సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

8, ఆగస్టు 2023, మంగళవారం

VIII. 2. సముద్ర ప్రయాణం - డా. సిద్దెంకి


2. సముద్ర ప్రయాణం
                      -ముద్దు రామకృష్ణయ్య


చదువండి – ఆలోచించి చెప్పండి
పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతోమాట్లాడుతూ ఉండిరి, సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్నిబట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను, బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను.

గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనంచేసితిని.

ప్రశ్నలు
1. పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు?
జవాబు. ఇంగ్లాండు లేదా గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్.
2. వాళ్ళు బ్రిటన్ కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు?
జవాబు. చదువుకోవడానికి
3. పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు. తుదకు గ్రేడ్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేశాడు

పాఠ్యం నేపథ్యం, ఉద్దేశం:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్నపని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం.

కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో దృఢసంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించ గలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
'యాత్రా చరిత్ర' ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన 'నా ప్రథమ విదేశీ యాత్ర' పుస్తకంలోనిది.

రచయిత పరిచయం: 
రచయిత పేరు:  ముద్దు రామకృష్ణయ్య
జననం: 18 .10.1907 
మరణం:  21. 10. 1985 
తల్లిదండ్రులు :  ముద్దు అమ్మాయి, ముద్దు రాజన్న, 
విద్యార్హతలు: బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. 
కృషి: ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ వివిధ  దేశాలలో విద్యా నిమిత్తం అధ్యయనం.
చేపట్టిన కార్యక్రమం: ఈచ్ వన్ టీచ్ వన్.

ప్రవేశిక
ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు.
అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు.
ప్రయాణం కొనసాగుతున్నది!
అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది? ఎట్లా చేరుకున్నది ..... తెలుసుకుందాం.

 

I

 పడవ యునైటెడ్ కింగ్ డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధకాలము.  యుద్ధం 1939లో మొదలయింది. అప్పటి నుండి గ్రేట్ బ్రిటనుకు పడవలు తరుచుగా పోవటంలేదు. నేను వెళ్ళినది సెప్టెంబర్ 8-1944లో.  గ్రేట్ బ్రిటనుకు చేరేవరకు ఏవేళ ప్రాణం పోతుందో అనే భయమే. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్యపు "కాన్వాయి" వెళ్ళేది.

     బందోబస్తులో చాలా నౌకల కాన్వాయ్ వెళ్ళేది. మా కాన్వాయ్ లో 50-60 నౌకలు ఉండె. ప్రతి పడవపైన 'Life Boats' ఉండేవి. పడవ కాప్టెన్ మొదలగు ఆఫీసర్లు వచ్చి, మమ్ములను సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి, తరువాత అందరిని పంపేవారు. బొంబాయిలో పడవ ఎక్కిన తరువాత కూడా, కొన్నిదినాల వరకు పడవ అక్కడనే ఉండింది. మమ్ములను దిగనివ్వలేదు. మా క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండె. మా పడవలోని అటెండెంట్లు భారతీయులే. వారు ఉండే డెక్ వేరే. వారు తినే డెక్ వేరే.

పడవ చిన్నదీ కాదు, చాల పెద్దదీ కాదు. కొత్త వారికి సముద్రరోగము వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బురాదు. దీనికి డబ్బు తీసుకోకుండానే పడవవారు మందులు ఇస్తారు. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది. తల తిరుగుతుంది. తల నొస్తుంది. కక్కు వస్తుంది. కండ్లు తిరుగుతవి. ఆ సమయంలో పక్కపైన పడుకొని ఉంటారు.

పడవలో హాస్పిటల్ కూడా ఉంటది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వస్తారు. మందులు క్యాబిన్కు పంపుతారు. పోస్టు ఆఫీసు కూడా ఉంటుంది. తరువాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీసు పెట్టుతారు. మనకు జాబువస్తే క్యాబిన్కు పంపుతారు.

టెలిగ్రాఫ్ ఆఫీసు (వైర్ లెస్) కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు. పడవలో "రిసెప్షన్ రూం" కూడా ఉంటుంది.  అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన -3 విషయాలన్నీ తెలుపుతారు. పడవలో దుకాణము కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి.

 ఆలోచించండి-చెప్పండి

వాహనాలు కాన్వాయ్ వెళ్ళడం ఎప్పుడైనా చూశారా? దేని కొరకు అట్లా వెళ్తాయి?

జవాబు. చూసాము. మంత్రులు వచ్చినప్పుడు కాన్వాయ్ వస్తుంది

◆ సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు?

జవాబు. మేము వస్తున్నాం అనే విషయం తెలియడానికి, అక్కడున్న వాళ్లు పక్కకు జరగడానికి.

* దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి?జవాబు.  దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కావలసిన వస్తువులు: బ్యాగు, సరిపడా బట్టలు, వాటర్ బాటిల్, అల్పాహారం, బ్రష్, పేస్టు,.. మొదలైన కనీస అవసరాలతో సిద్ధం కావాలి

II. 

పడవపైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడు స్పీకర్లతో కనెక్టు చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైపు చేయించి, సైక్లోస్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లోని ఫర్నీచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖ్మల్ (వెల్వెట్) తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు.

చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంటలేకుండా ప్రయాణం చేసే పసి పిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీకూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్ కు చదువుకోవటానికి ఇచ్చేవారు. ఔట్ డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణీకులు ఆడుతుండేవారు. చివరిదినం టూర్నమెంట్స్ పెట్టించి, గెలిచినవారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఏర్లో రాత్రి ఎందరో పడ్కుండేవారు.

మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి. భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో బ్రిటీష్వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్వారు ఎవరూ కాని నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత రోజుగా కూర్చుని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేదికాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కాని వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి, నా ఉచ్చారణ తెలుసుకొనేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవటం చాలా శ్రమ అయ్యేది

రేడియో ఇంగ్లీషు భాష కూడా తెలియకపొయ్యేది. నేను ధోవతి షేర్వానీతో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. ఐనా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరుచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు,

ఇంకొకరు ఆంగ్లో ఇండియను. వ్యక్తి తెల్లగా లేకుండె. అతనిపేరు ఫాల్సెట్టు ఇంగ్లాండుకు సెలవుపైన వెళ్ళుతూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటీష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. వేయిల రూపాయలు ఉంటేగాని బ్రిటన్లో జీవితం జరుగదు. అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరుకదు అనేవాడు.

అలోచించండి-చెప్పండి

* ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.

ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి? ఎందుకు?

కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి? అప్పుడు మీరేం చేస్తారు?

III

డెక్పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంటచేసే వాణ్ణని, నా డ్రస్సు చూసి అనుకున్నాడట. తరువాత నేను విద్యాభ్యాసానికి వెళ్ళుతున్నానని చెప్పినాను. నేను బీదవాణ్ణి. డబ్బులేకుండా వెళ్ళుతున్నానని వారికి తెలువదు. నేను చెప్పలేదు. నా దగ్గర డబ్బులేదని తెలిస్తే నన్ను 'డీపోర్టు' చేసి ఇండియాకు తిరిగి పంపుతారని నా భయం. దేవునికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు.

ఇంగ్లాండుకు పడవ చేరగానే, బ్రిటీషు రేవులోని పోలీసులు, తగినంత పైసాలేని వారిని డీపోర్టు చేసి వాపసు పంపుతారనీ, బ్రిటీష్ పోలీసువారు చాలా స్ట్రిక్ట్ అని ఫాల్సెట్ నాతో అనేవారు. వారి మాటలు విని. నన్ను ఇంగ్లండులో దిగనివ్వరని మళ్ళీ అదే పడవలో దేశం వెళ్ళగొట్టుతారని లోలోపల భయం వేసి "ఈశ్వరా నీవే దిక్కు నీవే నన్ను తలవని తలంపుగా తీసుకొని వస్తున్నావు. కనుక నీవే నన్ను డీపోర్టు చేయించకుండా ఇంగ్లండులో ప్రవేశపెట్టమని ప్రతి నిముషం మొక్కేవాణ్ణి.

నేను నా దగ్గర ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లాండుకు బయలుదేరినాను. అప్పుడు ఎక్స్ఛేంజ్ రేటు ఒక స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు 13 రూపాయల 6 అణాలు. ఉన్ని బట్టలు నావద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వానీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. కనుక నాకు ఇంగ్లాండులో ఏదో పని చూపించి ద్రవ్యం సంపాదించే మార్గం చూపి నన్ను చదివించి తిరిగి తప్పక దేశం తెస్తడన్న నమ్మకంతోనే బొంబాయి నుండి గ్రేట్ బ్రిటను బయలుదేరినాను. మా పడవ మెల్లగా నడిచేది. పడమర వైపుకు పోతూ ఉంటిమి. కాబట్టి రోజూ గడియారం వెనుకకు తిప్పుకోవాలనీ, ఎన్ని నిమిషాలు వెనుకకు తిప్పాలో పడవ రిసెప్షన్ ఆఫీసులో నోటీసు పెట్టేవారు.

గ్రేట్ బ్రిటన్ చేరే వరకు అయిదున్నర గంటలు వెనుకకు తిప్పినాము. మొదటి హాల్ట్ మాది ఆడన్ (ఏడెన్)లో. ఆడెన్ పట్టణములోనికి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఇచ్చినారు. నా వెంబడి ఉన్న గుజరాతీ పిల్లల బంధువులు ఆడన్లో ఉండిరి.

14

విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక

అతడు కారు తెచ్చి మమ్ములను తీసుకొని వెళ్ళినాడు. ఆడన్ ప్రాంతములోని చారిత్రాత్మకమైనవన్నీ చూపించినాడు. వారి ఇంట్లో మంచి శాకాహార భోజనం పెట్టి మళ్ళా పడవరేవులో విడచినాడు. ఆడన్లో ఉండేవారందరు అరబ్బీ ముస్లిములు, -మన హైదరాబాదులోని ముస్లింల మొహల్లా ఉన్నట్టు ఉంటుంది.

2

మా పడవ కొన్ని దినాలు పోర్టు సయీద్లో ఉండి, మధ్యధరా సముద్రములో ప్రవేశించెను. చాలా జాగ్రత్తగా * ప్రయాణం చేసితిమి. మా వెంట ఉన్న యుద్ధ విమానాలు మా పడవపైన ఎగురుచుండెను. డిస్ట్రాయర్లు మైనులను తీసివేస్తూ ఉండెను. అప్పుడప్పుడు డేంజర్ ఉన్నదని మేసేజ్ "" వస్తే మా పడవలు వెనుకకు తిరిగేవి. కొంతసేపు అయిన ఆ తరువాత మార్గం మార్చి మళ్ళీ ముందుకు నడిచేవి. ఆన్ 'జిబ్రాల్టర్' రేవుకు చేరుకొంటిమి.

ఆలోచించండి- చెప్పండి.

* విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి?

విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి?

"ఈశ్వరా నీవే దిక్కు" అని రచయిత అనుకోవటానికి కారణమేమిటి? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.

IV

అట్లాంటిక్ మహాసముద్రములో ప్రవేశించేటప్పుడు సముద్రము చాలా 'కాము' (ప్రశాంతం)గా ఉండెను. యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు జిబ్రాల్టర్ సంధిని కాపాడుచుండెను. మేము 'బే ఆఫ్ బిస్కే' చేరితిమి. సముద్రము చాలా ఘోరంగా వైల్డ్ గా ఉండెను. వాతావరణం చల్లగా, మబ్బులతో నిండియుండెను. అప్పుడే ఇంగ్లాండు దగ్గరకు వస్తున్నదని, అందరూ దిగే ఇడట సన్నాహాలు మొదలు పెట్టినరు. జర్మన్ బాంబుల నుండి బ్రతికి చివరకు ఇల్లు చేరుకొంటిమని బ్రిటిష్వారు సంతోషపడుచుండిరి.

ఇంగ్లీష్ చానల్ లో మా పడవ చేరగానే సముద్రం 'కాం' (ప్రశాంతం) అయింది. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా పడవ పోవుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని, కాని పాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు, బ్రిటిష్ కస్టం వాళ్ళు పడవ దిగేముందు డబ్బు గురించి అడుగుతారనీ, సరిపోయేటంత డబ్బు లేకపోతే పడవ దిగనివ్వరని మాటిమాటికి గట్టిగాచెప్పుచుండిరి. కాబట్టి నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోలోపల చింతించుకొంటూ, మాటి మాటికి దేవుణ్ణి శరణుజొచ్చితిని.

అప్పుడు నేను నాతో పాటు గ్రేట్ బ్రిటన్ క్కు ప్రయాణిస్తున్న కరీంనగరు జిల్లా ఎగ్జికూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేశ్ బాబును కలిసితిని. క్లుప్తంగా నా పరిస్థితి వివరించితిని. నా దగ్గర డబ్బు లేదన్న రహస్యం ఎవ్వరికీ చెప్పనని అతని నుండి వాగ్దానము తీసుకొంటిని. ఆ పిల్లవాడు చాలా మంచివాడు. అతని దగ్గర 150/- పౌండ్ల డ్రాఫ్ట్ ఉండె. అతడు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి అతన్ని డబ్బు ప్రశ్న అడుగరు. అతనికి పడవదిగే పర్మిషన్ తొందరగా దొరుకుతుందని అతనితో "బాబూ! నీకు డబ్బు ప్రశ్నలేదు. నిన్ను డబ్బు విషయం అడుగరు. నీవు గవర్నమెంట్ స్కాలర్షిప్ హోల్టరువు. కనుక నీ 150 పౌండ్ల డ్రాఫ్ట్లో నావి నూరు పౌండ్లు ఉన్నవనీ, నేను నీకు బంధువును కాబట్టి ఇద్దరి డబ్బు ఒకే డ్రాఫ్ట్ లో ఉన్నవని చెప్పు. భయపడకు. నేను నీ డబ్బు తీసుకోను. నిన్ను డబ్బు అడుగను. నన్ను పడవ దిగేటట్టు చూడు" అని అంటిని. ఈ మాటకు సురేశ్ బాబు ఒప్పుకొన్నాడు. గ్రేట్ బ్రిటన్ సాయంత్రం చేరినాము. గ్రేట్ బ్రిటన్ పశ్చిమ తీరపు స్కాట్లాండ్ యొక్క గ్లాస్గో రేవు పట్టణం దగ్గర పడవ ఆగింది. అక్కడి పోలీసువారు, మా పడవ రేవుకు చేరకముందే పడవలోనికి

 విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ

కానుక

15
వచ్చినారు. ప్యాసింజర్ల ఇతర కాగితాలను చెక్ చేయటం మొదలు పెట్టినారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు గుండె జల్లుమన్నది. నా గతి ఏమి అవుతుందో అని. పాల్సెట్ గారు మహా సంతోషముతో తనకు పర్మిషన్ దొరుకుతుందని వెళ్ళినారు. కాని వారికి కూడా ఎందుకో పర్మిషన్ దొరకలేదు. నాకు చమటలు పట్టినవి. కాని పైకి మాత్రం ధైర్యంగానే ఉన్నా, నేను షేర్వానీ, పైజామాలో ఉన్నా. నా వంతు వచ్చింది. నా పాస్పోర్టు చూసిన పోలీసు అధికారి "మీరు స్టడీస్ కొరకు వచ్చినారా?" అని అడిగినారు. నేను అవునని చెప్పినాను. ఆలస్యం లేకుండా, ఇంకా ఏమీ అడగకుండానే "పర్మిటెడ్" అని స్టాంపు వేసినారు.

నేను బయటకు వచ్చినాను. బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయినాను. పట్టరాని సంతోషం వచ్చింది. దేవుడు సాధ్యం కాదనుకొన్నదాన్ని సాధ్యం చేసినాడు. నేను ఎక్కడ? గ్రేట్ బ్రిటన్ కు పైసాలేకుండా రావటమెక్కడ? ఈశ్వరుడు నన్ను రక్షించినాడు- బ్రిటన్లోని సుందర దృశ్యాలను చూసి, సమీపంలోని పడవలను చూసి దేవునికి కృతజ్ఞతా వందనాలు చేసితిని. పాల్సేట్ గారికి కూడా దిగటానికి పర్మిషన్ దొరికింది. సురేశ్ బాబుకు గూడా పర్మిషన్ దొరికింది. సురేశ్ బాబు సహాయం లేకుండానే అతని డబ్బుతో అవసరం లేకుండానే నాకు పర్మిషన్ దొరికినందుకు అతడు ఆశ్చర్యపడినాడు. మేము పడవనుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది. నవంబర్ నెల. చాలా చలి. సామాను దింపటానికి కూలివారులేరు. నా సందుగ చాలా పెద్దది. అందరు తమ తమ సామాన్లు వెతుకుతూ ఉండిరి. కొందరు భారతీయ స్నేహితులు నాకు సహాయం చేసిరి. నా సామాను పడవ దిగింది. ఈశ్వరుని కటాక్షము వలన వంటాయన కొడుకునైన బీద టీచరును, సరిపడ డబ్బు వెంట లేకుండా 22 పౌండ్లతో, షేర్వానీ పైజామా తొడుగుకొని గ్రేట్ బ్రిటన్ లోని స్కాట్లాండ్ భూమిపైన అడుగుపెట్టితిని.

ఆలోచించండి- చెప్పండి..
* రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది?

* ఏయే సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.

16

విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ
కానుక


ఇవి చేయండి
1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
వాక్యం                           పేరా సంఖ్య శీర్షిక

పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది
నేను ధోవతి శేర్వానీతో ఉంటిని
ఏవేళ ప్రాణం పోతుందో
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదా తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది..

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచ పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అము నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తా రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ ఉన్నది.

II. పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ)బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు?
బాసర పుణ్యక్షేత్రంలోని దేవత శ్రీ జ్ఞానసరస్వతి.
 ఆ) సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? 
జ. గోదావరి నది తీరము
ఇ) సరస్వతి దేవి సైకతా మూర్తిని మలిచిన వారు ఎవరు? 
జ. వ్యాసం మహర్షి సైకతమూర్తిగా మల్చాడని ప్రసిద్ధి
ఈ). నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి 
జ.దసరా పండుగ రోజు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు
ఉ)పై పేరాకు శీర్షిక సూచించండి.
జ. బాసర సరస్వతి / బాసర వీణపాణి

7, ఆగస్టు 2023, సోమవారం

పుస్తక సమీక్ష - ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి




పుస్తక సమీక్ష - ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి 



పుస్తక సమీక్ష, ప్రాజెక్ట్ పని రాసే విధం


పుస్తక సమీక్ష ఎలా రాయాలి?

పుస్తక సమీక్ష : 1 / 2 / 3 / 4

I. ప్రాథమిక సమాచారం

అ. పుస్తకం పేరు :

(ఉప శీర్షిక )

ఆ. రచయిత పేరు :

ఇ. ప్రక్రియ :

ఈ. పబ్లిషర్స్ / ప్రచురణ

వివరాలు :

ఉ. పుస్తకంలోని పేజీలు :

ఊ) పుస్తకం వెల / ధర :

ఋ). సమీక్షకుల పేరు  :

ౠ) తరగతి-సెక్షన్ :

II. చదివిన అంశం (సంక్షిప్త వివరణ) : (పుస్తకంలోంచి తీసుకున్న భాగము పద్యము /గద్యము / గేయము / మొదలైనవి)

వివరణ :

అభిప్రాయం / (ముగింపు) :

-------------- అను పేరుగల పుస్తకం పై నా అభిప్రాయం