సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

సృజనాత్మకత / ప్రశంస


భాషా నైపుణ్యాలు సాధనలో వివిధ సాహిత్య ప్రక్రియల వ్యవహార రూపాల స్వరూప స్వభావాలు అర్థం చేసుకుని పిల్లలు తమ రచన నైపుణ్యానికి ఊహ శక్తికీ, సృజన శక్తికీ పదును పెట్టడానికి ఉద్దేశించిన అభ్యసన ప్రక్రియ.

6 నుండి 10 తరగతి వరకు సృజనాత్మకత శీర్షిక కింద ఇచ్చిన ప్రశ్నలు ఈ కింది ప్రక్రియలు చేర్చడమైంది‌.


ప్రక్రియ:  నిర్మాణాత్మక విధానాన్ని కలిగి ఉన్న భాషా వ్యవహారం



నినాదాలు / సూక్తులు


నినాదాలు : చిన్న చిన్న వాక్యాల రూపంలో ఉండటం రస పదాలను  శ్రోతల్లో ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపడం. గుండెల్లోకి చొచ్చుకపోవడం నినాదాల ప్రత్యేక లక్షణాలు.


సూక్తులు : సూక్తి అనగా మంచి మాట. ఇందులో భావం ప్రధానం. వాక్యం పట్టుకోగలిగేటట్లు అంటే ధారణకు అనుగుణంగా ఉండాలి. మంచివి ప్రబోధించాలి. క్లుప్తంగా ఉండాలి.


వ్యాసం రాయడం ఎలా ?.


సంభాషణ

ఏకపాత్రాభినయం


వచన కవిత నేర్పించడం ఎలా ?


కరపత్రం: చేతిలో అణువుగా ఒదిగి ఒక విషయాన్ని సంబంధించిన వివరాలు ఇచ్చే కాగితాన్ని కరపత్రం అంటారు దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు ఒక సమాచారాన్ని లేదా విషయాన్ని అందరికి తెలియజేయడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం కరపత్రంలో శీర్షిక ప్రచురణకర్తలు సందేశం మొదలగునవి ఉంటాయి.


అభినందన వ్యాసం: ఏదైనా ఒక రంగంలో పేరుగాంచిన వ్యక్తుల గురించి రాసే ప్రశంసాత్మకాంశాలను తెలిపే వ్యాసం ఇందులో ప్రశంస తో పాటు జీవిత విశేషాలను సంఘటనలు తెలియజేయడానికి ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని సందర్భాలలో పెట్టండి సంఘటనలో వివరించడంతోనే వ్యాసం పూర్తి కావచ్చు.



పాట రాయడం ఎలా?


లేఖ రాయడం ఎలా?


విద్యార్థులచే కథ ఎలా రాయించాలి?


సంపాదకీయ వ్యాసం: దేశ కాలమాల పరిస్థితులను గమనిస్తూ సమకాలీన సంఘటన ప్రతి స్పందించి సామాజిక హితం లక్ష్యంగా పత్రికా సంపాదకులు రచించే వ్యాసాలను సంపాదకీయ వ్యాసాలు అంటారు.


పుస్తక పరిచయ పీఠికను పరిచయం చేయండి 


 ఇంటర్వ్యూ / ప్రశ్నావళి



గేయం 

సంభాషణ : 

వ్యాసం :

ఏకపాత్ర: రంగస్థలం మీద ఒకే పాత్ర నటిస్తుండడం ఏకపాత్రాభినయం అంటారు.  ఒకే పాత్ర ఉండటమే ఏకపాత్ర. ఇది స్వాగతానికి ఆత్మకథకు దగ్గరగా ఉంటుంది కానీ వాచకాది అభినయాల ద్వారా (వాచికం, ఆంగికం ఆహార్యం, సాత్వికం చతుర్విధ అభినయాలు) ఆ పాత్ర రసపోషణ చేస్తూ ప్రేక్షకులను శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది,

 పౌరాణిక, చారిత్రక, ఇతిహాసిక, సామాజిక ప్రాధాన్యం కలిగిన పాత్రలనే గాక వైవిధ్య భరితమైన సామాన్య వ్యక్తులను కూడా ఏకపాత్రకు ఎంపిక చేసుకోవచ్చు.


ఆత్మకథ : ఎవరి అనుభవాలను వాళ్ళు తాము ఉత్తమపురుషలో ప్రకటించడం ఆత్మకథ. ఇది మనుషులేగాక ఇతర ప్రాణులు ఒక్కొక్క సందర్భంలో జడపదార్థాలు కూడా తమ అనుభవాలను చెప్పుకుంటాయి. స్వగతం కూడా ఇంచుమించు ఆత్మకథ వంటిది. స్వగతంలోని మాటలు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లే ఆత్మకథలు బయటికి ప్రకటిస్తున్నట్లు ఉంటాయి.


పోస్టరు: 



వర్ణన : సాధారణ విషయాన్ని వర్ణించి రాయడమే వర్ణన అంటే ఒక మామూలు విషయాన్ని అలంకారికంగా ఉపమాన యుక్తంగా అనుభూతి భరితంగా వివరించి వ్యక్తీకరించడమే వర్ణన. ఇది స్థాయిని బట్టి వేరువేరుగా ఉంటుంది.

వర్ణన అంటే దృశ్యాలను వర్ణించడం మాత్రమే కాదు. మానసిక స్థితిని, అనుభూతులను, సామాజిక పరిస్థితులను, మూర్త, అమూర్త పదార్థాలన్నింటినీ వర్ణించవచ్చు. అందుకు తగిన శబ్దజాలం, ఉపమానాలు, అలంకారాలు ఎంపిక చేసుకొని వివరించడం ముఖ్యం.


ప్రశ్నావళి : ఏదైనా ఒక విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి రూపొందించుకునే ప్రశ్నల సమూహం.

సాధారణంగా పెద్ద వాళ్ల గురించి ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకునే సందర్భంలో వాడుతారు. 2. ఏదైనా ఒక రంగానికి సంబంధించిన వ్యక్తుల నుండి సమాచారం సేకరించేటప్పుడు

3. ఒక పదవికి ఉద్యోగానికి అర్హులైన వారిని ఎంపిక చేసుకునేటప్పుడు.

 ఈ ప్రశ్నల  అవసరం అవుతుంది.

ప్రశ్నావళిలో మూడు విభాగాలు :

1. వ్యక్తిగత సమాచారం రాబట్టేవి

 2. వృత్తి లేదా రంగానికి సంబంధించినవి 

3. అనుభవాలు ఆశయాలు ఆకాంక్షలు సందేశం అందించేదిగా ఉంటాయి.




ప్రకటన : ఏదైనా ఒక విషయాన్ని ప్రకటించడం అంటే బహిరంగంగా అందరికీ తెలిసేటట్లు చేసే ప్రక్రియ ప్రకటన ఇది మౌఖిక రూపంలో లిఖిత రూపంలో ఉంటుంది. పాఠ్య పుస్తకంలో ఇచ్చిన వ్యవహార రూపం లిఖిత రూపం. ప్రకటనలు ఉద్దేశించిన దీన్ని ఇంగ్లీషులో నోటీస్ అంటున్నారు.

ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన చైతన్యం కల్పించడం సమాచారం తెలపడం హెచ్చరించడం కోసం ప్రకటనను ఉపయోగిస్తారు. ప్రకటనలో విషయం భాష అందరికి అర్థమయ్యేటట్లు ఉండాలి. క్లుప్తంగా ఉండాలి.


    ఆహ్వాన పత్రం: ఏదైనా ఒక కార్యక్రమానికి రమ్మని పిలవడానికి లిఖిత రూపకంగా ఉండే మాత్రమే ఆహ్వాన పత్రం వివాహాది శుభకార్యాలకు జాతరలకు ఉత్సవాలకు సంగీత సాహిత్య నృత్యాలు ప్రదర్శనలకు వైద్య విజ్ఞానిక అంశాల సభలు సమావేశాలకు పాఠశాల నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించడానికి ఇటువంటి పత్రాలను రాస్తారు లేదా ముద్రిస్తారు.


 అభినందన పత్రం: ఏదైనా ఒక రంగంలో విజయం సాధించిన సందర్భంగా కానీ బదిలీ అవుతున్నప్పుడు గానీ పదవీ విరమణ పొందుతున్నప్పుడు గానీ ప్రత్యేక గుర్తింపు పొందినప్పుడు కానీ ఆ వ్యక్తిని వ్యక్తులను అభినందిస్తూ ప్రశంసిస్తూ రాసే పత్రం దీన్నే ప్రశంసా పత్రం అని కూడా అంటారు అభినందన పత్రం వ్యక్తి ప్రశంసను ప్రధాన అంశంగా కలిగి ఉంటుంది.

 అభినందన పత్రాలు పధ్యాత్మకంగానూ కవితాత్మకంగానూ వచనాత్మకంగానూ గద్యపద్యాత్మకంగానూ ఉంటాయి.


వ్యక్తిగత వివరాలు అంశాలు 

వృత్తి సంబంధిత రంగానికి చెందిన అంశాలు 

సంబంధిత రంగంలో సాధించిన విజయాలు గుర్తింపు 

వ్యక్తిత్వం.


ఉదాహరణకు విద్యారంగంలో ఉపాధ్యాయుడుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న ఒక వ్యక్తికి సంబంధించిన అభినందన పత్రం


నిరాడంబరులు నిగరువి నిరంతర కృషివలు ఉత్తమ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరా నగర్ సహాయకులు పి రాజిరెడ్డి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించిన అభినందన పత్రం.


తేదీ 31 ఆగస్టు 2024 స్థలము ఇందిరానగర్.


మీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కమిటీ జడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్ సిద్దిపేట జిల్లా.

 

 ప్రసంగ వ్యాసం: ఉపన్యసించడం కోసం ముందుగా సిద్ధం చేసుకున్న వ్యాసం సాధారణంగా రేడియోలో టీవీల్లో చదవడానికి పెద్ద పెద్ద రాష్ట్రస్థాయి జాతీయ అంతర్జాతీయ స్థాయి సదస్సులను ప్రసంగించడానికి మేధావులు సభలు సమర్పించడానికి ఎటువంటి ప్రసంగవ్యాసాలను సిద్ధం చేసుకుంటారు. చెప్పదలుచుకున్న అంశం సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పడానికి ఇంతకు మించిన పద్ధతి లేదన్నమాట.


 స్వగతం: ఇది ఆత్మకథ వంటిదే కానీ ఆత్మకథలు పాత్ర ప్రకాశంగా బయటికి మాట్లాడుతుంది స్వాగతం అంటే తనలో తాను మాట్లాడుకోవడం అన్నమాట ఈ పరిధి తెలుసుకొని ప్రక్రియను విస్తరింప చేయాలి తరగతి భాష నిడివి నిర్ణయించాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...