3. అరణ్యకాండ
- విరాధ వధ
- అగస్త్యాశ్రమ దర్శనం
- పంచవటిలో నివాసం
- శూర్పణఖ భంగం
- ఖరదూషణాదుల సంహారం
- రావణునితో శూర్పణఖ గోడు
- రావణునకు మారీచుని హితవు
- మాయలేడితో మోసం
- సీతాపహరణం
- జటాయువు మరణం
- కబంధుని శాప విమోచన
- శబరి సేవ
రామాయణం నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
విరాధ వధ: తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. ఏ శస్త్రంతోనూ చావకుండా వరముంది.
రామునిచేతనే అతనికి శాపవిముక్తి కావాలి.
విరాధుడు సీతను పట్టుకుపోసాగాడు.
రాముని పదును బాణాలవలన కోపించి, సీతను విడచి, రామ లక్ష్మణులను చేతులలో ఇరికించుకుపోసాగాడు.
రామ లక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు.
శాపవిముక్తి
విరాధుడు వారెవరో తెలిసికొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు.
బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్ళకుండా వేచియున్నాడు. తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి, రిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు.
అగస్త్యాశ్రమ దర్శనం
సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామలక్ష్మణులు ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు.
అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి.
వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపాడు.
దక్షిణ దిక్కును మునులకు ఆవాస యోగ్యంగా చేశాడు.
పంచవటిలో నివాసం:
పర్ణశాలలో గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు.
పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు.
దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు.
సీతాములకు స్వర్గంలా అనిపించింది. సంతోషంగా గడిపారు.
శూర్పణఖ భంగం:
శూర్పణకరావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఆమె కామరూపి.
పర్ణశాలకు వచ్చిలక్ష్మణుడు చూచి మోహించి తనను పెళ్ళి చేసుకోమని అడిగింది.
లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను తినివేయబోయింది. అపుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసివేశాడు.
శూర్పణఖఖరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది.
ఖరుడు పధ్నాలుగు రాక్షసులను రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు.
పదునాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు.
శూర్పణఖ ఖరునివద్దకుపోయి అతను చేతకానివాడని దెప్పిపొడిచింది.
ఉద్రిక్తుడైన ఖరుడూ,
ఖరదూషణాదుల సంహారం
ఖరునిపై బాణ ప్రయోగం చేసిన రాముడు
ఆకాశంలో పుట్టిన ఉత్పాతాలను గమనించాడు రాముడు.
రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనసు ధరించి, సీతను వెంటబెట్టుకొని, ఒక దుర్గంలా ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు.
అగ్నిలాగా రాముడు ధనుర్ధారియై నారి మోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు.
వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమికూడి రామునకు మంగళం పలికారు.
పధ్నాలుగు వేల మంది రాక్షసులూ, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది. తన పెద్దన్న రావణుని తీవ్రంగా నిందించి హెచ్చరించింది – నువ్వు స్త్రీలోలుడవై రానున్న అపాయాన్ని తెలిసికోలేకపోతున్నావు. రాజు అనేవాడికి సరైన చారులుండాలి.
రావణునితో శూర్పణఖ గోడు: దశరధుని కొడుకులైన రామ లక్ష్మణులు జనస్థానాన్ని రాక్షసవిహీనం చేస్తున్నారు. ఆ రాముని భార్య సీత నీకు తగిన అందాల రాశి. కనుక రాముని సంహరించి, సీతను నీదానిని చేసికొని రాక్షస జాతి ఋణం తీర్చుకో – అని శూర్పణఖ రావణునితో మొత్తుకొంది.
రావణునకు మారీచుని హితవు: రావణునికిలా హితం బోధించాడు – రాముడు మహావీరుడు. సత్యధర్మ వ్రతుడు. అతనితో వైరం పెట్టుకుంటే నీకు, నీ జాతికి పోగాలం దాపురించినట్లే. ఇదివరకు నేను వెయ్యేనుగుల బలంతో ఎదురు లేకుండా భూలోకం అంతా తిరిగేవాడిని. అప్పుడు నేను విశ్వామిత్రుని యాగం ధ్వంసం చేయబోయాను. యాగాన్ని రక్షిస్తున్న రాముడు సుబాహుడిని, నా రాక్షస గణాలను సంహరించి నన్ను మాత్రం శరాఘాతంతో నూరామడల దూరాన సముద్రంలో పారవేశాడు.
మాయలేడితో మోసం: బంగారు లేడికంటబడింది. వయ్యారాలు పోతూ గెంతుతున్న ఆ లేడిని చూచి సీత అది తనకు నచ్చిందనీ, దాన్ని తెచ్చిపెట్టమనీ రాముని కోరింది. ఆ లేడి గెంతుతూ, మాయమౌతూ, మళ్ళీ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. ఇక లాభం లేదనుకొని రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణం విడిచాడు. దానితో ఆ లేడి మారీచునిగా నిజరూపం ధరించింది. మారీచుడు అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాలవైపు సాగాడు.
సీతాపహరణం: రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను పలకరించాడు.రావణుడు తన నిజరూపం ధరించి సీతను తనకు భార్యగా కమ్మన్నాడు. సీత అగ్ని శిఖలా మండిపడి రావణుని గడ్డిపరకలా తృణీకరించింది. తనను వాంఛిస్తే రావణునికి రాముని చేత వినాశనం తప్పదని ధిక్కరించింది.
జటాయువు మరణం: రావణుడు బలవంతంగా సీతను ఒడిసిపట్టుకొని తన రథం ఎక్కాడు. సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణునిమీద విజృంభించాడు.
కబంధుని శాప విమోచన: మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు.
తలా మెడా కూడా లేవు. వాని ముఖం కడుపుమీద ఉంది.
వాడి చేతులు ఆమడ పొడవున్నాయి. శరీరం పర్వతంలా ఉంది. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. వాడు తన చేతులతో రామలక్ష్మణులను ఒడిసి పట్టి తినబోయాడు.
రామలక్ష్మణులు వాడి చేతులు నరికేశారు. తన శాపాన్నించి విముక్తి కలిగించే రామలక్ష్మణులు వారేనని కబంధుడు గ్రహించాడు. అతని కోరికపై వారు అతని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు.
శబరి సేవ;సిద్ధురాలయిన శబరి మతంగాశ్రమంలో మునులకు సపర్యలు చేస్తుండేది. ఆమె గురువులు అంతకు పూర్వమే విమానారూఢులై స్వర్గానికి వేంచేశారు. ఆమె మాత్రం శ్రీరాముని దర్శనార్ధమై వేచిఉంది. రామలక్ష్మణుల పాదాలకు మ్రొక్కింది. మధురమైన ఫలాలతో వారికి అతిథి పూజ చేసింది. రాముడు ఆమెను కుశలమడిగాడు. ఆమె వారిని పూజించి ఆశ్రమం అంతా చూపించింది. ఆ మునులు తమ తపోప్రభావంతో సప్తసాగరాలను అక్కడికి రప్పించుకొన్నారు. ఆపై మహాత్ములైన తన గురువుల వద్దకు పోవడానికి సెలవడిగింది. రాముడు ఆనందించి ఆదరంతో శబరీ! నువ్వు నన్ను చాలా భక్తితో కొలిచావు. ఇక సుఖంగా నీ ఇష్టం వచ్చిన లోకాలకు వెళ్ళు అన్నాడు. వెంటనే వృద్ధ శబరి తన జీర్ణదేహాన్ని అగ్నిలో ఆహుతి చేసుకొని సుకృతాత్ములైన తన గురువులున్న చోటికి విమానం ఎక్కి వెళ్ళిపోయంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి