సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

22, ఫిబ్రవరి 2024, గురువారం

VIII. 12. మాట్లాడే నాగలి

మాట్లాడే నాగలి

చదవండి ఆలోచించండి చెప్పండి.
ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకంత ప్రాధాన్యముందో ….. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ ఏీతకూ కూడ 5ాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం ఇప్పుడు ఈ భూమ్మీద మన ఆస్తిత్వమే ఆయోమయంలో పడింది.


పాఠ్యభాగ ఉద్దేశం:
ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే (పేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెహ్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు: 
ప్రశ్న 1.
అనువాద ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Translation) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనటం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలుఅనే (్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కనన్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్. వేణుగోపాలరావు అనువాదం చేశాడు.
రచయిత పరిచయం:
రచయిత పేరు : పొన్కున్నం వర్కెయ్
పాఠ్యభాగం పేరు : మాట్లాడే నాగలి
కాలం : 1910 – 2004
రచనలు : 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.
ప్రవేశిక:
ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో [పేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్
 
ఇవి చేయండి.
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. కింది అంశాల గురించి తెలుపండి.
అ. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబుమానవత్వం గురించి, మూగ జీవుల పట్ల మానవులు చూపాల్సిన ప్రేమ గురించి చెప్పిన మంచి కథ ఇది. ఓసెఫ్ ఒక మనసున్న రైతు. అతని వద్ద కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఆ ఎద్దే అతని లోకం. అది ఉంటే అతడు ఈలోకాన్ని మరచేవాడు. అందుకే అతనిని ఎద్దు పిచ్చోడు అని మిగిలిన రైతులు అనేవారు. కన్నన్ను ఎప్పుడూ ఓసెఫ్ చెర్నాకోలతో కొట్టలేదు. అదే తన యజమాని మనసు తెలుసుకుని ప్రవర్తించేది. పని అయిపోయాక హాయిగా కడుపునింపుకోమని వదిలేవాడు. అది గడ్డి తిన్నదే గాని ఏనాడు అరటి మొక్కలను కొబ్బరి మొక్కలను తాకనైనా తాకలేదు. ఓసెఫ్ పాట మాట అంటే కన్నన్కు ఇష్టం. ఇరవైఏళ్ళపాటు కన్నన్ ఓసెఫ్క మొక్కవోని సేవచేసింది.
ఓసెఫ్కు ఒక కూతురుంది. ఆమెపేరు కత్రి. ఆమెకు పెళ్ళిచేయాలనుకున్నాడు. కట్నంకోసం పొలాన్ని అమ్మాడు. అయినా చాలలేదు. కన్నన్ను కూడా అమ్మేయక తప్పిందికాదు. ఒక రోజు కూతురు కత్రికి బట్టలు తేవటానికి వెళ్ళిన ఓసెఫ్కు తన కన్నన్ను మాంసం దుకాణానికి తరలిస్తుండడం కన్పించింది. తట్టుకోలేక పోయాడు. కన్నన్.. అని పెద్దకేకవేసి బట్టలకని తెచ్చిన డబ్బులతో కన్నన్ను కొని ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న బట్టలు తెస్తున్నాడని ఎదురువెళ్ళిన కత్రికి కన్నన్ కన్పించింది. విషయం అర్థమయింది. నాన్నా నువ్వు నాకు ఇలా అన్యాయం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదని ఏడ్చింది. అప్పుడు ఓసెఫ్ ఓ బిడ్డా నువ్వు నాకు ఎంతో కన్నన్ కూడా అంతే అన్నాడు.
ఆ. మాట్లాడే నాగలిఅనే పేరు ఈ కథకు సరైందేనా? ఎందుకు?
జవాబు.దేశాభివృద్ధిలో రైతులదే కీలకపాత్ర. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆయుధం నాగలి. రైతు యొక్క జీవితాన్ని విశ్లేషించిన కథ మాట్లాడే నాగలి’. రైతు అతనికి ప్రాణప్రదమైన ఎద్దుల అనుబంధం ఈ కథలో వివరించబడింది. కనుక ఈ కథకు మాట్లాడే నాగలి అనుపేరు సరైందేనని భావించాలి. ఇక్కడ నాగలి అంటే ఎద్దు. మాట్లాడడమంటే ప్రేమను చూపడం.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.
అ. ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
జవాబు.ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో మొదటి పేరాలో ఉంది. మొద్దుబారి పోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తలపైకెత్తి చుట్టూ చూసింది.
అ. అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో రెండవ పేరాలో ఉంది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తలమీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. ఔను, వెనకకాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కాని మునిసిపాలిటీ వేసిన ఆ నల్లముద్రను చెరపడం అంత సులభం కాదు.
2. కింది పేరా చదవండి. ఖాళీలు పూరించండి.
ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపలకింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడ. ఎందుకది ? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అ సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా!అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతేఅన్నారు భగవాన్.
అ. జీవకారుణ్యం అంటే తోటి జీవుల పట్ల కారుణ్యంతో వ్యవహరించటం.
ఆ. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం చీమలకు ఆహారం వెయ్యటం
ఇ. పూర్వాచారాలను పాటించాలె ఎందుకంటే ఆ ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కలిసి ఉన్నవి.
 
ఈ. పై పేరాకు శీర్షిక జీవకారుణ్యం
ఉ. పై పేరాలోని ఐదు ముఖ్యమైన పండుగరోజు, ఆశ్రమం, బియ్యపుపిండి, ఘాటు, ధనుర్మాసం, రంగవల్లులు, జీవకారుణ్యం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
జవాబు.ఓసెఫ్ స్థానంలో నేనుంటే కన్నన్ను ఓసెఫ్ లాగానే కన్న బిడ్డలా చూసుకుంటాను. దానితోడిదే లోకంలా భావిస్తాను. నా మనుగడకు కారణమైన కన్నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అవసరం తీరిందిగదా, అది ఇంక ఎంతో కాలం పనిచేయలేదు కదా అని దానిని కటిక వానికి అమ్మను. పెంపుడు జంతువులపై ప్రేమను అందరికీ వివరిస్తాను.
ఆ. పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేదిఎందుకని?
జవాబు.ఎవరైనా మాటల్లో చెప్పేవిషయాలు చేతల్లో చేసి చూపించాలనేది ఓసెఫ్ తత్వం. ఆయన పశువులను ప్రేమగా చూడడం కర్తవ్యంగా భావించేవాడు. అందుకే ఓసెఫ్ తనకుమార్తె అత్తారింటికి వెళ్ళటానికి బట్టలు కొనడం కన్నా, తనకు చాలా కాలం జీవనాధారంగా నిలచిన మూగజీవి కన్నన్ మాంసశాలకు వెళ్ళకుండా ఉండడానికి పైసలు ఖర్చు చేయడం సరైందని భావించాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు చేసే కన్నా వాటిని రక్షిస్తే బాగుంటుందన్నాడు.
 
ఇ. క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు?
జవాబు.క్రయపత్రం అంటే బేరసారాలు జరిగేటప్పుడు కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు నమ్మకం కోసం ఒకరికొకరు రాసుకునే పత్రం. వ్యాపార లావాదేవీలు ముగిసేవరకే దీని విలువ ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఇండ్లు, గొడ్లు మొదలగు వాటికి క్రయవిక్రయాలు జరిపేటప్పుడు వీటిని రాసుకుంటారు. ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను ఇతరులకు విక్రయించేటప్పుడు కూడా ఈ క్రయపత్రాలు వ్రాసుకుంటారు. దీనిని ఇంగ్లీషులో అగ్రిమెంట్అని వ్యవహరిస్తారు. ఒకనాడు నోటి మాటలతోనే క్రయవిక్రయాలు జరిగేవి. ఇపుడు క్రయపత్రం రాసుకోవటం తప్పనిసరి అయింది.
ఈ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి నాన్నా!అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి నాన్నాఅంది. ఇలా అనటానికి కారణం లేకపోలేదు. తండ్రి తనకు
వివాహంచేసి అత్తగారింటికి పంపించటానికి బట్టలు తెస్తానని పెళ్ళిబట్టలు మానేసి కన్నన్ను వెంటబెట్టుకొచ్చాడు. మరి తను అత్తారింటికి వెళ్ళేదెట్లా. ఆ ఆశ నెరవేరేదెట్లా అని ఆలోచించిన కత్రి తన మనసులో కలిగిన ఆలోచనను ఆవేదనను నాన్నాఅన్న ఒక్క మాటలో వ్యక్తం చేయగలిగింది. ఇంత పనిచేస్తావని ఎప్పుడూ అనుకోలేదని మూగగా రోదించింది.
ఉ. మాట్లాడే నాగలి ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ? రచయిత ఎవరు ? విశేషాలను తెలుపండి?
జవాబు.మాట్లాడే నాగలి అను పాఠం అనువాద ప్రక్రియకు సంబంధించిన పాఠం. దీనిని మలయాళంలో పొన్కున్నం వర్కెయ్, వ్రాయగా దానిని ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువదించాడు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లైతే దానిని అనువాదం అంటాం. ఆంగ్లంలో అనువాదాన్ని ‘Translation’ అంటారు. సాహిత్య అకాడమీవారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలుఅనే గ్రంథంలో ప్రచురించిన మలయాళకథ ఇది. ప్రకృతి, మూగజీవుల పట్ల ప్రేమ ఆవశ్యకతను వివరించిన కథ ఇది. జీవకారుణ్యానికి ఈ కథ ఒక మచ్చుతునక.
ఊ. కన్నను, దాని స్వభావాన్ని వివరించండి. (లేదా) మాట్లాడే నాగలి పాఠం ఆధారంగా కన్నన్ ఎద్దు స్వభావాన్ని వివరించండి.
జవాబు.కన్నన్ ఓసెఫ్కు జీవనాధారమైన ఎద్దు. ఓసెఫ్క కన్నన్ తోడిదే జీవితం. అది బూడిదరంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారం గలిగిన వృషభరాజం. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటకు ఉబికిన కళ్ళుండేవి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకత కన్పించేది. కన్నన్ విచక్షణాజ్ఞానం కలిగిన ఎద్దు. దానిని తిట్టవలసిన కొట్టవలసిన అవసరం ఓసెఫ్కు ఏనాడు రాలేదట. దీనిని బట్టి కన్నన్ ఎంతటి పెంపుడు జంతువో అర్థమౌతుంది. ఓసెఫ్ మాటలను ముందుగానే అర్థంచేసుకొని కూతురితో సమానమనిపించుకుంది.
ఎ. ఓసెఫ్ కన్నన్ను ఎలా శాంతింపజేసేవాడు?
జవాబు.ఓసెఫ్ మాట్లాడిన ప్రతిమాట కన్నన్ అర్థం చేసుకునేది. ఎంతటి గుంపులో ఉన్నా కన్నన్ ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది. నాగలిని ఓసెఫ్ పడితేనే ఇష్టపడేది. ఇంకెవరు పట్టినా తన కొంటెతనం చూపించేది. కన్నన్ హెచ్చరికతో దానిని శాంతింపజేసేవాడు. పొలాల్లో పనిచేసే రైతులు చక్కగా పాటలు పాడుకుంటారు. వాటికి వ్యాకరణంతోగాని, శాస్త్రీయ రాగాలతోగాని పనిఉండదు. ఓసెఫ్ గొంతెత్తి చక్కని పాటలు పాడేవాడు. ఆ ఆలాపన కన్నన్కు మహాఇష్టం. ఒకసారి మడి దున్నుతున్నపుడు ఓసెఫ్కు బదులు ఓసెఫ్ మిత్రుడు పచన్ పాట అందుకున్నాడు. ఆ పాటను విన్న కన్నన్ సంగీతాన్ని పచన్ అవమానిస్తున్నాడని కుడి కాలు మీద ఒక్కటి తన్నింది. ఓసెఫ్ మాటలతో మరలా శాంతించింది. ఇలా కన్నన్ విషయంలో ఎవరైనా ఓసెఫ్ తరువాతే, ఓసెఫ్కు కన్నన్ తరువాతే ఎవ్వరైనా!
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. (లేదా) మాట్లాడే నాగలిపాఠం ఆధారంగా ఓసెఫ్, కన్నన్ ల మధ్య అనుబంధం గురించి రాయండి.
జవాబు.ఓసెఫ్ ఒక రైతు. అతడు తన ఎద్దు కన్నన్ సంగతి వచ్చేసరికి అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదేలోకం. బూడిదరంగులో పొట్టిగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో, సుడిదిగిన బిగువైన చర్మంతో బయటకు ఉబికిన కళ్ళతో ఠీవిగా నడుస్తుంది. ఓసెఫ్ ప్రతి అడుగు ప్రతి మాట దానికి ఎరుకే! అందుకే కన్నన్ పై ఓసెఫ్ ఏనాడూ చెర్నాకోల వాడలేదు. కన్నన్ను ఓసెఫ్ ఎప్పుడూ కట్టేయ లేదు. దున్నటం పూర్తవగానే దానిని మేతకు వదిలేవాడు.
కన్నన్ వంటికి అంటిన బురదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. కన్నన్కు ఓసెఫ్ చేసేపనులలో నచ్చనిది ఇది ఒక్కటే. ఓసెఫ్ కన్నన్కు తన హృదయంలోని ప్రేమానురాగాలను పంచి పెట్టేవాడు. పశువులను రక్షించాలన్న ఉపన్యాస మంటే ఓసెఫ్కు కోపం వచ్చేది. ఓసెఫ్ దొడ్లో పశువులు ఆకలితో మాడితే ఆ ఇంటికి అరిష్టం వస్తుందనేవాడు. పనిఅవగానే ఇంటికి తీసుకొనిపోయి కన్నన్కు చేతినిండా గడ్డిపరకలను, అరటి తొక్కలను చిన్న కానుకగా ఇచ్చేవాడు.
ఓసెఫ్ ప్రేమగా కన్నన్ను దువ్వుతుంటే కన్నన్ అతనిని నాకుతుంటుంది. ప్రేమకు మాటలూ ప్రదర్శనలు అవసరంలేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాలు. కుమార్తె నాన్నా నువ్వు నాకింత పని చేస్తావని ఎపుడూ అనుకోలేదుఅని అన్నపుడు ఓసెఫ్ బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ అంతేఅన్న మాటల్లో కన్నన్పట్ల ఓసెఫ్ ప్రేమ మనకు అర్థమౌతుంది.
ఆ. మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి ? (లేదా) పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి రాయండి.
జవాబు.ఈ సృష్టిలో మనిషికి బ్రతికే హక్కు ఎంత ఉందో మిగిలిన జీవరాశికి బ్రతికే హక్కు అంతే ఉంది. కాబట్టి మనం మూగ జీవాల మీద ప్రేమచూపించాలి. జీవరాశిలో మానవుడు విలక్షణమైనవాడు. మిగిలిన జీవరాశుల కంటే మానవుడు ఆలోచనా జ్ఞానం విచక్షణా జ్ఞానం కలిగినవాడు. మానవుడు జీవరాశి అంతటికి ఉన్నతుడు అవటంచేత ఇతర జీవరాశుల నియంత్రణకు పాల్పడుతున్నాడు. అది సరైన పద్ధతి కానేకాదు.
ప్రతి జీవిపై ప్రేమాభిమానాలను చూపించాలి. మనిషి తాను సుఖంగా బతకాలనుకొని ఇతర జీవరాశిని నాశనం చేస్తే ప్రకృతిలో అసమతౌల్యత తలెత్తే ప్రమాదం ఉంది. ఆ అసమతౌల్యతను అధిగమించటానికైనా మనం మూగ జీవాల మీద ప్రేమను చూపించాలి. మూగజీవులకు మాటలేదు. తమ బాధలను చెప్పుకోలేవు. అందుకే వాటిని ప్రేమగా లాలించాలి. అవి చేతలతో వ్యక్తం చేసే బాధలను అర్థం చేసుకోవాలంటే ప్రేమ చూపించడమే మార్గం.
ఇ. ఎద్దు (కన్నన్)ను అమ్మవలసిన పరిస్థితిలో ఓసెఫ్ పడిన బాధను వివరించండి. (లేదా) ఓసెఫ్కి ఎద్దులంటే చాలా ప్రేమ. వాటిని అమ్మేశాడు కదా ! పేదరైతులు తమకు విలువైన వాటిని ఎందుకమ్ముకుంటున్నారో వివరించండి.
జవాబు.కన్నన్ ఓసెఫ్ దగ్గర పన్నెండు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల ప్రభావం వలన ఓసెఫ్కు కన్నన్ ను అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తాను బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా కాదు. అంతకంటే గత్యంతరం లేదు. ఓసెఫ్కు పెళ్ళీడుకు వచ్చిన ముద్దుల కూతురుంది.
ఆమె పెళ్లికి కట్నకానుకలు సమర్పించటానికి పొలాన్ని, తనకు ఇష్టమైన కన్నన్నీ అమ్మేయవలసివచ్చింది. పెళ్లికొడుకు కుటుంబం పైసాకు రికాణా లేనిదైనా 3 వేలు కట్నంగా అడగటంతో అమ్మేయక తప్పిందికాదు. కన్నన్ ను అమ్మినపుడు ఓసెఫ్ అక్కడ లేడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు ఉండవు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే. ఓసెఫ్ బాధ ఎవరూ తీర్చలేనిది. ఓసెఫ్ మనసు మనసులో లేదు. కన్నన్ పట్ల ఓసెఫున్న ప్రేమ కథ చివరిలో కూతురుతో బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతేఅన్నమాటల్లో అర్థమౌతుంది.
IV సృజనాత్మకత/ప్రశంస
1. “మూగజీవులకు నోరొస్తే …..” ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జవాబు.
ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోరతపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షింపదలచి తన ఆశ్రమంలోని జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వమొచ్చి ఆశ్రమంలో తనకు అడ్డువచ్చే ప్రతి జంతువునూ నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆశ్రమంలోని విద్యార్థులను కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా తిట్టింది. దాంతో మహర్షికి కోపం వచ్చి మరలా దానికి మాట రాకుండా చేశాడు.
కాబట్టి ఎవరి స్థాయిని వారు మరువకూడదు.
2. “మూగజీవులను ప్రేమించాలిఅన్న అంశాన్ని ప్రజలకు తెలియచెపుతూ ఒక కరపత్రం రాయండి.
మూగజీవులను ప్రేమించాలి
ప్రజలారా!
సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో మనం ప్రేమానురాగాలను చూపించాలి. మనింట్లో ఒక ఆవో గేదో ఉందనుకుందాం. అది మనతో 10, 15 ఏండ్ల పాటు కలిసి మెలసి ఉంటుంది. మనకు ఒకరకంగా జీవనోపాధినిస్తుంది. తరువాత అది పాలివ్వటం లేదని కటికవానికి అప్పగించకూడదు. నాలుగు గడ్డిపరకలు వేస్తే దాని జీవనం అది గడుపుతుంది. అంతకన్నా మూగజీవాలు మనల్ని ఏమీ కోరవు. వాటి మూగ వేదనను రోదనను భరించవలసిన పని మనకేమిటంటే ఇక మానవత్వం ఎక్కడున్నది.
ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి. అవి మనకు ఏ హాని చేయవు. వాటిని ప్రేమిస్తూ నాలుగు గింజలను వాటికోసం ఉంచండి. మనకు పోయేదేంలేదు. దారి వెంట తనదారిన తాను పోతున్నా తొండల మీద పక్షుల మీద రాళ్ళను విసరటం మానుకోవాలి. అవి గాయపడితే మనకేం లాభం. కాబట్టి మూగజీవాలను ప్రేమతో ప్రేమించండి. ప్రేమిస్తారు కదూ!
ఇట్ల
జీవావరణ పరిరక్షణ కమిటీ,
xxxxxx
V. పదజాల వినియోగం:
1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.
(అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది
జవాబు. వృషభం = ఎద్దు.
(ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు. పసికట్టు = కనిపెట్టు
(ఇ) మనిషిని అసహనం ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు. ఠీవిగా = దర్జాగా
(ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.అరిష్టం = కీడు
కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.
(అ) రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు?
జవాబు.హృదయము, ఎద, ఎడద
(ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష
(ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సంబరం, సంతోషం, ఆనందం
3. కింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.
(అ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.దిక్కు = దిశ, శరణము, వైపు
(ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే ఉత్తరమివ్వ లేదు.
జవాబు.ఉత్తరము = దిక్కు, లేఖ, జవాబు.
4. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది సంధులను విడదీసి, సంధి పేర్లను రాయండి.
2. కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని
ప్రశ్న 1.నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నిత్య జీవితంలో జంతువులు పక్షులపైన (పేమ చూపించే సంఘటనలు కోకొల్లలు. వాటిలో నాకు తెలిసిన కథ వివరిస్తాను. బౌద్ధమతం బుద్ధునిచే ప్రారంభించబడింది. అది అహింసో పరమోధర్మఃఅని ర్రబోధించింది. బుద్ధుడు చిన్నతనంలో ఒకానాక రోజున ఉద్యానవనంలో విహరిస్తుండగా హంసలు ఆ వనంలో హాయిగా అటుఇటు తిరుగుతున్నాయి. బుద్ధుని అన్న కుమారుడు ఆ హంసలలో ఒకదానిని బాణంతో కొట్టాడు.
ఆ హంస బుద్ధుని వద్దకు వచ్చి పడిపోయింది. అపుడు బుద్ధుడు ఆ హంస శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి తన వస్తాన్ని చించి కట్టుకట్టి సంరక్షించాడు. ఆ హంసను నేను వేటాడాను; అది నాది నాకిమ్మని పట్టుపట్టాడు అన్న కుమారుడు. బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. వారి తగవు రాజు వద్దకు చేరింది. రాజు వారిద్దరి వాదనలు విని హంసను [పేమతో రక్షించిన వాడు బుద్ధుడు కావున అది బుద్ధునిదేనని తీర్పు ఇచ్చాడు. (పేమించిన వానిదే ప్రాణి కాని హింసించిన వానిది కాదని ఈ కథలోని నీతి.
 
ప్రశ్న 2.వివిధ జంతువులు / పక్షులు పెంపకం దారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల / పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
సంప్రదించిన వ్యక్తులు
  1. డేవిడ్ కెన్నెల్ నిర్వాహకులు
  1. న్నూభాయ్ పావురాల ప్రేమికుడు
  1. కిరణ్ కుక్కపిల్ల (జూలీ) ని పెంచుకుంటున్న స్నేహితుడు
  1. రంగమ్మత్త పిల్లికూనను పెంచుకుంటున్న పక్కింటి అత్తమ్మ 5. రామయ్య ఆవును సాదుకుంటున్న పశుప్రేమికుడు
  1. సలీం అలీ పక్షుల సంరక్షకుడు
  1. శ్రావణి లవ్బర్డ్స్ని పెంచుతున్న ఒక అమ్మాయి.
  1. సురేందర్ ఆక్వేరియంలో చేపపిల్లలను పెంచుతున్న మిత్రుడు
ఈవిధంగా మన చుట్టూ సమాజంలో ఉన్న రకరకాల జంతుప్రేమికులను, పక్షుల ప్రేమికులను, చేపల ప్రేమికులను సంప్రదించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. వివిధ రకాల పశుపక్ష్యాదుల పెంపకం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించడమే గాక, బాధ్యతను, సహానుభూతినీ, క్రమశిక్షణనూ నేర్పిస్తాయనీ తెలుసుకున్నాను. వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేశాయి.
నివేదిక :
మనుషులకు దగ్గరై, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని పెంచుకొని, విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మనసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే జంతువులూ, పక్షులూ మనచుట్టూ ఉన్నాయని, వాటి రక్షణ, పోషణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా మూగజీవుల మనోవేదనను, స్పందనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పెంపకం ఉపకరిస్తుందనీ గ్రహించాను.
మనకు ఇష్టమైన పక్షినో, జంతువునో పెంచుకోవాలనుకున్నప్పుడు వాటిని చిన్న వయస్సులో ఉండగానే తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, రక్షణ, భద్రత, పోషణకు సంబంధించిన అన్ని విషయాలూ కూలంకషంగా తెలుసుకోవాలి.
కొన్ని కొన్ని పక్షులకు / జంతువులకు ప్రత్యేకమైన ఆహారం, ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఉదాహరణకు పావురాలకు జొన్నలంటే ఇష్టం. అదే లవ్బర్స్కైతే కొర్రలు ఇష్టమైన ఆహారం. పిల్లులూ కుక్కలు కూడా పాలన్నా, మాంసాహారమన్నా ఇష్టపడతాయి. కుక్కలకు రొట్టెలు ఇష్టం. పిల్లులకు పెరుగన్నం ప్రీతిపాత్రం. చేపలకు నిర్దేశించిన ఆహారం ఎక్కువైతే విషతుల్యమౌతుంది.
అవి నివసించే పరిసరాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లులు, కుక్కలకు మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్ళే అలవాటు చేయాలి. పావురాలు, లబ్బర్డ్స్ తమ గూళ్ళను, పంజరాన్నీ బాగా మలిన పరుస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పిల్లులకు, కుక్కలకు తరచూ స్నానం చేయిస్తుండాలి. ఆవులు కూడా స్నానానికి ఇష్టపడతాయి. ఎద్దులు అంతగా ఇష్టపడవు. చేపల అక్వేరియంలు తొందరగా మురికి అయిపోతుంటాయి. వాటిని 10-15 రోజులకొకసారి శుభ్రం చేయాలి.
పశువులు, పక్షులు సరిగ్గా నిద్రపోకున్నా, వాటి అరుపుల్లో తేడా వచ్చినా, నీరసంగా కనిపించినా వెంటనే వాటికి సంబంధించిన వైద్యులకో, అనుభవజ్ఞులకో చూపించి తగిన వైద్య సహాయం అందించాలి. అవి మూగజీవులు భాషను అవి అర్థం చేసుకుంటాయి. కాని వాటి భాషనే మనం అర్థం చేసుకోలేం. తగినంత శ్రద్ధ, పరిశీలన ఉంటే కనీసం వాటి మనోభావాలను అర్థం చేసుకొని, తగిన విధంగా స్పందించగలుగుతాం.
జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. నగరాల్లో వాటిని స్వేచ్ఛగా వదిలేసే అవకాశం లేకుంటే కనీసం రోజుకొక్కసారైనా బయటి ప్రపంచంలో తిప్పడం మంచిది. లవ్బర్డ్స్ పెద్దవయ్యాక వాటిని పంజరంలో నుండి స్వేచ్ఛగా వదిలేయాలి. ఈవిధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పోషించడమేగాక, వీలైనంత సమయం వాటితో గడిపితే వాటికీ, మనకూ ఆనందంగా ఉంటుంది. మూగజీవులను స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు సాటి మనుషులతో సఖ్యంగా నివసించగల్గుతా
పర్యాయపదాలు:
  • రైతు = కృషీవలుడు, కర్షకుడు
  • లోకము = ప్రపంచము, జగత్తు
  • రాజు = చక్రవర్తి, భూపాలకుడు
  • కళ్ళు = నయనము, నేత్రములు
  • స్నేహితుడు = మిత్రుడు, నేస్తము
  • చెట్టు = తరువు, వృక్షము
  • భూమి = ఇల, ధరణి
  • పండుగ = ఉత్సవము, సంబరము
నానార్థాలు:
  • రాజు = చంద్డు, భూపాలుడు
  • ఊరు = గ్రామము, గ్రవించు
  • స్నేహితుడు = చెలికాడు, సూర్యుడు
  • అర్థము = శబ్దార్థము, ఏయోజనము
ప్రకృతిలు వికృతిలు:
  • భాష బాస
  • మనిషి మనిసి
  • ప్రాణము పానము
  • కష్టము కస్తి
  • ఆశ ఆస
సంధులు:
బహ్మాండమైన బబ్మాండము + ఐన = ఉత్వసంధి
చిత్రమైన చిత్రము + ఐన = ఉత్వసంధి
గొంతెత్తి గొంతు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడ సంధి అవుతుంది.
పత్యక్షము = పత్రి + అక్షము = యణాదేశసంధి
సూ(త్రం : ఇ, , ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు య, , ర లు ఆదేశమవుతాయి.
చెప్పినదంతా = చెప్పినది + అంత = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది.
(పేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, , , ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సహాలు = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, , ఋలు పరమైతే (క్రమంగా ఏ, , అర్లు ఏకాదేశమవుతాయి.
సమాసాలు:
అరటి చెట్టు అరటి అనుపేరుగల చెట్టు = సంభావనా పూర్వపద కర్మధారయము
[పేమానురాగాలు చేమయును, అనురాగమును = ద్వంద్వ సమాసము
మంచి భూమి మంచిదైన భూమి = విశేషణపూర్వపద కర్మధారయము
మధ్యాహ్నము అహ్నం యొక్క మధ్య భాగము = (ప్రమా తత్పురుష సమాసము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...