సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

22, ఫిబ్రవరి 2024, గురువారం

IX. 12. తీయని పలకరింపు

తీయని పలకరింపు


పాఠము తీయని పలకరింపు

  1. తులసిదళాలు
  1. రాజహంస
జవాబు:ఈ మాటలు విదేశాల్లో తమ పిల్లలు ఉంటున్న ముసలి తల్లిదండ్రులు అంటూ ఉండవచ్చు.
జవాబు:పిల్లలు దగ్గరలో లేకపోవడం వల్ల, వారికి ఆలనాపాలనా చూసే దిక్కు ఉండదు. వారిని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళే దిక్కు ఎవరూ ఉండరు. వారికి కావలసిన వారు ఎవరూ దగ్గరలేక, వారు బెంగతో బాధపడుతూ ఉంటారు. వారు కమ్మని తమ బిడ్డల పలుకరింపుకై, ఎదురుచూస్తూ ఉంటారు.
జవాబు:మా ప్రక్క ఇంటి తాతగారు, బామ్మగారు ఇలాగే ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారి అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరు. వారి అమ్మాయి జపాన్లో ఒక పెద్ద డాక్టరుకు భార్య. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది.
జవాబు:వారి పట్ల మనం జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. వారిని తీయగా తాతగారూ, బామ్మగారూ అంటూ పలకరించాలి. అప్పుడప్పుడు వారితో తీయగా కబుర్లు చెప్పాలి. వారి యోగక్షేమాలు తెలిసికోవాలి. వారి అవసరాలను తెలుసుకొని, వాటిని వారికి తెచ్చి పెట్టాలి. ముఖ్యంగా వారిని ప్రేమగా వరుసలు పెట్టి పిలువాలి.
జవాబు:నేడు కన్న కొడుకులు, కూతుళ్ళు ముసలివారిని పట్టించుకోడం మానివేశారు. కోడళ్ళూ, కొడుకులూ వారిని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు. ముసలివారు తమ ఆస్తిలో భాగం తమకు సరిగా పంచి ఇవ్వలేదనీ, ముసలివారు, ఆస్తులు కూడబెట్టలేదనీ, ముసలివారిని పిల్లలు తప్పుపడుతున్నారు. మనుమలు, మనుమరాండ్రు సహితం, ముసలివారికి చాదస్తం ఎక్కువని, వారివి ఛాందసాచారాలనీ ఈసడిస్తున్నారు.
అ) చెట్టు కింద ఒక్కరూ కూర్చున్నారేం ?
జవాబు:గంగాధరరావు
జవాబు:విమల
జవాబు:సావిత్రమ్మ
జవాబు:కోడలు
జవాబు:కూతురు
జవాబు:మనువడు
జవాబు:పుత్రరత్నం
ఇల్లంటే అమ్మఒడి
ఇల్లంటమమతలు పల్లవించే యెద సడి
ఇల్లంటే
ఆత్మీయతల సందడి
ఇల్లంటే
మనల్ని మనం పునశ్చరణ చేసుకునే బడి
ఇల్లంటే
ప్రేమాభిమానాల సెలయేళ్ళ అలజడి
ఇల్లంటే
ఊరడింపుల రాబడి
స్వార్థం ఎండమావులవెంట పరుగులు
పెడ్తు
చలిచెలిమె వంటి
ఇల్లును దూరం చేసుకుంటే
తల్లివంటి ఇల్లు
మనసు చిన్నబుచ్చుకుంటుంది
అక్కడ నీళ్ళింకిపోతే
తరతరాలకు ఆ తడిలేని జీవితం
శాపంగా పరిణమిస్తుంది కొడుకా !
అ) ఇచ్చిన వచన కవితలోని అంత్యానుప్రాసపదాలను గుర్తించండి.
జవాబు:
అంత్యానుప్రాసలు :
  1. అమ్మబడి
  1. యెదసడి
  1. సందడి
  1. బడి
  1. అలజడి
  1. రాబడి
జవాబు:
ఇల్లు ఆత్మీయతల సందడిఅంటే, ఇంట్లో ఒకరంటే మరొకరికి అంతులేని అభిమానం, ప్రేమ, వాత్సల్యము, ఆర్ద్రత, ఉంటాయని అర్థం.
జవాబు:
పునశ్చరణఅంటే,      మళ్ళీ                                                                                                                                           మళ్ళీ చేయడం అని అర్ధము. మనం చేసే తప్పొప్పులను తిరిగి సవరించుకొనే బడివంటిది ఇల్లు. బడిలో మనం గురువు ద్వారా, మన తప్పులను సరిదిద్దుకుంటాము. ఇంట్లో కూడా పెద్దల మాటలను విని, మన తప్పులను మనం దిద్దుకొంటామని భావం.
జవాబు:
ఇల్లు చలిచెలిమె వంటిది. చలిచెలిమేలో నీరు ఎంత తోడినా, తిరిగి ఊరుతుంది. ఎండమావిలో నీరు ఉన్నట్లు భ్రాంతియే కాని, అసలు నీరు ఉండదు. చలిచెలిమెలో నీరు ఊరినట్లు, ఇంట్లో వారికి పరస్పర ప్రేమ ఊరుతుంది.
జవాబు:
మానవజీవితంలో చెలిమి ఎంతో ముఖ్యమైనది. చెలిమికి ప్రాణాలు ఇచ్చే సమయ సందర్భాలు ఉంటాయి. అలాంటి చెలిమిని దూరం చేసుకుంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది.
జవాబు:గంగాధరరావు గారు ఉద్యోగం చేసే రోజుల్లో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బంట్రోతులు ఉండేవారు. కొడుకు, నాన్నగారూ! అంటూ ప్రేమగా పలుకరించి, కావలసిన డబ్బు పట్టుకెళ్ళేవాడు. ఇక, కోడలు ఎంతో ప్రేమను నటిస్తూ, సమయానికి ఆయనకు టిఫిన్లు, కాఫీ వగైరా సమకూర్చేది. మనవడు ఆయన వెంట షికారుకు తోడుగా వెళ్ళేవాడు. కూతురు ఆయన పూజకు కావలసిన పూవులు వగైరా తెచ్చి, పూజాద్రవ్యములు సమకూర్చేది.
జవాబు:గంగాధరరావు వ్యక్తిత్వమున్న వ్యక్తి. ఆయనకు గృహస్థ సభ్యుల ప్రేమాదరాలు కావాలి. ఇంటిలో అందరూ ఆయన మంచి, చెడ్డలను చూడాలని ఆయన కోరుకొనేవాడు.
జవాబు:తల్లిదండ్రులు తమపిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. తమ కడుపు కట్టుకొని పిల్లలకు కావలసినది సమకూరుస్తారు. పిల్లల చదువులకై, పెళ్ళిళ్ళకై, తమకు ఉన్న ఆస్తులను అమ్ముకొని ఖర్చు చేస్తారు. వారికి శక్తి శరీరంలో ఉన్నంత కాలం బిడ్డల అభివృద్ధికే, తమ సర్వస్వాన్ని ధార పోస్తారు.
జవాబు:ఇల్లిందల సరస్వతీదేవిగారు సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో రచనలు సాగించేవారు. ఈమె తన రచనలో మానవ మనస్తత్వ ధోరణులను చక్కగా విశ్లేషించింది. ఇల్లిందల సరస్వతీదేవి గారి కథాకథనము అద్భుతంగా ఉంది.
జవాబు:
వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.
జవాబు:గంగాధరరావు నిత్యం దైవపూజ చేసేవాడు. ఆశ్రమంలో సభ్యులు అందరూ గంగాధరరావు పట్ల మంచి అభిమానం చూపించేవారు. ఒక రోజున హైకోర్టు నుండి గంగాధరరావును గురించి ఎంక్వైరీ చేస్తూ, ఒక గుమాస్తా వచ్చాడు. ఆశ్రమం సూపర్నెంటును కలిశాడు. గంగాధరరావు మాతామహుడి బాపతు పొలం వంద ఎకరాలు గంగాధరరావుకు సంక్రమించాయని, ఆయన ఆర్డర్లు హైకోర్టు నుండి తెచ్చి ఇచ్చాడు. గంగాధరరావు సంతోషించాడు.
అ) చెట్టు వృక్షం, తరువు, మహీజం
జవాబు:అచ్చెరువు (వికృతి) ఆశ్చర్యము (ప్రకృతి)
జవాబు:సాయం (వికృతి) సహాయం (ప్రకృతి)
జవాబు:బోనం (వికృతి) భోజనం (ప్రకృతి)
(ఇది కర్తరి వాక్యము. క్రియను ఎవరు సేకరించారుఅని ప్రశ్నిస్తే రచయిత్రులుఅని కర్త జవాబు.)
జవాబు:రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. (ఇది కర్మణి వాక్యం)
(ఇది కర్మణి వాక్యం. రికార్డు చేయబడింది.అనే క్రియను దేనినిఅనే దానిచే ప్రశ్నిస్తే, ఇంటర్వ్యూను అనే కర్మ జవాబుగా వస్తుంది.)
జవాబు:ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (ఇది కర్తరి వాక్యం)
(ఇది కర్తరి వాక్యం. ప్రచురించారుఅనే క్రియను ఏవి ప్రచురించారు అని ప్రశ్నిస్తే, ‘ఇంటర్వ్యూలుఅనే కర్త జవాబుగా వచ్చింది. కాబట్టి ఇది కర్తరి వాక్యం.)
జవాబు:కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు, యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
(ఇది కర్మణి వాక్యం. క్రియలో, ‘ఐదుధాతువు చేరింది. ఇందులో మార్పుచేయబడలేదుఅనే క్రియను, ‘ఏదిఅన్న దానిచే ప్రశ్నిస్తే భాషఅనే కర్మపదం జవాబుగా వస్తుంది. కాబట్టి ఇది కర్మణి వాక్యం.)
జవాబు:వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)
జవాబు:ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:గోడలమీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)
జవాబు:దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)
జవాబు:మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)


రచయిత్రి : ఇల్లిందల సరస్వతీదేవి

పాఠం దేనినుండి గ్రహింపబడినది : రచయిత్రి రచించిన తులసిదళాలుకథానికల సంపుటి నుండి గ్రహింపబడింది.

జననము : 15 – 06 – 1918

మరణము : 31 – 07 – 1998

రచనలు : ఈమె స్వాతంత్ర్యం రావడానికి ముందే, సృజనాత్మక రంగంలోకి అడుగు పెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు,                                                             కొన్ని                                  నవలలు,      రేడియో నాటికలు, అనేక వ్యాసాలు రచించింది.

అవార్డులు : 1982 లో ఈమె రచించిన స్వర్ణకమలాలుకథాసంపుటికి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చింది. ఈమె సుశీలా నారాయణరెడ్డిపురస్కారాన్ని కూడా పొందింది.

కథాసంపుటాలు :

పదవి : 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జైలు విజిటర్గానూ పనిచేసింది.

ఆంధ్ర యువతీమండలి : ఈమె 1934 లో స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు.

రచనాశైలి : మానవ మనస్తత్త్వ ధోరణులనూ, వివిధకాలాల్లో, వివిధ సందర్భాల్లో జీవన పరిణామాలనూ విశ్లేషించడం, విశ్వజనీన భావాలతో రచనలు చేయడం ఈమె దృక్పథం.

 

ప్రవేశిక

మానవుడు సంఘజీవి. పదిమందితో కలసి జీవించాలనుకుంటాడు. దేశవిదేశాలతో సంబంధాలు. నెలకొల్పుకొంటున్నాడు. కాని తన కుటుంబసభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా ? ఇంటికి పెద్దదిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూసుకుంటున్నాడా ?

నిర్లక్ష్యానికి గురి అయిన గంగాధరరావు అనే వృద్ధుడు,                                                                       తన ఇల్లువదిలి, తన వాళ్ళందరికీ దూరంగా జీవించసాగాడు. గంగాధరరావు అట్లా వెళ్ళిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి ? వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేమిటి ? తెలుసుకునేందుకు ఈ కథ చదువుదాం…….

 

 

చదువండి ఆలోచించి చెప్పండి

అరే రాజన్నా ! ఈ బతకుమీద విరక్తి గలుగుతుందిరా! రెక్కలు ముక్కలు జేసుకోని పిల్లలను బెంచిన. విదేశాల్లో జదువుకుంటే గొప్ప ప్రయోజకులైతరు, మాకు మంచి పేరొస్తదనుకున్న. పెండ్లిల్లు జేసిన. రెక్కలొచ్చిన పక్షులు గూడువదలిపోయినట్లు, మల్ల సూడకుండా ఎల్లిపొయ్యిన్రురా. అప్పుల సంగతి సరే. ఆయాసమొచ్చినప్పుడు నరాలు దెగిపొయ్యేటట్లు ఏడిచినా వాళ్ళకు యినవడదు. ఇనవడ్డా, నేనొచ్చి ఏం జేస్త నాయినా, డాక్టరుకు జూపిచ్చుకో, కావాల్నంటె పైసలు పంపిస్తంఅని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడ్తాయా? మనసులోని బాధను పంచుకుంటయా? మనుమండ్లు, మనుమరాండ్ల స్పర్శను గలిగిస్తయా ? తియ్యగ ఒక్కసారి పలుకరిస్తయా?”

1.ఈ మాటలు ఎవ్వరంటుండవచ్చు?

2.పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ?

3.మీరు ఇటువంటి వాళ్ళను ఎవరినైనా చూశారా ?

4.వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ?

 

ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన

ప్రశ్న 1.ముసలివారు వృద్ధాశ్రమాలకు వెళ్ళడానికి గల కారణాలు చర్చించండి.

వారి పిల్లలు విదేశాల్లోనూ, దూరప్రాంతాల్లోనూ. ఉద్యోగాలు చేస్తున్నారు. ముసలివారు శక్తిలేక, తమ పనులు తాము చేసికోలేకపోతున్నారు. కొడుకులూ, కోడళ్ళూ వారికి సాయపడడంలేదు. వేళకు కొంచెం కాఫీ, భోజనం కూడా వారికి ఇవ్వడం లేదు. ముసలివారిని డాక్టర్ల వద్దకు పిల్లలు తీసుకువెళ్ళడం లేదు. వారికి కావలసిన మందులు తెచ్చి ఇవ్వడం లేదు. అందువల్లనే ముసలివారు వృద్ధాశ్రమాలకు వెడుతున్నారు.

 

ప్రశ్న 2.పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరి గురించి చెప్పినవో గుర్తించి, రాయండి.

ఆ) సంసార బాధ్యతలు లేవు.

ఇ) ఆ చీరలూ, ఆ నగలూ ఎంత వైభోగంగా బతికింది.

ఈ) ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న పట్టుదల.

ఉ) ఫిక్స్డ్ డిపాజిట్ తనకిస్తే పండుగకు వస్తా.

ఊ) మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి.

ఎ) ఈ జబ్బువస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు ?

ప్రశ్న 3.కింది వచనకవిత చదివి ప్రశ్నలకు జవాబు లివ్వండి.

ప్రశ్నలు :

 

ఆ) ఇల్లు ఆత్మీయతల సందడి అంటే

ఇ) ఇల్లు పునశ్చరణ చేసుకునే బడి’ – ఎందుకంటే ?

ఈ) చలిచెలిమెకు, ఎండమావికీ భేదం

ఉ) మనసు చిన్నబుచ్చుకునేది ఎప్పుడు ?

 

II. వ్యక్తీకరణ- సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) గంగాధరరావు ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో, ఊహించి రాయండి.

భార్య సావిత్రమ్మ భర్తపై ప్రేమ కురిపించేది. హొయలు ఒలకపోస్తూ పట్టు చీరలూ, నగలూ ధరించి భర్తకు సకల సౌఖ్యాలూ అందించేది. ఇంట్లో నౌకర్లు ఆయన కనుసన్నల్లో నడుచుకుంటూ, ఆయనకు కావలసిన సమస్త సౌకర్యాలూ సమకూర్చేవారు. సావిత్రమ్మగారు భర్తకు కావలసిన మందులు దగ్గర ఉండి ఇచ్చేది. ఆయన ధరించే బట్టలు, బూట్లు ఒకరోజు ముందే ఆమె సిద్ధంగా ఉంచేది. ఇంట్లో ఆయనకు ఇష్టమైన కూరలే వండేవారు. ఆయనకు నచ్చే టిఫిన్లు మాత్రమే తయారుచేసేవారు. ఇంటివారు అంతా గంగాధరరావు చుట్టూ తిరిగేవారు.

 

 

ఆ) ఇల్లు వదిలి, ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టి గంగాధరరావు ఎలాంటివాడో రాయండి.

తాను సంపాదించిన ధనాన్ని ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఎందరికో సాయం చేశాడు. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్టు చేశాడు. తన డబ్బు తాను దాచుకున్నాడు. కట్టుకున్న భార్య కూడా తన మంచి, చెడ్డలను చూసుకోకపోవడం, ఆయనకు కోపాన్ని తెప్పించింది. కొడుకూ, కోడలూ తాను బ్రతికి ఉండగానే తాను కట్టించిన ఇంటిని వారిపేర రాయమని ఒత్తిడి చేయడం, ఆయనకు బాధ కల్గించింది.

ఆయనను అందరూ పట్టించుకోవాలి కాని ఆయన వారిని పట్టించుకొనేవాడు కాడు. గంగాధరరావు పట్టుదల మనిషి. అందుకే తనవారందరినీ విడిచిపెట్టి, తాను ఆశ్రమానికి చేరాడు. గంగధారరావుకు తీయని పలకరింపు కావాలి. అది ఆశ్రమంలో ఆయనకు దొరికింది. తనకు వైద్యం అనవసరం అన్న కొడుకు మాట, ఆయనకు నొప్పి కల్గించింది. మొత్తం మీద గంగాధరరావు కాస్త మొండి మనిషి. తాను అనుకున్న పనిని తాను చేసేవాడు. తన ఇంటివారు తనపై చూపిన అనాదరణను, ఆయన సహించలేకపోయాడు.

 

ఇ) పెంచి, పెద్దచేసి, బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకపోవటం సమంజసమేనా ? మీ అభిప్రాయం రాయండి.

అటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోడం, వారికి తిండిపెట్టకపోడం చాలా అన్యాయము. దుర్మార్గము. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతోనే, తల్లిదండ్రులు తమ సర్వస్వాన్నీ బిడ్డల చదువులకూ, వారి అభివృద్ధికీ వినియోగిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్ధమైనది. అవ్యాజమైనది. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో వారిని పట్టించుకోకపోడం మహాపాపం.

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులను కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. తాను తిన్నదే, తల్లిదండ్రులకూ పెట్టాలి. ప్రేమగా వారిని పలుకరించాలి. తల్లిదండ్రులకు తిండికన్న తీయని పలుకరింపు, వాత్సల్యం ముఖ్యమని నా అభిప్రాయం.

 

ఈ) పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా విధానం ఎట్లా ఉన్నదో తెలుపండి.

ప్రస్తుత కథ తీయని పలకరింపులో గంగాధరరావు మనస్తత్వాన్ని రచయిత్రి చక్కగా వెల్లడించింది. గంగాధరరావు మంచితనము, ఉదారగుణము, తోడి ఉద్యోగులతో ఆయన నడవడి ఆయనను ఆదర్శమూర్తిగా నిలబెట్టాయి.

అటువంటి సజ్జనుడిని ఇంట్లో వారు, తలోరీతిగా బాధపెట్టడం, గంగాధరరావు తట్టుకోలేకపోయాడని రచయిత్రి వెల్లడించింది. ఈ జబ్బు వస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు అనే పుత్రరత్నంఅన్న రచయిత్రి మాటలో హాస్యం తొంగి చూసింది. గంగాధరరావు ఇంట్లో ఆయనను ఇంటి సభ్యులు ఎలా బాధించారో రచయిత్రి చక్కగా చెప్పింది.

గంగాధరరావు భార్యగా మంచి చీరలు, నగలతో వైభోగంగా బతికిన సావిత్రమ్మ, ఆయనను నిర్లక్ష్యం చేయడం చిత్రంగా అనిపిస్తుంది. మానవుల మనస్తత్వాలను అద్భుతంగా ఈ కథ వ్యక్తీకరించింది. వృద్ధాప్యంలో పెద్దవారిని అనాదరంగా చూడడం తప్పని       

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 

(లేదా)

ఆ) వృద్ధాప్యంలో మనుషులకు ఏమి కావాలి? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ?

పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.

భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో,, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు

వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక,                                              తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.

 

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) తీయని పలకరింపు కథను పొడిగించి ఒక మంచి ముగింపును రాయండి.

దీన జనసేవలో మునిగిపోయాడు గంగాధరరావు. ఒకసారి కలక్టరు వచ్చి, ఆశ్రమంలో సభ పెట్టి దీనబంధుఅనే బిరుదును గంగాధరరావుకు ప్రభుత్వం తరపున అందచేశాడు. ఈ వార్త పేపర్లలో, టీ.వీ.ల్లో ప్రముఖంగా వచ్చింది. టీ.వీ. ఎక్కువగా చూసే సావిత్రమ్మ ఆ వార్త చూసి, ఇంట్లో అందరికీ చెప్పింది. తాము తప్పు చేశామని అందరూ తీర్మానించుకొని, వెళ్ళి గంగాధరరావు కాళ్ళపై పడ్డారు.

సావిత్రమ్మ కూడా ఆశ్రమంలోనే భర్తతో ఉండాలని నిశ్చయించుకుంది. గంగాధరరావు కుటుంబ సభ్యుల పశ్చాత్తాపానికి సంతోషించాడు. వారానికి ఒకరోజు కొడుకు, కోడలు, మనుమడు గంగాధరరావు దంపతులతో ఆశ్రమంలోనే గడుపుతున్నారు. కూతురు, అల్లుడు వచ్చారు. గంగాధరరావు తన ఆస్తిలో సగం ఆశ్రమానికి రాసి ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆనందించారు.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పట్టికను పరిశీలించండి. పట్టిక కింద ఇచ్చిన పదాలకు సరిపోయే పర్యాయపదాలు వెతికి రాయండి.

ఆ) ఆకాశం = అంబరం, గగనం

ఇ) నిలయం = ఆవాసం, స్థానం, నెలవు

 

ఈ) రాత్రి = రజని, రేయి, నిశ, నిశీథి

2. కింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి.

అ) ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువొందారు.

ఆ) అడిగినవారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు.

ఇ) మా తాతయ్య బోనం చేయనిదే బయటికి వెళ్ళడు.

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

అ) రోజులు + ఐనా = రోజులైనా (ఉత్వసంధి)

ఆ) ఆదర + అభిమానాలు = ఆదరాభిమానాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఇ) లేదనక + ఉండ లేదనకుండ (అత్వసంధి)

ఈ) వీలు + ఐతే = వీలైతే (ఉత్వసంధి)

ఉ) కావలసినవి + అన్నీ కావలసినవన్నీ (ఇత్వసంధి)

ఊ) పగలు + పగలు = పట్టపగలు (ఆమ్రేడిత సంధి)

2. కింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి, సమాసం పేరు రాయండి.

అ) అధికారం చేత దర్పం -అధికారదర్పం తృతీయా తత్పురుష సమాసం

ఆ) గది యొక్క తలుపులు = గదితలుపులు షష్ఠీ తత్పురుష సమాసం

ఇ) మంచివైన బట్టలు = మంచిబట్టలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఈ)పది సంఖ్యగల గంటలు = పదిగంటలు ద్విగు సమాసం

ఉ) న్యాయమూ, అన్యాయమూ = న్యాయాన్యాయములు ద్వంద్వ సమాసం

3. కింది వ్యాక్యాల్లో కర్తరి/కర్మణి వాక్యాలను గుర్తించండి. నియమాలతో సరిపోల్చుకోండి.

అ) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు.

ఆ) ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది.

ఇ) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు.

ఈ) వాళ్ళ భాష మార్పు చేయబడలేదు.

ఉ) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి, మళ్ళా రమ్మని పంపించారు. (కర్తరి వాక్యం)

ఊ) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి వాక్యం)

ఋ) ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి వాక్యం)

ౠ) గోడలమీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి వాక్యం)

ఎ) దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి వాక్యం)

ఏ) మేం పెద్దలను గౌరవిస్తాం. (ఇది కర్తరి వాక్యం).


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...