సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

13, మార్చి 2023, సోమవారం

2. అయోధ్య కాండ

2. అయోధ్యా కాండ


  1. శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు

  2. కైకేయికి మంధర దుర్బోధ

  3. కైకేయి కోరికలు:

  4. దశరథుడు మూర్ఛిల్లడం

  5. కైకేయికి శ్రీరాముని హామీ

  6. సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష

  7. వన ప్రయాణం

  8. గుహుని ఆతిథ్యం

  9. చిత్రకూట నివాసం

  10. దశరధుని మరణం

  11. భరతుని దుఃఖం

  12. చిత్రకూటానికి భరతుడు ప్రయాణం

  13. పితృవాక్య పాలన

  14. శ్రీరాముని పాదుకలతో పరిపాలన

  15. అత్రి, అనసూయ, సీత

రామాయణం డౌన్లోడ్ చేసుకోండి



శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు: 

 శ్రీరాముడు అయోధ్యా నగర వాసులకు ప్రాణప్రథమయ్యాడు.

దశరధుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగించి, తాను విశ్రాంతి తీసికొనవలెనని సంకల్పించాడు. 

 చైత్ర పుష్యమినాడే పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. 

పుర వాసులంతా హర్షించారు.

వశిష్ఠుడు రామునకు పట్టాభిషేక దీక్షనిచ్చి సీతారాములను ఉపవసించమని, మరునాడే పట్టాభిషేకమని చెప్పాడు. 

అయోధ్యానగర వాసులు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి సంబరాలు చేసికొనసాగారు.


కైకేయికి మంధర దుర్బోధ:  కైకేయి అరుణపు దాసి మంథర.     

తన కళ్ళలో నిప్పులు కుమ్మరించుకుంది.    

కైకేయికి రామ పట్టాభిషేకం గురించి తెలియజేసింది.   

 కైకేయి బహుమానాలు అందజేసింది.

ఎందుకు సంతోషిస్తున్నావని కైకేయిని ప్రశ్నించింది మంథర.    

నాకు రాముడు, భరతుడు సమానము.

 "రాముడు పట్టాభిశక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏమిటి' అని కైకేయి ప్రశ్నించింది.

రాముడు రాజయితే రాజమాత కౌసల్య  అవుతుంది. 

నీవు నీ  జీవితకాలమంతా కౌసల్యకు దాసివని కైకకు మంథర నూరిపోసింది.

కైకేయి మనసు మారింది.

ఎప్పుడో కోరిన కోరికలు తీర్చాలని

రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపాలి. భరతునికి పట్టాభిషేకం జరగాలని దశరథుని కైకేయి కోరింది.


కైకేయి కోరికలు: కైక సకలాలంకారాలూ త్యజించి కోపగృహంలో విషణ్ణవదనయై ఉంది. 

అడిగిందిస్తానని రామునిమీద, తాను చేసుకున్న పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్పాడు. 

పూర్వం దేవాసుర యుద్ధంలో దశరథుడు తనకిచ్చిన రెండు వరాలు ఇప్పుడు చెల్లించాలని కోరింది. ఆ రెండు కోరికలు -

 (1) భరతుని పట్టాభిషేకము

 (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. కైకేయి మాటలు విని దశరథుడు కుప్పకూలిపోయాడు. 

అది అధర్మమనీ, అందుకు భరతుడు కూడా సమ్మతించడనీ, అంతే గాక తాను పట్టాభిషేకాన్ని అందరిముందూ ప్రకటించాననీ, కనుక ఆ రెండు కోరికలను ఉపసంహరించుకోమనీ కైకను బ్రతిమాలాడు. నిందించాడు. అయినా కైక తన పట్టు వీడలేదు.


మరునాడు వశిష్ఠుడు, సుమంతుడు పట్టాభిషేకం జరిపించడానికి దశరథుని వద్దకు వచ్చారు. దశరథుడు దీనుడై నోటమాటరాని స్థితిలో ఉన్నాడు. 

కైకయే రాముని పిలిపించి దశరథుని సమక్షంలోనే అంతకుముందు దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. 

రాముడు కించిత్తైనా దుఃఖం లేకుండా తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్ళడానికి తాను సిద్ధమనీ, వెంటనే భరతుని పిలిచి పట్టం కట్టమనీ చెప్పాడు.


సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష:

కౌసల్యా లక్ష్మణుడూ రాముని వనవాసాన్ని నిరోధింప యత్నించారు.  

తండ్రి మాట నిలబెట్టడం లక్ష్మణుని బాధ్యత కూడాననీ, 

కౌసల్య ధర్మమనీ వారిద్దరికీ నచ్చచెప్పి రాముడు వనవాస దీక్షకు ఉద్యుక్తుడయ్యాడు.

సీత తాను కూడా వనవాసానికి రామునితోడుగా వస్తానన్నది. 

సీత వినలేదు.- 

రాముడు తోడుంటే తనకు కష్టాలు, భయాలు ఉండనే ఉండవు. 

మొండిగా వాదించి సీత రాముని వెంట బయలుదేరింది. 

తల్లి అనుజ్ఞ తీసికొని, అన్నతో వాదించి, వనవాస సమయంలో అన్నా వదినల సేవ జేయడానికి లక్ష్మణుడు కూడా వారివెంట ప్రయాణమయ్యాడు.


వన ప్రయాణం:

సీతా రామ లక్ష్మణులు తమ సంపదలను అందరికీ దానాలు చేశారు. 

రాముడు తన ఆభరణాలను సుయజ్ఞునికీ, సీత తన ఆభరణాలను సుయజ్ఞుని భార్యకూ ఇచ్చారు. 

తల్లిదండ్రుల సెలవు తీసుకొన్నారు. 

కటువుగా కైక వారికి నారచీరలు ఇప్పించింది. 

అన్నను సేవించమని సుమిత్ర లక్ష్మణునికి ఆనతిచ్చింది. 

సుమంత్రుడు రథంపై వారిని తీసుకొని ప్రయాణమైనాడు. 

 దశరథుడు నేలపై బడి యేడుస్తున్నాడు. సుమిత్ర కౌసల్యను ఓదార్చింది. అయోధ్యాపుర వాసులు వారిని వెంబడించసాగారు. వెనుదిరగడానికి నిరాకరించారు.


తమసానది ఒడ్డున మొదటి రాత్రి విశ్రమించిన సీతారామలక్ష్మణులు ఎలాగో అయోధ్యాపుర వాసులను ఏమరచి, చీకటిలో కోసలదేశం దాటిపోయారు. 

వేదశృతి, గోమతి, స్యందిక నదులను దాటి గంగానది ఒడ్డున ఉన్న శృంగిబేరపురం చేరుకున్నారు. ఒక చెట్టుక్రింద విశ్రమించారు.


గుహుని ఆతిథ్యం:


బోయ రాజైన గుహుడు సపరివారంగా వచ్చి రాముని కౌగిలించుకొని ఉత్తమమైన ఆతిథ్యాన్ని అందించాడు. 

తన రాజ్యాన్ని ఏలుకోమని రాముని ప్రార్థిచాడు. 

రాముడు వనవాస దీక్షలో ఉన్నందున వారు సమర్పించిన భక్ష్యాదులను నిరాకరించి, రాజుగారి గుర్రాలకు మాత్రం మేత ఇమ్మన్నాడు. 

సీతారాములు మాత్రం నేల మీదే విశ్రమించారు. వారిని చూచి లక్ష్మణుడు దుఃఖించాడు.


వెనుకకు వెళ్ళడానికి మనసొప్పని సుమంత్రునికి నచ్చజెప్పి రాముడు అతనిని అయోధ్యకు పంపాడు. 

గుహుడు ఏర్పాటు చేసిన నావలో సీతారామలక్ష్మణులు గంగానదిని దాటారు. సీత గంగమ్మకు నమస్కరించి తమను కాపాడమని ప్రార్థిచింది.


చిత్రకూట నివాసం:


సీతారామలక్ష్మణులు ప్రయాణం కొనసాగించి గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగ వద్ద భరద్వాజాశ్రమాన్ని చేరుకొన్నారు. 

ముని వారిని ఆదరించి అక్కడే వనవాస కాలాన్ని గడపమన్నాడు. కాని అది జనావాసాలకు సమీపంలో ఉన్నందున అక్కడ ఉండడానికి రాముడు ఇష్టపడలేదు.


భరద్వాజ మహర్షి సూచన ప్రకారం వారు ఒక తెప్ప తయారు చేసుకొని యమునానదిని దాటి వెళ్ళారు. 

వారు చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశం చేరుకొన్నారు. 

అక్కడ లక్ష్మణుడు దృఢమైన పర్ణశాలను నిర్మించాడు. 

రాముడు మాల్యవతీ నదిలో స్నానం చేసి, వాస్తు పూజావిధులు నెరవేర్చాడు. అక్కడ వారి నివాసం ఆరంభమైంది.


దశరధుని మరణం: దశరథుడు గతంలో మునిబాలకుని పొరపాటుగా చంపినందుకు ఆ బాలకుని తల్లిదండ్రులు పెట్టిన శాప ఫలితమే ఈ మరణం.


సుమంత్రుడు గుహుని వద్ద వీడ్కోలు తీసికొని శోకదగ్ధమైన అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు. పరితపిస్తూ అంతఃపురానికి వెళ్ళి దశరథునికి జరిగినది వివరించాడు. దశరథుడు కృశించి దీనుడై దుఃఖిస్తూ ఉన్నాడు.

దశరథుడు తన యౌవనంలో శబ్దవేధ విద్యలో ప్రజ్ఞుడు. 

ఒకమారు కారుచీకటిలో అతను నీటిలో శబ్దాన్ని బట్టి, ఏదో ఏనుగు తొండంతో నీళ్ళు త్రాగుతుందనుకొని బాణం వేశాడు. 

మునికుమారుడు అంధులైన తన తల్లిదండ్రులకోసం కుండలో నీరు పట్టుడం వల్ల ఆ శబ్దం వచ్చింది. 

దశరథుని బాణానికి ఆ మునికుమారుడు మరణించాడు. 

పశ్చాత్తాపంతో హతాశుడైన దశరథుడు ఆ ముని కుమారుని తల్లిదండ్రులకు తన వల్ల జరిగిన తప్పిదం విన్నవించాడు. 

వారు కొడుకు శవంపై బడి విలపించారు. 

దశరథుడు కూడా పుత్రశోకంతోనే కాలం చేస్తాడని ఆ తండ్రి శపించాడు.

ఈ శాప వృత్తాంతాన్ని కౌసల్య, సుమిత్రలకు చెప్పి దశరథుడు తన దుష్కృత్యానికి తగిన ఫలం అనుభవిస్తున్నానని శోకించాడు. 

రామునికోసం విలపిస్తూనే మృతిపొందాడు.


భరతుని దుఃఖం:


అయోధ్య శోకంలో మునిగిపోయింది. 

వశిష్ఠుడు గిరివ్రజంలో మేనమామల ఇంట్లో ఉన్న భరతునికి కబురు పంపాడు.

 భరతుడు దుస్వప్నం కారణంగా వ్యాకులచిత్తుడై ఉన్నాడు. 

 కైకేయి భరతునికి త్వరగా పట్టాభిషేకం చేయించుకోమని తొందర చేసింది. 

దశరథుడు మరణించిన సంగతీ, సీతారామలక్ష్మణులు అడవులకు పోయిన సంగతీ చెప్పింది. అంతా తన కొడుకు మేలు కోసమే చేశానని చెప్పింది.

కోపంతోనూ, రోషంతోనూ, దుఃఖంతోనూ భరతుడు మండిపడ్డాడు.

 అధర్మానికి ఒడిగట్టిన తల్లిని తీవ్రంగా నిందించాడు. 

రాముని వనవాసం మాన్పించి తిరిగి అయోధ్యకు పిలచి పట్టం గట్టి, తాను అన్నను సేవిస్తానని ఖండితంగా చెప్పాడు. 

మన్నించమని కౌసల్యను వేడుకున్నాడు.


వశిష్ఠుని ఆదేశంపై భరతుడు తండ్రికి అగ్ని సంస్కారం చేశాడు. 

పండ్రెండో దినాన శ్రాద్ధ కర్మలన్నీ పూర్తి చేశాడు. 

పధ్నాలుగవ నాడు భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని రాజోద్యోగులు కోరారు. 

భరతుడు వారికి నమస్కరించి, నిరాకరించాడు. 

రాముడే రాజు కావాలని, రాముని అయోధ్యకుతెచ్చి అభిషిక్తుడిని చేసి తాను మాత్రం తల్లి కోరికకు వ్యతిరేకంగా అడవులకు పోతానని దృఢంగా అన్నాడు.


చిత్రకూటానికి భరతుని ప్రయాణం:


రాముణ్ణి రాజుగా చేయడానికి అయోధ్యకు పిలవాలని భరతుడు సపరివారంగా బయలు దేరాడు. 

దారిలో గంగాజలంతో తండ్రికి తర్పణం చేశాడు. 

గుహుని కలసి జరిగిన సంగతులు తెలిసికొని విలపించాడు. 

గంగను దాటి భరద్వాజాశ్రమం చేరుకొని మునిని ప్రసన్నం చేసుకొన్నాడు.

 సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో ఉన్నారని తెలిసికొన్నాడు.

చిత్రకూటంలో సీతారాములు మందాకినీ పరిసర సౌందర్యం చూసి పరవశిస్తున్నారు. 

పెద్ద కోలాహలం విని లక్ష్మణుడు చెట్టుపైకెక్కి గొప్ప సైన్యాన్ని చూశాడు.

 

కోవిదార ధ్వజాన్ని బట్టి అది భరతుని సైన్యమే అని గ్రహించాడు. 

భరతుని ధర్మ నిరతిని సంశయింపవద్దని రాముడు లక్ష్మణునికి చెప్పగా అతను తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు.

సైన్యాన్ని దూరంగా ఉంచి, భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, వశిష్ఠ మహర్షి, సుమంత్రుడు, మరి కొందరు అమాత్య బ్రాహ్మణ ప్రముఖులు రాముని పర్ణశాలకు చేరుకున్నారు. 

భరత శత్రుఘ్నులు సీతారామలక్ష్మణుల పాదాలపైబడి శోకంతో నోట మాట రాక విలపించారు.


పితృవాక్య పాలన:  తండ్రి మరణించిన వార్త తెలియగానే రాముడు మూర్ఛిల్లాడు. 

పిదప లేచిన రాముడు అమితంగా దుఃఖిస్తూ మందాకినీ జలాలతో దశరథునికి తర్పణం వదిలాడు. 

 దశరథుని భార్యలు కూడా పర్ణశాలకు చేరుకున్నారు. 

రాముడు, లక్ష్మణుడు తల్లులకు పాదాభివందనాలు చేశారు. 

సీత కన్నీటితో వచ్చి అత్తల కాళ్ళకు మ్రొక్కింది.

భరతుడు దీనుడై రాముని పాదాలకు మ్రొక్కి – “నేను నీ భృత్యుడిని. నీకు చెందవలసిన రాజ్యాన్ని నేను పొందలేను. నాపై దయ వుంచి నీ రాజ్యం నీవు గ్రహించి మమ్ములను అనుగ్రహించు” అని కోరాడు. 

అప్పుడు రాముడు “తండ్రి నీకు రాజ్యమూ, నాకు వనవాస దీక్షా ఇచ్చాడు. ఇద్దరమూ వాటిని అలా అనుభవించాల్సిందే” – అని బదులు చెప్పాడు.

ఎవరెన్ని విధాలుగా చెప్పినా వనవాసం విరమించుకోవడానికి రాముడు అంగీకరించలేదు. తండ్రి ఋణం తీర్చుకోవడానికి, ఆయనకు అసత్య దోషం అంటకుండా ఉండడానికి అదే మార్గమని స్థిరంగా చెప్పాడు.

శ్రీరాముని పాదుకల రాజ్యం:    శ్రీరాముని తిరస్కారంతో భరతుడు దర్భలు పరచుకొని అడ్డంగా పడుకున్నాడు. అన్నయ్య తన ప్రార్థన అంగీకరించే వరకు అన్నం నీళ్ళు ముట్టనన్నాడు. 

రాముడు భరతుని అనునయించి పితృఋణం తీర్చుకునే ధన్యత నుండి తనను దూరం చేయవద్దని కోరాడు. 

ఖిన్నుడైన భరతుడు ధర్మమార్గమేదో నిర్ణయించి ఆజ్ఞాపించమని రాముని పాదాలపై వాలాడు. 

రాముడు భరతునకు రాజధర్మం బోధించి, రాజ్యం చేయమని ఆదేశించాడు. 

ప్రలోభం వల్ల చేసిన కైక తప్పిదాన్ని మరచి తల్లిని భక్తితో సేవించమని చెప్పాడు.


భరతుడు శ్రీరాముని పాదుకలను అనుగ్రహించమని కోరాడు. 

అందుకు రాముడు సమ్మతించాడు. 

పధ్నాలుగు సంవత్సరాలు తాను కందమూలాలు మాత్రం తింటూ, నగరం బయటనే నివసిస్తూ, అన్నగారి పాదుకల పేరునే రాజ్యం చేస్తానని భరతుడు చెప్పాడు. 

పధ్నాలుగు సంవత్సరాలు అయిన మరునాడు రాముడిని చూడకపోతే తాను అగ్నిలో దూకుతానన్నాడు. అందరికీ నమస్కరించి పాదుకలు శిరసున ధరించి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు. 

 భరద్వాజ మహర్షికి జరిగిన విషయం విన్నవించాడు.

అందరినీ అయోధ్యకు పంపి భరతుడు తాను మాత్రం నందిగ్రామంలోనే ఉండిపోయాడు. 

పాదుకలకు సకల రాజమర్యాదలూ జరిపించాడు. 

 నారచీరలు ధరించి అన్నగారి పాదుకల పేరున రాజ్యపాలన సాగించాడు.


అత్రి, అనసూయ, సీత: 

సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమాన్ని దర్శించారు. అత్రి భార్య అనసూయ. ఆమెకు సీత పాదాభివందనం చేసింది. అనసూయ సీతకు పతివ్రతా ధర్మాలను ఉపదేశించి మహత్తు గల పూలదండ, చందనం, వస్త్రాభరణాలు ఇచ్చింది. అనసూయ కోరికపై సీత తన స్వయంవరం, కళ్యాణం కథను ఆమెకు చెప్పింది. అనసూయ మురిసిపోయింది. ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులు ధరించి సీత ఆమెకు మరల పాదాభివందనం చేసింది.


మరువాడు వారివద్ద సెలవు పుచ్చుకొని సీతారామలక్ష్మణులు, సూర్యుడు మేఘ మండలంలో ప్రవేశించినట్లు, ఇంకా దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు.


_----------------------------------


వ్యాసరూప ప్రశ్నలు:

 శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు ఏమిటి?

జ.  పట్టాభిషేక అయోధ్య అలంకరించుకుంది.

మందర కళ్ళల్లో నిప్పులు 

మందర దుర్భోధ వల్ల కైకేయి మనసు మారింది. 

రాముడు 14 సంవత్సరాలు వనవాసం. 

భరతునికి పట్టాభిషేకం చేయాలని కైకేయి దశరధుని కోరింది.


పితృ వాక్య పరిపాలన రాముడికి దశరధుని దగ్గర తీసుకున్న రెండు వరాలను గురించి రామునికి చెప్పింది.    రాముడు తండ్రి మాటలను గౌరవించి వనవాసానికి బయలుదేరాడు.

 రాముని తో పాటు సీతా లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు


ప్రశ్న . శ్రీరముని గుణగణాలను వివరించండి.

శ్రీరాముడు సద్గుణరాశి. వినయంలోనూ,  రూపంలోనూ గుణంలోనూ శ్రేష్టుడు. 

మహావీరుడు. మృదుస్వభావి. శరణన్న వారిని కాపాడతాడు. 

కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. 

పరుల సంపద ఆశించని వాడు. దీనులను ఆదుకునే వాడు.

 కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల విచ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేని వాడు కలలో ఆరితేరిన వాడు.



రామాయణం డౌన్లోడ్ చేసుకోండి

12, మార్చి 2023, ఆదివారం

"ఉత్తమ కథా సంపుటి - మూడు గుడిసెల పల్లె "







మిత్రులందరికీ జై భీమ్ లు

జంబూ శనార్తులు

తేదీ: 17-03-2023 రోజున రవీంద్ర భారతి మినీ హాల్ లో ఆవిష్కరణ జరగునున్న నా "మూడు గుడిసెల పల్లె" కథల పుస్తకం పై ముందుమాట "ఉత్తమ కథా సంపుటి" రాసిన పెద్దలు, సాహితీ దిగ్గజం కొలకలూరి ఇనాక్ గారి అభిప్రాయం చదవండి.

పూర్తి వ్యాసం చదవండి మిత్రులారా.
మీ అభిప్రాయం రాయండి.

తేది : 12-03-2023న సృజనలో వ్యాసాన్ని ప్రచురించిన సృజన పత్రిక వారికీ , విల్సన్ అన్న గారికి కృతజ్ఞలు.






"ఉత్తమ కథా సంపుటి - మూడు గుడిసెల పల్లె"

డా. సిద్దెంకి యాదగిరి వ్రాసిన ‘మూడు గుడిసెల పల్లె’ ఉత్తమ కథానికల సంపుటి. ఇది అచ్చమయిన తెలంగాణ కథానికలు. అందులోనూ పేదల జీవితాలు, మరీ ముఖ్యంగా కథకుల బ్రతుకులు చిత్రిచంచిన కథానికలు, ఇవి.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కొంతభాగం నీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. కడుతున్న ప్రాజెక్టుల వల్ల ముంపుకు గురి అవుతున్న ప్రాంతాల దయనీయ గాథలు రెండున్నాయి. ఇందులో ఒకటి మొట్ట మొదటి కథానిక. రెండోది చిట్ట చివరి కథానిక. ఈ రెండిరటి మధ్య ఉన్న 16 కథానికలు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రచయిత నేలవిడిచి సాముచేసే మనిషికాడు. నేలను, నేలతల్లిని, నమ్ముకొన్న, కొన్ని సందర్భాలలో అమ్ముకొన్న అతి సామాన్యుల ఛిద్ర జీవితాలను వేదనామయంగా కథానికల్లో పొందుపరిచాడు.

నీట మునిగినా సరే, ఈ నేలలోనే నన్ను పూడ్చి పెట్టండి అని అడిగే ఒక అతి సామాన్య వృద్ధురాలి కథానిక గుండెలు పిండుతుంది. తనను కాల్చే కట్టెల్ని పోగుచేసుకొని, చనిపోయి కాలిపోయే మనిషిని చూడాలంటే డా. యాదగిరి కథానికలు చదవండి.

మాదిగ మగమనిషేకాదు, ఆడమనిషి కూడా, చెప్పులకు పాలీసుచేసి బ్రతకుతుందా? కూతురు పెళ్లి చేయటానికి ఉన్న పొలం అమ్ముతుంది. తెచ్చిపెట్టిన పెద్దనోట్లు రద్దయితే, ఆ అసహాయురాలు ఏం చేస్తుంది? ఆలోచించండి. ఇంతకంటే సమకాలీనమయిన కథానికలు ఉంటాయా? కరోనా భయాన్ని జయించే మానవాత్మ ఏంచేస్తుంది? బతుకమ్మ ఆడతామంటే అంత వ్యథ ఉంటుందా? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు ‘మూడు గుడిసెల పల్లె’లో మునిగి తేలాల్సిందే. దళితుల మధ్య ఉండే తారతమ్యాలు పోవాలంటే వాళ్లు లంద స్నానం చేసిన తోళ్ల లాగా మారాలి. ఊరికి కానివాడు అని తృణీకరించాకే ......

ఈ సంకలనంలోని కథానికలు తెలంగాణ పల్లెల సజీవ జీవన దృశ్య చిత్రీకరణలు. సామాన్యులు ఈ కథానికల్లో నాయకులు, నాయికలు. మనుషుల మధ్య ఉండవలసిన సంబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతలు పోయి పొరపొచ్చాలు అద్భుతంగా రూపం దిద్దుకొన్నాయి. డా. సిద్దెంకి కథానికలు అతనివి మాత్రమే. ఏ ప్రభావాలు ఈ రచనల మీద లేదు. ఎంత ప్రసిద్ధమైన కథానికలు కానీ ప్రసిద్ధులైనవాళ్ల కథానికలు కానీ ఛాయా మాత్రంగా కూడా ఈ కథానికల్లో కనిపించవు.

ఈ సంకలనంలోని కథానికలు వివిధ సందర్భాÛలలో నిర్వహింపబడ్డ వేరు వేరు పోటీల్లో బహుమతులు పొందాయి. గుర్తింపు పొందాయి. రచయితకు ఖ్యాతినీ, ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. నిజానికి ఈ కథానికల్లో ఉన్న జీవితం, దాన్ని కథకుడుగా అర్థం చేసుకొన్న తీరు, పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితం ప్రతిబింబించాయి. మనుష్యులు, ఆరాటాలు, పోరాటాలు, దు:ఖాలు వాటి వలపోతలు గుండెలకు కన్నీరు తాగించాయి. రచయిత డా. సిద్దెంకి యాదగిరిది పసిపిల్లల మనస్తత్వం. ఆకల్లాగినా, అల్లాడిపోయే రచయిత స్వభావం ఇంత ఉన్నత కథానికలు వ్రాయడానికి నేపథ్యంగా నిలిచింది. మనుషులపట్ల ఉన్న తీరని మమకారం రచయతను ముందుగా మానవోన్నతుడిగా చేసింది ఆ పైన మహారచయితను చేసింది. గొప్ప కథానికలకు ప్రాణప్రతిష్ఠ చేసింది.

తెలంగాణ గ్రామీణ జీవితం, గ్రామాల ప్రజలు డా. యాదగిరి కథానికల్లో ప్రాణం. `` తెలంగాణ భాష, యాస, సర్వ శక్తి సంపన్నంగా వీటిలో ప్రతిధ్వనించింది. ప్రతిస్పందించింది. గురజాడ అప్పారావు కన్యాశుల్కం ప్రసిద్ధికి ప్రధానమైన కారణం వస్తువు మాతృతతో పాటు ఉత్తరాంధ్ర మాండలికం అనీ సాహిత్య లోకం అంగీకరించింది. అలాగే డా. సిద్దెంకి యాదగిరి ‘మూడు గుడిసెల పల్లె’ తెలంగాణ భాషను శోభించింది. తెలంగాణ తెలుగు భాషకు నూత్న సౌందర్యం సమకూర్చి పెట్టింది. కథకుడు సిద్దెంకి యాదగిరి కవి. అతడి వాక్య నిర్మాణం సౌందర్య శోభితం. కథానికల్లో ప్రతి వాక్యం కవితాత్మకం గావించడంలో అతనికతనే సాటి.

తెలంగాణ భౌతిక స్వరూపమే కాదు, దాని అంతర బహిర్గత సత్త్వం, నిక్షిప్తం చేసుకొన్నాయి. స్వభావాల్ని పుణికి పుచ్చుకొన్న ‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు. తెలంగాణ తెలుగును అక్షరమక్షరం సర్వాంగ సుందరంగా ఈ కథానికలు గుండెల్లో దాచుకొన్నాయి.

సామాన్యుల జీవితాను, సమకాలీన జీవిత ` ఉభయ పార్వ్శాలను సంపూర్ణంగా తమలో నింపుకొన్న ‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు, గొప్ప సమాజ చైతన్య దీపాలు. ప్రాంతం, ప్రజలు, భాష, భావన, వేదన, ఆంతర్యం, అభివ్యక్తి, అంతా తెలంగాణ నిండిన కథానికలు. తెలుగు సాహిత్యానికి విలువల వలువలు కట్టబెట్టాయి. కథానికా వాఙ్మయంలో చిరంజీవత్వం పొందుతాయి.

ఇంత మంచి కథానికలు వ్రాసిన డా. సిద్దెంకి యాదగిరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీటిని చదువుకోవడం వల్ల, మనల్ని మనం అర్థం చేసుకోనే అవకాశం కలుగుతుంది.

‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు అనువాదంగా లభిస్తే, తెలంగాణ ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచ స్థాయి కథానికలు మనమీ సంపుటిలో మూడు గుడిసెల పల్లెలో చూడగలం పున:పర్యాలోకనం వల్ల.

డా. సిద్దెంకి యాదగిరి సమాజానికి, సాహిత్యానికి ప్రపంచ పరిశీలన లభించాలనీ ఆశీర్వదిస్తున్నాను.
శుభాకాంక్షలతో....
కొలకలూరి ఇనాక్‌.











పీడనను చిత్రించిన కథలు








పీడనను చిత్రించిన కథలు

ఒకే సమాజంలోనూ జీవిస్తున్న ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల్ని, సంఘర్షణల్ని కథలు వ్యక్తీకరిస్తాయి. దళిత, దళితేరజీవితాల్లో అటువంటి వైరుధ్యాలు కోకొల్లలు. కొన్ని వైరుధ్యాలని చూసిన పిదప మౌనంగా ఉండడం చాలా కష్టం. అట్లాంటి మౌనాన్ని బద్దలుచేస్తూ నా మిత్రుడు డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ఈ కథల్ని రాశాడు. సిద్దెంకి  యాదగిరి రాసిన ఇవి కథలు మాత్రమే కాదు గుండెలోతుల్లో సంచరిస్తున్న బాధల్ని, గాథల్ని తనదైన భాషా శైలితో కథలుగా మలిచాడు. ఈ కథలు తాను జీవిస్తున్న, అనుభవిస్తున్న వ్యవస్థ పట్ల అపరిమితమైన కన్సర్న్‌తో రాసినవి. దుగ్ధతో యావతో, కోపంతో రాసిన కథలు కావు. 

ఈ కథలన్నింటికీ మనిషే అడ్రస్‌. ఆ అడ్రస్‌ గల్లంతవుతున్న మనిషిని ‘‘డిఫెన్స్‌’’ చేయడం కోసమే ఈ కథలు రాశాడు. ఈ కథలు చదివిన తర్వాత ఊరు కోల్పోయిన మనిషి, నిరాశ్రయులైన మనిషి, పీడితుడైన మనిషి, కరోనాతో నిరాదరణకు గురైన మనిషి, వంచింపబడిన దళితుడు, 
రాజకీయవివక్ష ఎదురుకున్న దళిత స్త్రీ, మంచి మనసున్న విద్యార్థి, ఏ కల్మషం లేని ఉపాధ్యాయుడు అందరూ కనపడతారు. ఉట్టిగా కనబడడమే కాదు వారితో సంభాషిస్తున్నట్లుగా ఈ కథలు ఉంటాయి. వారికి భరోసాను ఇస్తాయి. గుండె ధైర్యాన్ని కూడా ఇస్తాయి. మార్పు అనివార్యమనే ఒక మేలుకొలుపును పట్టిస్తాయి.

ఈ కథ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఈ కథలు వేటికవే ప్రత్యేకమైనవి. కథనంలో, శైలిలో, భాషా సౌందర్యంలో ఒక్కో కథా ఒక్కో నేపథ్యాన్ని తెలియజేస్తుంది.
మన కండ్ల ముందర జరుగుతున్నది అభివృద్దే కాదని, అభివృద్ధిలాగా కనిపిస్తుందని ఒక ‘‘ఎపిఫని’’ అర్థం అవుతుంది. ఎపిఫని అంటే ఒక నిజమైన సత్యం ‘సాక్షాత్కరించడం’.  నిజానికి ఈ మాయ వ్యవస్థలో ‘అసత్యం’, ‘సత్యం’ లాగా కనిపిస్తుందని ‘‘ఆఖరి కోరిక’’ కథ చదివితే అర్థమై కన్నీళ్లు వస్తాయి. జీవితం పాతదే కానీ వేదనలే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ సందర్భాన్ని చాలా బలమైన కథగా మలిచాడు సిద్దెంకి.

గత కాలపు జ్ఞాపకాలను నెమరువేస్తూ బలమైన శైలిలో ఈ ‘ఆఖరు కోరిక’ కథను రాశాడు. ఈ కథలో వెంకటయ్య అనే ఉపాధ్యాయుడు ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి ఒక విద్యార్థి బడి బంద్‌ చేసి ఇంటి దగ్గరే ఉంటాడు. సారు ఊల్లకు పోయి విద్యార్థి ఎందుకు రాలేదని తల్లిదండ్రులను కలుస్తాడు. అక్కడ పోశవ్వ అనే ముసలి అవ్వ మాట మాట కలుపుతూ సారు... ఊరు పోతుందంట కదా. ఇంకా చదివి ఏమి లాభం? అని ఊరుతో, ఇల్లుతో, వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ ఇల్లు గోడలకు, దూలానికి ఉండే చరిత్రను చెపుతుంది. వాసానికి  ఉండే అనుభవాన్ని  కూడా ఆర్తితో వేదనతో వలపోస్తుంది. బతుకు మర్మం ఇప్పుతుంది. ‘పందిరి మీద గుండు పడ్డట్టు’ ఇంత పెద్ద చెరువు ఎందుకు సారు మాకు అనే ప్రశ్న బలంగా వేస్తుంది. మా ఉనికే లేనటువంటి అభివృద్ధి ఎవరికోసమని ఎందుకోసమని ప్రశ్నిస్తుంది. నిత్య సత్యాలతో నిప్పులు చెరుగుతుంది. వెంకటయ్య సారు అవ్వ ప్రశ్నలకు నిస్సహాయుడైపోతాడు. 
  
       నీళ్లు వచ్చినా పూర్తిగా బతికే స్థితి లేనప్పుడు కొందరి అభివృద్ధికై మేమెందుకు త్యాగం చేయాలన్న ప్రధాన ప్రశ్నకు సమాధానం శూన్యమే. ఈ కథలో గోసలు ఎతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఊరు మునిగితే వచ్చే కష్టాలు, పడే బాధలు, పోగొట్టుకున్న గుర్తులు, చెల్లాచెదురయ్యే జీవితాలు అన్ని గుర్తుకు వస్తాయి. మనిషి చుట్టూ అల్లుకున్న వెలుగులను ఆర్తితో గుర్తుచేశాడు. దోపిడి పరాయి ప్రభుత్వాలే కాదు సొంత ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయని నిరూపించిన కథ ఈ ‘ఆఖరి కోరిక’ కథ.
తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రోది చేసుకొని తెలంగాణ కలను సాకారం చేసుకున్నది. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఒక ప్రధానమైన పండుగ. ఈ పండుగలో ఉండే వివక్షతను అంటరానితనాన్ని నిరసిస్తూ ‘అంటరాని బతుకమ్మ’ అనే కథ రాసిండు. 

సిద్దెంకి ఏ విలువల్ని ముఖ్యంగా ఎవరి విలువల్ని గౌరవిస్తున్నాడు అనేది ఈ కథ చదివితే అర్థమవుతుంది. నిర్మాణ పరంగా ఈ కథ చాలా సహజమైన శైలిలో నడిచి, అధరహో అనిపిస్తుంది. కథను నిర్మించిన పద్ధతి పాఠకుడిని కట్టిపడేస్తుంది. కథ అల్లిక కృత్రిమంగా లేదు. చలికాలం మంట పెట్టుకొని చేతులు కాపుకుంటూ మాట్లాడినంత సులభ సంభాషణగా ఈ కథ నడిచింది. నిజానికి ఉన్నత కులాల వాళ్ళు బతుకమ్మను పేర్చితే ఆ బతుకమ్మ పేర్చడానికి కావలసిన పూలు అన్నీ కూడా కింది కులాల వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడులేని అంటరానితనం బతుకమ్మ పేర్చేటప్పుడు మాత్రం బాగా గుర్తుకు వస్తుంది. అందుచేత కింది కులాల స్త్రీలు ఇన్నొద్దులు ఎక్కువోళ్ల  కోసం పువ్వులు తెంపినం. ఇప్పుడు మనకోసం తెంపుతున్నము. మనకోసం మనం బతుకమ్మ ఆడాలి. ఇన్నొద్దులు శాతకానట్లు చేతులు ముంగట పెట్టుకుని ఆడిటోళ్ళను చూశాం అని అనుకుంటారు. అంతా ఆడటానికి రెడి అవుతారు. తీరా బతుకమ్మ ఆడడానికై పూలు తెంపడానికి వెళితే తేనెటీగలు ఒకరికి కుట్టినయ్‌. దళితులు బతుకమ్మ ఆడటానికి పూలు తెంపితే తేనెటీగలు కుట్టినాయి అనే భయం పుకారుగా వ్యాపించింది. ఇది అపశకునంగా భావిస్తారు. కాబట్టి దళితులు బతుకమ్మ ఆడొద్దని పెద్ద మనుషులు అనుకుంటారు. అట్లను మైసయ్య మనవడు రాకేష్‌ బండి నడుపుతూ జారిపడ్డాడు. దెబ్బలు తగులుతాయి. ఇవన్నిటికి బతుకమ్మకు ఏ సంబంధం లేదని మన తప్పిదాల వల్లనే ఇట్లాంటివి జరుగుతాయని చదువుకున్న పోరగాండ్లు పెద్దవాళ్లకు సదిరి చెప్తారు. తీరా బతుకమ్మ ఆడాలని యూత్‌ తీర్మానిస్తారు. పెద్దలను ఒప్పిస్తారు. పెద్దవాళ్లు సంతోష పడతారు. చేయక చెడిపోయినా చేసి బాగుపడాలని పెద్దోళ్ళు సంబరపడతారు. ఇది కథ. ఈ కథలో అవమానాల మూలతత్వాన్ని ఎరుక పరుస్తాడు. కథకుడికి కలిగిన అనుభూతిని పాఠకుడికి కూడా కలిగిస్తున్నాడు. జరగాల్సిన దానికి జరిగిన దానికి మధ్య ఏర్పడిన ‘ఖాళీ’ని పూడ్చే విధంగా పై కథ ను తీర్చిదిద్దాడు సిద్దెంకి.

అట్లాగే గ్రామాల్లో దళితులకు జరిగే రాజకీయ వివక్షతను పట్టించే కథ ‘మూడు గుడిసెల పల్లె ‘కథ. ఈ కథలో పటేల్‌ ఊరు సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేయాలనే     ఉద్దేశంతో కుట్రతో దళిత కులానికి చెందిన సరిత అనే ఉత్తమ గుణాలున్న మహిళను సర్పంచ్‌ కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్‌ చేసినటువంటి మోసం, ఆడినటువంటి నాటకాన్ని బయట పెట్టిండు. అదే దళిత కులానికి చెందిన రాజు మిగతా కొంతమందితో నామినేషన్‌ వేయించి విత్‌ డ్రా కావాలంటే లక్ష రూపాయల డబ్బు  సరిత ఇవ్వాలని తీర్మానించిండు. చివరకు సరిత, సరిత భర్త శంకర్‌ డబ్బులు ఇవ్వలేక పోటీ చేయరు. పటేల్‌ పెంపుడు కుక్కలుగా మసిలే వ్యక్తులే ఆ పదవిలో కుదురుకుంటారు. ఏమి చేసైనా సరే పటేళ్లు తమ బానిసలనే రాజకీయంగా అందలం ఎక్కిస్తారు. కానీ చైతన్యవంతమైనటువంటి దళితులను రాజకీయ పదవులు అనుభవించకుండా అడ్డుకుంటారని ఈ కథ ద్వారా తెలియజేసిండు. ఈ కథలో తేలిపోయే వస్తువు లేదు. తన ఉనికి కోసం బలవంతుల మెప్పుకోసం అధికార గుర్తింపు కోసం కాకుండా తన గుండెల్లో తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, ఎతలను విప్పి చెప్పాలనే ఉద్దేశం బలంగా కనపడుతుంది. 

ద్రోహం చేసే వ్యక్తుల కళ్ళు తెరిపించాలనే తపన రచయితకు బలంగా ఉంది.   ఈ కథలో అల్లిక పూర్తిగా పటిష్టంగా ఉంది. ఏమాత్రం నీరసంగా కృత్రిమంగా లేదు. చిన్నపిల్లవాడు వందల మంది స్త్రీలు ఉన్న తన తల్లి దగ్గరికి ఎంత సహజంగా కన్ఫ్యూజ్‌ కాకుండా వెళతాడో అంతే సహజంగా పాఠకుడిని కథాంశంలోకి తీసుకుపోగల నేర్పరితనం సిద్దెంకి కి ఉన్నది అని నిరూపించిన కథ.పల్లెలో అగ్రకుల రాజకీయ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గతంగా సూత్రంగా తెలిపిండు అని భావించాలి.

విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి నింపే కథ ‘‘గెలుపు గీతం’’ కథ. చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చూయించును. ఎన్ని కష్టాలనైనా చదువుతో జయించొచ్చు అని నిరూపించే  కథ ఇది. ఇక్కడ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చదువు గురించి చెప్పిన ఒక కొటేషన్‌ గుర్తుకు చేస్తాను.
  ‘‘you may forgot the material benefit of our culture.But we cannot forgot educational benifit’’ అంటే మనం వస్తు గత ప్రయోజనాలను వదులుకోవచ్చు కానీ, చదువు అందించే ఏ ప్రయోజనాన్ని వదులుకోకూడదు అని అంబేద్కర్‌ చెప్పాడు. సరిగ్గా ఈ అంశానికి అతికినట్టుగా ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఈ కథలో చాలా పరిమితంగా పాత్రను సృష్టించాడు. ఒకే సంఘటన కథలో    ఉంది. కథాంశం పాఠకుడికి తొందరగా చేరుతుంది.

‘పిడుగు’ కథలో అనేక మలుపులున్నాయి. ఏమవుతుందో అనే టెన్షన్‌ పాఠకుడికి కలుగుతుంది. సిద్దెంకి యాదగిరి కథల్లో సాధారణ మహిళా పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాంటి స్త్రీ పాత్రే లింగమ్మ. లింగమ్మ చాలా కలుపుగోలు మనిషి. ఇగురం గలది .మానవ సంబంధాలు  చెడిపోకుండా మాట మాట్లాడుతుంది.  కసురుకోదు. ఇసురుకోదు. మనిషిని అభిమానిస్తుంది. లింగమ్మ బిడ్డ అంజమ్మ. చదువు పట్ల చాలా శ్రద్ధ గలది. చదివి జీవితంలో తానేంటో నిరూపించాలనుకుంటుంది. కానీ పల్లెల్లో చదువు కంటే ముఖ్యంగా పెళ్లి మీదే వాడకట్టు మనుషుల ఆలోచన ఉంటుంది. లింగమ్మ అత్త చావుకు దగ్గర అవుతుంది సచ్చే ముందర మనవరాలి పెండ్లి చేసి నాలుగు అక్షంత లేసి చావాలనుకుంటుంది. కోడలిని తొందరగా పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తుంది. అందుకోసం అత్తమామలు సంపాదించిన ఎకరం భూమిని 14 లక్షలకు అమ్మి డబ్బును బ్యాంకు నుండి ఇంటికి తెస్తుంది. అదే రోజు అంజమ్మ అన్నం తినకుంటా టీవీ చూస్తున్న సందర్భంలో నోట్ల రద్దు అంశం టీవీలో వస్తుంది. డబ్బులు చెల్లవని రెండు లక్షల వరకే బ్యాంకులో తీసుకుంటారని, మిగతా డబ్బులు పనికిరావని అంజమ్మ వార్తల్లో వింటుంది. ఇట్టి విషయం అమ్మ లింగమ్మకు చెబితే గుండె పగిలి చస్తుందని తన గుండెల్లోనే దాచుకుంటుంది. అంజమ్మ టెన్షన్‌ పడుతుంది. నిద్రపట్టదు చాలా ఆందోళనకు గురవుతుంది. సామాన్యులకు ప్రభుత్వాలు సృష్టించే సమస్యల వలయాల ఆధారంగా కథ రూపు దిద్దుకున్నది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలను అనుభవించారో ఈ కథ ద్వారా సిద్దెంకి బలంగా వ్యక్తీకరించారు. ఈ కథలో దళిత ఈస్థటిక్స్‌ చాలా బలంగా పలికించాడు. తెలంగాణ భాషా సౌందర్యం అదనపు బలంగా పలికింది. జీవితం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఉంది కాబట్టే సిద్దెంకి ఇట్లాంటి కథ రాయగలిగిండు. నిజాయితీ కొట్టొచ్చినట్లు ఈ కథలో కనపడిరది. అందరి జీవితాలు ఉన్నతంగా తయారు కావాలనే తాపత్రయం ఈ కథ వెనుక ఉన్న బలమైన కథనం.

‘‘ఆరు కోట్ల అందగాడు’’ కథలో ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక జరిగే సంభాషణ ముచ్చట్ల ఆధారంగా కథను నడిపించాడు. విచిత్రమేమంటే టెన్త్‌ ఫెయిల్‌ అయినవాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ప్లాట్లు కోట్లు సంపాదించాడు. క్లాసులో మంచి ర్యాంకులు వచ్చి బాగా చదివిన విద్యార్థులు చిన్నపాటి ఉద్యోగంచేసి కుటుంబ పోషణకు పరిమితమైన స్థితిని చూయించాడు. ఈకథలో ఉద్యోగం అనేది మనిషిని పరిమితమైన స్థాయిలో ఎలా బంధిస్తుందో చెప్పిండు. కథావస్తువు తెలిసిన జీవితమే. చాలామంది పెద్దలు ‘కథకు ముడిసరుకు జీవితమే’ అంటారు. అట్లాంటి జీవితాలు ఎన్నో సిద్దెంకి కథల్లో రూపుదిద్దుకున్నాయి.

అంబేద్కర్‌ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ‘ఆచరణ’ కథ. ఈ కథ చాలామంది ఉపాధ్యాయులు చదవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో ఈ కథ తెలియజేస్తుంది. 

‘రుణం’ కథ ఈ కథల్లో చాలా భిన్నమైన కథ. ఈ కథలో నేటివిటీ బాగా కనిపిస్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి పట్ల ఎంత అమానవీయంగా సొంత మనుషులే ప్రవర్తించారో నిరూపించిన కథ. ఈ కథలో డాక్టర్‌ కత్తి మల్లయ్యగారి పాత్ర చాలా స్ఫూర్తివంతంగా ఉంది. దాదాపు చావుకు దగ్గరగా పోయిన వ్యక్తిని డాక్టర్‌ కత్తి మల్లయ్య గారు బతికించి మళ్లీ పూర్వపు స్థితికి తీసుకువచ్చారు. బతకడానికి ఒక భరోసానిచ్చిన  అంశం అందరి డాక్టర్లకు మాత్రమే కాదు మనందరికీ కూడా ఆదర్శం.

ఈ కథల్లో సిద్దెంకి వాడిన పద సంపద భాషా సొబగు అందరిని ముగ్దుల్ని  చేస్తుంది. సందర్భానికి అనుగుణంగా జాతీయాలను, నుడులను సామెతలను ఎంత గొప్పగా వాడారో. ఈ సామెతలు  కచ్చితంగా అసహజంగా మాత్రం లేవు. సందర్భానికి అదనపు బలాన్ని మెరుపులు చేకూరుస్తున్నాయి. మచ్చుకు కొన్ని సామెతలను ఇక్కడ పేర్కొంటున్న దినడమంత్రాన నాలుగు వెంట్రుకలు వచ్చిన అవ్వ ఎగిసి పడుకుంటూ కొప్పులు పెట్టినట్లు ఉంది.
ఆరాటం గళ్ళ అప్ప తొర్ర ఎప్పుడొచ్చినా చిప్ప తొర్ర.
అంబేద్కర్ను మొక్కుడే, మనకు బతుకమ్మ లేదంటే తొక్కుడ.ే 
నల్ల వెంట్రుకలని పాపితే తెల్ల వెంట్రుకను ఊడబీకినట్లు.
మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటిల్నే.
తెలిస్తే మొలిచినట్టు దిఊరంతా ఒక దిక్కు ఊసుగంలోడు ఒక దిక్కు. 
పిట్ట బెదిరించి బట్ట గుంజుకపోయినట్లు.
రసీదు తప్పితే మసీదు దితోలుడిగిన ముసలి భవిష్యత్తును పోతపోస్తది.
దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంటా.
మాటకు సత్యం మందుకుపథ్యం.
అతనికి ఆగం ఎక్కువ ఆలోచన తక్కువ.
రాయిని లక్క లక్కను చేసిండు.
పులి బక్కగైనా సారుకలు తగ్గినట్లే. 
కష్టాల కొలిమిలో కాలినోల్లే సోకం బంగారమైతరు.
సదివినోళ్లకు సన్మానం లేదంటే అవమానం లాంటి సామెతలు కథకు 10 చొప్పున విరివిగా పడ్డాయి. ఇన్ని సామెతలు ఉట్టిగనే పడవు. సామాన్యులు మాట్లాతుంటే గొప్ప గ్రహింపు ఉంటేనే ఇది సాధ్యం.  

అట్లాగే ఒక డిక్షనరీకి సరిపోయేటాన్ని తెలంగాణ భాషా పదాలు కూడా ఈ కథల్లో దొరుకుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏదైనా ఉంది అంటే తెలంగాణ భాష సాహిత్య గౌరవాన్ని పొందడం. అది సిద్దెంకి లాంటి వాళ్లు బతికిస్తున్నందువల్లే ఈ గౌరవం దక్కింది.

దాదాపుగా ప్రతి కథలో వ్యవస్థల మధ్యన జరిగిన ఘర్షణ ఉంది. ఘర్షణ లేకుండా కథ రాస్తే ఆ కథకుడికి ఒక నిర్దిష్ట జీవిత నేపథ్యం, ఒక నిర్దిష్ట చూపు లేనట్టే లెక్క. ఈ కథలకు ఒక సామాజిక నేపథ్యం ఉంది. సామాజిక ప్రతిఫలం ఆశిస్తూ అంతర్గత ఘర్షణను బలంగా వ్యక్తీకరించిన కథలు ఇవి. సామాన్యుల కలలు సాఫల్యం కావాలని సామాన్యుడు ఉన్నతంగా జీవించాలని ఆశించి రాసిన కథలు.

కల చెదిరిన మనుషులకు, ఆ కలల్ని చెదరగొట్టిన మనుషులను పట్టిస్తాడు. ముఖ్యంగా శత్రువు ఎవరో మిత్రువు ఎవరో అర్థం చేయించడానికి ఒక వంతెనలాగా సిద్దెంకి కథలు ఉన్నాయని బలంగా నేను నమ్ముతున్నాను. నా దృష్టిలో చెదిరిన జీవితాలను సాహిత్యంలో ఒంపడమే రచయిత కథకుడి పని. ఆ పనిని బలంగా చేస్తున్న సిద్దెంకి  యాదగిరికి నా జై భీమ్‌లు.

గుడిపల్లి నిరంజన్ 
 9493319878