"ప్రబంధ యుగము"
1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది.
కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు.
సాహిత్య పోషణ:
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు.
సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము,
మదాలసాచరితము,
సత్యవధూపరిణయము,
సకలకథాసారసంగ్రహము,
జ్ఞానచింతామణి,
రసమంజరి తదితర గ్రంథములు,
తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.
తెలుగు రేడ నేను తెలుగొకొండఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడిదేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే.
రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు.
ప్రబంధ యుగ లక్షణాలు:
వర్ణ బాహుళ్యం: అష్టాదశ వర్ణనలు
కథకంటే వర్ణనలే ముఖ్యం
ఈ వర్ణనలలో కవి సమయాలు ఉంటాయి.
కవి స్వయంగా చేసినదే కవి సమయం
ఉదాహరణకు చేగోర పక్షులు వెన్నెల తాగడం
స్త్రీలది హంస నడక అనడం
వస్తువు: పురాణాల ఇతిహాసాల నుంచి తీసుకున్న చిన్న సంఘటనను పెద్ద కావ్యం గా రాయడం.
రసానందం: శృంగార రసంలో వల్ల లాడించడం కనబడుతుంది.
ఇవి మిశ్రమ కథలు
స్వకపోల కల్పనలు చేరుతుంటాయి.
ఏక నాయకుడు
ఆదర్శ పాత్రలు దివ్య పాత్రలకే పెద్ద పీట.
భువనవిజయంలో
- అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని వాని అల్లిక జిగి అనే శైలి మనోరమ వృత్తాంతం, ఇందీ వ రాక్షసుని వృత్తాంతం పేరుగాంచినవి. వరూధిని ప్రవరాఖ్యుల ప్రేమ వృత్తాంతం
- నంది తిమ్మన : నాన సూన వితా నవాసనల అనే పద్యం వల్ల ముక్కు తీమనగా పేరు వచ్చింది. వీరు రాసింది పారిజాతాపహరణం. రాయలకు ఇచ్చాడు. వీరి శైలి ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు.
- ధూర్జటి: శ్రీ కాళ్ల మహాత్మా శ్రీకాళహస్తీశ్వర శతకం వీరు శైలి: అతులిత మాధురి మహిమ
- మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి) రాజశేఖర్ చరిత్ర నాదెండ్ల అప్పయ్య మాత్తునికి అంకితం.
- అయ్యలరాజు రామభద్రుడు: రామాభ్యుదయం అనే గ్రంధాన్ని రాసి అలియరామరాయుల అల్లుడైన గొబ్బూరి నరసరావుపేట అంకితం ఇచ్చాడు. అహల్య చరిత్ర శబరి వృత్తాంతాలు లేవు.
- పింగళి సూరన: పూర్ణోదయమును రాసి నంద్యాల కృష్ణ భూపతికి అంకితం ఇచ్చాడు.
- ఇందులో కలభాషిని వృత్తాంతం నారద గాన మాత్సర్యం సుగాత్రి- శాలీనుల కథ, మణికందరుని వృత్తాంతం, మొదలైనవి కలవు.
- రాఘవ పాండవీయం ద్వర్తి కావ్యం.
- ప్రభావతి ప్రద్యుమ్నం అనే ప్రబంధం రాసి తన తండ్రి అమరావతి అంకితం ఇచ్చాడు. సూచిముఖి అనే పాత్ర ప్రభావతి ప్రద్యుమ్నంలో చాలా విశిష్టమైనది.
- రామరాజభూషణుడు (భట్టుమూర్తి) ఇతనికే ప్రబంధాంకం మూర్తికవి అని పేరు. ఇతని బట్టు మూర్తి అని పిలుస్తారు.
- వసు చరిత్ర అనే ప్రబంధం రాశాడు. దీనిని తిరుమల రాయలకు అంకితమిచ్చాడు ఇందులో గిరికా - వసురాజుల వివాహం శక్తిమతి కోలాహాలుల వృత్తాంతం కూడా ఉంది. బిరుదుశ్లేష కవితా చక్రవర్తి, సంగీత కళా రహస్య నిధి అని బిరుదులు కలవు.
- తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
ప్రబంధ యుగము
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం.
- ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.
- ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు.
- ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది.
- నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు,
- పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు.
కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి.
అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.
పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది.
వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది.
తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
లక్షణాలు
ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
పింగళి లక్ష్మీకాంతం:
ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.
వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.
చరిత్ర రచనలో
విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి.
ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.
ఉదాహరణలు
మనుచరిత్రసంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము, ఆముక్త మాల్యద, నాలాయిర దివ్య ప్రబంధము-తమిళముముకుందవిలాసమువీరభద్ర విజయము కలవు.
- అల్లసాని పెద్దన : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు.
- నంది తిమ్మన : తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
- అయ్యలరాజు రామభద్రుడు : ఇతని సకలకథాసార సంగ్రహమును రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. రామాభ్యుదయము మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు అళియ రామరాజుకు అంకితమిచ్చాడు.
- ధూర్జటి : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
- మాదయగారి మల్లన : ఇతడు అష్ట దిగ్గజాలలో ఒకడని చెప్పడానికి కూడా కుమార ధూర్జటి రచనయే ఆధారం. మల్లన తన గ్రంధాన్ని కొండవీటి దుర్గాధిపతి, తిమ్మరుసు అల్లుడు అయిన నాదెండ్ల అప్పామాత్యునకు అంకితమిచ్చాడు.
ఈ ఐదుగురు కాక తక్కిన మువ్వురి పేర్లు నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు. ఊహలలో ఉన్న పేర్లు - (1) తాళ్ళపాక చిన్నన్న
(2) పింగళి సూరన
(6) ఎడపాటి ఎఱ్ఱన (7) చింతలపూడి ఎల్లన. ఈ విషయం నిర్ణయించడానికి వాడదగిన ప్రమాణాలు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి