IX. 10. వాగ్భూషణం
చదవండి ఆలోచించి చెప్పండి.మాటలు కోటలు కట్టిమహారాజుగా మసులుతాడు మాటచేటలతోమనసు చెరిగి పోతాడు ఒకడుమాటలు బాటలు వేస్తాయిమాటలు పాటలు రాస్తాయిమాటలు లేకపోతేకవిత లేదుగానం లేదునాగరికత లేదునవ్యత లేదుజాగృతి లేదుచైతన్యకృతి లేదువెలుగులు చూపించేదివిశ్వాన్ని నడిపించేదివాక్చక్తి. వాగ్రక్తి.- వేముగంటి నరసింహాచార్యులు.
ప్రశ్నలు :
1. ఈ కవితను ఎవరు రాశారు?
2. ఇది దేని గురించి చెబుతుంది
3. మాటల గొప్పతనం ఏమిటి ?
మంచిగా మాట్లాడమంటే ఏమిటి?
4. వాక్చక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థం అయింది ?
పాఠం ఉద్దేశం : ఉపన్యసించడం గొప్ప కళ. మంచి వక్త కావాలంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి? ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి? ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు : ఈ పాఠం 'వ్యాసం' అనే ప్రక్రియకు చెందినది. ఇరవెంటి కృష్ణమూర్తి రాసిన 'వాగ్భూషణం భూషణం' అనే పుస్తకంలోనిది.
రచయిత పరిచయం:
పేరు : డా. ఇరివెంటి కృష్ణమూర్తి
జననం : 12-07-1930
మరణం : 26-04-1989
జన్మస్థలం : మహబూబ్నగర్ జిల్లా
ప్రవేశం : సంస్కృత ఆంధ్ర ఆంగ్ల ఉర్దూ హిందీ భాషలలో..
ఉద్యోగం : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులు
పదవులు : అధ్యక్షులు, యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ.
కార్యదర్శి : 1. ఆంధ్ర సారస్వత పరిషత్తు
2. ఆంధ్ర సాహిత్య అకాడమీ
3. తెలంగాణ రచయితల సంఘం.
రచనలు : తెలుగు - ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం వేగుచుక్కలు, వెలుగు బాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా, పరిశోధన సిద్ధాంత గ్రంథం : 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు.
ఇవి చేయండి
I. అవగాహన ప్రతిస్పందన:
1. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది దీనికి సమర్థిస్తూ మాట్లాడండి.
2. కింది పదాలు ఈ పాటల్లో ఏ పేరాల్లో ఎన్నో పంక్తి లో ఉన్నాయో గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి.
అ) ధారాశుద్ధి, ఆ) వక్తృత్వకళోపాసనం, ఇ) ఊనిక, ఈ)వచశ్శైలి, ఉ)వ్యంగార్థం, ఊ) తపస్సు.
కింది అంశాన్ని చదివి తప్పొప్పులను గుర్తించండి.
మాటలు ద్వారా చెప్పి చెప్పిందని చేసేవారు మహాత్ములు (ఒప్పు)
చెప్పింది చేయడం చాలా సులభం (తప్పు)
ఆలోచనలు సదాలోచనలు కావాలి (ఒప్పు)
మనసు మాట నడత ఒకటైనవాడు సహితుడు కాదు (తప్పు)
వ్యక్తీకరణ సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) 'జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మాటే ప్రధానం' దీనిపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు: చక్కగా పొందికగా నొప్పించకుండా ఇతరుల మనసు గెలుచుకునే విధంగా మాట్లాడగల వాడికి అన్ని విజయాలే సిద్ధిస్తాయి.
మంచి ఉపన్యాసకుడు పార్టీ నాయకుడైతే ప్రజలు ఆ పార్టీ ఓట్ల వర్షం కురిపిస్తారు. నేర్పుగా మాట్లాడగలిగితే ఉద్యోగాల ఇంటర్వ్యూలలో మంచి ఉద్యోగాలు పొందవచ్చు. రాజకీయ నాయకులు చక్కగా వాగ్దానాలు గెలుస్తారు. మన జీవితంలో పక్కవారితో సంతోషం కలిగే విధంగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోవచ్చు.
భార్య బిడ్డలతో కూడా నేర్పుగా ఓర్పుగా మాట్లాడి వారి ప్రేమను పొందవచ్చు. ఒకరి వద్ద పనిచేసినప్పుడు యజమానికి అనువుగా మాట్లాడి ఆ యజమాని మనం చక్కగా మాట్లాడడం, సరసంగా సంభాషించడం. ఇతరుల మనుషులకు హాయి కలిగేటట్టు మాట్లాడే వారు మాట ద్వారా జీవితంలో ఏదైనా సాధించగలరు.
ఆ) 'శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కు 'పవిత్రమైనది' ఇట్లా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జ. వాక్కు అంటే మాట. వాక్కు అంటే సరస్వతి స్వరూపం. మాట్లాడే మాట నిర్దిష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉండాలి. మాట సభ్యత సంస్కారాలు కలిగి ఉండాలి. భారతీయులు వాక్కులు సరస్వతి దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. వాక్కును పరిశుద్ధంగా ప్రయోగించడం. పుణ్యమని పెద్దలు అన్నారు కాబట్టి వ్యాకరణ శాస్త్రం మర్యాదకు అనుగుణంగా తప్పులేని భాషను మాట్లాడాలి వాక్కు మనిషికి అలంకారం వంటిది. భాష మనిషికి ఎన్నడు కలతగ్గని అలంకారం. చక్కని భాష లేని వాడికి మంచి వేషం ఉన్న వ్యర్ధమే. వాగ్దార కత్తి అంచు. చక్కగా ఉచ్చరించే వాళ్ళు చూసి ఆయా అక్షరాలతో స్పష్టంగా నిర్దిష్టంగా వ్యాకరణ శాస్త్ర సమ్మతంగా ఉచ్చరించడం మనం అలవాటు చేసుకోవాలి.
భాష పవిత్రమైనది. కాబట్టి దానిని శాస్త్ర సమతంగానే మాట్లాడగలరు. మంచి భాష అలవాడం కోసం పుస్తకాలలోని ప్రసిద్ధ ఉపన్యాసాలను అధ్యయనం చేయాలని రచయిత గారి అభిప్రాయం.
ఇ) వ్యకృత్వంలో శరీర కదలికలు (అంగ విన్యాసం) పాత్ర ఎట్లాంటివి?
జవాబు. మహోత్సవంతో మాట్లాడేటప్పుడు ఉత్తేజకరభావాలను ప్రకటించేటప్పుడు పండితుడైన వక్త కళ్ళలో, కనుబొమ్మలు చేతుల్లో ముఖంలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ భావాన్ని ప్రకటించడానికి ఏ కదిలిక అవసరమో అన్నదానికి సరైన సమాధానం దొరకడం కష్టం.
ఈ అంగాంగ సంచలనం అన్నది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. వక్త తన భావాలను ప్రకటించేటప్పుడు అంగాంగ విన్యాసం చేయాలని నియమం ఏది లేదు. అవి సహజంగానే జరిగిపోతూ ఉంటాయి.
ఈ) ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం పాఠం నేటి విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది?
జ. విద్యార్థులకు ఉపన్యాస కళ చాలా ముఖ్యం. వారి ఉద్యోగాలు సంపాదించడానికి ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి ఈ ఉపన్యాసం శక్తి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సిగ్గు, భయం లేకుండా ఇంటర్వ్యూలలో వచ్చే ప్రశ్నలకు వారు ధైర్యంగా జవాబు చెప్పగలుగుతారు మనుషులను గెలుచుకుంటారు. కృష్ణమూర్తి గారు ఈ వ్యాసంలో ఉపన్యాస కళను నేర్చుకునే పద్ధతులను గూర్చి సవివరంగా వివరించారు. ధైర్యంగా ఎలా మాట్లాడాలో చెప్పారు. ఉపన్యాసం చెప్పడానికి ఎలా సిద్ధం కావాలో వివరించారు. భర్తకు కావలసిన పాండిత్యం గురించి వ్యాసంలో చెప్పారు. వక్త ఎటువంటి సిద్ధాంతాలను ప్రయోగించాలో చెప్పారు. వక్తకు కావలసిన జ్ఞాపకశక్తి, మేధాశక్తి ఉచ్చారణ శక్తిని సమగ్రంగా విశ్లేషించారు. ఉపన్యాసం చెప్పే పద్ధతిని ఎలా అలవాటు చేసుకోవాలో దీనిలో సమగ్రంగా చిత్రించారు.
ఉపన్యాసం చెప్పేటప్పుడు తమ కంఠతను ఎలా నియంత్రించుకోవాలో రసానుగునంగా ఎలా భావవ్యక్తీకరణ చేయాలో ఉపన్యాసంలో క్లుప్తత అవసరమని వివరించారు. మొత్తంపై విద్యార్థి ఈ వ్యాసం చదివితే ఉపన్యాసకాలపై మక్కువ పెంచుకుని ఉపన్యాసం మాట్లాడే పద్ధతులు కలిగించి వారు మహావక్తలు కాగలుగుతారు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) 'ఉపన్యాసం- ఒక గొప్ప కళ' దీన్ని వివరిస్తూ రాయండి.
ఉపన్యాసం ఒక గొప్ప కళ మాట్లాడం మనిషికి మాత్రమే లభించిన వరం. మాటలను అందంగా ఒక పద్ధతిగా అల్లుకొని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. వక్తృత్వ కలలో అందరూ నేర్పును సాధించవచ్చు. మాట్లాడడం నేర్చుకొని తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు.
వకృత్వం రాణించాలంటే పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి. చదువు ఎంత వస్తే అతడు ఉపన్యాసం అంతగా రాణిస్తుంది. అతడి మాటల్లో గాంబీర్యం సంస్కారం ఉంటుంది. భయాన్ని అనుమానాన్ని వదిలి ధైర్యంగా మాట్లాడుతుంటే వారు మంచి ఉపన్యాసాలు అవుతారు. భయాన్ని విడిచి ధారా ప్రవాహంగా మాట్లాడినప్పుడు ఆ ఉపన్యాసం శ్రోతలకు రసానందాన్ని పంచిపెడుతుంది.
కొన్ని ఉపన్యాసాలు మంచి పేరు పొందుతాయి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణులు ఉపన్యాసం, విశ్వమత మహాసభలో వివాకానంద స్వామి ఉపన్యాసం పేరుకి ఎక్కాయి. వక్త చెప్పదలచిన విషయంపై తన్వయత్వంతో గంభీరంగా మాట్లాడాలి. భర్తకు పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.
ఒక్క చెప్పదలుచుకునే విషయానికి సంబంధించిన సామగ్రిని బాగా సేకరించాలి. దాని కోసం ఎన్నో పుస్తకాలు విషయాలు సేకరించాలి మొదట పిల్లల వద్ద మాట్లాడాలి. ఒంటరి ప్రదేశాలలో విషయానికి తగినట్టుగా తన కంటఠతను పరిమితం చేసుకోవాలి. శ్రోతల ముఖాలను చూస్తూ మాట్లాడాలి. రసానికి అనుగుణంగా తన కంటాన్ని సవరించి సభ్యులు చేస్తూ మాట్లాడాలి. తర్కబద్ధమైన, ముఖ్యమైన ఉపన్యాసం చాలా గొప్పది. చీకట్లో దీపం వెలిగించినట్లు అజ్ఞానం పారిపోయేటట్లు మాట్లాడడం బుద్ధిమంతుడి లక్షణం.
3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ) ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మాట్లాడవలసిన అంశమైన 'మాట గొప్పదనం' మీద ఒక ప్రసంగ వ్యాసం రాయండి.
మిత్రులారా! ఈరోజు ప్రపంచ భాషా దినోత్సవం. ఈ సందర్భంగా మాట గొప్పదనం గురించి మనం ముచ్చటిస్తాం. భర్తృహరి వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే మనిషికి వాక్కు పెట్టని అలంకారం. దాన్నిబట్టి మాటకు ఉన్న శక్తి విలువను గుర్తించవచ్చు. పలుకే బంగారం అని పెద్దలంటారు. మాట మనిషికి దేవుడు ఇచ్చిన వరప్రసాదం ఏ జంతువులు ఏ ప్రాణి మాట్లాడదు. మనిషిని మిగతా జంతువు నుండి వేరు చేసి గొప్పగా నిలబెట్టినది మాట మాత్రమే. ఇప్పటికే ప్రస్తుతము అప్పటికి ఆ మాటలు గల వాడు ధన్యుడు. అతడు గొప్ప కార్యసాధకుడు. మంచి వాక్కు కల్పవృక్షం వంటి మనసిస్తాయి. అతని మాటలను బట్టి తెలుస్తుంది. మాధుర్యంగల మాటలు కార్య సాధకులు మంచి మాటలు స్నేహాన్ని పెంచుతాయి. ఆనందాన్ని ఇస్తాయి బాధలు ఉపశమనాన్ని ఇస్తాయి. మాటలలో కాఠిన్యం పనికిరాదు. కోయిలలో తీయగా మాట్లాడాలి. కాకిలా పరుషంగా మాట్లాడకూడదు.
మాటలతో కోటలు కట్టి మనిషి మహారాజు కాగలరు. దేశ ప్రధాని కాగలరు. మాటలు పాటలు రాస్తాయి. మాటలు స్నేహానికి బాటలు వేస్తాయి. మాటలు వల్లే కవిత్వ సంగీతాన్నిచ్చాయి. మాటలవల్లే నవ్యత, నాగరికత, చైతన్యం వెలుగు చూశాయి. విశ్వాన్ని వాక్శక్తి నడిపిస్తుంది.
భాషాంశాలు :
పదజాలం
1. కింది వాక్యాల్లో గీత గీసిన మాటలు అర్ధాన్ని గ్రహించి పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి.
I. సొంతవాక్యాలు :1. అప్రతిహతంగా : అప్రతిహతంగా సాగుతున్న అలెగ్జాండర్ దండయాత్రను పురుషోత్తముడు అడ్డుకున్నాడు.
2. అమేయము : రావణుడు అమేయమైన తపస్సుతో శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందాడు.
3. ఉదాసీనత : రాముడు విద్యాభ్యాస సమయంలో ఎక్కడా ఉదాసీనత కనిపించనీయలేదు.
4. ఆచరణ : లాల్బహదూర్, టంగుటూరి ప్రకాశం వంటి నాయకులు తమ ఆశయాలను ఆచరణలో చూపించారు.
2. కింది పర్యాయపదాలను పదవి జ్ఞానం ఆధారంగా జతపరచండి.
అ) కృపాణం - కత్తి ఖడ్గము అసిఆ) వాక్కు - మాట పలుకు నుడుగుఇ) స్నేహం - చెలిమి మైత్రి నెయ్యముఈ) మనసు - మది హృదయం ఎదఉ) విశ్వాసం - నమ్మకం నమ్మికఊ) ధ్వని - చప్పుడు శబ్దం
3. 'వాగ్మి', 'ధ్వని' అనే పదాలకు కింది వాక్యాలలో నానార్ధాలు ఉన్నాయి వాటిని గుర్తించండి.
వాగ్మి: యుక్తిగా మాట్లాడగలిగే వాడు చిలుక
ధ్వని : వ్యంగ్యార్థము, శబ్దం
4. కింది పట్టికనుండి ప్రకృతి వికృతులు గుర్తించి రాయండి.
స్నేహం - నెయ్యం
హృదయం - ఎడద
భాష - బాస
ప్రాణం - పానం
దివ్వే - దీపం
శబ్దం - సద్దు
వ్యాకరణాంశాలు కింది పదాలను విడదీసి సంధి రాయండి.
అ) కళోపాసనం = కళ+ఉపాసనం - గుణసంధి
ఆ) అభ్యుదయము = అభి+ ఉదయం -యణాదేశ సంధి
ఇ) తనకెంతో = తనకున్ + ఎంతో -ఉత్వ సంధి
ఈ) ఉన్నతమైన =ఉన్నతము + ఐనా - ఉత్వ సంధి
ఉ) రసానందం = రస + ఆనందము - సవరణ దీర్ఘ సంధి.
2. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస పేర్లు రాయండి.
అ) శక్తి సామర్థ్యాలు - శక్తియు, సామర్థ్యమును - ద్వంద్వ సమాసం
ఆ) పఠనశక్తి - పఠనమునందు ఆసక్తి - సప్తమీ తత్పురుష సమాసం.
ఇ) అభ్యుదయ పథం - అభ్యుదయమైన పథం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఈ) ఆత్మ శక్తి : ఆత్మ యొక్క శక్తి - షష్టి తత్పురుష సమాసం
ఉ) అద్భుత శక్తి - అద్భుతమైన శక్తి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి