సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

26, అక్టోబర్ 2023, గురువారం

VI. 6. పోతన బాల్యం

పోతన బాల్యం 
-డా. వానమామలై వరదాచార్యులు

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం 'కావ్య' ప్రక్రియకు చెందినది. కావ్యము అనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా. వానమామలై వరదాచార్యులు రచించిన 'పోతన చరిత్ర' అనే మహాకావ్యం లోని ప్రథమ శ్వాసము నుండి తీసుకోబడింది.

కవి పరిచయం
కవి పేరు డాక్టర్ వానమామలై వరదాచార్యులు
జననం : 16 .8 .1912
మరణం : 30 .10. 1984.
కాలం : 20వ శతాబ్దం
జన్మస్థలం: వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండ గ్రామం.
స్థిర నివాసం : మంచిర్యాల జిల్లా చెన్నూరు.
బిరుదులు:  అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి.
రచనలు:  పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము, వ్యాసమనణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి).
పురస్కారాలు : 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం. 
2. వారణాసి వారి విద్యా వాచాస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు

ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం కింది పద్యం చదవండి భావంలోని ఖాళీలు పూరించండి.
 
కందుకం వోలే సుజనుడు 
క్రిందంబడి మగుడమీదికి న్నెగయు జుమీ
మందుండు ముత్పిండం వలె 
క్రిందపడి యడగి యుండు గృపణత్వమునన్
ఖాళీలు
అ)కింద పడ్డ పైకి లేచేవాడు  సుజనుడు.
ఆ) అపజయం పాలైన తిరిగి విజయం సాధిస్తాడు.
ఇ) మందుడు అంటే బుద్ధిహీనుడు.
ఈ) బంతితో పోల్చబడినవాడు సుజనుడు.
ఉ) మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదం - మృత్పిండము.

III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలు జవాబులు రాయండి.

అ) ఊళ్లోని పెద్దలందరూ అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునేవారు మీ చుట్టుపక్కల వారు మెచ్చుకునేటట్లుగా నువ్వేం చేస్తావు?
జవాబు: తిప్పన పోతనలు అన్నదమ్ములు తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపి సోదరా భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నేను మా తమ్ముడు మీద మా చెల్లెలు మీద తిప్పన కురిపించిన ప్రేమను కురిపిస్తాను. తిప్పన పోతనలు ఎలా ఉన్నారో నేను మా అన్నదమ్ములం అలాగే ఉంటాము.


ఆ) 'కాళ్లలో పాదరసం' అంటే మీకేం అర్థమైంది?
జవాబు: పాదరసం అనగా నిలకడగా ఉండని స్వభావం గలది. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. నిలకడగా ఉండదు. చంచలమైన మనస్తత్వం కలిగిన వారిని పాదరస స్వభావం గలవారు అని కూడా అంటారు.

ఇ) 'తిప్పన - పోతన' లను రామలక్ష్ములతో ఎందుకు పోల్చారు?
జవాబు: తిప్పల పోతనలిద్దరూ అన్నదమ్ములు. ఒక్కరిని విడిచి ఒకరు ఉండలేరు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. పోతనకు అన్న అంటే అమితమైన ప్రేమ. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తమ్ముడు కనబడకపోతే అన్న వెతుకుతాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలని అనుకుంటాడు. కొట్లాటలు అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు గలవారు. మంచి స్వభావం కలిగిన వారు. వారు మణులు రామలక్ష్మణుల వంటి గుణగణాలు కలిగిన వారు. కావున వారిని రామలక్ష్మణులతో తో పోల్చారు.

ఈ) ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు: 
పోతన బాల్యం రాసిన కవి పేరు వానమామలై వరదాచార్యులు వీరు మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరవాసం ఏర్పరచుకున్నారు. వీరి బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి అనునవి. వీరి రచనలు పోతన చరిత్రను మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము,ఢ వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ(బుర్రకథలు) సంపుటి గ్రంథాలు రచించాడు.

2. ఈ క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు: పోతన బాల్యం.
పోతనకు తన అన్న తిప్పన అంటే ప్రాణం అమితమైన గౌరవం మర్యాద. తిప్పన తెలివిగలవాడు. ఏదైనా పద్యం తిప్పన చదువుతుంటే దాన్ని పోతన వినగానే అర్థం చేసుకునేవాడు. ఆ పద్యం యొక్క సారాంశాన్ని త్వరగా చెప్పగలిగేవాడు. పోతన విద్యలోనే కాదు వినయంలోనూ వివేకంలోనూ మంచి గుణాలు అలవర్చుకున్నాడు. ఆటపాటల్లో ఆరితేరిన వాడు. చదువులో తనకు తానే సాటి. ధైర్య సాహసాలలో శక్తివంతుడు. శ్రావ్యమైన పాటలు పాడేవాడు. మొగమాటము భయము వెనుకడుగు వేయడం అంటూ తెలియనివాడు. చెట్లు ఎక్కడంలో కోతులు మించిన నైపుణ్యం గలవాడు. పక్షుల కిందికి దూకేవాడు. ఉడతవలే పైకి ఎగబాకే వాడు. ఆయనకు భూమి మీద కాలు క్షణమైన నిలిచేది కాదంటే సందేహం లేదు. తన తల్లితో పోతన కూడా గుడికి వెళ్లేవాడు. దేవునికి నమస్కారాలు చేసేవాడు. సాధువులు సజ్జనులను దర్శించాలని ఉత్సాహం కలిగి వారితో సాంగత్యం చేసేవాడు. హరికథలను, పురాణాలను చిన్నప్పటి నుంచే వినడం మొదలైంది. శివ పూజ అంటే ఆసక్తి ఎక్కువ.

V. సృజనాత్మకత / ప్రశంస
పోతన తన బాల్యంలో ఆడుకునే ఆటలు తెలుసుకున్నారు కదా అట్లాగే మీరు ఆడుకునే ఆటలు ఏవి ఆటలు ఎందుకోసం ఆడాలో వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు: నేను ఆడుకునే ఆటలు కబడ్డీ వాలీబాల్, రింగ్ బాల్,  షెటిల్ కాక్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, ఖో ఖో గోలిలాట మొదలైనవి.
ఆటలు ఎందుకోసం ఆడాలి. మనోవికాసానికి అవి ఉపయోగపడతాయి. వ్యాయామం జరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎలా ఆడాలో, ఎలా ఆడకూడదో సమయస్ఫూర్తి అలవడుతుంది.

లేదా

పోతన ఆడుకునేటప్పుడు చూసిన వాళ్ళు "ఈ బాలుడు అసాధ్యుడు" అని అనుకునేవారు కదా! మరి ఇప్పుడు ఆడుకునే పిల్లలు చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు: 
రంగయ్య: రామయ్య నేటి పిల్లలు ఆటలు ఆడడమే లేదు. నిత్యం సెల్ ఫన్లు టీవీలు చూసుకుంటా ఊబకాయంతో బాధపడుతున్నారు చూసావా?
రామయ్య నిజమే రంగయ్య అమ్మ మనుమడు మనుమరాలు ఇద్దరూ అంతే ఎప్పుడు ఆడాలని చూడరు ఎలా మరి వీరితో
రామయ్య ఆడితి ప్రమాదకరమైన ఆటలు ఆడతారు రంగయ్య
రంగయ్య రామయ్య నిజమే ప్రమాదకరమైన ఆటలు ఆడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది





V. పదజాల వినియోగం
కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు పాఠంలో వెతికి రాయండి.
ఉదా భారతీయులు సోదర భావం కలిగి ఉంటారు సౌబ్రాత్రము
అ) లక్ష్మీ పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది
జవాబు : పొత్తం
ఆ)అర్జునుడు విలువిద్య యందు అధిపుడు
జవాబు : గొప్పవాడు
ఇ) బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు
జవాబు అన్న లేదా తమ్ముడు
ఈ)  ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం గా ఉంచుకోవాలి.
జవాబు : శరీరం 

2. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి.
అ) భోజనం - భోనం 
ఆ) నిదుర - నిద్ర 
ఇ) పొత్తం - పుస్తకం

3. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
అ) అనుజుడు 
జవాబు : మానుజుడు చిత్రలేఖనంలో, సంగీతంలో ప్రావీణ్యుడు.
ఆ) గొంకు జంకులు : గొంకు జుంకులు లేకుండా ప్రసంగిస్తేనే వక్తలవుతారు.
జవాబు : ఎలాంటి సమస్య వచ్చినా నేను గొంకు జంకు  లేకుండా మాట్లాడగలుగుతాను.
ఇ) మేటి :
జ. చదువులో ఆటలలో పాటలలో నేనే మేటి
ఈ) ఆసక్తి 
జవాబు: చదువు యందు నాకు ఆసక్తి ఎక్కువగా ఉన్నది.
ఉ) వెత 
జవాబు: వెత చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది
ఊ) అసాధ్యుడు 
జవాబు: కార్యదీక్షత కలిగిన వారు అసాధ్యులు.
4. క్రింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలునే వారిని కింద గీత గీయండి.
అ) పురము, పట్టణము, నగరం
ఆ) ధరణి, రైతు, అవని
ఇ) కోతి, కపి, వానరం 
ఈ) గుడి, కోవెల, దేవాలయం.

VI. భాషను గురించి తెలుసుకుందాం
కింది పట్టిక లోని పదాలు చదివి పుంలింగ శ్రీ లింగాలంగా పదాలను ఏకవచన బహువచనాలను అవ్యయాలను గుర్తించండి.
1. కింది పట్టికలోని పదాలు చదువి పుంలింగ , స్త్రీ లింగ పదాలను, నపుంసక లింగ పదాలను, ఏక వచన - బహువచనాలను,  అవ్యయాలను గుర్తించండి.
అ) పుంలింగ పదాలు :  సుధాకర్ చంద్రుడు బలరాం అతడు
ఆ) స్త్రీ లింగ పదాలు : రచయిత్రి, నటి, సీత ఆమె
ఇ) నపుంసక లింగ పదాలు : పుట్ట పత్రిక  
ఈ) ఏకవచనం : పత్రిక, డబ్బా, ఉంగరం, బల్ల
ఉ) బహువచనం : బాలురు, మహిళలు, ఆటలు, రచనలు 
ఊ) అవ్యయం: ఆహా, శభాష్, అట్లని, అమ్మో

2. కింది వాటిని జతపరచండి
అ) నామవాచకం ( జ ) హైదరాబాద్ 
ఆ) సర్వనామం.   ( గ ) ఆమె 
ఇ) విశేషణం.       ( ఘ) ఎర్రని 
ఈ) క్రియా            ( క ) చదివింది 
ఉ) అవ్యయం      ( ఖ ) కానీ

3. కింది ఖాళీలను పూరించండి 
అ) నామవాచకానికి లేదా సర్వ నామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం
ఆ) నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం 
ఇ) పనిని తెలిపే మాట క్రియా
ఈ) లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము 
ఈ) పేరు తెలిపే పదం నామవాచకం.

ప్రాజెక్టు పని : మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయండి వారి గురించి ఏమనిపించిందో మీ అనుభవం రాయండి ప్రదర్శించండి.
మా గ్రామంలో




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...