చేమకూర వెంకటకవి గురించి:  ఈ కవి రాసిన సారంగధర చరిత్రము, విజయ విలాసము, అను రెండు ప్రబంధాలు ఆయనకే అంకితమిచ్చాడు.)

 సారంగధర చరిత్రము:- సారంగధర చరిత్ర. తెలుగు సాహితీ చరిత్రలో మేటి ప్రబంధం. చేమకూర వేంకటకవి వ్రాసిన మరోప్రబంధ కావ్యం విజయ విలాసము. దీనిని మహాభారతము నందలి మూడవయాశ్వాశ ములో ప్రధాన కథను గ్రహించి మనోహరమైన సరస వర్ణనలతోను, మధుర గంభీరమైన భావములతో అద్భుత శ్లేషాలంకారములతోను, ఆహ్లాదము కలిగించినట్లు, చమత్కారములతోను అనన్య సామాన్యంగా రచించాడు. రస పాత్రపోషణములోను, పద ప్రయోగములతోను, అతనికి అతనే సాటి యనిపించుకున్నాడు.  విధమైన ప్రతిభా సంపన్నులు ఇద్దరే ఇద్దరు. వారిలో చామకూర వేంకటకవి మరియు భట్టు మూర్తి అద్వితీయమైన కవులు". క్షితిలో నీ మార్గమెవరికిన్ రా"అనుట సత్యము, అంతటి గొప్ప కవి కావుననే రసిక శేఖరుడైయిన రఘునాధ భూపాలుడు ఆదరించి ఘన సత్కారాలు చేసాడు. రఘునాథ నాయకుని ఆస్థానములో విద్వత్ కవియై పలు గ్రంథములు రచించాడు. వాటినన్నిటిని అతనికే అంకితం చేసిన మేటి కవి చామకూర వెంకటకవి. ఆతని ఘనత చెప్పనలవి కాదు. కృష్ణాధ్వరి, రఘునాథ భూపాలీయము, నైషధ పారిజాతావతారిక, కళ్యాణ కౌముదీ, కందర్ప నాటకము, శృంగార సంజీవని, తాళ్ల చింతామణి, నైషధ పారిజాతము అను ఆరు గ్రంధములను తానే రచించినట్లు చామకూర వెంకటకవి చెప్పుకున్నాడు.  రఘునాధుని ఆస్థానములో మేటి కవి చేమకూర వెంకట కవియని చెప్పుట అతిశయోక్తి కాదు.