పాఠం నేపథ్యం
ప్రతిష్ఠానపురానికి రాజు యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు
దారితప్పి, జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాలి అతనికి రామాయణ కథ
సంక్షిప్తంగా చెప్పి, ఒంటరిగా అడవిలో తిరుగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న
యయాతి దప్పికగొని ఒక నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలో నున్న ఒక స్త్రీ తనను
రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె
రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను
ఉపయోగించకుండా, కేవలం అచ్చతెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చతెనుగు పదాలు, అనగా దేశ్యపదాలు, మఱియు వికృతి పదాలు
కలిసిన భాష. యయాతి చరిత్ర, తెలుగులో మొదటి అచ్చతెనుగు కావ్యం.
‘యయాతి చరిత్ర’ అనే ఈ అచ్చతెనుగు
కావ్యాన్ని “పొన్నికంటి తెలగన”
రచించాడు.
ఈ పాఠం,
‘యయాతి చరిత్ర’ కావ్యంలోని
తృతీయాశ్వాసములోనిది.
పాఠం పేరు : ‘చెలిమి’
కవి పేర : ‘పొన్నికంటి తెలగన’
కవి కాలం : 16వ శతాబ్దం
పొన్నికంటి తెలగన ప్రసిద్ధి : పొన్నికంటి తెలగన, అచ్చతెనుగులో
నియమబద్ధమైన కావ్య రచనకు పూనుకున్న “అచ్చ తెనుగు ఆదికవిగా”
ప్రసిద్ధుడు.
నివాస స్థలము : గోలకొండ పరిసరాలలోని ‘పొట్లచెరువు’ (సంగారెడ్డి
జిల్లాలోని పటాన్చెరువు).
యాయాతి చరిత్ర : తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్ర.
ప్రవేశిక సృష్టిలో స్నేహం తీయనిది మనం తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనివి చూడ పుట్టిన వారితో కూడా చెప్పుకోలేని అయిన విషయాలను స్నేహితులకు చెప్పుకుంటాం మిత్రుడు మన తప్పులను ఎత్తి చూపిస్తాడు మన మంచిని మెచ్చుకుంటాడు మనకు అవసరం అయితే సాయం చేస్తాడు రహస్యాలను దాస్తారు.
ఈ విధంగా ఎంతో మంది కలిసి ఉండే స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా శత్రువులుగా మారిపోతుంటారు అలా మిత్రులు ఎందుకు శత్రువులుగా మారుతారు తెలుసుకోవడానికి దానిలో గల మంచినీళ్లు విశ్లేషించి చూసుకోవడానికి పాఠం చదువుదాం
(ప్రతిపదార్థం అన్వయ క్రమంలో రాయాలి. అన్వయ క్రమం అనగా భావం చెడిపోకుండా క్రమంగా కఠిన పదాలకు జవాబు రాయడం)
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
I.చ. కనుఁగొని నెమ్మది న్నెగులు గ్రమ్మఁగ రక్కసియొజ్జయంచుఁ బే
ర్కొనఁ దగునట్టి శుక్రునకుఁ గూరిమి కూఁతురు దేవయాని నాఁ
దవరిన యిన్నెలంత నొక తప్పునకై వృషపర్వుపట్టి నూ
తమ బడఁద్రోచి పోయెనని దాని తెఱం గది విన్నవించివన్.
ప్రతిపదార్థం :
కనుగొని = చూచి ;
నెమ్మదిన్ = తన మనస్సులో
నెగులు = దుఃఖము
క్రమ్మగన్ = వ్యాపించగా
రక్కసియొజ్జయంచున్;
రక్షసి = రాక్షసులకు
ఒజ్జ = గురువు
అంచున్ = అని
పేర్కొనన్ = చెప్పడానికి
తగునట్టి = తగిన
శుక్రునకున్ = శుక్రుడు అనే వానికి
కూరిమి కూతురు = ప్రియమైన బిడ్డ
దేవయానినాన్ = దేవయాని అనే పేరుతో
తనరిన = ఒప్పిన
ఇన్నెలంతన్ (ఈ + నెలంతన్) = ఈ స్త్రీని (ఈ దేవయానిని)
ఒక తప్పునకై = ఒక్క తప్పుకోసం ;
వృషపర్వుపట్టి = వృషపర్వుడు అనే రాక్షసరాజు కూతురు ; శర్మిష్ఠ
నూతను = నూతిలో
పడఁదోచి (పడన్ + త్రోచి) = పడేటట్లు తోసి
పోయెన్ = వెళ్ళిపోయింది ;
అని = అని
దాని తెఱంగు = ఆమె విషయము (ఆ శర్మిష్ఠ విషయమును)
అది విన్నవించినన్ = ఆ ఘూర్ణిక అనే దేవయాని చెలికత్తె, యమాతి మహారాజుకు తెలుపగా,
భావం :దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక అనే ఆమె, యయాతి మహారాజును చూసి, తన మనస్సులో దుఃఖము నిండగా, ఆమె “ఓ మహారాజా! ఈమె దానవగురువు అని చెప్పబడే, శుక్రాచార్యుని కుమార్తె. ఈమె పేరు దేవయాని. ఈమెను ఒక తప్పుకొఱకు వృషపర్వుని కూతురు, ఈ బావిలో త్రోసిపోయింది” అని ఆ దేవయాని విషయమును, యయాతి మహారాజుకు చెప్పింది.
2.
తే. ‘అతివ, వృషపర్వుఁడన నెవ్వఁ? డతని యనుఁగుఁ
గూఁతుపేరేమి? తనుఁబట్టినూతఁద్రోయు
నంతపని యేమి చేసె నీయలరుఁబోఁడి?’
యనుడు నవ్వాలుగంటి యయాతిఁ జూచి
ప్రతిపదార్థం :
అతివ = ఓ యువతీ ! (ఓ ఘూర్ణికా!)
వృషపర్వుడు = వృషపర్వుడు
అనన్ = అనగా (అంటే)
ఎవ్వడు = ఎవడు ?
అతని = అతని యొక్క (ఆ వృషపర్వుని యొక్క)
అనుగు కూతురు = గారాబమైన బిడ్డ
పేరేమి (పేరు + ఏమి) = పేరు, ఏమిటి ?
తనుఁబట్టి (తనున్ + పట్టి) = తనను పట్టుకొని (ఈ దేవయానిని పట్టుకొని)
నూతన్ = బావిలో
త్రోయు = పడద్రోయవలసిన
అంతపని = అంత తప్పుపని;
ఈ అరుఁబోడి = ఈ పూవువంటి శరీరముగల ఈ సుకుమారి (దేవయాని)
ఏమి చేసె = ఏమి చేసింది ?
అనుడున్ = అని యయాతి ఘూర్ణికతో అనగా ;
అవ్వాలు గంటి (ఆ + వాలుగంటి) = ఆ దీర్ఘములైన కన్నులుగల ఘూర్ణిక
యయాతిన్ = యయాతి మహారాజును ;
చూచి = చూసి
భావం :ఆ యయాతి మహారాజు ఘూర్ణికను చూసి, “ఓ యువతీ! వృషపర్వుడంటే ఎవరు ? అతని కూతురు పేరేమిటి? ఈ దేవయాని, తనను పట్టుకొని నూతిలో పడద్రోయవలసినంత దోషము ఏమి చేసింది ?” అని అడుగగా, ఆ ఘూర్ణిక ఆ మహారాజుతో.
3.క. విను వృషపర్వుఁ డనంగాఁ
దనరున్ రక్కసులతేఁడు తన కనిలోనం
బెనఁగఁదగు మార్తు నెందుం
గని యెఱుఁగక జగము లేలుఁగడ లేని సిరిన్
ప్రతిపదార్థం:
విను = వినుము ; (ఓ మహారాజా! వినుము)
వృషపర్వుడు = వృషపర్వుడు.
అనంగాన్ = అనే
రక్కసులఱేడు = రాక్షసరాజు
తనరున్ = ఒప్పుచుండును (ఉన్నాడు)
తనకున్ = ఆ మహారాజునకు (ఆ మహారాజుతో)
అనిలోనన్ = యుద్ధంలో ;
పెనగందగు (పెనగన్ + తగు) = యుద్ధం చేయగల
మార్తున్ = శత్రువును
ఎందున్ = ఎక్కడనూ
కని = చూచి ;
ఎఱుగక = తెలియక
సిరిన్ = ఐశ్వర్యంతో
జగ = లోకాలు
ఏలున్ = పాలిస్తాడు.
భావం:
ఓ మహారాజా ! చెపుతాను విను. వృషపర్వుడనే పేరుగల ఒక రాక్షసరాజు ఉన్నాడు. ఆయనతో సాటిగా యుద్ధం చేయగల రాజు ఎవ్వరూ లేరు. అతడు అంతులేని ఐశ్వర్యంతో, లోకములను ఏలుతున్నాడు.
విశేషం : వృషపర్వుని సభానిర్మాణము రాక్షసులలో 1) దైత్యులు, 2) దానవులు, 3) అసురులు అని మూడు తెగలు ఉన్నాయని, రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో చెప్పాడు. 1) హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, బలి – మొదలగువారు, దైత్యులు. అనగా వీరు దితి కుమారులు. విప్రచిత్తి, శంబరుడు, నముచి మొదలయినవారు దానవులు. అనగా వారు దనువు కుమారులు. బలి, వృత్రాసురుడు, వృషపర్వుడు మొదలయినవారు, అసురులు.
ఇందులో వృషపర్వుడు, కశ్యపప్రజాపతి కుమారుడు. ఇతని తల్లిపేరు దనుజ. “మయబ్రహ్మ”, వృషపర్వుడికి సభాభవనం నిర్మించాడు. ఈ సభాభవనం కోసం తెచ్చిన వాటిలో మిగిలిన సామాగ్రితోనే, మయుడు ధర్మరాజుకు ‘మయసభ’ను కట్టి ఇచ్చాడు. ఆనాటి సభాభవనాల్లో, మయసభకు ఉన్న ఖ్యాతి చాలా గొప్పది.
వృషపర్వుని సభ కట్టగా మిగిలిన సామాగ్రితో కట్టిన మయసభయే అంత అందంగా ఉందంటే, ఇక వృషపర్వుడి సభ ఎంత అందమో ఊహించాల్సిందే.
అతని కూఁతురు శర్మిష్ఠ యనఁగ నొప్పుఁ
గూర్మి సకియలు వేగురు గొల్వనెపుడు
నా చెలియఁగూడి యీ కొమ్మయాడుకొనుచు
నరమరలు లేని చెలుముల ననఁగి పెనఁగి.
ప్రతిపదార్థం :
అతని కూతురు = ఆ వృషపర్వుడనే రాక్షసరాజు కూతురు,
శర్మిష్ఠయనఁగన్ (శర్మిష్ఠ + అనగన్) = శర్మిష్ఠ అనే పేరు గలది ;
ఒప్పున్ = ఒప్పుతోంది ; (ఉంది)
కూర్మిసకియలు = ప్రియమైన చెలులు ; (ఆమెను)
ఎపుడున్ = ఎప్పుడూ
వేగురు కొల్వన్ = వేయిమంది సేవిస్తుండగా ;
ఒప్పున్ = ఒప్పుతుంది ; (ఆమె ఉంటుంది)
ఆ చెలియన్ = ఆ శర్మిష్ఠను ;
కూడి = కలసి ;
ఈ కొమ్మ = ఈ దేవయాని ;
అరమరలు లేని = పొరపొచ్చెములులేని ;
చెలుములన్ = స్నేహాంతో
అనగి పెనగి = కలసిమెలసి
ఆడుకొనుచున్ = ఆడుకుంటూ
భావం :
ఆ వృషపర్వునికి శర్మిష్ఠ అను పేరు కల కూతురు ఉంది. ఆమెకు వేయిమంది చెలులు. ఎప్పుడూ సేవలు చేస్తూ ఉంటారు. ఆ శర్మిష్ఠతో ఈ దేవయాని పొరపొచ్చెములు లేని స్నేహంతో కలసిమెలసి ఆడుకుంటూ తిరుగుతుంది
వచనం : తిరుగుచు నొక్కనాడు నీరాట సల్పునట్టియెడ.
ప్రతిపదార్థం :
తిరుగుచున్ = ఈ విధంగా వారు స్నేహంగా తిరుగుతూ;
ఒక్కనాడు = ఒకరోజున
నీరాట సల్పునట్టియెడన్ (నీరాట + చల్పు + అట్టి + ఎడన్) ;
నీరాట = జలక్రీడ
చల్పు + అట్టి + ఎడన్ = చేసేటటువంటి సమయంలో
భావం :
అలా తిరుగుతూ, ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయం
క. సురకరువలి చనుదెంచిన
దరిఁబెట్టినకోక లెల్లఁదడఁబడి పోఁగా
నరిగి యవి దెచ్చి చెలు ల
బ్బుర మగు తమ చీర లెల్లఁ బూనిన, నందున్
ప్రతిపదార్థం:
సురకరువలి = సుడిగాలి
చనుదెంచినన్ = రాగా
దరిన్ = ఒడ్డునందు (గట్టున)
పెట్టిన = తాము పెట్టినటువంటి (తాము పెట్టుకున్న)
కోకలు = కోకలు (చీరలు)
ఎల్లన్ = అన్నీ
తడబడిపోగాన్ = తారుమారు కాగా (చెల్లాచెదరు కాగా):
అరిగి = వెళ్ళి (వారందరూ గట్టుమీదికి వెళ్ళి)
అవి = ఆ తారుమారయిన చీరలు ;
తెచ్చి = తీసుకొనివచ్చి ;
చెలులు = ఆ శర్మిష్ఠ. చెలికత్తెలు
అబ్బురమగు = ఆశ్చర్యకరమైన
తమ చీరలు + ఎల్లన్ = తమ చీరలనన్నింటినీ
పూనినన్ = ధరింపగా
అందున్ = ఆ చీరల లోపల
భావం :
సుడిగాలిరాగా, గట్టుమీద వారు పెట్టుకున్న చీరలన్నీ తారుమారు అయ్యాయి (చెల్లాచెదరయ్యాయి). దానితో ఆ చెలికత్తెలు అపుడు పైకి వెళ్ళి, వారి బట్టలు తెచ్చుకొని ధరించారు.
క. లలి నీ నెలఁతయుఁ దానును
వలువలు వీడ్వడఁగ దాల్చి, వైళమె చెలువల్
దలఁపింప నెఱిఁగి కినుకం
గులుకుచు రక్కసుల తేని కూఁతురు తెగువన్.
ప్రతిపదార్థం :
లలిన్ = ఒప్పునట్లుగా
ఈ నెలతయున్ = ఈ దేవయానియునూ ;
తానును = ఆ శర్మిష్ఠయునూ
వలువలు = చీరలు
వీడ్వడఁగఁ దాల్చి (వీడ్వడగన్ + తాల్చి) = తారుమారుగా ధరించి; (ఒకరి చీర మరొకరు కట్టుకొని)
వైళమ = ఆ వెంటనే
చెలువల్ = రాజకుమార్తె చెలికత్తెలు
తలపింపన్ = వారికి తమ పొరపాటును తెలియబరచగా
ఎఱిగి = అది తెలిసికొని (ఆ పొరపాటును తెలిసి)
కినుకన్ = కోపంతో
కులుకుచున్ = (తుళ్ళిపడుతూ) (పోట్లాడుతూ)
రక్కసుల లేని కూతురు = రాక్షసరాజు వృషపర్వుని కూతురు ; (శర్మిష్ఠ)
తెగువన్ = సాహసంతో
భావం :
అప్పుడు ఈమెయు, ఆమెయు ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నారు. అది చూసి, చెలులు వారికి తెలియబరచారు. అపుడు రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ ఆ విషయం తెలిసికొని, కోపంతో త్రుళ్ళిపడుతూ, సాహసంతో ఇలా అంది.
8 : (కంఠస్థ పద్యం)
* ఉ. ‘నెట్టన రేయినిం బగలు నేరమి వెట్టునటంచు వేలుపు
ల్వెట్టియుఁ గొట్నముల్చలుప వ్రీలని చేబలు వొప్పు పోఁకుడుం
బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూఁతుర, నట్టి నేను నీ
కట్టిన మైలఁ గట్టుదునె కావరమేటికి వచ్చెనీ’ కనన్.
ప్రతిపదార్థం:
నెట్టన = మిక్కిలిగా
రేయినిన్ = రాత్రియునూ
పగలున్ = పగలునూ
నేరమీ వెట్టునటంచున్ (నేరమి + పెట్టును + అటంచున్) ;
నేరమి = దోషము
పెట్టు వేలుపుల్ = ఆరోపిస్తాడని ;
వెట్టియున్ = దేవతలు
కొట్నముల్ = ఊడిగములును (సేవలును)
చలుపన్ = చేస్తుండగా
వ్రీలని = భంగపడని
చేబలు వొప్పు (చేబలువు + ఒప్పు) = భుజబలము ఒప్పుతుండగా
సోకుడుంబట్టము (సోకుడు + పట్టము) = రాక్షసరాజ్యానికి పట్టాభిషేకము
కట్టుకున్న = చేసికొన్న
వృషపర్వుని కూతురన్ = వృషపర్వునికి కూతురిని
అట్టినేను = అటువంటి నేను
నీ కట్టిన మైలన్ = నీవు కట్టి విడిచిన మైలకోకను;
కట్టుదు = కట్టుకుంటానా ?
నీకున్ = నీకు
కావరము = గర్వము
ఏటికిన్ = ఎందుకు
వచ్చెన్ = వచ్చింది
అనన్ = అనగా
భావం :
“దేవతలందరూ ఎక్కడ తమను తప్పుపడతారో అని, రాత్రింబగళ్ళు తప్పకుండా వెట్టినీ, ఊడిగాన్నీ చేస్తుండగా, తిరుగులేని భుజబలంతో రాక్షసరాజ్యానికి పట్టాభిషేకం చేసికొన్న వృషపర్వుడి కూతురిని. అటువంటి నేను, నీవు కట్టుకున్న మైల చీరను కట్టుకుంటానా ? నీకు ఇంత పొగరు ఎందుకు వచ్చింది” అని శర్మిష్ఠ దేవయానిని అడిగింది.
III.
9. వచనం విని యయ్యెలనాఁగకు దేవయాని యిట్లనియె.
ప్రతిపదార్థం :
విని = ఆ శర్మిష్ఠ మాటలు విని
అయ్యెలనాగకున్ = ఆ యువతియైన శర్మిష్ఠకు
దేవయాని = ఈ దేవయాని
ఇట్లనియె (ఇట్లు + అనియె) = ఇలా చెప్పింది.
భావం :
అది విని, శర్మిష్ఠతో దేవయాని ఇలా అన్నది.
10హ
క. ‘ఉసు తొక్కటియై బొందులు
వెస రెండుగ నుండి, వల్వవీడ్వడుటకుఁ గాఁ
గస రెద, విధి తగ వగునా ?
పసిబిడ్డవె ? వాయి తెఱచి పల్కెదవు చెలీ !
ప్రతిపదార్థం:
చెలీ = ఓ చెలియా ! శర్మిష్ఠా !
ఉసురు = ప్రాణము (మన ఇద్దరి ప్రాణము)
ఒక్కటియై = ఒకటే అయి
బొందులు = శరీరాలు ;
వెసన్ = క్రమముగా ;
రెండుగన్ + ఉండి = రెండుగా ఉండి ;
వల్వ = చీర
వీడ్వడుటకుగాన్ = తారుమారైనందుకుగాను ;
కసరెదు = (నన్ను) కసరుకొంటున్నావు ; (విసుగుకుంటున్నావు)
ఇది = ఇలా కసరుకోడం
తగునా (తగవు + అగునా) = న్యాయమేనా ?
వాయి = నోరు
తెఱచి = తెరిచి
పల్కెదవు = మాట్లాడుతున్నావు.
పసిబిడ్డవె (పసిబిడ్డవు + ఎ) – నీవు పసిపిల్లవా ? ; (అంత తెలియని దానివా ?)
భావం :
ఓ చెలీ ! మనం ఇద్దరమూ ప్రాణం ఒకటియై, శరీరాలు రెండుగా బ్రతుకుతున్నాము. నీవు చీర తారుమారై నందుకే, ఇంతగా కసరుతున్నావు. ఇది న్యాయమేనా ? నోరుచేసి మాట్లాడుతున్నావు. నీవేమి పసిదానవా ?
11.
క. అనవుడు మడుగకఁ మిక్కిలి
కినుకం గేరడము లాడ గేలిగఁ గొనుచు
న్విని విని వేసరి యోర్వక
యెనసిన వగతోడఁ గూడ నీ పడుచనియెన్
ప్రతిపదార్థం :
అనవుడున్ = అని దేవయాని అనగా
ఉడుగక = మానక
మిక్కిలి కినుకన్ = మిగుల కోపంతో
కేరములు = నిష్ఠూరములు
ఆడన్ = పలుకగా (శర్మిష్ఠ మాట్లాడగా)
కేలిగన్ = పరిహాసముగా
కొనుచున్ = తీసుకుంటూ (శర్మిష్ఠ మాటలను)
విని విని = ఆ మాటలు విని విని ;
వేసరి = విసిగి, (దేవయాని విసిగి)
ఓర్వక = ఓర్చుకోలేక
ఎనసిన = పొందిన
వగతోడఁ గూడన్ (వగతోడన్ + కూడన్) = ఆ మాటలకు కలిగిన దుఃఖముతో కూడా
ఈ పడుచు = ఈ దేవయాని ;
అనియెన్ = ఇలా చెప్పింది
భావం :
ఈ దేవయాని అలా అన్నప్పటికీ, శర్మిష్ఠ మానక, కోపంతో అలాగే నిష్ఠూరములు మాట్లాడగా, ఈ దేవయాని వాటిని పరిహాసంగా భావించి విని విని, విసిగిపోయి, చివరకు వాటిని ఓర్చుకోలేక, మనస్సులో కలిగిన దుఃఖముతో ఇలా అంది.
12వ పద్యం : (కంఠస్థ పద్యం)
మత్తకోకిల.
‘ఓలి రక్కసి వంగడంబున కొజ్జకూరిమి కూఁతుర
వేలవేలుపుఁగన్నియం దగనీపు గట్టినపుట్టముం
దాలుపందగునమ్మ నా’ కని దాని కర్మిలిఁ బల్కఁ దా
నాలకింపక నూతఁద్రోచి గయాళి యై చనియెవ్వడిన్.
ప్రతిపదార్థం :
ఓలి = చెలీ !
రక్కసివంగ డంబునకున్ = రాక్షస వంశానికి
ఒజ్జ = గురువైన (శుక్రునకు)
కూరిమి కూతురన్ = గారాపు బిడ్డను;
నేలవేలుపు కన్నియన్= బ్రాహ్మణ కన్యను
తగన్ = ఒప్పునట్లుగా
నీవు = నీవు
కట్టినపుట్టమున్ = ధరించిన వస్త్రాన్ని
నాకున్ = నాకు ;
తాలుపన్ = ధరించడానికి
తగునమ్మ = తగునా తల్లీ !
అని = అని
దానికిన్ = ఆమెకు (శర్మిష్ఠకు)
అర్మిలిన్ + పల్కన్ = ప్రేమతో బదులు చెప్పగా
తాన్ = ఆమె (శర్మిష్ఠ)
ఆలకింపక = ఆ మాటలు వినక ;
గయాళియై = గయ్యాళిదై
వడిన్ = వేగముగా (దేవయానిని)
నూతన్ + త్రోచి = బావిలోకి తోసి
చనియెన్ = వెళ్ళింది.
భావం :
ఓసీ శర్మిష్ఠా ! నేను మీ రాక్షస వంశానికి తగినట్టి గురువైన శుక్రాచార్యుని గారాబు బిడ్డను. బ్రాహ్మణ కన్యను. కనుక నాకు మాత్రము, నీవు కట్టిన వస్త్రమును కట్టవచ్చునా? అని, ఆమె మాటలకు ప్రేమగా బదులు పలుకగా, శర్మిష్ఠ ఆ మాటలను వినిపించుకోకుండా, గయ్యాళితనముతో ఈమెను బావిలోకి త్రోసి వెళ్ళింది.
13. వచనం
అని యక్కలికి తెఱం గెఱింగించిన విని
కటకటంబడుచు మగిడి పొగడందగు తేజినెక్కి
మక్కువతో యయాతి తన ప్రోలికిం జనియె.
ప్రతిపదార్థం :
అని = దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక
అక్కలికి (ఆ + కలికి) = ఆ శర్మిష్ఠ యొక్క
తెఱంగు = విధమును
ఎఱింగించినన్ = తెలుపగా
విని = (యయాతి) ఆ మాటలు విని ;
కటకటం బడుచున్ = బాధపడుతూ
మగిడి = తిరిగి
పొగడంగ (పొగడన్ + తగు) = పొగడదగిన
తేజిన్ = గుఱ్ఱాన్న
ఎక్కి = ఎక్కి
మక్కువతోన్ = ప్రేమతో
యయాతి = యయాతి
తన ప్రోలికిన్ = తన పట్టణానికి
చనియెన్ = వెళ్ళాడు.
భావం :
అని దేవయాని చెలికత్తె అయిన ఘూర్ణిక ఆ సంగతంతా చెప్పగా విని, జాలిపడుతూ, ‘తిరిగి శ్రేష్ఠమైన గుఱ్ఱాన్ని ఎక్కి, యయాతి మహారాజు తన పట్టణానిక
పాఠం నేపథ్యం
అటంచున్ = అనుకొని
వేలుపుల్ = దేవతలు
వెట్టియున్ = ఉచితంగా
హహహహ (సేవలును)
చలుపన్ = చేస్తుండగా
వ్రీలని = భంగపడని
చేబలు వొప్పు
(చేబలువు +
ఒప్పు) = భుజబలము ఒప్పుతుండగా
సో
(సోకుడున్ +
పట్టము) = రాక్షసరాజ్యానికి పట్టాభిషేకము
కట్టుకున్న = చేసికొన్న
వృషపర్వుని = వృషపర్వుని
కూతురన్ = కూతురిని
అట్టి = అటువంటి
నేను = నేను
నీ = నీవు
కట్టిన = కట్టి విడిచిన
మైలన్ = మైలకోకను;
కట్టుదు = కట్టుకుంటానా ?
నీకున్ = నీకు
కావరము = గర్వము (అహంకారం)
ఏటికిన్ = ఎందుకు
వచ్చెన్ = వచ్చింది
అనన్ = అన్నది
భావం :
“దేవతలందరూ
ఎక్కడ తమను తప్పుపడతారో అని, రాత్రింబగళ్ళు
తప్పకుండా వెట్టినీ, ఊడిగాన్నీ
చేస్తుండగా, తిరుగులేని భుజబలంతో
రాక్షసరాజ్యానికి పట్టాభిషేకం చేసికొన్న వృషపర్వుడి కూతురిని. అటువంటి నేను, నీవు కట్టుకున్న మైల చీరను
కట్టుకుంటానా ? నీకు ఇంత పొగరు ఎందుకు వచ్చింది” అని శర్మిష్ఠ దేవయానిని
అడిగింది.
(కంఠస్థ పద్యం)
మత్తకోకిల. ‘ఓలి రక్కసి వంగడంబున కొజ్జకూరిమి కూఁతుర
న్నేలవేలుపుఁగన్నియం దగనీవు గట్టినపుట్టముం
దాలుపందగునమ్మ నా’ కని దాని కర్మిలిఁ బల్కఁ దా
నాలకింపక నూతఁద్రోచి గయాళి యై చనియెన్వడిన్.
ప్రతిపదార్థం :
ఓలి = చెలీ !
రక్కసి = రాక్షసవంగడంబునకున్ = వంశానికి
ఒజ్జ = గురువైన (శుక్రునకు)
కూరిమి = గారాలకూతురన్ = బిడ్డను;
నేలవేలుపు = భూ దేవుడగు బ్రాహ్మణకన్నియన్ = కన్యను
తగన్ = ఒప్పునట్లుగా
నీవు = నీవు
కట్టిన = ధరించినపుట్టమున్ = వస్త్రాన్ని
నాకున్ = నాకు ;
తాలుపన్ = ధరించడానికి
తగునమ్మ = తగునా తల్లీ !
అని = అని
దానికిన్ = ఆమెకు (శర్మిష్ఠకు)
అర్మిలిన్ + పల్కన్ = ప్రేమతో బదులు చెప్పగా
తాన్ = ఆమె (శర్మిష్ఠ)
ఆలకింపక = ఆ మాటలు వినక ;
గయాళియై = గయ్యాళిదై
వడిన్ = వేగముగా (దేవయానిని)
నూతన్ + త్రోచి = బావిలోకి తోసివడిన్ = వేగంగా
చనియెన్ = వెళ్ళింది.
భావం :
ఓసీ శర్మిష్ఠా ! నేను మీ
రాక్షస వంశానికి తగినట్టి గురువైన శుక్రాచార్యుని గారాల బిడ్డను. బ్రాహ్మణ
కన్యను. కనుక నాకు మాత్రము, నీవు కట్టిన వస్త్రమును కట్టవచ్చునా? అని, ఆమె మాటలకు ప్రేమగా బదులు
పలుకగా, శర్మిష్ఠ ఆ మాటలను
వినిపించుకోకుండా, గయ్యాళితనముతో బావిలోకి త్రోసి వెళ్ళింది.
I. అవగాహన ప్రతిస్పందన
1.ఒకరి వస్తువులు మరొకరు వాడుకుంటే కీడు తలపెట్టడం సరైనదేనా చర్చించండి.
జవాబు ఒకరి వస్తువులు ఒకరు వాడినంతలో నష్టమేమీ జరగదు అందువల్ల మనం కీడు చేయాలనుకోవడం సబబు కాదు.
సాధారణంగా హాస్టల్లో పాఠశాలలో ఒకరు వస్తువులు ఒకరు అవసరరీత్యా పొరపాటున కావాలని కానీ తీసి వాడుతారు పొరపాటున వాడే సందర్భాలు వస్తాయి.
తాము వాడుకునే సబ్బులు టూత్ పేస్టులు కాకపోయినా ఇతరుల వస్తువులను వాడినప్పుడు బాధపడతారు కోపగించుకుంటారు అట్లాగే ఇంటిలో అన్నదమ్ములు అక్క ఎండల మధ్య ఇలాంటి వస్తువులు ఒకరు వాడినప్పుడు వచ్చే తగాదాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఇతరుల వస్తువులు మనం వాడిన ఎలాంటి ఇబ్బంది రాదు. ఏమైనా ప్రక్కవారు మన వస్తువులు తీశారని కోపంతో అహంకారంతో వారికి కీడు తలపెట్టడం సరైన పద్ధతి కాదు.
2. స్నేహితులంటే ఎట్లా ఉండాలో మీ అభిప్రాయం చెప్పండి.
స్నేహితుడు ఆత్మీయుడు లా ఉండాలి.
మనస్పర్ధలు కల్పించకూడదు.
మిత్రు రహస్యాలను శత్రువులతో పంచుకోకూడదు.
నిందారోపణలు లేనివి పుట్టించడం చేయకూడదు.
స్నేహము స్వార్థాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. స్నేహం సమృద్ధిని కలిగిస్తుంది. ఆశలను చిగురింపజేస్తుంది.
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహానికన్న మిన్న లోకాన లేదు అని సినీ కవులు ఎంతగానో పాడుకున్నారు కాబట్టి మంచి స్నేహం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. మంచి చేసే స్నేహం మరువకు మరిచే స్నేహం చేయకు.
3. పాఠమాధారంగా శర్మిష్ఠ దేవయానిల స్వభావాలను ఎట్లా ఉన్నాయో కింది పట్టికలో తెలియజేయండి.
జవాబు: షర్మిష్ఠ దేవయాని లో స్వభావాలు భిన్నంగా ఉన్నాయి.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) స్నేహితుల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో
వివరించండి.
జవాబు:
- సామాన్యంగా ఆటలు ఆడుకొనేటపుడు స్నేహితుల మధ్య వివాదాలు
వస్తూ ఉంటాయి.
- స్నేహితులకు ఎవరైనా ఏదైనా బహుమతులు ఇచ్చినపుడు,
అవి వారికి సమానంగా ఇవ్వలేదనే
విషయం దగ్గర తగాదాలు వస్తాయి.
- చదువులలో పోటీలు ఏర్పడినపుడు నోట్సులు,
పుస్తకాలు దగ్గర తమకున్న బట్టలు
వగైరా దగ్గర తగాదాలు వస్తాయి.
- తల్లిదండ్రులు కాని, ఇతరులు కాని ఏవైనా బహుమతులు,
స్నేహితులలో ఒకరికి ఇచ్చి,
రెండవవారికి అవి ఇవ్వనపుడు,
తమకు ఎక్కువ తక్కువలు ఉన్నాయనే
విషయం దగ్గర వివాదాలు వస్తూ ఉంటాయి.
- తమకు ఇంటివద్ద ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కువ తక్కువలు
ఆరోపించుకోవడం, అందులో
ఎక్కువ ఉన్నవారికి గర్వం, అహంకారం
వచ్చిందనే కారణంగా, రెండవవాడు
తగాదా పెట్టడం వల్ల వివాదాలు వస్తాయి.
ఆ) “కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటే” దీనిని సమర్థిస్తూ రాయండి.
కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటే”
స్నేహానికి హద్దులు లేవు.
పరిమితులు లేవు. బడిలో చదువుకొనేటపుడు,
ఆటలు ఆడుకొనేటప్పుడు, ఎందరో మనకు
స్నేహితులవుతారు. అందులో వివిధ కులాలవారు,
మతాలవారు, వర్గాలవారు, పేదలు, ధనికులు కూడా ఉంటారు. స్నేహానికి
మనస్సులు రెండూ కలవడమే ముఖ్యం. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోడంలోనే స్నేహం ఉంది.
లోకంలో ఎందరో వివిధ మతస్థులయిన, వివిధ కులాలవారయిన
స్నేహితులు ఉన్నారు. వారు ఒకరికోసం మరొకరు తమ ప్రాణాలు ఇస్తారు. సుగ్రీవుడు
వానరుడు. రామలక్ష్మణులతో స్నేహం చేసి అతడు,
సీతను తిరిగి పొందడంలో
రామునికి ఎంతో సాయం చేశాడు. అలాగే విభీషణుడు రాక్షసుడు. రాముని ఆశ్రయాన్ని పొందిన
విభీషణుడు యుద్ధంలో రామునికెంతో సాయం చేశాడు. దీనినిబట్టి స్నేహానికి, కులమత వర్గ భేదాలు ఉండవని
గ్రహించాలి.
ఇ) అచ్చతెలుగు భాషలో రాయబడిన "చెలిమి" పాఠం చదివారు కదా
! దీనిపై మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా రాయండి.
జవాబు: చెలిమి పాఠం పై నా అభిప్రాయం: అచ్చతెనుగు పద్యం ఒకటి
కావ్యంలో ఉంటేనే, అది ఎంతో గొప్ప విషయం అని కావ్యరసజ్ఞులు మెచ్చుకుంటారు. అలాంటిది
నేను ఈ ‘చెలిమి’ పాఠంలో 12 అచ్చతెలుగు పద్యాలు చదువుకున్నాను. అయితే సంస్కృత సమాసాలతో పద్యాలు
వినడానికి కమ్మగా, గంభీరంగా, ఇంపుగా ఉంటాయి. ఈ అచ్చతెలుగు పద్యాలు, ముద్దులొలికే పదాలు మూటలు కడుతూ
ఉన్నాయి. శ్రవణ పర్వంగా ఉన్నాయి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు” ఎందుకు వివరించండి.
జవాబు: ఆపదలో ఆదుకునేవాడే
నిజమైన స్నేహితుడు
‘చెలిమి’ పాఠంలో రాక్షసరాజు కూతురు
శర్మిష్ఠ, తన స్నేహితురాలైన దేవయానిని,
చిన్న తప్పు కోసం అసహనంతో
నూతిలోకి త్రోసివేసి, ఇంటికి వెళ్ళిపోయింది. దేవయానిని ఎవరూ ఆదుకోలేదు. శర్మిష్ఠ రాజు
కూతురు కాబట్టి, ఆమె వెంట వేయిమంది చెలికత్తెలూ కూడా వెళ్ళిపోయారు.
దేవయాని చెలికత్తె ‘ఘూర్ణిక’ దేవయానిని విడువకుండా
ఆమెకు సాయం చేద్దామని చూస్తూ, తాను ఒక్కతే ఏమీ చేయలేక సాయంచేసే వారికోసం ఎదురు చూసింది. ఇంతలో
ప్రతిష్ఠానపురము ప్రభువైన యయాతి మహారాజు జాబాలి మహర్షి ఆశ్రమం నుండి తిరిగి వెడుతూ, దాహంతో దేవయాని ఉన్న నూతి
దగ్గరకు వచ్చాడు. తన్ను రక్షించుమని దేవయాని చెలికత్తె కోరగా దేవయానిని
రక్షించాడు.
దేవయానికి ఘూర్ణిక నిజమైన చెలికత్తె. అందుకే
ఘూర్ణిక, దేవయానిని అడవిలో నూతిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు.
దేవయానికి వచ్చిన కష్టాన్ని యయాతి మహారాజుకు చెప్పింది. యయాతి మహారాజుచే దేవయానిని
రక్షింపజేసింది. అందుకే ఆపదలో ఆదుకొన్నవారే నిజమైన స్నేహితులు అని చెప్పాలి. ఈ
కథలో ఘూర్ణికయే, దేవయానికి నిజమైన స్నేహితురాలు.
(లేదా)
ఆ) మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి ? ఆ స్నేహం కలకాలం
ఉండడానికి ఏం చేయాలి ?
జవాబు:
మంచి స్నేహితులే మనకు
నిజమైన సంపదలు. కాబట్టి మనకోసం ప్రాణం ఇచ్చే స్నేహితులను సంపాదించుకోవాలి.
స్నేహితులకు అవసరం అయినపుడు, తన ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పంచి ఇవ్వాలి. స్నేహితుల అవసరాలు మనం తెలుసుకొని, వారికి మనం సాయపడాలి.
స్నేహితుడు కష్టాల్లో ఉంటే, మన శక్తిని అంతా ధారపోసి వారికి మనం సాయపడాలి.
వారి అవసరం కోసం మనతో స్నేహం చేసేవారు, మంచి స్నేహితులు
అనిపించుకోరు. ఎవరైతే మనం ఆపదలో ఉన్నపుడు,
లేనిస్థితిలో ఉన్నపుడు
ఆదుకొంటారో వారే మంచి స్నేహితులు. మనం తప్పుదారిలో నడిచేటప్పుడు అది మంచిదికాదని, దానివల్ల కలిగే
లాభనష్టాలను వివరంగా మనకు తెలియపరచి, మంచిదారి చూపించేవారే మంచి స్నేహితులు.
మంచి స్నేహం త్యాగాన్ని కోరుతుంది. మంచి
స్నేహితుల కోసం మనం ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వేయకూడదు. మంచి స్నేహం, కలకాలం నిలవాలంటే
మిత్రులు చిన్న చిన్న విషయాలపై తగువులు పెట్టుకోరాదు. ఒకరి మనస్సులను మరొకరు బాగా
అర్థం చేసుకోవాలి.
స్నేహితులకు అవసరమైతే తననూ, తన ఆస్తినీ, తన బంధువులనూ వినియోగించి
తోడ్పడాలి. ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
శర్మిష్ఠ తన స్నేహితురాలైన దేవయానిని తిట్టి, బావిలో తోసింది కదా !
తర్వాత తన తప్పు తెలుసుకొని చింతిస్తే,
ఎట్లా ఉంటుందో ఊహించి, “ఏక పాత్రాభినయా”నికి అనువుగా మాటలు
రాయండి.
జవాబు:
శర్మిష్ట ఏకపాత్రాభినయము:
“అయ్యో ! ఎంతపని చేశాను ? అర్థం కాని ఆవేశంలో ఎంత పని చేశాను? నేను ఎంత కఠినురాలను? ఎంత మూర్ఖపు మనసు నాది? ఛీ! ఛీ! తలుచుకుంటేనే బాధేస్తుంది.
దేవయాని నాకు ఎంతో మంచి స్నేహితురాలు కదా ! అంతకుమించి ఆప్తురాలు.
అనవసరంగా దాన్ని నూతిలోకి తోశాను. పాపం ఏమయ్యిందో ! ఎలాగుందో? చచ్చిపోయిందేమో ! ఎంత పాపానికి ఒడిగట్టాను. నిజంగా నేను మిత్రద్రోహురాలిని.
పాపం దేవయాని నాకు ఎంతో నచ్చచెప్పింది. అవును. సుడిగాలి వస్తే దేవయాని ఏం చేస్తుంది ? బట్టలు మారిపోడానికి దేవయాని నిజంగా కారణం కాదు కదా !
మరి నేను మాత్రం తప్పు చేయలేదా ? నేను దేవయాని బట్టలు
కట్టుకున్నాను కదా ! నేను మాత్రం నా బట్టలు సరిగ్గా గుర్తించగల్గానా ? లేదు కదా ! నేను చేసిన
తప్పే, దేవయానీ చేసింది. తప్పు మా ఇద్దరిదీ ఒక్కటే, కాని శిక్ష దేవయాని
అనుభవిస్తోంది. ఇది అన్యాయం.
నేను రాజకుమార్తెననే అహంకారంతో ఈ తప్పుచేశా. ఇది
నిజం. దేవయాని తండ్రిగారు మా రాక్షస వంశానికి గురువుగా మాకు, ముఖ్యంగా మా నాన్నగారికి, ఎంత ఉపకారం చేస్తున్నారు ? రాక్షసుల క్షేమానికి
కారణం దేవయాని తండ్రి శుక్రాచార్యులు గారే !
నేను ఎంత తెలివితక్కువగా వ్యవహరించాను. ఎంత
చెడ్డపని చేశాను. వెంటనే దేవయానిని రక్షించమని భటుల్ని పంపిస్తా. దేవయానిని
రక్షింపజేసి, ఆమె దగ్గర నా తప్పు అంగీకరిస్తా. క్షమించమని కోరుతా ! (ఎవరక్కడ !)
III. భాషాంశాలు
పదజాలం:
1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) మన ఇరుగు పొరుగు వాళ్ళతో అనగి పెనగి ఉండాలి.
జవాబు:
అనగిపెనగి = మిక్కిలి
స్నేహముతో కలిసియుండి
వాక్యప్రయోగం : మా
తరగతిలోని బాలబాలికలందరం అనగి పెనగి సరదాగా ఉంటాము.
ఆ) చెలువలు బంగారు ఆభరణాలను చాలా ఇష్టపడతారు.
జవాబు:
చెలువలు = స్త్రీలు
వాక్యప్రయోగం : బతుకమ్మ పండుగ రోజున మా వీధిలో చెలువలు రంగురంగుల చీరలు ధరిస్తారు.
ఇ) మా పాఠశాలలో తరగతికి వందమంది చొప్పున పది తరగతుల్లో వేవురు విద్యార్థులు
చదువుతున్నారు.
జవాబు:
వేవురు = వేయిమంది
వాక్యప్రయోగం : మా గ్రామ
జనాభాలో వేవురు పురుషులు, తొమ్మిదివందల మంది స్త్రీలు ఉన్నారు.
ఈ) అమ్మనాన్నలు, గురువులు మనమంచికై కఠినంగా మాట్లాడినా నెగులు పడకూడదు.
నెగులు = విచారము
వాక్యప్రయోగం : మా ఇంట్లో
దొంగలు పడి, బంగారము దొంగిలించారని,
మేమంతా నెగులుపడ్డాము.
2. కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
అ) ఆళి ( సి ) ఎ) సకి
ఆ) గర్వం ( డి ) బి)అబ్బురం
ఇ) అద్భుతం ( బి ) సి) ఓలి
ఈ) సఖి. ( ఎ ) డి) కావరం
ప్రకృతి –
వికృతి
అ) ఆళి – ఓలి
ఆ) గర్వము – కావరం
ఇ) అద్భుతము – అబ్బురం
ఈ) సఖి – సకి
వ్యాకరణాంశాలు
1. కింది పదాలు విడదీసి, సంధి పేరు రాయండి.
అ) జగములేలు = జగములు + ఏలు – ఉత్వసంధి
ఆ) అలరుఁబోఁడి =అలరు + మేను – పోడ్యాదేశ సంధి
ఇ) నీరాట = నీరు + ఆట – ఉత్వసంధి
2. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
అ) రక్కసిరేడు = రక్కసులకు రేడు = షష్ఠీ
తత్పురుష సమాసం
ఆ) నీరాట = నీటి యందలి ఆట = - సప్తమీ తత్పురుష సమాసం
ఇ) పసిబిడ్డ = పసిదైన బిడ్డ = విశేషణ పూర్వపద
కర్మధారయ సమాసం.
గసడదవాదేశ సంధి:
కింది పదాలను కలిపినప్పుడు, ఏర్పడిన రూపాలను
గమనించండి.
అ) వాడు + కొట్టె =
వాడుగొట్టె
ఆ) మీరు + చనుడు =
మీరుసనుడు
ఇ) నీవు + టక్కరి =
నీవుడక్కరి
ఈ) నిజము + తెలిసి =
నిజముదెలిసి
ఉ) పాలు + పోక = పాలువొక
పై ఉదాహరణలు గమనించారు కదా! పూర్వపదం చివర
ప్రథమా విభక్తి ప్రత్యయాలున్నాయి. పరపదం మొదట, క, చ, ట, త, ప లున్నాయి. ఈ విధంగా ప్రథమా విభక్తి మీది ప్రత్యయాలకు, క, చ, ట, త, ప, లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.
అంటే
-
1) ‘క’ → ‘గ’ గా మారుతుంది.
-
2) ‘చ’ → ‘స’ గా మారుతుంది.
- 3) ‘ట’ → ‘డ’ గా మారుతుంది.
-
4) ‘త’ → ‘ద’ గా మారుతుంది.
- 5) ‘ప’ → ‘వ’ గా మారుతుంది.
ప్రథమ మీది పరుషాలకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.
అనగా క, చ, ట, త, ప లకు వరుసగా గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తాయి
(ప్రథమ పరుషం అనగా అతడు, అది, వాడు, ఆమె మొదలైన పదాలు. ఇంగ్లీషులో దీనిని థర్డ్ పర్సన్ అంటారు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి