సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

16, నవంబర్ 2023, గురువారం

VIII.6. తెలుగు జానపద గేయాలు

Viii.6. తెలుగు జానపద గేయాలు 
-ఆచార్య బిరుదు రాజు రామరాజు 

పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదు రాజు రామరాజు రాసిన వ్యాసం.

రచయిత పరిచయం
పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు పాఠం పేరు : తెలుగు జానపద గేయాలు జననం : 16 - 4 - 1925 
మరణం : 8 - 2 - 2010 
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామం.
 వృత్తి : కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడు.
 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్ గా పనిచేశారు.

 ఇతర రచనలు : "తెలుగు జానపద గేయ సాహిత్యం" ఈయన పరిశోధన గ్రంథం. చరిత్ర చరితార్థులు. ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ - తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.

II. స్వీయ రచన: 
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి?
జ. జానపద గేయాలు మన సంస్కృతికి నాగరికతకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. జానపద పాటల్లో విద్యాభ్యాసము లోకజ్ఞానము, హేతువు అంతా వారి సాహిత్యమే. జానపద గేయాలలో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. బుద్ధికి పదును పెట్టే సమస్యలు ఉంటాయి.  ముక్తపదగ్రస్తాలు వివిధ అలంకారాలు ఉంటాయి.  జానపద గేయాల్లో శైలి విశిష్టమైనదిగా పేర్కొనవచ్చు. వివిధ పురాణ గాథలు చారిత్రక కథలు విశిష్టమైన అంశాలు జానపద గేయాల్లో కనిపిస్తాయి. జానపద గేయాలు చాలా సరళమైన భాషలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి. చరిత్రను తెలియజేస్తాయి. ఇటువంటి జానపద గేయాలను మనం వారసత్వ సంపదగా భావించాలి. ముందు తరాల వారికి అందించాలంటే వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది.

ఆ)జానపద గేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి?
జవాబు:  రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథము అని సూక్తి ఇది భారతీయులకు ఆదికావ్యం రామాయణం.  అనువాదాలలో మూలంలో లేని కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నవి ఉంటాయి. సీతారాములు ఆదర్శ దంపతులుగా దర్శనమిస్తారు. రాముడు మానవాళికి ఆరాధ్యుడు. శ్రీరాముడు, రాఘవ కళ్యాణం, రాములవారి అలక, సుగ్రీవ విజయం, లక్ష్మణ మూర్ఛ, లంక యాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైనవి రామాయణంలో కొన్ని ఘట్టాలను తెలియజేస్తాయి. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. సీత అంటే కష్టాలకు చిరునామా అని భావిస్తారు. అప్పుడప్పుడు నాకు సీత కష్టం వచ్చిందని కూడా పేర్కొంటారు. సీత పుట్టుక కళ్యాణం మొదలైన వారిని ఉన్నాయి

ఇ) ‘గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది’ – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సంసార విషయాలు స్త్రీలకే బాగా తెలుస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలగడం, గృహసంబంధమైన వేడుకలు మొదలైన వాటిల్లో స్త్రీలకే ప్రాధాన్యం ఎక్కువ.

జానపదగేయాల్లో కూడా స్త్రీలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా తల్లి తన కుమారుడిని రామునిగానో, కృష్ణునిగానో, కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో తలచుకొని తన్మయత్వం పొందుతుంది. పిల్లల అభివృద్ధి కోసం స్త్రీలు ఎన్నో త్యాగాలను చేస్తారు. స్త్రీకి పురుషుని కంటే ఓర్పు చాలా ఎక్కువ. కుటుంబజీవనం ఇంతగా వృద్ధి పొందడానికి స్త్రీలే ప్రధానకారణమని చెప్పవచ్చు.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
జానపదగేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడుతారు. ఈ పాటలను పాడుతున్నప్పుడు శ్రామికులు తమ శ్రమను మరచిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి శారీరక శ్రమ కలుగదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.

(లేదా)

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” – దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు.
ఇతర భాషలలోని జానపద గేయాల లాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయచరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.


ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితాసౌరభం గుభాళిస్తుంది.

మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమ పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృదు హృదయం అవసరం. తెలుగు జానపదం ఎంతో మధురమైంది. ఈ జానపద వాఙ్మయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

IV. సృజనాత్మకత / ప్రశంస: 
1. కింది ప్రశ్నలకు జవాబులు సృజనాత్మకంగా రాయండి.
అ) వారం రోజులపాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారు చేయండి.

జానపద కళావారోత్సవాలు ఆహ్వాన పత్రిక

జై తెలంగాణ ! జై జై జానపదం !

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో జానపద కళా రూపాలను ప్రదర్శిస్తున్నాము. తరతరాల వారసత్వంగా మనకు సిద్ధించిన ఈ జానపదకళారూపాలను దర్శించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము.

వేదిక : కోటిలింగాల దేవస్థాన కళామండపం, సిద్దిపేట.
సమయం : రాత్రి 7 గం॥ నుండి 9 గం||ల వరకు

ప్రదర్శించే రోజు – ప్రదర్శించే జానపదకళారూపం
1) 13. 10. 18 – సీతాకళ్యాణం – తోలుబొమ్మలాట
2) 14.10.18 – సుగ్రీవ విజయం (యక్షగానం)
3) 15.10.18 – రాధాకళ్యాణం – కురువంజినృత్యం
4) 16.10.18 – వాలివధ – వీధి భాగవతం
5) 17.10.18 – వీరాభిమన్యు – హరికథ
6) 18.10.18 – రుక్మిణీ కళ్యాణం – బుర్రకథ
7) 19. 10. 18 – శ్రీకృష్ణలీలలు – ఒగ్గు కథ

ఇట్లు,
సిద్దిపేట జానపద కళా సమితి.

V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి 
సౌరభం సువాసన పరిమళం
ఆలంబన ఆధారం ఆశ్రయం
మోక్షం కైవల్యం ముక్తి 
కష్టం ఇక్కట్లు శ్రమ

2. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
పురోగతి:  
ఇంకా మానవ పురోగతి సాధించాలి.

రూపురేఖలు: 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల రూపురేఖలు మారాయి.

కూని రాగాలు : 
కొందరు తీరిక సమయాల్లో పోలిరాగాలు తీస్తారు.

VI. భాషను గురించి తెలుసుకుందాం.
ఒకటి కింది వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి
అ)  మామయ్య ఇంటికి వచ్చాడు మామయ్య కాఫీ తాగాడు.
జ. మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది. కొమ్మ విరిగి కింద పడింది.
శత్రువులు భయపడ్డారు.
 శత్రువులు పారిపోయారు. 
జవాబు: శత్రువులు భయపడి పారిపోయారు

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) శివ అన్నం తిన్నాడు రాజు పండ్లు తిన్నాడు.
జవాబు : శివ అన్నం, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది.
ఆమె కొబ్బరికాయలు ఇచ్చింది.
జ. ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకున్నాయి.
 వర్షం పడలేదు.
జ. నల్లని మబ్బులు కమ్ముకున్నా వర్షం పడలేదు.

కింది పదాలు చదవండి వాటికి విగ్రహవాక్యాలు రాయండి అవి ఏ తత్పురుష సమాసం రాయండి

అ) గదా ధరుడు : గదను ధరించిన వాడు ద్వితీయ తత్పురుష సమాసం 
ఆ) అగ్ని భయం : అగ్ని వలన భయం - పంచమి తత్పురుష సమాసం 
ఇ) గుణహీనుడు : గుణముల చేత హీనుడు - తృతీయ తత్పురుష సమాసం 

ఈ) ధనాశా : ధనమునందు ఆశ - సప్తమి తత్పురుష సమాసం 
ఉ) దైవభక్తి : దైవమునందు భక్తి - సప్తమి తత్పురుష సమాసం 
ఊ) అజ్ఞానం : జ్ఞానం కానిది - నణ్ తత్పురుష సమాసం

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
పెళ్లిళ్లలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు సేకరించి నివేదిక రాయండి.
సీత కల్యాణ వైభోగమే 
రామ కల్యాణ వైభోగమే 
పవనజ స్తుతి పాత్ర పావని చరిత్ర 
రవి సోమ నవనేత్ర రమనీయ గాత్ర భక్తజన పరిపాల భరిత శరజాల 
భక్తి ముక్తి దలీల భూదేవ పాల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...