కొత్తబాటడా. పాకాల యశోద్ధా రెడ్డి
పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు రచించిన "యశోద రెడ్డి ఉత్తమ కథలు" అనే గ్రంథంలోనిది. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానికి తగ్గట్టుగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి. యశోదా రెడ్డి గారు ఈ 'కొత్త బాట' కథలో తెలియజేశారు.
రచయిత్రి పరిచయం* కొత్తబాట పాఠ్యాంశ రచయిత్రి - పాకాల యశోదా రెడ్డి.* మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలోజననం: ఆగస్టు 8, 1929లో జన్మించారు.* తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.* తెలుగు ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.రేడియో కార్యక్రమం: మహాలక్ష్మి ముచ్చట్లురచనలు: ఆంధ్ర సాహిత్య వికాసం
పారిజాతాపహరణ పర్యాలోచనముఎర్ర ప్రగడకథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలు.మా ఊరి ముచ్చట్లుఎచ్చమ్మ కథలుకథా చరిత్రధర్మశాల కథా సంపుటాలు.
కింది లింక్ నొక్కి వినండి :
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తులు వచన కవిత రాయండి.
పల్లే పై కవిత
మా ఊరు మంచి స్ఫూర్తి
మతల హారతి మనసులు చూద్దువు
చిరునవ్వులు రువ్వుతూ
కన్నతల్లి ఆత్మను మరిపించే ఆత్మను చూద్దువు
పచ్చని చెట్లు, పాడిపంటలతో
కలకలలాడే మాపల్లె
పంట పొలాలు పశు సంపదతో
శోబిల్లే మాపల్లె
ఆత్మీయులకి పెట్టుబోతల తీరు
అప్యాయతలకీ ఆయువుపట్టు
పుట్టతేనె తీరు
పిల్లగాలులతో పల్లె సేను ఒయ్యారం ఒలుకబోస్తది
చెరువు అలలతో చెంగలిస్తూ తుల్లిపాడ్తది
విద్యుత్ కాంతిలో మాపల్లె విరాజిల్లోతోంది
అన్నదమ్ముల అనుబంధం తో అలరారుతోంది
కులమతాలు కాదనీ
వరుసలతో అనుబాధాలు అల్లుకుంటది.
ఒక్కసారి రా పోగొట్టుకున్న ప్రేమలో తేలుదువు
III. భాషాంశాలు:
3. ప్రకృతి వికృతులు:1. సముద్రము - సంద్రం2. విద్య - విద్దె3. ఆధారము - ఆదెరువు4. శిఖ - సిగ5. ప్రయాణం - పయనం
4. జాతీయాలు వివరణ:నక్షత్రకుడు : వెంటపడి పీడించేవాడని అద్దంలో వాడుతారు.నిండుకొన్నవి : అయిపోయాయని అర్థంలో వాడుతారు.దడిగట్టు : చుట్టూ చేరారని అర్థంలో వాడుతారు.నిప్పుకలు సెరగంగ: కోపోద్రిక్తులు అవుతుండగా అని అర్థంలో వాడుతారు.
ప్రాణాలుగోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు - గసడవాదేశ సంధి
మూటగట్టు = మూట + కట్టు - సరళాదేశ సంధి / దృత ప్రకృతిక సంధి
ఆసుపోయుట = ఆసు + పయుట -గసడవాదేశ సంధి
కాలుసేతులు = కాలు + సేతులు -గజదవాదేశ సంధి
పూచెనుగలువలు = పూచెను + కలువలు -సరళాదేశ సంధి లేదా ద్రుత/ ప్రకృతిక సంధి
1. సూత్రం : ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
2. సూత్రం: అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐ కారం, ఓ, ఔ లు పరమైతే ఔ కారం ఏకాదేశంగా వస్తాయి.
:సారాంశం:
కొత్తబాట
'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు.
అక్క పయనమై బండెక్కి బయలు దేరింది.
వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు.
అక్క ఎంత సేపటికీ మాట్లాడపోయే సరికి
ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.
చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.
కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది.
ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.
గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.
బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.
బాట పాఠం ప్రకారం
మారుతున్న సమాజంలో..
- ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని.
- కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
- చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
- ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
- రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
- మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
- ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
- పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
- దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
- ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
- మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
- పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
- యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు.
ముగింపు :
ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం.
అ ) "నల్గురు నడిసిందే బాట " లోని అంతరార్ధమేమిటి?
1.'నల్గురు నడిచిందే బాట 'అంటే పదిమంది ఏ పని చేస్తే అదే అందరికి ఆమోదం అవుతుందని భావం, పదిమంది పాటించింది పద్దతి అవుతుందని నానుడి.
ప్రక్రియ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది కథ లేదా కథానిక. సంఘటనల మధ్య సంభాషణ సంబంధాల్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది వచన ప్రక్రియ. సంభాషణ కథనం శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. క్లూప్త దీని ప్రత్యేకత దీనిని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు.
2.అదే సాంప్రదాయ మవుతుంది.నలుగురు నడిచినప్పుడే అది బాటగా మారుతుంది.దాన్నే మిగిలిన వారందరూ అనుసరిస్తారు.పదుగురాడు మాట పాడి ఐ ధర చెల్లు" అని వేమన కూడా అన్నాడు కదా!
౩.పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.
4.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
''అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవి" అంటే మీకేం అర్థమైంది? జ: నక్కలు చాలా తెలివైనవి. అవి ఉచితంగా ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని కనిపెడుతుంటాయి. పెద్ద జంతువులు తినగా మిగిలిన వాటిని తింటాయి.
ఆ) సేవ్వు మిద పెను వార్తెన? అంటే మీకు ఏమి అర్థమయ్యింది ...
మన చెవి మీద పెను పాకితే ,మనలో వెంటనే చైతన్యం కలుగుతుంది.దిని అర్థం పట్టించుకోవడం.
పంచేంద్రియాలలో చెవి కూడా ఒకటి. కాని ఈ పాఠం లో అక్క చెప్తున్నా మాటలు,తమ్ముడికి చెవి మిద పెను పాకితే కలిగే టంత చలనం కూడా కలిగించలేదు.అందువల్ల అతను అక్క చెప్పిన మాటలు వినిపించుకోకుండా తానె అక్కకు చెప్తున్నాడు.'అసలు పట్టించుకోవడం లేదు','గ్రహించాడంలేదు అని .దిని అర్థం.
పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
జ: పల్లెల్లో ఆనాడు దారులన్నీ వర్షంవస్తే బురదమయంగా మారేవి. ఇప్పుడు ప్రతి పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి