పిల్లలందరిని బాధ్యతాయుతమైన, హేతుబద్దమైన పౌరులుగా తీర్చిదిద్దడమే విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం. గత కొంతకాలం వరకు చదువు జ్ఞాపకశక్తి లేదా బట్టీ విధానం మీద ఆధారపడి ఉండేది. 2009- విద్యా హక్కు చట్టం ఈ పద్ధతిని మార్చివేసింది. విద్యార్థి ఒక తరగతిని పూర్తి చేయడమంటే...ఆ తరగతిలోని అన్ని విషయాలకు సంబంధించిన సామర్థ్యాలను సాధించడమే అని రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం - 2011 పేర్కొంది. అందులో భాగంగా ప్రతి విషయానికి కొన్ని సామర్థ్యాలను నిర్ధేశించింది. తెలుగు భాషను ఒక విషయంగా నేర్చుకొనే పాఠశాల విద్యార్థులు కచ్చితంగా కింది సామర్థ్యాలు సాధించాల్సి ఉందని రా. వి. ప్ర. ప. ప.-2011 పేర్కొంది
ప్రథమ భాషగా తెలుగు నేర్చుకొనే (9, 10 తరగతుల) విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు
అవగాహన - ప్రతిస్పందన
వినడం - మాట్లాడడం,
ధారాళంగా చదివి, అర్థం చేసుకోవడం, వ్యక్తీకరించడం
అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
విద్యార్థి విన్న, చదివిన అంశాలను అర్థం చేసుకోవాలి.
తన అభిప్రాయాలను వ్యక్తీకరించాలి.
సమర్థిస్తూ, విభేదిస్తూ మాట్లాడగలగాలి. కారణాలు వివరించగలగాలి.
నచ్చిన సందర్భాన్ని, అనుభూతులను వర్ణించగలగాలి.
పద్య భావాలు, పాఠ్య భాగ సారాంశాలు, కథలు సొంత మాటల్లో చెప్పగలగాలి.
వక్తృత్వ పోటిల్లో పాల్గొనాలి. సద్యోభాషణం చేయగలగాలి.
జాతీయాలు, సామెతలు గుర్తించగలగాలి.
సందర్భాలను గుర్తించగలగాలి.
భావాలకు తగిన పద్యపాదాలను గుర్తించగలగాలి.
పేరాలకు శీర్షికలు పెట్టడం, శీర్షికలకనుగుణంగా పేరాలను గుర్తించాలి.
అపరిచిత గద్య, పద్యాలను చదివి అర్థం చేసుకోవాలి.
వ్యక్తీకరణ - సృజనాత్మకత
స్వీయరచన, సృజనాత్మకత, ప్రశంస
అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
కారణాలు రాయగలగాలి.
వివరిస్తూ రాయగలగాలి.
అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను రాయగలగాలి.
రచయిత అభిప్రాయాలను గ్రహించి, వివరించగలగాలి.
సమర్థిస్తూ, విభేదిస్తూ రాయగలగాలి.
ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ రాయగలగాలి.
అభినందన వ్యాసాలు, కరపత్రాలు, సన్మాన పత్రాలు రాయగలగాలి.
వ్యాసాలు, కవితలు, కథలు రాయగలగాలి.
భాషాంశాలు:
పదజాలం, వ్యాకరణాంశాలు
అను సామర్థ్యాలు ఉంటాయి. ఇందులో భాగంగా విద్యార్థులు కింది పనులు చేయగలగాలి.
పదాలకు అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు రాయగలగాలి.
ఇచ్చిన పదాలను, జాతీయాలను సొంత వాక్యాలలో ప్రయోగించగలగాలి.
ప్రకృతి, వికృతులను రాయగలగాలి.
దైనందిన జీవితంలో జాతీయాలను, సామెతలను ఉపయోగించాలి.
పద్యాల లక్షణాలను అర్థం చేసుకోవాలి.
సంధులు, సమాసాలను అర్థం చేసుకొని వివరించగలగాలి.
అలంకారాలను అర్థం చేసుకొని, వివరించగలగాలి.
ప్రాజెక్టు పనులు:
వివిధ సామార్థ్యాల సమాహారం
కథలు, కవితలు, రచయితలు, కళాకారుల వివరాలు సేకరించడం. సేకరించిన అంశాలపై నివేదికలు రూపొందించడం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి