సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

13, అక్టోబర్ 2023, శుక్రవారం

IX.8. ఉద్యమస్ఫూర్తి

8. ఉద్యమస్పూర్తి 

-    సంగెం లక్ష్మీబాయి 


చదవండి ఆలోచించి చెప్పండి:

 గాంధీజీ భారత దేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు.  దేశమంతా వారి ఆధీనంలోనే  ఉన్నది. కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించడం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవడం చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కానీ గాంధీ అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నారు.

 సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులు ఉన్నారు

 ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ.శదండి యాత్ర 24 రోజులపాటు సాగింది. అభిమానులు స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్రతీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్ల ప్రజలందరినీ ఏకం చూసి స్వాతంత్ర ఉద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించాడు.

 ప్రశ్నలు: 

1.  ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు? 

2.నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు?

3. గాంధీజీ అహింస మార్గాన్ని ఎందుకు అనుసరించాడు?

పాఠం ఉద్దేశం:  నేనొక్కడినే బాగుంటే చాలు ఎవరేమైతే నాకెందుకు? అనే స్వార్థం సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలావరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్ధకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

 ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. ఒకే వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథం గా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలు కాకుండా సమకాలీన విశేషాలు ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది.

ప్రస్తుత పాఠ్యాంశము : సంగెం లక్ష్మీబాయి రాసిన 'నా జైలు జ్ఞాపకాలు - అనుభవాలు' అనే ఆత్మకథలోనిది.


రచయిత్రి : సంగెం లక్ష్మీబాయి

 గ్రహించబడిన గ్రంథం : రచయిత్రి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలుఅనే ఆత్మకథ నుండి గ్రహించబడినది.

జన్మస్థలము : ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరంఅనే గ్రామంలో జన్మించింది.

జననము :27-07-1911. 

మరణము 1979 వ సంవత్సరం

ఉద్యోగం : హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా ఈమె పనిచేసింది.

పదవులు : ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు.

 పాల్గొన్న ఉద్యమాలు :

  1. గాంధీజీ పిలుపుతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె.
  2. 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె.

ప్రవేశిక:

చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంత కాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశ పడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషిచేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి.

తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్ర్యోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

ఇవి చేయండి.

I. అవగాహన ప్రతిస్పందన

ప్రశ్న 1.ఆనాటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటివారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, సమాజ సేవకు అంకితమైనారు కదా! ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటి ? ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం ఉందా? ఎందుకు ? మాట్లాడండి.

జవాబు:
సుమారు రెండు వందల సంవత్సరాలపాటు మనదేశం బ్రిటిష్వారి పాలన కింద బానిస దేశంగా ఉండిపోయింది. ఆ రోజుల్లో గాంధీజీ, నెహ్రూ, తిలక్ వంటి నాయకుల నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం ప్రజలు పోరాటం చేశారు. అప్పుడు సంగెం లక్ష్మీబాయి వంటి స్త్రీలు సహితం గాంధీజీ పిలుపును అందుకుని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. వారు సత్యాగ్రహాలు, ధర్నాలు, పికెటింగులు చేశారు. వారు సమాజసేవకు నడుం కట్టారు. ఆ త్యాగమూర్తుల కృషివల్లనే నేడు మనం హాయిగా స్వాతంత్య్ర వాయువులను పీలుస్తున్నాము. నేడు మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాము.
పాఠం చదివి కింది పేరాలకు శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని కీలక పదాలు రాయండి.
జవాబు:
మాసుమా బేగం గురించిన కింది పేరా చదువండి. సందర్భాన్ని బట్టి, ఖాళీలను సరైన పదాలతో పూరించండి.
జవాబు:
1) జన్మించింది
2) సేవకురాలు
3) నెలకొల్పింది
4) తోడ్పడ్డాడు
5) సత్కరించింది
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమాజం వ్యాధిగ్రస్తమైపోయింది. అందుకు కారణం, సమాజంలోని వ్యక్తులు. అంతేకాని స్వాతంత్ర్య సిద్ధి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాజకీయ నాయకులలో స్వార్ధము, పదవీ లాలస, అక్రమ ధన సంపాదన, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి.
జవాబు:
స్వాతంత్ర్య సాధనకు గాంధీజీ సత్యము, అహింస, సహాయ నిరాకరణము అనే వాటినే అస్త్రాలుగా స్వీకరించి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించాడు. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, స్వాతంత్య్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది.
జవాబు:
బ్రిటిష్వారు మొదట మనదేశానికి వర్తకం చేసుకోడానికి వచ్చారు. వర్తకం చేసుకోడానికి స్వదేశరాజుల అనుమతులు సంపాదించారు. స్వదేశరాజుల మధ్య తగవులు పెంచి, వారిలో తాము ఒకరి పక్షాన్ని వహించి, రెండవ వారిని దెబ్బతీసారు. తరువాత తాము సమర్థించిన రాజునూ దెబ్బతీశారు. స్వదేశరాజులకు మిలటరీ సాయం చేస్తామని చెప్పి, వారి నుండి కొన్ని రాజ్య భాగాలు సంపాదించారు.
జవాబు:
సంగెం లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. సుప్రసిద్ధ దేశభక్తురాలు. ఈమె రచనా శైలి సంస్కృతాంధ్రపద సమ్మేళనంతో అనుప్రాసలతో అద్భుతంగా ఉంది. ఆమె రచనలో దేశభక్తి, బ్రిటిష్ వారిపై ద్వేషం అడుగడుగునా తొంగిచూస్తున్నాయి.
జవాబు:
మన భారతదేశ ప్రజలు కేవలం తమ హక్కులను రక్షించుకోడమే కాదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. భారతదేశ ప్రజలు పాటించవలసిన విధులనూ, కర్తవ్యాన్నీ, నిర్దుష్టంగా నెరవేర్చాలి. భారత ప్రజలలో సమాజంపట్ల నిర్లిప్తత పనికి రాదు.
జవాబు:
సంగెం లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర్య సమరయోధుల అవసరం
స్వానుభవము = తన అనుభవము
వాక్యప్రయోగం : స్వానుభవమును మించిన గుణపాఠము, వేరే ఉండదని నా నమ్మకము.
పరితపిస్తూ = బాధపడుతూ
వాక్యప్రయోగం : జీవితమంతా బాధలతో పరితపిస్తూ బ్రతికే పేదవారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి.
కొల్లగొట్టి = దోచుకొని
వాక్యప్రయోగం : దొంగలు ప్రజల సొమ్ములను కొల్లగొట్టి తీసుకుపోతారు.
అ) గారవం  –  గౌరవం
ఆ) కత  –  కథ
ఇ) జీతం  –  జీవితము
ఈ) కఱకు  –  కర్కశము
 3.మాసుమాబేగం హైదరాబాదులో         1            ఆమె ప్రముఖ సంఘ           2             నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ. అంజుమన్ ఖవాతీన్ ను స్థాపించి, బీద పిల్లల కోసం హైదరాబాదు నగరంలో ఏడు పాఠశాలలు          3             హైదరాబాదు నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ మాసుమాబేగం. ఈమె చేసే పనుల్లో, సేవా కార్యక్రమాలలో ఆమె భర్త ప్రొఫెసర్ హాసిమాన్ అలీఖాన్ కూడా ఎంతో            4            ఈమె చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ బిరుదుతో            5           .

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి, ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) స్వాతంత్ర్యం లభించినప్పటికీ, అది సంతోషం కలిగించటం లేదని సంగెం లక్ష్మీబాయి ఎందుకు భావించింది?

స్వాతంత్రానంతరం సమాజం ఉదాసీనత లోకి వెళ్లింది. రాజకీయ నాయకులలో స్వార్ధము పదవిలాలస అక్రమ ధన సంపాదన అవినీతి లంచగొండితనం పెరిగిపోయాయి. ప్రజలలో సాంఘిక నిర్లిప్తత పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, మనకెందుకులే అనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజలు తామూ, తమ బ్రతుకూ వరకు పరిధుల్ని పరిమితం చేసుకుంటున్నారు. దేశం కోసం, తోటిప్రజల కోసం సేవచేయడం, త్యాగం చెయ్యడం అనే గుణాలు తగ్గిపోయాయి.

అందువల్లనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అది తనకు సంతోషం కల్గించటం లేదని సంగెం లక్ష్మీబాయి భావించింది.

ఆ) గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఎట్లా చెప్పగలరు ?

స్వాతంత్ర సాధనలో గాంధీజీ సత్యము అహింస సహాయ నిరాకరణ ఉద్యమం అనే వాటిని వస్త్రాలుగా స్వీకరించారు. గాంధీజీ అహింసా మార్గం స్వాతంత్ర సాధనలో ప్రాధాన్యత పోషించింది. బ్రిటిష్  వద్ద గొప్ప సైన్య సంపద ఉండేది. వారికి తుపాకీలు, విమానాలు, ఫిరంగులు ఉన్నాయి. గాంధీజీ హింసామార్గాన్ని ఎన్నుకుంటే, బ్రిటిష్ వారు ఆ ఉద్యమాన్ని మిలటరీ సాయంతో అణచివేసి యుండేవారు. గాంధీ హింసా పద్ధతిలో పోరాడితే పెక్కుమంది ఉద్యమకారులు తమ ప్రాణాలు పోగొట్టుకొని యుండేవారు. ఎక్కువ మంది సత్యాగ్రహులు మరణిస్తే, ఉద్యమంలోకి ప్రజలు ఎక్కువగా వచ్చియుండేవారు కారు. ఆ విధంగా స్వాతంత్ర్య పోరాటం నీరసించి యుండేది.

    అలాకాక, అహింసా పద్ధతిలో ఉద్యమం సాగడం వల్ల, ఉద్యమంపట్ల ప్రజలకూ, ప్రభుత్వానికీ, పాలకులకూ, సానుభూతి కలిగింది. కనుక అహింసామార్గం స్వాతంత్ర్య సాధనలో కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు.

ఇ) బ్రిటిష్ వారి చేతుల్లోకి మనదేశ పాలన పోవుటకు గల కారణాలు వివరించండి.

భారతదేశానికి బ్రిటిష్ వారు వర్తక వాణిజ్యం కోసం వచ్చారు. స్వదేశ రాజుల నుంచి అనుమతులు పొంది వారి మధ్యనే తగులు పెంచి పోషించారు.  స్వదేశరాజులు దత్తత చేసుకోరాదని వారి రాజ్యాన్ని లాక్కున్నారు. అన్యాయంగా, స్వదేశరాజుల రాజ్యాల్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని కుట్రలతో స్వాధీన పరచుకున్నారు. ఈ విధంగా వర్తక నెపంతో మనదేశానికి వచ్చి బ్రిటిష్వారు క్రమంగా మనదేశాన్నీ, మనదేశ సంపదనూ, కబళించి వేశారు.

 

ఈ) సంగెం లక్ష్మీబాయి రచనా విధానం ఎట్లా ఉన్నది?

సంగం లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. దేశభక్తురాలు. సంస్కృత ఆంధ్ర సమ్మేళనంతో అనుప్రాసులతో అద్భుతమైన రచన శైలి ఆమె సొంతం. 

ఆనాడు దేశప్రజలు సంతోషంగా ఉరికంబాలెక్కారని ప్రజల దేశభక్తిని ఈమె ప్రశంసించింది. రచనలో మంచి పదబంధాలు ప్రయోగించింది. ఉడుకు నెత్తురు ప్రవహించేలా”, “వీరావేశంతో జేజేలు కొట్టు” – “బాలుడి మరణం తల్లికీ, స్వదేశీయులకూ రంపపు కోత” – “వంటి మాటలు రాసింది. బ్రిటిష్ వారివి, కర్కశ హృదయాలన్నది. వారు పచ్చి నెత్తురు త్రాగే కిరాతకులన్నది. మన స్వదేశరాజులు దేశాన్ని బ్రిటిష్ వార్కి ధారాదత్తం చేశారని బాధపడింది.

     ప్రపంచం మారినా, మన భారతీయులు ఇంకా అజ్ఞానంలో మ్రగ్గుతున్నారనీ, కరవు కాటకాలు మారెమ్మలా ఊళ్ళమీద పడి ఊడ్చేశాయనీ, మంచి అనుప్రాసలతో ఈమె రచన సాగింది.

       మన ప్రాచ్యదేశం అంతా అప్రాచ్యమని, పాశ్చాత్యులు నాగరికత కలవారని భారతీయులను తక్కువ చూపు చూసిన బ్రిటిష్ వారిని, ఈమె పరాన్న భుక్కులని ఎగతాళి చేసింది.

       మనకు స్వాతంత్ర్యం, మన హక్కుల సంరక్షణకేకాక, బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్యపాలనకూ లభించిందని మనకు ఈమె గుర్తు చేసింది. లక్ష్మీబాయి రచనాశైలి ప్రభావవంతమైనది. చురుకైనది. పదబంధాలతో, తెలుగు నుడికారంతో సుందరంగా ఉంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) స్వాతంత్ర్య సమరయోధులు కన్నకలలు నిజం కావాలంటే మనకు లభించిన స్వాతంత్య్రాన్ని ఎట్లా సద్వినియో గించుకోవాలో విశ్లేషిస్తూ రాయండి.

మనది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశ ప్రజలు పాటించవలసిన విధులను కర్తవ్యాన్ని నిర్దిష్టంగా నెరవేర్చాలి. మంచి శీలవంతమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి. అవినీతిపరులైన లంచగొండులైన వారిని దూరంగా తరిమికొట్టాలి. ప్రతివ్యక్తి సంఘంలో జరిగే చెడ్డను ఎదిరించి పోరాడాలి. లంచగొండితనాన్ని రూపుమాపాలి.

మన దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమించి పనిచేయాలి. సోమరితనం కూడదు. దేశాభివృద్ధికి ప్రతివ్యక్తి తన వంతుగా కష్టించి పనిచేయాలి. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొని, దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. యువత శ్రద్ధగా చదువుకోవాలి. వృద్ధులను గౌరవించాలి. దేశభక్తి కలిగియుండాలి. దేశసంపదను కొల్లగొట్టే నీచులను తరిమికొట్టాలి.

ప్రతి భారతీయుడు పై విధంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, స్వాతంత్య్ర సమరయోధుల కలలు ఫలిస్తాయి.

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా/ప్రశంసాత్మకంగా రాయండి.

అ) నేటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటి వారు ఎందుకు అవసరమో వివరిస్తూ వ్యాసం రాయండి.

సంగం లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర సమరయోధుల అవసరం:

సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయి, వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాండ్రు ఆనాడు గాంధీ మహాత్ముని అడుగుజాడలలో నడచి, అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. కారాగారాలలో నిర్బంధింపబడ్డారు. లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలు. సాంఘిక సేవా పరాయణురాలు.

దుర్గాబాయి ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసింది. వరలక్ష్మమ్మగారు, లక్ష్మీబాయిగారు ఎందరినో కార్యకర్తలను తయారుచేశారు. వినోబాభావే భూదానోద్యమ యాత్రలో లక్ష్మీబాయి పాల్గొంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేయడంలో వీరు ప్రముఖపాత్ర వహించారు.

ఇటువంటి మహిళామణుల ఆవశ్యకత స్వతంత్ర భారతంలో ఎంతగానో ఉంది. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు, స్త్రీలపై జరిగే అత్యాచారాల నిరోధానికి, పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు జరగాలి.

స్వచ్ఛభారత్, బాలకార్మికుల నిరోధం, అవినీతి నిర్మూలనం, స్త్రీ విద్యాభివృద్ధి, స్త్రీలకు పురుషులతో సమానహక్కుల సాధన వంటి రంగాల్లో లక్ష్మీబాయి వంటి త్యాగధనులయిన మహిళామణుల సేవలు ఎంతో అవసరం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు మహనీయులయిన దేశభక్తురాండ్ర అడుగుజాడల్లో నడిస్తే, మన భారతదేశం సస్యశ్యామలమై, రామరాజ్యమై వర్ధిల్లుతుంది.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) మనం మంచి చేస్తే, మనకూ మంచి జరుగుతుందని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను.

జవాబు స్వానుభవం = తన అనుభవం

ఆ) తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు.

పరితపిస్తూ = బాధపడుతూ

ఇ) బ్రిటిష్ వారు మనదేశ సంపదను కొల్లగొట్టి తీసుకొని పోయారు. 

కొల్లగొట్టి = దోచుకొని

2. కింది వికృతి పదాలకు ప్రకృతులను పాఠంలో వెతికి రాయండి.

  వికృతి - ప్రకృతి

గారవం - గౌరవం 

కత - కథ 

జీతం -  జీవితము 

కరకు - కర్కశము

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను పరిశీలించి, అవి ఏ ఏ సంధులో గుర్తించి, పదాలను విడదీసి, సంధి సూత్రం రాయండి.

అ) మనకెందుకు = మనకున్ + ఎందుకు ఉకారవికల్ప సంధి

ఆ) విషాదాంతము = విషాద + అంతము సవర్ణదీర్ఘ సంధి

ఇ) మేమెంత = మేము + ఎంత ఉత్వసంధి

ఈ) ఎవరికున్నాయి =ఎవరికిన్ + ఉన్నాయి ఇత్వసంధి

ఉ) విచిత్రమైన = విచిత్రము + ఐన ఉత్వసంధి

2. కింది సమాస పదాలను పరిశీలించి, వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

అ) మాతృదేశం = తల్లి యొక్క దేశం షష్ఠీ తత్పురుష సమాసం

ఆ) కర్కశహృదయం = కర్కశమైన హృదయము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) సహాయనిరాకరణ = సహాయమును నిరాకరించడం ద్వితీయా తత్పురుష సమసం

ఈ) విప్లవసంఘం = విప్లవకారుల యొక్క సంఘం షష్ఠీ తత్పురుష సమాసం

ఉ) అశ్వత్థవృక్షం = అశ్వత్థముఅనే పేరుగల వృక్షము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఊ) శాస్త్రదృష్టి - శాస్త్రము యొక్క దృష్టి షష్ఠీ తత్పురుష సమాసం

యణాదేశ సంధి

* కింది పదాలను విడదీయండి. విడదీసిన పదాలను కలిపి, కలిగిన మార్పులను గమనించండి.

గమనిక : పై మూడు రకాల ఉదాహరణల ద్వారా కింది అంశాలను గమనింపవచ్చు. ఇ, , ఋ లకు అసవర్ణములు కలిస్తే ఇ, , ఋ లకు ఆదేశంగా య్, వ్, ర్ లు అంటే, , , , లు వస్తాయి. య, , , , లను యణులుఅని పిలుస్తారు. యణులుఆదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇలా ఏర్పడిన సంధిని యణాదేశ సంధిఅంటారు.

 

, , ఋ లకు, అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు, ‘యణులుఆదేశంగా వస్తాయి.

అసవర్ణములు : అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు.

అభ్యాసము : కింద ఇచ్చిన పదాలను విడదీసి, యణాదేశ సంధి అవునో కాదో పరిశీలించండి.

అ) అభ్యుదయం = అభి + ఉదయం = యణాదేశ సంధి

ఆ) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = యణాదేశ సంధి

ఇ) మాత్రంశ = మాతృ + అంశ = యణాదేశ సంధి

 ఈ) మధ్వరి మధు + అరి = యణాదేశ సంధి

ఉ) స్వాగతం = సు + ఆగతం = యణాదేశ సంధి

ఊ) మీ పాఠ్యపుస్తకంలో యణాదేశ సంధికి సంబంధించిన పది పదాలు వెతికి రాయండి.

ప్రాజెక్టు పని


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...