సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

11, జూన్ 2025, బుధవారం

మండల స్వామి కథ "ఒట్టి చాపలు"

#telugu_siri_dr #shortstoriesintelugu #shortstories #telugu 
#మండల_స్వామి_కథ #ఒట్టి_చాపలు Dr. #Mandal_SwamyStory | Ottichapalu | #Telugu_siri _Dr.Siddenky



కవి, కథకుడు, విమర్శకుడు, కీర్తిశేషులు డా. మండల స్వామి గారు. తెలుగు సాహిత్య వేదిక నుంచి అర్ధాంతరంగా 
తేది : 19-10-2024న నిష్క్రమించడం సాహితీ లోకానికి బాధాకరం. 

 మండల స్వామి గారు మండల లక్ష్మమ్మ రాములు దంపతులకు తేది : 15 ఏప్రిల్ 1972లో పిట్టంపల్లి గ్రామం చిట్యాల మండలం నల్లగొండ జిల్లా లో జన్మించారు. 

పేదరికంలోంచి కడుపు మార్చుకుని కన్నీళ్లను మూటగట్టుకొని కలలు చేత్తో పట్టుకొని అక్షరలోకసంచారిగా అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచాడు. అక్షరమే ఆత్మవిశ్వాసం అని నమ్మి కష్టపడుతూ పీహెచ్డీ డిగ్రీ వరకు చదివాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఎందుకంటే బోధించడమే పరమావధిగా చైతన్యమే ప్రబోధంగా భావించాడు. 

మితభాషి. మృదుస్వభావి. నొప్పించని మనస్తత్వం, కలివిడి స్వభావం వారి సొంతం. 

మండల స్వామి "నల్లగొండ జిల్లా గ్రామ నామాలు" అనే అంశంపై పరిశోధన గావించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి పీహెచ్డీ డిగ్రీ పట్టా పొందాడు. విమర్శ వ్యాసాలు సమీక్షలు కవితలు కథలు రచించాడు. తెలంగాణ గ్రామ నామాలు వ్యాస సంపుటి మొదలైనవి అచ్చులోకి తేవలసి ఉన్నది. 

క్యాన్సర్ తో బాధపడుతూ ఆఖరి కోరికలను ఫోన్లో తెలియజేసి నా పుస్తకాలు ప్రచురించండి కోరాడు. 

ఈ పనిని భుజాల మీద వేసుకొని పెరుమళ్ళ ఆనంద్, సాగర డా. సాగర్ల సత్తయ్య , రామకృష్ణ మొదలగు మిత్ర బృందం కలగలిసి అంకుటిత దీక్షతో, అంకిత భావంతో సృజన సాహితి నల్లగొండ అందించిన సహకారం వల్ల మండల స్వామి కథలను "ఒట్టి చాపలు" పేరుతో ప్రచురించారు. ఆ కృషి అభినందనీయం.

ఒట్టి చాపలు పుస్తకం ఫిబ్రవరి 2025 లో ప్రథమ ముద్రణ తో 11 కథలతో ముందుకొచ్చింది. 

ముందుమాట రాస్తూ ప్రముఖ కవి రచయిత ఏనుగు నరసింహారెడ్డి "స్వామి లేడు. ఆయన కథలు ఉన్నాయి". స్వామి మరణించడం లేదు ఆయన కుటుంబానికి ఎంత పెద్దదో ఆయనకి సాహిత్యకారులకు అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. 

నేను గుడిపల్లి నిరంజన్ తప్పక ఓదయ్య నిర్వహించే
 జంబు సాహితీ వెలువరించే దళిత కథలలో డాక్టర్ మండల స్వామి గారి 'కాలం మారింది', 
'బతుకు గీత' రెండు కథలను ప్రచురించాం.
అట్లా వారితో సంభాషించడం. చర్చించడం. కథల గురించి కథ సాహిత్యం గురించి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడేవాడు.

SCERT ఉన్నతి శిక్షణా కార్యక్రమములో రాష్ట్రస్థాయి శిక్షణలో మాంటిసోరి లో ఐదు రోజులు వారితో ఉండే అవకాశం కలిగింది.

కుల్లం కుల్లం మాట్లాడతాడు. కపటం లేదు. కదిలిస్తే కన్నీళ్ళ చల్మా ఏరులై పారే మనస్తత్వం. నిప్పులు మింగిన నిజాల బాధలు పెల్లుబుకుతాయి.

సాగర సత్తన్న ఒట్టిచాపల పుస్తకం ఇవ్వడంతో ఇవన్నీ గుర్తుకొచ్చాయి. 
ఒక స్నేహితునిగా నేను వారి ఒట్టి చాపలు కథ చదివి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. వినండి. 

పుస్తకం కావలసినవారు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారిని 7989117415 అనే నెంబర్ ఫోన్ చేసి సంప్రదించండి.

(వీలు చూసుకుని మరో సమీక్షలో మరిన్ని వివరాలు రాస్తాను.)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి