సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

25, ఫిబ్రవరి 2023, శనివారం

10వతరగతి తెలుగులో పది పాయింట్లు సాధించాలంటే....

పదవ తరగతి తెలుగులో 10/10  సాధించాలంటే
తెలుగు.. మన మాతృభాష. 
 విద్యార్థులు సాధించడం చాలా సులువు అని భావిస్తున్నారు. కానీ 
అంత సులువైనది కాదని గమనించాలి.
 
ఇందులో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువే. కానీ.. తెలుగులో మంచి మార్కులు సాధించాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే! 

పరీక్ష పత్రాన్ని పరిశీలిస్తే ....

I. అవగాహన - ప్రతిస్పందన 20 మార్కులు


1. పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణం నుండి ఇస్తారు.
(1-5 ఒకటి నుండి ఐదు ప్రశ్నలు ఇస్తారు. జవాబులు ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాయాలి.
2. ఖాళీలు పూరించమని అడగవచ్చు.
3. తప్పొప్పులు గుర్తించమని ప్రశ్న ఇవ్వవచ్చు.
4. జతపరచమనవచ్చు.
5. సరియైన సమాధానానికి సరైన మార్కు పొందుకోవొచ్చు)

ఆ) 6వ ప్రశ్నగా పాఠంలోని చుక్క పద్యాల మీద అవగాహనను పరీక్షిస్తారు.

ఆరో ప్రశ్న ఎన్ని రకాలుగా వస్తుందో చూడండి.
  • పద్యాన్ని పూరించి భావాన్ని రాయమనడం
  • ప్రతిపదార్థాన్ని రాయండి (అన్వయ క్రమంతో, భాషా దోషాలు లేకుండా రాస్తే ఐదు మార్కులు)

ఇ) అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం నకు 10 మార్కులు 

(7, 8, 9, 10, 11 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున)
  • 10 పాయింట్ల సాధనలో ఈ భాగం చాలా కీలకం. 
  • అందరికీ తెలిసిన సుపరిచితమైన పద్యాన్ని అపరిచిత భాగం కింద ఇస్తారు.
  • అపరిచిత గద్యంలో భాగంగా పర్యావరణము, పరిశుభ్రత, విజ్ఞాన శాస్త్రాలు, సాహిత్యము, సంప్రదాయములు ఏదైనా ఒక అంశంపై పేరాగ్రాఫ్ ఇవ్వబడుతుంది.

 ఇందులో.....
  • ఐదు ప్రశ్నలు ఇస్తారు.
  • ఐదు ప్రశ్నలు తయారు చేయమంటారు.
  • తప్పు ఒప్పుల్ని గుర్తించమంటారు.
  • జతపరచమంటారు. 
  • ఖాళీలు పూరించమంటారు.
  • కీలక పదాలను వివరించమని కోరవచ్చు.
  • జవాబు ఒక వాక్యంలో రాయాలి (ఏకపద జవాబులకు మార్కులు స్కోర్ పొందలేరని గమనించాలి)
  • ఏరకంగా నైనా అడగవచ్చు.
  • సరిగ్గా రాస్తే పదికి పది మార్కులు వస్తాయి.

 II స్వీయ రచన - సృజనాత్మకత 40 మార్కులు 

అ) నాలుగు ప్రశ్నలు ఇస్తారు. (12,13,14,15)
ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు 12మార్కులు.
 5, 6 వాక్యాల్లో తప్పకుండా రాయాలి.
ఇందులో ఛాయిస్  లేదు.
పాఠ్యాంశంతో పాటు కవి, రచయిత గురించి లేదా శైలి గురించి ఖచ్చితంగా అడుగుతారు.

ఆ) భాగం: స్వీయరచన

  • పద్యభాగం నుండి(16,) రెండు ప్రశ్నలు 
  • గద్య భాగం నుండి (17)రెండు ప్రశ్నలు 
  • ఉపవాచకం నుండి (18)రెండు ప్రశ్నలు ఇస్తారు.
  • ఒక్కొక్క ప్రశ్నకు ఏడు మార్కుల చొప్పున మొత్తం 21 మార్కులు
ప్రతి భాగం నుండి  ఒక్క ప్రశ్నకు జవాబు రాయాలి.
ప్రతి జవాబు 10 నుంచి 12 వాక్యాలలో రాయాలి.
120 పదాల కంటే ఎక్కువ పదాలతో జవాబు రాయాలి.
సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉండాలి.
ప్రశ్నలు అనుసరించి జవాబు రాయాలి.
భాషా దోషాలు లేకుండా రాయాలి.
వాక్య క్రమం ఉండాలి.

ఇ) భాగం:
19వ ప్రశ్న 
సృజనాత్మక అంశాలు రెండు ఇస్తారు.
 7 మార్కులు.  ఒక్క ప్రశ్నకు సమాధానం 
ఒక ప్రశ్నకు జవాబు తప్పకుండా రాయాలి. 

ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న 22 సృజనాత్మక అంశాలలో ఏవైనా ఇవ్వవచ్చు.


  • లేఖ
  • వచన కవిత 
  • సంభాషణ 
  • ఏకపాత్రాభినయం 
  • ప్రశంసా పత్రం 
  • అభినందన వ్యాసం 
  • వ్యాసం
  • కరపత్రం 
  • ఆహ్వాన పత్రం
  • కథ 
  • గేయం 
  • ప్రశ్నావళి
  • నినాదాలు - సూక్తులు
  • కథలు పొడిగించడం
  • .....
  • మొదలైన అంశాలపై సృజనాత్మకంగా రాయాలి


III భాషాంశాలు 20 మార్కులు (పదజాలం & వ్యాకరణాంశాలు)

  • సొంత వాక్యాలు 
  • అర్థాలు 
  • ప్రకృతి - వికృతులు 
  • సమానార్థకాలు లేదా పర్యాయపదాలు 
  • వ్యుత్పత్తి అర్థాలు
  • వ్యుత్పత్తి పదం
  • జాతీయాల వివరణ
  • కర్తరీ, కర్మణీ వాక్యాలు
  • ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు 
  • సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు
  • గ్రాంథికం నుంచి వ్యవహార వాక్యం లోకి మార్చి రాయడం
.....

  • సంధులు 
  • సమాసాలు 
  • అలంకారాలు 
  • గణవిభజన మొదలైన ఇస్తారు.
  • ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.

**********

తెలుగులో పది/పది రావాలంటే
పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి. 
ప్రశ్న ఏ కోణం నుండి ఇస్తే ఆ కోణం నుంచి వివరించగలగాలి.

1. ఆవశ్యకత అంటే అవసరం గురించి రాయాలి. 

2. ఆంతర్యం లేదా ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు మనసులోని మాటగా వివరించాలి.

3. సొంత మాటల్లో రాయండి అంటే పాఠం యొక్క సారాంశం విద్యార్థి సొంత మాటల్లో రాయాలి.

4. వివరించుము అంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి.

5. సమర్థించుము అంటే 
ఏ పాత్ర లేదా? ఏ భావం అడుగుతున్నారో దానికి అనుగుణంగా సమర్థిస్తూ  రాయాలి. 

6. విశ్లేషణాత్మకంగా రాయండి అంటే 
ఒక్క పాత్ర మనస్తత్వ విశ్లేషణ అడిగితే ఆ పాత్ర  మనస్తత్వం మారడానికి గల పరిస్థితులు, అందుకు గల కారణాలు చెబుతూ 
మొదలైన అంశాలతో సమగ్రంగా రాయడమే విశ్లేషణాత్మకంగా రాయడం.

7. సోదాహరణంగా రాయండి అంటే...
ఉదాహరణలు ఇస్తూ రాయాలి.

8. ఊహించి రాయండి అంటే.... ఇచ్చిన అంశానికి అనుగుణంగా ఏం జరుగుతుందో, జరుగబోతోందో ఊహించి రాయాలి.

9. కారణాలు రాయండి అంటే....
కారణాలు రాయాలి.

10. విమర్శనాత్మకంగా రాయండి అంటే తప్పు ఒప్పుల నుంచి సకారాత్మక విమర్శ ఒప్పువైపు రాయాలి.

11. విశిష్టత తెలపండి అన్నప్పుడు గొప్పతనం గురించి రాయాలి.

12. అభినందిస్తూ వ్యాసం రాయండి అంటే పొగడుతూ గొప్పతనాన్ని మాత్రమే వివరిస్తూ రాయాలి

13. వృత్తాంతాన్ని రాయండి అనే ఉపవాచక ప్రశ్నకు జవాబుగా సంబంధిత కథ రాయాలి. 

14. పాఠం ఆధారంగా రాయండి.  అంటే  కేవలం పాఠం లోనిది మాత్రమే రాయాలి. 

*********"*
విద్యార్థులకు  సూచనలు: 
  • ప్రశ్న పత్రాన్ని క్షున్నంగా  చదవాలి.
  • ప్రశ్నను అర్థం చేసుకోవాలి. 
  • ప్రశ్నను అనుసరించి మాత్రమే జవాబు రాయాలి.
  • ప్రతి జవాబుకు ప్రశ్న సంఖ్య మరవకూడదు.(తప్పకుండా శీర్షిక పెట్టవచ్చు. దానశీలం పాఠ్యభాగ  సారాంశం రాయండి అనే ప్రశ్నకు దానశీలం పాఠ్య సారాంశం: అని రాయాలి. అలా  రాయడం వలన దిద్దే ఎగ్జామినర్ కి సులువుగా అర్థమవుతుంది)
  • ప్రతి వాక్యానికి 6,7 పదాలు రాయాలి. 
  • వాక్యాలు  సమదూర0 పాటించాలి.
  • ప్రతి విషయంపై  స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
  • పరీక్ష రోజు వరకూ వాటిని నిత్యం పునశ్చరణ / మననం  చేసుకోవాలి. 
  • పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. 
  • మైండ్ మాపింగ్ (భావనా చిత్రాన్ని) ద్వారా గుర్తించుకోవాలి.
  • ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యమైనది. 
  • కాబట్టి సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. 
  • ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి.
  • విరామ చిహ్నాలు పాటించాలి.
  • భాషా దోషాలు లేకుండా రాయాలి.
  • వాక్య క్రమం ఉండాలి.



ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన, శైలి, సందర్భము, స్థలం మొదలైన అంశాల సందేశాన్ని తెలుసుకోవాలి.


వ్యాకరణం.
సంస్కృత
తెలుగు సంధులు 
సమాసాలు
అలంకారాలు
చందస్సు
మొదలైన అంశాలపై బాగా పట్టు సాధించాలి


ఆల్ ది బెస్ట్.
కృషి ఉంటే విజయం నీ బానిస.
మరిన్ని అంశాల కోసం.....


Dixa app, Tsat టి‌వి, తెలుగు దళం .... 
siddenky.blogspot.com ని ఫాలో కాగలరు.
Telugu Siri Dr Siddenky yt channel
Subscribe చేసి ఫాలో కండి.

డా. సిద్దెంకి యాదగిరి 
తెలుగు భాషోపాధ్యాయులు
 సిద్దిపేట జిల్లా. DRG సభ్యులు 
9441244773. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...