సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

31, అక్టోబర్ 2023, మంగళవారం

ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు

  1. అ – ‌ ర ‌- తలకట్టు
  2. ఆ – ా – దీర్ఘం
  3. ఇ. – ి – గుడి
  4. ఈ – ీ – గుడి దీర్ఘం
  5. ఉ – ు – కొమ్ము
  6. ఊ – ూ – కొమ్ము ధీర్ఘం
  7. ఋ – ృ – ఋత్వం
  8. ౠ – ౄ – ఋత్వ ధీర్ఘం
  9. ఎ. – ‌‌ ె – ఎత్వం
  10. ఏ. – ే ‌- ఏత్వం
  11. ఐ – ై – ఐత్వం
  12. ఒ. – ొ – ‌ ఒత్వం
  13. ఓ. – ో – ఓత్వం (ఒత్వా పొల్లు)
  14. ఔ – ౌ – ఔత్వం
  15. అం – ం – సున్నా
  16. అః – ః – విసర్గ


1
***********************
క - కా : కాలు కారు కాలువ
గ - గా : గాలి గానం గాడిద
చ - చా : చాలు చారు
జ - జా: జారు జానకి జాతకం
ట - టా: టారెత్తు టాకా
డ - డా: డాక్టర్ డాడీ డాండాం 
త - తా: తాతా తాలు తారు రోడ్డు
ద - దా: దానిమ్మ దాచు దారి 
న - నా: నాగు నాలా నాకు నారు
ప - పా: పాము పాలు పారకం పానకం 
బ - బా: బాగు బాలురు బాలికలు బాధ
మ - మా: మాది మానేడు మారు అన్నం 
య - యా: యాది యాదగిరిగుట్ట
ర - రా: రాయి రాజు రాణి
ల - లా: లావు లాగు లారీ లాలన
వ - వా: వాగు వాన వాడు వారం‌ వాలి 
శ - శా: శాపం శాఖ 
ష -  షా: షాక్ 
స - సా: సాకు సాక సారు 
హ - హా: హారం హాలుడు హాననం
ళ -

2
*********
క - కి: కిరాణం కిటికీ కిరణం కివి
గ - గి:  గిరక గింజ గిన్నె గిన్నీస్ బుక్ 
చ - చి: చిలుక చిరుత చిక్కుడు
జ - జి: జింక జిలకర జిలుగు జిగురు
ట - టీ : టీకా టీం 
డ - డి :  డివైడర్, 
త - తి : తిరుగు తిరుపతి తినుట 
ద - ది: దినం దిక్కు దిశ దిగంబర 
న - ని: నిచ్చెన నిలబడు నిప్పు
ప - పి: పిలక పిచ్చుక పిల్ల పిలగాడు పిలుపు
బ - బి : బిడ్డ బియ్యం బిలము 
మ- మి: మిమ్ము   మిన్ను 
య - యి : 
ర - రి : రింగు రిమ్మనగూడ
ల - లి: లిఖిత లింగం 
వి - వి :  విగ్రహం విరహం వినుము
శ - శి: శిలా శిల్పి శిల్పం శిఖ
ష - షి : షికారు 
స- సి:  సిరి సింగిడి  సిద్ధం
హ - హి: హింస హిందీ 

3
***********************
క - కీ : కీలు కీలక కీర్తన కీడు కీటకం 
గ - గీ : గీరు గీత గీతిక గీయడం గీర
చ - చీ : చీమ చీర చీలిక చీకటి
జ - జీ : జీరా జీవనం జీతం జీవి జీకురు 
ట - టీ : టీకా టీవీ టీం 
డ - డీ : డీలు డీజీపి
త - తీ : తీయని తీరు తీగ తీరం తీపి
ద - దీ : దీవి దీవెన దీక్ష దీపం దీపిక
న - నీ : నీరు నీరా నీవు నీకు నీతి నీరసం నీరజ నీది నీలి
ప - పీ : పీచు పీరి పీలిక పీత పీట
బ - బీ : బీరతీగ బీదజనం బీజం బీజాపూర్
మ - మీ : మీద మీరా మీగడ మీనం మీడియా
య - యీ :
ర - రీ : రీతి రీలు రీము
ల - లీ : లీనం లీల 
వ - వీ : వీరు వీరుడు వీణ వీక్షణలు వీసం వీక్షిత
శ - శీ : శీర్షిక శీర్షము శీతాకాలం
ష - షీ : షీలా 
స - సీ : సీమ సీలు సీత సీసం
హ - హీ : హీనం హీనా హీరా
క్ష - క్షీ : క్షీణము క్షీరం

4
*****************
క - కు:  కుడి కుర్రాడు కుమ్మరి కునుకు కుడక
గ - గు : గుర్రం గుండె గుడి గుట్టు గుట్ట గురక 
చ  - చు: చుక్క చుట్టూ చుట్ట 
జ - జు : జున్ను జుట్టు జుడాయిజం 
ట - టు: టుగాగమ సంధి
డ - డు: 
త - తు : తుమ్మ తుంటరి తురుము తులారాశి తుట్టేపురుగు తునికాకు
ద - దు : దుక్కి దురద దున్నపోతు
న - ను: నురుగు, నులిపురుగు నులివెచ్చని నుడువుట (చెప్పుట) నుడికారం (మాట స్వభావం)
ప - పు: పురం పుట్ట పురుగు పులమడం పుచ్చుకొను పుచ్చకాయ
బ - బు:  బుట్ట బుక్కు బురద 
మ - ము:   ముక్క ముక్కెర ముక్కు మునగాకు మునగడం
య - యు:
ర -రు: ఋషి రుక్కు
ల - లు: 
వ - వు:
శ - శు: శుచి  శుక్రుడు శుభ్రత
స -సు: సుశీల సురక్ష సునీత సుకుమారుడు
హ- హు: హుక్క హుషారు 
క్ష - క్షురకత్తి

********************
5
క- కూ: కూత కూరాడు కూర్పు కూల్చుట 
గ - గూ: గూడు గూన గూడూరు
చ - చూ: చూడు చూరు చూళిక
జ - జూ: జూటం జూకాలు 
ట - టూ : టూర్ 
డ - డూ: 
త - తూ : తూర్పు తూలుట తూనీగ 
ద - దూ : దూరం దూలం దూకుట
న - నూ : నూరు నూలు నూనె 
ప - పూ: పూలు పూరించుట
బ - బూ: బూరుగుపల్లి బూర
మ - మూ: మూలగడం మూల మూలకం
య - యూ:
ర - రూ : రూపం రూడి రూకలు 
ల - లూ: లూలుమాల్
వ - వూ: 
శ - శూ : శూరుడు శూలం 
ష - షూ : 
స - సూ: సూర్యుడు 
హ -హూ: హూనం హుంకరించు
ళ - ళూ :
క్ష - క్షూ : 
హ - హూ: హూనం 

*******************
6
క - కృ : కృతి కృపాణము కృతజ్ఞత కృష్ణుడు
గ - గృ : గృహము గృహిణి
చ - చృ:
జ - జృ : జృంభన 
ట - టృ :
డ - డృ : 
త - తృ : తృష్ణ తృప్తి  తృణీకరణ
ద - దృ : దృష్టి దృతి దృక్పథము దృక్కోణము 
న - నృ : నృసింహ నృత్యం నృపాలుడు నృపాలుడు 
ప - పృ : పృథ్వి
బ - బృ : బృందం బృహన్నల బృహస్పతి బృహత్ బృహదీశ్వరాలయం 
మ - మృ : మృగము మృత్తిక  మృదుల మృగరాజు మృణాళిని మృదంగం 
య - యృ :
ర - రృ :
ల - లృ :
- వృ : వృధా వృక్షము వృత్తం వృశ్చికము వృత్తాంతము వృద్ధుడు వృకోదరుడు
శ - శృ : శృతి శృంగం శృంఖలం 
ష - షృ :
స - సృ : సృష్టి సృజన
హ - హృ: హృదయం హృత్తు 
- ళృ :
క్ష - క్షృ :

*******************
7
ౠక
క - కౄ: కౄరుడు 
గ - గౄ :
చ - చౄ :
జ - జౄ : 
ట - టౄ :
డ - డౄ : 
త - తౄ : మాత్రూణం
ద - దౄ : చిద్రూపం
న - నౄ:
ప - పౄ :
బ - బౄ :
మ - మౄ:
య - యౄ:
ర - రౄ :
ల - లౄ:
వ - వౄ:
శ - శౄ :
ష - షౄ :
స - సౄ :
హ - హౄ :
- ళౄ :
క్ష - క్షౄ :

*******************
8
క - కె  : కెంపు కెరటం 
గ -  గె :  గెలుపు గెల 
చ - చె : చెరుకు, చెదలు, చెప్పులు 
జ - జె : జెగ్గు, జెన్నీ 
ట- టె  : టెంకాయ, 
డ - డె :  డెందం డెంగ్యూ, డెన్మార్క్ 
త - తె : తెరచాప తెలుగు తెనుగు 
ద - దె  : దెస 
- నె   : నెపం, నెనరు, నెచ్చలి నెమలి నెమ్మది
ప - పె : పెనం, పెరుగు, పెరూ దేశం 
బ - బె : బెండకాయ, బెదిరింపు, బెబ్బులి
మ - మె: మెరుపు, మెద, మెరుగు
య - యె:
ర - రె: రెండు రెక్క రెళ్ళు రెమ్మ 
ల - లె: లెమ్ము లెక్క 
వ - వె: వెలుగు వెంకన్న వెన్నుడు 
శ - శె 
- షె :
స - సె : సెలుక 
హ - హె 
ళ - ళె:
క్ష - క్షె :
*******************
క - కే : కేరళ కేసు కేక్ 
గ - గే : గేలి గేయం గేరు 
చ - చే: చేను, చేపలు, చేదు
జ - జే: 
ట - టే : టేకు టేపు 
డ- డే : 
త - తే : తేది, తేలు, తేలిక తేనె తేకువ 
ద - దే : దేవుడు దేశం 
న- నే : నేల నేను
ప - పే : పేరు పేగు పేలు పేక 
బ - బే : బేడ
మ - మేక మేలు మేధా మేఘం మేం మేడం 
య- యే: 
ర - రే: రేయి రేణుక రేగు రేలా రేవతి రేఖ
ల- లే : లేమి లేమ లేఖ లేక లేబరీ లేను
వ - వే : వేసవి వేగురు వేణి
శ- శే : శేరు 
ష- షే: 
స- సే: స్నేహం, సేవకుడు సేకరణ సేమ్యా 
హ - హే : హేళన హేతువు హేమ హేమంత ఋతువు
ళ- ళే:
క్ష - క్షే : క్షేత్రం

************************
10
క- కై: కైక  కైత కైలాట్కమ్ 
గ - గై: గైకట్టే 
చ - చై : చైత్ర చైతన్య 
జ - జై : జైత్ర యాత్ర 
ట- టై : టై టైం
డ- డై :  డై డైనింగ్ డైనింగ్ 
త - తై : తైదలు తైలం 
ద - దై : దైవం దైనందిన 
- నై : నైట్రైట్ నైలు నైషధం 
ప - పై : పైకం, పైరు పైన 
బ - బై : బైడెన్ బైక్ 
మ - మై : మైనం మైకు మైళ్ళు మైల
య - యై:
ర - రై : రైలు రైక రైల్వే 
ల - లై : లైలా లైకా లైక్ 
వ - వై : వైరా వైతేరని వైదేహి వైద్యం వైరు 
శ - శై : శైలజ శైలి శైవం
- షై 
స - సై : సైగ సైకిల్ సైంధవుడు 
హ - హై : హైలెస్సా హైమ హైదరాబాద్ హైందవులు
- ళై :
క్ష - క్షై :

*******************
11
క - కొ : కొంగ కొక్కెర కొమ్ము కొడుకు 
గ - గొ : గొంగడి 
చ - చొ : చొప్పున చొప్పదండి చొక్కా 
జ - జొ : జొన్న 
ట- టొ : టోకరా 
డ- డొ : 
త - తొ : తొండం తొండి తొమ్మిది 
ద - దొ : దొంగ దొండ దొర 
న - నొ :  నొసలు 
ప - పొ : పొగరు పొలం పొద పొన్న చెట్టు 
బ - బొ : బొంకు బొమ్మలు బొక్క 
మ - మొ :మోడెమ్ మొండెం మొగ్గ మొక్క మొలక 
య - యొ :
ర - రొ : రొక్కం రొద 
ల - లొ : లొల్లి 
- వొ 
శ - శొ : శొంఠి 
ష - షొ 
స - సొ: సొద సొక్కం 
- హొ : హొళియ 
- ళొ :
క్ష - క్షొ :
*******************
క- కో   : కోడి కోతి కోలాటం కోలాహలం
గ - గో  : గోలెం గోరువెచ్చని గోరింక గోధుమ
చ - చో : చోటు
జ - జో : జోరు జోకటం జోల జోగి 
ట- టో  : టోకు టోల్ గేటు టోకరా
డ- డో   : డ్రోను డోము
త - తో : తోక తోలు తోరణం
ద - దో  : దోరా 
న - నో  : నోరు 
ప - పో  : పోరు పోకలు
బ - బో  : బోనము బోలుకడెం
మ - మో: మోకాలు మోర మోకా 
య - యో:
ర - రో    : రోలు రోకలి రోత రోసిపోవుట
ల - లో  : లోకం లోహిత లోలకం
వ- వో   :
శ - శో   :
ష- షో   : కాష్మోరా
స - సో  : సోయి సోంపు సోగ్గాడు
హ- హో : హోరు హోలీ హోమారు
ళ- ళో    :
క్ష - క్షో    : క్షోభ


12
క - కౌ  : కౌలు కౌరవులు
గ - గౌ  : గౌరీ గౌరవం గౌడు 
చ - చౌ : చౌరస్తా
జ - జౌ : జౌలి 
ట -  టౌ : 
డ - డౌ : 
త - తౌ : తౌరఖ్యాంధ్రము
ద - దౌ : దౌడు
న - నౌ : నౌక
ప - పౌ 
బ - బౌ : బౌ బౌ
మ - మౌ : మౌకలి
య - యౌ 
ర - రౌ  : రౌలత్ చట్టం
ల - లౌ :
వ - వౌ :
శ - శౌ :
- షౌ :
స - సౌ : సౌకర్యం
హ - హౌ : హౌరా బ్రిడ్జి
ళ - ళౌ :
క్ష - క్షౌ : క్షౌరం 

*******************
.

*******************
14.
క- :
గ - :
చ - :
జ - : 
ట-  :
డ- : 
త - :
ద - :
:
ప :
బ :
మ :
య :
ర :
ల :
:
శ :
:
స :
:
:
క్ష - :
*******************
15.
క- :
గ - :
చ - :
జ - : 
ట-  :
డ- : 
త - :
ద - :
:
ప :
బ :
మ :
య :
ర :
ల :
:
శ :
:
స :
:
:
క్ష - :
*******************


******************

_*💫 పదప్రయోగాలు ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. మనం చేసే చాలా పదప్రయోగాలు, పుస్తకాలు_* *_చదివినవే మర్చిపోతున్నాం. ఇన్ని జంట పదాలకూ మీకు వాడుక తెలుసు. తెలుసు కదా !?_* 👇

1.కలకల. 
2.కిలకిల.
3.గలగల. 
4.విలవిల. 
5.వలవల. 
6.మలమల. 
7.వెలవెల. 
8.తళతళ. 
9.గణగణ. 
10.గునగున 
11.ధనధన. 
12.ఝణఝణ. 
13.కణకణ. 
14.గడగడ. 
15.గుడగుడ. 
16.దడదడ. 
17.కిటకిట. 
18.గటగట. 
19.కటకట. 
20.పటపట. 
21.కితకిత
22.గిలిగిలి. 
23.కిచకిచ. 
24.జిబజిబ. 
25.చకచక. 
26.పక పక. 
27.మెకమెక 
28.బెకబెక. 
29.నకనక. 
30.చురచుర. 
31.చిరచిర. 
32.బిరబిర. 
33.బురబుర. 
34.పరపర. 
35.జరజర. 
36.కరకర.  
37.బరబర. 
38.చరచర. 
39.గజగజ. 
40.తపతప. 
41.టపటప. 
42.పదపద. 
43.గబగబ. 
44.గుసగుస. 
45.కువకువ.
46.ఠవఠవ. 
47.చిమచిమ. 
48.గురగుర. 
49.కొరకొర. 
50.భుగభుగ. 
51.భగభగ. 
52.ఘుమఘుమ. 
53.ఢమఢమ. 
54.దబదబ. 
55.కుహుకుహు. 

*_అందుకే దేశ భాషలందు తెలుగులెస్స._*

*_తెలుగును బ్రతికించుకుందాం !తెలుగులోనే మాట్లాడుకుందాం !_*

*_ రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి..._*


26, అక్టోబర్ 2023, గురువారం

VI. 6. పోతన బాల్యం

పోతన బాల్యం 
-డా. వానమామలై వరదాచార్యులు

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం 'కావ్య' ప్రక్రియకు చెందినది. కావ్యము అనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా. వానమామలై వరదాచార్యులు రచించిన 'పోతన చరిత్ర' అనే మహాకావ్యం లోని ప్రథమ శ్వాసము నుండి తీసుకోబడింది.

కవి పరిచయం
కవి పేరు డాక్టర్ వానమామలై వరదాచార్యులు
జననం : 16 .8 .1912
మరణం : 30 .10. 1984.
కాలం : 20వ శతాబ్దం
జన్మస్థలం: వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండ గ్రామం.
స్థిర నివాసం : మంచిర్యాల జిల్లా చెన్నూరు.
బిరుదులు:  అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి.
రచనలు:  పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము, వ్యాసమనణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి).
పురస్కారాలు : 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం. 
2. వారణాసి వారి విద్యా వాచాస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు

I

కం. తిప్పన సౌభ్రాత్రమ్మన న 
ప్పురిఁ గల చిన్న పెద్ద లందరికిఁ గడున్ మెప్పనుజునకన్న యనన్ 
గొప్పగుఁ దమ్ముఁ డన నన్నకున్ బ్రాణంబౌ. . 1
1. తిప్పన, పోతనలు అన్నదమ్ములు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ, తిప్పన తన తమ్ముడైన పోతనమీద చూపే సోదరభావంతో ఊరిలో అందరికి ఆదర్శంగా నిలిచాడు. అన్న అంటే పోతనకూ గౌరవం. తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు.

సీ. తన కెవ్వ రేదేని తినుబండ మిడిరేని 
యనుజుని కిడక తిప్పన తినండు 
అనుజన్ము నెవ్వ రేమనిన తా నడ్డమ్ము 
వచ్చు మై నీఁగను వ్రాలనీఁడు
గడియసేపింటఁ దమ్ముఁడు గానరాకున్న 
వెదకుఁ గన్పడుదాఁక వెతసుజెందుఁ 
తన ప్రాణమున కెంతయును గూర్చు వస్తువే 
నవరజుం డడిగినయంత నొసఁగు.

తే. భోజన మొనర్చు తఱి నిద్రబోవు వేళ 
లందును యవీయసుఁడు తన యండ నుండ 
వలెను దగవులాటననేమొ తెలియ రనఘ 
గుణులు సోదరుల్ రామలక్ష్మణులు మణులు. 2
భావం. 2. తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండ తిప్పన తినడు. తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఈగను కూడ వాలనీయడు. కొంచెంసేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలుపెడ్తాడు. కనిపించిందాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చి వేస్తాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు. వారు మణులు, రామలక్ష్మణుల వంటివారు.

*కం. తిప్పిన చదివెడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరి పోతన తా 
విప్పక పొత్తము నొప్పం 
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. 3

3. తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్ధంచేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు.

****************************
ఆలోచించండి- చెప్పండి.

'తమ్మునిమీద ఈగను వాలనీయడు' అంటే మీకేమర్థమయింది?

అన్న తన తినుబండారాలు తమ్మునికి ఇచ్చాడు. ఇట్లా తమ్ముని కోసం అన్న ఏమేమి చేయవచ్చు?

'తిప్పన పోతన' లకు తగువులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు అన్నదమ్ముళ్ళతోటి లేదా అక్కజెల్లెళ్ళతోటి ఎట్లా ఉంటారు?
************************
II
ఆ. దూఁకు లెగురు లందుఁ దొండు మెండుగఁబడి సరకుఁగొనఁడు లేచి యుఱుకు నపుడె 
యరరె! భూమి ప్రక్కలయ్యె నండ్రా యుక్కు 
బాలు పాటుగాంచి ప్రక్కవారు.
4. పోతన ఆటలాడుతూ, దుంకుతూ, ఎగురుతూ ఉన్నప్పుడు కిందపడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరుగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి 'అరెరే... ఈ ఉక్కులాంటి పిల్లవాడు పడితే భూమియే ముక్కలయిందే!' అని అంటారు.


*
ఉ. ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడె సాటి కొ 
ట్లాటను బాలు రంద దొకటైన దిర్చెడి ధాటి, తీయగా
 బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో 
మోటముఁ గొంకుజంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.


* 5. ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైనా ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు, తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటీ. మొగమాటం, భయం, వెనకడుగు వేయడమంటూ ఎరుగడు.

చ. గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం 
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూ తా 
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
 చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.6
6. గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీకూడా గురితప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు 'పటుక్కని' పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరు గుండెలమీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.
****************************
ఆలోచించండి- చెప్పండి.

పోతనను 'ఉక్కు బాలుడు' అని కవి ఎందుకు అనవలసివచ్చింది?

పాడటంలో పోతనను కోకిలతో పోల్చాడు కదా! ఇంకా వేటిని వేటితో పోల్చవచ్చు?

(ఉదా : నడకను, మాటను, కళ్ళను, మనస్సును, ముఖాన్ని, చేష్టలను)

'వీడు అసాధ్యుడు!' అని ఎవరినైనా, ఏయే సందర్భాల్లో అంటారు?
*****************************
III

ఆ॥వె॥ కోఁతివోలెఁ జెట్ల కొనఁగొమ్మ లెగబ్రాకుఁ 
బక్షివోలెఁ గ్రిందఁబడఁగ దూఁకుఁ 
గాలు భూమిపైన గడియైన నాఁగదు 
పాదరసము గలదొ పాదయుగళి ! 7
7. కోతివలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. పక్షివలె కిందికి దుంకుతాడు. భూమి మీద కాలు క్షణమైన నిలువదు. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో? (పాదరసం నిలకడగా ఉండదు.)

కం. గుడికిఁ జను జననిఁ గని వెం 
బడిఁబడి చను జదువుకొనెడి బడి విడియైనన్ 
బడి పడి జేజే లిడు న 
య్యెడ నెడమయుఁ గుడియు ననక నెంతయు భక్తిన్. 8
8. అమ్మ గుడికి పోతుంటె, పోతన బడికి పోకుండ అమ్మవెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. (తన పరిసరాలను పట్టించు కోకుండా దేవునిపైనే దృష్టిపెడుతాడని భావం.)

*తే॥గీ॥ సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు
 హరికథాపురాణ శ్రవణాభిరతియు 
శంభుపద సరోజార్చ నాసక్తమతియుఁ 
బెరుగసాగె వేరొకప్రక్క బిడ్డ యెడద.9

9. మరోవైపు పోతన మనసులో సాధుసజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదపద్మాలను పూజించాలనే ఆసక్తి పెరుగసాగింది.

****************************
ఆలోచించండి-చెప్పందడి..

“దూకుతున్నాడ”న్నారు కదా! ఇవి కాక ఇంకా పిల్లలు ఏయే చేష్టలు చేస్తారో చెప్పండి?

'పెరుగసాగె వేరొక ప్రక్క బిడ్డ యెడద' అంటే మీకేమి అర్థమయింది?
***************************
ఇవి చేయండి.

ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం కింది పద్యం చదవండి భావంలోని ఖాళీలు పూరించండి.
 
కందుకం వోలే సుజనుడు 
క్రిందంబడి మగుడమీదికి న్నెగయు జుమీ
మందుండు ముత్పిండం వలె 
క్రిందపడి యడగి యుండు గృపణత్వమునన్
ఖాళీలు
అ)కింద పడ్డ పైకి లేచేవాడు  సుజనుడు.
ఆ) అపజయం పాలైన తిరిగి విజయం సాధిస్తాడు.
ఇ) మందుడు అంటే బుద్ధిహీనుడు.
ఈ) బంతితో పోల్చబడినవాడు సుజనుడు.
ఉ) మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదం - మృత్పిండము.

III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలు జవాబులు రాయండి.

అ) ఊళ్లోని పెద్దలందరూ అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునేవారు మీ చుట్టుపక్కల వారు మెచ్చుకునేటట్లుగా నువ్వేం చేస్తావు?
జవాబు: తిప్పన పోతనలు అన్నదమ్ములు తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపి సోదరా భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నేను మా తమ్ముడు మీద మా చెల్లెలు మీద తిప్పన కురిపించిన ప్రేమను కురిపిస్తాను. తిప్పన పోతనలు ఎలా ఉన్నారో నేను మా అన్నదమ్ములం అలాగే ఉంటాము.


ఆ) 'కాళ్లలో పాదరసం' అంటే మీకేం అర్థమైంది?
జవాబు: పాదరసం అనగా నిలకడగా ఉండని స్వభావం గలది. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. నిలకడగా ఉండదు. చంచలమైన మనస్తత్వం కలిగిన వారిని పాదరస స్వభావం గలవారు అని కూడా అంటారు.

ఇ) 'తిప్పన - పోతన' లను రామలక్ష్ములతో ఎందుకు పోల్చారు?
జవాబు: తిప్పల పోతనలిద్దరూ అన్నదమ్ములు. ఒక్కరిని విడిచి ఒకరు ఉండలేరు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. పోతనకు అన్న అంటే అమితమైన ప్రేమ. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తమ్ముడు కనబడకపోతే అన్న వెతుకుతాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలని అనుకుంటాడు. కొట్లాటలు అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు గలవారు. మంచి స్వభావం కలిగిన వారు. వారు మణులు రామలక్ష్మణుల వంటి గుణగణాలు కలిగిన వారు. కావున వారిని రామలక్ష్మణులతో తో పోల్చారు.

ఈ) ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు: పోతన బాల్యం రాసిన కవి పేరు వానమామలై వరదాచార్యులు వీరు మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరవాసం ఏర్పరచుకున్నారు. వీరి బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి అనునవి. వీరి రచనలు పోతన చరిత్రను మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము,ఢ వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ(బుర్రకథలు) సంపుటి గ్రంథాలు రచించాడు.

2. ఈ క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు: పోతన బాల్యం.
పోతనకు తన అన్న తిప్పన అంటే ప్రాణం అమితమైన గౌరవం మర్యాద. తిప్పన తెలివిగలవాడు. ఏదైనా పద్యం తిప్పన చదువుతుంటే దాన్ని పోతన వినగానే అర్థం చేసుకునేవాడు. ఆ పద్యం యొక్క సారాంశాన్ని త్వరగా చెప్పగలిగేవాడు. పోతన విద్యలోనే కాదు వినయంలోనూ వివేకంలోనూ మంచి గుణాలు అలవర్చుకున్నాడు. ఆటపాటల్లో ఆరితేరిన వాడు. చదువులో తనకు తానే సాటి. ధైర్య సాహసాలలో శక్తివంతుడు. శ్రావ్యమైన పాటలు పాడేవాడు. మొగమాటము భయము వెనుకడుగు వేయడం అంటూ తెలియనివాడు. చెట్లు ఎక్కడంలో కోతులు మించిన నైపుణ్యం గలవాడు. పక్షుల కిందికి దూకేవాడు. ఉడతవలే పైకి ఎగబాకే వాడు. ఆయనకు భూమి మీద కాలు క్షణమైన నిలిచేది కాదంటే సందేహం లేదు. తన తల్లితో పోతన కూడా గుడికి వెళ్లేవాడు. దేవునికి నమస్కారాలు చేసేవాడు. సాధువులు సజ్జనులను దర్శించాలని ఉత్సాహం కలిగి వారితో సాంగత్యం చేసేవాడు. హరికథలను, పురాణాలను చిన్నప్పటి నుంచే వినడం మొదలైంది. శివ పూజ అంటే ఆసక్తి ఎక్కువ.

V. సృజనాత్మకత / ప్రశంస
పోతన తన బాల్యంలో ఆడుకునే ఆటలు తెలుసుకున్నారు కదా అట్లాగే మీరు ఆడుకునే ఆటలు ఏవి ఆటలు ఎందుకోసం ఆడాలో వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు: నేను ఆడుకునే ఆటలు కబడ్డీ వాలీబాల్, రింగ్ బాల్,  షెటిల్ కాక్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, ఖో ఖో గోలిలాట మొదలైనవి.
ఆటలు ఎందుకోసం ఆడాలి. మనోవికాసానికి అవి ఉపయోగపడతాయి. వ్యాయామం జరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎలా ఆడాలో, ఎలా ఆడకూడదో సమయస్ఫూర్తి అలవడుతుంది.

లేదా

పోతన ఆడుకునేటప్పుడు చూసిన వాళ్ళు "ఈ బాలుడు అసాధ్యుడు" అని అనుకునేవారు కదా! మరి ఇప్పుడు ఆడుకునే పిల్లలు చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు: 
రంగయ్య: రామయ్య నేటి పిల్లలు ఆటలు ఆడడమే లేదు. నిత్యం సెల్ ఫన్లు టీవీలు చూసుకుంటా ఊబకాయంతో బాధపడుతున్నారు చూసావా?
రామయ్య : నిజమే రంగయ్య అమ్మ మనుమడు మనుమరాలు ఇద్దరూ అంతే ఎప్పుడు ఆడాలని చూడరు ఎలా మరి వీరితో
 రంగయ్య: ప్రమాదకరమైన ఆటలు ఆడతారు
 రామయ్య: నిజమే ప్రమాదకరమైన ఆటలు ఆడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది





V. పదజాల వినియోగం
కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు పాఠంలో వెతికి రాయండి.
ఉదా భారతీయులు సోదర భావం కలిగి ఉంటారు సౌబ్రాత్రము
అ) లక్ష్మీ పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది       జవాబు : పొత్తం
ఆ)అర్జునుడు విలువిద్య యందు అధిపుడు       జవాబు : గొప్పవాడు
ఇ) బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు       జవాబు: అన్న లేదా తమ్ముడు
ఈ)  ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం గా ఉంచుకోవాలి.       జవాబు : దేహం

2. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి.
అ) భోజనం - భోనం 
ఆ) నిదుర - నిద్ర 
ఇ) పొత్తం - పుస్తకం

3. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
అ) అనుజుడు 
జవాబు : మా అనుజుడు చిత్రలేఖనంలో, సంగీతంలో ప్రావీణ్యుడు.
ఆ) గొంకు జంకులు : గొంకు జుంకులు లేకుండా ప్రసంగిస్తేనే వక్తలవుతారు.
జవాబు : ఎలాంటి సమస్య వచ్చినా నేను గొంకు జంకు  లేకుండా మాట్లాడగలుగుతాను.
ఇ) మేటి :
జ. చదువులో ఆటలలో పాటలలో నేనే మేటి
ఈ) ఆసక్తి 
జవాబు: చదువు యందు నాకు ఆసక్తి ఎక్కువగా ఉన్నది.
ఉ) వెత 
జవాబు: వెత చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది
ఊ) అసాధ్యుడు 
జవాబు: కార్యదీక్షత కలిగిన వారు అసాధ్యులు.
4. క్రింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలునే వారిని కింద గీత గీయండి.
అ) పురము, పట్టణము, నగరం
ఆ) ధరణి, రైతు, అవని
ఇ) కోతి, కపి, వానరం 
ఈ) గుడి, కోవెల, దేవాలయం.

VI. భాషను గురించి తెలుసుకుందాం
కింది పట్టిక లోని పదాలు చదివి పుంలింగ, స్త్రీ లింగ పదాలను ఏకవచన బహువచనాలను అవ్యయాలను గుర్తించండి.
1. కింది పట్టికలోని పదాలు చదువి పుంలింగ , స్త్రీ లింగ పదాలను, నపుంసక లింగ పదాలను, ఏక వచన - బహువచనాలను,  అవ్యయాలను గుర్తించండి.
అ) పుంలింగ పదాలు :  సుధాకర్ చంద్రుడు బలరాం అతడు
ఆ) స్త్రీ లింగ పదాలు : రచయిత్రి, నటి, సీత ఆమె
ఇ) నపుంసక లింగ పదాలు : పుట్ట పత్రిక  
ఈ) ఏకవచనం : పత్రిక, డబ్బా, ఉంగరం, బల్ల
ఉ) బహువచనం : బాలురు, మహిళలు, ఆటలు, రచనలు 
ఊ) అవ్యయం: ఆహా, శభాష్, అట్లని, అమ్మో

2. కింది వాటిని జతపరచండి
అ) నామవాచకం ( జ ) హైదరాబాద్ 
ఆ) సర్వనామం.   ( గ ) ఆమె 
ఇ) విశేషణం.       ( ఘ) ఎర్రని 
ఈ) క్రియా            ( క ) చదివింది 
ఉ) అవ్యయం      ( ఖ ) కానీ

3. కింది ఖాళీలను పూరించండి 
అ) నామవాచకానికి లేదా సర్వ నామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం
ఆ) నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం 
ఇ) పనిని తెలిపే మాట క్రియా
ఈ) లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము 
ఈ) పేరు తెలిపే పదం నామవాచకం.

ప్రాజెక్టు పని : మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయండి వారి గురించి ఏమనిపించిందో మీ అనుభవం రాయండి ప్రదర్శించండి.





VI. 5. శతకసుధ

VI. 5. శతక సుధ



ప్రశ్నలు

1. పై బొమ్మలో ఎవరెవరున్నారు?

2. గురువుగారు ఏం చెప్తున్నారు?

3. మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి.

పాఠం ఉద్దేశం
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం 'శతక' ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్ధం. కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీతాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలున్నాయి.

కవి పరిచయాలు
1. సుమతి శతకం- బద్దెన
లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన సుమతి శతకంతోపాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు.
(13వ శతాబ్దం)

2. శ్రీకాళహస్తీశ్వర శతకం- ధూర్జటి
మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడ ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతోపాటు శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. 'అతులిత మాధురీమహిమ' కలిగినవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు.
(16వ శతాబ్దం)


3. కుమారి శతకం- పక్కి వేంకట నరసింహకవి
పక్కి వేంకట నరసింహకవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వేంకట నరసింహకవి సులభరీతిలో చెప్పాడు.
(17వ శతాబ్దం)

4. సుభాషిత రత్నావళి - ఏనుగు లక్ష్మణకవి
సంస్కృతంలో భర్తృహరి రాసిన 'సుభాషిత త్రిశతి'ని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణకవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానం లోని పెద్దాడ గ్రామనివాసి. సుభాషిత రత్నావళితోపాటు రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగామాహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన, రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి.
(18వ శతాబ్దం)

5. ప్రభుతనయ శతకం - కౌకుంట్ల నారాయణరావు
కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డిజిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయా! అనే మకుటంతో ఈయన రాసిన 'ప్రభుతనయ శతకం' చాలా ప్రసిద్ధి చెందింది.
1883-1953

6. గాంధీతాత శతకం - శిరశినహల్ కృష్ణమాచార్యులు
శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా 'మోర్తాడ్' లో జన్మించాడు. కోరుట్లలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరుపొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు 'రత్నమాల' అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన 'అభినవ కాళిదాసు' అనే బిరుదుపొందాడు.

7. *భరత సింహా శతకం సూరోదు బాల నరసింహాచారి 
సూరోజు బాలనరసింహాచారి నల్లగొండజిల్లా చిన్నకావర్తి గ్రామానికి చెందిన వాడు. కవితాకేతనం, బాలనృసింహశతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. 'సహజకవి' గా ప్రసిద్ధుడు.
9.5.1946 2.2.2014

8. భవ్యచరిత శతకం - డాక్టర్ టి.వి. నారాయణ
డా|| టి.వి. నారాయణ హైద్రాబాద్ జిల్లాకు చెందినవాడు. 26.07.1925 లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవనవేదం, అర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం (కవితాసంపుటి) అమరవాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాససంపుటి) మొదలైనవి ఈయన రచనలు.


విద్యార్థులకు సూచనలు

* పాఠంలోని బొమ్మలను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
* పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.
* అర్ధంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.
* పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు అర్థాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.

ప్రవేశిక
జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము.
అట్లా తెలుసుకున్న విషయాల్లో మంచివాటిని భవిష్యత్తు తరాలవారికి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడ కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతకపద్యాల రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం.

I

* కం|| పరనారీ సోదరుడై 
పరధనమున కాసపడక పరులకు హితుడై 
పరులు దనుఁ బొగడ నెగడక
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!
                                - బద్దెన
1. మంచి బుద్ది కలవాడా! ఇతర స్త్రీలకందరికీ సోదరునిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడవద్దు. ఇతరుల మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తనపై కోప్పడ్డా తాను వారిమీద కోప్పడకుండా ఉండాలి. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు.

* మ॥ కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై 
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్ 
వడిసెం బుత్రులులేని యాశుకునకుం బాటిల్లెనే దుర్గతుల్ 
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! 2
                 - ధూర్జటి

2. శ్రీకాళహస్తీశ్వరా! 'నాకు కొడుకులు పుట్టలేదే' అని తెలివిలేనివారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రునకు ఏ మేలూ జరుగలేదు. అదే శుకమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంతమాత్రాన ము లభించకపోవడం జరుగదు.

ఆలోచించండి - చెప్పండి
* ఇతరులు తనను పొగిడితే పొంగి పోకుండా ఉండాలని కవి అన్నాడు. కదా! అట్లా ఎందుకన్నాడో. చెప్పండి.
* నూర్గురు కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరుగలేదు. అదెట్లాగో చెప్పండి.

II
* కం॥ చెప్పకు చేసిన మేలు నొ 
కప్పుడయినఁగాని దాని హర్షింపరుగా 
గొప్పలు చెప్పిన నదియును 
దప్పేయని చిత్తమందు దలపు కుమారీ! 3
                -పక్కి వేంకట నరసింహకవి

3. ఓ కుమారీ! నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవ్వరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో.

* ఉ. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా 
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా 
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ 
పౌరుష వృత్తు లిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్ 
     - ఏనుగు లక్ష్మణకవి.
4. కాలిన ఇనుముమీద నీళ్లుపడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకుమీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా (ముత్యాలుగా) మారుతాయి, మనిషి అధములతో చేరితే అధముడౌతాడు. మధ్యములతో చేరితే మధ్యముడౌతాడు. ఉత్తములతో చేరితే ఉత్తముడౌతాడు.

* కం॥ వాదంబు లాడకెప్పుడు. 
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్ 
భేదంబు సేయకెన్నడు 
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా! 5
        - కౌకుంట్ల నారాయణరావు

5. ఓ తనయా! ఎప్పుడూ అనవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరిపట్ల భేదభావం చూపకు. మంచివారికి సేవ చెయ్యి.
-------------------------------------------------------------------

 ఆలోచించండి - చెప్పండి
* చేసిన మేలును చెప్పుకోవద్దని కవి' ఎందుకు అని ఉండవచ్చు?

* వాదములాడవద్దని కవి అన్నాడు. కదా! వాదము లాడడంవల్ల కలిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి?
------------------------------------------------------------------
* కం॥ మానవుడె మాధవుండను. 
జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియె నీ 
మానవతలోని మాన్య 
స్థానంబనె గాంధీతాత సద్గుణజాతా! 6
                       -శిరిశినగల్ కృష్ణమాచార్యులు
6. 'మంచిగుణాలు కలవాడా! మనిషే భగవంతుడు అనే ఆలోచనతో ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నతస్థానం' అని గాంధీతాత చెప్పాడు. గమనించు.

* ఆ॥వె॥ నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
 కడుపునిండ విషము గలుగువాడు 
కాలనాగుకన్న కడు ప్రమాదంబయా 
బాలనారసింహ! భరతసింహ! 7
                 -సూరోజు బాలనరసింహాచారి.
7. బాలనారసింహా! భరతసింహా! నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారు కాలనాగు (నల్లత్రాచు) కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.

* ఆ॥వె॥ తప్పుచేసికూడ తమదగు తప్పును
 కప్పిపుచ్చువారు కలుషమతులు 
ఒప్పుకొనెడివారు గొప్పమనీషులు 
భరతవంశతిలక! భవ్యచరిత! 8
                    - డా|| టి.వి. నారాయణ

8. భరతవంశానికి తిలకం వంటివాడా! మంచి నడవడిక గలవాడా! తప్పుచేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు.

ఆలోచించండి- చెప్పండి.

* కడుపునిండ విషమున్నవాడు కాలనాగుకన్న ప్రమాదకరమని కవి అన్నాడుకదా! అది ఎట్లో చెప్పండి.
* 'మానవుడే మాధవుడని భావించి ప్రజలసేవ చేయాలి' అట్లా చేసి గొప్పపేరు తెచ్చుకున్న కొందరి గురించి చెప్పండి.


ఇవి చేయండి విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం శతక పద్యాలు చదివారు కదా వీటిని గొప్పతనం గురించి చెప్పండి 
2. ఒకరు పద్యం చదవండి మరొకరు భావం చెప్పండి.


II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించదం
1. కింది భావాలకు సరిపోయిన పద్యపాదాలను పాఠంనుండి వెతికి రాయండి.
అ. మనిషే భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి.
జ. మానవుడే మాధవుండను 
ఆ. తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు.
జ. తప్పుచేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు
ఇ. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే.
జ. గొప్పలు చెప్పిన నదియును తప్పే 
ఈ. మంచివారికి సేవ చేయాలి.
జ. సాధుల కనుగొన్న సేవ 

2 కింది పద్యాన్ని చదువండి.
పుత్తడి గలవాని పుండు బాధైనను 
వసుధలోన చాల వార్తకెక్కు 
పేదవాని యింట పెండ్లైన యెరుగరు 
విశ్వదాభిరామ వినురవేమ!
పై పద్యం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి.
అ. పుత్తడిగలవాడంటే ఇనుము గలవాడు. (   x    )
ఆ. వార్తకెక్కు అంటే వార్తల్లోకి రావడం.        (  ✓   )
పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు. (  ✓   )
ఈ. శ్రీమంతులు ఏదిచేసినా అది వార్త అవుతుంది. ( ✓ )

3. కింది వాక్యాలు చదువండి. మీరు చేసే పనులకు సంబంధించి సరైన జవాబును'' తో గుర్తించంది.
అ. నేను తప్పుచేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను.      అవును ✓/ కాదు   
ఆ. ఇతరులకు మేలుచేసి ఆ గొప్పలు చెప్పుకోను.
       అవును✓ / కాదు 
ఇ. నాకు అందరు మంచివాళ్ళుగానే కనిపిస్తారు.   అవును / కాదు ✓
ఈ. నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను.
       అవును / కాదు x
ఉ. నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను.         
అవును / కాదు   ✓
ఊ. ఇతరుల మధ్య గొడవలు పెట్టను.     అవును✓ / కాదు 
ఋ. ఇతరులకు ఏదైనా అవసరముంటే ఇస్తాను.   అవును ✓/కాదు 
ౠ. ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను.          అవును ✓/ కాదు 

III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. మనం ఇతరులకు మేలు చెయ్యాలి. ఎందుకు?
జ. ఇతరులకు మేలు చేయడం వలన అందరూ క్షేమంగా ఉంటారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటే కలకాలం గుర్తుంటాము. సాయం చేయడం వల్ల వారి హృదయాలలో మనకు గొప్ప స్థానం ఉంటుంది. ఇతరుల సంపదలకు డబ్బుకు ఆశ పడకూడదు.

ఆ) "మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి  గుణాలు అలవాడతాయి" సమర్థిస్తూ రాయండి.
జ. మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు అలవాడతాయి. ఇతరుల ధనానికి ఆశపడము.  పొగిడినా పొంగకుండా ఉండగలం. స్త్రీల పట్ల సోదరునిలా మెలుగుతాము. పెద్దలను గురువులను గౌరవిస్తాము. క్రమశిక్షణగా జీవిస్తాము. ఇతరులు తిట్టినా వారిపై కోపాన్ని ప్రదర్శించము

ఇ)"గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే" అని తెలుసుకున్నారుకదా. దీని గురించి మీ అభిప్రాయం. తెలుపండి.
జ. మనం చేసే మేలును ఎప్పుడూ బయటకి చెప్పకూడదు. అలా చెప్పితే మెచ్చుకోరు మన మీద నిందలు వేస్తారు. గొప్పలు చెప్పి గర్వాన్ని ప్రదర్శిస్తారు అందువల్ల గొప్పలుచెప్పుకోవడం కూడా తప్పు అవుతుంది. 

ఈ. అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు?
జ. అనవసర వాదాలకు పోవడం సమయాన్ని వృథా చేస్తుంది, మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. వాదనలో కోపం, అహంకారం పెరిగి సంబంధాలు చెడిపోతాయి. వాదించడం కంటే వినడం, అర్థం చేసుకోవడం మంచిది. వాదన ద్వారా ఎవరికీ లాభం ఉండదు, కానీ మనసులో విభేదాలు పెరుగుతాయి. వివేకంతో నిశ్శబ్దంగా ఉండటం, సరైన సమయంలో సరైన మాట చెప్పడం మన ప్రతిష్ఠను, సమాధానాన్ని కాపాడుతుంది. అందుకే అనవసర వాదాలకు దూరంగా ఉండాలి.

2 కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది?
జ.శతక కవులు సమాజానికి నైతిక విలువలు, సత్యనిష్ఠ, ధార్మికతను బోధించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. వారు అన్యాయం, అజ్ఞానం, కులవ్యవస్థలను విమర్శించి సమానత్వాన్ని ప్రోత్సహించారు. సులభమైన భాషలో రాసిన శతకాలు ప్రజల మనసులో ఆలోచన, విజ్ఞానం నాటాయి. తెలుగు భాషా సంస్కృతిని కాపాడి, సాహిత్య సౌందర్యంతో జీవన మార్గదర్శకత్వం చూపి సమాజానికి మేలు చేశారు.

IV. సృజనాత్మకత / ప్రశంస
శతక పద్యాల ఆధారంగా మనం చేయకూడనివి, చేయవలసినవి పట్టిక తయారుచేసి ప్రదర్శించండి.
జ. చేయవలసినవి
నిజాయితీగా ఉండి సత్యం మాట్లాడాలి.
మంచి వ్యక్తుల సాంగత్యం చేసి జ్ఞానం పెంచుకోవాలి.
విద్యను సంపాదించి మనసు వికసింపజేయాలి.
పెద్దలను గౌరవించి ధర్మం పాటించాలి.
శ్రమతో సంపాదించి ఇతరులకు సహాయం చేయాలి.

చేయకూడనివి
అబద్ధాలు చెప్పి విశ్వాసం కోల్పోవడం.
చెడు సాంగత్యంతో చెడు మార్గంలోకి వెళ్లడం.
అజ్ఞానంలో మునిగి నీచ స్థితికి దిగజారడం.
పెద్దలను అవమానించి పాపం మూటగట్టడం.
సోమరితనం, లోభంతో స్వార్థంగా జీవించడం


V. పదజాల వినియోగం

1. కింది పదాలతో సొంతవాక్యాలను రాయండి.
ఉదా: మోదం        పండుగలు మోదంను కలిగిస్తాయి;
అ. హితం  = (మేలు)   : హితం పలుకుట మంచిది
ఆ. హర్షించుట = (సంతోషము) : మన మిత్రులు గొప్ప కార్యాలు సాధించినప్పుడు హర్షించాలి.
ఇ. సంతోషం : నేను కబడ్డీ ఆటలో ప్రథమ విజేతగా నిలిచినప్పుడు సంతోషం కలిగింది.
ఈ. పరధనం=(ఇతరుల ధనం): మనము పరదనము ఆశించకూడదు
ఉ. దుర్గతి =(చెడ్డగతి): చెడ్డ అలవాట్లు దుర్గతికి కారణమవుతాయి.
ఊ. మేలు =(లాభం ): తోటి వారికి మేలు చేయాలి.
ఋ. ప్రజల సేవ : ప్రజల సేవ చేస్తే సమాజం బాగుపడుతుంది.

VI

2. జట్టుపని : పద్యాల్లోని పదాల్లో ఏయే పదాలు పుస్తకం చివరి అకారాది పట్టికలో ఉన్నాయో చూసి వాటికింద గీత గీయండి. అర్థాలు రాయండి.

VI.

భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పేదాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు, చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ! బతుకమ్మ! సంపదను ఇవ్వమ్మ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజలవల్ల ఫలితాన్ని పొందుతారు.

పదం

ఉదా: బతుకును

4.

విభక్తి ప్రత్యయం

విభక్తి పేరు

ద్వితీయావిభక్తి

2. కింది ఖాళీలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి.
ఉదా॥ చెరువు నందు నీరు నిండుగా ఉన్నది (సప్తమీ విభక్తి )
అ) చదువు కు మూలం శ్రద్ధయే. (షష్టి విభక్తి)
ఆ) చేసిన తప్పు ను  ఒప్పుకునేవారు ఉత్తములు.(ద్వితీయ విభక్తి)
ఇ. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. (పంచమీ విభక్తి)
ఈ. ఘటము నందు నీరు నిండుగా ఉంది. (సప్తమి విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. (చతుర్థి విభక్తి)
ఊ. ఈ హింస.. తో... దేనిని సాధించలేం..(తృతీయ విభక్తి)
(ఋ. అతడు కుంచె ...తో...చిత్రాలు గీశాడు. (తృతీయ విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం..... వల్ల.. మనస్సు (పంచమి విభక్తి) 
ఎ. బాలిక ..తో.... బహుమానాలు తీసుకోవడానికి వేదిక పైకి ఎక్కారు.  (  తృతీయ విభక్తి )

ఏ. రైతు నాగలి ... తో.. పొలం దున్నుతాడు. (           )

చెరువు ....లో... బట్టలు ఉతుకొద్దు.  (          )

గౌరవించాలి. ఒ. పెద్దలమాటల (           )

ఓ. పసివాడు పాల ఏడుస్తున్నాడు.  (           )


ఔ. బాలబాలికలు స్వయంకృషి పైకి రావాలి.

  (               )

క. సుస్మిత మానస తెలివైనది. (           )

అవ్యయం

కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నా కదా! ఇప్పుడు 'అవ్యయం' అంటే ఏమిటో తెలుసుకుందాం.

* కింది వాక్యాలను చదువండి.

నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం పనికిరాదు.

మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.

ఆహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో!

ఈ వాక్యాల్లో ఉన్న 'అట్లని, అయితే, ఆహా!' మొదలైన పదాలను చూశారుకదా! ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులూ కావు. ఏకవచన, బహువచనమను తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను 'అవ్యయాలు' అంటారు.

లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు.

1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయపదాలకింద గీతగీయండి.

"ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది." అని సీత రాముడితో అన్నది.

ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు..

'శభాష్' అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.

ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.

ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.

ఊ. ధనం సంపాదించాలి. అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.

ప్రాజెక్టు పని

మీకు బాగా నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి వినిపించండి.

నేనివి చేయగలనా?

* శతక పద్యాల గొప్పదనం గురించి చెప్పగలను.

అవును / కాదు

* అపరిచిత పద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించగలను.

అవును / కాదు

* శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను.

అవును / కాదు

* శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయగూడనివి, చేయవలసినవి పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించగలను.

అవును / కాదు

సూక్తి

పాతదంతా బంగారం కాదు.

కొత్తదంతా ఇత్తడీ కాదు. తెలివైనవాడు మంచిని ఎక్కడినుండైనా స్వీకరిస్తాడు.


II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం
1. కింది భావాల కు సరిపోయిన పద్య పాదాలను పాఠం నుండి వెతికి రాయండి.


V. పదజాల వినియోగం 
1. కింది పదాలతో సొంత వాక్యాలను రాయండి.
ఉదాహరణ:  మోదం- పండుగలు మోదం ను కలిగిస్తాయి
అ) హితం: నేను ఇతరులకు హితం చేస్తాను
ఆ) హర్షించుట: నేను బాగా చదివినప్పుడు నా తల్లిదండ్రులు హర్షిస్తారు.
ఇ) సంతోషం -  నేను మరియు నా మిత్రులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను.
ఈ) పరధనం - నేను ఇతరుల పరధనం ఆశించను. 
ఉ) దుర్గతి - చెడు వ్యసనాలకు లోనైన వారు దుర్గతి పాలవుతారు.
ఊ) మేలు-  ఇతరులకు కీడు చేయకపోతే మేలు చేసినట్లే.
ఋ) ప్రజల సేవ - రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తారు.
2. జట్టు పని: పద్యాల్లోని పదాల్లో ఏ ఏ పదాలు పుస్తకం చివరి అకారాతి పట్టికలో ఉన్నాయో వాటి కింద గీత గీయండి. అర్ధాలు రాయండి.

VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. భాషను గురించి తెలుసుకుందాం

L కింది పేరాలో విభక్తి ప్రత్యయాలున్నాయి. వాటిని గుర్తించి రాయండి.

బతుకమ్మను పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలువడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక, వర్తమాన సంఘటనలుంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ! బతుకమ్మ! సంపదను ఇవ్వమ్మ! అంటూ పూజలు చేస్తారు. ఆ పూజలవల్ల ఫలితాన్ని పొందుతారు.

పదం విభక్తి ప్రత్యయం విభక్తి పేరు
పండుగను ను ద్వితీయ విభక్తి
ఆ. పండుగలో లో షష్టి విభక్తి
అనుబంధాలకు కు షష్టి విభక్తి
చేతులతో తో తృతీయ విభక్తి
అందుకొరకు కొరకు చతుర్థి విభక్తి
పాటల అందు అందు సప్తమి విభక్తి



2. కింది
  ఖాళీలను సరైన విభక్తి ప్రత్యాయాలతో గుర్తించి, అవి ఏమి విభక్తులో రాయండి.
ఉదా: చెరువు నందు నీరు నిండుగా ఉన్నది (సప్తమి విభక్తి)
అ)చదువు ...కు... మూలం శ్రద్దయే (షష్టి తత్పురుష సమాసం)
ఆ) చేసిన తప్పు.... ను ... ఒప్పుకునే వారు (ద్వితీయ తత్పురుష సమాసం)
ఇ) కడుపులో విషయం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు (పంచమి తత్పురుష సమాసం)
ఈ) ఘటము ..లో.. నీరు నిండుగా ఉన్నది (షష్టి విభక్తి)
ఉ. దేశభక్తులు దేశం ... కోసం...తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు.
ఊ. హింస ... వల్ల... దేనిని సాధించలేం.
(పంచమి విభక్తి)
ఋ. అతడు కుంచె ..తో.. చిత్రాలు గీశాడు. (తృతీయ విభక్తి)
ౠ. వాదాలు పెట్టుకోవడం ..వల్ల... మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. (

ఎ. బాలిక......తో...... బహుమానాలు తీసుకోవడానికి వేదిక పైకి ఎక్కారు. (తృతీయ విభక్తి)

ఏ. రైతు నాగలి తో పొలం దున్నుతాడు.
(తృతీయ విభక్తి (

బట్టలు లో ఉతుకొద్దు. (షష్టి విభక్తి)

 ఒ. పెద్దలమాటల ను గౌరవించాలి.

ఓ. పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు.

(చతుర్ధి విభక్తి)

ఔ. బాలబాలికలు స్వయంకృషి తో పైకి రావాలి. (తృతీయ విభక్తి)

క. సుస్మిత  కంటే మానస తెలివైనది. (పంచమి విభక్తి)



అవ్యయం
కింది తరగతులలో భాషాభాగాలలోని నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణాల గురించి తెలుసుకున్నాయి.

కదా! ఇప్పుడు 'అవ్యయం' అంటే ఏమిటో తెలుసుకుందాం.
కింది వాక్యాలను చదువండి.
అ) నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం పనికిరాదు.
ఆ) మనిషికి వినయం అలంకారం. అయితే అతివినయం పనికిరాదు.
ఇ) ఆహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో!
ఈ వాక్యాల్లో ఉన్న 'అట్లని, అయితే, ఆహా!' మొదలైన పదాలను చూశారుకదా! ఇవి పుంలింగం, స్త్రీలిం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే ఇవి విభక్తులూ కావు. ఏకవచన, బహువచన తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను 'అవ్యయాలు' అంటారు.

లింగ, వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు

1. కింది వాక్యాల్లో ఉన్న అవ్యయపదాలకింద గీతగీయండి.

ఆ. "ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది." అని సీత రాముడితో అన్నది.
ఆ. ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు.
'ఇ. 'శభాష్' అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు.
ఈ. విజ్ఞానం మరియు వినోదం అందరికి అవసరం.
ఉ. అమ్మో! ఆ కుక్క కరుస్తుంది.
ఊ. ధనం సంపాదించాలి. అయితే అందులో కొంత దానం కూడా చేయాలి.

ప్రాజెక్టు పని

మీకు నచ్చిన శతకాల్లోని ఏవైనా 5 పద్యాలను సేకరించి, భావాలు రాయండి. నివేదిక రాసి చదివి. వినిపించండి.

నేనివి చేయగలనా?

1. శతక పద్యాల గొప్పదనం గురించి చెప్పగలను. అవును /కాదు

2. అపరిచిత పద్యాన్ని చదిని తప్పొప్పులను గుర్తించగలను.అవును /కాదు

3. శతక కవుల వల్ల సమాజానికి కలిగే మేలు గురించి రాయగలను.   అవును /కాదు

4. శతక పద్యాల్లోని భావాల ఆధారంగా మనం చేయగూడనివి, చేయవలసినవి పట్టిక రూపంలో తయారుచేసి ప్రదర్శించగలను.
అవును /కాదు


సూక్తి

పాతదంతా బంగారం కాదు.

కొత్తదంతా ఇత్తడి కాదు.

తెలివైనవాడు

మంచిని ఎక్కడినుండైనా స్వీకరిస్తాడు.