సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

30, డిసెంబర్ 2022, శుక్రవారం

దళిత కథా వార్షిక 2021 చిందూ నేల

తెలుగు దళిత కథ వార్షిక 2020 "తొండం బొక్కెన"KP Ashok kumar

జై బీములు మిత్రులందరికీ జంబూ శెనార్థులు.

ప్రసిద్ధ విమర్శకులు గౌరవనీయులు కేపీ అశోక్ కుమార్ అన్నగారు తెలంగాణ సాహిత్య అకాడమీ మాసపత్రిక పునాసలో తొలి తెలుగు దళిత కథా వార్షిక తొండబోక్కెనపై తన అమూల్యమైన విశ్లేషణను అందించారు.

 వారికి జంబు సాహితి తరపున సిర్ర చిటికెన పుల్లతో చాటింపు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

 జయహో కే పి అశోక్ కుమార్ అన్న.

మీ  అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాస్తారని ఆశిస్తున్నాం.

జంబూ సాహితీ


18, డిసెంబర్ 2022, ఆదివారం

తీర్మానం కథ - డా. సిద్దెంకి యాదగిరి ఈనాడు కథా విజయం

7

మూడు గుడిసెల పల్లి కథ - డా. సిద్దెంకి యాదగిరి

7

పీడ కథ - డా. సిద్దెంకి యాదగిరి


వెరీ గుడ్ కథ డా. సిద్దెంకి యాదగిరి

మిత్రులందరికీ నమస్కారం, జై భీమ్ లు. 
నా కథ వెరీ గుడ్డు. నవతెలంగాణ సోపతి  ఆదివారం అనుబంధం లో ప్రచురితం. ప్రచురించిన యాజమాన్యానికి, సంపాదకులకు, ఆనందచారి గారికి, కృతజ్ఞతలు. కథ చదివి అభిప్రాయం చెప్పగలరు. 

వెరీ గుడ్డు
స్టీల్‌ పల్లాలు పట్టుకొన్న విద్యార్థులు ఆకలి సమరంలో ఆయుధాలు ధరించిన యుద్ధ వీరుల్లా కనబడుతున్నారు. 
ప్రాకృత వేషం ధరించిన అన్నపూర్ణమ్మలా లచ్చవ్వ అన్నం వడ్డిస్తుంటే అప్పుడప్పుడు అన్నం చెమ్చా బవుగొని గిన్నెకి తాకి కన్‌ కన్‌ మనే శబ్ధంతో గాజులు  గళ్ళు మంటున్నాయి. 

కిష్టవ్వ ఒకచేత చార్‌ పోస్తుంది. మరోచేత గుడ్డు పెడుతుంది. పిల్లల మొఖాల్లో పట్ట పగలు ఆనందాలు పొంగుతున్నయి. వంటోల్ల సంబూరమ్‌ తిండి పెడుతుంటే తిన్నంత తృప్తి అవుతుంది. 

ఆ స్కూల్లో పీఈటిలేడు. మధ్యాహ్న భోజనం వద్ద హెచ్చెమ్‌,  ఒక సారు రోజూ పర్యవేక్షిస్తారు. 

లాక్‌ డౌన్‌ ఎత్తేసిండ్రు. అన్నీ వ్యాపార సంస్థలతో పాటు స్కూళ్లూ తెరిచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాల ప్రారంభమైంది. పాఠశాలలో మధ్యాహ్నభోజనమూ ప్రారంభమయ్యింది. రోజు మార్చి రోజు గుడ్డు, మెనూ ప్రకారం మాధహ్నభోజనం అందజేస్తున్నారు. కరోన భయం వల్ల విద్యార్థులు పలుచ పలుచగా బడికి హాజరవుతున్నారు.
‘మేక్‌ ఏ లైన్‌, కీప్‌ క్వైట్‌’ లైన్‌ తప్పుతున్న పిల్లలను నర్సింలు సార్‌ హెచ్చరిస్తున్నాడు. విద్యార్థులు ఫాలో అవుతున్నారు.  

‘ఇయ్యాల్ల గుడ్డుతో కడుపునిండ తినొచ్చు. ఎన్నాళ్ళకు దొరికింది గుడ్డు. గుడ్డు కోసమైన బడి ఉంటే ఎంత బాగుండు? బడి ఉంటే ఇప్పటికి ఎన్ని గుడ్లు తిందుమో?’ ఒకడి మనసులోని మాట.

‘కరోనా రోగమేనాయే బడి తెరుస్తరా? గుడ్డు పెడుతరా? లైన్లో ముందన్నోని ప్రశ్నకు జవాబు

‘మా అమ్మకు, మా నాయినకు పని దొరుకక తిండికే తిప్పలైంది. కూరగాయలు, కిరాణం లేవు. రేషన్‌ బియ్యం. పచ్చిపులుసు, దప్పుడమ్‌, చారుతో రోజూ తినలేక సచ్చినమ్‌. ఆకలిబాధకు తినలే. బతికేతందుకు తిన్నమ్‌. మేం తిన్నది గడ్డి అనొచ్చు.’ మొదట అన్నోడి నోట వాస్తవం.  
‘లేటైన సరే! గుడ్డు పెడుతుండ్రు. ఇప్పటికిదే సంతోషం. ఇన్ని రోజులదంతా ఇయ్యల్ల తినరాదూ!’ ఊరిల్లు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా వెనుకోడి జవాబు.  
‘దొరికిందే పరమాన్నం. తినకపోతే ఎట్లరా? కుమ్ముడే.’

‘ఔనౌను. నిజమే! తినడానికే బతుకుతున్నాం’ అని మరికొంతమంది నమ్మ పలుకుతున్నారు. గుసగుస అన్నట్లే కానీ బాహాటంగా మాటలు వినిపిస్తున్నాయి.

‘అటునుంచి నర్సింలు సార్‌, ఇటె జూస్తుండు రా! హెచ్చెమ్‌ సార్‌ మల్లీ వస్తుండురా. సైలెన్స్‌ రా’ అని పరస్పరం హెచ్చెరికలు చేసుకున్నారు. నిశ్శబ్ధం అలుముకుంది. చక్కగా నిలుచున్న సైనికుల్లా ఉన్నారు. 

గుడ్డు పెట్టుకుంటున్నారు. కొంతమంది వద్దంటున్నారు. మరికొంత మంది గుడ్డు పెట్టుకోవాల్నో, వద్దో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. వద్దనే వారిలో ఆడపిల్లలు, మగపిల్లలూ ఉన్నారు. వద్దనే పిల్లలు సార్లు దృష్టించని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. పిల్లలు అన్నం పెట్టుకొని తింటున్నారు. 

ఎవరో వచ్చారని తెలియగానే హెచ్చెమ్‌ రామ కృష్ణసార్‌, నర్సింలుసార్‌కి చెప్పి, ఆఫీస్‌లోకి  వెళ్ళాడు. 

ఆ స్కూల్లో లంచవర్‌, లీసర్‌ పీరియడ్‌లో తప్ప ఫోన్‌ మాట్లాడరు. వొచ్చిన ఫోన్‌ని నర్సింలు సార్‌ ఎత్తి మాట్లాడుతున్నాడు. అట్లా గుడ్డు వద్దనుకునే పిల్లలు పెట్టుకోకుండానే వెళ్ళి పోయారు.
‘‘మేం లెక్క కొద్ది పెడ్తాంటే వొద్దంటరు. గుడ్డు పెట్టలేదనీ తల్లిదండ్రులకు ఫిరాదైతరు. ఇదేం బాగోతం. మీ పళ్ళెంల పెట్టినంక పారెయ్యిరి. మూల్గులు మునుపటోల్నే తిండి ఎప్పటోల్నే అన్నట్లుంది. మమ్ముల గుడ్డు పెట్టలేదనీ సాటింపు చెయ్యిండ్రి’’ అని కిష్టవ్వ ఉరుముతుంది.

ఫోన్‌ కట్‌ చేసి నర్సింలు సార్‌ ‘‘ఏమైందేమైంది’’ అని ఆరాతీసిండు.
‘లేకపోతే ఏంది సార్‌. పోరలు గుడ్డు తినుమంటే తినరు. పెట్టలేదనీ తల్లి తండ్రులకు చెప్పుతరు. ముందుగాల చెప్పరు. బిస్కెట్‌ ప్యాకెటో ఇంకేదో తెద్దామంటే ముందగాల చెప్పరు. బడికి దుకాణానికి దూరమాయే. ఈ ఊళ్లె అడ్డగోలు పిరమాయే.  ఇప్పటికిప్పుడు ఏం తేవొస్తది సారూ! ఈ పిల్లలు భయం ఉన్నట్లే చేసినపని చేసినట్లే. తినేది తినుకుంటూనే జోలెకేవడో చేసే అంటరు సూడు గట్ల ఉంటది. మాకో బదునామ్‌ ఎందుకు సారూ’ అని రూపాయి బిల్లెలుపు బొట్టున్న నొసలు విరుచుకుంటూ, కనుబొమ్మలు ఎగరేస్తూ వివరిస్తంది లచ్చవ్వ.
‘‘లచ్చవ్వా! ఇదసలే కరోనా కాలం. తినోటోల్ల వొద్దు అనొద్దు. తిననోళ్ల తినుమని బలవంత పెట్టొద్దు. వాళ్ళ ఇష్టమే మన ఇష్టం. ఎవ్వరేమనరు. నిజమే మనం పెట్టకపోతే మనకు మాట.’’ అని సార్‌ వివరిస్తున్నాడు. 
‘‘పిల్లలూ! అందరూ గుడ్డు తినాలి. బలవర్దకమైన, సమతులా ఆహారం. కరోనాను నివారిస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. బలమొస్తది. ఖచ్చితంగా తినాలి. మీకోసమే చెప్పుతున్న.’’ అని నర్సింలు సార్‌ బంతిగా కూర్చుండి భుజిస్తున్నవిద్యార్థులకు గుడ్డు వల్ల కలిగే లాభాలు చెప్పిండు. 
గుడ్డు పెట్టుకొన్నారు. తింటున్నారు. మారు అన్నం కోసం వస్తున్నారు. తిన్నవాళ్ళతో, తినని వాళ్ళూ నవీన్‌, అనిల్‌ లు ఇద్దరున్నారు. 

ఇద్దరు గుడ్డు పెట్టుకోగానే భోజనం తింటున్నట్లు చేస్తున్నారు. గుడ్డు జేబులో పెట్టుకొని బడి దాటుతున్నారు. 

‘తినని వాళ్ళు గుడ్డు పెట్టుకోరు. తినే వాళ్ళు గుడ్డు పెట్టుకుంటారు, తింటారు. వీళ్ళు గుడ్డు పెట్టుకుంటున్నారు.

 తింటలేరు. తినకపోతే పారేయాలి. పారేస్తలేరు. గుడ్డును ఏమి చేస్తున్నారో తెలుస్తలేదు. మిగతా పిల్లలకు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. గుడ్డు తినకుండా ఎక్కడికి, ఎందుకు తీసుకుపోతున్నారు?’అని నవీన్‌, అనిల్‌ల దోస్తులు నితిన్‌, అజయ్‌లు ఆలోచిస్తున్నారు. ఈ విషయం నర్సింలు సార్‌ కి చెప్పిండ్రు. 
ఇదే విషయాన్ని నర్సింలు సార్‌, హెచ్చెం రామ కృష్ణ సార్‌కి చెప్పిండు. 

ఈ రోజు మధ్యాహ్నం భోజనం నిర్వహణలో రమేశ్‌ సార్‌ ఉన్నాడు. 
‘మర్నాడు బుధవారం రోజున భోజన సమయంలో పల్లాలు కడుక్కొని క్యూ లైన్‌ లో నిలబడ్డ విద్యార్థులతో ‘‘గుడ్డు పెట్టుకున్నోళ్ళు, పెట్టుకొనోళ్ళు అందరూ తింటే మంచిది. తినాలి కూడా. కొందరు గుడ్డు పెట్టుకొని తినకపోవడం మంచిది కాదు. బయటికి తీసుక పోతున్నారట. ఎవరెవరు తీసుకపోతున్నారో నాకు తెలిసింది. గతం గతః. నిన్నటివరకు తీసుక పోయిన  వారు ఈరోజు తీసుక పోవద్దు. తీసుకపోతే బాగుండది.  ఆ పద్ధతి మానుక్కోవాలి. గుడ్డు మీ కోసమే పెడుతున్నం. మీరు తినాలి. అదే న్యాయం. అదే ప్రభుత్వ ధ్యేయం. ఇవ్వాల్ల ఎవ్వరు తినరో నాకు అట్లే తెలిసి పోతుంది. ఎక్స్ట్రా లు చేయొద్దు. 
డిడ్‌ యూ అండర్స్టాండ్‌?’’ అని బొటన వేలు ఎత్తి ప్రశ్నించిండు.
పిల్లలు రెస్పాన్స్‌ ఇవ్వక ముందే ‘‘పెద్ద సారు మంచిగనే చెప్పుతుండు.’’’  

‘‘పిల్లల మునుపటోలే భయంల ఉంచుతలేడు. అరేయ్‌ అని గుడ్లు తెరిస్తే ఒక్కొకని లాగులు తడుసు.’’ అని వంట మనుషులు చర్చించుకుంటున్నారు.

‘‘యెస్సార్‌’’ అని కోరస్‌గా తంబూ ఎత్తారు పిల్లలు.

‘‘ఒ కె గుడ్‌’’అన్నాడు హెచ్చెం 
హెచ్చెం చూసే వరకు ‘ఎందుకీ గోల’ అనుకోని అతి కష్టమ్మీద నవీన్‌, అనిల్‌ లు తంబు ఎత్తారు.

‘‘కానివ్వండి’’ అన్నాడు రామకృష్ణ సార్‌.  
నవిన్‌, అనిల్‌లని బోన్‌లో నిలుచో బెట్టిన ముద్దాయిల్లా చూస్తున్నారు మిగతా విద్యార్థులు. 

అన్నంతినేటప్పుడు ఎప్పటిలాగా నవీన్‌, అనిల్‌లు గుడ్డు తినలేదు. గుడ్డు దాసుకున్నారు. బయటకి తీసుకెళ్లారు. సార్ల కంటపడకుండా గేట్‌ దాటి. 
లంచ్‌ బ్రేక్‌ పూర్తి అయ్యేలోపల బడిలో చేరుకున్నారు. అప్పటికే కొంతమంది విద్యార్థులతో తెలుసుకున్న హెచ్చెం కోపం నశాలానికి అంటింది. ఇద్దరినీ పిలుసుకున్నాడు. ఆరా తీశాడు. ఎంతకీ చెప్పుతలేరు. భయంతో ఏడుస్తున్నారు. 
హెచ్చెం బాగా ఆలోచించాడు. శుక్రవారం రోజున మధ్యాహ్నభోజనంలో గుడ్డు పెట్టారు. యథావిధిగా తినేవాళ్లు తిన్నారు. తిననివాళ్ళు తినలేదు. నవీన్‌, అనిల్‌లు తినలేదు. ఎప్పటిలాగా గుడ్డు దాచుకున్నారు. తీసుకెళుతున్నారు. పిల్లలు పట్టించుకోలేదు.  
హెచ్చెం స్టాఫ్‌ తో చర్చించి, ఒక నిర్ణయం తీసుకొన్నారు కనుక్కుందామనీ. ఆ బాధ్యతను నర్సింలు, రమేశ్‌ లకు అప్పగించారు. 

నవీన్‌ వెళ్తుంటే అనుమానం రాకుండా నర్సింలు సార్‌ వెంబడిరచాడు. ఎప్పటిదో ఇల్లు. వానకు ఉరుస్తది. సందుల్లోంచి సూర్యకిరణాలు ఇంట్లోకి దూరుతాయి. మట్టితో అలికిన ఇల్లు. నిద్ర చోటేరుగదు. ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు నివాసం ఏదైనా నివాసమే. నవీన్‌ ఇంటికి చేరిండు నర్సింలు సార్‌. ఇంటి ముందు కూలిన పందిరి తండ్రి సచ్చిపోతే తల్లి సంకలో ఏడుస్తున్న పిల్లలా చెల్లా చెదరైనట్లు ఉంది. చిన్న దర్వాజ. ఒకటే తలుపు. తీసుకొని లోపలికి పోయిండు నవీన్‌.
హెచ్చెంసార్‌ ఆగమేఘాల మీద నవీన్‌ ఇంటికి బండి మీద చేరుకున్నాడు.
‘‘అమ్మమ్మా! లేవు’’ అంటూ పిలుస్తున్నాడు. మేలుకరాలేదు. 
కప్పిన బట్టల్లో మనిషి ఉన్న ఆనవాల్లు లేవు. బట్టలు పొరలు పొరలుగా తొలగిస్తున్నాడు. మంచంలో దీనంగా పడుకున్నది నవీన్‌ అమ్మమ్మ కనకవ్వ. మరొకరి ఆసరా లేకుండా లేవది. కూర్చోదు. అవుతలకి పోదు. ఇవుతలకి రాదు. అన్నీనవీన్‌, అతనితల్లి కలిసి చేస్తారు. 

నవీన్‌ నాన్నఅనుకోని ప్రమాదంలో చనిపోతే అమ్మ తీసుకొచ్చి సాదుతుంది. తల్లి అమాయకురాలు. ఏ పనైనా చెప్పితే చేస్తది. చెప్పక పోతే చెయ్యది. కూలికి వెళ్ళితేకూడా అంతే. ఎంత ఇస్తే అంతే. చలాకీతనం లేదు. లెక్కలు రావు. అన్నీకనకవ్వ చూసుకునేది. 

సర్కార్‌ దావఖాన పుణ్యమా బతికింది. ఇప్పుడు కనకవ్వకు కరోనా సోకి చావు అంచులు చూసొచ్చింది. సచ్చి పుట్టింది. నీరసంగా తయారైంది. మందులు లేకపోతే బతుకడం కష్టమన్నారు డాక్టర్లు. ఆమెకి మంచి తిండి పెట్టాలి. పైసలు లెవ్వు. పరపతిలేదు. ఆస్తి అసలేలేదు. ఎట్లా సాధ్యం. నవీన్‌ తల్లి తెచ్చే కూలి డబ్బులు గోలీలకు, మందులకు, సరిపోతలేవు. ఉన్నంతలో బడిలో గుడ్డు తెస్తున్నాడు. తినపెడుతున్నాడు. 
తిన్నా, తినకున్న కనకవ్వకు మందులు తెస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆమె బతుకుతుంది. వాళ్ళకి ఆమె బతుకడమే కావాలి. అమ్మ ఆకలి తీర్చడానికి నానా తంటాలు పడుతున్నాడు. నవీనుకి సైగలతో గుడ్డు వొద్దని చెప్పింది. వినడు. బతిమాలి తినవెడ్తడు. 

ఒక్కరెక్క తలుపు తీసుకుంటూ లోనికి వెళ్ళి, ‘‘అమ్మమ్మ లేవు.’’ అని పిలిచాడు.
చిన్నగా మూలుగులతో తెరిచిన కళ్లతో చూసింది.  

నర్సింలుసార్‌ సాటుగా గమనిద్దాము అన్నుకున్నాడు. ముక్కలైన బతుకును చూసేసరికి మనసు లక్కలా కరిగిపోయింది. దుఖభరితమైన సన్నివేశం చూసి చలించిపోయాడు. తాను చిన్న దర్వాజకు వొంగి ఇంట్లోకి ప్రవేశించాడు.   
సార్‌ని చూసి నవీన్‌ భయపడుతున్నాడు. అప్పుడే హెచ్చెం రామకృష్ణ సార్‌ బండిదిగి ఇంట్లోకి వొచ్చిండు. వస్తూనే నర్సింలు సార్‌ ద్వారా తెలుసుకున్నాడు. హెచ్చెం మనసు కన్నీళ్లతో తడిసిపోయింది. 

‘‘భయపడకు నవీన్‌. నిన్ను సాదిన నీ తల్లి తల్లికి ప్రాణం పోస్తున్నవు. భేష్‌. ఆయుషు ఆరువాల్లు. ఏదుకునుడు ఏడు పాళ్ళు. నీ కృషి తప్పకుండ ఫలిస్తుంది. మీ అమ్మమ్మ మళ్ళీ మామూలు అవుతుంది. ఇక నుంచి మీ అమ్మమ్మ వైద్య ఖర్చులు, నీ చదువు ఖర్చులు నావి. భయపడకు’’ అన్నాడు. 

‘‘నవీన్‌! మీ అమ్మమ్మకు గుడ్డు తినపెడుతుంటే నా మనసు ముక్కలు చెక్కలవుతుంది బిడ్డా! మీ అమ్మ బాగయ్యే వరకు నెలకు పౌష్టికాహారం నేను అందజేస్త అని అప్పటికప్పుడే ఐదువందల నోట్లు రెండు కనకవ్వ చేతిలో పెట్టిండు పెద్దసార్‌.  మాట్లాడే శక్తిలేని కనకవ్వ నాలుగుబొట్లు కన్నీళ్లు కార్చింది. 
ఇంకా భయం పోలేదు. కలా, నిజమా అర్థమవుతలేదు నవీన్కి. వణుకుతుండు. భయంతో వణుకుతుండు. కాళ్ళ మీద పడ్డాడు. నవీన్‌ కన్నీళ్లు బొట్లు బొట్లుగా హెచ్చెంకాళ్ళు కడిగాయి.  

‘‘వొద్దుర నవీన్‌’’ అని లేపి హెచ్చెమ్‌ రామకృష్ణ సార్‌ నవీన్నుదగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు.  నువ్వు వెరీ గుడ్డు.’’ అని......
     Dr. Siddenky Yadagiri 9441244773



17, డిసెంబర్ 2022, శనివారం

దాశరథి కవితా శైలి

"అగ్నిధార" కావ్యఖండికలోనే మానవ పరిణామాన్ని గురించి "?" (ప్రశ్నార్థకం) శీర్షిక గల కవితను పొందుపర్చాడు.

 "ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో" అంటూ ప్రారంభమయ్యే ఈ గేయంలో కేవలం రెండు పంక్తులలోనే మొత్తం భూమి పుటుక, మానవ పరిణామం గురించిన శాస్త్రీయ అవగాహనను చాలా సరళంగా తెలియజేశాడు. సూర్యుని నుంచి వేరుపడిన అనేక అగ్నిముద్దల్లో, చల్లబడిన ఒక మద్దయే మన భూమి. ఈ శాస్త్రీయ అవగాహనని ప్రజలకు తెలియచేసేలా 'భూగోళం పుటుక కోసం రాలిన సురగోళాలెన్నో" అని రాశారు. అలా చల్లబడిన ఈ భూగ్రహంపై కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జీవం ఏర్పడింది. ఈ జీవపదార్థాం అనేక మార్పులు చెందుతూ, నేటి అత్యున్నతమైన మానవుని రూపంగా ఆవిర్భవించింది. ఈ మానవ పరిణామాన్ని చాలా చక్కటి, చిక్కటి పదాలలో వ్యక్తం అయ్యేలా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో." అని రాశారు. ఇలా సంక్లిష్ట శాస్ర విషయాలను చాలా సులభశైలిలో పామరులకు కూడా అర్థం అయ్యేలా భూగ్రహ, మానవ పరిణామాల గురించి శాస్త్రీయ అవగాహనను కల్పించాడు.

తెలంగాణ ప్రజల కన్నీళ్ళను “అగ్నిధార"గా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం అద్భుత రచనలు దాశరథి చేశాడు. సముద్రం మనకు పైకి ప్రశాంతంగా అగుపించినా, తన గర్భంలో ఎన్నో అగ్ని పర్వతాలున్నాయని హెచ్చరించాడు. నల్లని, నిర్మల ఆకాశంలో మనకు కనిపించే సూర్యుడిలాంటి నక్షత్రాలు అనేకం ఉన్నాయని తెలియజేశాడు. ఇలా సముద్ర శాస్త్ర, ఖగోళ శాస్ర విశేషాలను ఈ కవితలో ప్రారంభంలోనే ప్రస్తావించాడు. రాజులతో నిండిన గత చరిత్ర నుండి, నేటి వర్తమాన ప్రపంచం వరకు సమస్యల పరిష్కారం పేరుతో సాగిన సాగుతున్న అకాల యుద్దల వల్ల అనేక మంది ప్రజలు బలవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే కులమతాల పేరుతో చాలా మంది అమాయకులు హత్యచేయబడుతున్నారని ఆవేదన చెందాడు. ఈ సమస్యలన్నీ నేటికీ కొనసాగటం ఒక హేయమైన వాస్తవం. సమస్యలను, బాధలను ఏకరువు పెట్టడమే కాకుండా వాటి పరిష్కారం కూడా ఆయన చాలా కవితాత్మకంగా ఇదే కావ్యంలో పేర్కొన్నారు. మంచిపాలన లక్ష్యం అన్నార్తులు, అనాధులుండని నవయుగం వైపుకు సమాజాన్ని నడిపించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పాలన సాగాలని, ఆ పాలనలో పిల్లల భవిష్యత్తుకు కూడా భరోసా ఉండాలని ఆయన వాంఛించాడు.

గత మూడు దశాబ్దాలుగా జనవిజ్ఞాన వేదిక ప్రధానంగా అక్షరాస్యతా ఉద్యమం, మద్యనిషేధ ఉద్యమం, వనితా కళా యాత్రలు, శాస్ర ప్రచారం, మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాల సందర్భంగా శాస్ర విషయాలను - సాంసృతిక అంశాలను మిళితం చేసింది. ఈ అనుభవం నుండేదేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకోవడం మన అందరికి తెలుసు.

శాస్త్రీయ దృక్పథానికి, సాహిత్యానికి గల సంబంధం ఈనాటిది కాదు. ప్రధానంగా తెలుగు సాహిత్యంలో వేమన అతి చిన్న పదాలు, పాదాలతో కూడిన తన పద్యాల ద్వారా ఎన్నో హేతువాదధోరణులను ప్రజలలో విజయవంతంగా వ్యాప్తి చేయడం మన ఘనమైన సాహితీ వారసత్వం. ఆ క్రమంలో ఎందరో ప్రముఖ కవులు, రచయితలు, సంస్థలు, ఉద్యమాలు తమ కార్యాచరణలో సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ భావాలను ప్రజలలో వ్యాప్తి చేశారు. ఈ వెలుగులో దాశరథి సాహిత్యాన్ని ప్రధానంగా ఈ గేయాన్ని ప్రజలలో ప్రచారంలో పెట్టాలని జె.వివి సంకల్పించింది. ఈ నేపధ్యంలో ఎంతో విస్తృతమైన మన తెలుగు సాహిత్యంలో "పరిణామ గేయకర్త దాశరథి" అని సగర్వంగా జెవివి ప్రకటిస్తున్నది. ఈ కవిత ద్వారా దాశరథి రగిలించిన శాస్త్రీయ సృహ ఆధారంగా పురోగతి దిశగా మనందరం

ఏ గ్రహమూ చేయలేని పని

మన పుడమి చేసి చూపింది

నీటిని ఒడిసిపట్టి

తన ఖ్యాతిని చాటింది

చుక్క చుక్కని దరిజేర్చి

వీర తెలంగాణ

వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించటం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణా ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో వినవచ్చు.

 వీర అనగా శత్రువును వణికించువాడు, పరమత సహనము లేనివాడు, కుంకుమ పువ్వు మొదలగు అర్థములు గలవు. తెలంగాణ అనగా పూర్వము హైదరాబాదు నిజాము ఏలుబడిలో నున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని భాగము, తెలుగుదేశ సంబంధమైన, తెలుంగు ఆణెం, తెలుగు స్థానం మొదలైన అర్థాలు గలవు.

       తెలంగాణలో జరిగిన అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపిన తెలంగాణ ప్రజల సాహసాన్ని వీరత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టే ఆదునిక పద్య ప్రక్రియకు చెందిన పాఠం ఈ వీర తెలంగాణ.

ప్రక్రియ పరిచయం
             పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు. ప్రాచీన పద్య రచనలు సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేవి కావు. కఠినమైన గ్రాంథిక భాషలో ఉండేవి. కాని ఆధునిక పద్యం అలాకాదు. అందరికి అర్థమయ్యే సులభ శైలిలో సరళంగా ఉండడం వీటి ప్రత్యేకత.


కవి పరిచయం
            ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కుడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు. తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.

      తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి.గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు, నవమి, యాత్రాస్మృతి వ్మోదలైనటువంటి గ్రంథాలను, ఆణిముత్యాల వంటి సినిమా పాటలను రచించాడు. 

        ప్రస్తుత పాఠ్యభాగం వీర తెలంగాణ డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది.


పాఠం నేపథ్యం/ఉద్దేశం 
          తెలంగాణలో రజాకార్లు అరాచకత్వాన్ని ఎదిరించి పోరాడిన ధీరులు ఎందరో ఉన్నారు. వారిలో లో ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమై తెలంగాణ ధైర్యసాహసాలను పద్యాల రూపంలో దాశరథి ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించటం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణా ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగిన ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో వినవచ్చు 
         తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 

         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 

      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.


కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు

*ఉ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!

          ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా

          జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్

          చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!


          తాత్పర్యం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!


*మ తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా

            జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ

            తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం

            చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్

           తాత్పర్యం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.


*మ తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం

          చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ

          జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా

         ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

       తాత్పర్యం: అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.

22, సెప్టెంబర్ 2022, గురువారం

సంధులు

 – తెలుగు వ్యాకారణం సంధులు
సంధులు – వ్యాకరణ పరిభాషలు
 ( Sandhulu in telugu )

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు. పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది. [1]

వర్ణాల మార్పు

వర్ణ లోపము

ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.

రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)

వర్ణాగమము
ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)

వర్ణాదేశము

ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.

కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)

సంధులు: I. సంస్కృత సంధులు, II. తెలుగు సంధులు.

సంస్కృత సంధులు:
1. సవర్ణదీర్ఘ సంధి
2. గుణ సంధి
3. వృద్ధి సంధి
4. యణాదేశ సంధి
5. జశ్త్వ సంధి
6. శ్చుత్వ సంధి
7. అనునాసిక సంధి
8. విసర్గ సంధి
9. పరసవర్ణ సంధి
10. పరరూప సంధి


సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. 
ఉదా:
రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం


2. గుణ సంధి: అకారానికి ఇ-ఉ-ఋలు పరమైతే క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశ మవడాన్ని గుణసంధి అంటారు. 
ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు
ఇతర + ఇతర = ఇతరేతర 
రాజ + ఋషి = రాజర్షి



3. వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు. 
ఉదా:
భువన + ఏక = భువనైక 
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం
పాప + ఓఘం = పాపౌఘం
పరమ + ఔషధం = పరమౌషధం 
ఋణ + ఋణం = ఋణార్ణం

4. యణాదేశ సంధి: ఇ-ఉ-ఋలకు అసవర్ణా చ్చులు పరమైతే క్రమంగా య-వ-రలు ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు. ‘‘ఇకోయణచిః’’ : ఇక్కులకు (ఇ-ఉ-ఋ) యణ్ణులు (య-వ-ర) పరమవుతున్నందు వల్ల ఇది యణాదేశ సంధి. 
ఉదా: 
జయంతి + ఉత్సవం = జయంత్యుత్సవం
హిందూ + ఆర్యులు = హింద్వార్యులు
పితృ + ఆర్జితం = పిత్రార్జితం



5. జశ్త్వ సంధి: క-చ-ట-త-పలకు అచ్చులు కానీ, హ-య-వ-ర-లు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశమవడాన్ని జశ్త్వసంధి అంటారు. 
ఉదా:
తత్ + అరణ్య భూములు = తదరణ్య భూములు
అచ్ + అంతం = అజంతం
వాక్ + ఈశుడు = వాగీశుడు
కకుప్ + అంతం = కకుబంతం
సత్ + భావం = సద్భావం


6. శ్చుత్వ సంధి: సకారత వర్గాలకు శకారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు. 
(సకార-త థ ద ధ న) (త వర్గం)
(శకార – చ ఛ జ ఝ ఞ) (చవర్గం)
తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)
సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) – చ= చ్ఛ)
సత్+జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)
విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి (త్ (త)+ శ=చ్ఛ)

7. అనునాసిక సంధి: వర్గ ప్రథమాక్షరాలకు (క-చ-ట-త-ప)‘న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి. 
ఉదా:
వాక్ + మయం = వాఙ్మయం (క-ఙ=నిత్యం)
జగత్ + నాటకం = జగన్నాటకం = జగద్నాటకం (వికల్పం)
(అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరం) (త-ద-వికల్పం)
మృట్ + మయం = మృణ్మయం, మృడ్మయం (టకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పం)

8. విసర్గ సంధి: అకారం పూర్వముందున్న విసర్గకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అ-హ-య-వ-ర-లలు పరమైనప్పుడు విసర్గ – ఓకారంగా మారుతుంది. (వర్గ తృతీయాక్షరాలు- గ, జ, డ, బ, లు వర్గ చతుర్థాక్షరాలు (ఘ, ఝ, ఢ, ధ, భ, లు) 
వర్గ పంచమాక్షరాలు: ఙ- ఞ- ణ- న-మ్ (అనునాసికాలు) హ-య-వ-ర-లలు పరమైనప్పుడు మాత్రమే విసర్గ ఓకారంగా మారుతుంది. కొన్నిసార్లు రేఫ వస్తుంది. 
ఉదా: 
అయః + మయం = అయోమయం (యః + మ = ఓ) 
ఇతః + అధికం = ఇతోధికం (తః+అ = ఓ)
చతుః + ఆత్మ = చతురాత్మ (తుః + ఆ = ‘ర’ కారం వచ్చింది) 
తపః ఫలము = తపఃఫలం (ఫ కారం వర్గ ద్వితీయాక్షరమైనందు వల్ల విసర్గలో మార్పు లేదు).

9. పర సవర్ణ సంధి: పదాంతం ముందున్న ‘త’ కారానికి లకారం పరమైనప్పుడు ‘ల’ కారమే ఆదేశంగా రావడాన్ని పర సవర్ణ సంధి అంటారు. (త్ – తకారానికి లకారం వస్తే ‘ల్ల’ కారం వస్తుంది) 
ఉదా: 
భగవత్ + లీల = భగవల్లీల (త్ + ల = ల్ల)
ఉత్ + లేఖనం = ఉల్లేఖనం (త్+లే = ల్లే)
విద్యుత్ + లత = విద్యుల్లత (త్ + ల = ల్ల)
సుహృత్ + లాభం = సుహృల్లాభం (త్ + లా = ల్లా)

10. పరరూప సంధి: హల్లుల్లోని అకారానికి అకారం పరమైతే రెండో పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమవుతుంది. దీన్ని పరరూపసంధి అంటారు. 
ఉదా: 
సార + అంగము = సారంగము
(ర్ + అ = రకారంలోని అకారానికి ‘అ’ కారం పరమై రకారానికి దీర్ఘం వచ్చింది) 
సీమ + అంతము = సీమంతము 
(మ్ + అకారానికి అకారం పరమై అకార దీర్ఘం వచ్చింది)

తెలుగు సంధులు – Telugu Sandhulu
తెలుగు సంధులు: 
1. ఉత్వ సంధి
2. ఇత్వ సంధి
3. అత్వ సంధి
4. యడాగమ సంధి
5. టుగాగమ సంధి
6. రుగాగమ సంధి
7. దుగాగమ సంధి
8. నుగాగమ సంధి
9. ద్విరుక్తటకార సంధి
10. సరళాదేశ సంధి
11. గ, స, డ, ద, వా దేశ సంధి
12. ఆమ్రేడిత సంధి
13. పుంప్వాదేశ సంధి
14. త్రిక సంధి
15. పడ్వాది సంధి
16. ప్రాతాది సంధి
17. లు, ల, నల సంధి
సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది.


1. ఉత్వ సంధి: ఉత్తునకచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది (హ్రస్వమైన ఉకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది) 
ఉదా: రాముడు + అతడు = రాముడతడు (డు లోని ఉ కారానికి అకారం పరమై అకారం నిత్యంగా వచ్చింది)


ప్రథ‌మేత‌ర‌ విభక్తి శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికం అవుతుంది.
ప్రథమా విభక్తి కాకుండా ఇతర విభక్తుల్లో శత్రర్థకమైన ‘చున్’ ప్రత్యయంలోని ఉకారానికి సంధి వైకల్పికమని అర్థం.
వైకల్పికమంటే ఒకసారి సంధి జరిగిన రూపం, మరోసారి సంధి జరగని రూపం సిద్ధిస్తుంది.
ఉదా: 
నన్నున్ + అడిగె = నన్నెడిగె (సంధి జరిగిన రూపం)
నన్నునడిగె (సంధి జరగని రూపం)

2. ఇత్వ సంధి: ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదుల్లో ఇత్తునకు సంధి వైకల్పికం (ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, కాన్) మొదలైనవి ఏమ్యాదులు.
ఉదా: 
ఏమి + అంటివి: 
ఏమంటివి, ఏమియంటివి 
(సంధి జరిగిన) (సంధి జరుగని)
మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి నిత్యం.
ఉదా: చూచితిరి + ఇపుడు = చూచితిరిప్పుడు
క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. 
భూతకాలిక అసమాపక క్రియ క్త్వార్థంబు 
ఉదా: వచ్చి + ఇచ్చి = వచ్చియిచ్చి (సంధి లేనందువల్ల యడాగమ రూపం) 

3. అత్వ సంధి: అత్తునకు సంధి బహుళం. బహుళమంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అనే నాలుగు కార్యాలు ఉంటాయి. 
నిత్యంగా జరిగేవి
ఉదా: 
రామ + అయ్య = రామయ్య (నిత్యం)
సంధి జరగని నిషేధ రూపం 
ఉదా: 
దూత + ఇతడు = దూతయితడు (యడాగమ రూపం)
వైకల్పికంగా జరగడం: సంధి జరిగిన రూపం, సంధి జరగని యడాగమ రూపం రెండూ వస్తాయి.
ఉదా: 
మేన + అల్లుడు = మేనల్లుడు (సంధి జరిగిన రూపం)
మేనయల్లుడు (సంధి జరుగని యడాగమ రూపం)
అన్యవిధం: సూత్రంలో సూచించని విధంగా కొన్ని హల్లులు వచ్చి చేరతాయి.
ఉదా: 
తామర + ఆకు = తామరపాకు 
పుగాగమం అన్య విధంగా వచ్చి చేరింది.

4. యడాగమ సంధి: సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు. సంధి జరిగే అవకాశం లేనప్పుడు పర స్వరానికి ముందు ‘య్’ కారం ఆగమంగా వచ్చి చేరుతుంది.
ఉదా: 
వెల + (య్) ఆలు = వెలయాలు
మా + (య్) అమ్మ = మాయమ్మ

5. టుగాగమ సంధి: కర్మధాయంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబగుతుంది.
వివరణ: నామవాచక, విశేషణాలకు సంబంధించిన సమాసం కర్మధారయ సమాసం. ఇందులో పరస్వరానికి ముందు ‘ట్’ కారం ఆగమంగా వస్తుంది. 
ఉదా:
కఱకు+ (ట్) అమ్ము = కఱకుటమ్ము
కర్మధారయమున పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబువిభాషనగు.
పేర్వాదులు: పేరు, పొదరు, చిగురు, తలిరు.
ఉదా: పేరు + ఉరము = పేరుటురము (టుగాగగం రానప్పుడు)

6. రుగాగమ సంధి: కర్మధారయంబున ‘పేరాది’ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు.
పేరాది శబ్దాలు: పేద, బీద, ముగ్ధ, కొమ, జవ, మనుమ, ఐదవ మొదలైనవి.
ఉదా: 
పేద (ర్) + ఆలు = పేదరాలు
పరస్వరానికి ముందు ‘ర్’ కారం చేరి పేదరాలు రూపం వచ్చింది. 
మనుమ(ర్) + ఆలు = మనుమరాలు
కర్మధారయంబున తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబు రుగాగమవుతుంది.
(తత్సమ శబ్దాలు: ధీర, గుణవంత, ధనవంత, సంపన్న, గంభీర, ధైర్యవంత మొదలైనవి) 
ఉదా: 
ధీర + ఆలు = ధీరు+ ర్ + ఆలు = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంతు + ర్ +ఆలు= గుణవంతురాలు

7. దుగాగమ సంధి: నీ- నా- తన శబ్దాలకు ఉత్తర పదంబు పరమైనప్పుడు దుగాగమంబు విభాషనగు. 
ఉదా: 
నా + (దు) విభుడు = నాదువిభుడు (సంధి జరిగిన రూపం)
నా విభుడు (సంధి జరగని రూపం)
తన + (దు) కోపం = తనదు కోపం ( సంధి జరిగిన రూపం)
తన కోపం (సంధి జరగని రూపం)

8. నుగాగమ సంధి: ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైనప్పుడు నుగామమంబగు.
తద్ధర్మార్థకాలు: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే క్రియలు. హ్రస్వమైన ఉకారం చివర ఉన్న తద్ధర్మార్థక క్రియలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుందని సూత్రార్థం. 
ఉదా: 
చేయు + (న్) ఎడ = చేయునెడ 
వ్రాయు + (న్) అది = వ్రాయునది
షష్ఠీ తత్పురుష సమాస మందలి ఉకార, ఋకారంబులకు అచ్చుపరమైనప్పుడు నుగాగమంబగు. 
ఉదా: 
రాజు + (న్) ఆనతి = రాజునానతి
చెరువు + (న్) ఉదకం = చెరువునుదకం

9. ద్విరుక్తటకార సంధి: కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ‘ఱ, డ’లకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్తటకారం ఆదేశమవుతుంది. 
ఉదా: 
కు (ఱు) (ట్ట్)+ ఉసురు = కుట్టుసురు
చిఱు + (ట్ట్) ఎలుక = చిట్టెలుక 
కడు + (ట్ట్) ఎదురు = కట్టెదురు
నడు + (ట్ట్) ఇల్లు = నట్టిల్లు 
నిడు + ఊర్పు = నిట్టూర్పు
వివరణ: ద్విరుక్తటకారమంటే ద్విత్వటకారమని అర్థం. ద్విత్వటకారం ఆదేశంగా వచ్చి ఈ రూపాలు వచ్చాయి.

10. సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళములగు.
ఉదా: పూచెను + కలువలు, పూచెను గలువలు: పరుషమైన కకారం సరళంగా (గ) మారింది.
ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషణలు విభాషనగు. పూచెను + గలువలు – పూచెంగలువలు; పూచెన్గలువలు: పూచెనుగలువలు, పూచెగలువలు అనే నాలుగు రూపాలు వస్తాయి. సమాసములందు స్వత్వ సంశ్లేషణ రూపాలుండవు. అర సున్నా రూపం మరో సూత్రంతో నిషేధానికి గురైంది. ‘పూచెంగలువలు’ అనే ఒక్క రూపం మాత్రమే మిగులుతుంది.

11. గ, స, డ, ద, వా దేశ సంధి: 
1. ప్రథమం మీది పరుషాలకు గ, స, డ, ద, వలు బహుళముగానగు. ప్రథమావిభక్తిలో ఉన్న పదాలకు పరమైన పదాల్లో ఉన్న పరుషాలకు (కచటతపలకు క్రమంగా గ, స, డ, వలు) బహుళంగా వస్తాయి. 
ఉదా: 
వాడు + కొట్టె = వాడు గొట్టె
అపుడు + చనియె = అపుడుసనియె
2. ద్వంద్వ సమాసాల్లో పదాలపై పరుషాలకు గ, స, డ, ద, వలు ప్రాయికంగా వస్తాయి.
ఉదా: తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
3. తెనుగుల మీది సాంస్కృతిక పరుషాలకు గ, స, డ, ద, వలు రావు. తెలుగు పదాలకు పరంగా వచ్చిన తత్సమ పదాల్లోని పరుషాలకు గ, స, డ, ద, వలు రావు. 
ఉదా: 
వాడు + కంసారి = వాడు కంసారి
వీడు + చక్రపాణి = వీడు చక్రపాణి
(ఈ ఉదాహరణలో క, చ అనే పరుషాలకు గ,స,లు రాలేదు)

12. ఆమ్రేడిత సంధి: 
1. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగానగు. ద్విరుక్తం పదరూపం ఆమ్రేడితం. ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్ఛరించినప్పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఆమ్రేడితమంటారు. 
ఉదా: 
ఔర + ఔర (ఆమ్రేడితం) ఔరౌర
ఆహా + ఆహా = ఆహాహా
2. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్తటకారంబగు (కడాదులు: కడ, చివర, తుద, మొదలు, తెరువు, నడుమ మొదలైనవి) 
ఉదా: 
క(డ)ట్ట + కడ = కట్టకడ 
చివ(ట్ట)ర + చివర = చిట్టచివర 
కడాదుల్లో తొలి అచ్చు తర్వాత వర్ణాలన్నింటికీ లోపం వచ్చి వాటి స్థానంలో అదంతమైన ద్విత్వట్టకారం వచ్చింది. 
3. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యములు. 
ఉదా: 
అందుకు + అదుకు = అందదుకు
చెర + చెర = చెచ్చెర లాంటి రూపాలు యథావిథిగా గ్రహించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం.

13. పుంప్వాదేశ సంధి: కర్మధారయమందలి ము వర్ణానికి ‘పుంపు’లగు ము వర్ణానికి ‘పువర్ణం’ బిందు పూర్వక పువర్ణం (ంపు) రెండు రూపాలు వస్తాయి. 
ఉదా:
సరసము + మాట = 1. సరసపు మాట 2. సరసంపు మాట
విరసము + వచనం = 1. విరసపు వచనం 2. విరసంపు వచనం


14. త్రిక సంధి: 
1. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికములు అంటారు. ఉదా: ఆ + కన్య
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా: ఆ + క్కన్య
3. ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికంబగు దీర్ఘం హ్రస్వం అవుతుంది.
ఉదా: ఆ + క్కన్య = అక్కన్య మూడు సూత్రాలతో – అక్కన్య రూపం వస్తుంది.

Sandhi in telugu


17, సెప్టెంబర్ 2022, శనివారం

నవ తెలంగాణ సంపాదకులకు,పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలతో.....///మాకేం దొఖా?///బీర్లో ముంచి బిర్యానీలో కుక్కి ఓట్లు దండు కొన్నాముఓట్లుకాదనీ సీట్లూ కొన్నాముగద్దె నెక్కిన పాలన మాదిసర్వం మాదైనప్పుడు మురువొద్దు మరీపోలీసోళ్ళు మా వోళ్ళు చట్టం రూపొందించేది అమలు పరిచేదీ అంతా మేమేమాటల గారడితో మతులు విరక్తి కలుగోద్దనీ భక్తిని రక్తి కడుతున్నది విద్వేషాలు బుసలు కొట్టినోల్లము మనుషుల్ని మత్త కొలుపమా ? వెన్నతో వెన్నుపోటు నేర్చినోల్లమ్పన్ను పోటు ప్రతాపం చూపమా? కోట్లుపోసి అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నంఅశాంతి చిటపటలతో శాంతి సస్యశ్యామలం చేస్తున్నంఅర్థం చేసుకోండి దేశాన్ని ముందుంచుతామునమ్మిన సర్కార్ సంస్థలు అమ్మినా ఆకలి సూచిలో అప్ఫుల సూచీలోనైనాజగత్ కుబేర సంకల్పం మా కల గెలుపు పెట్టుబడి అతడు మర్యాదొద్దా?నిరూపనైతే కదా ఆర్థిక ద్రోహి అప్పట్దాక దగ్గరుండి సెండాఫ్ చేద్దాం దాసిన బ్యాంకుల్నీ మూసినా సరే కూటికి లేకుంట అయితది కావొచ్చు ఐతే మాత్రం ఐదు తరాలకు కూడపెట్టాలే కదా ఇంకేం? మేధావులకు భయం పుట్టించినం ప్రశ్నించే గొంతులను మ్యూట్లో పెట్టినమ్ తార్కికుడు తందాన పాడుతుండు ఒర్రుబోతు ముద్రేసి నిర్ణయించినమ్ సకల విద్దెలతో గద్దె నెక్కితిమి బుద్దికలిగి ప్రశ్నించినోల్ల ఎనలేని జాలి కలిగి నొప్పి తెలియని శిక్షలు అమలుచేయడానికి హై టెక్కులతో జైళ్లను ఆధునీకరిస్తున్నాము చరిత్ర పునరావృతం అభూత కల్పనచరిత్ర లేనోడు చరిత్ర సృష్టిస్తడా?అదంతా వట్టిదే లంక తిరుగుబాటా?అంతా సీనుందా ఈ దేశానికీఆ ఆలోచనలొస్తయా ఈ మనుషులకీ ఎవరి చేతులో ఎవరుండకుండా?ఒకని చేతిలో ఒకని పెట్టినమ్ సమయమొస్తే ప్రాణాలు తీసుకోనైనావాళ్ళే తన్నుక సస్తరు మాకేం దొఖా?డా. సిద్దెంకి యాదగిరి 9441244773(లంకలో తిరుగు బాటు దారులు అధ్యక్షుని ఇంటిలోకి చొరబడ్డ సంఘటన ఆధారంగా...)

17, జులై 2022, ఆదివారం

సిద్దిపేట జిల్లా కథా సాహిత్యం

 

                             సిద్దిపేట జిల్లా కథా సాహిత్యం                                                                    -డా. సిద్దెంకి యాదగిరి

          ప్రపంచ కథా సాహిత్యానికి ఆదిపురుషుడైన గుణాడ్యుడు నడయాడిన నేల మంజీర దేశమని పిలవబడిన మెదక్‌ జిల్లా ప్రాంతం. మెదక్‌ పట్టణానికి కొండాపూర్‌ కి విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో 2016 అక్టోబర్‌ 11న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అక్కన్నపేట, హుస్నాబాద్‌, కోహెడ, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలతో నూతనమైన సిద్దిపేట జిల్లా ఏర్పాటయింది. సంగీత సాహిత్య కళ్లకు ప్రసిద్ధి ప్రసిద్ధిపేట. కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన ప్రాంతం సిద్దిపేట. 

          ఇక్కడి కథలు సాంఘిక సమకాలీన అంశాలను పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చిత్రించాయి. గజ్వేల్‌కి మారుమూల ప్రాంతమగు వడ్డేపల్లికి చెందిన బెల్లంకొండ వెంకటాచార్యలు భక్త విజయంఅనే కథ బహుశ సిద్దిపేట జిల్లా తొలి కథ కావొచ్చు. వీరి సోదరులు బెల్లంకొండ నరసింహాచారి దేశబంధుఅను పత్రికను 1927-30 మధ్యకాలంలో నడిపారు. వీరిద్దరూ వడ్డేపల్లి సోదరులు జంట రచయితలుగా పలు రచనలు చేసారు. తెలుగు సాహిత్యంలో వెట్టి విధానానికి వ్యతిరేకంగా మొట్టమొదటి సియాసీ సభలుఅను కథ వెట్టికి వ్యతిరేకంగా రాయబడిన తొలికథగా ప్రసిద్ధ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ అభిప్రాయం1 వెల్లడిరచారు.

          గుళ్ళపల్లి తిరుమల యదగిరిరావు 6 మార్చి 1922న చేర్యాల పట్టణంలో జన్మించారు. 1943 ప్రాంతంలో తప్పేమిలాంటి కథలు రాసారు. 1974లో కైవల్యం చెందారు.

          మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రిస్తూ తెలంగాణ యాసలో భాషలో అనేక కథలు రచించినది ఉమాపతి పద్మనాభ శర్మ సిద్దిపేట పట్టణంలో 1936లో జన్మించారు. బతకనేర్చిన మృత్యువు’, ‘చంక్రమణం’, ‘మరపురాని వసంతం’, ‘చీకటి కురిసిన రాత్రి’, ‘సుప్త చైతన్యం’, ‘మసిబారిన సెంద్రుడుమొదలైన కథలు రాశారు.

          ముదిగొండ ఈశ్వర చరణ్‌ సిద్దిపేటలో 09-09-1937లో జన్మించారు. జలజ నేర్చిన పాఠంఅను కథ రాసారు. తెలుగు సాహిత్యాన్ని మేల్కొల్పిన సాహిత్యంలో ప్రముఖ కవి జ్వాలాముఖి. పూర్తిపేరు వీరరాఘవాచార్యులు. వీరు 1938వ సంవత్సరంలో దుబ్బాక మండలం ఆకారం జన్మించారు. వీరు స్థిరపడ్డది హైదరాబాద్‌లో. ప్రజా సాంస్కృతిక ఉద్యమకర్త వక్త. వీరి రచనల్లో అభ్యుదయ, విప్లవ భావాలు కనిపిస్తాయి. వీరి మా ఫలేషు కదాచనకథలో తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకున్న కూతురు. కూతురు భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు తండ్రి. తిరగబడ్డ ఊరి జనంపై కేసులు పెడతాడు తండ్రి. యావజ్జీవ శిక్ష పడిన పెరుమాలయ్య శవాన్ని ఊరంతా కలిసి శవ యాత్ర చేస్తారు. ఒక మాల పిల్లవాడు నిప్పు పడుతూ నడుస్తాడు. ధ్వజస్తంభం మీద గీతా శ్లోకం ముక్కచెక్కలై కనబడుతుంటే దొర కూతురు పెళ్లి చేసినా ఆచారి కొడుకు చూసి చదివాడు మా ఫలేషు కదాచన.

          డిప్యూటీ ఏ.ఈ. గా రిటైర్‌ అయిన బదునపల్లి గంగారం సిద్ధిపేటలో  జన్మించారు. (1939-2015) మంగళంలో అమంగళంఅను కథతో పాటు మరో 14 కథలు రచించారు.

          తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ నేల నుంచి రెండవ కథకుడు అస్తిత్వాన్ని కేతనంగా ఎగరవేసిన రుద్రవరం ఎల్లయ్య 1940లో హుస్నాబాద్‌లో జన్మించారు. తొలి కథ 1964లో రాశాడు. రిజర్వేషన్‌లు ఎందుకు?’3, ‘పావురాలు’, ‘అక్షర శక్తిఅనే కథా సంపుటాలను ప్రచురించారు. దళిత చైతన్యం తేవడం కోసం కథలనుపయోగించాడు.

          కథకులు, నటుడు, దర్శకుడు సిహెచ్‌ నారాయణ దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో 1941లో జన్మించారు. వీరు యాభైకి పైగా కథలు రచించారు. వందకు పైగా నాటకాల్లో నటించారు. దర్శకత్వం వహించారు. వీరి రచనలు కథాప్రపంచం’, కొత్త గులాబీరాశారు.

          దారం మల్లారెడ్డి నంగునూరు మండలం ముండ్రాయ గ్రామానికి చెందినవాడు. వారి మిత్రుడు ఆంజనేయులుతో కలసి 1965 - 1971 వరకు ఆమపేరుతో జంట కథకులుగా చాలా కథలు రాశారు. వివిధ ప్రజా సంఘాల్లో పనిచేశారు. ఒక ఐదు పెసలైన..... పది పైసలైన ఉంటే ఇవ్వండికథ రాశారు.

          కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు వంగగాల్‌ రెడ్డి రంగధాంపల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలో జన్మించారు. వీరి కథ శకునం4 రాసారు. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారు 1531 రోజులపాటు ప్రత్యేక రాష్ట్ర ఆశయాన్ని చాటడానికి దీక్ష శిబిరం నడిపారు.

          రేడియో అనౌన్సర్గా పదవి విరమణ పొందిన ఉమాపతి బి. శర్మ సిద్దిపేట పట్టణంలో 1944లో జన్మించారు. వీరి కథ ఏది పుణ్యం ` ఏది పాపం’(విశ్వ రచన, మే 1973) కథ వీరికి పేరు తెచ్చింది. బహుశ ఇదే దళితేతరులు రాసిన తొలి దళిత కథ కావొచ్చు.

          సిద్దిపేట మండలం దోర్నాల గ్రామానికి చెందిన కె. వై. గిరి 1945లో జన్మించారు. వీరి తొలి కథానిక ఆరని జ్యోతిఇందులో ప్రేమికుని పెళ్లి చేసుకోలేక పోతున్నాను అని మరణవాంగ్మూలం రాసి తనువు చాలించారు సరోజ. వీరు దాదాపు పది కథలు రాశారు.

          కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో గొల్లపల్లి పట్టాభిరామ శర్మ 1945లో జన్మించారు. 20కి పైగా కథలు, చతురంగం కథా సంకలనంలో వీరు భాగస్వాములు.

          నటుడు, రచయిత, చిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు, తెలంగాణ చరిత్ర, సినీ దర్శకుడు బి. నరసింగరావు ప్రజ్ఞాపూర్‌ 1946లో జన్మించారు. వీరి కథ చలిదీన దరిద్రులు చలికి పడిన పాట్లను వివరించింది.

          కథాశిల్పి ఐతా చంద్రయ్య 1946 సంవత్సరంలో సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో జన్మించారు. వీరి తొలి కథ  దేవ రథము5 1965లో ప్రచురితమైంది. మంచు ముద్ధ’, ‘కలికి గాంధారి’, ‘వరాల మూట’, ‘విముక్తి’, ‘బామా సాహిమొదలైన వాటితో పాటు 22 కథాసంపుటాలు తెచ్చాడు. వీరి కథలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. దాదాపు ఏడు వందలకు పైగా కథలు రాసి తెలుగు సాహిత్యానికి అందించాడు.

          ముదిగొండ సాలాగ్రామ్‌ 1947లో సిద్ధిపేట నందు జన్మించారు. తొలుత హింది కథను తెలుగులోకి మండమాలపేరుతో అనువాదం చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు సారస్వత సమితి కథాపోటీలలో పథికుడుఅను కథ ఉత్తమ కథగా నిలిచింది. 1964`69 మధ్య కాలంలో ఆంధ్ర భూమిలో వీరివి 5 కథలు అచ్చయ్యాయి. వీరి కథ టెస్ట్‌ ట్యూబ్‌లో కన్నీరుఆంధ్ర జ్యోతి వార పత్రికలో, వెన్నెల విరిసిన రాత్రిఆంధ్ర ప్రభ వార పత్రికలోనూ 1956లో రేడియోలో ప్రసారమైంది.

          1949లో సిద్దిపేటలో జన్మించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎల్‌ సత్యనారాయణ రాధి6 కథ జనధర్మ పత్రికలో రాశారు.

          కంశ్రీ అనే కలం పేరుతో రచనలు గావించిన రచయిత కందుకూరి శ్రీరాములు. సిద్దిపేట మండలం రావురూకుల గ్రామానికి చెందిన వీరు 1951లో జన్మించారు. 1980 దశకంలో ఆనాడున్న ప్రధాన పత్రికల్లో వీరి కథలు అచ్చు అయ్యాయి. లీల’, ‘రథం’, ‘జయశ్రీ’, ‘ప్రేమించిన మనిషి’, ‘కర్టెన్‌’, ‘ఆహుతి’, ‘మూగ పుట్టుక’, మొదలైన కథలు పేరుగాంచినవి.

          గులాబీల మల్లారెడ్డి 26-1-1952లో హుస్నాబాద్‌లో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. మంచి కథకులు. పల్లె పొలిమేర’, ‘జనమేవ జయతే’, ‘ఎన్కౌంటర్‌’, ‘కోర్టు రణభూమి వేయి యుద్దాలు’, ‘నా లక్ష్యం నా గమ్యంవీరు తొలి కథ పంచ రాగి’,’లవ్లీ పేరెంట్స్‌’, ‘ఇది దేవత కథనే’, ‘ఎవరు కారకులు’,’రాలిన స్వప్నం’, ‘క్యాంపస్‌ లో వేపచెట్టు’, వీరి కథా సంపుటి పేరు జర్నలిస్టు కథలు.7

          అందుకో దండాలు బాబా అంబేద్కరాఅనే గీతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రసిద్ధిగాంచిన మాస్టార్జిది బయ్యారం గ్రామంలో 7-9-1952న జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితల కళాకారుల మేధావుల దరకమేఐక్యవేదిక కార్యదర్శిగా పనిచేశారు. కథలు, కవిత్వం, మూలవాసుల పాటలు, నాటకాలు ఎన్నో రచించాడు. అగ్రకులాలకు దళితులతో అవసరం వస్తే కుల వివక్షత అంటూ ముట్టు ఉండదు. అవసరం లేకుంటే అంటూ ముట్టు ఉంటుందని చెప్పే కథ అవసరం వస్తే’.8  దాదాపు 15కథలు వరకు రాశారు.

          తెలంగాణ జన జీవితాన్ని పోరాట పంథాను అక్షరీకరించిన సుప్రసిద్ధ నవలాకారుడు కథా రచయిత సరిపల్లి కృష్ణారెడ్డి సిద్దిపేట పట్టణంలో 1953లో జన్మించారు. వీరు దాదాపు 30 కథలు. బిగిసిన పిడికిళ్లుఅను వీరి కథలో గొల్ల యాదయ్య చెట్లు నరికి నందుకు గదిలో బంధించిండు దొర. విడిపించడానికి వచ్చిన కులపోళ్లు దొర కాళ్లు పట్టుకొమ్మన్నరు. వాళ్ళ మాట కాదని తిరగబడ్డాడు యాదయ్య. అతని భార్య ఇద్దరు దొర తుపాకీ తూటాలకు అందరు చూస్తుండగానే బలయ్యారు. అక్కడున్న వారిలో మార్పు ఆవేదన దావాగ్నిలా దహించివేస్తుంది. తత్ఫలితంగా దొరలపై తిరగబడ్డానికి అందరి పిడికిళ్లు బిగుసుకున్నాయని ముగిస్తాడు.య1975లో వీరు నవసాహితి సంస్థను ఏర్పాటు చేశారు.

          1953 మార్చి 24న జన్మించిన జలజా రాణి కథకులు. వీరి తొలి కథ కనువిప్పు9, ‘అత్తకు కొండంత అండమొదలైన కథలు 30 వరకు రాశారు.

          కథల తాతయ్యగా పేరుగాంచి బడి పిల్లలకు కథలు రాయడం తెలియజేస్తున్న బాల సాహితీ మిత్రులు ఎన్నవల్లి రాజమౌళి 25 డిసెంబర్‌ 1953లో సిద్దిపేట మండలం ఎన్సాపన్‌పల్లిలో జన్మించారు. వీరి తొలి కథ చదువురాని మంగమ్మ’, ‘పది రూపాయలకు లక్ష వడ్డీ’, ‘మానవత్వం’, ‘మతాతీతం’, ‘అత్త కాదు అమ్మ’, అమ్మ ఫోటోనైతమొదలగు కథలు 20కి పైగా రాశారు. వీరి కథా సంపుటి పేరు పది రూపాయలకు లక్ష వడ్డీ’. బాల కథలు కూడా రాశారు.

          తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌ నందిని సిధారెడ్డి బందారం గ్రామం కొండపాక మండలంలో 02`05`1954లో జన్మించారు. 2021-22మధ్యకాలంలో బందారంకథల పేరిట మూసీ పత్రికల్లో క్రమానుగతమైన కథలు బందారం కథలురాస్తున్నారు. వీరు ఏది రాసిన నిత్యనూతనం. విశ్వజనీనంగా ఉంటుంది. కథల్లోనూ కవిత్వం ప్రవేశపెట్టడం ప్రత్యేకత.

          వీరి ప్రసిద్ధ కథ చిత్ర కన్ను.సిద్ధోగం చేసిన తర్వాత ఎల్లమ్మకు చిత్రకన్నుపెడితే ఎల్లమ్మ చూపు ఎంత దూరం ఉంటే అంత దూరం ఉన్న ఏ జీవి అయినా మాడి మసి అవుతుందని నమ్మకం. ఈ కథ కూడా అగ్రవర్ణాలతో గొడవకు దిగిన దళితుల పరిస్థితి అలాగే ఉందని చిత్రించిన కథ. ఈ చిత్ర కన్ను1979 జూలై రాశారు. ఈ కథ రాసిన ఐదు సంవత్సరాల తర్వాత దేశాన్ని కుదిపేసిన కారంచేడు సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వీరి కథలు కుల కశ్పి’, ‘హృదయం’, ‘సిల్లీ గర్ల్స్‌’ ‘పుల్లర’, ‘పాముల మధ్య చీమమొదలైన ప్రసిద్ధ కథలు. చిత్ర కన్నుకథా సంపుటి. తొలి వ్యవస్థాపక అధ్యక్షులుగా నందిని సిద్ధారెడ్డి. తెరవే ఆధ్వర్యంలో తెలంగాణ సోయి పేరిట త్రైమాసిక పత్రికను తెచ్చారు. ప్రతీ సంచికలో దాదాపు నాలుగు కథలు ఉండేవి.

          మహమూద్‌ పాషా సిద్దిపేటలో 24 జూలై 1954లో జన్మించారు. వీరి తొలి కథ ఆసర’,10తాయిమారెండు కథలు రాసారు. 10వరకు వ్యాసాలు రాసారు.

          కవి, రచయిత, విమర్శకులు, పరిశోధకులు, ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ 16`8`1954లో జన్మించారు. వీరిది సిద్దిపేట జిల్లా మూలాలు గల గజ్వేల్‌ పక్కనున్న జాలిగామా గ్రామము. వారి మిత్రుడు చింతపట్ల సుదర్శన్‌తో కలిసి సిహెచ్‌ ఎస్వి పేరుతో పదహారేళ్ల వాడుఅనే కథ రాశారు. ఈ కథ హైదరాబాద్‌ అభ్యుదయ రచయితల సంఘం సంకలనం చేసిన కెరటాలు1972లో అచ్చయ్యింది. వీరి మరో ప్రసిద్ధ కథ వలస’, ‘అరిటాకుమొదలైన కథలు రాసాడు. దాదాపు పదికిపైగా వివిధ రకాల పుస్తకాలు రచించారు.

          వినూతనమైన కథన శైలి, ఆకట్టుకునే అభివ్యక్తి కల కథకులు అనువాదకులు. విమర్శకులు. సమీక్షకులు. జర్నలిస్టు ఎగు మామిడి అయోధ్య రెడ్డి సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో 11 ఫిబ్రవరి 1955లో జన్మించారు. వీరి కథలు ప్రధాన పత్రికలు అన్నిటిలో అచ్చయ్యాయి. వీరి కథా సంపుటాలు ఆహార యాత్ర’, ‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’. కొన్ని ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ అనువాద నవలలు కొన్ని తెలుగులోకి అనువదించారు. పదిహేడు దేశాల పందొమ్మిది రచయితల కథలు కథా సంగమమంపేరిట 2022లో వెలువరించారు.

          జనం మెచ్చిన జర్నలిస్టుగా, జర్నలిస్టు, కథకులు కవి సుపరిచితులు కొమరవెల్లి అంజయ్య 9`08`1955లో సిద్దిపేట పట్టణంలో జన్మించారు. 1973 నుంచి కథలు, . 20కి పైగా కథలు రచించారు. పేదలకు ఉన్నత వర్గాలకు ఉన్న తారతమ్యాన్ని వ్యక్తీకరించిన కథ వరదలు11. 

          సిద్ధిపేట మం. మిట్టపల్లి గ్రామము చెందిన బి. గోపాల్‌., ఏ. జయరాంలు అను జంట రచయితల కథలు ముద్రితమయ్యాయి.

          దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి చెందిన దాసరాజు రామారావు 1`7`1955లో జన్మించాడు. వీరి కథ మట్టి ఎర్రబడిరది’. ఊరి కరణం వద్ద మైసడు మస్కూరి. గిర్దావార్‌ ద్వారా జాగ ఇప్పిస్తానని ఆశ పుట్టిస్తాడు. ఖర్చులకి కానీ డబ్బులు వసూలు చేస్తాడు చివరకు మాదిగ రంగనికి అదే జాగను పట్టా చేయిస్తాడు. నాకు ఇస్తానని చెప్పిన జాగా పట్టా కాయితాలు మైసడు అడుగుతాడు. నువ్వు ఇచ్చిన ఐదు వందలకు నీకేం భూమి దొరుకుతదిరా గాడిది కొడుకా అని తిడుతున్నప్పుడు మైసడికి మైసమ్మ ఆవహించింది.      

          ఐలేని గిరి దుబ్బాక మండలం ధర్మాజీపేటలో 1961లో జన్మించారు. వీరు దాదాపు 20కి పైగా కథలు రాశారు. లభ్యమవుతున్న కథ శృతి లయలుమెతుకు కథలు సంపుటిలో ప్రచురితమైంది.

          సిద్దిపేట మండలం పొన్నాల గ్రామంలో జన్మించిన కథకులు, కవి, విమర్శకులు, చిత్రకారులు పర్కపల్లి యాదగిరి 31-12 -1961లో జన్మించారు. వీరి తొలి కథ శిల్లర జిత్తు’, ‘పాతాళ గరిగె’, ‘గూడు’, ‘పాములు’, ‘పొలిమేర దాటి వేల’, ‘పేగు ముడి’, ‘పోరడు’, ‘చీమలుమొదలైన కథలు 250 వరకు రాశాడు. వీరి కథా సంపుటి శికారివెలువరించారు. వీరు కొండి మల్లారెడ్డితో కలసి సిద్ధిపేట కథలుకథా సంపుటి తెచ్చారు. 

          కీ.శే. పోగుల రాజన్న మంచి కథకుడు. ఆయన రాసిన కథ మరణ వాంగ్మూలంఆంధ్ర ప్రభలో అచ్చైంది. భార్యను కాల్చేసి అబద్ధపు మరణవాంగ్మూలం ఇప్పించాడు భర్త. బిడ్డ మీద ప్రీతితో ఆమె అలానే చెప్పింది. అలా చెప్పకపోతే నీ కుటుంబాన్ని మన కూతుర్ని చంపేస్తానని బెదిరించాడని అందుకే అలా చెప్పానని ఎస్సైతో చెప్పింది. పెళ్లి కావాల్సి ఉన్న చెల్లెలు ఏదో సాధించాలని నిమగ్నమై పోయిందని ముగించిన కథ మరణవాంగ్మూలం.మరో రెండు కథలు బీడి బతుకులు’, వరకట్నం అంశాలపై కూడా కథలు రాశారు. వీరి మరణానంతరం వీరి మిత్రులు సెలవింకఅనే కవితాసంపుటి తెచ్చారు. అకాల మరణం పొందారు.

          బహుగ్రంధకర్త అన్నవరం దేవేందర్‌ హుస్నాబాద్‌ మండలం పోతవరం గ్రామంలో 17 అక్టోబర్‌ 1962లో జన్మించారు. బి.ఎస్‌.రాములు సాన్నిహిత్యంలో కొన్ని కథలు రాశారు.

          అక్షరాలతో నాటకీయతను చూపించే నవలాకారుడు కథా రచయిత, కవి, విమర్శకులు, చొప్పదండి సుధాకర్‌ చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌ గ్రామంలో 1963వ సంవత్సరంలో జన్మించారు. వెన్నెల కుప్పలువీరి కథాసంపుటి.  వీరి అన్న కీ. శే. చొప్పదండి కుమారస్వామి కథా రచయిత. వేదన’, ‘అవివేకిఅనే కథల ద్వారా స్పూర్తి పొందారు.

               కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి చెందిన వంగర నర్సింహారెడ్డి 7 మార్చి 1964లో జన్మించారు. శ్రావణి’,  బంగారు ఉపిల్ల’, ‘పెంపకం’, ‘వెలుగుబాట’, బాల్యం లాంటి కథలతో పాటు దాదాపు పది కథలు రాశారు.       

          కథకులు, కవి, విమర్శకులు,  బి.వి.ఎన్‌ స్వామి కోహెడ మండలం వర్కోలు గ్రామంలో 16 డిసెంబర్‌ 1964లో జన్మించారు. వీరి తొలి కథ పరీక్ష’(2000), ఇప్పటి వరకు దాదాపు 100 కథలు రాశారు. నెలపొడుపు’, ‘రాత్రి పగలు’, ‘ఒక మెరుపుమొదలైన కథా సంపుటాలు వెలువరించారు. వీరు ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం ఒక పరిశీలన 1970-2000అనే అంశంపై పరిశోధన పూర్తి చేసారు. వీరు కర్ర ఎల్లారెడ్డితో కలసి తెలంగాణ సాహితీ పబ్లికేషన్స్‌ ద్వారా తెలంగాణ చౌక్‌అను ఉద్యమ కథా సంకలనాన్ని 2011లో ప్రచురించారు.

          గూడూరి అమరావతి, నల్లవోలు మనోహర్‌ హుస్నాబాద్‌ నుంచి కొన్ని మంచి కథలు రాశారు.

          సిద్దిపేట పట్టణంలో 1964లో జన్మించిన వి. శ్రీనివాస్‌ ఇప్పటి వరకు ఐదు కథలు రాశాడు.

          కట్కూరు గ్రామానికి చెందిన పి. పద్మజ రాసిన కథ రాజేశ్వరిఅను కథ రాసింది. అల్లం రాజయ్య, తుమ్మేటి రాజయ్య సంపాదకత్వం వహించిన కథా సంకలనం ఋతుపవనంలో ప్రచురించబడిరది.

          పదునైన కథనం, ఆకట్టుకునే శైలితో రాణిస్తున్న కథకురాలు శ్రీమతి ఏదునూరి రాజేశ్వరి 10 సెప్టెంబర్‌ 1966లో జన్మించింది. హుస్నాబాద్‌ మండలం పోతరం ఎస్‌ మెట్టినిల్లు. జయ జయహే తెలంగాణ’(2012), తొలి కథ రాసింది. అత్తా కోడలు’, ‘తెగింపు’, ‘కరోనా తెచ్చిన కలవరంకథకు కరోనా శతాధిక కథా సంకలనంలో చోటు దక్కింది. వల్లనే వల్లనే’... మొదలైన కథలు రాసి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. తన కథల్లోని పాత్రలు తేట తెలంగాణ జీవభాషలో మాట్లాడుతారు...

          మచ్చ అనురాధ దుబ్బాకలో 1967 మార్చి 2న జన్మించింది. వీరి తొలి కథ ఆదర్శ రైతు’. బాల సాహిత్య సృజన చేస్తున్నారు.

          మౌన సాక్షి’, ‘అరుగుకథా సంపుటాలతో దూసుకుపోతున్న వర్తమాన కథారచయిత వేణు నక్షత్రం. వీరు సిద్దిపేటలో 1968లో జన్మించారు. అమెరికాలో స్థిరపడ్డారు. వీరి తొలి కథపర్యవసానం’, ‘రైల్వే సత్యం’, ‘పిలుపుమొదలైన కథలతో పాటు ఇప్పటివరకు దాదాపు 25 కథలు రాశారు.

          సాహితీ సాంప్రదాయాలు కలబోసిన కుటుంబంలో గుమ్మన్నగారి బాల సరస్వతి 1971లో దుబ్బాక మండలం పోతరెడ్డిపేట్‌ లో జన్మించారు. రామితెలంగాణ యాసలో రచించారు.

          గోనెపల్లికి చెందిన గజ్జల కనకరాజు 12 మే 1968లో జన్మించారు. వీరి తొలి కథ కష్ట జీవి’, ‘పిల్లలు దేవుడు’, ‘ఈతరం అల్లుడు’, ‘రేపటి పునాది’, ‘మానవీయం’, ‘ఉత్తరాల కథమొదలైన కథలు రాశారు. వీరి కథలు హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి.

          ఒకవైపు పాత్రికేయ వృత్తి. మరొకవైపు అక్షరాలతో తిత్తితో కలంతో కత్తి చూస్తున్న కథా రచయిత బోయిని భాస్కర్‌  హుస్నాబాద్‌ మండలం, పోతారం గ్రామంలో 1970 ఆగస్టు 15వ తారీఖున జన్మించాడు. వీరి తొలి కథ కన్నెమోజు’ (1993), ‘దేవున్ని చూడాలని ఉంది’, ‘నల్ల మల్లి’, ‘ఆమె’, ‘వలస’, ‘మబ్బు పట్టిన వెన్నెల’, ‘బావొచ్చే యాల్లయ్యింది’ ‘గడ్డిపువ్వు12  మొదలైన కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. దాదాపు 20 కథల వరకు రాశారు. త్వరలో కథా సంపుటి తేవడానికి సిద్ధమవుతున్నాడు.

          వేముగంటి మురళి 10`06`1972లో సిద్దిపేట పట్టణంలో జన్మించారు. వీరి తొలి కథ జాతరతో ముక్కలైన రెక్కల కష్టంమొదలైనవి కథలతో పాటు దాదాపు 20 కథలు రాశాడు. బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ కలసి ఉమ్మడి మెదక్‌ జిల్లా కథా సాహిత్యాన్ని మెతుకు కతలు2016లో ప్రచురించారు.

          తొగుట మండలం వెంకట్రావు పేట గ్రామంలో జన్మించిన రాయరావు సూర్య ప్రకాష్‌ రావు 18 నవంబర్‌ 1972లో జన్మించారు.  కవి, కథకలు వీరి కథ ఉల్టా తిరిగిన కథ’.

          దాస్యం లక్ష్మయ్య హుస్నాబాద్‌కు చెందినవారు. వీరు కవి రచయిత. హత్య’, ‘తల్లి పానం’, ‘సదువు’, ‘సిగ్గుమొదలైనవి వీరి కథలు.

          దళిత అస్తిత్వ నివేదనతో జీవితం అల్లుతున్న కథకులు తప్పెట ఓదయ్య 15 -10-1972లో బెజ్జంకి మండలం దాచారంలో జన్మించాడు. వీరి తొలి కథ మలక్క14, ‘మీరేంటోళ్ళు సార్‌’, ‘కలిమాయ’, ‘ఎంతెంత దూరం’, ‘మనాదిమొదలైనవి ప్రసిద్ధ కథలు. దాదాపు పది కథలు రాశారు. దళిత కథా వార్షిక సంపాదకులు. మొగ్గ పూసలు’, ‘అలకల పోతవీరి కవితా సంపుటాలు.

          కోహెడ మండలం మండలం వింజపల్లి గ్రామానికి చెందిన సువర్ణ దేవి 14 డిసెంబర్‌ 1972లో జన్మించారు. వీరి తొలికథ మార్పు’,’ఆడ పిల్ల’, ‘పెంపకం’, ‘వెలుగుబాట’, బాల్యం లాంటి కథలతో పాటు దాదాపు పది కథలు రాశారు. బతుకమ్మ’, ‘బొడ్డెమ్మఉయ్యాల పాటల సంకలనాలు వేశారు.

          కవిగా పాటలు కవితా సంపుటాలు తెచ్చిన దాస్యం లక్ష్మయ్య హుస్నాబాద్‌ కు చెందిన వారు. వీరు కవి రచయిత. హత్య’, ‘తల్లి పానం’, ‘సదువు’, ‘సిగ్గుమొదలైనవి వీరి కథలు.13

          ప్రపంచీకరణతో ధ్వంసమవుతున్న మానవీయ కోణాన్ని, బహుజన తత్వాన్ని అందిస్తున్న కథకుడు డా. వెల్దండి శ్రీధర్‌ కోహెడలో 15 ఏప్రిల్‌ 1973లో జన్మించారు. కథా కచ్చీరు పేరిట 2018 నుంచి గత నాలుగు సంవత్సరాలుగా కథాకాలం నిర్వహిస్తున్న విమర్శకులు, విశ్లేషకులు. తెలంగాణ కథావార్షిక సంపాదకులు. వీరి తొలి కథ అక్షరాలు ఏడుస్తున్నాయి (1997), ‘పడుగు పేకలుకథాసంకలనం.పొక్కిలివట్టికోట ఆళ్వారుస్వామి అవార్డు పొందిన కథ. నాలుగు కోట్ల పిడికిళ్ళు’, ‘పుంజీతం’, ‘పుండు’, ‘అంగడి’,  పాజిటివ్‌’,  కాసేపుల్ల’,  సజీవదహనంమొదలైన కథలు. దాదాపు 18 కథలు రాశారు. పుంజీతంకథాసంపుటి. తెలంగాణ కథా సాహిత్యాన్ని విశిష్ట స్థాయికి తీసుకుపోతున్న కథా కచ్చీరు కాలమిస్టు, వార్షిక తెలంగాణ కథావార్షిక సంపాదకులు.

          కోహెడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన డా. పొన్నాల బాలయ్య 4 సెప్టెంబర్‌ 1973లో జన్మించిన. వీరి తొలికథ గోరి’, ‘స్మోక్‌ లెస్‌ కోల్‌’, ‘దుఃఖపు మేఘంకథలతో పాటు పది కథలు రాశారు. ఎగిలివారంగ’, ‘దందెడ’, ‘మిగ్గువీరి కవితా సంపుటాలు. త్వరలో రాబోయే వీరి నవల లంద.

          బాధల్ని, గాధల్ని ఇప్పుడు వీస్తున్న గాలిగా ప్రవచిస్తున్న కొండి మల్లారెడ్డిది పదునైన శైలి. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌ గ్రామంలో 17-04-1973లో జన్మించినారు. వీరి తొలి కథ రంగధాంపల్లి చౌరస్తా’(2012) తెలంగాణ ఉద్యమ కాలంలో వలసవాదుల కుట్రల పసిగట్టిన కథ. వాగవతల మడి’, ‘కొమ్ముల బర్రె’, ‘గూడు’, ‘బుగులుమొదలైన కథలు రాశాడు. వీరు, పర్కపల్లి యాదగిరి సంపాదకత్వంలో సిద్దిపేట కథలు సంకలనంగా తెచ్చారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తర్వాత వచ్చిన తొలి కథా సంకలనం.

          బైతి దుర్గయ్య చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో 5 ఆగస్టు 1974లో జన్మించారు. కలం పేరు భైతి దుర్గం. వీరి తొలి కథ తనువంతా తానే (2017)ఇప్పటివరకు 42 కథలు రాశారు.

          కోహెడ మం. నాగసముద్రాల గ్రామానికి చెందిన చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసిన కవి, కథకుడు డా. తైదల అంజయ్య 25-5-1975లో జన్మించారు. ఒక తుపాకీ మాట’, ‘గుప్పెడు మట్టి’, ‘బతుకమ్మ’, ‘వర్గ సమీకరణంమొదలైనవి దళిత అస్తిత్వం తెలియజేస్తాయి. జీవితంలోని అనేక కోణాలను తెలియపరుస్తాయి. త్వరలో రాబోయే కథాసంపుటి మునుల చెలిమే’.                

          అటు బాలసాహిత్యంలో ఇటు ప్రౌఢ సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న యువ కవి, బాల సాహితి సాహితీవేత్త, కథా రచయిత ఉండ్రాల రాజేశం. చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది గ్రామంలో 8 మే 1978 లో జన్మించారు. వీరి తొలి కథ మా పల్లె ముచ్చట్లు’(2012), ‘బుక్కెడు బువ్వ పెట్టలే రా’, ‘పట్నం విద్యాకుసుమాలుమొదలైన 30 కథలు ప్రచురింపబడ్డాయి. వీరి రచనలు బాలల కథా మంజరి’, ‘పసిడి వెన్నెల’, ‘బంధుప్రీతిమొదలైన తొమ్మిది పుస్తకాలు ప్రచురించారు. జాతీయ సాహిత్య పరిషత్‌ సిద్దిపేట ప్రధానకార్యదర్షిగా కొనసాగుతున్నారు

           చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన డా. సిద్దెంకి యాదగిరి 30 జూన్‌ 1980లో జన్మించారు. వీరు కవి, రచయిత, విమర్శకులు. వీరు బోధ’, ‘తప్ష’, ‘ఎత’, ‘విరిగిన కల’, ‘కీలెరిగి వాత’, ‘అంటరాని బతుకమ్మ’, ‘తీర్మానము’, ‘పీడమొదలైన కథలు రాశాడు. వీరి కథా సంపుటి తప్షపల్లె పలుకుబడులు నుడికారం సామెతలు జీవ భాష వీరి ప్రత్యేకత. వీరి తప్షకథా సంపుటి సిద్ధిపేట జిల్లా తొలి పుస్తకం. త్వరలో రానున్న కథా సంపుటి పిడుగు’. వ్యాస సంపుటి ముక్వారు’. తెలుగు దళిత కథ వార్షిక తొండం బొక్కెనసంపాదకులు. ఈ దళిత కథా వార్షిక మరో సంపాదకులు తప్పెట ఓదయ్య, సిద్దిపేట జిల్లా చెందినవారే.

          నాంపల్లి సుజాత హుస్నాబాద్‌ మండలం పోతారం చెందినవారు. వీరి తొలి కత ఎదురీతఇప్పటివరకు దాదాపు పదికి పైగా రాశారు.

          వర్తమాన కాలంలో ఆధునిక జీవితాలను చిత్రిస్తున్న కథారచయిత్రి మారోజు దేవేంద్ర దుబ్బాకలో 1982లో జన్మించారు.  కథా సంపుటి అచ్చు వేసిన జిల్లా తొలి రచయిత్రి. వీరి తొలి కథ అడుగులుఇప్పటివరకు ఇరువై కథల వరకు రాసింది. అడుగులుకథా సంపుటి..2020లో ప్రచురించారు. తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ (1990`2010)అను అంశంపై పరిశోధన చేశారు.

          రావి చెట్టు మహేష్‌ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో 8 జూన్‌ 1984లో జన్మించాడు. వీరి తొలి కథ ఇజ్జత్‌’, ‘పౌరోస్‌’. అను మరో కథ రాశారు.

          1986లో గజ్వేల్‌ పట్టణంలో జన్మించిన వి. వంశీధర్‌ రెడ్డి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వీరు తొలి కథ చౌరస్తాకినిగె (2014)పత్రికలో ప్రచురించబడిరది. ‘‘జిందగీ’’, ‘‘ఐస్‌ క్యూబ్‌’’, ‘‘కీమో’’, ‘‘వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌’’, ‘‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌’’, ‘‘మనోరమ’’ కథలు రాశారు.

          డాక్టర్‌ విట్టబోయిన వెంకటేష్‌ దుబ్బాకలో గ్రామంలో 14-6-1988లో జన్మించారు. తొలి కథ బతుకుదెరువుఇప్పటి రాసిన మూడు కతలు రాశారు. 

          చెన్న రాజు దౌల్తాబాద్‌ మండలం శౌరీపూర్‌ గ్రామంలో 10 ఆగస్టు 1990 జన్మించారు. వీరు రాసిన కథ పయిలం బిడ్డ                   


             తెలంగాణ కథ - సిద్దిపేట జిల్లా:

          ఉమ్మడి మెదక్‌ జిల్లాలో హరిపురం వెంకట రామయ్య పంతులు కథ సమ్మేళనాలు నిర్వహించారు. సాహితీ వికాస మండలి 1965లో చతురంగం పేరుతో నాలుగు కథలు ప్రచురించింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన రెండవ కథా సంకలనంగా ప్రసిద్ధి గాంచింది. చతుర రంగంకథా సంకలనంలో ఉమాపతి పద్మనాభశర్మ, తూప్రాన్‌ వాస్తవ్యులైన డిరగిరి నరసింహాచార్యులు, గొల్లపల్లి పట్టాభిరామ శర్మ, వరిగొండ రాంచందర్‌ రావు రాసిన కథలతో ప్రచురించారు.

          ఉమ్మడి మెదక్‌ జిల్లా తొలి కథా సంకలనం చతురంగం’, ప్రసిద్ధ కథా సంకలనం మెతుకు కతలు’, సిద్ధిపేట జిల్లా తొలి కథా సంకలనం సిద్ధిపేట జిల్లా కథలుతెలంగాణ ఉద్యమ కథా సంకలనం తెలంగాణ చౌక్‌’, తొలి దళిత కథా వార్షిక తొండం బొక్కెనసిద్ధిపేట జిల్లా తొలి పుస్తకం తప్ష’. సిద్ధిపేట జిల్లా రచయిత్రి రాసిన పుస్తకం అడుగులు’. సిద్ధిపేట కథా సేద్యానికి తేనెపట్టు.

          మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో వేముగంటి రఘునందన్‌ వట్టికోట ఆళ్వారు పురస్కారాన్ని ఒక దశాబ్దం పాటు నూతన కథకులకు బహుమతి ప్రధానం చేసి ప్రోత్సహించారు.

          నందిని సిధారెడ్డి తెరవే అధ్యక్షులు తెచ్చిన తెలంగాణ పత్రిక తెలంగాణ సోయి’, ‘జంబిపత్రికలు నిర్వహించారు. బైరన్‌పల్లి చెందిన కర్ర ఎల్లారెడ్డిగారు తెలంగాణ కథ వార్షిక 2000 - 2010 మొత్తం ఎనిమిది వార్షిక సంచికలు తెచ్చారు. మన తెలంగాణ 11 సంచికలు. మన తెలంగాణ పత్రికలో తెలంగాణ కథకు నాలుగు కథలు చొప్పున చోటు కల్పించారు.

          సుగుణ సాహితి సిద్దిపేట వారు బాల సాహిత్య సృజనను పెంపొందిస్తుంది. పెందోట వెంకటేశ్వర్లు బాల కథా సంకలనాలు తెచ్చారు. తెలంగాణతోపాటు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం కథకులు ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధి చేస్తున్నారు.

                                                                                      `డా॥ సిద్దెంకి యాదగిరి 9441244773.

                                             

   ``````````````````````````````

పాద సూచికలు:

1. ముందుమాట, పుట.          రళీ కృష్ణ, వేముగంటి., సంపత్‌ కుమార్‌, బెల్లం కొండ2016, మెతుకు కతలు  సం॥ మరసం.

2. ఈశ్వర చరణ్‌, ముదిగొండ. వ్యాస పీఠము : సాహితీ వికాస మండలి, సిద్ధిపేట.

3. శ్రీనివాస్‌, సంగిశెట్టి., నిరంజన్‌, గుడిపల్లి. 2021, సం॥ తెలంగాణ దళిత కథలు, సింగిడి, తెరసం, ఫూలే ` అంబేద్కర్‌ అధ్యయన వేదిక

4. మల్లారెడ్డి, కొండి., యాదగిరి, పర్కపలి. 2018, సం॥ సిద్ధిపేట కథలు, వెన్నెల సాహితీ సంగమము, సిద్ధిపేట.

5. రాజిరెడ్డి, పప్పుల., ఆగస్టు 2019, సిద్ధిపేట జిల్లా సాహిత్య చరిత్ర, పుట.82, తెలంగాణ సాహిత్య అకాడమీ, హై.

6. భారత రిపబ్లిక్‌ దినోత్సవ ప్రత్యేక సంచిక, 1979, జనధర్మ పత్రిక

7. మల్లారెడ్డి, గులాబిలా., సెప్టెంబర్‌, 1986., జర్నలిస్టు కథలు, శారద ప్రింటర్స్‌, కరీంనగర్‌.

8. మురళీ కృష్ణ, వేముగంటి., సంపత్‌ కుమార్‌, బెల్లం కొండ., 2016, సం॥  మెతుకు కతలు మరసం.ె

9. సిద్ధిపేట టైమ్స్‌, 28`12`2012.

10. మల్లారెడ్డి, కొండి., యాదగిరి, పర్కపలి. 2018, సం॥ సిద్ధిపేట కథలు, వెన్నెల సాహితీ సంగమము, సిద్ధిపేట.

11. మురళీ కృష్ణ, వేముగంటి., సంపత్‌ కుమార్‌, బెల్లం కొండ., 2016, సం॥  మెతుకు కతలు మరసం.

12.  శ్రీనివాస్‌, సంగిశెట్టి., నిరంజన్‌, గుడిపల్లి. జూలై 2021, సం॥ తెలంగాణ దళిత కథలు, సింగిడి, తెరసం, ఫూలే ` అంబేద్కర్‌ అధ్యయన వేదిక.

13. రాజిరెడ్డి, పప్పుల., ఆగస్టు 2019, సిద్ధిపేట జిల్లా సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య అకాడమీ, హై.

14. యాదగిరి, సిద్దెంకి., నిరంజన్‌, గుడిపల్లి., ఓదయ్య, తప్పెట., 2021, సం॥ తొండం బొక్కెన: దళిత కథా వార్షిక `2020, జంబూ సాహితీ.

 

 

ఆధార గ్రంథాలు:

సిద్ధిపేట జిల్లా సాహిత్య చరిత్ర ` పప్పుల రాజిరెడ్డి

తెలంగాణ చౌక్‌’ ` కర్ర ఎల్లారెడ్డి, బి.వి. ఎన్‌. స్వామి తెలంగాణ పబ్లికేషన్స్‌

మెతుకు కతలు ` సం॥ వేముగంటి మురళీ కృష్ణ, డా॥ బెల్లంకొండ నరసింహాచార్యులు.., మరసం, మెదక్‌ జిల్లా.

సిద్ధిపేట కథలు ` కొండి మల్లారెడ్డి, పర్కపల్లి యాదగిరి, వెన్నెల సాహితీ సంగమమం

తొండం బొక్కెన ` డా॥ సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య, జంబూ సాహితి.

తెలంగాణ దళిత కథలు ` గుడిపల్లి నిరంజన్‌, సంగిశెటి శ్రీనివాస్‌

చిలుకపచ్చ చీర, పల్లె నా తల్లి, కుంకుమరేఖ, ఐదు నిమిషాలు, కథామంజూష, నిశ్చితార్థం,వరవిక్రయం,సిద్ధపురి కథలు

& కథ సంపుటాలు ----ఐతా చంద్రయ్య కథా సంపుటాలు

జర్నలిస్టు కథలు ` గులాబీల మల్లారెడ్డి

ఆహార యాత్ర, అక్కన్నపేట రైల్వే స్టేషన్‌, కథా సంగమం ` ఎగుమామిడి అయోధ్యరెడ్డి,

చిత్ర కన్ను ` డా. నందిని సిధారెడ్డి

పది రూపాయలకు లక్ష వడ్డీ ` ఎన్నవెల్లి రాజమౌళి

వెన్నెల కుప్పలు ` చొప్పదండి సుధాకర్‌

శికారి ` పర్కపల్లి యాదగిరి

మౌన సాక్షి, అరుగు- ` నక్షత్రం వేణుగోపాల్‌

తప్ష` డా॥ సిద్దెంకి యాదగిరి

పుంజీతం ` డా॥ వెల్దండి శ్రీధర్‌

అడుగులు ` మారోజు దేవేంద్ర


సిద్దిపేట సమగ్ర స్వరూపం - తెలంగాణ సారస్వత పరిషత్ కోసం రాసిన పరిశోధన వ్యాసం