సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

17, నవంబర్ 2023, శుక్రవారం

VIII. 8.చిన్నప్పుడే

VIII. 8. చిన్నప్పుడే
వట్టికోట ఆల్వారు స్వామి
పాఠం ఉద్దేశం :
ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమము విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు: 
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితం ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది;  ఇటువంటి వచన ప్రక్రియని 'కథానిక' అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత.

1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వార్ స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.


కవి పరిచయం: 
పేరు         : వట్టి కోట ఆళ్వారు స్వామి
జన్మస్థలం :  నల్గొండ జిల్లాలోని చెరువు మాదారం
జననం :  01-11-1915.
మరణం : 05-02-1961.
నిర్వహించిన పదవి : ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడు.
సంస్థలు : దేశోద్ధారక గ్రంథమాల 35 పుస్తకాల ప్రచురణ.
నడిపించిన పత్రికలు: 'తెలంగాణ', 'గుమస్తా'.
కథా సంపుటి : జైలు లోపల.
నవలలు : 'ప్రజల మనిషి',  'గంగు'.
ఇతర రచనలు :  'రామప్ప రభస', 'తెలంగాణ'. వ్యాసాలు.


విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం

చిన్నప్పుడే కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్రానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.


ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం
1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారు చర్చించండి.


అ) వీండ్ల అందరెవరో ఎరికేనా? 
వెంకట్రావు పిల్లలతో

ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
వెంకట్రావు ఒక బాబుని చూచి మీరెవరు అని అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం.

ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
పిల్లల దీనత్వాన్ని చూచి చలించిన ఒక నాయకుడు పలికిన మాటలు

2. కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి. 
(టెక్స్ట్ బుక్ పేజి నెంబర్ 84 లోని పేరా.)
ప్రశ్నలు 
అ) అణిచివేత గురైన వారెవరు? 
జవాబు : తెలంగాణ ప్రజలు.

ఆ)వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణిచివేతకు గురి అయ్యారు ?
జవాబు. సాంస్కృతికంగా భాషాపరంగా అంచవేయబడ్డారు.

ఇ) తెలంగాణలో ఆంధ్రోద్యమము ఎందుకు విస్తరించింది ?
జవాబు: జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే ఆంద్రోద్యమము విస్తరించింది.

ఈ) తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు. గ్రంధాలయాలు పఠనాలయాలు తెలుగు పత్రికలు

ఉ) తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు?
జవాబు : మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయ్, రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి, రావి నారాయణరెడ్డి లు ముఖ్యులు




III. స్వీయ రచన 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) వెంకట్రావు స్వభావాన్ని తెలపండి.
జ. వెంకట్రావు నాయకుడు ఆంధ్ర మహాసభ కార్యకర్త అతనిని చిన్న పెద్ద ప్రజలంతా తమ ధన మాన ప్రాణ రక్షకునిగా భావించేవారు. గ్రామీయుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా పనిచేసేవాడు. అడగడానికి నిందలు నేరాలు మోపడం లంచాలు లాగడం వంటివి లేకుండా పెత్తందాల నుండి ప్రజలకు రక్షణ కల్పించారు. పెత్తందారుల దుర్భాషల నుండి కాపాడడం, నీచంగా మాట్లాడడం వంటివి వెంకట్రావు నిరోధించాడు. దయతో గ్రామ పెద్దలు ఇచ్చే కూలితో వెట్టి చాకిరి చేయకుండా వెంకట్రావు కృషి చేశాడు.

ఆ) వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? 
జ. వెంకట్రావు వంటి యువకులు ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కష్టసుఖాల్లో అండగా ఉండి వారికి జరిగే అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతారు. పెత్తందారులు, యజమానులు చేసే దుర్మార్గాలను అరికడతారు. యువకులను పెద్దలను అందర్నీ చైతన్యవంతం చేసి వారి సాయంతో గ్రామీయుల సమస్యలను తీరుస్తారు. సుఖ సంతోషాలు కలిగేలా సహాయపడతారు. ఇతరుల మేలుకోసిన వారు పనిచేస్తారు. స్వార్థానికి చోటు ఇవ్వరు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు మంచి కోసం మార్గదర్శనం చేస్తారు.

ఇ)వెంకట్రావు తో నేటి యువతను పరిశీలించి, పోల్చండి. 
జ. వెంకట్రావు నాయకుడు. హితవరి. సంఘసేవకుడు పరోపకారి. ఇతరుల కష్టాలను తన కష్టంగా భావించి వాటిని నిర్మూలించడానికి కృషి చేస్తాడు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు. విజయాన్ని సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును తమ ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావించారు. మరి నేటి యువకులు‌ స్వార్థంగా ఆలోచిస్తున్నారు తమకు మేలు జరుగుతుందంటే ఇతరులకు హాని  తలపెడుతున్నారు. వివిధ వ్యసనాల బారిన పడకపోతే చాలా మంచిది. కొంతమంది యువకులు సంఘ సేవకులుగా, పరోపకారులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ) "మనం ఈ రోజు స్వార్ధ రహితంగా, ధైర్యంగా పట్టుదలతో పని చేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు" అని ఒక నాయకుడు ఎందుకని ఉంటాడు?
జ. 
నిజాం రాష్ట్రంలో గ్రామ పెత్తందారులు మునసబులు, గ్రామ నౌకరు, పోలీస్ అధికారులు, పోలీస్ పటేల్, మాలి పటేల్ , మొదలైన వారు ఆనాటి అధికారం కలిగిన వ్యక్తులు నిజాం ప్రభువు వద్ద పనిచేసి చిన్న అధికారులు ప్రజల్ని బెదిరించి తిట్టి కొట్టి జర్మానాలు వసూలు చేసి దోపిడీ చేసేవారు. ప్రజలు వారికి నమస్కారం చేయవలసి వచ్చేది.
 ప్రజల నుండి బలవంతంగా ఆ పెత్తందారులు కావాల్సినవన్నీ తీసుకుపోయేవారు అడవిలో కట్టెలు ఏరుకోవడానికి ప్రజలకు అనుమతి లేదు.
ఆ నాయకుడు తామంత ధైర్యంగా పట్టుదలతో ఆ పెత్తందారులకు ఎదురు తిరిగితే తమకు స్వాతంత్రం వస్తుందని హాయిగా బతుకుతారని చెప్పే ప్రజలకు కార్యకర్తలకు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు.

2.  కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! ఆనాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా? కారణాలు ఏమిటి?
జ. తెలంగాణ ఒకప్పుడు నిజాం చక్రవర్తి పాలనలో ఉండేది. గ్రామంలో వివిధ రకాల అధికారులు ఉండేవారు. వారు మాటిమాటికి హింసించి జరిమానాలు విధించి వసూలు చేసేవారు. ప్రజలకు పెత్తందారులంటే మహా భయం. ఊరిదొరలు ప్రజలను బర్రెలను బందెల దొడ్డిలో పెట్టించేవారు. చేలో పడితే ఊరు పట్టేలు పది రూపాయలు జరిమానా పుచ్చుకునేవాడు. ఒక దున్న పక్క వారిపై బుసుమంటే దానికి మూతాడు లేదని నేరం మోపి మాలి పటేల్ వారి వద్ద 30 రూపాయల పన్ను వసూలు చేసేవాడు.

ఆడవారు కూలికి వెళ్లి చేలో కట్టెలేరుకుంటే దొర సేగిదారు ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని కొట్టేవాడు. ఎవరైనా అడ్డుపడితే వారి సైతం బాధేవాడు. వండుకున్న తిండిని కూడా గిర్ధవార్ల కోసం పట్టుకపోయేవారు.
ఆనాడు అడవులలో పీడ ఏరుకున్నా తట్ట లాగుకునే వారు మందలించేవారు ఈ విధంగా గ్రామ పెత్తందారు నిజాం పేరు చెప్పి ప్రజలపై పెత్తనం సాగించేవారు.

IV. సృజనాత్మకత ప్రశంస 
అ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.
అ) ఈ పాఠం ఆధారంగా చేసుకొని మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జ. తరతరాలుగా ప్రజల బాధలు తీర్చడానికి నాయకులు అంకణం కట్టుకుంటారు సిద్దిపేట పురోభివృద్ధి చెందడానికి చాలామంది నాయకులు కృషి చేశారు డిగ్రీ కళాశాల తేవడానికి రాజేశ్వరరావు ఎడ్ల గురువారెడ్డి గారు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేశారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సిద్దిపేట పట్టణంలో తాగునీరు అందజేశారు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అద్భుతంగా తీర్చిదిద్దారు కోమటి చెరువు రంగనాయక సాగర్ ఆధునిక నగరముగా అభివృద్ధి చేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారల ఆశీస్సులతో ఈ పట్టణానికి రైలు సౌకర్యం కల్పించబడ్డది.


 లేదా 
ఆ) వెంకటరావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్లు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జ. మాది సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ వారు చెత్త ఎత్తేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేశారు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ చెత్త విడివిడిగా సేకరిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు చాలా ప్రయాస కోర్చి ఆ దుర్వాసనలోనూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి మరీ శుభ్రపరిచారు నిజంగా వారి సేవను ఏమని కొనియాడగలుగుతాము
మున్సిపల్ కార్మికులకు వారి కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు అందిస్తున్న 
         

 ఇట్లు
ఎస్ హరీష్
8వ తరగతి, జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్

IV. పదజాలం :
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు తెలుసుకొని రాయండి.
అ) దండం నమస్కారం
ఆ) అవ్యాజ కపటం లేని సహజమైన
ఇ) రకం పన్ను
ఈ) మిరం కారం మీడియం
ఉ) ఎరుక జ్ఞానం తెలుసుకోవడం

2. సమానార్థకాలు అదే అర్థం వచ్చే పదాలు.
అ) విలువ 
విలువ ఖరీదు మూల్యం
ఆ) కుప్పలుగా :ప్రోగులు, రాశులు
ఇ) గభాలున : గుభేలున, గుభిల్లున 
ఈ) వెండి : రజితం, కలధౌతం

3. ప్రకృతి పదాలు
 వికృతి               ప్రకృతి
అ) మొగం      -    ముఖం
ఆ) సంతసం   -   సంతోషం
ఇ) సుకం        -   సుఖం
ఈ) గారవం    -   గౌరవం

V. భాషను గురించి తెలుసుకుందాం: 
1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.
సమాస పదం              విగ్రహవాక్యం                                        సమాసం పేరు
అ) రాజ్య కాంక్ష : రాజ్యం నందుకాంక్ష - సప్తమి తత్పురుష సమాసం
ఆ) విజయ గర్వం : విజయం వల్ల గర్వం - పంచమి తత్పురుష సమాసం
ఇ) అష్టదిక్కులు : అష్టసంఖ్య గల దిక్కులు - ద్విగు సమాసం
ఈ) బలరాములు : బలరాముడును, కృష్ణుడు - ద్వంద్వ మాసం
ఉ) ప్రజల భాష : ప్రజల యొక్క భాష- షష్టి తత్పురుష సమాసం
ఊ) అక్రమము : క్రమం కానిది నైన్ - తత్పురుష  సమాసం


ఆమ్రేడిత సంధి 
కింది వాటిని చదవండి.
ఔరౌర! ఎంత గొప్ప పని చేశావు 
ఆహాహా ఎంతో ఆనందం కలిగించావు
పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర =  ఔర + ఔర = ఔరౌర 
ఆహాహా = ఆహా + ఆహా = ఆహాహా అవుతున్నాయి కదా!
ఇప్పుడు ఒకే పదం రెండుసార్లు వచ్చింది అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు.

అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

కింది పదాలను కలిపి రాయండి అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు
ఏమి ఏమి ఏమేమి
ఊరు ఊరు ఊరూరు
ఇంట ఇంట ఇంటింటా
ఓరి ఓరి ఓరోరి

ద్విరుక్త టకార సంధి:
 పగలు+పగలు = పట్టపగలు
చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి పగలు పగలు పట్టపగలు అవుతుంది అంటే మొదటి పదంలోని పగలులో తర్వాత ఉన్న గలు పోయి దానికి బదులుగా ట వచ్చింది అప్పుడు పట్టపగలు అయింది అట్లనే చిట్టచివర పదం కూడా.


 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...