సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 SCERT         🌐 School Edu Dept.         🌐 LEARNUNG MANAGEMENT SYSTEM _ SCERT         🌐 * * PGI(Performance Grading Index         🌐 * * DIKSHA WEB         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"    
🌐 భాషను ఎంచుకోండి

6, జులై 2026, సోమవారం

ఇలవరస / ఇడుపు కాగితం ముడుపు కవిత

మిత్రులకు నమస్కారం
నా "ఇలవరస" కవితను ప్రచురించి తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సామరస్య సందేశాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చిన నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
తెలంగాణ నేల గుండె చప్పుళ్లను, మా బాస ఆత్మీయతను, మా యాస ఆత్మగౌరవాన్ని, విభేదాలకు బదులు సహజీవనాన్ని, విద్వేషాలకు బదులు సోదరభావాన్ని పలికించిన ఈ కవితకు మీ పత్రికలో చోటు కల్పించడం ఒక రచయితగా నాకు ఆనందాన్ని, బాధ్యతను మరింత పెంచింది.
ఈ సందర్భంగా సంపాదకవర్గానికి, పాఠకులకు, సాహిత్య మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.




ఇలవరస

 ...............................................................................................................................                                                                       
మా బాసంటే మాకు  పాయిరమే 

మా యాసంటే మాకు మోయలేనంత పేమ
మాకు మొగులు కంటే ఎత్తైనది
పాతాళం కంటే లోతైనది

తినుస్కారమొద్దు తిట్లపడకు కంట్లే పడకు కుట్లె కారం కొట్టుకోకు  ఎప్పుడు రగులుతదో తెలువని మంట తెలంగాణ  తెరువు కొచ్చి తెర్లుగాకు గతిలేనోడికి కుతిలావట అతి గతి లేదా? మీ వొల్ల ఏసుకు(కీర్తికి) తెచ్చుకో యేరు పడ్డం  తావులు యేరైనయి ఎవల రేవు వాళ్ళకైంది యేందిది ? ఎందుకిది ? కొట్లాటలొద్దు  కొర్కాసులొద్దు మంటలు పెట్టే మాటలు వద్దు ఎల్యం చెయ్యకుండ్రి  మాల్యమ్ మల్ల కుదురుకుంటది నియంతలను నిలేసిన జాగ కుల్లును కూల్చేసిన తలంల పగ పెంచే పాగాలొద్దు  త్యాగాలమీద కట్టుకున్న గూడు  తగలబెట్టాలని చూడొద్దు తగలబడి పోతవ్ జాగీర్ లు వొద్దు  జగడాలొద్దు  కాయ కొరుకుడు మాటలు వద్దే వద్దు కాల గర్భంలో కలిసిపోతవ్ అన్నదమ్ములమ్ అంతరాలొద్దు  ఆగమ్ గావొద్దు  దాక్షిణాది వాటా అడుగుదాం పా  అన్నీ మరిసి ఆలాయి బలాయి తీసుకో  తినేతందుకు  రా  కడుపునిండా తిండీ పెడ్తం కన్నారా నిద్ర దొరుకుతది  తిట్టకు,  పట్టుపట్టి మా బువ్వల  మట్టి కొట్టకు    తెంపిన ముడి కుదురది తెగిన కట్ట నిల్వది ఎద్దుకు ఎగేసే బర్రెకు సగేసేరెండు నాల్కలొద్దు జిద్దులొద్దు ఏడుపులు ఎకసెక్కలొద్దు  ఇలవర్స ల బుద్ధులు చెప్పుతమ్  ఇడుపుకాయితమే కాదు ముందు తరాలకు మా బాస ముడుపు కడుతమ్ యాస ఒడుపు నేర్పుతమ్ 
- డా. సిద్దెంకి




7

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి