VII. 1. చదువు - డా. సిద్దెంకి
చదవండి ఆలోచించండి – చెప్పండి
తే॥గీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయును
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.
1.ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?
జవాబు.ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.
2.ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?
జవాబు.చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.
3.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?
జవాబు.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.
4.చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?
జవాబు. చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.
నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.
పాఠ్య భాగ వివరాలు : ఈ పాఠం “కథాకావ్యం” (ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ట్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వా(తింశిక చతుర్థాశ్వాసంలోనిదీ కథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.
కవి పరిచయం:
కవిపేరు : కొఱవి గోపరాజు
పాఠ్యభాగం పేరు : చదువు
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం
రచన : సింహాసన ద్వాత్రింశిక
తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక
విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.
I
ఆ.వె॥
భట్టి మంత్రి; సైన్యపాలి గోవిందచం
ద్రుడు; త్రివిక్రముడు పురోహితుడు;
ఆ పురోహితునకు ఆత్మజుడగు కమ
లాకరుడన నొక అవివేకి గలడు.
ఆ.వె॥
ఆ కమలాకరుడు ఆ కమ
లాకర సాదృశ్యముగ జడాశయుడై, నన్
శోకము మదిని బొదలంగ, వి
వేకము పుట్టింప దండ్రి వెరవున దూజెన్.
కం॥
చుట్టములకు, తల్లిదండ్రుల
కు ఎట్టి యెడంబ్రియము నెరపనెడపని, చదువుల్
గట్టిగా నెరుగని పుత్రుడు
పుట్టుట, కులమునకు తెగులు పుట్టుట చుమ్మీ.
కం॥
విను! ఉత్తమమగు పుట్టువు
గనుపట్టెడు నట్టి రూపుగల మోదుగు భౌ,
వును మూర్ఖుండును ప్రభలెడు
వనమున, భవనమున తగిన వాసన గలదే.
II
- అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
- కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
- "చదువురాని పిల్లలు వంశానికి తెగులు" అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
కం॥
పరులకు, సోదరులకు, భూ
వరులకు కొనరాదు; సర్వవశ్యము. తానె
వ్వరికిచ్చిన గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.
కం॥
పరభూమికి జనుచో ద
స్కరులకు నగపడదు; వ్రేగుగా దెచ్చట నె
వ్వరినైన హితులం జేయును;
ధరలో మరి విద్య బోల ధనములు గలవే.
కం॥
గద్యముఁ, పద్యముఁ బెనుప గైకొనుటొండె, ధ్రువప్రబంధ సం
పద్యముతోడౌట యొండె, మృదుభాషలన్ బ్రొద్దులు పుచ్చుటొండె, లో
కోద్యమ లక్షణంబెరుగుదొండె, గడున్ భజియించుగాక; ఏ
విద్యలు నేర్చనివాడైన పశువే అగుగాదే గణించి చూచినన్. ⑦
ఆలోచించండి – చెప్పండి
- తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
- "చదువు దొంగలకు కనిపించదు." – చర్చించండి.
- అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
3
శా॥
సంగీతంబుఁ, కవిత్వతత్త్వమును, సౌజన్యంబు, భావంబు, స
త్సాంగత్యంబు నెఱుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్;
శృంగద్వంద్వములేని యెద్దతనము జెల్లున్;
దృణంబాతడయ్యాంగీకంబున మేయు డాపసుల భాగ్యంబిచ్చటన్. ⑧
సీ|| అనుచు నెగ్గించిన నా కమలాకరుం
డభిమానియై తన యాత్మలోన,
విద్యలు నేర్చి వివేకినై కాని,ఈ
జనకు వక్త్రము చూడననుచు వెడలి,
కాశ్మీరదేశంబు కడకేగి, యొక యోర
చంద్రకేతుండను సంజ్ఞ బరగు,
ఉత్తమ ద్విజున్ గొల్చియుండగా, నాతండు
క్రమమున సిద్ధసారస్వతంబు. ⑨
తే.గీ॥
కరుణ నొసంగిన నతడు సాంగంబుగాగ,
నాల్గు వేదములును, కావ్యనాటకములు,
దర్శనంబులు, నీతిశాస్త్రములు, దివిరి
కలయ సంగీతసాహిత్యకళలు నేర్చి, 9
వ. అభిజ్ఞుండై గురునానతి వడసి,
తిరిగి దేశవిశేషంబులన్ జూడం జరియించుచు... ⑩
ఆలోచించండి – చెప్పండి
- పశువులకు, మనుషులకు తేడాలేమిటి?
- కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు?
- కమలాకరుడు గురువుకు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు?
1. విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి,
2 కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆవిధంగానే కమలాకరుడు జడాశయుడు ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్ధంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొదుకును వివేకిని చేయాలని ఈవిధంగా మందలించాడు.
3. చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు.
4. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగుపువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎం. మంచి రూపమున్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు.
5. పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చిన కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.
6. వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాద ఎక్కడనైనా ఎవ్వరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమై ధనం మరొకటి లేదు.
7. వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా ధ్రువాప్రబంధ సంపదను (సంగీత నాట్య సాహి జ్ఞానాన్ని) పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందా ఇవి ఏవీ చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివా
8. సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనుల తోడి స్నేహం వీటి గ్రహించలేని వాడిని భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివా గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి.
9. తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువా కాని తండ్రి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీరదేశంలోని చంద్రకేతుడు అనే ఉత్త బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగా కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.
10. ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు. (ఈవిధంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఎవ్వరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు. దా ప్రేరణగా తీసుకొని ఎదగాలి అని పాఠ్యాంశ భావం).
ఆలోచించండి – చెప్పండి.
1.అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
జవాబు.అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.
ప్రశ్న 2.కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
జవాబు. కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.
3.“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.
4.తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు.
చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.
5.“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.
6.అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే .
ఇవి చేయండి
1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడంలేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళుకూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?
జవాబు.
అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు. మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ!
(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.
తానెవ్వరికిచ్చినఁగోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య
(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
జవాబు.
ధరలో మరి విద్యబోల ధనములు గలవే?
(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెలున్.
(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.
(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.
2. కింద పద్యాన్ని చదువండి. భావం రాయండి.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)
జవాబు. “చదువుకోనివాడు అజ్ఞాని యౌతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో”. అని ఈ పద్య భావం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ). చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
(లేదా)
చదువురాని వారికి పశువులకు తేడాలేదని కవి ఎందుకన్నాడు?
జవాబు.చదువు నేర్వని వారిని కవి పశువుతో పోల్చాడు. ఎందుకంటే పశువులకు మాటలు రావు. భాషరాదు. అవి చదవలేవు. రాయలేవు. ఎక్కడ కట్టేస్తే అక్కడే పడి ఉంటాయి. మనిషి చదువుకోకపోతే చదవలేడు. రాయలేడు. సరిగా మాట్లాడలేడు. పశువుకెంత గౌరవం ఉంటుందో అతనికీ అంతే. పశువులు గడ్డి తింటాయి. అతడు అన్నం తింటాడు. పశువుకున్న తోక, కొమ్ములు అతడికి లేవు. అంతకు మించి చదువురాని వాడికీ, పశువుకూ ఏమీ తేడాలేదు.
(ఆ). త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎట్లాంటివి?
(లేదా)
చదువును గురించి త్రివిక్రముడు ఎలా ఆలోచించాడు?
జవాబు. చదువు పట్ల త్రివిక్రమునికి గల భావాలు : చదువు ఎవరికీ కనిపించని ఎవరూ దోచుకోలేని గొప్ప సంపద. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు సహాయపడుతుంది. అందరినీ మనకు ఆప్తులుగా చేస్తుంది. చదువుకు సమానమైన సంపద మరేదీలేదు. మంచి కావ్యాలు చదవాలి. లలితకళలు నేర్చుకోవాలి. మంచివారితో మంచి మాటలతో కాలం గడపాలి. లోకజ్ఞానం సంపాదించాలి. అలా చదువులు నేర్వని వాళ్ళు పశువులతో సమానం.
(ఇ). కమలాకరుని స్వభావం ఎటువంటిది?
(లేదా)
కమలాకరుడు ఎలాంటివాడు?
జవాబు. కమలాకరుడు జడాశయుడు. అంటే ఏ ఆలోచనలు, ఆశయాలు లేకుండా కాలం గడిపేవాడు. చదువు సంధ్యలు లేనివాడు. ఎవరితోనూ కలవడు మాట్లాడడు. స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు బంధువులకు ఏనాడూ సంతోషం కలిగించలేదు. అందమైన మోదుగపువ్వు అడవిలోపడి ఉంటే దాన్ని చూసి ఆనందించేవారెవ్వరూ ఉండరు. అలాంటి మూర్ఖుడే కమలాకరుడు.
(ఈ). చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
(లేదా)
“చదువు లేకపోవడమే కష్టాలన్నిటికీ మూలం” ఎలా? వివరించండి.
జవాబు.
చదువు మనిషి జీవితాన్ని మార్చే గొప్ప సాధనం. చదువు రాకపోతే అనేక కష్టాలు ఎదురవుతాయి. పుస్తకాలు, పత్రికలు చదవలేడు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, ఆసుపత్రి సూచనలు అర్థం చేసుకోలేడు. మంచి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఆర్థికంగా వెనుకబడే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మోసాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం కష్టమవుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గి సమాజంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేడు. అందువల్ల ప్రతి ఒక్కరూ చదువును విలువైన సంపదగా భావించి శ్రద్ధగా నేర్చుకోవాలి. చదువే వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశాభివృద్ధికి బలమైన పునాది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు. విక్రమార్క మహారాజు పురోహితుడు త్రివిక్రముడి కుమారుడు కమలాకరుడు అవివేకిగా, లక్ష్యరహితంగా ఉండేవాడు. తన కుమారుని స్థితిని చూసి తండ్రి బాధపడి విద్య యొక్క గొప్పతనాన్ని వివరించాడు. తల్లిదండ్రులకు ఆనందం కలిగించే చదువులు నేర్చుకోవాలని, విద్యలేని జీవితం వంశానికి భారమని బోధించాడు. విద్య మనకు శాశ్వత సంపద అని, దానిని ఎవరూ దోచుకోలేరని, పంచినకొద్దీ పెరుగుతుందని చెప్పాడు. విద్యతో పాటు సాహిత్యం, సంగీతం, మంచి మాటలు, లోకజ్ఞానం మనిషిని సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయని వివరించాడు. తండ్రి మాటలు కమలాకరుడిలో ఆత్మపరిశీలన కలిగించాయి. విద్య నేర్చుకొని వివేకవంతుడిగా మారిన తర్వాతే ఇంటికి వస్తానని సంకల్పించాడు. కాశ్మీర దేశంలోని చంద్రకేతుడు అనే గురువును ఆశ్రయించి నాలుగు వేదాలు, వేదాంగాలు, కావ్యాలు, నాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలను అభ్యసించాడు. అనంతరం గురువు అనుమతితో దేశాటనకు బయలుదేరాడు. ఈ కథ ద్వారా తల్లిదండ్రులు, గురువులు చెప్పే మందలింపును అవమానంగా కాకుండా ప్రేరణగా స్వీకరించి విద్యతో, కృషితో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే సందేశం తెలుస్తుంది
IV. సృజనాత్మకత/ప్రశంస
(అ) బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(లేదా)
(ఆ) చదువు ఆవశ్యకత తెలిసేటట్లు కొన్ని నినాదాలు రాయండి.
లేఖ
సిద్దిపేట,
తేది : XXXX.
ప్రియమైన అన్నయ్యా !
ఇక్కడ అంతా క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాకు తరగతిలో రెండవ స్థానం లభించింది.
అన్నయ్యా ! ఇదంతా నీ ప్రేరణ వల్లనే జరిగింది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరూ ఎగతాళి చేస్తే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. నువ్వు చెప్పిన మంచిమాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చదువుపట్ల ఆసక్తిని పెంచాయి. ఏమైనా సరే మంచిమార్కులు సాధించి తీరాలని పట్టుదల నాలో పెరిగింది. గట్టిగా కృషిచేశాను. తగిన ఫలితం లభించింది. ఇదంతా నీ వల్లనే సాధ్యపడింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సగౌరవంగా నేను చెప్పే ధన్యవాదాలు స్వీకరించు. ఉంటాను.
ఇట్లు
నీ ప్రియమైన తమ్ముడు,
కార్తికేయ.
చిరునామా :
ఎ. ప్రసాద్, తొగుట.
(ఆ) చదువు ఆవశ్యకతపై నినాదాలు :
జవాబు.
చదువుకుంటే కలదు లాభం.
ఎంత చదివితే అంత జ్ఞానం.
అభ్యాసము కూసు విద్య.
చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
చదువు వల్ల సంస్కారం కలుగును.
రాజుకు తన దేశంలోనే గౌరవం. పండితుని ప్రపంచమంతా గౌరవిస్తుంది.
చదువు అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు.
చదువు లేకపోవటమే అసలైన గుడ్డితనం.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.
(అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి. – కొమ్ములు
(ఆ) గణపతి వక్త్రమున తొండము ఉంటుంది. – ముఖాన
(ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది. – గడ్డి
(ఈ) ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. – కుమారుడు, కొడుకు
2. కింది పదాలను వివరిస్తూ రాయండి.
(అ) మృదుభాషలు
జవాబు. మృదు అంటే మెత్తని. భాషలు అంటే మాటలు. మృదుభాషలు అంటే మెత్తనైన మాటలు. అంటే అందరికీ నచ్చేమాటలు.
(ఆ) ప్రబంధ సంపద
జవాబు. ప్రబంధములు అంటే కావ్యాలు. ప్రబంధముల యొక్క సంపద. అంటే కావ్యాలు అధికంగా ఉండటం.
(ఇ) సౌజన్యభావం
సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యభావం మంచి ఆలోచనలు కలిగి ఉండటం.
(ఈ) సత్సాంగత్యం
జవాబు. సాంగత్యం అంటే సమీపం. మంచివారితో కలిసి ఉండటమే సత్సాంగత్యం.
3. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
పర్యాయ పదాలు
(అ) ధర = ఇల, భూమి
(ఆ) ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
(ఇ) వనం = అడవి, అరణ్యం
(ఈ) శోకం = దుఃఖం, వ్యథ
VI. భాషను గురించి తెలుసుకుందాం
కింది పేరాను చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.
మా ఊరి చెరువుగట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో, ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆహా! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా!
నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం
జింకలు మా సుందరంగా ఉన్నది అబ్బో
కుందేళ్ళు ఆ ఎర్రని అలరారే ఆహా
కండ్లు అద్భుత ఉంటుంది కిలకిల
సంగమేశ్వర పచ్చని చాలవు అక్కడి
సూర్యుడు శోభాయమానంగా వర్ణిస్తూ....
ప్రాజెక్టు సంఖ్య – 1
ప్రాజెక్టు పేరు: చదువు ప్రాముఖ్యత – శతక పద్యాలు, పాటలు
ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థి పేరు: ........................................
తరగతి: 7వ తరగతి
సెక్షన్: ( )
క్రమసంఖ్య: ( )
2. సమాచార సేకరణ విధానం:
వివిధ పుస్తకాల ద్వారా సేకరించినది.
3. సంక్షిప్త వివరణ
చదువు మనిషి జీవితాన్ని మార్చే గొప్ప సాధనం. విద్య వల్ల జ్ఞానం, వివేకం, ఆత్మవిశ్వాసం, సంస్కారం పెరుగుతాయి. మంచి చెడులను గుర్తించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాముఖ్యతను తెలిపే అనేక పద్యాలు, పాటలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో చదువు ప్రాముఖ్యతను తెలియజేసే రెండు శతక పద్యాలను, రెండు పాటలను వివిధ పుస్తకాల ద్వారా సేకరించాను.
1. విద్య నిగూఢగుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు; విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము; విద్యకుసాటి ధనంబులేదిలన్
విద్య నృపాల పూజితము; విద్యనెరుంగని వాడు మర్త్యుడే
విద్య అనేది ధనం లాంటిది. చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.
విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.
చదువే మనకు వెలుగురా
చదువే మనకు బలమురా
జ్ఞానమనే దీపం వెలిగించి
జీవితాన్ని తీర్చిదిద్దురా!
అక్షరమే ఆయుధమురా
విద్యయే మన సంపదరా
చదివి ఎదిగి మంచి మనిషిగా
దేశానికి సేవ చేయురా!
చదువు పాట ద్వారా చదువు యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది
ఈ భావం ద్వారా కేవలం పుస్తక జ్ఞానం కాకుండా, జీవితానికి ఉపయోగపడే జ్ఞానం కూడా అవసరమని అర్థమవుతుంది.
చదువు ప్రాముఖ్యత తెలిపే రెండు పాటలు:
- “చదువే వెలుగు – చదువే మనకు బంగారు భవిత” అనే భావంతో సాగిన విద్యా గీతం.
- “విద్య విలువ తెలుసుకో – విజ్ఞాన మార్గంలో నడవాలి” అనే సందేశంతో సాగిన విద్యా ప్రేరణ గీతం.
ఈ పద్యాలు, పాటలు విద్య మన జీవితంలో వెలుగును నింపి, మంచి భవిష్యత్తుకు మార్గం చూపుతాయని తెలియజేస్తున్నాయి.
4. నేర్చుకున్న అంశాలు
ఈ ప్రాజెక్టు ద్వారా చదువు మన జీవితానికి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. విద్య వల్ల జ్ఞానం, విజ్ఞానం, వివేకం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నేర్చుకున్నాను. చదువు వల్ల మనం మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి తోడ్పడగలమని తెలుసుకున్నాను.
5. ప్రదర్శన
రాయకూడదు. చెప్పాలి. (ఈ ప్రాజెక్టును తరగతి గదిలో ఉపాధ్యాయుల సమక్షంలో సహ విద్యార్థుల ముందు ప్రదర్శిస్తాను. మొదట నా పేరు, తరగతి, ప్రాజెక్టు అంశాన్ని తెలియజేస్తాను. తరువాత చదువు ప్రాముఖ్యతను వివరించి, సేకరించిన రెండు శతక పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో చదివి వినిపిస్తాను. ఆ తరువాత విద్య ప్రాముఖ్యతను తెలియజేసే రెండు పాటలను పరిచయం చేసి, వాటిలోని సందేశాన్ని వివరిస్తాను. పద్యాలు, పాటల ద్వారా విద్య వల్ల కలిగే ప్రయోజనాలను సహ విద్యార్థులకు తెలియజేస్తాను. చివరగా “చదువు మన జీవితానికి వెలుగు; విద్య మన భవిష్యత్తుకు బాట” అనే సందేశంతో నా ప్రదర్శనను ముగిస్తాను.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి