సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

11, డిసెంబర్ 2021, శనివారం

ఛందస్సు






పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు.

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపునది ఛందస్సు అనబడును.

 తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధారపడి అభివృద్ధి చెందినది.

 సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. 


ఛందస్సులో రెండే అక్షరాలు. 
గురువు, లఘువు. 
గురువుని U తోటి, 
లఘువుని | తోటి సూచిస్తారు.

గురు, లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడి ఉంటుంది.

 ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందులో మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలు ఒక్కొక్కటి ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అమ్ రెండు లిప్తల కాలము, ఆ తరువాతి మ ఒక లిప్త అక్షరము కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.


కొన్ని నియమాలు:
1. దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I

2. "ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)

3. సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )

4. సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. 

 
 అక్షరాల గుంపును గణము అని అంటారు.

ఇవి నాలుగు రకాలు
ఏకాక్షర గణం
ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.

 అది గురువు లేదా లఘువు కావచ్చు.U, U, Uఉదా: శ్రీ, శై, 

రెండక్షరాల గణాలు: రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు.
1. లలము
2. లగము ( వ గణం ) 
3. గలము ( హ గణం ) 
4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, ... లల గణములు

లగ లేదా వ IU ఉదా: రమా

గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ

గగ UU ఉదా: రంగం, సంతాన్

మూడు గణాలు ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి. 

య మా తా రా జ భా న స ల గం 

యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. 

యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది.

అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III

ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU

ఇవి మూడక్షరముల గణములు
ఉపగణాలు సవరించు ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి.

 ఇవి మూడు రకములు 

1. సూర్య గణములు. 
ఇవి రెండు.
న = న = III
హ = గల = UI

ఇంద్ర గణములు. 
ఇవి ఆరు.
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI


చంద్ర గణములు. ఇవి పద్నాలుగు.
భల     = UIII
భగరు = UIIU
తల     = UUII
తగ     = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ     = IIIUU
నవ     = IIIIU
సహ     = IIUUI
సవ     = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII

మధ్య గురువు జ గణము IUI

అంత్య గురువు స గణము IIU

సర్వ లఘువులు న గణము III

ఆది లఘువు య గణము IUU

మధ్య లఘువు ర గణము UIU

అంత్య లఘువు త గణము UUI

సర్వ గురువులు మ గణము UUU

ఇవి మూడక్షరముల గణములు


ఉపగణాలు    సవరించు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు


సూర్య గణములు. ఇవి రెండు.

న = న = III

హ = గల = UI

ఇంద్ర గణములు. ఇవి ఆరు.

నగ = IIIU

సల = IIUI

నల = IIII

భ = UII

ర = UIU

త = UUI



        ఉత్పల మాల   లక్షణములు

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20

ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ

యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము

ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.


ఉత్పల భరి10

 1:10


మత్తేభము       స భ ర న మ య వ


లక్షణములు   

మత్తేభము వృత్తమునందు గణములు

స    భ    ర    న    మ    య    వ

I I U    U I I    U I U    I I I    U U U    I U U    I U

సి రి కిం    జె ప్ప డు    శం ఖ చ    క్ర యు గ    ముం జే దో    యి సం ధిం    ప డే

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20

ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ

యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గుర్తుండడం కోసం  మసభ 14


        చంపకమాల

లక్షణములు

పాదాలు: 4

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు


గుర్తుండడం కోసం చంపన లెవెన్ 

చంపకమాల నజభజజజర 

1 అక్షరానికి 11 అక్షరానికి యతిమైత్రి


శార్దూలం 

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19

ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ

యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు.


గుర్తుండడం కోసం

శ్యామ స 13


please follow  www.siddenky.blogspot.com 


17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? ప్రతి పదార్థం

 .

కారే రాజులురాజ్యముల్ గలుగవేర్వోన్నతిం బొందరే?

             వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరేభూమిపైఁ 

             బేరైనం గలదేశిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై 

             యీరే కోర్కులువారలన్ మఱచిరే యి క్కాలమున్భార్గవా!

        భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.  

       వామనునికి దానం ఇవ్వద్దు అన్న శుక్రాచార్యులకు సమాధానం చెప్పే సందర్భంలో బలి చక్రవర్తిచే పోతన పలికించిన జగత్రసిద్ధ మైన పద్య మిది. 

            భార్గవా= భృగు వంశ వారసుడా! ఓ శుక్రాచార్యా! (భార్గవుడు - భృగువు పుత్రుడుశుక్రుడు).

            రాజులు = రాజులు

కారే అయ్యారు కదా

            రాజ్యముల్ రాజ్యములు

గలుగవే - కలుగవే కలిగి ఉన్నారు కదా!

గర్వ+ఉన్నతిన్+పొందరు+ఏ

గర్వ అహంకారముతో

ఉన్నతిన్ విర్రవీగుటను 

పొందరే పొందియున్నారు

వారేరీ - వారు వాళ్ళందరు 

ఏరి ఎక్కడ ఉన్నారు?

సిరి - సిరిని సంపదలను 

మూటఁగట్టుకొని - మూటగట్టుకొని కూడగొట్టుకొని

పోవంజాలిరే తీసుకెళ్ళగలిగిరాలేదు 

భూమిపైన్ + పేరైనన్ + కలదే 

భూమి నేలపైన 

పేరైనన్ కనీసము పేరైన

కలదే ఉన్నదాలేదు

శిబిప్రముఖులుంబ్రీతిన్ - శిబి శిబిచక్రవర్తి

ప్రముఖులున్ మొదలగువారు

ప్రీతిన్ కోరి

యశఃకాములై – 

యశః కీర్తి

కాములు కోరువారు

 అయ్యి

యీరే-ఈరే ఇవ్వలేదా 

కోర్కులు కోరెవారి కోరికలు  

వారలన్ వారిని

యిక్కాలమున్ -  ఇప్పటి; 

కాలమున్ కాలమునందును; 

మఱచిరే మరచిపోయారాలేదు; 



నియంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
           
 ర్మణంబైనఁ, గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
            
రుఁ డైనన్, హరి యైన, నీరజభవుం భ్యాగతుం డైన నౌఁ;
           
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

          వామనుడు దానం పట్ట బోతున్నాడు. శుక్రాచార్యుల వారు వారించారు. బలి చక్రవర్తి తన నిర్ణయం చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మన సహజ కవి పోతనామాత్యుల వారి కవితా ఝరి వడి.
          మిగతావి అన్నీ అనవసరమయ్య! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్దలవటం కాని, నిజంగానే వస్తే రానియ్యి; జరుగుతే జరగనీ; ఏమైనా సరే నేను మాత్రం అబద్దమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విఙ్ఞాన స్వరూప శుక్రాచార్య! నా నిర్ణయం విన వయ్య!

        నిరయం బైన - నిరయంబు నరకము దాపురించినదిఐనన్ అయిన సరేనిబంధ మైన - నిబంధము కట్టివేయబడుటఐనన్ జరిగిన సరేధరణీ నిర్మూలనం బైన - ధరణీ రాజ్యమునిర్మూలనంబు నాశనముఐనన్ అయినా సరేదుర్మరణం బైనఁ గులాంత మైన - దుర్మరణంబు దుర్మరణముఐనన్ సంబవించిన సరేకుల వంశముఅంతము నాశనముఐనన్ జరిగిన సరేనిజమున్ సత్యమునేరానిమ్ము ఒప్పుకొనెదనుకానిమ్ము పో - కానిమ్ము జరిగెడిది జరగ నిమ్ముపో భయం లేదుహరుఁ డైనన్ - హరుడు శివుడుఐనన్ అయినాహరి యైన - హరి విష్ణువుఐనన్ అయినానీరజభవుం డభ్యాగతుం డైన నౌఁ దిరుగన్ - నీరజభవుండు బ్రహ్మదేవు డయినాఅభ్యాగతుండు అతిథిగా వచ్చినవాడుఐనన్ అయిన సరేతిరుగన్ వెనుతిరుగుటనేరదు చేయ లేదునాదు నా యొక్కజిహ్వ నాలుకవినుమా వినుముధీవర్య విఙ్ఞానివేయేటికిన్ పలు మాటలు దేనికి.


https://pratibha.eenadu.net/tenth/lesson/telugu-medium/education/2-32-4-218-481-808-571-7976-20040013793

 

6, మార్చి 2021, శనివారం

మనీషి తత్వాన్ని పంచే ‘మనిషి అలికిడి లేక’

      
https://telugu.asianetnews.com/literature/dr-siddenki-yadagiri-reviews-chittaluri-satyanarayana-poetry-qpjo7k


మనీషి తత్వాన్ని పంచే ‘మనిషి అలికిడి లేక’

                  

 జీవిత విమర్శనమే కవిత్వం (Poetry is criticism of life) –మాథ్యూ ఆర్నాల్డ్.

 కాలం చలనశీలం. కదిలే కాలం ఎవరికోసమూ ఆగదు. కాలంతో పరుగెత్తుతూ ఆగని కాలాన్ని అందుకున్నవాళ్లే విజేతలు. విజేతల విజయం మానవాళి నుదిటిపై చరిత్ర. నూతనత్వం దిద్దిన మహత్తు. మానవ మనుగడకు ప్రతిబంధకంగా మానవీయత లోపిస్తున్న సంధి కాలం. మనిషి తనం లుప్తమవుతున్నసందర్భం.

 అణువణువున అనుమానం.  కరచాలనాల మధ్య కత్తులు మొలిపిస్తున్న కాలం.  బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవీ లేవు.  ప్రేమలు పెనవేసుకున్నమనుషుల మధ్య పొంచి ఉన్న కనపడని శత్రువు భయపెడుతున్నదుస్థితి.  కాలం కరవాళంతో కసాయి.  ఆరడుగుల దూరముంచిన కరోనా కాలం.  కనికరం లేని మృత్యుతాండవం.  ఆశలు కొట్టేసుకున్న వాళ్ళు అంపశయ్యపై చావును ఆహ్వానించారు.  ఆవాహన చేసుకున్నారు.  కాలం కౌగిట్లో అంతర్ధానమయ్యారు.  అయినవారు దర్శించుకోలేని, స్పర్శించలేని అంధకారం.  పెంచి పెద్దచేసిన వాళ్ళను కడచూపు చూడనివ్వని కర్కశత్వం మిగిల్చిన కాలం.  ఆశలుగా ఆశయాలుగా వాళ్ళ కళలు ఇంకా మిగిలే ఉన్నాయి.

మానవత్వం పునరావృతం అవ్వాలని, మనిషి బతుకాలని కలలుగనే వారిలో ముందుంటాడు కవి. తన అక్షరాలకు పదును పెడ్తాడు.  ప్రాణం పోస్తాడు. నిశ్శబ్ద నిశాచర కాలంలో బతుకుపై ఆశలు రేకెత్తిస్తాడు. దుర్మార్గపు కాలానికి చరమగీతం పాడుతాడు. అచ్చం అలాంటి లక్షణాలు గల కవి చిత్తలూరి ఆర్ద్రతతో మనిషి తనముండాలనీ సాహితీ లోకానికి అందిస్తున్న పుస్తకమే  ‘మనిషి అలికిడి లేక’

 

 అక్షరాలతో మనిషితనాన్నివిత్తుతూ మనిషిలోని విధ్వంసాన్ని, విరిగిపడుతున్న విలయంలో అక్షరాలా తన కవితలతో భరోసా గీతాలు ఆలపిస్తున్నాడు చిత్తలూరి సత్యనారాయణ.  ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ తరుచుగా సుపరిచితమైన పేరే చిత్తలూరిది.  అవి కవితలు కాదు ఎతలు అనడం సమంజసమేమో.  పిట్ట పీసుమననీ జనారణ్యంలో, కరోన కాలం లోనే కాదు నిజ జీవితంలోని మనిషి తనాన్ని, మనసులని తట్టి లేపుతూ, రాసిపోసిన తన కవితల కుప్పకు 'మనిషి అలికిడి లేక' అనే పేరుతో మనీషితనం ఎలుగెత్తి చాటుతున్నాడు.

 

         

         ‘ఏ ముఖం ఎవరిదో తెలియకుండా

          అనేకానేక మాస్కులు తొడుక్కున్న ఇన్ని ముఖాల మధ్య

          ఏ మాస్కూలేని స్వచ్ఛమైన తేట నీటి లాంటి

          పారదర్శకమైన అద్దంలాంటి

          ఒక మానవ ముఖం కావాలి

          నాకో ముఖం కావాలి’ (నాకో ముఖం కావాలి)అని కరోనా కాలంలో మనిషి గురించి మానవత్వంతో ఆలోచించిన, మనిషి అలికిడి లేని కాలాన పొద్దు పొడిచిన అక్షరంగా నాకో ముఖం కావాలంటాడు.  ఆ ముఖం వారికొక్కరికేనా? కాదు. సమస్త మానవాళికి, భయం గుప్పిట్లో బతుకుతున్నవాళ్ళకీ,  ప్రతి ఒక్కరికీ అవసరమే కదా!

 

కోవిడ్ -19 వల్ల కొత్త పదాలు పరిచయమయ్యాయి. లాక్ డౌన్, కోరంటైన్, ఐసోలేషన్, మొదలైన పదాలు ప్రతీకలయ్యాయి. పతాకలయ్యాయి.  కవిత్వానికి కొత్త వస్తువు అయింది.  ఈ కవి స్త్రీ దృక్పథంతో లాక్ డౌన్ గురించి రాస్తూ వేదనలను,  అవిశ్రాంత విధి నిర్వహణనూ గుర్తుకు తెస్తాడు.

          ఏ లాక్ డౌన్ ను ప్రకటించినా  

          మాకు గృహమే కదా బందిఖానాలంటూ

          శోక గీతాలే తప్ప

          గృహ మీదే కదా స్వర్గసీమ లంటూ

          మీలా కరోనా కవితలు ఎక్కడివి?

          మా శ్రమల జైలు నుంచి మాకు విముక్తి లభించిందెపుడని’ స్త్రీ స్వరమై ప్రశ్నిస్తాడు.

 

          

లాక్ డౌన్ వల్ల స్తంభించిన రవాణా.  బతకడమే బాధ.  బాధతో బతుకడమే జీవితం. ఎక్కడుండాలి? ఉండడానికి ఇల్లులేదు. తనడానికి తిండి లేదు. బతికేదెట్ల? పట్నం నుంచి వందల కిలోమీటర్ల దూరమున్న పల్లెతల్లి ఒడికి పాదయాత్రలు.  వాళ్ళకు అలుపు లేదు. వాళ్ళ గెలుపు ఇల్లు చేరడమే.  వారి లక్ష్యం పోతున్న ప్రాణాలు నిలుపుకోవడం.  దారంటా సరిపడే ఆహారం లేదు. తాగడానికి నీళ్ళు లేవు. అడుగడుగుకు తండ్లాటలు.  కొంతమంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేరదీసినా సహాయం సరిపోతలేదు. వాళ్లు ప్రస్తుతం అభాగ్యులు వారికి ఎదురెల్లుదాం అంటాడు.

          అన్నం పొట్లాలమై ఎదురెళ్దాం

          నడక పాదాల మీద పూలు చల్లకపోయినా

          ఆకలి మంటల్ని ఆర్పేసే

          మెతుకు పూల వానై కురుద్దాం (మెతుకు పూల) పాదయాత్ర చేస్తున్న ప్రజలను చూసి హత్తుకుందామని కవిత్వమై వేడుకుంటాడు.

 

          

ఈ కవితా సంకలనంలో కరోన కాలంతో పాటూ అనేక సమస్యల మధ్య సతమతమవుతున్న మనుషుల జీవితాల్నీ చిత్రిస్తాడు. గాలానికి చిక్కి విలవిల్లాడుతున్న చేపల్లాంటి మనుషుల్నీ, మనసుల్నీ చెరుగని పుట్టుమచ్చలా ఆవిష్కరిస్తాడు.

 

దేశంలో ఇప్పటికీ వయసొచ్చిన ఆడపిల్లలకు, స్త్రీలకూ నెలసరి దినాల్లో పడే బాధని తదాత్మయమ్ చెంది రాస్తాడు. కవితను ఎత్తుకోవడం లోనే కవి ప్రతిభ కనపడుతుంది చూడండి.

          ఇంతగా అభివృద్ధి చెందిన నా దేశంలో

          ఆమె ఇంకా ఒక గుడ్డ ముక్క కోసమే వెతుక్కోవటం

          కంటనీరు తెప్పిస్తోంది

          .............

          ఒక చిన్న నెత్తురు చుక్కను దాచుకునేందుకు

          ఇప్పుడు దేశమంత శానిటరీ పాడ్‌ కావాల్సిందే! (దేశమంతా) కవితలో శానిటరి ప్యాడ్ ల అవసరతను ఖచ్చితత్వంతో వివరిస్తాడు.

 

          

గతుల కోసం సుతులు.  సుతుల కోసం గతులు అనే సామెతను అనుసరించి పిల్లల కోసం తల్లి తండ్రుల తపన.  పెళ్లి చేసుకొని తల్లి తండ్రుల్నీ వదిలి అనాధలను చేస్తున్నఉరుకుల పరుగుల జీవితాలకు వాస్తవాలనీ తేటతెల్లం చేస్తూ రాసిన కవితలో 

          మీరు తినే పళ్లెంలోంచి

          ఓ ముద్ద కూడు

          ఆకు రాలిన చెట్టయి మిగిలిన

          ఆ ఎముకల గూడును

          ఆప్యాయంగా అల్లుకునే

          పూల తీగల్లాంటి మీవయిన

          ఓ నాలుగు ప్రేమపూర్వకమైన మాటలు (ఏం  కావాలి వాళ్లకు!) మనకు జీవితాన్నిచ్చి, ఉన్నతికి కారణమైన తల్లి తండ్రులకు మీవైన (మనవైన) నాలుగు ప్రేమ పూర్వక మాటలే కదా! వాటిని కూడా అందించకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తాడు.

 

 బంధాలు, బంధుత్వాల గురించి చిక్కన్ని అనుబంధాల్ని అల్లుతాడు.  మనల్ని తన కవిత వింటినారికి బిగించి గుంజుతాడు. తన తల్లి గురిచి చెబుతూ ఏమీ చెప్పననీ ఎంతో గొప్పదనం చెప్పుతాడు.

          ఎవరి ద్వేషాన్నయినా

          ఎందరి ఆవేశాన్నయినా

          గుండెల్లోనే దాచుకుని

          ప్రేమను మాత్రమే పంచి పెట్టే

          ఒట్టి పిచ్చి తల్లి మా అమ్మ

          మా అమ్మ గురించి

          అంతగా చెప్పుకోదగిందేముందిలెండి! (పిచ్చి తల్లి!)

 

 తనకంటూ ఏమీ మిగుల్చుకోనీ తండ్రిని తన కవితా పంక్తులుగా చిత్రిస్తాడు.  డాడీ స్వార్థ పరుడు కాడు గనుకనే అతని వారసులుగా ఉన్నామనీ ఒక నిర్వేదంతో ఒక దు:ఖ తెరను పాఠకుల మీదికి విసిరి మనసును తడిబట్టలా పిండుతుంటాడు.

          ఇన్ని రకాల పనులు మీదేసుకుని

          అందరికీ అన్నీ పంచిపెడుతూ

          తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా

          ఒంటరిగా మిగిలిపోతున్న డాడీ

          మంచోడెలా అవుతాడు?

          అవును డాడీ మంచోడు కాడు!  (డాడీ మంచోడు కాడు!)  

 

          

రూపాయలుంటే రూపమనుకునే సమాజంలో కులం తోకలు పేరు చివరన చేరీ ఏలుబడి చేస్తున్నాయని గేలి చేస్తూ,  మానసికంగా మభ్యపెడుతున్న తీరును తులనాడుతూ రాసిన కవితను పరిశీలిస్తే, తనపై తోకలతో దాడి చేసే వారిపై ఎలా కలబడుతాడో తెలుస్తుంది. వారి కొట్లాట తోకలతో కాదు. తోకలు చూపే అహంతో, వివక్షతో.

          నిజానికి నాకు తోకలతో పనేముంది?

          ఆధిపత్య తోకలను కత్తిరించి

          తలెత్తుకుని నిలబడే ఆత్మగౌరవ శిరస్సు నాది(తోకలు)

 

 జనాభా లెక్కలు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి కరోన కంటే ముందు పెద్ద ఎత్తునా దేశమంతా రాద్దాంతం జరిగింది.  ఈ దేశ మూలవాసులమైన మమ్ము లను పరిచయం చేయడానికి నీవెవరు? అని కుట్రను పసిగట్టి ప్రశ్నిస్తాడు.  

          నన్నివాళ కొత్తగా పరిచయం చేసుకోమనే కుట్రేంది?

          అనేక రకాల రంగుల పూలను

          గుబాళిస్తున్నదేశభక్తి నాది

          కొత్తగా నా భక్తికి పరీక్షలేంది

          పిడికెడు మట్టిని చేతుల్లోకి తీసుకుని చూడు

          ఈ దేశ మూవాసుల నెత్తురూ కన్నీళ్లతో

          తడిసి మొలకెత్తిన నా దేశం కనిపిస్తుంది!(ఒకానొక పరిచయం)  ఈ దేశ మూలవాసుల పరిచయం, వాస్తవం తెలిసేలా వివరిస్తూ, రాజకీయ కుట్రలను ప్రశ్నిస్తాడు.

 

  

కవి అనధికార ప్రజా ప్రతినిధి.  కవి ప్రజల పక్షాన నినదిస్తాడు. బలం లేనోళ్ల బలమైన గొంతుకగా మారిన తన కవిత్వంలో వారి ఆత్మ కనబడుతుంది.  బలహీనుల పక్షంగా గొంతెత్తుత్తాడు.

          మీ కాళ్ల కింద చెప్పుగానో

          మీ పిర్రల కింద పీటలగానో తప్ప

          మీ భుజాల మీదకి ఎక్కించుకుందెప్పుడని

          మమ్మల్ని  (తెలుసులెండి) అనే కవితలో ముక్కుపట్టి కొట్టినట్లు అడుగుతాడు.  ఆ భావజాలాన్ని కడుగుతాడు.

 

ఏ కవినైనా, కళాకారుడినైనా ప్రజలవైపు మాట్లాడినా, బడుగు బలహీనుల తరుపున రాసినా, ఆ తంటా నీకెందుకు? నీ కవిత్వమేదో నీవు రాసుకో. నిజం నిష్టూరం. యదార్థవాది లోక విరోధి. వొద్దు. ఉన్నది ఉన్నట్టు రాయకు అనే బోడి సలహాలను చూసి ...

          మనిషిగా చచ్చిపోయి

          రెండు దండలూ నాలుగు శాలువాలూ  మీదేసుకుని

          బతకనేర్చిన కవిగా ఊరేగమంటున్నారు

          ఛీ! అంతా తొండి (ఛీ అంతా  తొండి!) సున్నితంగా తిరస్కరిస్తున్నకవి అంతరంగం అక్షరాల్లో కనపడుతుంది. 

 

మనం మనుషులం. మనుషుల మధ్య ప్రేమ, స్నేహం, సమానత్వం పెంపొందించాలి కానీ వైరుధ్యాలను కాదనీ గట్టిగా నమ్ముతాడు చిత్తలూరి.  అదే వారి అంతరాత్మగా అగుపిస్తుంది. విశ్వ నరుడనని ప్రకటించిన జాషువా లాగా,  ఆకశం భీజ ప్రధాతగా/ అవనీయే ఆది మాతగా చూసే జనాలకు సమాజమంతా ఒకే కుటుంబంగా కనబడుతుందన్న సినారె కవితా పంక్తులు తప్పకుండా గుర్తుకొస్తాయి.

          మనిషిని విత్తనం చేసి మొలకెత్తించటం

          దేశాన్ని ఆకుపచ్చని పంట చేను చేసి పరవశించటం కదా

          మనిషి ఆశయం కావాలి

          మనుషులెక్కడైనా మనుషులే కదా

          -------

          ద్వేషానికి సరిహద్దులు చాలా వుంటాయి

          కానీ మనిషిని ప్రపంచ మానవుడిగా ప్రేమించటానికి

          ఏ భౌగోళిక సరిహద్దులూ లేవు

          ప్రపంచమే ఒక దేశం, దేశమే ఒక ప్రపంచం!      (దేశమే ఒక ప్రపంచం)

         

చిత్తలూరి కవిత్వం నేలవిడిచి సాము చేయదు.   జీవితం

లోంచి, జీవితం కొరకు, జీవితం చేత రాయించిన కవిత్వమే వీరి వస్తువు.  నాకు తెలిసి ఈ పుస్తకం ఎవరు చదువుతున్నా వారి జీవితమే కనిపిస్తుంది.  కనిన, వినిన, కాంచిన కథలు, గాథలు, కన్నీళ్లని దాటుకొనే బతుకును సూచిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

          

చిత్తలూరిని,  వారి కవిత్వాన్ని ఎవరో పరిచయం చేయడమేంటి? విడ్డూరంగా.  మీరూ చదవండి.  మీకూ సుబోధకమవుతుంది. ఎందుకంటే జీవితమే కవిత్వమై, కవిత్వమే జీవితమై, అక్షరమై, బాసిస్తూ ఉంటాడు గనుక.  కావలసినన్ని ప్రతీకలు, భావచిత్రాలు, పదచిత్రాలు ఉన్నాయి ఇందులో.   వస్తు నవ్యత, ఆకట్టుకునే వినూత్నశైలి, నూత్న అభివ్యక్తి, సమతులాహారంలాంటి సమపాళ్ళ కవిత్వం  ‘మనిషి అలికిడి లేక.’  ఇది వారి నాలుగో పుస్తకం.  ఈ పుస్తకంలో మొత్తంగా అరువై ఏడు కవితలున్నాయి.  జీవితంలోని దాదాపు అన్నీ కోణాలు దర్శింపజేస్తాడు.

 

          ఎటు కదిలినా గుచ్చుకునే రాకాసి ముళ్ల మధ్య

          ఏ ఆచ్ఛాదనా లేని బతుకు తలపైన కురిసే

          అకాల రాళ్ల వర్షాల నడుమ

          మనిషన్నవాడు నిత్యం గాయపడటమే (రాకాసి ముళ్లు )

 

వారు జీవితతత్వమెలా పట్టుకుంటారో  కవిత్వమే మనసు ప్రతిబింబంగా చూపుతుంది.  మనిషిన్న వాడు గాయపడుతూనే ఉంటాడు. ఆ గాయంలోంచి ఒక బోధ, ఒక అనుభవం రావాలి.  ఆ అనుభవం ఇతరులకు జ్ఞానం కలిగించాలనీ, తపనపడే కవిగా జీవిత సారాన్నిచెప్పుతాడు.   నిజాల ఇజాన్ని ప్రకటిస్తాడు కవి చిత్తలూరి.


https://telugu.asianetnews.com/literature/dr-siddenki-yadagiri-reviews-chittaluri-satyanarayana-poetry-qpjo7k

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

అచ్చమైన కవి సిద్దెంకి యాదగిరి

సిద్దెంకి యాదగిరి కవిత 'బరి'

నవ తెలంగాణ దర్వాజా 8-2-2021

https://m.facebook.com/story.php?story_fbid=2026318010841114&id=100003888054246


బరి

మత్తిల్లే తలలు కాదు 
మేల్కొలుపు ఆలోచనలు కావాలే 
లపూట్ల కొలతలా?
లైఫే వైఫై
దండె గొడ్తవా?
ఇది గుండె కాదు
మొండి పర్వతం

వ్యాకర్ణాలు వెతుకకు  
ప్రమాణాలు తూచకు 
బతుకును ఏ తక్కెడ జోకుతది?
పావందుల పానాదులు తొక్కకు
తొవ్వకు అంతు ఉందా?

నిజం
ఖనిజం
ఇజం మేమే
మాయిముంత పునాదులు మాయి
బూతద్దంతో బుకాయించకు
బతుకే అద్దం చూర 

బతుకు చూడూ!
ఎతల రొద వినూ!
టైం లేదనీ మైం చెయ్యకు
సోయికి రా అన్నీ కనపడుతయి

అమాసకు దారి చూపిన చుక్కల వెలుగు
లైట్ పురుగుల గురి 
ఎత్తిన పోరు బరిసె 
వంచిన మెడలని నిమురు
కాలిన మా దేహాల కమురు వాసన కంపు వీస్తది

మాది ఆకలి రణం
అవమానాల వ్రణం
సత్తైం నిత్తె రాజుకునే నిప్పు

ఉనికి కోసం ఊపిరి
పగపట్టిన సావు పీడ
తలపడిన బతుకే కాగడా
జీవన్మరణ మనుగడ

అర్థం కాలే?
తవ్వూ బాధలగని 
తోడూ జీవజల
రాయీ బతుకే మహా గ్రంథం 

కటింగ్ లు వొద్దు
ఆకలి కీకలే కవిత్వం 
భావోద్వేగాలే భాష 
విలువలే శైలీ 
శిథిలాలను పెకిలించిందే రాత 
పలుకుబడులే సౌందర్య సోయగం 
  
సమ్జైత లేదా ?
కాలంతో కలబడే కన్నీళ్ళు
బతుకు కాగితాలపై ఓడని స్ఫూర్తి 
జయించే ఆత్మ విశ్వాసమే
మా అక్షరం
మా పుస్తకం గండ దీపం
మా సాహిత్యం
అంతరాల చరిత్ర పై భస్మనేత్రం

కొలతలు, ప్రమాణాలు లేవు 
ష్యూర్
రూల్స్ బ్రేక్ చేయడమే మా పని 
ప్రామిస్ 
ప్రేంస్ విరవడమే విధి 
నడిమికి తెగ్గొట్టిన
పొద్దు పొడుపు తోరణంను అతికించడమే మా బాధ్యత 

ఆవాహనా?
అనుమానమా?

వేరెవర్
మీది మిస్టరీ
మాది హిస్టరీ.

డా. సిద్దెంకి యాదగిరి
 9441244773.