సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

20, డిసెంబర్ 2024, శుక్రవారం

సరళ పదాలు - ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు

______________________________________


రెండు అక్షరాల సరళ పదాలు 









______________________________________
అల,   అర 
ఆవ,     ఆన
ఇక,  ఇల, ఇగ
ఈగ, ఈక, ఈత, 
ఉమ,  ఉష, 
ఊక.  ఊట, 
ఎద, ఎత, ఎల,
ఐస 
ఒర, ఒక, ఒగ
ఓడ, ఓర,
ఔర, 
కల, కడ, కద,
గద, 
జత, జడ,  జల,
తల, తడ,  తమ 
దడ, దయ,  
నగ,  నట, నస, 
పగ, పర, పద
బస, బల, 
మగ,  మత,  మన 
యమ,
రమ, రస 
లయ, లత 
వడ, వల 



-----------------------------------------------------------
మూడు అక్షరాల సరళ పదాలు  సరళ పదాలు డౌన్ లోడ్








-----------------------------------------------------------
అరక,            అమల
ఆమడ.         ఆయన,  
ఇతర,            ఇచట,          ఇరగ
ఈదర,           ఈయన,      ఈవల 
ఉదక,        ఉపమ,        ఉలవ, 
ఊయల,    ఊదర,        ఊరక, 
ఎడమ       ఎచట         ఎకర
ఏడవ        ఏలన.      ఏమర 
ఐదవ 
ఔనట 
కమల        కడప        కలప 
గడప         గదవ       గనక 
చదర        చవట       చలమ 
జనప        జలజ       జలగ 
టమక 
డజన 
తడవ        తబల      తపన 
దవడ        దహన 
నరక         నవల          నయన 
పలక        పనస           పడవ 
బయట     బడవ          బరమ 
మడవ      మసక.         మరక 
యసర      యతల 
రచన         రమణ         రగడ 
లలన         లవణ 
వరద          వనజ         వరస 
శనగ
సరళ           సహన       సమత 

________________________________
నాలుగు అక్షరాల సరళ పదములు  సరళ పదాలు డౌన్ లోడ్
----------------------------------------------------
అవతల        అవగతం
ఆచరణ        ఆమరణ        ఆదరణ
ఇవతల         ఇరగటం        ఇగరటం 
ఉడకటం        ఉరవటం       ఉతకడం 
ఊడవటం      ఊరవతల
 ఎదగడం         ఎగరటం 
ఏడవటం       ఏడు ఏరు
కదలక              కలపక       కలకలం 
గబగబ.           గడపటం.   గడవటం 
చదవడం        చకచక
జలజల          జరజర 
టపటప.         టకటక
డబడబ.         డగడగ 
తరతమ.        తడవక   తరలక 
దడదడ.          దబదబ   
నడవడం.        నవరసం        నరహర నడవక
పకపక              పరపర
బరబర             బలవడం 
మరవక            మరలక మరల మలమల 
యనమల         యకశక 
లకలక              లబలబ
వలవల            వదలక
సలపక ‌            సడలక 
హరహర
______________________________________
సున్నాతో వచ్చు సరళ పదాలు 
___________________________________________________________________________
అంబ అంకం అండ 
ఇంగువ ఇంకా ఇంధనం 
ఉంగరం ఉండ 
ఎండ ఎంత 
ఓం 
కంచం కందకం కలవరం కంటకం 
గంప గండం గంగ 
చందనం 
జలకం జంట 
ఢంకా 
టెంకాయ 
తంగలాన్ తిందాం 
దండ, దంట
పంతం, పంజరం 
బలగం, బలం, బంతి 
మంట, మంగ, మండుట 
రంగం, రంగ
లంద లంగ  
వందనం, వండటం, వంశం 
శంఖం, శంకరుడు 
సంపుటాలు, సంధి, సంఘర్షణ 
హంస
సరళం 

______________________________________
మహా ప్రాణ అక్షర సరళ పదాలు
_____________________________________ సరళ పదాలు డౌన్ లోడ్_
ఖర, ఖండం అఖండ 
ఘనం ఘటన 
ఛట్రం 
ఝండా, ఝషం 
ధర, ధనం, 
ఫలం, ఫలహారం, 
భారతం, భరిణ, భలే, భేటీ 


______________________________

గుణింత పదాలు 





ఆ   - కారు, కాఫీ, గానుగు, చాలు, జారు, తారు, డాగు,  పారు, బారు, మారు

ఇ - కిటికి, గిలక, చిలక, జిగి, తినడం, దినం, నిరుడు, మిలమిల, విలవిల, 

ఈ - కీలకం, కీలు, గీరు, చీర, తీరిక, దీనం, మీరు, వీరు, కీటకం, గీర, 

ఉ - కురులు, గురువు, చులకన, తులం, దుల, నులక, పురుగు, మునక, గునుగు, 

ఊ- కూర, గూడ, చూరు, తూలిక, దూరం, నూరు, పూనుట, మూకుడు, 

ఋ - కృప, తృణం, నృపాలుడు, మృగం,

ౠ - కౄరత్వం 

ఎ - కెరటం, గెల, చెదలు, టెంకాయ, నెనరు, బెదురు, మెడ, 

ఏ- కేరడం, గేయం, చేను, నేల, పేరు, మేక, రేల, 

ఐ, కైకేయి, చైతన్య, జైలు, టైం, డైరీ,‌ నైజం, పైకి, బైక్, మైండ్,

ఒ - కొలిమి, చొరవ, పొద, నొగ, మొదలు, రొద,

ఓ - కోరిక, గోడ, చోటు, జోరు, తోట,‌ దోషం, నోరు, పోరు, బోధ, మోది, యోగ, రోలు 

ఔ- కౌరవులు, గౌను, చౌదరి, జౌళి, నౌక, మౌనం,

ం ‌- కంప గంప, చంపుట, దంచు, 

__________________________________________
            ద్విత్త్వ పదాలు : ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.

__________________________________________
క్క-  అక్క చెక్క, తొక్క, నక్క, తొక్క 
గ్గ - అగ్గి, గుగ్గిలం, మొగ్గ, లగ్గ, దగ్గు, దగ్గర, పగ్గం 
చ్చ - రచ్చ, కచ్చ, రొచ్చు, పుచ్చు, ముచ్చు, 
జ్జ - సజ్జ, బజ్జీలు, కజ్జికాయ, గజ్జి,
ట్ట- అట్ట, తట్ట, బట్ట, నట్టలు, కట్టెలు 
డ్డ - గడ్డ,  అడ్డం, రెడ్డి
త్త - అత్త, చిత్తు, బొత్తు, ఉత్తరం, మత్తు, కత్తెర, కత్తులు 
ద్ద- చద్దన్నం, ముద్ద, పొద్దున, హద్దు, నిద్దుర, 
న్న- నన్ను , అన్నా సున్నం కన్నం వన్నె నన్ను నిన్ను 
మ్మ - అమ్మ కమ్మ జుమ్మా రెమ్మ
య్య- అయ్య కయ్య పొయ్యి 
ర్ర- అర్ర కర్ర బర్రె గొర్రె
ల్ల - గల్లా చెల్లాచెదురు అల్లం ఉల్లిగడ్డ తల్లి చెల్లెలు
వ్వ - అవ్వ  బువ్వ కవ్వం నవ్వులాట తవ్వుట 
శ్శ - నిశ్శేషం


________________________________________
             సంయుక్త అక్షర పదాలు 

__________________________________________

సంయుక్తాక్షర పదాలు అంటే ఒకదానికంటే ఎక్కువ వ్యంజనాక్షరాలు కలసి ఒకే అక్షరంగా ఏర్పడిన పదాలు. వీటిని సంయుక్తాక్షరములు (Conjunct consonants) అంటారు.

ఉదాహరణకు, "క్ష" (క్+ ష్+అ), "త్ర" (త + ర్+అ), "జ్ఞ" (జ + ణ్+అ) మొదలైనవి సంయుక్త అక్షరాలు

తర్కము (ర్ + క్+అ = ర్క)

ఆసక్తి (క్ + త్ + ఇ = క్తి)

పద్యము (ద్ + య్ + అ = ద్య)

అశ్వము (శ్ + వ్ + అ = శ్వ)

పెండ్లి (డ్ + ల్ + ఇ = డ్లి )

కాశ్మీరు (శ్ + మ్ + ఈ = శ్మీ)

భగవద్గీత (ద్ + గ్ + ఈ = ద్గీ )

అద్భుతము (ద్ + భ్ + ఉ = ద్భు)

అర్జున (ర్ + జ్ + ఉ = ర్జు)

_______________________________

సంశ్లిష్ట పదాలు సరళ పదాలు డౌన్ లోడ్

 _______________________________

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

స్వాతంత్ర్యము ( త్ + ర్ + య్ + అ = త్ర్య )

ధృతరాష్ట్రుడు (ష్ + ట్ +ర్ + ఉ = ష్ట్రు)

సామర్ధ్యము (ర్ + ధ్ + య్ + అ = ర్ధ్య)

వస్త్రము (స్ + త్ + ర్ + అ = స్త్ర)


గుణింతాలు

ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు

కళ కలకడ

______________________________________

గళం  గద గంగ

_____________________________________

చక్రం 

_____________________________________

జలజ  జల  జత 

_____________________________________

టముకు టపటప  టమాట

_____________________________________

ఢంకా 

_____________________________________

తల తప్పెట   తడ  తబల  తడక 

ధర

నగ నలం నగం

పనస పదం పలపల 

బలపం బండి  బడి 

మడుగు మంచి మనిషి మధురం మంచు 

యముడు 

రవి రంగు రచన 

లత 

వల వడ వరం 

శంఖం

  

కాయ కారం కాగడ కాడ కాలం 

_____________________________________

గాలం గాబర గానం గాతం గంగాళం

_____________________________________

చాప చాట చామ ఛాయ చాలా

_____________________________________

జాతర జానజాణ జావ జామ 

_____________________________________

టాటా టాకా టమాటా

_____________________________________

డాబా

_____________________________________

తార తాళం తాపం తామర తారకం 

దారం దాహం దానం ఆధారం

నాప నార నావ నాశనం నాగ

పాప పాపం పాట పానకం పావలా

బాసర బావ బాన బాధ బాట భాష 

మాట మాయ మామ మాత మానం  

యాతన యాగం యాస యానాం 

రాగం రాక రాత రాచ

లాభం లాల పలాస లాంఛనం 

వాన వాసన వారం

శాఖ



కి- కిరాయి కిటికి కిచిడి కిరణం కింద నకిలి
గిలక గింజ అంగిలి
చిలిపి చిదిమి చివర చిలక
జింక అంజి గంజి జింక అంజి గంజి జిరాఫి
టింటిం
తిండి అంతిమ తంతి
దినం దినుసు  గది మది పది నది వదిన
నిజం నికరం నిదానం నిశాని నివారణ నివాసం నింద
పిత పిండం పిరికి పింఛం పిన పిదప ఫిరంగి
బిరడా బింకం  
మిరప మిగతా మితం మిగిలిన మిఠాయి
రింగు, రింకు
లింగం కలిపి అలిగి పగిలి నలిగిన కలిగి
విరి విదియ విరాగి వినతి విశాలం వివరం వినడం వివాదం శిఖరం శిశిరం శిల శిధిలం శిఖ
ఋషి సినిమా
పసిడి సింహం
హిమం హింస
క్షితి  

కీ- కీటకం కీచక కీర కీలకం వకీలు రాఖీ
గీత గీత  గీర అంగీరస
చీమ చీర చీల
జీడి జీతం అంజీర మంజీర జామీను
టీకా టీపాయి
తీట తీరం తీగ అతీతం సతీమణి
 దీపం దీన ధీర దీపిక దీపావళి ఆధీనం మదీన
నీరసం నీడ నీతి నీచం
పీక పీట పీడ పీత
బీద భీతి భీజం బీట బీరకాయ భీకరం
మీసం మీనా మీగడ మీద మీట మీనం జామీను
రీట రీలు ఖరీదు
లీల వలీవ గలీవ
వీణ వీర వీపు వీచుట వీడు వీధి
శీత శీతలం
షీల సీత
సీమ మసీదు
హీనం మహీధర
క్షీరం క్షీరదం

కునుకు కుడుము కుబుసం కులుకు కురుచ కుజ 

_____________________________________

గుబురు గుణం గుంట గుంపు గురువు_ గుండు 

 _____________________________________

చురుకు చుంచు చులకన అంచు కంచు 

_____________________________________

 జులాయి రాజు గాజు జులపాలు జుంకా

_____________________________________

అటు ఇటు ఎటు నటుడు భటుడు ఇటుక

_____________________________________

అడుగు గడువు పడుచు నడుము గడుసు


_____________________________________

తుఫాను తుపాకి తురుము తులసి దురుసు దుమారం దులుపు దుంగ దుంప
నులక నుదురు నునుపు కనుమ ఇనుము
పులుసు పులుపు పుడమి పురం పురాణం పులి బులుగు బుంగ భుజం జాబు గాబు కబురు గుబురు ముసలి మునక మునగ ముదురు ములుగు ముంత యువక యుగం అయువు వాయువు
రుంగ  
లుకలుక
వీరు నారు కబీరు కారు

కూర కూడు కూత కూతురు కూపం ఖూనీ

_____________________________________
గూడు గూబ గూడూరు గూని


_____________________________________

చూపు చూలు చూర చూలాలు

_____________________________________

జూదం జూలు 

_____________________________________

గుంటూరు ఇంటూ రు   

____________________________________

డూపు మండూకం

_____________________________________

తూకం తూనీగ తూము తూటా
దూరం దూడ దూకుడు దూలం దూత
నూక నూరు నూనె నూతన నూగు నూజివీడు
పూజ పూట పూత పూనకం పూజారి పూడిక పూరి బూజు బూర బూజర బూతు బూతం బూటకం మూగ మూత మూలుగు మూడు మామూలు యూరియా యూదు
రూపం రూటు రూక
లూనా లూఠీ లూజు లూసీ
వూపు వూరు

కెరటం కెనడ అంకె ఒంకె జంకె లంకె
గెసి గెల గెలుపు గెంతు గెంటు
చెంగు చెదలు చెకుముకి  చెదురు చెరుకు చెమట
జెమిని జెముడు జెండా జెఠారి
టెంక టెంటు టెంపరు గరిటె టెంకాయ
గుండె దండెం పండెను బండెడు వండెను కండె తెగ తెలుపు తెలిసి తెలుసు తెలుగు తెగులు తెరచి
అందె బిందె పందెం
నెమలి నెల నెపం నెరుపు
పెంకు పెరుగు పెనుగు పెళుసు పెండళం పెంపకం బెంగ బెండ బెండు బెరడు బెదురు బెణుకు బెంచి
మెరుగు మెరుపు మెలిక ఆమె ఈమె మెడ అమెరిక
యెకరం
రెండు
లెక్క
వెల వెరసి వెగటు
శెట్టి
  

కేక కేజీ కేటు కేవలం కేతనం కేసరి
గేదె గేటు గేరు
చేటు గేయం గేళి గేజి చేమ చేమంతి చేవ చేకూరు చేపు జేబు జేసు జేజేలు
టేకు టేగ
డేగ డేరా డేగిశ డేటా
తేలు తేట తేమ తేడా తేనె తేరు తేది తేవటం తేపు
దేశం దేవత దేహం దేహి దూదేకు దేవాలయం నేల నేల నేరం నేత నేను నేటి
పేరు పేట పేద పేను పేజి పేతురు పేడు పేగు పేరంటం పేచీ బేదం బేటా బేరం బేగం బేకరీ
మేఘం మేషం మేలు మేడ మేతర మేనక మేదర
యేపు యేసు
రేప రేటు రేణుక రేగడి రేవతి రేఖ
లేత లేత లేటు
వేప వేమన వేదం వేతనం  వేరు వేటూరి వేళ
శేఖరు శేషం
సేతువు సేద సేవ
హేమంత హేతువు హేళన
క్షేమం క్షేదం

కొలను కొలత కొండ కొంత కొరకు కొసరు కొలిమి గొడవ గొంగళి గొడుగు గొలుసు గొణుగుట
చొరవ
జొరబడి
టొమాట
డొంక
తొలకరి తొడ తొలి తొడిమ తొందర
దొర దొండ దొంతర దొంగ
నొక నొసలు
పొడి పొదుపు పొరుగు పొలిమేర పొరుగు పొదిలి పొగ బొంగరం బొంత బొంద బొరియ బొటనవేలు
మొదలు మొటిమ మొనగాడు మొసలి
యొనరు
రొంపి రొంది

కోమలి కోపం కోరిక కోణం కోలాటం కోడలు
గోడ గోతం గోధుమ గోరు గోల గోంగూర గోవు
చోదన చోటు చోడవరం చోదకుడు
జోలె జోడి జోకరు జోబు జోము జోరు
అటో ఇటో ఎటో టోకర టోపి ఆటో
డోలు
తోలు తోట తోవ తోక తోముట తోరణం తోడు. దోమ దోస దోర దోనె దోవతి దోచుట దోషం దోశ
నోము నోరు
పోతన పోరాటం పోటీ పోరంబోకు కపోతం
బోడి బోరు భోజనం బోండాం భోగి భోగం
మోజు మోటు మోత మోపు మోసం మోదకం యోబు యోధుడు
రోలు రోకలి రోగం రోమ రోటి రోత రోజు




 



కింది వర్ణమాల పట్టికను చూడండి. అక్షరాలను చదువండి.
అఆఇఈఉఊఋౠఎఏఐఒఓఔఐంఅః
కఖగఘ
చఛజఝ
టఠడఢణ
తథదధన
పఫబభమ
యరలవశషసహళక్షఱ
ఈ వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా  10 పదాలు రాయండి

1. అల

2. అరక

3. ఇల

4. ఉమ

5. రమ

6. క్షమ

7. తల

8. తలగడ

9. లతతల

10. తళతళ

11. కల

12. మర

ఈ కింది అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు రాయండి
అల
ఇ – ఇల్లు
ఈ – ఈగ
ఉ – ఉడుత
ఊ – ఊరు
ఎ – ఎలుక
ఏ – ఏనుగు
ఐ – ఐదు
ఒ – ఒంటె
ఓ – ఓడ
ఔ – ఔషధం
అం – అంకం
అః – అః (ఆశ్చర్య ధ్వని)
క – కలం
గ – గది
చ – చరక
జ – జలము
ట – టమాటా
డ – డబ్బు
త – తల
ద – దారి
న – నది
ప – పనస
బ – బడి
మ – మట్టి
య – యానం
ర – రథం
ల – లత
వ – వనం
శ – శరత్
ష – ఝషం
స – సూర్యుడు

క గ చ జ ట డ త ద న

కారు, కాఫీ, గానుగు, చాలు, జారు, తారు, డాగు, దాగు, తాగు, దానం , నారు
ఇ - కిటికి, గిలక, చిలక, జిగి, తినడం, దినం, నిరుడు, మిలమిల, విలవిల,

ఈ - కీలకం, కీలు, గీరు, చీర, తీరిక, దీనం, మీరు, వీరు

ఉ - కురులు, గురువు, చులకన, తులం, దుల, నులక
పురుగు, మునక,

ఊ- కూర, గూడ, చూరు, తూలిక, దూరం, నూరు, పూనుట, మూకుడు,

ఋ - కృప, తృణం, నృపాలుడు, మృగం,

ౠ - కౄరత్వం

ఎ - కెరటం, గెల, చెదలు, టెంకాయ, నెనరు, బెదురు, మెడ,

ఏ- కేరడం, గేయం, చేను, నేల, పేరు, మేక, రేల,

ఐ, కైకేయి, చైతన్య, జైలు, టైం, డైరీ,‌ నైజం, పైకి, బైక్, మైండ్,

ఒ - కొలిమి, చొరవ, పొద, నొగ, మొదలు, రొద,

ఓ - కోరిక, గోడ, చోటు, జోరు, తోట,‌ దోషం, నోరు, పోరు, బోధ, మోది, యోగ, రోలు

ఔ- కౌరవులు, గౌను, చౌదరి, జౌళి, నౌక, మౌనం,

ం ‌- కంప గంప, చంపుట, 

క గుణితం నుంచి న గుణింతం వరకు (క, గ, చ, జ, ట, డ, త, ద, న)
దీర్ఘం నుంచి విసర్గ వరకు కలిపిన పట్టిక

ఆ (ా) గుణింతం

కా కాలం | గా గానం | చా చాటు | జా జాబిలి | టా టాటా | డా డాబా | తా తాత | దా దానం | నా నాన్న

ఇ (ి) గుణింతం

కి కిలి | గి గిరి | చి చిలక | జి జిలేబి | టి టిక్కెట్టు | డి డిమ్ము | తి తిమింగలం | ది దినం | ని నిలువు

ఈ (ీ) గుణింతం

కీ కీటకం | గీ గీతం | చీ చీమ | జీ జీవం | టీ టీచర్ | డీ డీలా | తీ తీరం | దీ దీపం | నీ నీరు

ఉ (ు) గుణింతం

కు కుర్చీ | గు గురు | చు చుక్క | జు జున్ను | టు టుబ్బు | డు డుగ్గు | తు తుమ్మెద | దు దుప్పటి | ను నుయ్యి

ఊ (ూ) గుణింతం

కూ కూతురు | గూ గూడు | చూ చూపు | జూ జూదం | టూ టూల్ | డూ డూడ్ (ఉదా) | తూ తూటా | దూ దూది | నూ నూనె

ఎ (ె) గుణింతం

కె కెరటం | గె గెంతు | చె చెట్టు | జె జెండా | టె టెంకాయ | డె డెబ్బ | తె తెర | దె దెబ్బ | నె నెల

ఏ (ే) గుణింతం

కే కేసు | గే గేటు | చేచేను | జే జేబు | టే టేబుల్ | డే డేరు | తే తేలు | దే దేశం | నే నేడు

ఐ (ై) గుణింతం

కై కైకం | గై గైడ్డు | చై చైత్రం | జై జైహో | టై టైము | డై డైరీ | తై తైలం | దై దైర్యం | నై నైపుణ్యం

ఒ (ొ) గుణింతం

కొ కొబ్బరి | గొ గొడుగు | చొ చొప్పున | జొ జొన్న | టొ టొంక | డొ డొక్క | తొ తొడ | దొ దొడ్డి | నొ నొప్పి

ఓ (ో) గుణింతం

కో కోతి | గో గోపి | చో చోరుడు | జో జోడి | టో టోపీ | డో డోలు | తో తోక | దో దోసె | నో నోరు

ఔ (ౌ) గుణింతం

కౌ కౌగిలి | గౌ గౌరవం | చౌ చౌక | జౌ జౌళి | టౌ టౌన్ | డౌ డౌట్ | తౌ తౌడు | దౌ దౌర్భాగ్యం | నౌ నౌక

అం (ం) అనుస్వారం

కం కంకణం | గం గంగ | చం చందం | జం జంతువు | టం టంకం | డం డండు | తం తంతి | దం దండం | నం నందం

అః (ః) విసర్గ

కః | గః | చః | జః | టః | డః | త

ప బ మ య ర ల వ శ స హ
కింద ప, బ, మ, య, ర, ల, వ, శ, స, హ అక్షరాలకు
దీర్ఘం నుంచి విసర్గ వరకు కలిపిన గుణింతాల పట్టిక

ఆ (ా) గుణింతం

పా పాప | బా బాబు | మా మామ | యా యాత్ర | రా రాజు | లా లాభం | వా వాన | శా శాంతి | సా సారం | హా హారం

ఇ (ి) గుణింతం

పి పిట్ట | బి బిలం | మి మిఠాయి | యి యిక | రి రిక్షా | లి లిపి | వి విగ్రహం | శి శిల | సి సింహం | హి హిమం

ఈ (ీ) గుణింతం

పీ పీట | బీ బీడు | మీ మీటరు | యీ యీశు | రీ రీతి | లీ లీలా | వీ వీణ | శీ శీలా | సీ సీత | హీ హీనం

ఉ (ు) గుణింతం

పు పులి | బు బుడగ | ము ముక్కు | యు యువకుడు | రు రూపం | లు లుంగి | వు వుట | శు శుభం | సు సుమం | హు హుందా

ఊ (ూ) గుణింతం

పూ పూలు | బూ బూడిద | మూ మూట | యూ యూనిట్ | రూ రూమ్ | లూ లూటీ | వూ వూల్ | శూ శూన్యం | సూ సూర్యుడు | హూ హూంకారం

ఎ (ె) గుణింతం

పె పెనం | బె బెట్టు | మె మెట్టు | యె యెదురు | రె రెక్క | లె లెక్క | వె వెండి | శె శెట్టి | సె సెలవు | హె హెచ్చరిక

ఏ (ే) గుణింతం

పే పేరు | బే బేలు | మే మేలు | యే యేడు | రే రేఖ | లే లేఖ | వే వేణు | శే శేఖర్ | సే సేవ | హే హేళన

ఐ (ై) గుణింతం

పై పైకం | బై బైట | మై మైదానం | యై యైక్యం | రై రైతు | లై లైటు | వై వైద్యం | శై శైలి | సై సైకిల్ | హై హైందవం

ఒ (ొ) గుణింతం

పొ పొలం | బొ బొమ్మ | మొ మొక్క | యొ యొగ | రొ రొట్టె | లొ లోకం | వొ వొల్లు | శొ శొభ | సొ సొంపు | హొ హొయలు

ఓ (ో) గుణింతం

పో పోతు | బో బోను | మో మోము | యో యోగం | రో రోగం | లో లోటు | వో వోటు | శో శోభ | సో సోమ | హో హోమం

ఔ (ౌ) గుణింతం

పౌ పౌర్ణమి | బౌ బౌద్ధం | మౌ మౌనం | యౌ యౌవనం | రౌ రౌద్రం | లౌ లౌక్యం | వౌ వౌవ్వ | శౌ శౌర్యం | సౌ సౌఖ్యం | హౌ హౌదా

అం (ం) అనుస్వారం

పం పంకం | బం బండి | మం మంట | యం యంత్రం | రం రంగు | లం లంక | వం వంశం | శం శంఖం |సం సంచీ | హం హంస

అః (ః) విసర్గ

పః | బః | మః | యః | రః | లః | వః | శః | సః | హః





2, డిసెంబర్ 2024, సోమవారం

బతుకుల్ని కాగడా చేసిన కొమ్ము కథలు

బతుకుల్ని కాగడ చేసిన ‘కొమ్ము’ కథలు. నీవు తెలంగాణ ఈ పేపర్ లింకు

బతుకుల్ని కాగడా చేసిన కొమ్ము కథలు 

చూపులకు అందని కడగండ్ల బతుకుల్ని కండ్లను కాగడా చేసి మనసుకు చూపిస్తూ, మానవీయ పరిమళలాలు వెదజల్లుతూ మహోన్నతంగా ఆవిష్కరించేది దళిత కథ. అక్కడక్కడ ప్రచురించబడిన కథల్ని సాహిత్య నుదుటిపై భాసికముగా అలంకరించి భవిష్యత్తుకి అందించాలనీ జంబూ సాహితీచే దళిత కథా వార్షిక 2020లో ప్రారంభించబడిరది. ఆ పరంపరలో ఈ సంకలనం ‘కొమ్ము’ నాలుగవది.

 కొమ్ము శబ్ధం ద్వారా వేడుక (పెళ్ల్లి, పండుగ,...) ప్రారంభం అయ్యిందనీ తెలిపే ఒక వాయిద్యం. ఇది డప్పు చప్పుల్ల మధ్య అనివార్యంగా ఉంటుంది. యుద్ధ సన్నద్ధతను తెలిపే బూర ధ్వని కొమ్ము ద్వారానే హెచ్చరిస్తారు. కొమ్మును పలికించేవారు కొమ్ములవారు. కొమ్ములవారు లేనిచోట మాదిగలే దీనిని పలికిస్తారు. కొమ్ము ఇంటి పేరు గలవారు ఉన్నారు. 

ఊపిరితిత్తులు కొలిమి తిత్తులుగా మారితేనే కొమ్ము బలంగా పలుకుతుంది. కొమ్ము సమూహిక జీవనంలో భాగమైంది. ‘సింగినాదం జీలకర్ర’ అనే జాతీయం దీనివలన్నే పుట్టింది. సింగినాదమంటే శృంగనాదం. శృంగం అంటే కొమ్ము. కొమ్ము నాదం వినపడగానే జీలకర్ర ఓడరేవుకు వచ్చిందనీ ఆనాటి ప్రజలకు తెలిసేదన్నమాట. మిగ్గు కొమ్ము వృత్తి సంబంధమైంది. పసుపు కొమ్ము, అల్లం కొమ్ము మొదలైనవి ఆచార వ్యవహారాలలో భాగమైనవి. లుప్తమవుతున్న విలువల్ని పెంపొందించాలనీ దళిత అస్తిత్వం కలిగిన ఈ పేరు ఈ సంకలనానికి నిర్ణయించనైనది. 

ఈ సంకలనంలో కాలం వడపోసిన కన్నీళ్ల బతుకులు, విధ్వంసాలు, ఆత్మగౌరవమూ, ఆత్మ విమర్శ, ఆధునిక కుల వివక్ష పార్శ్వాలు, ముసుగులు చించేయడమూ, దళితేతరులకు మద్దతుగా నిలవడం వల్ల ఇవి దళిత కథా విస్తృతిని చూపుతున్నాయి. 

ఇందులో లబ్ధప్రతిష్టులైన సతీష్‌ చందర్‌, జూపాక సుభద్ర మొదలగు కథకుల నుంచి ఇప్పుడిప్పుడే రాస్తున్న కథకుల కథలున్నాయి. పుట్ట పెంచల్దాస్‌, దుర్గాని రాజు కథలు ఆశావాదాన్ని కలుగజేస్తున్నాయి. వాటిలోని కొండంత కథలను తడిమి చూద్దాం. 

అందమైన రోజిలిన్‌లు నిత్యజీవితంలో జీవితాన్ని కోల్పోయి తారసపడి మా ఈ దుస్థితికి మీరు కారణం కాదా అని ప్రశ్నిస్తున్నపుడు మనలోనే మనం మదన పడుతుంటాం. తల్లి మనసెరిగిన డెలీలా ఆమె ఆకాంక్షను నెరవేర్చినందుకు పూల తీగలా ఉంటే ఎవరైనా నలిపేస్తారు ముల్లులా ఎలా జీవించాలో బోధించే సతీష్‌ చందర్‌ కథ ‘ముల్లు’ ప్రతి ఒక్కరికీ నిజంగా ప్రబోధమే... 

వద్దని వారించిన వచ్చే చుట్టంలాంటి నెల స్త్రీలను ఆచారాలు వ్యవహారాల మాటున కట్టుబాట్లు ఎలా హింసిస్తాయో తెలుపుతూ ప్రత్యామ్నాయ పరిష్కారం దిశగా ఆలోచింపజేసే జూపాక సుభద్ర కథ ‘అంటు- ముట్టు’ మహిళాలోకానికి ప్రత్యామ్యాయ దిశా నిర్ధేశనమే... 

ఆదర్శాలను వల్లిస్తూ ఆచరణలో చూపించని ప్రతి ఒక్కరూ పిసినార్లే. మహా పిసినారిగా ముద్రపడ్డ బుచ్చయ్యలు మనకు చాలా మంది కనిపించవచ్చు. అయినవాళ్ల శవాల మీదపడి నగలు దోచుకునే వాళ్ళ వ్యక్తిత్వం బట్టబయలు, మరోవైపు తన భార్యమీదున్న నగలు తీయొద్దని చెప్పడం అత్యుత్తమ వ్యక్తిత్వానికి మహోన్నత రూపుకట్టిన డా. పసునూరి రవీందర్‌ కథ ‘బుచ్చయ్య బతుకు మర్మం’ మనుషుల డొల్లతనాన్ని ఎండగడుతుంది.

వలస పోవడం అంటే కనబడని శత్రువైన పేదరికాన్ని జయించడంలో భాగమే. వలస కార్మికుల చావులు కుక్కల కంటే హీనం. ఎంత వద్దనుకున్నా వలస పోతున్న కొడుకును చూసిన తండ్రి కలిగిన అనుభూతినీ ఆర్ద్రంగా చిత్రించిన ఇండ్ల చంద్రశేఖర్‌ కథ ‘బేల్దారి’ మనసును పిండే ఆర్థ్రతతో సాగుగుతుంటది. 

బలహీనులపై బలవంతుల ఆరాచాకలు, దౌర్జన్యాలు, బాధితుల కన్నీళ్ళు చూడలేక ఆక్రందనలు వినలేక మౌనంగా ఉన్న చెట్టు కాలంబు రాగానే కాటేసి తీరాలన్న ఉపదేశమిస్తూ బలహీనుల బలమై నిలిచిన చెట్టు ప్రతీకారం ఎలా తీర్చుకుందో తెలిపే మన్నె ఏలియా కథ ‘‘సాక్షి’’ ధిక్కార తత్వాన్ని నేర్పుతుంటది 

కొన్ని అలవాట్లు మనసు మీద ఎంతటి తీవ్రతరం చూపుతాయో అవే ప్రాణానికి ఆధార భూతమై ఉంటాయో, సలహాల మీద బోధించే సైన్‌ బోర్డుల మీద తిరుగుబాటు ప్రకటించిన ఎండపల్లి భారతి కథ ‘పానాదరువు’ తినే జర్దా మా ప్రాణానికి ఆధారమంటుందో కథ చదివితే అర్థమవుతుంది.

కథ చదివాక వాక్యం వెంటాడకపోతే అడగండి. హిజ్రాలు అనగానే ఒక రకమైన అసహ్యం, జుగుప్సాకరమైన అవహేళన కలిగి, పైకి పరిమళంగా కనిపించే దుర్గంధ సమాజంలో మనం ఉన్నామా అని మనల్ని ప్రశ్నిస్తూ బుద్ధి చెప్పి, గుణానికి తెచ్చే మానవత్వాన్ని మహోన్నత పతాకగా నిలిపిన సోలోమోన్‌ విజయ్‌ కుమార్‌ కథ ‘సిలుమంతూరి గేటు దగ్గర కొజ్జా’ హ్యూమనిజానికి ఒక నమ్మకమైన చిరునామా గా ఎలా మారిందో చదవాల్సిందే.

నిస్వార్ధంగా జీవితాలను అర్పించిన తల్లిదండ్రులని పట్టించుకోలేని పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా వదిలిపెట్టడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో జీవితమంతా ఒంటరిగా జీవించిన రామలచ్చుం పై విశ్వాసం గల బ్రౌని కుక్క మరణంలోను ఒంటరిగా విడిచిపెట్టలేదనీ, చదువుతుంటే ఎద బరువెక్కించే రత్నాకర్‌ పెనుమాక కథ ‘కాండ్రేగుల రావలచ్చుం కొట్టు’ ఆత్మీయత పంచే మనిషి ఎప్పుడూ ఒంటరికాదనీ జీవితానంతరం కూడా సమూహమనీ రుజువు చేస్తుంది.. 

కుట్రలు పసిగడితే కదా ప్రమాదం తప్పి ప్రమోదం మిగిలేది. కాలాలు మారినా మనుషులు మారకపోవడమే పెను ప్రమాదమని వివక్ష విపరీతమై విజృంభిస్తుంది. ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోల్పోయిన జీవితాలను చక్కదిద్దిన సవాలే కె.పి లక్ష్మీనరసింహ కథ ‘యువనాయకత్వం’ నేటి తరానికి కర్తవ్య దీక్ష.

జీవితాలు అంకితం చేసిన ఉపాధ్యాయులు అనేక జీవితాలను నిలబెట్టారు. సరిగ్గా అలాంటి కథ కల్లోలమైన పాఠశాలలోనూ జీవితంలోనూ డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థిని లలిత గురించి తెలుసుకున్న సీత టీచర్‌ నిండు గర్భిణీగా నిర్గాంత పోయినా జీవితాన్ని నిలుపాలనీ దీక్షబూనుతది. తన బిడ్డకు జన్మనివ్వాలనే సమయం మరోవైపు కనబడని బిడ్డలాంటి లలిత కోసం లేబర్‌ రూములో ఆయాసపడుతున్న వేదనే డిజి హైమావతి రాసిన కథ ‘మూసిన తలుపులు’ పాఠకుడే ప్రసవ వేదన పడేంతగా మలచిన తీరు మానవ హోమమే.

తనవాళ్ల కోసం జీవితం ధారపోసింది గీత. చెల్లెలు పిల్లల్ని అనాధలు చేసి వెళ్లిపోయినప్పుడు ముప్పైఐదేళ్లు నిండిన గీత తన తల్లి మాట విని, తాను పెళ్లి చేసుకోవద్దని గీసుకున్న గీతదాటి ఆలోచిస్తూ, వాసుతో పిల్లల కోసం కొత్త జీవితాన్ని ప్రారంబించాలనుకోవడమే డా. మండల స్వామి కథ ‘బతుకు గీత’ భవిష్యత్తుకు పునాది.

వేద కాలం నుంచి నేటి వరకు కులం మారితే శిక్ష మారుతుంది. అగ్రవర్ణాలకు అన్నిచోట్ల మినహాయింపులు. చేయని తప్పులకు శిక్షలు, నిమ్న వర్గాలకు జరుగాల్సిన న్యాయంలో కూడా అన్యాయమే అని సరిగ్గా నిరూపణ చేసిన కెంగార మోహన్‌ కథ ‘నీ కృప నాకు చాలు’ కుల వివక్షల తారతమ్యాలను ప్రతిబింబించింది. 

ఆత్మవిశ్వాసం నింపితే ఏద్కెనా సాధించగలరనీ, కష్టాన్ని నమ్ముకుని కాలంతో కనబడితే జీవితం మెరుగు అవుతుంది అని తెలియజేసే సమ్మోహిత నినాదం సిస్టర్‌ అనసూయ కథ ‘విక్టరీ ఇస్‌ యువర్స్‌.’ గెలుపు సత్తా నీవనీ తెలుపుతుంది.

ఆత్మవిశ్వాసం నింపాలి కానీ ఎవరైనా ఏద్కెనా అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయగలరనీ దేశ గురువు చెప్పిన బోధను ఆచరించి అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిన సామాన్యుడే అసమాన్యుడ్కె గీసిన జీవితాన్ని డా. గాదె వెంకటేష్‌ కథ ‘దేశ గురువు’ బోధించిన తీరు సమయోచితంగా ఉంది.

 కుల పంకిలము ఎక్కడికెళ్లినా వెంటాడుతది. వేటాడుతది. ఆ పంకిలము ఇతర మతాల మధ్య దూరి స్వచ్ఛమైన ప్రేమను కాలరాస్తది. మాదిగ రాజయ్యను పెళ్లి చేసుకుంటా అన్నందుకు పరువు హత్యగావింపబడిన జరీనా లాంటి బలహీనులను సజీవంగా కాల్చివేస్తదని మన కళ్ళకు చితిమంటను, ముక్కుపుటాలకు కమురువాసనను చూపే రాజు దుర్గాని కథ ‘మాదిగ రాజయ్య’ మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమభావుటా రెపరెపలాడాలనీ కోరుకుంటదో కథ వివరిస్తది.

ఒక ప్రత్యేకమైన జీవితం ఉపకులాలది. చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని వివిధ రూపాల్లో వివరిస్తారు.అలాంటి జీవితాన్ని ఈ మధ్య కాలంలో గంధం విజయలక్ష్మి, గడ్డం మోహాన్‌ రావు లాంటి వారు రాసింది అతికొంచెమే. ఇంకా రాయల్సిన కలలు, జీవితమూ మిగిలే ఉంది. ఆ లోటును పూడ్చుతూ సినీగేయ రచయిత పుట్ట పెంచల్దాస్‌ రాసిన ‘యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా’ కథ మాలదాసరి జీవితాన్ని ఆవిష్కరించింది. రాయలసీమ కుల మాండలికంలో అద్భుతంగా సాగింది.

విద్యార్థులకు ఏదైనా అపాయం జరిగితే ఓర్చుకోలేని సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ లోకం ఉన్న ఈ సమాజంలో అనుకోకుండా చనిపోయిన విద్యార్థి గురించి విలపిస్తున్న ఉపాధ్యాయుడి అంతరంగ ఆవిష్కరణ తప్పెట ఓదయ్య కథ ‘పుట్టెడు ఎత’. చదువుతున్నంత సేపు ఒక దుఃఖపు తెరను మనల్ని ఆవహిస్తుంది. ఆవరిస్తుంది. అతలాకుతలం చేస్తుంది. మారని పరిస్థితి గురించి మనసు మారాం చేసేలా రాయడం కథకుడి ప్రత్యేకత.

ఎగువ గేరి ఆడ కుక్క దిగువ గేరి మగ కుక్కతో సాంగత్యం అత్యంత సహజమైంది. జంతువులలో ఆమోదయోగ్యమైనది కూడా. ఆ రెండు కుక్కలు మాట్లాడుకుంటూ ఛి.. ఛి.... వాళ్లు మనుషులు. వాళ్లకంటే హీనులు మరొకరు లేరని మాట్లాడుకుంటున్న తీరు మానవులకి బుద్ధి చెబుతున్నట్లుంది. కుక్కల జీవన విధానానికి పరాకాష్టగా చిత్రించిన వైనం, గేరిలో చారిత్రక రాజకీయ పరిణామ క్రమాలను కుక్కలు చర్చిండం నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్న విధంగా అక్షరీకరించిన గుడిపల్లి నిరంజన్‌ ‘రచ్చకట్ట’అంబేడ్కర్‌ కలలు కన్న రేపటి రాజ్యాధికారానికి ఆలంబన నిలిచింది.

అనుబంధాలు అల్లుకున్న ఊరు ముంపు గ్రామమై మునిగిపోతున్నందుకు, ప్యాకేజీలు రాకపోవడం వల్ల చితి పేర్చుకొని చనిపోయిన స్థలాన్ని దర్శించి, అక్కడి ప్రజల దు:ఖంతో మమేకమవ్వడం మానవత్వం కలిగిన ఉపాధ్యాయ బృందం అక్కడి మట్టితో విలపించిన విషాదగీతం డా. సిద్దెంకి యాదగిరి కథ ‘నిలువెత్తు దుఃఖం’ బాధితుల ఓదార్పుకు స్వాంత్వన, సహచింతన, తదాత్మయం మానవత్వానికి నిదర్శనం. 


ప్రతీకలు, ఉపమానాలు, సౌందర్యాత్మక వాక్యాలు మచ్చుకు కొన్ని. 
‘తెగులొచ్చిన చేలో మొలకల్లా వున్నాయి మూతి మీద వెంట్రుకలు! ఇలాగే ముల్లులా బతకవే.. నా బంగారమా?’, ‘అంటరాని తనం ఆకాశాన్ని మించిన దుక్కం’, ‘ఏడుపు రాకున్నా ఏడుస్తున్నట్టు నటిస్తున్నోళ్లే ఎక్కువున్నరు’, ‘బంగారు భవిష్యత్తుని పెట్టెలో పెట్టి సమాధులతోటకి మోసుకెళ్తున్న నలుగురు మనుషుల్లా కనిపించాయి ఆ బస్సు చక్రాలు డెవిడ్కి’, ‘శవాన్ని చూడడానికి వెళ్లుతున్న వాళ్లకి జాతరకువెళ్తున్నట్టే వుంది.’, ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ’, ‘గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది’, ‘చివరికి చావులో మాత్రం ఒంటిరిది కాలేదు’, ‘శూన్యంలో శబ్దం ప్రవహించనట్లు ఏదో నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవహించింది’, ‘భవిష్యత్తును చూస్తూ మంచు పర్వతంలా కరిగిపోయింది గీత’, ‘ఏడ్పుతో చెరువు కట్ట దద్దరిల్లుతుంది’, ‘ఛీ, ఛీ మనుషులు. వాళ్ల గురించి చెప్పుకోవడం సిగ్గుచేటు’, ‘చూపు ఆనని గాజు కళ్ళ ముసలామె బాధ’. ‘ఆమెను ఓదార్చుతుంటే మనసు మహా సముద్రం అయ్యింది’ లాంటి మొదల్కెన వాక్యాలు ఆయా కథలకు బలం చేకూర్చాయి. 
 ప్రాణమున్న మనిషిని కాదనీ ప్రాణములేని రాయిరప్పని కొలిచే భక్తి తత్వం నేడు దేశంలో పొర్లి పారి మనుషుల పై దాడికి తెగబడుతున్న పరిస్థితులు మారి మనుషులుగా గుర్తించాలనీ, విలువనివ్వాలనీ, మనుషుల ఆచార, ఆహార, వ్యవహార సంప్రదాయపు అలవాట్లకు భరోసా ఇవ్వాలనీ, మనుషులందరూ ఏకవర్ణమే అనీ సాటి మనిషిని మనిషిగా గౌరవించాలనీ ఊదుతున్న శబ్దమే ఈ కొమ్ము. ఇంతకు ముందులా ఈ దళిత కథా వార్షికను సాదరంగా ఆహ్వానిస్తారనీ ఆశిస్తున్నాం.


         మీ 
                సంపాదకులు, 
జంబూ సాహితీ,
     డా॥ సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య.

22, నవంబర్ 2024, శుక్రవారం

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు.

వారిపై నేను రాసిన వ్యాసం వీలు చూసుకుని చదువుతారనీ.....

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి 
నేడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 

భాస్కర్!
నీ మథర్ లాంగ్వేజ్ సౌండ్ 
డప్పు దరువే నీ బ్రాండ్ 
సూర్యుణ్ణి జబ్బ కేసుకొని 
భూదేవర వేదిక మీద 
మొగులు శ్యాందిరికింద 
తాత జాంబవంతుని మనువడివై 
చిందులు తొక్కి నింగినంటిన నీ ఆట
చిర్రా చిటికిన పుల్లల ధ్వని మాంత్రికుడా
నవరసాలు పలికించిన నైపుణ్యవంతుడా 
జాతికి కీర్తి తెచ్చిన  ఘనుడా  
డిల్లీ పీఠాలు గెలిచిన ధ్వనుడా!
జజ్జనకల జనలతో నీకు నీలి సలాం

పండుగకు పబ్బానికి పెళ్లికి సావుకు ప్రతి కార్యంలో ముందు నడిచేది డప్పు. తను మేల్కొని ప్రజలను మేల్కొల్పేది చాటింపు లేదా దండోరా. దండోరా వేసేది డప్పే. డప్పును తప్పెట అని కూడా పిలుస్తారు. అన్ని సంగీత వాయిద్యాలు కంటే ముందు పుట్టిన డప్పు ప్రపంచీకరణ ముప్పులో డప్పు వెనుకబడిన మాట నిజమే అయినా డప్పు డప్పే.
 అధునాతనమైన సంగీత పరికరాలు ఎన్ని వచ్చినా డప్పు ముందు దిగదుడుపుగానే ఉన్నాయి. మరుగున పడుతున్న కాలంలో డప్పుకు పోయిన పరువును నిలబెడుతున్న కళాకారుడు అందే భాస్కర్. 

 ఆకాశంలో వేలాడే సూర్యుణ్ణి డప్పు కుదురుగా తన భుజానికి వేసుకొని ఆకాశంలో ఒక అడుగు, భూమి మీద మరో అడుగు అన్నట్లు జాంబవంతునిలా చిందేస్తున్న కళాకారుడు అందె భాస్కర్. అందె భాస్కర్ డప్పు మీద జతులు వాయిస్తుంటే పండిత పామర జనరంజకంగా ఉంటుంది. సంగీత సామ్రాట్టులకి కూడా సంబ్రమాశ్చర్యాలు కలిగించే నైపుణ్యం వారి సొంతం. అతని కళా ప్రదర్శన తీరుతెన్నులను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. వారు పలికించే దరువులు, జతుల తీరు ఆబాల గోపాలానికి ఆనందాన్ని పంచుతాయి. మానసిక ఉల్లాసమే కాదు, ఆ శబ్దానికి ముసలోడైనా పడుచుదనంతో ఎగిరి గంతులు వేస్తుంటారు. అందె భాస్కర్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, దేశ విదేశాలలో అంతర్జాతీయ వేదికలపైన శబ్దాన్ని శూన్యంలో కూడా కాంతి వేగంలా పయనింపజేసిన  ప్రతిభ భాస్కర్ పుట్టు విద్య. మలేషియాలోని తెలుగు సంఘం వారి దీపావళి వేడుకలలో వీరి ప్రదర్శనను ఆ దేశ ప్రధాని వీక్షించారు. 

అందె భాస్కర్ మారుమూల పల్లెటూరైన అందె గ్రామం మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లాలో దుర్భర దారిద్యంలో కొట్టుమిట్టాడుతున్న శాంతమ్మ బాలయ్య దంపతులకు  జన్మించాడు. అందే గ్రామం కూడవెళ్లి వాగు పరివాహక ప్రాంతం. భాస్కర్ పుట్టే నాటికి ఆ ప్రాంతమంతా సిరులొలికే పాడిపంటలకు నెలవైనది. గలగల పారే వాగొడ్డున అనుభవించిన ఆకలి జీవితమమూ, అవమానాల బ్రతుకూ ఉంది. ఆ ప్రాంతం చైతన్యవంతమైంది. ధిక్కారానికి చిరునామా. త్యాగాలకు, తెగింపులకు వీలునామా అని చెప్పుకోదగ్గ ప్రాంతంలో కుల వివక్ష కుటీల్లం మాత్రం పోలేదు. అవమానాలలోంచి సన్మానాన్ని స్వప్నించిన భాస్కర్ చిత్తశుద్ధిని కొనియాడవలసిందే.
భాస్కర్ బాల్యంలో తన తండ్రి బాలయ్య కొడుతున్న డప్పు దరువులు చూసి అనుకరించాడు. ఆచరించాడు. నేర్చుకున్నాడు. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని తన కళ గురించి గొప్పగా చెప్తాడు. ఆటను శబ్దాన్ని జతులను విశ్వవ్యాప్తం చేయాలని కలలుగన్న సంకల్పవంతుడు. అంకుఠిత దీక్ష కలిగిన సంపద్వంతుడు.   పలుకోణాలలో పరిశోధించి అనేక కొత్తకోణాలను ఆవిష్కరిస్తున్న డప్పు కళాకారుడు. 
 తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద విభాగంలో "తెలంగాణ జానపద కళారూపాలు - సంగీత వాయిద్యాల ప్రాధాన్యత" అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాడు. అభిరుచి కలిగిన రంగంలో ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో వీరి ప్రతిభను గుర్తించిన CCRT (Centre for Cultural Resources and Training) స్కాలర్ షిప్ అందజేస్తున్నది.
నిరంతరం నేర్చుకుంటూ అనేకమందికి డప్పు వాయించే విద్యను బోధిస్తూ దశ దిశలా వ్యాపింపజేస్తున్న కృషికి నిలువెత్తు రూపం అందె భాస్కర్. డప్పును మోగించేది పురుషులు మాత్రమే. డప్పుల తయారి విధానములో స్త్రీల పాత్ర అమోఘం. వారూ వాయించాలని పట్టుబట్టాడు. భాస్కర్ పట్టుదల ఆ పరిస్థితిని తిరగరాసింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ గారి ప్రోద్బలంతో పదిహేను వందల మంది ఆడబిడ్డలకు డప్పు దరువులను నేర్పించిన దీక్షా దక్షిత వారిది. గత సంవత్సరం నారీ శక్తి పేరుతో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ మట్టికళా రూపం 20 మంది ఆడబిడ్డల చేత ఢిల్లీలో ఆదిమ ధ్వని వినిపించాడు.  
ఆగస్టు 2022లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళల ప్రదర్శనలలో భాగంగా భాస్కర్ కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కందుల దుర్గేష్ "జానపద సామ్రాట్" అనే బిరుదును ఇచ్చి సన్మానం గావించారు.

సంగీత వాయిద్యాలలో సంగీత కళాను నైపుణ్యాలలో విశేష ప్రతిభ కనబరిచే కళాకారులకు ఏటా ఇచ్చే బహుమతులలో భాగంగా సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2022- 23 సంవత్సరానికి భాస్కర్ ని ఎంపిక చేసింది. ఈ అవార్డు ప్రారంభమై 74 సంవత్సరాలు  గడుస్తున్నా ఇప్పటివరకు షెడ్యూల్ కాస్ట్ కు  వరించలేని స్థితిలో భాస్కర్ ని వరించడం అంటే తెలంగాణ కీర్తిగా జాతి సంపదగా పరిగణించాలి. ఈ పురస్కారం కింద 25 వేల రూపాయల నగదు శాలువాతో సత్కారం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు సాధించిన ఒక విజయం గా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులు అందజేశారు.  ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం ఈనెల నవంబర్ 22 రోజున ఢిల్లీలో జరిగే ఒక వేడుకలో  బహుకరించనున్నారు.

తన విశేషమైన డప్పు కళా నైపుణ్యంతో ఎంతో కీర్తి పొందుతున్న అందే భాస్కర్ డప్పు కళకు పెట్టని కిరీటమై వెలుగొందుతాడని భరోసా కల్పిస్తున్నాడు. అందె భాస్కర్ జాతి శిఖలో జానపద సామ్రాట్. ఆ పురస్కారం స్వీకరించబోతున్న వేళ డప్పు భాస్కర్ కి హృదయ పూర్వక అభినందనలు.

-డా. సిద్దెంకి యాదగిరి
జంబూ సాహితీ

డప్పు కళా సామ్రాట్ అందె భాస్కర్ ఈ పేపర్ విజయక్రాంతి లింకు 

22-11-2024.

27, అక్టోబర్ 2024, ఆదివారం

కాలంపై కలం మోగిస్తున్న నిప్పుల తప్పెట


కాలంపై కలం మోగిస్తున్న నిప్పుల తప్పెట
 ‘‘ప్రత్యామ్నాయ మేథోమథనం మానవ అస్తిత్వాన్ని చాటే అంతిమ లక్ష్యమై ఉండాలి.’’ డా॥ బి. ఆర్‌. అంబేడ్కర్‌.

 నిందల్ని ఎదుర్కొని నిచ్చెనమెట్ల వ్యవస్థలో జ్ఞానాన్ని సాయుధంగా మలుచుకున్న అంబేడ్కర్‌ తొవ్వ దూగుతున్న జ్ఞానం ఈ దేశానికి వెలుగుల్ని పంచింది. ఆజ్ఞానం ఇప్పుడు ఆకాశంలో వేలాడుతున్న పొద్దును మున్నూటరవై డిగ్రీల దప్పు కుదురును చేసి మోగిస్తుంది. కుతకుత ఉడుకుతున్న బతుకుల్ని కవిత్వంగా సమానత్వం కోసం మా‘నవ’ అస్తిత్వాన్ని చాటింపు చేస్తున్న నిప్పుల తప్పెట మోగిసుస్తున్న వెలివాడ లంద స్వప్నం దళిత కవిత్వం. దళిత కవిత్వం రాస్తున్న ప్రముఖ దళిత కవి సంపాదకులు తప్పట ఉదయ ఆవిష్కరిస్తున్న పుస్తకమే 'అలకల పోత'. 

 పేదరికం బహుమానంగా ఇచ్చిన అయ్యవ్వను ఈసిడించలేదు. కడుపుల ఆత్మతో కళ్లకు అద్దుకున్నడు. కన్నీళ్లకు కారణమైన సమస్యలపై జిద్దుకు నిలవడ్డడు. అవ్వ సేను సేనుకు చల్లిన సెమట జల్లుల్ని తూట్లుపడ్డ బస్సు టిక్కెట్లని బాగా గుర్తించుకున్నడు. పనిల దిట్ట, మాయితనంల మునిగి మంచికి మారు పేరు తెచ్చుకొని మధ్యలోనే ఆగం చేసి వెళ్ళిన అయ్యని తలుసుకుంటుండు. మూలాల్ని స్మరిస్తూ పిడికెడు కలలని దోసెడు కన్నీళ్లతో ఎండమావుల్లాంటి స్వప్నం వెంట పరుగెత్తుతున్న జీవితం తప్పెట ఓదన్నది.
ఉదరపోషణకు ఎన్నో ఉద్యోగాలున్నా బాధ్యతాయుత పౌరుల్ని తీర్చే బడిపంతులు అయిండు. ఇపుడు పాఠంతో పాటు బతుకుపాఠంను బోధిస్తున్న అక్షర ప్రేమికుడు.

 పలుక బలుపం పట్టి బడికి పోతున్నపుడు కుల వివక్ష బూతమై తరిమిన కాలం కాల్చిన వాతలున్నాయి. ఆదరణ అందించిన ఉన్నత కులాల సాన్నిహిత్యమూ ఉంది. కంట్లె ఒత్తులు పెట్టుకొని గురి కోసం గిరిగీసుకొని రాత్రీపగలు రాజీలేని పోరుతో సదువుతున్నపుడు అడుగడుగున సమాజాన్ని అర్థం చేసుకున్నడు. అవమానాలు లేని సమాజాన్ని కలగన్నడు. 

 అంతరాలని అంతం చేయడానికి సమసమాజ నిర్మాణానికి అక్షరాలను ఆయుధంగా ఎంచుకున్నడు. అనుభవాలను, అనుభూతులను, కన్నీళ్ల కలల గెలలతో సాహిత్య వాకిట్లో అలుకుపోసి ముగ్గేసినట్లు అస్తిత్వ గుర్తులతో ‘మొగ్గ పూసలు’ మొదటి పుస్తకంతో ముందుకొచ్చిండు. ఆ పరంపరలో మళ్లీ ``అలకలపోత`` కవిత్వంతో ఓదన్న వస్తున్నాడు.

  వస్తు నవ్యత, పదచిత్రాలు, భావ చిత్రాలు మొదలైన అన్నింటి మేళివించి ఎంచుకున్న కవితా వస్తువులో ప్రత్యేకతను చాటుకుంటున్న కవిగొంతుక ఓదన్నది. అన్ని వాదాలతోపాటు దళితవాదాన్ని తనదైన శైలిలో ప్రదర్శిస్తున్న తీరు పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. నిరసన నిప్కల్ని రగిలిస్తున్నాడు. నిరాధారమైన పనితట్టని అట్టహాసమైన ప్రగతిగా మార్చుకుంటున్నాడు. 

 ‘గోళమే లందగోలెం’ కవితలో
 ‘‘తోలు పర్రనే కాన్వాస్‌గా 
 పని కత్తుల్ని కుంచెని చేసి బతుకు చిత్రం గీస్తున్న
 నిత్యం వన్నెతగ్గని వర్తమాన పటమే నేను’’అని తన అస్తిత్వంతో సమాజానికి పరిచయమవుతున్నాడు. తన పరిశీలనను, విషయాలను, వినూతనంగా వివరిస్తాడు. ఎక్కడా దళితవాదాన్ని బయటపెట్టడు. స్థూలంగా ఆలోచిస్తే గాని దళితాయనం అర్థంగాదు. విశ్వనరుడనని గుర్రం జాషువా గారు నుడివినట్లు ఓదన్న స్వీయ వ్యక్తీకరణ ‘అన్వేషణ’లో చూడండి.
 ‘‘ఆలోచన సుడుల్లో జ్వలిస్తున్నా 
 నిత్యం రగులుతునే వున్నా 
 నిర్మలత్వం కోసం వెదుకుతూ 
 విశ్వమంతట విస్తరిస్తున్నా’’ అని చెబుతుంటాడు. అవసరాన్ని బట్టి బడబాగ్నిలా జ్వలిస్తుంటాడు. నిత్యం రగులుతూ నిర్మలత్వం కోసం విశ్వమంతా విస్తృతమవుతున్నానని స్వీయ కార్యదీక్షతను ప్రకటిస్తాడు.

 దారి చూపిన వేగు చుక్కలకు ప్రణమిల్లుతూ ఈ దేశం సర్వం కర్మమయమనే దోపిడి మనువాదాన్ని ధిక్కరించి సమాజంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాల్ని ధారపోసిన మహాత్మ జ్యోతిరావు ఫూలేని స్మరిస్తూ..
 ‘‘అంతరాల దొంతరల కులగజ్జి
 కుటిలత్వాన్ని చీల్చి మనువాదులు కుట్రలపై
 ఫెడేల్మని చర్సిన చర్నా కోలతడు’’ అని కుట్ర పూరితంగా పుట్టింది మొదలు పుల్లలలో పడేవరకు శాసిస్తూనే వుంటారు. కాని ఫూలేని మొద్దు నిద్దురని మేల్కొల్పే చర్నా కోలతో పోల్చడం సబబుగా ఉన్నది.

 దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. దళితుల జీవితాలు దుర్భరమవుతున్నాయి. దళితుల్ని హీనంగా చూస్తున్న సంఘటనలు కవిని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మంథనిలో మధుకర్‌, నిజామాబాద్‌లో ఇశ్రాయేలు లాంటి కులహత్యల్ని వాటి పర్యవసనాల్ని తలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో నిప్పుల కుంపటిలా రాజుకుంటాడు. పరువు హత్యల్ని చూసి చలించి కన్నీరైతాడు. తేరుకుంటాడు. రాలిన మోదుగుపూలను ఏరి ధైర్యాన్ని అద్ది మన భుజానికి తగిలిస్తాడు. ‘మీ సొగసు మాకెందుకు’ అను కవితలో.. 
‘‘శవాల మధ్య మృత విద్యను అభయమిస్తూ
  తెగిపడిన శంబుక తలకు  
  మా శుక్రాచార్యుడు జీవి పోస్తండు
  తరతరాల పీడన నిర్మూలన కోసం
  కంచికచెర్ల కోటేశు కణకణ మండే నిప్పుల కాట్నంలోంచి
  ఎగసిపడుతున్న నిప్పురవ్వలై సందేశమిస్తుండు ’’ అనే అభివ్యక్తి ద్వారా నిజాన్ని కళ్ల ముందుంచుతాడు.

 ‘‘మీకు చేతనైతే నా మృతదేహాన్ని నాలుగు రోడ్ల కూడలిలో ఖననం చేయండి / ధిక్కార పతాకాన్నవుతా’’ అని రాసిన కలేకూరి ప్రసాద్‌ వాక్యరవ్వలు గుర్తుకొస్తయి. దళిత సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిన కంచికచెర్ల కోటేశుతో సహా పురాణ ప్రతీకలైన శుక్రాచార్యుని ఉపమానించడం వలన ప్రజాకవి శివసాగర్‌ చెప్పినట్లు ఇప్పుడు నడుస్తున్నది చండాల చరిత్ర స్ఫురించేలా దృశ్యీకరిస్తాడు.

 కుల మత లింగ ప్రాంత వివక్షలేని అంతర్జాతీయంగా మహా ఘనత వహించిన రాజ్యాంగం మనది. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అబలల్ని వేశ్యలతో పోల్చుతూ దూషిస్తుంటే కవి బాధతో మదనపడుతుంటాడు. ‘నిజప్రతి’ కవితలో..
 ‘‘జీవులన్నీ విభిన్న సమూహాల సమాహారమే
 ప్రకృతే ప్రథమ సోపాన పట్టిక
 జంబు ద్వీపమెప్పుడు బహుళజాతుల నిలయమే’’ అని జాంబవంతుడు పాలించినప్పటి నుంచి ఇప్పటి ఎన్నో భిన్న మతాలకు పుట్టినిల్లు. బహుళ జాతుల నిలయమని నినదిస్తాడు. అవాకులు చవాకులు పేల్చడం సరికాదని ప్రబోధిస్తాడు.
   Poetry is criticism of life -Matthew Arnold చెప్పినట్లు బతుకు మూలాన్ని విమర్శీకరించడమే కవిత్వం. తన జీవిత మూలాన్ని కట్టిన మూటని విప్పుతాడు.

 కుల వృత్తులు సాతలుగా విభజించబడి ఉండేవి. మాదిగలు చేసే పనిని మాయితనం, మ్యాతనం మొదలైన పేర్లతో పిలుస్తుంటారు. నార చీరడం, చెప్పులు ముడవడం, బాయికాడ పనిచేయడం. సాతలవల్ల ఎట్టికి దగ్గరైన బతుకులు సదువుకు దూరమయ్యాయి. సాతలమీద స్పష్టమైన అవగాహన కవికి ఉన్నది. ‘సాత’ కవితలో
 ‘‘సాత మట్టిని ముద్దాడి 
 అక్షరాలను దిద్దుకొని
 కర్మ సిద్ధాంతంను తిరగ రాస్తూ ఆకాశమే హద్దుగా గమ్యాన్ని నింగిని ముద్దాడుతుంది’’ అని కర్మ సిద్దాంతంతో కలెబడుతూ భవిష్యత్తు సారెపై లక్ష్యాన్ని ఆవిష్కరిస్తాడు. 

 దళిత వస్తువు వ్యక్తీకరణలో సౌందర్యాత్మకతను జొప్పిస్తాడు. దళిత ప్రతీకలైన నల్లని, చెమట సుక్కలు, దళిత ప్రేమాయణం, మొదలైన మాదిగ వాసనలు పచ్చి పచ్చిగా వీస్తుంటాయి. ‘నీలిమ’ కవిత లో...
 ‘‘ఓ... నా... నల్లని కలువపువ్వా
 మట్టిలో పుట్టి ఉప్పునీటిలో పెరిగిన
 చెమటచుక్కల గంధమా
 నీ ముందు కస్తూరి జిలుగులన్నీ దిగదుడుపే’’ అని చెప్పడంతో కళాత్మకతను ఆపాదించాడు. ఈ కవిత చదువుతుంటే ఎండ్లూరి సుధాకర్‌ గారి ‘చండాలిక’ కవితలోని ‘‘ఓ... నా చండాలిక నీ వెండి కడియాల కాళ్ల ముందు వేలయేల్ల ప్రబంధ కన్యలు వెలవెల బోయారు’’ అన్న పంక్తులు గుర్తుకు రాకమానవు. 

 అలమటించే ఆకలి పిడికెడు మెతుకుల్ని వెతుకుతుంటే ఉన్మాదం రాజకీయాన్ని తొవ్వుతుంది. సమానత్వం లేక సతమతమవుతున్న అలజడి జీవితాలు ఆధ్యాత్మిక జీవితం కోసం పరమతాల్ని ఆశ్రయిస్తాయి. ఎందెందు వెదకినా అందందు కులమే కలదన్నట్లు నిరూపణలు గావిస్తూ రాసిన కవిత ‘రాత’ వాస్తవానికి దర్పణంగా ఉన్నది. ‘‘కులం మారిన కరుణించదు ఈ గీత
 మతం మారిన మారదు కులం వాత
 కులం వాతకు లేదేం మార్గం?’’ అంటూ మతం మారిన కులఛాయాలు వెంటాడుతుంటాయి. ఇక్కడి తారతమ్య భేదాలు నీడలా తరుముతుంటాయని వాస్తవాల్ని చూపుతాడు. 

 సాధారాణ ఉపాధ్యాయులు బడికి తప్పరు. విద్యార్థికి అర్థం కాని కాకప్పు వారికనవసరం. పాఠం చెపుతూనే ఉంటరు. పిల్లలంటే కవిగారికి మహా ప్రీతి. పిల్లల నడుమ తాను, తన చుట్టూ పిల్లలు అన్నట్లుంటాడు. ఓదన్న సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయునిగా పాఠశాల బాధలే కాదు పిల్లల బాధల్ని చూసి చలించిపోతాడు. పాఠశాల కోవెలలో తండ్రిలేని విద్యాకుసుమం పాముకాటుతో నేలరాలింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక విలపిస్తాడు.  
 ‘‘రూపమంతా సక్కదనం గాకున్నా
 రూపు కట్టినట్టుగా... నా మదిలో వాడు
 వాని జ్ఞాపకాల బతుకే ఒక పెద్ద ప్రశ్నగా...’’ (మదినిండా వాడే పుట.8) తన పాఠశాలను కమ్మిన విషాదాన్ని అక్షరీకరిస్తాడు. 

 ఓదన్నది తల్లిమనసు. కోడి తనపిల్లల్ని రెక్కల కింద పొదువుకున్నట్లు పిల్లలపై ఆశలు పెంచుకుంటాడు. ఆశయాల ను ఆవిష్కరిస్తుంటాడు. పట్టుకుచ్చుల పువ్వును తడిమినట్లు మృదువుగా దువ్వుతుంటాడు. నేటి బాలలు రేపటి పౌరులు అని ప్రపంచ భవిష్యత్తు వారిదేనని భరోసాగా చెప్పతాడు.
 ‘వారసులు’ కవితలో...
  ‘‘పిల్లలు సమసమాజ ప్రగతికి సోపానాలు 
  విశ్వానికి వారసులు
  మన ఆశలకు ప్రతిరూపాలు’’ అని పిల్లలే ప్రగతికి సోపాలనాలని రేపటి ఆశల ప్రతిరూపాలుగా దర్శిస్తాడు.

 ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం తిరిగి రానిది. తరగని జ్ఞాపకాల గని. కానీ కొంత మందికి బాల్యంలేని జీవితాలను చూసి కరిగిపోతాడు. ‘‘నాకు బాల్యం లేదు’’ అన్న మ్యాక్జిమ్‌ గోర్కీ మాటలు స్ఫురిస్తాయి. ‘పగిలిన గాజు పెంకనే’ అనే కవితలో బాల్యం గురించి రాస్తూ...
 ‘‘బాల్యం చెరగిపోయిన తీయటి కళ
 పట్టుజారి పలిగిపోయిన అద్దం
 అతుకు పెట్టడానికి వీలులేని ముక్కల్ని ఏరినాకొద్దీ
 నిలువుత కోస్తూనే ఉంటది.’’ అంతర్థానమైన బతుకులు పట్టుజారి పగిలిన అద్దం ముక్కలుగా పోల్చడం ఉన్నతమైన అభివ్చక్తిగా ఉంది.

 ‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. నీ అభిప్రాయం చెప్పడానికి నా ప్రాణాన్నైన అడ్డుపెడతా’’ అని ఫ్రెంచ్‌ రచయిత ఓల్టేర్‌ చెప్పినట్లు ప్రజల కోసం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెపుడు మాట్లాడుత’అని నిక్కచ్చితంగా ప్రవచిస్తాడు. అన్యాయం జరుగుతున్నంత సేపు ఉదాసీనంగా ఉండనంటూ ...
 ‘‘మనమంతా ఒకటనే తేనే పలుకులు
 లోగుట్టు చెక్క భజనలు 
 లేళ్లను బుద్ధిజీవుల(లేల్ల)ను బలిచ్చే 
 పన్నాగాలైనపుడు? 
 నోరెత్తకుండ ఎలా ఉండగలను?’’
 కవి ఒక కంట కన్నీళ్లనీ, మరో కంట అగ్నిని వెదజల్లగలడు. ఎతను పారించినట్లే పీడకుల్ని ఎదురించే పదునును పదాలకి తేజుతనాన్ని అద్దుతాడు. అన్యాయం జరుగుతున్నపుడు వైరాగ్యంతో వుండే వ్యక్తిత్వం ఓదన్నది కాదు. లోపల ఒకటి బయట మరొకటి వ్యక్తీకరిస్తే తప్పనిసరిగా ధిక్కరిస్తానంటాడు. మాటలకు అగ్ని స్నానం చేయించి పుటం వేసినట్లు పరిశుద్ధంగా మాట్లాడాలని తలుస్తాడు.
 వాక్‌ శుద్ధి అంటే నమ్మకం. 
అచంచలమైన విశ్వాసం. మాటల పరిణామ క్రమాన్ని వివరిస్తాడు. ‘వాక్‌ శుద్ధి’ కవితలో...
 ‘‘ఇపుడు మాటలు 
 నలుదిక్కులు ప్రాకే రవి కిరణాలౌతాయి
 అంకురించే అస్తిత్వపు జాడలౌతాయి.’’ మాటల మహోన్నత తత్వం అక్షరాల ఎండుగ వోసి చెప్పుతడు. 
 కవి హృదయమంతా నిఖార్సయిన పల్లెతనమూ ఉంది. కవి పల్లె తనాన్ని మరువలేదు. పల్లెమీది మమకారాన్ని పల్లె అంత స్వచ్ఛంగా, సంస్కారయుక్తంగా విశదీకరిస్తాడు. పల్లె సుట్టూ ఉన్న జీవవైవిధ్యాన్ని నెమరేస్తాడు. మనల్ని బాల్యంలోకి తీసుకెళుతాడు. స్వభావోక్తంగా వివరిస్తాడు. ‘పల్లె దృశ్యం’ని ఆవిష్కరిస్తాడు.
 ‘‘గట్టు గట్టంతా పచ్చపచ్చని 
 పంట చేండ్ల నిగారింపు 
 తలెత్తుకొన్న మొక్కజొన్న తలసుంచులా 
 కొండలు నడుమ సూరీడు
 పల్లె నుదుటి సింధూరం’’ అని పల్లెతనాన్ని వివరిస్తాడు.
 కోల్పోతున్న పల్లెతనాన్ని కలవరిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మార్క్స్‌ మాటలతో ఉదహరిస్తాడు. మనసుల్ని చిత్రిస్తాడు. మనుషుల ప్రేమని వస్తువుల మీదికి మలుపుతున్న వ్యాపారంలో కొట్టుకపోతున్న మనిషితనాన్ని మానవత్వంతో వస్త్రగాలం పట్టి వడపోయాలని తలపోస్తాడు.

 ‘‘సరుకుల సంతలో 
 కరుగుతున్న మంచులా
 మమతాను బంధాలు 
 తెలంగాణ పల్లె గుండెల్లో పొడుస్తున్న పొడుస్తున్న‘‘ (బంధము పుట 25) కన్నీళ్లతోనే కత్తులు నూరాలని బహుళజాతి మోసాల్ని నాటకీయంగా ప్రదర్శిస్తాడు. అక్షర సైరికుడు కాబట్టి అక్షరాలతోనే కవాత్‌ చేస్తాడు. పల్లెను మింగుతున్న నయా దళారులపై అక్షర తూటాలు ఎక్కుపెడుతాడు. గుట్టను ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ కవిత్వానికి పోరు మంత్రం వేస్తాడు. అదృశ్య విధ్వంసాన్ని తేటగా దృశ్యీకరిస్తాడు. ‘కాగుతున్న నిప్పుల కుండ’ కవితలో..
 ‘‘బహుళజాతి బద్ధ శత్రువు
 జడలు విప్పి కారు మేఘంలో కమ్మేస్తూ
 గీడనే పుట్టి పెరిగిన మల్లెమొగ్గలను 
 పల్లె సీమలను ముసి ముసి నవ్వులతో 
 కసి కసిగా కాటేస్తుంది’’ అని కుట్రల్ని బట్టబయలు చేస్తాడు. ఇవ్వాళ్ల పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా సామ్రాజ్యవాద బూతం కనపడకుండా వ్యాపిస్తున్న కైత్కాలను పసికట్టిండు. పల్లెల్ని నాశనము చేస్తున్న విధానాలను కాగుతున్న నిప్పుల కుండయి మసులుతుంటాడు.
 పుట్టి పెరిగిన నేపథ్యాన్ని రాయని కవి వుండడు. తన ఊరిలోని బాధల్ని గాథలుగా మలుస్తాడు. ఊళ్లోని ప్రతిచోటకు పాఠకుల్ని తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కుటీలం లేదు. కలసిమెలసిన సహజీవనం. మమతల ఒడి మా ఊరు అని పరిచయం చేస్తూనే మారిన పరిస్థితుల్ని ఏకరువు పెడతాడు.
 ‘‘ఊరిప్పుడు
 కాకులు గద్దలు తన్నుకుపోతున్న కోడిపిల్ల
 దళారి చేతుల్లో మోసపడిన దిగులు
 వచ్చలు వచ్చలుగా పెచ్చులూడుతున్న నొప్పుల పచ్చికుండ
 మాడుతున్న రెక్కలమాటున రగులుతున్న నిప్పుల కుంపటి’’ అని ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాడు.
 మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసాలు నింపి విభజిస్తున్న మత మారణహోమాన్ని, తత్ఫలితంగా జరుగుతున్న తీవ్ర పరిణామాల్ని వివరిస్తాడు. మనుషుల్లో ‘‘చైతన్యపు జ్వాల’’ రగిలిస్తాడు.
 ‘‘మనిషికి మనిషికి మధ్య కౌర్యం
 ఉగ్గుపాల పోతగా
 మతమౌఢ్యమేమో మానవతను బల్జేస్తుంది’’అని విశ్వవిద్యాలయాల్లో కుల మతాల కుళ్లుల్ని వెల్లడిస్తాడు. దళిత బహుజన విద్యార్థులు బాల్రాజ్‌, వేముల రోహితుల్ని రాలిన సంఘటల్ని గుంబనంగా స్పృశిస్తాడు.

 తెలంగాణ పండుగలని ప్రచారం కల్పిస్తున్న ప్రభుత్వం కిందిస్థాయికి అందిందా లేదా అనేది పట్టించుకోదు. బతుకమ్మ పండుగకు ఎనలేని ప్రాముఖ్యతనిస్తూ ఉంటది. ఇప్పటికీ కొన్ని దళితవాడల్లో బతుకమ్మ ఆడిన దాఖలాలు లేవు. ఇంకా అంటరాని వారుగానే పరిగణించబడుతున్నారు. మాదిగలకు బతుకమ్మ పండుగ లేకుంట చేసిన వ్యవస్థమీద కవి తన నిరసన వెళ్లగక్కుతాడు. బతుకమ్మ మీద దాండియా దాడిని ఓదన్న నిరసిస్తాడు. తంగేడు వనంలో తండ్లాట కవితలో నవోదయాన్ని ఆహ్వానిస్తాడు. దూరమైన ‘బతుకమ్మ’ పండగలో ఎతల్ని పేర్చుతుంటాడు.
 ‘‘తంగేడు వనంలో 
 బతుకు తండ్లాట మొదలైంది 
 వెలివేయబడిన బతుకమ్మ 
 గంపెడాశతో తూర్పును తడుముతుంది
 రేపటిని వెలుతురు కోసం’’ అని కొత్త దృక్కోణాన్ని కలగంటాడు. బతుకమ్మందరిదని చాటుతుంటాడు.
 విలయానికి కారణమవుతున్న సామాజిక మాధ్యమాలు మోసుకొచ్చిన దుర్మార్గాన్ని అక్షరబద్ధం చేస్తాడు. ఒక అబలను మూకుమ్మడిగా తగలబెడుతున్న దుస్సంఘటనను చిత్రిస్తూ..
 ‘‘సదాచార సంస్కృతిలోని అరాచకమా
 అతివల్ని ఆహుతి చేస్తున్న వాచాలత్వమా
 నీ రెండు నాల్కల ధోరణి శ్రీఘ్రముగా నాశనమగు గాక’’ అని విపరీతాన్ని కవి శపిస్తాడు. 
 తెలంగాణ ఔన్నత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇక్కడి నేలలోని జిద్దును గానం చేస్తాడు. గాయాలను స్మరిస్తాడు. పోరాటపంథాను యుద్ధగీతికగా మలుచుకున్న విధానాన్ని వివరిస్తాడు. ‘బృందగానం’ కవిత ద్వారా
 ‘‘అస్తిత్వమే ఊపిరిగా
 పోరాటమే ఆరాధనగా ఓ యుద్ధగీతికైంది’’ అని ప్రతిబింబిస్తాడు. 

 మూలాన్ని మరువకూడదని మట్టి సంబంధాన్ని మన్నికగా రాస్తాడు. నిరాకారంగా కనిపించే మట్టిలో జనావళిని పోషిస్తున్న వాస్తవాన్ని కళ్లకు కడుతాడు. మట్టిలోని మమకారాన్ని తట్టి లేపుతాడు. ‘మట్టి సంబంధం’ అనే కవితలో మట్టి తత్వాన్ని వివరిస్తాడు. 
 ‘‘మట్టిలో ఒడువని ముచ్చటుంది
 మట్టికి మనిషికి విడదాయరాని బంధం ఉంది
 నెనురుండాలె గని ఎప్పటికీ తెగని సంబంధముంది’’
 పుల్వామా దాడి అనంతరం సర్జికల్‌ జరిపిన దాడుల్లో అభినందన్‌ వర్తమాన్‌ ధైర్య సాహసాలకు ఎంత హింసిస్తున్నా తొణకని ఆత్మస్థైర్యానికి దేశం యావత్తు శిరసొంచి నమస్కరించింది. ఓదన్న మాటల్లో ఒక ప్రత్యేకత చూడండి.
 ‘‘దేశానికి పెట్టని కోటగ నిల్సినోడ
 నిస్వార్థ త్యాగానికి పట్టం గట్టిన వీరుడా...
 అజేయుడా నీకు సలాం’’ అని దేశభక్తిని కీర్తిస్తాడు. 

 ఈ పుస్తకంలో తెలంగాణ దళిత, మాదిగ వృత్తి పదాలు అద్భుతంగా ప్రయోగించాడు. అత్తర గాలం, అద్దె పొందికలు, రికాం, వనెం, ఎల్లెలుకల, గంపెడాశ, అందు బొందుగుల, గొండిగ, పుటుక్కున, గల్మ, ఇద్దెకాడ్వి, ఉర్మిర్మి, నిగురాన్‌ మొదలైన ఎన్నో పదాలను సాహిత్యంలో ప్రయోగించాడు.

 ఇది రెండవ పుస్తకం గనుక కవిత్వం ఎలా ఉండాలో ఉండకూడదో ఓదన్నకు తెలుసు. చిక్కదనం చక్కదనం మేళవించిన కవిత్వం వస్త్రగాలం పట్టే వడపోతలో కాలంతో కలెవడి నిలుస్తది. జన జీవన నాలుకలపై నడయాడుతది. అధ్యయనంతో విశ్వమంతా విస్తృతమయ్యేంత కృషి చేస్తాడని నమ్మకం కల్గిస్తున్నాడు. దాదాపు అన్ని చలనాలు ఆకళింపు చేసుకున్న కవి తప్పెట ఓదన్న. ఏది రాసినా దానిలో లీనమవుతాడు. అనుభూతితో రాస్తాడు. మనసుతో దేవుతూ హత్తుకునేటట్లు వ్యక్తీకరిస్తాడు.

ఎత్తిన కలంలో ఎతలు ఎగజల్లుతున్నాడు. బరిగీసి నిలిచే బాధల్ని సిరలో ముంచి గాథాలు కావాలని కాంక్షిస్తున్నాడు. బతుకును అక్షరాల్లోకి నింపి కవిత్వంగా మలిచి కాలం కాన్వాసు మీద లిఖిస్తున్నాడు. నడుస్తున్న చరిత్రను పొడుస్తున్న పొద్దును గుప్పెట్లో పట్టి సాహితీ క్షేత్రంలో అక్షర మొలకల్ని ఎగజల్లుతున్నాడు. మండే సూర్యున్ని జబ్బకేసుకొని చిర్రా చిటికెతో నిజాన్ని ధ్వనిస్తూ, ఇజాన్ని సాహిత్యంలో ప్రకటిస్తూ తప్పులపై నిప్పుల తప్పెట మోగిస్తున్నాడు తప్పెట ఓదన్న.

  -డా॥ సిద్దెంకి యాదగిరి
         9441244773.



అలకల పోత పుస్తకావిష్కరణ 
తేది :27-10-24
స్థలం ఫిలిం భవన్ కరీంనగర్ 
సమయం: ఉదయం 10 గంటల నుంచి. 
అందరూ హాజరై సభను విజయవంతం చేయగలరు.