సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

30, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీశ్రీ

అభ్యుదయ కవి..శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీ శ్రీ) జయంతి ఏప్రిల్30న ఆమహాకవికి నివాళులు అర్పిస్తూ........

జననం 30 ఏప్రిల్ 1910
మరణం 15 జూన్ 1983

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు 
"శ్రీ శ్రీ"గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల 
సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీ.శ్రీ.హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీ.శ్రీ.విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం  ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

జీవిత గమనం..

 శ్రీ.శ్రీ. 
- శ్రీరంగం శ్రీనివాసరావు  1910 లో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది.  

ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో  చేసాడు. 
1925లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 
1931 లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. 
1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. 
ఆ తరువాత  ఆకాశవాణి ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 

1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం,జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. 

పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

శ్రీ శ్రీ సాహిత్యం..

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేసేవాడు 

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి.

"వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే!శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు.

శ్రీశ్రీ తన ఆత్మ కథను"అనంతం" అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులను మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.

1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటి
సారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం,  జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో 
నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. 

మహాప్రస్థానం..

"మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవ్వెత్తున లేచి గర్జించిన సింహం వలె అరిచాడు.

 తరువాత మరోప్రస్థానం, ఖడ్గసృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటి కి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు.

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. 
ఈపాటకు జాతీయ పురస్కారం లభించింది.

ప్రముఖ సినిమా పాటలు..

●మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
●హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
●నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన) 
●తెలుగువీర లేవరా(అల్లూరి సీతారామరాజు) 
●పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)

1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గాప్రచారం నిర్వహించాడు.  హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో 
ఉండవలసి వచ్చింది.  

1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీ.శ్రీ.,వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.

అయినా ప్రతినిత్యం తన సాహిత్యం ద్వారా ప్రజలలో నిలిచిన ప్రజాకవి శ్రీ .శ్రీ.

16, ఏప్రిల్ 2022, శనివారం

Dr.B.R అంబేద్కర్.

*అంబేద్కర్ జయంతి*
(14ఏప్రిల్ )

ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న Dr.B.R.అంబేద్కర్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు...

(దయచేసి చదవండి - భావితరాలకు తెలియజేయండి)

✿✿ జీవన చిత్రం ✿✿

☞ తల్లిదండ్రులు :- తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.

☞ జననం:- 14 ఏప్రిల్ 1891

☞ ప్రాంతం :- మౌవ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)

☞ వివాహం:- 
రమాబాయి అంబేద్కర్ 1906 లో వివాహం జరిగింది, ఆయనకు ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు,చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో రమాబాయి చనిపోయారు.

సవిత అంబేద్కర్ :- 
అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యాన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..

☞ డా. బి. ఆర్. అంబెడ్కర్ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు,నిద్రలేమి,మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు.

తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసెంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు.

☞✿ బాబాసాహెబ్ Dr.B.R అంబేద్కర్ గారి చదువులు - ప్రత్యేకతలు:- ✿☜

✍ మెట్రికులేషన్ -1908 
✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
✍ Political Economics - Germany. 
✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India. 
✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
✍ బాబాసాహెబ్ Dr.B.R అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు,ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

✿✿ తొమ్మిది భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావీణ్యత కలిగి ఉన్నారు ✿✿

- మరాఠీ 
- హిందీ
- ఇంగ్లీషు 
- గుజరాతీ
పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
- సంస్కృతం 
- జర్మన్
- పార్శీ
- ఫ్రెంచ్

✿✿ బాబాసాహెబ్ Dr.B.R. అంబేద్కర్ గారి ఉద్యమ జీవితం ✿✿

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ఉద్యమ సంస్థలు:-

1. బహిషృిత హితకారిణి సభ :- జులై 20, 1924
2. సమత సైనిక్ దళ్ :- మార్చి 13, 1927

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన రాజకీయ సంస్థలు:-

1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)-- ఆగస్టు 16, 1936
2. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (SCF)-- జులై 19, 1942 ( ILP నే SCF గా మార్చారు)
3. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) - అక్టోబరు 3, 1957 (బాబాసాహెబ్ అనారోగ్యం కారణంగా ఆయన తదనంతరం నెలకొల్పబడింది)

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన విద్యసంస్థలు:

1. డిప్రెస్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూన్ 14, 1928
2. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ -- జూలై 08, 1945 
3. సిద్ధార్థ్ కాలేజి, ముంబై -- జూన్ 20, 1946 
4. మిళింద్ కాలేజీ, ఔరంగాబాద్ -- జూన్ 01, 1950

☞☆ బాబాసాహెబ్ స్థాపించిన ధార్మిక సంస్థ:

1. బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా -- మే 4, 1955

✿✿ బాబాసాహెబ్ నాయకత్వం వహించిన కొన్ని ముఖ్య ఉద్యమాలు ✿✿

- మహద్ చెరువు ఉద్యమం - 20/3/1927
- మొహాళీ (ఘులేల)తిరుగుబాటు - 12/2/1939
- అంబాదేవీ మందిరం ఆందోళన - 26/7/1927
- పూణే కౌన్సిల్ ఉద్యమం - 4/6/1946
- పర్వతీ ఆలయ ఉద్యమం - 22/9/1929
- నాగపూర్ ఆందోళన - 3/9/1946
- కాలారామ్ ఆలయ ఆందోళన - 2/3/1930
- లక్నౌ ఉద్యమం - 2/3/1947
- ముఖేడ్ ఉద్యమం - 23/9/1931

✿✿ బాబాసాహెబ్ స్థాపించిన పత్రికలు ✿✿*మూక్ నాయక్ - జనవరి 31, 1920
*బహిషృత భారత్ - ఏప్రిల్ 3, 1927
* సమత - జూన్ 29, 1928
*జనత - నవంబరు 24, 1930
*ప్రభుద్ధ భారత్ - ఫిబ్రవరి 4, 1956

✿✿ బాబాసాహెబ్ ప్రత్యేకతలు దక్కిన గౌరవాలు✿✿

☞- బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు,ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే.
☞- లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కడు బాబాసాహెబ్.
☞- ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు గల ప్రజా నాయకుడు బాబాసాహెబ్. 
☞- ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు.
☞- లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
☞- తన ప్రమేయం లేదు కాబట్టి హిందూమతంలో పుట్టాను గానీ హిందూమతంలో మాత్రం చావను అని ఆయన బౌద్ధం తీసుకుంటే, మరో ఆలోచన లేకుండా 5లక్షల మంది బౌద్ధం తీసుకున్నారు.. ఇంతటి అభిమానం ఇంకే నాయకుడు పొంది ఉండడు. 

❤ అరుదైన గౌరవాలు

☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం. 

☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు. 

☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత.

☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN.

*‍‍‌‍‌‍‌బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు 

యావత్ ప్రపంచం బాబాసాహెబ్ ను నవభారత నిర్మాతగా,భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే,భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా,ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది.సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునిగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది.ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర.

ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే,మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే,అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారమౌతం.

✿✿☆ వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు .. ☆✿✿

✿ బాబాసాహెబ్ - మహిళా హక్కులు ✿

☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవినే వదిలేసారు.)
☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు. 
☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).
☞✓ పని ప్రాంతాలలో మహిళకు ప్రత్యేక సౌకర్యాల కోసం పథకాలు.
☞✓ స్త్రీ శిశు సంక్షేమ చట్టం - ఇది తరువాతి కాలంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆవిర్భావానికి దారి తీసింది.

✗✗✗ అయినప్పటికీ మనువాదంలో మునిగి తేలుతున్న స్త్రీ సమాజం ఏనాడూ బాబాసాహెబ్ పేరును కూడా తలుచుకోదు,మహిళా హక్కులంటూ గొంతు చించుకునే మహిళా సంఘాలు బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా తమ సంఘాల వారికి చెప్పరు ✗✗✗

✿ బాబాసాహెబ్ - కార్మికుల హక్కులు ✿

☞✓ 8 గంటల పనిదినాలు - 7వ Indian Labour Conference, నవంబరు 27, 1942 లో 14 నుండి 8 గంటలకు కుదించారు.
☞✓ ESI (Employee State Insurance) సౌకర్యం :- కార్మికుల ఆరోగ్య భద్రత కోసం (తూర్పు ఆసియాలోనే మొదటిది.
☞✓ ఇండియన్ ఫ్యాక్టరీల చట్టం :- పని ప్రదేశంలో నిర్ధిష్ట విధానాలు,జవాబుదారీతనం కోసం.
☞✓ కరువు భత్యం (Dearness Allowance)పెరిగిన నిత్యావసర ఖర్చులను భరించేందుకు వీలుగా. 
☞✓ కనీస వేతనం ఉండే విధంగా చర్యలు.
☞✓ కేంద్ర కార్మిక సంఘాల (సవరణ) చట్టం :- 1926 చట్టం కేవలం కార్మిక సంఘాలను రిజిష్ట్రేషను చేయడం మాత్రమే చెప్పింది.8 నవంబరు 1943న సవరణ చట్టం తీసుకొచ్చి పూర్తి విధివిధానాలు రూపొందించారు బాబాసాహెబ్.
☞✓ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం.

✗✗✗ కానీ ఏనాడూ బాబాసాహెబ్ పేరు కూడా ఎత్తకుండా కార్మికులను మాయలో ఉంచుతారు ఈ అగ్రకులాల నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్టులు.✗✗✗

✿ బాబాసాహెబ్ - రైతుల కోసం ✿

☞✓ నీటిపారుదల సౌకర్యాల పితామహుడు:- హిరాకుడ్ ప్రాజెక్టు,దామోదర్ నదీలోయ ప్రాజెక్టు, సోన్ నది లాంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్ దగ్గర నుండి పూర్తి చేసేదాకా బాబాసాహెబ్ కృషి ఉంది.భారతదేశ చరిత్రలో అనుకున్న ఖర్చు మరియు అనుకున్న సమయంలో పూర్తయిన నీటిపారుదల జలవిద్యుత్ ప్రాజెక్టులు ఇవే.
☞✓ మెరుగైన నీటిపారుదల కోసం Central Waterway and Irrigation Commission (CWIRC) ఏర్పాటు చేసారు.

☞✓ జలవనరుల నుండి విధ్యుత్తుత్పత్తిని క్రమబద్ధం చేయడం కోసం Central technical power board స్థాపించారు. 
☞✓ ఇప్పటికీ సమస్యలు లేకుండా విజయవంతంగా నడుస్తూ దేశంలో విధ్యుత్తు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న "గ్రిడ్ వ్యవస్థ " బాబాసాహెబ్ ఆలోచనే.

✗✗✗ మొక్షగుండం విశ్వేశ్వరయ్య, నెహ్రూ, పటేల్ ల వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయంటూ బాబాసాహెబ్ పేరు కూడా తలవవు ఈ ప్రభుత్వాలు.✗✗✗

✿ బాబాసాహెబ్-నిరుద్యోగం-స్వయం వికాసం ✿

☞✓ ఇప్పుడు నిరుద్యోగులకు అత్యంత సహాయకరంగా నిలుస్తున్న "ఎంప్లాయిమెంట్ ఎక్సచేంజీలు" (Employement exchange) బాబాసాహెబ్ స్థాపించినవే.
☞✓ భారత దేశంలో సాంకేతిక విద్య అందుబాటులో లేని కారణంగా నిరుద్యోగులను యూనిట్ గా చేసుకుని ITI లాంటి సంస్థలు ఏర్పాటు చేసి అవసరం అయితే వారిని విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్.

✿ భారతదేశ ఆర్థిక ప్రగతికి బాబాసాహెబ్ కృషి ✿

☞✓ రెండవ ప్రపంచ యుద్ధం సమయానికి ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న భారతదేశాన్ని మళ్ళీ పునర్నించే ప్రయత్నంలో భాగంగా నియమించిన Reconstruction Commitee of Council లో బాబాసాహెబ్ సభ్యులుగా ఉన్నారు.నీటిపారుదల మరియు విధ్యుత్తుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రగతికి బాటలు వేసారు.
☞✓ ఇప్పటిదాకా నివేదికలు సమర్పించిన 13 ఆర్థిక సంఘాల (Finance Commisions) నివేదికలు కూడా బాబాసాహెబ్ Phd thesis అయిన "The Evolution of Provincial Finance in British India" నుండి సేకరించినవే.
✍✓ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఆర్థిక మాంద్యాలు కూడా భారతదేశాన్ని ప్రభావితం చేయలేక పోవడానికి ముఖ్య కారణం అయిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన పూర్తిగా బాబాసాహెబ్ కృషి ఫలితమే.రిజర్వు బ్యాంకు స్థాపన కోసం ఏర్పాటు చేసిన హల్టన్ అండ్ యంగ్ కమీషన్ పూర్తిగా బాబాసాహెబ్ రాసిన "The Problem of the Rupee – it’s origin and it’s solution.” ని అనుసరించింది.

✗✗✗ మరి ఈనాడు చూస్తే కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ మరియు బ్యాంకుల్లో రవీంద్రనాద్ ఠాగోర్ ల ప్రవచనాలే కనిపిస్తాయి.నిజానికి వీరి ఇద్దరి సహకారం శూన్యం.

✿ బాబాసాహెబ్ - హేతువాదం - సామాజిక ఉద్యమాలు ✿

☞✓ భారతదేశం విజ్ఞానపరంగా ముందుకు వెళ్ళకుండా మూఢనమ్మకాలలో మగ్గుతూ ఉండడానికి ముఖ్యకారణం హిందూమతం అని నినదించి.ఈ రుగ్మతలు ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న మనుధర్మాన్ని తగలబెట్టారు బాబాసాహెబ్.

☞✓ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి హేతువాదం మాత్రమే సరిపోదు, ఒక హేతువాద భావనలు గల మరో సంస్కృతి సృష్టించాల్సిందే అని చెప్పి నవయానాన్ని ప్రభోధించారు బాబాసాహెబ్.

 కానీ ఈనాడు హేతువాదులం అని చెప్పుకునే ఏ అగ్రకులం వాడు బాబాసాహెబ్ పేరు తలవడానికి కూడ ఇష్టపడడు.

ఇలా మనువాద భావనలు నిండిన మన సమాజం బాబాసాహెబ్ ఈ దేశ వ్యవస్థకు అందించిన సహకారం పూర్తిగా విస్మరిస్తూ వస్తోంది.
 
*బాబాసాహెబ్ తన జీవిత కాలంలో నిర్వహించిన బాధ్యతలు.

ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..

ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..

ఒక విశిష్టమైన చరిత్రకారుడు..

ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త...

ఒక అద్భుతమైన రచయిత..

ఒక తిరుగులేని ఉద్యమకారుడు..

ప్రజలను కట్టిపడేయగల వక్త.. 

ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..

భారత రాజ్యాంగ నిర్మాత.

అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది.

స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,
తపన పడ్డ సామాజిక విప్లవకారుడు.

భారత భూమిపై నడయాడిన ఒక "గ్రేటెస్ట్ ఇండియన్"

"జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలి అని బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.

 పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించండి. కుదిరితే మీ దగ్గర లోని SC,ST,BC హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి.

✊ భారతదేశ సామాజిక ఉద్యమ పితామహుడు, ప్రపంచ మేధావి, నిజమైన ప్రజా నాయకుడు.

నేను హిందువుగా పుట్టినను... అది నా చేతుల్లో లేదు. కానీ... హిందువుగా మాత్రం చావను... చావను... చావను. Dr.B.R అంబేద్కర్.

* :-.ప్రపంచంలో అత్యదిక పుస్తకాలను అధ్యయనం చేసిన వాళ్ళలో...

1)కారల్ మార్క్స్ [జర్మని]
2)డా బి ఆర్ అంబేడ్కర్ [ఇండియా)
3)మజ్జిని [జెనివా]
5) వివేకా నంద 
5) ఉమర్ ముక్తార్ ....
6) చేగెవారా ....
ఇలా చాలామంది ఉన్నారు...

***********ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంధాలయంగా పేరొందిన *లండన్* *మ్యూజియంలో* అత్యధిక పుస్తకాలను చదివిన రీడర్స్ గాఈ ముగ్గురు గుర్తింపు నొందారు.

 *అంబేడ్కర్* *60* *వేల* *పుస్తకాలకు* *పైగానే* *చదివారు.లక్ష* *పేజీలు* *రాసారు* .

 *బౌద్దమతానికి* *సంబందించి* *2000* *పుస్తకాలను* *చదివారు* .

ఆసియా ఖండంలోనే 2 దేశాలలో ఆర్దికశాస్త్రంలో 2 డాక్టరేట్ లు తీసుకున్న  
ప్రప్రధముడు
                          * * *

అలాగే ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరి కల్గిన వ్యక్తులుగా ....

డా॥బిఆర్ అంబేడ్కర్ ( 1891 - 1956 )
ధామస్ జాఫర్సన్ ( 1743 -1826 )లు గుర్తింపు నొందారు.

అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయితే... జాఫర్సన్ అమెరికా రాజ్యాంగం రూపకర్త.జాఫర్ సన్ యునైటెడ్ స్టేట్స్ కి మూడవ అధ్యక్షుడు కూడా

జాఫర్సన్ కు 7000 వేల గ్రంధాలతో పర్సనల్ లైబ్రరి వుండేది.బహుశ ప్రపంచంలొ అతిపెద్ద తొలి పర్సనల్ లైబ్రరి ఇదేకావచ్చు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ 60 వేల గ్రంధాలతో కూడిన లైబ్రరీ ని .. లండన్ మ్యూజియం , న్యూయర్క్ లైబ్రరి తరహాలో ఏర్పరచుకున్నారు.

 ఒక వ్యక్తి లైబ్రరి కోసం బంగ్లాను నిర్మించడం అనేది ఆసియా ఖండంలోనే ప్రప్రదమం.

అమెరికా రాజ్యాంగ నిర్మాణంలొ బెంజిమెన్ ప్రాంక్లిన్,జాఫర్ సన్ ,మాడిసన్ అనె ముగ్గురు మేధావులు చేసిన కృషికి సమానంగా డా బి ఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసారు

రాజ్యాంగ నిపుణుడు సర్ జెన్నింగ్స్ కూడా ఏదైన సందేహముంటే అంబేడ్కర్ తో చర్చించి సలహాలను తీసుకుంటా
నన్నారు
 
నాకు నోబుల్ అవార్డ్ రావడానికి ఆర్దిక శాస్త్రంలో అంబేడ్కర్ సమర్పించిన ధీసెస్ కారణమని పేర్కొన్నారు.

అంబేడ్కర్ కి మహనీయుల చరిత్రలకు సంబందించిన పుస్తకాలను కొనడం అనేది తాను BA చదువుతున్నప్పడే అలవాటు అయింది.

ఆ సమయంలో తన తండ్రి వద్ద డబ్బులు లేకపోతే తన కూతురు పెళ్ళికి పెట్టిన చెవి కమ్మలను తాకట్టు పెట్టి అంబేడ్కర్ కోరుకున్న పుస్తకాలను తీసిచ్చారు.

తనకు పంపే స్కాలర్ షిప్ లో కొంత సొంత ఖర్చులకు ఇంటి ఖర్చులకు పోను మిగిల్చుకున్న డబ్బులతో పాత పస్తకాలను కొనేవారు.

పుస్తకాల కోసమని తక్కువ ఖర్చుతో కూడిన భోజనం, అద్దెకు గదిని కుదర్చుకున్నాడు. చాలినంత డబ్బులు లేక ఎన్నిసార్లు ఆకలితో పడుకున్నాడో తనకే తెలియదు.ఒక రొట్టె ముక్కతో, ఒక కప్పు ' టీ ' తో ఆకలి తీర్చుకున్న రోజులు కోకొల్లలు.

( లండన్ లో ఒక అంటరాని వాడు అద్దెకు తీసుకున్న గది నేడు పరిశోధకులకు సందర్శన ప్రాంతంగా మారింది)

అలా...పస్తులుండి దాచిన డబ్బుతో న్యూయర్క్ నుండి 2000 పాత పుస్తకాలను ,లండన్ నుండి 8000 పుస్తకాలను తీసుకొచ్చారు.

( అందుకే నేడు ప్రపంచ మేధావులలో ప్రధముడు గా (2013 ) కేంబ్రిడ్జి యూనివర్సటి గుర్తించింది )

ఆ విదంగా 1934 నాటికి 45వేలు పుస్తకాలు అయినాయి.వాటిని భద్రపరచుకునే ప్రదేశం లేక అంబేడ్కర్ మదనపడుతుండేవారు.ఆ సమయంలోనే వాటి కోసమని ఏకంగా ఒక బంగ్లానే నిర్మించారు.

షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని నిర్మిస్తే...బాబాసాహెబ్ అంబేడ్కర్ తన పుస్తకాల (జ్ఞానం) కోసం రాజగృహ అనే మూడంతస్తుల భవనాని నిర్మించారు.

ఇప్పుడు ఈ భవనం( లైబ్రరి ) పరిశోధకులకు సందర్శకులకు కేంద్రంగా మారింది. రీసెర్చ్ కొసం ఎంతోమంది స్కాలర్స్ దేశ విదేశాల నుండిరాజగృహకు 
వస్తుంటారు.

10 వేల విలువైన అతిముఖ్యమైన గ్రంధాలు అందులో వుండేవి.

 న్యాయశాస్త్రానికి సంబందించి నా దగ్గర వున్న పుస్తకాలు బహుశ దేశంలో మరొకరి దగ్గర వుండక పోవచ్చునన్నారు.
అలా న్యాయశాస్త్ర పుస్తకాలతో తన అలమర నిండిపోయివుండేది.

తన 200 రూపాయల సంపాదిస్తే... అందులో 100 రూపాయలపైగానే పుస్తకాల కోసం ఖర్చు చేసేవారు.తన సంపాదనంతా పుస్తకాల కోసమే వ్యయం చేసారు

ఇంగ్లాడ్ నుండి తిరిగి వస్తున్నప్పుడు వెనిస్ నుండి బొంబాయి చేరుకోవాలంటే 6 రోజులు పడుతుంది. ఆసమయంలో 
8000 పేజీలు చదివానన్నారు

ఒకసారి నేను 64 గంటలు పుస్తకాని చదువుతు కూర్చొన్నాను.అది అయిపోయిన తర్వాత నేను పైకిలేచాను.

ప్రతి రోజు చదవడానికని తన బల్లపై 10 15 పుస్తకాలను వుంచుకునేవారు.
రోజుకు 18 గంటలు చదివేవారు.

అన్ని మత గ్రంధాలతో పాటుగా బౌద్ద గ్రంధాలను 2 000 దాకా చదివారు

ప్రయాణాలలో కాదు...ఎక్కడ సమయం దొరికితే అక్కడ చదవడంలో మునిగి పోయెవారు.ఆఖరికి బాత్రూంలో కూడా చదివేవారు.

లండన్ లైబ్రరికి ఉదయం 10 గంటలకు వెలితే సాయత్రం 5 గంటల వరకు లైబ్రేరియన్ వచ్చి గుర్తు చేసేవరకు లేచేవారుకాదు.అలా పుస్తకంలో నిమగ్నమై పోయేవారు.

1942 లో వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వున్నప్పుడు బొంబాయిలో రైల్వెేస్టేషన్ లో తన పుస్తకాల కోసం ఒక ప్రత్యేక రైల్వేగది ( రైల్వే సెలూన్ ) ను ఏర్పరుచుకున్నారు

ఆ సమయంలో సరోజినాయుడు రైల్వె సెలూన్ లో వున్న గ్రంధాలను సందర్శించి

 " కాంగ్రెస్ దాని అధినాయకుడు గాంధి అంబేడ్కర్ యొక్మ విలువను గుర్తించక పోవడం విచారకరం. భావితారాలు మాత్రం అతని జాతీయతను అపారమైన జ్ఞానాని గుర్తిస్తాయి అని అన్నారు.

బెవర్లీ నికోలస్ అనె అమెరికా విధ్యావంతురాలు అంబేడ్కర్ తో కలసి మాట్లాడి తన జ్ఞానానికి ముగ్ధురాలై 
తాను వ్రాసిన " వర్ధిక్ ఆఫ్ ఇండియా " (1944) అనే గ్రంధంలో...m

" అంబేడ్కర్ జీవించి వున్న జ్ఞానదేవత " అనికొనియాడింది

ఒకసారి ' ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ ' అనే సినిమాకు వెల్లారు. 

మద్యలో ఒకఆలోచన వచ్చేసరికే సినిమా నుండి ఇఁటికి వెల్లి ఆ...ఆలోచనను పేపర్ పై పెట్టారు.అంబేడ్కర్ తన జీవితకాలంలో 4 సినిమాలను మాత్రమే చూసారు

.పుస్తకాల పఠనం కోసం ఆకలిని సుఖాలను,విలాసాలను వదులు కున్నాడు.తనకు వున్న సమయాన్నంతా పుస్తకం పఠనం కోసమే దారబోసారు. సమయాని ఎప్పుడు వృదా చేయలేదు.

1948 లో శ్రీలంక స్బాతంత్రఉత్సవాలకు అంబేడ్కర్ ని ఆహ్వానించారు.వాటికి నెహ్రు పటేల్ హాజరైనారు. సమయాని వృధా చేయడం ఇష్టం లేకనే నేను ఉత్సవాలకు హాజరుకావడం లేదని అంబేడ్కర్ అన్నారు

 ఆఖరి దశలో నేను కఠిక పేదరికాని అనుభవించాను.నేను కనుక ఉద్యోగంలో చేరివుండి వుంటె ..పెన్షన్ డబ్బులతో నా శేష జీవితం. ఇబ్బందులు లేకుండా గడిచి పొియేదని క్షోబించాడు

నా పుస్తకాలను అమ్మితే 5 లక్షలు వస్తాయి. ఆ డబ్బులతో కష్టాలన నుండి బయటపడవచ్చు.కానీ పుస్తకాలు నా నేస్తాలు.నేను అలా చేయలేను

ఎన్నో సార్లు నేను పస్తులుండి .. కుటుంబ ఖర్చులకు పంపకుండా..దాచిన డబ్బుతో కొన్న పాత ,కొత్త పుస్తకాలు అవి ..వాటిలో చాలా పుస్తకాలు ఇప్పుడు దొరకవు .

బిర్లా నా పుస్తకాలను కొనడానికి నా దగ్గరకు వచ్చారు.నేను అందుకు ఒప్పుకోలేదు.

అంతటి మహా బహుముఖ ప్రజ్ఞాశాలిని ప్రపంచం ఎన్నడు చూచి వుండదు...ఇక చూడబోదు

ప్రపంచంలోనే అత్యధిక పుస్తకాలను అధ్య యనం చేసి విశ్వనరుడుగా ఖ్యాతినొందిన అంబేడ్కర్ వంటి మహా మేధావిని గర్తుంచుకోండి.

అంబేడ్కర్ 200 దేశాలలొ విశ్వ జ్ఞానిగా వెలుగొందుతున్నాడు. 

 అంబెడ్కర్ ఒక్కరే జ్ఞానం ద్వారా ప్రపంచ వ్యాపితమైనారు.
A TRIBUTE TO LEGENDARY SYMBOL OF WORLD KNOWLEDGE & REFORMIST
🙏🙏🙏🌹🌹🌹💐💐

7, ఏప్రిల్ 2022, గురువారం

సమాసములు

 

·          సమాసములు

        

·         అవ్యయీభావ సమాసము: సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి

·         ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.

·         సమాహార ద్విగు సమాసము: ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర

·         విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము

·         విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము

·         విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును

·         ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము

·         ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము లోని పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.

·         అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము

·         సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరం - ద్వారక అను పేరుగల నగరం.

·         నఞ్ తత్పురుష సౌకచంకమాసము: అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు '' వర్ణము వచ్చును. ఈ '' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - '' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము

·         ద్వంద్వ సమాసము: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.

·         బహుపద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.

·         బహువ్రీహి సమాసము: అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు.

సమాసపదం

అర్థం

ఏ సమాసం

అనంతం

అంతం లేనిది

నఞ తత్పురుష సమాసం

అర్ధరాత్రి

రాత్రి యొక్క అర్ధభాగము

షష్ఠీ తత్పురుష సమాసం

అసాధ్యము

సాధ్యము కానిది

నఞ తత్పురుష సమాసం

ఆలుమగలు

ఆలును మగడును

ద్వంద్వ సమాసం

ఊతపదాలు

ఊతం కొరకు పదాలు

చతుర్థీ తత్పురుష సమాసం

కంటినీరు

ఠన కంటి యందలి నీరు

సప్తమీ తత్పురుష సమాసం

కనకాభిషేకము

కనకముతో అభిషేకము

తృతీయాఅబ్బ తత్పురుష సమాసం

కుటీరపరిశ్రమ

కుటీరము లోని పరిశ్రమ

సప్తమీ తత్పురుష సమాసం

కులవృత్తులు

కులము యొక్క వృత్తులు

షష్ఠీ తత్పురుష సమాసం

కూరగాయలు

కూరయు, కాయయు

ద్వంద్వ సమాసం

గంగానది

గంగ అను పేరుగల నది

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

గృహప్రవేశము

గృహమునందు ప్రవేశము

సప్తమీ తత్పురుష సమాసం

చంద్రుడు

చల్లనైన కిరణములు కలిగినవాడు

బహువ్రీహి సమాసం

చతుర్ముఖుడు

నాలుగు ముఖములు కలవాడు

బహువ్రీహి సమాసం

చిరునవ్వు

చిన్నదైన నవ్వు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

తల్లిదండ్రులు

తల్లియును తండ్రియును

ద్వంద్వ సమాసం

త్రికరణాలు

త్రి (మూడు) సంఖ్యగల కరణాలు

ద్విగు సమాసం

తెలుగుభాష

తెలుగు అను పేరుగల భాష

నటజ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

దీపావళి

దీపముల యొక్క ఆవళి

షష్ఠీ తత్పురుష సమాసం

నరసింహుడు

సింహము వంటి నరుడు

ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

నల్లకలువ

నల్లనయిన కలువ

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

నవరసాలు

నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు

ద్విగు సమాసం

పరోపకారము

పరులకు ఉపకారము

షష్ఠీ తత్పురుష సమాసం

పార్వతీపరమేశ్వరులు

పార్వతియును పరమేశ్వరుడును

ద్వంద్వ సమాసం

పినాకపాణి

పినాకము పాణియందు కలవాడు

బహువ్రీహి సమాసం

పుట్టినిల్లు

పుట్టినట్టి ఇల్లు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పురుషోత్తముడు

పురుషుల యందు ఉత్తముడు

సప్తమీ తత్పురుష సమాసం

పెనుతుఫాను

పెద్దదైన తుఫాను

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

భూగర్భం

భూమి యొక్క గర్భం

షష్ఠీ తత్పురుష సమాసం

భూలోకము

భూమి అనే పేరుగల లోకము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

మధ్యాహ్నం

అహ్నం యొక్క మధ్య భాగం

షష్ఠీ తత్పురుష సమాసము

మనోవాక్కాయములు

మనస్సును, వాక్కును, కాయమును

బహుపద ద్వంద్వ సమాసం

మానస సరోవరము

మానస అను పేరుగల సరోవరము

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

ముందడుగు

ముందుకు అడుగు

షష్ఠీ తత్పురుష సమాసం

ముక్కంటి

మూడు కన్నులు కలవాడు

బహువ్రీహి సమాసం

ముల్లోకములు

మూడు అయిన లోకములు

ద్విగు సమాసం

మేఘచ్ఛాయ

మేఘము వంటి ఛాయ

ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం

రక్తపుపోటు

రక్తము యొక్క పోటు

షష్ఠీ తత్పురుష సమాసం

రామలక్ష్మణులు

రాముడును లక్ష్మణుడును

ద్వంద్వ సమాసం

వయోవృద్ధులు

వయస్సు చేత వృద్ధులు

తృతీయా తత్పురుష సమాసం

వాణిజ్యపంటలు

వాణిజ్యము కొరకు పంటలు

చతుర్థీ తత్పురుష సమాసం

విద్యాధనము

విద్య అనెడి ధనము

అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం

వేదాంగాలు

వేదాల యొక్క అంగాలు

షష్ఠీ తత్పురుష సమాసం

శస్త్రచికిత్స

శస్త్రముచే చికిత్స

తృతీయా తత్పురుష సమాసం

సప్తాహాలు

సప్త (ఏడు) సంఖ్యగల అహాలు

ద్విగు సమాసం

సముద్రతీరము

సముద్రము యొక్క తీరము

షష్ఠీ తత్పురుష సమాసం

ప్రత్యయాలు విభక్తి పేరు

డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.

నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.

కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.

వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.

అందున్, నన్--- సప్తమీ విభక్తి.

, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి. ...