సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, జులై 2023, సోమవారం

Viii. 1. త్యాగనిరతి - డా. సిద్దెంకి



త్యాగనిరతి

నన్నయ

చదువండి ఆలోచించి చెప్పండి

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్నలు

1. దధీచి ఎవరు?
2. దధీచి చేసిన త్యాగం ఏమిటి? ఎందుకు?
3. త్యాగం అంటే ఏమిటి?
4. మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.

పాఠం నేపథ్యం
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబిచక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే 'ఇది ఇట్లా జరిగింది' అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు.
ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ అశ్వాసం నుండి గ్రహించారు.


కవి పరిచయం
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది.
(11వ శతాబ్దం)
వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో 'శారదరాత్రులు' అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. 'ఆంధ్రశబ్ద చింతామణి' అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో 'ప్రసన్నకథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వం' అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.



విద్యార్థులకు సూచనలు
పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
ఆ పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.


ప్రవేశిక
మన ప్రాచీనసాహిత్యంలో నైతికవిలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబిచక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలుసుకుందాం.

I

ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు 
నట్టి నీకు బాడియయ్య? యిప్పు 
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా 
హార విఘ్న మిట్టులాచరింప?

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు బుభుక్షావేదనంజేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మవిరోధంబు 2

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

ధర్మజ్ఞులైన పురుషులు 
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ 
ధర్మముగా మదిఁ దలఁపరు 
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్, 3

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు. 'శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి' యను వేదవచనంబ గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి యిట్లనియె 4
4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను 
నాశ్రయించే నాశ్రితునెట్టి యధముఁడయిన 
విడువఁడనినను నేనెట్లు విడుతు దీని? 
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె? చెపుమ 5

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.


ఆలోచించండి - చెప్పండి.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు?
"ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్" దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు?
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు?

వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండె? నీయాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీ యత్నం బాహారార్థం బేని యిప్పుం డివ్వసంబున మృగ మహిష వరాహ భగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువ' ననిన శ్యేనం బిట్లనియె... 6
6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షిఁ 
బూని కావ నీకు బుద్దియేని య
వని నాథ! దీని యంత నీ మాంసంబు 
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ 7
7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

చ॥ అనిన 'ననుగ్రహించితి మహా విహగోత్తమ' యంచు సంతసం 
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం |
నఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె 
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్  ... 8
8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.


ఈ॥ దానికి నచ్చెరువడి ధర 
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం 
దాన తుల యెక్కెనంతన్ 
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్ 9
9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...


వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి 'నీధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యం శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్థిల్లుచుండు'మని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి. 10
10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు. 

ఆలోచించండి - చెప్పండి.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది?
"అనుగ్రహించితి మహా విహగోత్తమ' అని శిబిచక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్ధం చేసుకున్నారు?
శిబిచక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా! త్యాగం అవశ్యకత ఏమిటి?

తాత్పర్యాలు

1. "ఓ శిబి చక్రవర్తీ! నీవు సత్య ధర్మాలను ఆచరించటంచేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా?

2 అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలిబాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లెతే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

3. ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. 'డేగలు పావురాలను తింటాయి' అనే వేద వాక్యం ఉన్న ది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వు"మని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

5. "ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

6. నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను" అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

7. “ఓ రాజా! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు"మని అడిగింది.

8. అనగా సంతోషించిన శిబి “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు" అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

9. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్ని దేవుడు మెచ్చుకొని...

10. డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి "నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు.

ఇవి చేయండి

1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1.. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి?
2. ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.
అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి 
ధర్మువు సర్వంబునకుహితంబగహుమన
ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం 
వేద విహితంబైన యాహారంబు 
ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు 
నాశ్రీ త్యాగమిడి ధర్మువగునే? చెపుమ

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.
బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు 
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు 
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగుబాల.

అ) 'చెట్టు' అను పదానికి సరిపోయేపదం.(ఎ)
ఎ) తరువు,   బి) గురువు,   సి) ఫలం, డి) గుణం

ఆ) త్యాగానికి గురువులు ఎవరు?(బి )
ఎ) మానవులు,  బి) చెట్లు సి) పక్షులు డి) జంతువులు

ఇ) తనువును చీల్చి యిచ్చేవి(సి)
ఎ) మేఘాలు బి) నదులు సి) చెట్లు డి) పక్షులు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్ధం (సి)
ఎ) పెరుగుట బి) తరుగుట సి) బ్రతుకుట డి) మేల్కొనుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక (డి)
ఎ) భారం బి) ప్రాణం సి) యోగం డి) త్యాగం

III స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.

ఆహారం తినే సమయంలో ఇతరులకు విఘ్నం కలిగించకూడదు. ఆ సమయంలో మాట్లాడించడం, ఆటపట్టించడం లేదా ఇతర పనులతో ఇబ్బంది పెట్టడం వల్ల వారు ప్రశాంతంగా భోజనం చేయలేరు. ఆహారాన్ని సరిగా నమలకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భోజనం చేయడం ఒక అవసరమైన, గౌరవించదగిన ప్రక్రియ. ఇతరుల పట్ల మర్యాద, సహనం, గౌరవం చూపుతూ వారు భోజనం పూర్తిచేసే వరకు వేచి ఉండాలి. ఇలా చేయడం మంచి సంస్కారం, మానవతా విలువలను ప్రతిబింబిస్తుంది.

ఆ) 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
ధర్మం మానవ జీవితానికి పునాది. ధర్మాన్ని ఆచరించడం వల్ల సమాజంలో శాంతి, న్యాయం, సామరస్యం నెలకొంటాయి. సత్యం చెప్పడం, పెద్దలను గౌరవించడం, పరులకు సహాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటి సత్కార్యాలే ధర్మం. ధర్మాన్ని పాటించే వ్యక్తి అందరి ఆదరణను పొందుతాడు. కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలి. "ధర్మో రక్షతి రక్షితః" అనే సూక్తి ప్రకారం ధర్మాన్ని రక్షించిన వారినే ధర్మం రక్షిస్తుంది. కాబట్టి అందరూ ధర్మాన్ని ఆచరించడం ప్రతి మనిషి కర్తవ్యం.

ఇ) ఇతరుల కొఱకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.

ఇతరుల శ్రేయస్సు కోసం మన శక్తి మేరకు త్యాగాలు చేయడం గొప్ప మానవతా గుణం. అవసరంలో ఉన్నవారికి ధనం, ఆహారం, వస్త్రాలు, విద్యా సహాయం అందించవచ్చు. మన సమయం, శ్రమ, జ్ఞానాన్ని పంచుకొని వారికి అండగా నిలవవచ్చు. రక్తదానం, అవయవదానం వంటి మహోన్నత సేవలు కూడా త్యాగమే. ప్రకృతిని కాపాడేందుకు స్వార్థాన్ని తగ్గించి బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల సుఖం కోసం చేసిన చిన్న త్యాగం కూడా సమాజంలో ప్రేమ, దయ, సహకార భావాలను పెంపొందించి మన జీవితాన్ని సార్థకం చేస్తుంది.


ఈ) 'త్యాగనిరతి' అనే శీర్షిక పాఠానికి ఏవిధంగా తగినదో రాయండి.
ఈ పాఠంలో దధీచి మహర్షి తన ఎముకలను దేవతల మేలు కోసం దానం చేసి పరమ త్యాగాన్ని చాటాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నా కవచకుండలాలను దానంగా ఇచ్చి దానశీలతను ప్రదర్శించాడు. ఈ మహనీయులు స్వార్థం లేకుండా పరుల శ్రేయస్సు కోసం తమ సర్వస్వాన్ని అర్పించారు. త్యాగమే వారి జీవిత లక్ష్యంగా నిలిచింది. అందువల్ల ఈ పాఠానికి 'త్యాగనిరతి' అనే శీర్షిక అత్యంత సముచితంగా, భావగర్భితంగా సరిపోతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి..

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని అనుభూతిని వివరించండి.
త్యాగం మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దే గొప్ప సద్గుణం. స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల శ్రేయస్సు కోసం తన సమయం, శ్రమ, సంపద, అవసరమైతే ప్రాణాలను సైతం అర్పించడం త్యాగం. త్యాగం వల్ల మనిషిలో దయ, కరుణ, ప్రేమ, సేవాభావం వంటి ఉన్నత విలువలు పెంపొందుతాయి. త్యాగం చేసినవారు తమ కోసం కాకుండా సమాజ హితం కోసం జీవిస్తారు. దధీచి మహర్షి తన ఎముకలను దేవతల విజయానికి దానం చేసి త్యాగానికి ఆదర్శంగా నిలిచాడు. అలాగే కర్ణుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ కవచకుండలాలను దానంగా ఇచ్చి దానగుణాన్ని చాటాడు. వారి త్యాగం వల్ల ఇతరులకు మేలు జరిగింది. త్యాగం చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి, ఆనందం, గౌరవం ధనంతో కొనలేనివి. త్యాగం వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టి సమాజంలో ఆదర్శంగా నిలిపిస్తుంది. అందువల్ల త్యాగం మానవత్వానికి చిహ్నం, సమాజ అభ్యున్నతికి మూలాధారం.

IV. సృజనాత్మకత / ప్రశంస.

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.

ఇబ్రాహీంనగర్,
తేది: 20.06.2025.

కు

సంపాదకులు గారికి,
వార్తాపత్రిక.

విషయం: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించవలెనని విజ్ఞప్తి.

మహోదయా,

మీ వార్తాపత్రిక ద్వారా ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. అన్నదానం ఆకలిని తీర్చితే, అవయవదానం ప్రాణాలను కాపాడుతుంది. మరణానంతరం దానం చేసిన కళ్లతో అంధులకు చూపు, మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాలతో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అయినప్పటికీ అవగాహన లేకపోవడం, అపోహల కారణంగా చాలామంది అవయవదానానికి ముందుకు రావడం లేదు. కాబట్టి అవయవదానం ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేక కథనాలు, వ్యాసాలు ప్రచురించి ప్రజలను చైతన్యవంతులను చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.

ధన్యవాదాలతో,

ఇట్లు,

విధేయురాలు,

(చిత్తరి వైష్ణవి)

8వ తరగతి,

ఇబ్రహీంనగర్.


V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్ధాలను రాయండి.

ఉదా: కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.

కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు. = ధర్మం 

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు. = మేలు

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణా రాష్ట్రం సిద్ధించింది. = సమర్పణ 

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక! = విస్తరించు, అభివృద్ది పొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. = ఆకలితో ఉన్నవాడు 

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా: ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో కలపడం ధర్మంకాదు
పాడి: న్యాయం, ధర్మం, తీర్పు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
అడవి:  అరణ్యం, విపినం

VI.భాషను గురించి తెలుసుకుందాం.


1. కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా: లోపలకి రావచ్చు అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి (4) 1. ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు. (3) 2. ప్రశ్నార్ధకవాక్యం
ఇ) ఆహా! ఎంత బాగుందో (1) 3. సామర్థ్యార్ధక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు (5) 4. ప్రార్ధనార్ధక వాక్యం
ఉ) గిరి! ఎక్కడున్నావు? (2) 5. నిషేధార్థక వాక్యం

6. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) ఇంద్రాగ్నులు - ఇంద్ర + అగ్నులు = సవరదీర్ఘ సంధి
ఆ) త్యాగమిది -  త్యాగము + ఇది  ఉత్వసంధి 
ఇ) ఆహారార్థం - ఆహార + అర్థం  = సవర్ణదీర్ఘ సంధి 
ఈ) నేనెట్లు  - నేను + ఎట్లు ఉత్తగుంధి
ఉ) శౌర్యాది - శౌర్య + ఆది  సవర్ణదీర్ఘ సంధి 

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలు – రంతిదేవుడు, కర్ణుడు


 
ప్రాజెక్ట్ పేరు ......................................................
ప్రాజెక్ట్ సంఖ్య 
విద్యార్థి పేరు ......................................................
క్రమసంఖ్య ......................................................
సేకరించిన వివరాలు 

నివేదిక

త్యాగం, దానం, పరోపకారం వంటి సద్గుణాలు మనిషిని మహనీయునిగా నిలబెడతాయి. భారతదేశ చరిత్ర, పురాణాల్లో త్యాగబుద్ధికి ఆదర్శంగా నిలిచిన మహనీయులలో రంతిదేవుడు, కర్ణుడు ప్రముఖులు.

1. రంతిదేవుడు

రంతిదేవుడు దయ, దానం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహారాజు. ఒకసారి నలభై ఎనిమిది రోజుల ఉపవాసం తర్వాత భోజనం చేయబోతుండగా వరుసగా వచ్చిన అతిథులకు తన వద్ద ఉన్న ఆహారమంతా దానం చేశాడు. చివరకు తాగడానికి మిగిలిన కొద్దిపాటి నీటిని కూడా దాహంతో వచ్చిన ఒక చండాలునికి ఇచ్చాడు. తన ఆకలి, దాహాన్ని లెక్కచేయకుండా పరుల బాధను తొలగించడమే తన ధర్మమని భావించాడు. ఈ విధంగా రంతిదేవుడు నిస్వార్థ సేవాభావానికి ఆదర్శంగా నిలిచాడు.

2. కర్ణుడు

కర్ణుడు మహాభారతంలోని దానవీరుడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతని సహజ కవచకుండలాలను దానంగా అడిగినప్పుడు, అవి తన ప్రాణరక్షణకు అవసరమని తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా దానం చేశాడు. తన మాటను నిలబెట్టుకొని దానగుణాన్ని ప్రదర్శించాడు. అందుకే కర్ణుడు **"దానవీరశూర కర్ణుడు"**గా చిరస్మరణీయుడయ్యాడు.

ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న విషయాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా త్యాగం, దానం, పరోపకారం వంటి మానవీయ విలువల గొప్పతనాన్ని తెలుసుకున్నాను. రంతిదేవుడు ఆకలితో ఉన్నప్పటికీ తన ఆహారాన్ని ఇతరులకు పంచడం, కర్ణుడు తన ప్రాణరక్షణకు అవసరమైన కవచకుండలాలను కూడా దానం చేయడం ద్వారా నిస్వార్థ త్యాగానికి ఆదర్శంగా నిలిచారని గ్రహించాను. పరుల శ్రేయస్సు కోసం చేసిన త్యాగమే నిజమైన మానవత్వమని తెలుసుకున్నాను. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, దానగుణాన్ని అలవరచుకోవడం, సమాజ సేవలో భాగస్వామి కావడం ప్రతి మనిషి కర్తవ్యమని ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్నాను. ఈ మహనీయుల ఆదర్శాలను నా జీవితంలో ఆచరించాలని సంకల్పించాను.


సూక్తి:

"త్యాగం చేసినవాడు గొప్పవాడు; పరుల కోసం జీవించినవాడు మహనీయుడు."

 

నేనివి చేయగలనా?
1. త్యాగంలోని గొప్పదనాన్ని సొంతమాటల్లో చెప్పగలను.
అవును /కాదు
2. అపరిచిత పద్యాన్ని చదివి అర్థం చేసుకోగలను. సరైన జవాబులు గుర్తించగలను.
అవును /కాదు
3. నిత్యజీవితంలో జరిగిన ఒక సంఘటనలోని త్యాగభావాన్ని గుర్తించగలను.
అవును /కాదు
4. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తా పత్రికకు లేఖ రాయుము
అవును /కాదు

సూక్తి
త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల మానవజన్మ సార్థకమవుతాయి.ద్ఫజ్డ్

19, జులై 2023, బుధవారం

VII. 1. చదువు - డా. సిద్దెంకి

VII.  1. చదువు - డా. సిద్దెంకి 

 
చదవండి ఆలోచించండి – చెప్పండి

తే॥గీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయును
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.

1.ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?
జవాబు.ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.


2.ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?
జవాబు.చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.


3.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?
జవాబు.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.
4.చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?
జవాబు. చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.


నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.

పాఠ్య భాగ వివరాలు : ఈ పాఠం “కథాకావ్యం” (ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ట్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వా(తింశిక చతుర్థాశ్వాసంలోనిదీ కథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.



కవి పరిచయం:

కవిపేరు : కొఱవి గోపరాజు

పాఠ్యభాగం పేరు : చదువు

కాలం : 15వ శతాబ్దం

జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం

రచన : సింహాసన ద్వాత్రింశిక

తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక

విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.



I

ఆ.వె॥
భట్టి మంత్రి; సైన్యపాలి గోవిందచం

ద్రుడు; త్రివిక్రముడు పురోహితుడు; 

ఆ పురోహితునకు ఆత్మజుడగు కమ

లాకరుడన నొక అవివేకి గలడు.

ఆ.వె॥
ఆ కమలాకరుడు ఆ కమ

లాకర సాదృశ్యముగ జడాశయుడై, నన్ 

శోకము మదిని బొదలంగ, వి

వేకము పుట్టింప దండ్రి వెరవున దూజెన్.

కం॥
చుట్టములకు, తల్లిదండ్రుల

కు ఎట్టి యెడంబ్రియము నెరపనెడపని, చదువుల్ 

గట్టిగా నెరుగని పుత్రుడు 

పుట్టుట, కులమునకు తెగులు పుట్టుట చుమ్మీ.

కం॥
విను! ఉత్తమమగు పుట్టువు 

గనుపట్టెడు నట్టి రూపుగల మోదుగు భౌ, 

వును మూర్ఖుండును ప్రభలెడు 

వనమున, భవనమున తగిన వాసన గలదే.


II

  1. అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
  2. కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
  3. "చదువురాని పిల్లలు వంశానికి తెగులు" అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

కం॥
పరులకు, సోదరులకు, భూ

వరులకు కొనరాదు; సర్వవశ్యము. తానె

వ్వరికిచ్చిన గోటి గుణో

త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.


కం॥
పరభూమికి జనుచో ద

స్కరులకు నగపడదు; వ్రేగుగా దెచ్చట నె

వ్వరినైన హితులం జేయును; 

ధరలో మరి విద్య బోల ధనములు గలవే.

 

కం॥

గద్యముఁ, పద్యముఁ బెనుప గైకొనుటొండె, ధ్రువప్రబంధ సం 

పద్యముతోడౌట యొండె, మృదుభాషలన్ బ్రొద్దులు పుచ్చుటొండె, లో 

కోద్యమ లక్షణంబెరుగుదొండె, గడున్ భజియించుగాక; ఏ 

విద్యలు నేర్చనివాడైన పశువే అగుగాదే గణించి చూచినన్.


ఆలోచించండి – చెప్పండి

  1. తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
  2. "చదువు దొంగలకు కనిపించదు." – చర్చించండి.
  3. అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?

3

 

శా॥

సంగీతంబుఁ, కవిత్వతత్త్వమును, సౌజన్యంబు, భావంబు, స 

త్సాంగత్యంబు నెఱుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్; 

శృంగద్వంద్వములేని యెద్దతనము జెల్లున్; 

దృణంబాతడయ్యాంగీకంబున మేయు డాపసుల భాగ్యంబిచ్చటన్.


సీ|| అనుచు నెగ్గించిన నా కమలాకరుం 

                డభిమానియై తన యాత్మలోన,
విద్యలు నేర్చి వివేకినై కాని,ఈ
 

                జనకు వక్త్రము చూడననుచు వెడలి,

కాశ్మీరదేశంబు కడకేగి, యొక యోర 

                చంద్రకేతుండను సంజ్ఞ బరగు,
ఉత్తమ ద్విజున్ గొల్చియుండగా, నాతండు

                             క్రమమున సిద్ధసారస్వతంబు.


తే.గీ॥

కరుణ నొసంగిన నతడు సాంగంబుగాగ, 

నాల్గు వేదములును, కావ్యనాటకములు, 

దర్శనంబులు, నీతిశాస్త్రములు, దివిరి 

కలయ సంగీతసాహిత్యకళలు నేర్చి, 9


 వ. అభిజ్ఞుండై గురునానతి వడసి,

తిరిగి దేశవిశేషంబులన్ జూడం జరియించుచు...


ఆలోచించండి – చెప్పండి

  1. పశువులకు, మనుషులకు తేడాలేమిటి?
  2. కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు?
  3. కమలాకరుడు గురువుకు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు?


1.  విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి,

2 కమలాకరం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆవిధంగానే కమలాకరుడు జడాశయుడు ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్ధంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొదుకును వివేకిని చేయాలని ఈవిధంగా మందలించాడు.

3. చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు.

4. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగుపువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎం. మంచి రూపమున్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు.

5. పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చిన కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.

6. వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాద ఎక్కడనైనా ఎవ్వరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమై ధనం మరొకటి లేదు.

7. వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా ధ్రువాప్రబంధ సంపదను (సంగీత నాట్య సాహి జ్ఞానాన్ని) పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందా ఇవి ఏవీ చేయకుండా ఎవరిని ఎంత సేవించినా ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివా

8. సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనుల తోడి స్నేహం వీటి గ్రహించలేని వాడిని భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివా గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి.

9. తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువా కాని తండ్రి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీరదేశంలోని చంద్రకేతుడు అనే ఉత్త బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగా కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.

10. ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు. (ఈవిధంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఎవ్వరు నిందించినా కోపాన్ని తెచ్చుకోరాదు. దా ప్రేరణగా తీసుకొని ఎదగాలి అని పాఠ్యాంశ భావం).

ఆలోచించండి – చెప్పండి.

1.అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
జవాబు.అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.

ప్రశ్న 2.కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
జవాబు. కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.
3.“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.
4.తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు.
చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.
5.“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.
6.అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే 
.

ఇవి చేయండి

1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడంలేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళుకూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?


జవాబు.
అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు. మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.

(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ!

(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.

తానెవ్వరికిచ్చినఁగోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య

(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
జవాబు.
ధరలో మరి విద్యబోల ధనములు గలవే?

(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెలున్.

(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.

(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.

2. కింద పద్యాన్ని చదువండి. భావం రాయండి.

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గల్గున్

చదువగ వలయును జనులకు,

చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)

జవాబు. “చదువుకోనివాడు అజ్ఞాని యౌతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో”. అని ఈ పద్య భావం.


16, జులై 2023, ఆదివారం

X.1. దానశీలము - డా. సిద్దెంకి







దాన శీలము 

 




చదవండి – ఆలోచించి చెప్పండి

కర్ణుని పూజామందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇలా అన్నాడు.

సూర్యుడు:
"పుత్రా! కర్ణా! బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది, నాయనా! జాగ్రత్త!"

కర్ణుడు:
"తండ్రీ! ఇంద్రుడంతటివాడు రూపం మార్చుకొని 'దేహి' అని నా వద్దకు వస్తే నేను ఎలా కాదంటాను? ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఎటువంటి ఆపద వచ్చినా నేను దానం చేయకుండా ఉండను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తున్నాను. అయితే, దయచేసి నన్ను వారించవద్దు."

ప్రశ్నలు

  1. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి?
  2. కర్ణుని మాటలను బట్టి మీకు ఏమి అర్థమైంది?
  3. ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు?
  4. ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా? వారు ఎవరు?

పాఠం నేపథ్యం / ఉద్దేశం

బలి చక్రవర్తి విరోచనుని కుమారుడు, ప్రహ్లాదుని మనుమడు. అతడు తన శౌర్యం, శక్తి, సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అతని పాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని విడిచి వెళ్లగా, మరికొందరు వివక్షకు గురయ్యారు. ఈ విషయాన్ని దేవతలు మహావిష్ణువుకు తెలియజేయగా, ఆయన తాను వామనుడుగా అవతరించి వారి కష్టాలను తొలగిస్తానని అభయమిచ్చాడు.

కొంతకాలం తరువాత మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు. బలి చక్రవర్తి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు అక్కడికి వెళ్లి తనకు మూడు అడుగుల నేలను దానంగా ఇవ్వమని కోరాడు. బలి చక్రవర్తి వెంటనే అంగీకరించి మాట ఇచ్చాడు. అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వామనుని ఉద్దేశాన్ని గ్రహించి, బలిని దానం చేయవద్దని హెచ్చరించాడు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వాన్ని, దానధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం.

అదనపు సమాచారం :(పాఠ్యాంశ వివరణ:     ‘దానము’ అనగా త్యాగంఅడిగినది లేదనకుండా ఇవ్వడంఉచితంగా ఇవ్వడం మరియు ఇచ్చిన దానిని తిరిగి తీసుకోకుండా ఉండడం. శీలము’ అనగా గుణముస్వభావము మరియు మంచి ప్రవర్తన. దానశీలము”  అంటే  దానము  యొక్క  గొప్పదనం. దానశీలము అనే ఈ పాఠ్యభాగం ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని దానం చేయడం లోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. పురాణ ప్రక్రియకు చెందిన ప్రాచీన పద్యాన్ని పరిచయం చేస్తూ త్యాగాన్ని మరియు శీలాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈయబడిన పాఠం ఇది.

ప్రక్రియ పరిచయం:  పురాణాలు -18. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది సర్గంప్రతిసర్గంవంశంమన్వంతరంవంశాను చరితం’ అనేవి పురాణ లక్షణాలు.

విశిష్టత  బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినాహెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు.)

  పూర్వకథ/నేపథ్యం:    బలిచక్రవర్తి  తన  శక్తిసామర్థ్యాలతో  స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు.  ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా  కొంత  కాలానికి విష్ణువు  వామన అవతారం  ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు  బలిని  దానం  ఇవ్వవద్దంటాడు.

కవిపరిచయం:   దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతనామాత్యుడు.

కవి పేరు : పోతన (బమ్మెర పోతన)

కాలం: 15వ శతాబ్దం(1420 ప్రాంతానికి) చెందిన కవి. 

స్థలం: జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామం

తల్లి దండ్రులు: లక్కమాంబ, కేసన

బిరుదు: సహజ పండితుడు. 

అనువాదం: సంస్కృతంలోని భాగవతపురాణాన్ని తెలుగులోకి భావానువాదం చేశాడు. ఇది పన్నెండు స్కంధాల బృహద్రచన. (ఇందులో కొంతభాగం సింగన, గంగన, నారయలు పూరించారు). 

రచనలు: 1. వీరభద్ర విజయం, 

2.భోగినీ దండకం, 

3.నారాయణ శతకం 

పోతన రచనల్లో సుప్రసిద్ధమైనది భాగవతం.

 రచనాశైలి:  పండిత పామరజన రంజకం.

- కవి, రచనాశైలి గురించి...  

శబ్దలంకారాల సొగసు భాగవతంలో మధుర భక్తి తర్వాత తరాల వాళ్లకు ఆదర్శం. ఆయన పద్యాల్లోని ధారాశుద్ధి, భావస్పష్టత తెలుగువాళ్లకు పద్యాలపై మక్కువ పెంచింది. 

అందుకే గజేంద్రమోక్షం, శ్రీకృష్ణ లీలలు, ప్రహ్లాదచరిత్ర, రుక్మిణీ కళ్యాణం తదితర భాగాల్లోని పద్యాలెన్నో తెలుగువాళ్లకు కంఠస్థమైయాయి.

భాగవతంలోని అవతారిక పద్యాల్లో నుంచి కూడా ఒకటి రెండు పద్యాలైనా తెలియని తెలుగువారు ఉండరు.

 

పాఠం ద్వారా విద్యార్థులు గ్రహించాల్సిన ముఖ్యాంశాలు:-
1) పాఠం ఉద్దేశం
2) కథ (విషయం)
3) పద్యాల కంఠస్థం-ప్రతిపదార్థ తాత్పర్యాలు గ్రహించడం.
4) ముఖ్యాంశాల గురించి భిన్నకోణాలో అవగాహన
5) కవి, కవిశైలి గురించి వివరాలు
6) భాషాంశాలు

 

1) పాఠం ఉద్దేశం:- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఆడిన మాట తప్పకుండా ఉండడం; 

దానం గొప్పతనాన్ని గ్రహించడం, విద్యార్థుల్లో పెంపొందింపజేయడం లక్ష్యంగా ఈ పాఠం నిర్దేశించారు. 

ఈ ఉద్దేశం నెరవేరడానికి విద్యార్థులకు అవగాహన ఉండవలసిన అంశాలు.

ఆడిన మాట తప్పకుండా ఉండడం వల్ల సమాజంలో మనిషికి ఉండే గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, వ్యక్తీకరించాలి.

ఆడినమాట తప్పని చారిత్రక, ఇతిహాసిక, పౌరాణిక పురుషుల/వ్యక్తులకు సంబంధించిన కొన్ని అంశాలు దృష్టిలో ఉండాలి.

 ఉదా:- సత్యహరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, రంతిదేవుడు, సక్తు ప్రస్తుడు.గోవు (పులిబారిన పడినప్పుడు), భీష్ముడు, కర్ణుడు,   మొదలైనవారు.

దాన గుణంలో ప్రసిద్ధులైనవారి గురించి తెలుసుకుని ఉండాలి. శిబిచక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, వివేకానందుడు (బాల్యంలో), ప్రకాశం పంతులు, సంగం లక్ష్మీబాయి, ఆధునిక సమాజంలో మీకు తెలిసిన ఒకరిద్దరు వ్యక్తులు-వాళ్లు చేసిన దానాలు.

దాన గుణం ప్రత్యేకత-ఆధునిక కాలంలో దానాలు-రక్తదానం, అవయవదానం మొదలైన అంశాలపై అవగాహన.

2) కథ:పాఠ్యాంశానికి సంబంధించిన కథ-కీలకాంశాలు.

రాక్షసరాజైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు, ఉత్తమ గుణ సంపన్నుడు. అతని కుమారుడు విరోచనుడు. విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి.

బలిచక్రవర్తి మహావీరుడు. ఉత్తమ గుణాలు కలిగినవాడు. ఆడిన మాట తప్పని సత్యసంధుడు. దానం చేయడమనే వ్రతానికి కట్టుబడిన వాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయని వాడు.

బలి చక్రవర్తి ఉత్తముడైనప్పటికీ రాక్షసజాతికి నాయకుడు. అతని అండచూసుకుని రాక్షసులు దేవతలను, సాధుసత్పురుషులను హింసించే తమ సహజ గుణాన్ని మరింత వికృతంగా ప్రదర్శించేవారు. రాక్షసులకు దేవతలతో ఉన్న జాతివైరం వల్ల బలిచక్రవర్తి కూడా ఇంద్రున్ని స్వర్గం నుంచి తరిమేసి, ఇంద్రపదవిని అలంకరించాడు.

బలిచక్రవర్తిని ఓడించలేని దేవతలు రాక్షసుల వల్ల తాము అనుభవిస్తున్న బాధలను విష్ణుమూర్తికి తెలియజేస్తారు. విష్ణువు తాను వామనుడుగా అవతరించి, బలి చక్రవర్తిని స్వర్గం నుంచి తొలగించి, మేలు చేస్తానని వాగ్దానం చేస్తాడు.

అన్నమాట ప్రకారం వామనుడుగా మారి, నర్మదానదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి, తనకు మూడడుగుల నేల కావాలని యాచిస్తాడు విష్ణువు.

అతడు విష్ణువని, అడిగిన దానంలో మోసం ఉందని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి దానం ఇవ్వకూడదని, ఇస్తే బలిచక్రవర్తితో పాటు రాక్షసకుల వినాశనం, రాజ్యనాశనం సంభవిస్తుందని హెచ్చరిస్తాడు.

చుక్క పద్యాలు - ప్రతి పదార్థాలు:

మత్తేభం

I   I  U

U  I    I

U  I    U

I   I  I

U  U  U

I    U

I  U

కు ల మున్  

రా  జ్య  ము 

దే జ మున్ 

ని  లు  పు 

మీ  కు  బ్జుం  

డు  వి  శ్వం 

 భ  రుం

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం

                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

షార్ట్ కట్   మ సభ 1-14

    ప్రతిపదార్థాలు అన్వయ క్రమంలో రాయాలి. అన్వయ క్రమము అనగా భావము చెడకుండా క్రమంగా రాయడం. ఉదా కంటిన్ జానకి

జానకి = సీతను

కంటిన్ = చూసాను)


   మ.    కులమున్   రాజ్యము  దేజమున్    నిలుపు మీ కుబ్జుండు విశ్వం భరుం
             డలతిం బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండ ముం 
            గలడే మాన్ప నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
            వలదీ దానము గీనముం, బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!

వదాన్య + ఉత్తమా! = దాతల్లో శ్రేష్టుడా! (ఓ బలి చక్రవర్తీ)

కులమున్            =‌ వంశాన్ని 

రాజ్యము            = రాజ్యాన్ని 

తేజమున్            = తేజస్సును 

నిలుపుము         = కాపాడుము 

ఈ కుబ్జుండు       = ఈ పొట్టి వాడు

విశ్వంభరుడు = విశ్వంను భరింపగలిగే వాడు 

అలతిన్ + పోడు = ఇంత తక్కువతో పోడు

త్రివిక్రమ స్ఫురణ వాడై = త్రివిక్రముడంతటివాడై మూడు లోకములను ఆక్రమించ గలవాడై

 బ్రహ్మాండము = ఈ బ్రహ్మాండం అంతటినీ

 నిండున్      = వ్యాపిస్తాడు  

మాన్పన్      = నిరోధించగలవాడు

ఒకండు.       = ఒక్కడైనా 

 కలడు + ఏ   = ఉన్నాడా? (లేడు)

నా                  = నా (యొక్క) 

పలుకులు     = మాటలు 

కర్ణంబులన్  = చెవుల నిండా  

ఆకర్ణింపు       = విను 

దానము.       = దానం 

గీనము           = గీనము వంటివి

వలదు      ‌‌     = వద్దు 

ఈ                   = ఈ

వర్ణిన్              = బ్రహ్మచారిని (వామనుడిని)

పనుపమా     = పంపించవయ్యా

తాత్పర్యం: దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ,  రాజ్యాన్నీపరాక్రమాన్నీనిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరానా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.    బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు. 

తాను గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తున్నానని, ఎవరేది అడిగినా (ధనం, కోరిక, కీర్తి, పదవి) కాదనకుండా ఇస్తానని మాట ఇచ్చి, ఇప్పుడా వాగ్దానభంగం చేయలేనని అంటాడు బలిచక్రవర్తి.

అంతేకాదు, ఆడినమాట తప్పేవాళ్లు దుర్మార్గులకన్నా నీచులని, వాళ్లను భూదేవి భరించలేదని చెబుతాడు. పూర్వపు రాజులు ఎంత సంపాదించినా, అహంకారంతో విర్రవీగి, నామరూపాలు లేకుండా అంతమైపోయారని, శిబిచక్రవర్తి లాంటి సత్యసంధులు, దాన గుణ సంపన్నులూ ఇప్పటికీ కీర్తి పొందుతున్నారని అంటాడు.

ఇంకా, ప్రాణం పోయినా, నరకం ప్రాప్తించినా, సమస్త సంపదలూ, రాజ్యం నశించినా, వచ్చినవాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్లో ఎవ్వరైనా, తెలిసిన వాడైనా తాను మాట తప్పననీ ప్రకటిస్తాడు బలిచక్రవర్తి.

ఆ విధంగా ప్రకటించి, భార్య అయిన వింధ్యావళితో కూడి, ఆ వామనుని కాళ్లు కడిగి, ఆ నీళ్లు నె త్తిన చల్లుకుని ‘విష్ణుస్వరూపుడవైన బ్రాహ్మణోత్తమా! వేద ప్రామాణికంగా మూడడుగలనేలను నీకు దానం చేస్తున్నాను’ అంటూ వామనుడు కోరిన మూడడుగుల నేలను దానమిస్తాడు.

సర్వప్రాణులకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువుకు బలిచక్రవర్తి దానమీయగానే దిక్కులన్నీ బలిచక్రవర్తిని ప్రశంసించాయి.

2. అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యులకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనే.


13


సీ. నిజమానతిచ్చితి నీవు మహాత్మక!

మహిని గృహస్థధర్మంబు నిదియ

యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు 

నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు


 నర్థలోభంబున నర్థిఁ బొమ్మనుటెట్లు?

పలికి లేదనుకంటెఁ బాప మెద్ది

 ‘యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని

సత్యహీనుని మోవఁజాల' ననుచుఁ


తే. బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ 

సమరమున నుండి తిరుగకఁ జచ్చుకంటెఁ 

బలికి బొంకక నిజమునఁ బరఁగు కంటెఁ 

మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె


కం. ధాత్రిని హలికునకును సు 

క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం 

జిత్రముగ దాత కీవియుఁ 

బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే !

---------------------------

ఆలోచించండి-చెప్పండి

◆ శుక్రుడు బలిచక్రవర్తితో “వలదీ దానం"అని ఎందుకు హెచ్చరించాడో ఊ హించండి.

◆ ‘మానధనులు    ఎట్లా ఉంటారని భావిస్తున్నాను?

---------------------------------


II

శార్ధూలం  

U  U  U

I  I  U

I   U   I

I  I  U

U  U  I

U  U  I

U

 కా   రే  రా

జు  లు?  రా

జ్యముల్  గ    

లు  గ  వే?

గ  ర్వో న్న

తిం బొం ద

రే?

            1 వ అక్షరానికి 13 కి యతి మైత్రి 
     నాలుగు పాదములుండును 

శ్యామస 1-13,19

శార్దూలం, మసజసతతగ అనే గణాలుండును. నాలుగు పాదములు, ప్రాస నియమం కలదు. 

     

  శా.            కారే రాజులురాజ్యముల్ గలుగవేర్వోన్నతిం బొందరే?
                   బేరైనం గలదేశిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై 
                    వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరేభూమిపైఁ 
                   యీరే కోర్కులువారలన్ మఱచిరే యి క్కాలమున్భార్గవా!

   

  భార్గవా        = భృగు వంశ వారసుడా! ఓ శుక్రాచార్యా! 

                            (భార్గవుడు - భృగువు పుత్రుడుశుక్రుడు).

 రాజులు = రాజులు
కారు + ఏ =  (కాలేదా) అయ్యారు కదా
రాజ్యముల్ రాజ్యములు
గలుగవే-

కలుగవు + ఏ  కలిగి ఉన్నారు కదా!
గర్వ + ఉన్నతిన్ + పొందరు + ఏ

గర్వ              అహంకారముతో
ఉన్నతిన్      విర్రవీగుటను 
పొందరు+ఏ  పొందియున్నారు
వారేరీ - వారు    వాళ్ళందరు 
ఏరి                   ఎక్కడ ఉన్నారు?
సిరి - 

సిరిని       సంపదలను 
మూటఁగట్టుకొని - 

మూటగట్టుకొని కూడగొట్టుకొని
పోవంజాలిరే     తీసుకెళ్ళగలిగిరాలేదు 
భూమిపైన్ + పేరైనన్ + కలదే 
భూమి             నేలపైన 
పేరైనన్           కనీసము పేరైన
కలదే              ఉన్నదాలేదు
శిబిప్రముఖులుంబ్రీతిన్ - 

శిబి                 శిబిచక్రవర్తి
ప్రముఖులున్  మొదలగువారు
ప్రీతిన్ కోరి
యశఃకాములై – 
యశః             కీర్తి
కాములు        కోరువారు
                  అయ్యి
యీరే-ఈరే     ఇవ్వలేదా 
కోర్కులు         కోరెవారి కోరికలు  
వారలన్         వారిని
యిక్కాలమున్ - 

 ఇప్పటి; 
కాలమున్   కాలమునందును; 
మఱచిరే   మరచిపోయారాలేదు; 

    తాత్పర్యం:  ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదావారిని ఈనాటికీ లోకం మరువలేదు  కదా.


5. ఉడుగని క్రతువుల వ్రతములఁ 
బొడగనఁ జననట్టి పొడవు పొడవునఁ గుఱుచై
 యడిగెడి నఁట; ననుబోఁటికి 
నిడరాదె మహానుభావ ! యిష్టార్థంబుల్




మత్తేభం

I   I   U

U    I    I

U   I    U

I   I  I

U  U  U

U  U

I  U

ని  ర  యం

బై    న,   ని

బం  ధ మై

,   ధ   ర

ణీ   ని  ర్మూ

ల  నం బై

,  దు  

, భ ర న మ య వ అనే గణాలుండడం వలన మత్తేభ పద్యం

                    1 వ అక్షరానికి 14 కి యతి మైత్రి 

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

షార్ట్ కట్   మ సభ 1-14, 20

 

మ  నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు   
 ర్మరణంబైనఁ, గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;     
హరుఁ డైనన్, హరి యైన, నీరజభవుం భ్యాగతుం డైన నౌఁ;           
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

ప్రతిపదార్థం:
ధీవర్యా  =  బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్యా !

నిరయంబైన - 

నిరయంబు నరకము దాపురించినా

ఐనన్          అయినా సరే

నిబంధమైన - 

నిబంధము కట్టివేయబడుట (కారాగార బంధనం)

ఐనన్          జరిగినా సరే 

ధరణీ నిర్మూలనంబైన - 

ధరణీ              రాజ్యము

నిర్మూలనంబు నాశనము

ఐనన్             అయినా సరే 

దుర్మరణంబైనఁ గులాంతమైన - 

దుర్మరణంబు దుర్మరణము

ఐనన్            సంభవించినా సరే

కుల               =  వంశము 

అంతము.     నాశనము

ఐనన్            జరిగినా సరే

నిజమున్     సత్యమునే

రానిమ్ము      ఒప్పుకొనెదను 

కానిమ్ము పో - 

కానిమ్ము      జరిగెడిది జరగ నిమ్ము

పో          భయం లేదు 

హరుఁ డైనన్ - 

హరుడు శివుడు

ఐనన్    అయినా

హరియైన - 

హరి    విష్ణువు

ఐనన్  అయినా

నీరజభవుండభ్యాగతుం డైన నౌఁ దిరుగన్ - 

నీరజభవుండు = (నీటిలో పుట్టిన కమలం నుండి ఉద్భవించిన) బ్రహ్మదేవు డయినా 

అభ్యాగతుండు   అతిథిగా వచ్చినవాడు

ఐనన్                 అయినా

                       సరే

వినుమా వినుము

వేయి = వేయి (పెక్కు ) మాటలు 

ఏటికిన్   దేనికి

నాదు  నా యొక్క

జిహ్వ = నాలుక

తిరుగన్ = వెనుతిరుగుట

నేరదు = చేయలేదు

తాత్పర్యం:ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనానాకు దుర్మరణం  వచ్చినా సరేనా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడువిష్ణువుబ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).

ముఖ్య వివరణలు : దశ దిక్కులు= పది దిక్కులు- దిక్కులు దిక్పాలకులు:- 

    1.తూర్పు-ఇంద్రుడు

    2.పడమర-వరుణుడు

    3.ఉత్తరము-కుబేరుడు

    4.దక్షిణము-యముడు,

    5.ఈశాన్యం-శివుడు

   6. నైరృతి-నిరృతి

   7.వాయవ్యము-వాయువు

   8. ఆగ్నేయము-అగ్ని

   9. ఆకాశం-బ్రహ్మ

   10.భూమి-శేషుడు.

పంచ భూతాలు= పృథివి(భూమి)ఆపస్సు (నీరు)తేజస్సు(అగ్ని)వాయువు(గాలి)ఆకాశం. (నీరు నిప్పు గాలి భూమి ఆకాశం పంచ భూతాలు. భూతము అనగా ప్రాణము. పంచ భూతాలు అనగా ఐదు ప్రాణాలు.)


------------------------------------------------------------------------

ఆలోచించండి-చెప్పండి

◆ "తిరుగన్ నేరదు నాదు జిహ్వ” అన్నాడు కవి. దీనిని బట్టి మీకేం తెలిసింది?

◆ ఎదుటివారు అడిగిన దానిని ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది? మీ అనుభవాలు చెప్పండి?

‘పొడవు పొడవున గుఱుచై' అని కవి ఎవరిని ఉద్దేశించి, ఎందుకట్లా అని ఉంటాడు?ఆటాడు?

-------------------------------------------------------

III

 బ్రదుకవచ్చుఁగాక బహుబంధనములైన 

వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక 

జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక 

మాట దిరుగలేరు మానధనులు.


వ. అయ్యవసరమున

ఆ.వె.

దనుజలోకనాథు దయిత వింధ్యావళి 

రాజవదన మదమరాళ గమన 

వటుని కాళ్లు గడుగ వర హేమఘటమున 

జలముఁ దెచ్చె భర్త సన్న యెఱిగి.


వ. అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె.


క. రమ్మా! మాణవకోత్తమ! 

.లెమ్మా! నీ వాంఛితంబు లే దన కిత్తుం 

దెమ్మా! యడుగుల నిటు రా 

నిమ్మా! కడుగంగవలయు నేఁటికిఁ దడయన్?


క. సురలోక సముద్ధరణము 

నిరత శ్రీకరుణ మఖిల నిగమాంతాలం 

కరణము భవసంహరణము 

హరిచరణము నీటఁ గడిగె నసురోత్తముఁడున్.


2. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరం దేశ కాలాది పరిగణనంబు సేసి.

శా. 'విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే 

ద ప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి' యంచుం గ్రియా 

క్షి ప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి 'బ్ర

 హ్మ ప్రీత'మ్మని ధారవోసె భువనం బాశ్చర్యముం బొందఁగన్.


బలి చేసిన దానమునకు

నళినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటం

 గలకలమని దశదిక్కులు 

బళిబలళి అని పొగడె భూత పంచకమనఘా

----------------------------------------------------------------------------

ఆలోచించండి- చెప్పండి

మాట విరగలేరు మానధనులు అన్న మాటను మీరు సమర్థిస్తారా ఎందుకు 

బలిచేసిన దానాన్ని దిక్కులు పొగిడిన వై అని కవి చెప్పిన దానిని బట్టి మీరేం గ్రహించారు 

------------------------------------------------------------------------


4. ముఖ్యాంశాల గురించి భిన్నకోణాల అవగాహన:-


ఆశించే కీలకాంశాలు:-

1) శుక్రుడు బలిచక్రవర్తి దానాన్ని అడ్డుకోవడం.

2) మానధనుల లక్షణాలు

3) కీర్తి సంపాదించడం గొప్పవిషయమా?

4) ‘తిరుగన్ నేరదు నాదుజిహ్వ’ అంటే

5) శిబి గొప్పదాత-ఎందుకు?

6) అడిగింది ఇవ్వడంలోని తృప్తి-అనుభవాలు

7) పొడవు-కురుచ పదాల వెనుకున్న అర్థం

8) మానధనులు మాట తిరుగకుండడం

9) దిక్కులు పొగడడం అంటే

పై ప్రశ్నలు-అంశాలను గమనించినప్పుడు.. విద్యార్థులు ఈ పాఠం ద్వారా ఏఏ అంశాలను అవగాహన చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? అనుభవాలు ఎలా జోడించాలి అనే విషయాలు స్పష్టమవుతాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకొని, తమ భావనలు (స్పందనలు) అక్షర రూపంలో స్పష్టంగా వ్యక్తీకరిస్తే ప్రశ్నలన్నిటికీ/ ఏ ప్రశ్నకైనా జవాబు రాయగలిగే సామర్థ్యం కలుగుతుంది.

ఆ ప్రశ్నల విశ్లేషణలో ఏర్పడే భావనలు....

పాఠంలో 3పాత్రలు: 1. శుక్రాచార్యుడు, 2. బలి (బలి భార్య వింధ్యావళి), 3. వామనుడు 

గుర్తుచేసుకున్న పాత్రలు: 

భూదేవి బ్రహ్మ తో చేసిన వాగ్దానం (ఎవరినైనా భావిస్తాను కాని పలికి తప్పిన వాన్ని కాదు.

రైతు పండించే పంటకు : మంచి పొలం, నీరు, నాణ్యమైన విత్తనాలు

రాజులు _శిబిచక్రవర్తి


శుక్రాచార్యుడు

బలికి కర్తవ్య బోధ - హితబోధ "కులమున్......." పద్యం యొక్క సారాంశం.

రాక్షసకుల గురువుగా తన జాతిని, ఆ జాతికి నాయకుడైన బలిచక్రవర్తిని కాపాడుకోవడం శుక్రాచార్యుని బాధ్యత.

వంచనతో విష్ణువు బలిచక్రవర్తిని, రాక్షసజాతిని నాశనం చేయడానికి వచ్చిన విషయం గ్రహించిన శుక్రుడు ఆ నిజం తెలిపి తన వాళ్లను కాపాడుకునే కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది సమర్థనీయం.

బలి శుక్రాచార్యునికి జవాబు: కారే రాజులు

మానధనులంటే గౌరవమే సంపదగా కలిగిన వారు. అంటే పరువు మర్యాదల కోసం జీవించే వాళ్లు. వీళ్లు గౌరవానికి హాని కలిగించే ఏ పనినీ సమర్థించరు. తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడితే ప్రాణాలైనా వదులుకుంటారు. 

నీతి, నిజాయితీగా జీవించడం, మాటకు కట్టుబడి ఉండడం, ఎవరినీ యాచించకుండా ఉండటం, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలనుకోవడం, తగని పనులు చేయకుండా ఉండడం వంటి లక్షణాలు వీళ్ల సహజసిద్ధమైన గుణాలు.

కీర్తి సంపాదించడం నిజంగా గొప్ప విషయమే. ఈ లోకంలో ధనం చాలామంది సంపాదిస్తారు. నాయకత్వాన్ని కొందరు సంపాదిస్తారు. కాని కీర్తిని సంపాదించే వాళ్లు కొందరే ఉంటారు. అది తేలికగా లభించేదికాదు. ఎంతో అంకితభావం, నియమబద్ధమైన జీవితం, నిరంతర కృషి, నీతి-నిజాయితీ, సహనం, ఔదార్యం వంటి ఉత్తమ గుణాలతో ప్రవర్తించే వాళ్లే కీర్తి సంపాదించగల్గుతారు.

    ‘జిహ్వ తిరుగనేరదు’ అంటే ‘ఆడినమాట తప్పను’ అని అర్థం.

ఒక పావురాన్ని కాపాడడం కోసం ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడ్డ శిబిచక్రవర్తి నిజంగా గొప్పదాత.

ఎవరైనా ఏదైనా అడిగితే-దాన్ని ఇవ్వడంలో ఎంతో తృప్తి ఉంటుంది (విద్యార్థుల వ్యక్తిగతానుభవాలు జోడించాలి)

పొడవు-అంటే గొప్ప, శ్రేష్ఠత్వం అని అర్థం. దానికి వ్యతిరేక పదం కురుచ-ఈ పదానికి అల్పం, తక్కువ అనే అర్థాలున్నాయి. శ్రేష్ఠుడైన విష్ణువు తనను తాను అల్పునిగా చేసుకొని బలిచక్రవర్తిని దానం అడగడం అల్పత్వానికి ప్రతీక కదా!

‘దిక్కులు’ అనేవి అమూర్త పదార్థాలు. అంటే కనిపించనివి. కనిపించని దిక్కులు బలి చక్రవర్తిని ఎలా పొగుడుతాయి? దీని అర్థం దిక్కులలోని సమస్త ప్రాణులూ ఆ మహనీయుడిని పొగిడాయని.

పాఠం ద్వారా విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాలు:- 

II వ్యక్తీకరణ సృజనాత్మకత:

అ)'ఈ కుబ్జుండలతింబోడు' అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?


II. వ్యక్తీకరణ - సృజనాత్మకత
కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.
అ ఈ కుబ్జుడు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది దానితో మీరు ఏకీభవిస్తారా?

జ. కుబ్జుండు అనగా పొట్టివాడు. పొట్టివాడైన వామనుడు తానడిగిన కొద్దిపాటి ఆ మూడడుగుల నేలతో వెళ్ళడని, ఆ మూడడుగులతోనే మూడు లోకాలను కొలుస్తాడని, బ్రహ్మాండమంతా వ్యాపిస్తాడని, బలి చక్రవర్తి రాజ్యాన్ని, మొత్తం స్వాధీనం చేసుకుంటాడని శుక్రాచార్యుడు చెప్పిన మాటల్లోని సారాంశం. అందుకే శుక్రుడు బలి చక్రవర్తిని, అతని వంశాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకోవాలని ఉపదేశించాడు. రాక్షస వంశ గురువైన శుక్రుడు రాక్షస రాజైన బలిని కాపాడాలని భావించాడు. అందుమూలంగా నేను శుక్రుని మాటలతో ఏకీభవిస్తాను.

ఆ). హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు?


జ. హాలికుడు అనగా రైతు. రైతు సంతృప్తిగా ఉండాలి అంటే సారవంతమైన పొలము ఉండాలి నాణ్యమైన విత్తనాలు లభించాలి. ప్రభుత్వమే వడ్డీ రహిత అప్పును అందించాలి. సాగునీరు సరిపెడంతా అందించాలి. యంత్రాలనుఙగ కల్పించాలి. సకాలంలో ఎరువులు అందజేయాలి. పొలంలో పనిచేసేందుకు చౌకగా కూలీలు దొరకాలి. 

పొలంలో పనిచేసిన కూలీల కూడా ఉపాధి పని భాగం కల్పించాలి. గిట్టుబాటు ధర ఉండాలి.

మార్కెట్ సదుపాయం ఉండాలి.సకాలంలో డబ్బులు అందజేయాలి.

ఇ) సిరి మూటగట్టుకొని పోవంజాలిరే అనడంలో బలి చక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది ?

జ. పూర్వకాలంలో సిరి సంపదలతో తులతూగిన రాజులు ఎందరో ఉన్నారు. వారికి రాజ్యాలు ధనధాన్యాలు లెక్కకు మించిన సౌకర్యాలు, విలాసాలు ఉన్నాయి. వారు మరణించినప్పుడు వారు పరలోకానికి వెళ్ళుతూ తాము సంపాదించిన ధనాన్ని తమ వెంట తీసుకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరు సంపాదించినా చనిపోయే రోజు సిరిసంపదలను తీసుకొని వెళ్లలేరు. సంపదలు అశాశ్వతం. మనుషులు శాశ్వతంగా ఉండాలి అంటే వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టతలే శాశ్వతంగా నిలుస్తాయని బలి చక్రవర్తి మాటల్లోని ఆంతర్యం.

ఈ) 'ఆడిన మాట తప్పకూడదు' ఎందుకు?

మనుషులు ఎవరైనా ఆడిన మాట తప్పకూడదు. పూర్వం భూదేవి చెడ్డ పని చేసిన వాడైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని నేను మోయలేను అని బ్రహ్మతో చెప్పిందట. మందుకు పత్యం మాటకు సత్యం అనే నానుడి లోకంలో సామెతగా నిలిచిపోయింది. తాను అన్న మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమాన దానులైన వారికి ఉత్తమ మార్గం. అభిమాన దనులు మాట తప్పరు. సత్యవాక్యం వల్ల పుణ్యం లభిస్తుంది. సత్యం మాట్లాడే వారికి స్వర్గాది పుణ్య లోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడిన మాట తప్పకూడదు.


2.అ) నేటి సమాజానికి దానగుణంగా వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.

జ. నేటి సమాజానికి దానగుణంగాల వ్యక్తుల అవసరం:

లక్షాధికారైన లవణం కానీ మెరుగు బంగారంబు మింగబోడు

నేటి సమాజంలో ధనవంతులు, పేదవారు, కడుదరిద్రులు ఉన్నారు. ధనవంతులలో పరిశ్రమాధిపతులు, మహాసంపన్నులు ఉన్నారు. వారి వద్ద ధనం మూలుగుతుంది. వారు ఆ ధనాన్ని వివిధ బ్యాంకుల్లో దాస్తున్నారు. తమ సంతానానికి వారసత్వంగా ఇస్తున్నారు. సమాజంలో ఎందరో పేదవారికి కట్టుకోవడానికి, బట్ట తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేదు. త్రాగడానికి సరైన మంచినీరు దొరకని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ధనవంతులు తమ దాతృత్వ గుణాన్ని చాటుకోవడానికి బీదవారికి వివిధ మౌలిక వసతులను కల్పించవలెను. వారికి మంచినీటి సదుపాయాలు మరుగుదొడ్లు, విద్యా వైద్య సౌకర్యాలను అందించాలి.

మంచి విద్యాలయాలు వైద్యశాలలు ప్రారంభించి బీదవారికి సాయపడాలి. ఆదాయం  ఎంత దాచినా' వారు చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని తమ వెంట తీసుకెళ్ళు లేరు. అక్రమార్గంలో కూడా పెట్టిన సొమ్మును ఈ డి, సి బి ఐ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆస్తిని జప్తు చేయకముందే బీదవారికి దానధర్మాణ రూపం లో అందజేయడం అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించినట్లు అవుతుంది.

కాబట్టి ధనవంతులు బిల్గేట్స్ ల విప్రోధిపతి ప్రేమ్ జీల టాటా బిర్లాల వలె తన సొమ్మును దానధర్మకార్యాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా సంతృప్తి ఆనందం కలుగుతాయి. ఎదుటివాడు ముఖంలో సంతోషం వెల్లి విరిస్తే అదే స్వర్గము. చాలామంది ధనవంతులు సహాయం చేసిన వారు ఉన్నారు.  వారి మార్గంలో అనేకమంది సాయం చేసి సమాజంలోని ఒరిదుడుకులను తారతమ్మ భేదాలను తొలగించవలసిన అవసరం ఉంది.

 దానశీలము’ సారాంశం:   శుక్రాచార్యుడు – దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడుఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.

     అప్పుడు బలిచక్రవర్తి…. ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరారాజ్యాలు లేవావారేమైనా మూటగట్టుకొని పోయారాఅడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది.

        ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినాబంధనం ప్రాప్తమైనాఈ భూమండలం అదృశ్యమైనానాకు దుర్మరణం వచ్చినానా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువుశివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.

     ఎన్ని కష్టాలకు గురైనాపేదరికం వచ్చినామరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూపంచభూతాలు బళి బళి” అని పొగడాయి. 

3 సత్యవాక్కు, దానగుణం ఆవశ్యకత ఆధారంగా సూక్తులు-నినాదాలు:-
సూక్తి-అంటే మంచిమాట: నినాదం అంటే నినాదించేది అని అర్థం. నినాదాలు ఉద్యమాల్లో, ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో ఉపయోగిస్తుంటారు.

 ఉదా:- సూక్తులు:-

ఆడి తప్పకు - ఇచ్చి దెప్పకు  

పలికి బొంకకు - ఇచ్చి పుచ్చుకోకు

సత్యమే సర్వమత సారం

సత్యమే ధర్మం

సత్యం సుకృతము, అసత్యము పథకం

. మనిషిని మాధవుడుగా నిలబెట్టేశక్తి ‘సత్యం’.

 దయగల హృదయమే దేవాలయం.

. సత్యమే జీవనం! అసత్యమే మరణం!

         . దాతృత్వాన్నే పాటించు!

                                పదికాలాలూ జీవించు!!

------------------------------------------------- 

బలి స్వభావంగురించి రాయండి.

బలి దానం చేయడంలో గొప్పవాడు

బలి చక్రవర్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు

దానం చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను ఆటంకాలని ఎదుర్కోగలడు

------------------------------------------------------------


III భాషాంశాలు

పదజాలం 
సొంత వాక్యాలు 
పలికి లేదనుట= మాట తప్పడం
 నేను పలికి లేదనను.
 కురుచగుట = పొట్టి అగుట
నా చొక్క మా తమ్మునికి కురుచగయ్యింది
చేతులొగ్గు= యాచించడం 
నేనెవరికీ చేతులొగ్గను


2. వ్యుత్పత్యర్థాలు:
నీరజభవుడు -  నీటిలో నుండి పుట్టిన కమలం నుండి జన్మించిన వాడు (బ్రహ్మ)
త్రివిక్రముడు - ముల్లోకాలను జయించి  ఆక్రమించిన వాడు (విష్ణువు)

3. సమానార్థాలు లేదా పర్యాయపదాలు
జలము : నీరు, సలిలం, ఉదకం.
యశః : కీర్తి, ప్రఖ్యాతి.

4. ప్రకృతి వికృతులు:
సిరి - శ్రీ 
విష్ణువు - వెన్నుడు 
ధర్మం - దమ్మం 
బ్రహ్మ - బమ్మ

5. నానార్ధాలు రాయండి
కులము : జాతి, వంశము, శరీరము, ఇల్లు.
క్షేత్రము : వరిమడి, భార్య, భూమి, శరీరం, తీర్థము, పుణ్యస్థలం
హరి:  విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం.
చిత్రము: చిత్తరువు, బొమ్మ, ఆశ్చర్యం, అద్భుత రసం.

వ్యాకరణాంశాలు:
గర్వోన్నతి = గర్వ + ఉన్నతి = గుణ సంధి
అభ్యాగతుడు = అభి + ఆగతుడు = యణాదేశ సంధి 
వదాన్యోత్తముడు = వదాన్య + ఉత్తముడు = గుణ సంధి
అణు+ ఆయుధాలు - యణాదేశ సంధి.

సమాస పదాలకు విగ్రహ వాక్యాలు సమాసాల పేర్లు

జీవధనములు - జీవమును, ధనమును - ద్వంద్వ సమాసము. 
మూడు అడుగులు - మూడు సంఖ్య గల అడుగులు - ద్విగుసమాసం
దశ దిక్కులు - దశ సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము 
భూతప్రేతములు - భూతమును, ప్రేతమును - ద్వంద్వ సమాసము


ఆ + చోట

ఆ +చోట

----------------------2 వ సూత్రం 
అచ్చోటు --------------------- 3 వ సూత్రం 
త్రికములు అనగా : ఆ, ఈ, ఏ

 1) ఆ, ఈ, ఏ అనే సర్వనామములు త్రికం అనబడుతాయి. 

2) త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. 

3) ద్విరుక్తంబగు హల్లునకు (హల్లు పరమైనపుడు) ఆచ్ఛికమైన దీర్ఘమునకు హ్రస్వంబగు 



పాఠం-అదనపు అంశాలు:-

సూచనలు : ప్రతి పదార్థం రాసే విద్యార్థులు అంవ్యక్రమమ్ పాటించాలి.

ఒక పాఠం అధ్యయనం చేసిన తర్వాత ఆ పాఠాన్ని పిల్లలు ఎంతమేర అర్థం చేసుకున్నారో, ఆ పాఠం ద్వారా భాషా సాహిత్యాంశాలపై వాళ్ల అవగాహన ఏ మాత్రం పెంపొందిందో, నిజజీవితానికి ఆయా అంశాలను ఎంత సమర్థంగా వినియోగించుకోగలరో తెలుసుకోవడానికి (అంచనా వేయడానికి) పాఠం చివర ‘ఇవిచేయండి’ అనే పేరుతో అభ్యాసాలు కల్పించారు. వాటన్నిటినీ పిల్లలు వ్యక్తిగత సామర్థ్యంతో పూర్తిచేయాలి. అవి సక్రమంగా సాధించగలిగితే, పరీక్షలో ఎటువంటి ప్రశ్నలకైనా అవలీలగా జవాబులు రాయగలరు.

   1) రక్తదానం-అవయవదానం-ప్రాధాన్యత:-

దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు మన దగ్గరున్నా ఏ సంపదనైనా, వస్తువునైనా ఇవ్వడం.

అనాదిగా అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం, ద్రవ్యదానం మొదలైన దానాలను చేస్తున్నారు మనపూర్వులు. ఆ సంప్రదాయం ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం అభివృద్ధి చెందిన నేపథ్యంలో మానవుడు సృష్టికి ప్రతిసృష్టి చేసే స్థాయికి చేరుకుంటున్నాడు. ప్రాణ ప్రతిష్ట చేయడం మినహా, ప్రాణమున్న మానవున్ని మామూలు వ్యక్తిగా మనగలిగేటట్లు చేయడంలో మనిషి విజ్ఞానం చాలా వరకు సఫలమమైంది. ఈ ప్రయత్నంలో భాగంగానే మానవుల రక్తాన్ని, అవయవాలను కూడా ఒకరి నుంచి మరొకరికి వినియోగించే శాస్త్రపరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు. పర్యవసానంగా రక్తదానం, అవయవదానం ప్రాముఖ్యత, గుర్తింపూ పెరిగాయి.

రక్తదానం:-    

రక్తం-మనిషిని సజీవంగా ఉంచి జీవనక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పతుంది. సగటున ప్రతి మనిషి శరీరంలోనూ 200 ఔన్సుల రక్తం ఉంటుంది. రక్తం ఆక్సీజన్(ప్రాణవాయువు)ను శరీర భాగాలన్నిటికీ అందజేస్తుంది. జీర్ణమైన ఆహారాన్ని శక్తిగా మార్చి శరీరమంతటా వ్యాపింపజేస్తుంది. రక్తం తనంతటతాను గడ్డ కట్టుకునే శక్తిని కూడా కలిగి ఉండి కొంతమేర రక్త స్రావాన్ని అడ్డుకుంటుంది. అందుకే రక్తం మనిషి శరీరంలో అత్యంత కీలకమైంది.

ప్రమాదాలు జరిగినప్పుడు; శస్త్రచికిత్సలు చేసిన ప్పుడు; రక్తం పూర్తిగా పాడైపోయినప్పుడు; కిడ్నీలు, కాలేయం వంటివి పని చేయడం మానేసినప్పుడు రక్తమార్పిడి అవసరమవుతుంది.

ఒక మనిషి ఒకసారి 8ఔన్సుల రక్తాన్ని ఇవ్వవచ్చు. ఈ 8 ఔన్సుల రక్తం రెండురోజుల్లో మళ్లీ సమకూరుతుంది. అందుకే ఆరోగ్యవంతులైనవారు వీలైనన్ని సార్లు రక్తదానం చేయవచ్చు.

మనిషి ప్రాణాన్ని కాపాడే రక్తం దానం చేయడమంటే ప్రాణదానం చేసినట్లే. ఈ విలువ గ్రహించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్త నిధులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి.

అందుకే ఆధునిక కాలంలో రక్తదానం ఎంతో విలువైంది. పుణ్య ప్రదమైంది. మానవతా సదృశమైందని అందరూ గ్రహించాలి.

అవయవదానం:-

మనిషి శరీరంలోని అంతరావయవాల్లో గుండె, మూత్రపిండాలు (కిడ్నీలు), కళ్లు, కాలేయం వంటివి ఇటీవలి కాలంలో మార్పిడి చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడడం, చూపు నివ్వడం, దీర్ఘ రోగాల బారి నుంచి కాపాడటం వంటి పుణ్యప్రదమైన కార్యక్రమాలు అందరి మన్ననలనందుకుంటున్నాయి.

మనిషి చనిపోయిన తర్వాత ఉపయోగపడని ముఖ్యమైన అవయవాలను శరీరం స్పందించడం మానిన సమయంలో, మెదడు నియంత్రణ పూర్తిగా కోల్పోయిన (బ్రెయిన్ డెడ్) సందర్భంలో గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయం వంటివి తీసి, నిర్ణీతకాలంలో ఇతరులకు అమర్చే వ్యవస్థ ఉంటుంది. ‘కిడ్నీ’ బతికున్నప్పుడు కూడా ఒకరి నుంచి మరొకరికి మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పిడి కార్యక్రమం అవయవదానం చేసే వ్యక్తుల లేదా వాళ్లబంధువుల పూర్తి అంగీకారం, సహకారంతోనే జరుగుతుంది.

దానాలన్నింటి ద్వారా మేలు జరుగుతుంది కాని, రక్తదానం, అవయవదానం వల్ల పరోక్షంగా ప్రాణదానం జరుగుతుంది. అందుకే ఇవి అన్ని దానాల్లోనూ విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి.

ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచి, మానవ శ్రేయస్సుకు, సంక్షేమానికి తోడ్పడే రక్తదానం, అవయవదానం కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వం, ప్రచారసాధనాలు ముందుకు రావాలి.

    2) రైతుకు తృప్తినీయగల వసతి సౌకర్యాలు:-

అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా పేరుగాంచిన రైతు తృప్తిగా ఉంటేనే అందరికీ ఆరోగ్యం, ఆనందం. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మేధావులు, వ్యాపారులు, దళారీలు సహానుభూతితో వ్యవహరించి, వాళ్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి.

    సకాలంలో సాగునీరు, తాగునీటి వ్యవస్థను కల్పించడం; అంతరాయం లేని విద్యుత్ సరఫరా; మేలిరకం విత్తనాలు; ఆధునిక వ్యవసాయ పరికరాలు; సబ్సిడీమీద ఎరువులు, విత్తనాలు; అధికోత్పత్తికి అవసరమైన విజ్ఞానం, అవగాహన; ఉత్పత్తి చేసిన సరుకును తరలించే రవాణా వ్యవస్థ; ఉత్పత్తులకు తగిన ధర; ధర పలుకు సమయంలో మద్దతు ధర; ప్రకృతి బీభత్సం నుంచి ధాన్యాన్ని కాపాడుకునే గిడ్డంగులు తదితర వసతి సౌకర్యాలుంటే రైతులు తృప్తిగా జీవించగలుగుతారు.

3) సిరిమూట గట్టుకొని పోవడం:-

అంటే సంపాదించిన ధనాన్ని మరణానంతరం వెంటతీసుకొని పోవడం. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు. భౌతికమైన ఏ సంపదనూ తన వెంట తీసుకుని పోలేరు. అందుకే సంపాదించిన ధనాన్ని ప్రజలకు మేలు చేయడానికి వినియోగించాలి. అప్పుడు ధనం స్థానంలో పుణ్యం అంటే ‘చేసిన మేలు’ మిగులుతుంది. తన గురించి తాను ఆలోచించకుండా, తనదనుకున్నదంతా పరులకోసం నిస్సంకోచంగా ఇచ్చిన త్యాగధనులు చరితార్థులై చరిత్రలో నిలిచిపోతారు. అందుకే పోయేటప్పుడు ఎవరూ సిరిమూట గట్టుకొని పోలేరన్న వాస్తవం వ్యాప్తిలోకి వచ్చింది.

    4) ఆడినమాట తప్పకుండా ఉండడం:-

అంటే మాటంటే దాన్ని తు.చ తప్పకుండా నెరవేర్చడం. వాగ్దానం తప్పకూడదన్నమాట. దీన్నే మాటమీద నిలబడడం అంటారు. అలా మాటమీద నిలబడే వాళ్లకు ఇంట బయటా గౌరవమర్యాదలుంటాయి. కాని, ఆడినమాట తప్పినవాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లనెవ్వరూ నమ్మరు. ఎంతటి గొప్పస్థానంలో ఉన్నా చులకనైపోతారు. సొంతమనుషులు కూడా వాళ్లను తేలికగా తీసుకుంటారు. సమాజం నుంచి, బంధువుల నుంచి సరైన సహకారం లభించదు. అవకాశం వస్తే అల్పులు కూడా అవమానించడానికి సాహసిస్తారు. అనుకున్న పనులు నేరవేరవు.

మానధనులు ఎలా ఉంటారు?

మానధనులైన వాళ్లు మాటతిరుగరు-అంటే ప్రాణం పోయినా ఆడినమాట తప్పరు అని భావం. మానధనులు,యుద్ధంలో వెనుదిరగాకుండా వీరమరణం పొందుతారు. వారు మాటకు కట్టుబడి సత్యంలోనే బ్రతుకుతారు. తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్తితి ఏర్పడితే ప్రాణాలైన వదులుకుంటారు. నీతి ,నిజాయితిగాా జీవించడం,మాటకు కట్టుబడి వుండడం, ఎవరిని యాచిoచకుండా వుండడం,వంటివి వీరి సహజసిద్దమైన గుణాలు.

దానగుణం కలిగిన వ్యక్తుల అవసరం

సమాజంలో ఏకాలంలోనైనా పేదలు, ఉపేక్షితులు, బాధితులు ఉంటారు. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అయితే ఆదుకోవడానికి ప్రధానంగా కావలసింది మంచి మనస్సు, ధనం. ఈ రెండు కలిగిన వాళ్లు మాత్రమే దాతలుగా పేరు పొందగలరు.

సమాజంలోని అసమానతల కారణంగా పేదరికం పూర్తిగా అంతరించడం లేదు. నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి, ఛాందసభావాలు పేదలను ఎదగనీయకుండా అడ్డుపడుతున్నాయి. వాటిని అధిగమించడానికి పేదలను ఆదుకోవడానికి మనసున్న ధనవంతులు ముందుకు రావాలి.

కులం, వర్గం, జాతి కారణంగా నీచంగా చూస్తున్న వాళ్లను సాటిమానవులుగా భావించాలి. సమాజాన్ని మేల్కొల్పాలి.

ముసలీతనం, రోగాల బారిన పడడం, అనాథలుగా మారడం వల్ల దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. వాళ్లను ఆదుకొని, అండగా నిలబడేందుకు వదాన్యులు ముందుకు రావాలి.

   















దీర్ఘాలున్న అక్షరాలన్నీ గురువులు. ఉదాహరణకు ఆట = U I

"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)

ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )

సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండు పదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)

ఋ అచ్చుతో ఉన్న అక్షరాలు, వాటి ముందరి అక్షరాలు (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.

ర వత్తు ఉన్నప్పటికి దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.

పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)

గణాలు-రకాలు .    సవరించు

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు


ఏకాక్షర గణాలు    సవరించు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.


U, U, U

ఉదా: శ్రీ, శై, లం

రెండక్షరాల గణాలు    సవరించు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు

లగ లేదా వ IU ఉదా: రమా

గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ

గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు    సవరించు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు


అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII

మధ్య గురువు జ గణము IUI

అంత్య గురువు స గణము IIU

సర్వ లఘువులు న గణము III

ఆది లఘువు య గణము IUU

మధ్య లఘువు ర గణము UIU

అంత్య లఘువు త గణము UUI

సర్వ గురువులు మ గణము UUU

ఇవి మూడక్షరముల గణములు


ఉపగణాలు    సవరించు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు


సూర్య గణములు. ఇవి రెండు.

న = న = III

హ = గల = UI

ఇంద్ర గణములు. ఇవి ఆరు.

నగ = IIIU

సల = IIUI

నల = IIII

భ = UII

ర = UIU

త = UUI



        ఉత్పల మాల   లక్షణములు

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20

ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ

యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము

ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.


ఉత్పల భరి10

 1:10


మత్తేభము   

స భ ర న మ య వ


లక్షణములు   

మత్తేభము వృత్తమునందు గణములు

స    భ    ర    న    మ    య    వ

I I U    U I I    U I U    I I I    U U U    I U U    I U

సి రి కిం    జె ప్ప డు    శం ఖ చ    క్ర యు గ    ముం జే దో    యి సం ధిం    ప డే

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20

ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ

యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గుర్తుండడం కోసం  మసభ 14


        చంపకమాల

లక్షణములు

పాదాలు: 4

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు


గుర్తుండడం కోసం చంపన లెవెన్ 

చంపకమాల నజభజజజర 

1 అక్షరానికి 11 అక్షరానికి యతిమైత్రి


శార్దూలం 

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19

ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ

యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు.


గుర్తుండడం కోసం

శ్యామ స 13


please follow  www.siddenky.blogspot.com

క్రింది విధంగా ప్రశ్నలను మార్చకుండా, జవాబులను మరింత సరళంగా, పదో తరగతి స్థాయికి అనుగుణంగా పునఃరచించాను.



---


1. దానశీలము పాఠ్యభాగ కవి గురించి రాయండి.

జ:దానశీలము పాఠ్యభాగ కవి బమ్మెర పోతన. ఆయన తండ్రి పేరు కేసన, తల్లి పేరు లక్కమాంబ. పోతన వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం వంటి రచనలు చేశాడు. ఆయన రాసిన భాగవత పురాణాన్ని రాజులకు అంకితం చేయకుండా శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు. పండితులకు, పామరులకు కూడా అర్థమయ్యేలా రచనలు చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను సహజ పండితుడు అంటారు.

2. అర్థ లోభంబున అర్థి బొమ్మనుటెట్లని శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఎందుకు అన్నాడు? దాని ఆంతర్యం ఏమిటీ?

జ: బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ శుక్రాచార్యుడు వచ్చిన వామనుడు విష్ణుమూర్తి అని చెప్పి దానం చేయవద్దని హెచ్చరించాడు. దానికి బలిచక్రవర్తి, ధనంపై ఆశతో వచ్చిన వాడిని తిరస్కరించలేనని అన్నాడు. ధనం శాశ్వతం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమని భావించాడు. అందుకే మాట తప్పకుండా దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇదే ఆయన అంతరార్థం.

3. దనుజలోక నాథ దయిత ఎవరు? ఆమె స్వభావం ఎట్టిది?

జ:దనుజలోక నాథుడు బలిచక్రవర్తి. ఆయన భార్య పేరు వింధ్యావళి. ఆమె చంద్రబింబంలాంటి ముఖం కలిగినది. బలిచక్రవర్తి వామనుడికి కాళ్లు కడిగే సమయంలో భర్త కనుసైగను గమనించి వెంటనే నీళ్లు తెచ్చింది. రాజహంస లాంటి నడకతో బంగారు కలశంలో నీళ్లు తీసుకొచ్చింది. భర్త మాటను గౌరవించే స్వభావం కలిగిన సతీమణి. భర్త త్యాగాన్ని అర్థం చేసుకొని కీర్తిని పొందింది.


4. శుక్రాచార్యులు పలికిన కుబ్జుడు విశ్వంభరుండు అన్న మాటల్లో అంతర్యమేమిటి?

జ:శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో వామనుడు సాధారణ వ్యక్తి కాదని చెప్పాడు. కుబ్జుడిలా కనిపించిన వామనుడు విశ్వాన్ని భరించే విష్ణుమూర్తి అని అర్థం. మూడు అడుగుల నేలను అడిగినా, ఆయన విశ్వరూపం చూపి అంతా ఆక్రమిస్తాడని శుక్రాచార్యుని భావం. అందుకే దానం చేయవద్దని బలిచక్రవర్తిని హెచ్చరించాడు.


5. మాట తప్పితే ఎం జరుగుతుంది?

జ: మాట తప్పితే గౌరవం తగ్గిపోతుంది. మనపై నమ్మకం పోతుంది. మాట తప్పేవాడనే పేరు వస్తుంది. ఇతరులు మనలను చులకనగా చూస్తారు. కుటుంబ సభ్యులు కూడా నమ్మకం పెట్టుకోరు. చివరకు అందరూ దూరమై, మనం ఒంటరిగా మిగిలిపోతాం. అందువల్ల మాట నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం.