2. సముద్ర ప్రయాణం
-ముద్దు రామకృష్ణయ్య
చదువండి – ఆలోచించి చెప్పండి
పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతోమాట్లాడుతూ ఉండిరి, సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్నిబట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవుని పైన భారం వేసినాను, బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను.
గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనపడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనంచేసితిని.
ప్రశ్నలు
1. పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు?
జవాబు. ఇంగ్లాండు లేదా గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్.
2. వాళ్ళు బ్రిటన్ కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు?
జవాబు. చదువుకోవడానికి
3. పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు. తుదకు గ్రేడ్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతా వందనం చేశాడు
పాఠ్యం నేపథ్యం, ఉద్దేశం:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకు వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్నపని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం.
కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో దృఢసంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించ గలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
'యాత్రా చరిత్ర' ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి.
ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన 'నా ప్రథమ విదేశీ యాత్ర' పుస్తకంలోనిది.
రచయిత పరిచయం:
రచయిత పేరు: ముద్దు రామకృష్ణయ్య
జననం: 18 .10.1907
మరణం: 21. 10. 1985
తల్లిదండ్రులు : ముద్దు అమ్మాయి, ముద్దు రాజన్న,
విద్యార్హతలు: బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు.
కృషి: ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ వివిధ దేశాలలో విద్యా నిమిత్తం అధ్యయనం.
చేపట్టిన కార్యక్రమం: ఈచ్ వన్ టీచ్ వన్.
ప్రవేశిక
ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు.
అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు.
ప్రయాణం కొనసాగుతున్నది!
అనంతాకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది? ఎట్లా చేరుకున్నది ..... తెలుసుకుందాం.
I ఆలోచించండి-చెప్పండి
వాహనాలు కాన్వాయ్ వెళ్ళడం ఎప్పుడైనా చూశారా? దేని కొరకు అట్లా వెళ్తాయి?
జవాబు. చూసాము. మంత్రులు వచ్చినప్పుడు కాన్వాయ్ వస్తుంది
◆ సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు?
జవాబు. మేము వస్తున్నాం అనే విషయం తెలియడానికి, అక్కడున్న వాళ్లు పక్కకు జరగడానికి.
* దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి?జవాబు. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కావలసిన వస్తువులు: బ్యాగు, సరిపడా బట్టలు, వాటర్ బాటిల్, అల్పాహారం, బ్రష్, పేస్టు,.. మొదలైన కనీస అవసరాలతో సిద్ధం కావాలి
II.
పడవపైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడు స్పీకర్లతో కనెక్టు చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైపు చేయించి, సైక్లోస్టైల్ కాపీలు లాంజ్లో పెట్టించేవారు. పీరియాడికల్స్ కూడా లాంజ్లో పెట్టేవారు. లాంజ్లోని ఫర్నీచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటవి. ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖ్మల్ (వెల్వెట్) తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు.
చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంటలేకుండా ప్రయాణం చేసే పసి పిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు. పడవలో లైబ్రరీకూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిన్ కు చదువుకోవటానికి ఇచ్చేవారు. ఔట్ డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణీకులు ఆడుతుండేవారు. చివరిదినం టూర్నమెంట్స్ పెట్టించి, గెలిచినవారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి. డెక్ పైన ఓపెన్ ఏర్లో రాత్రి ఎందరో పడ్కుండేవారు.
మా పడవలో పాశ్చాత్యులు చాలా ఉండిరి. భారతీయులు చాలా తక్కువగా ఉండిరి. పాశ్చాత్యులలో బ్రిటీష్వారే ఎక్కువగా ఉండిరి. బ్రిటిష్వారు ఎవరూ కాని నాకు తెలియదు. దగ్గర నుంచి చూడటం, వారి దగ్గర అంత రోజుగా కూర్చుని వారి భాష వినటం అదే మొదటిసారి. వారి ఉచ్చారణ సరిగా తెలిసేదికాదు. నా ఉచ్చారణ వారికి తెలిసేది కాదు. కాని వారు భారతదేశంలో ఉన్నవారు కాబట్టి, నా ఉచ్చారణ తెలుసుకొనేవారు. నాకు వారి మాటలు తెలుసుకోవటం చాలా శ్రమ అయ్యేది
రేడియో ఇంగ్లీషు భాష కూడా తెలియకపొయ్యేది. నేను ధోవతి షేర్వానీతో ఉంటిని. నేను తప్ప మిగతా భారతీయులు పాశ్చాత్య డ్రెస్లో ఉండిరి. నా దగ్గరికి చాలా మంది బ్రిటిష్ వాళ్ళు రాకపోతూ ఉండిరి. ఐనా కొంతమంది నన్ను మందలించేవారు. నా దగ్గరకు వచ్చి కూర్చుండి నాతో మాట్లాడేవారు. అందులో తరుచుగా మాట్లాడిన వ్యక్తి జైపూర్ మహారాజా గారి కుమారునికి చదువు చెప్పిన వ్యక్తి. అతడు చాలా మంచివాడు. భారతదేశంలోని ఎందరో రాజకుమారులు వారికి శిష్యులు,
ఇంకొకరు ఆంగ్లో ఇండియను. వ్యక్తి తెల్లగా లేకుండె. అతనిపేరు ఫాల్సెట్టు ఇంగ్లాండుకు సెలవుపైన వెళ్ళుతూ ఉండెను. అతనితో నాకు చాలా స్నేహం కలిగింది. అతడు నాకు పాశ్చాత్యుల అలవాట్లను కావలసిన వాటిని తెలుపుతూ ఉండేవాడు. బ్రిటీష్ జీవితపు కథలు తెలుపుతూ ఉండేవాడు. బ్రిటన్లో చదువుకోవడం బీదవారి తరం కాదనేవాడు. వేయిల రూపాయలు ఉంటేగాని బ్రిటన్లో జీవితం జరుగడు. అనేవాడు. బ్రిటన్లో ఉద్యోగం దొరుకదు అనేవాడు.
అలోచించండి-చెప్పండి
* ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి? ఎందుకు?
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి? అప్పుడు మీరేం చేస్తారు?
అలోచించండి-చెప్పండి
* ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి? ఎందుకు?
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి? అప్పుడు మీరేం చేస్తారు?
III
ఆలోచించండి-చెప్పండి
◆ విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి?
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి?
* "ఈశ్వరా నీవే దిక్కు" అని రచయిత అనుకోవటానికి కారణమేమిటి? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
IV
ఆలోచించండి-చెప్పండి
◆ రచయితకు సురేశ్బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది?
◆ ఏయే సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
ఇవి చేయండి
1. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
వాక్యం పేరా సంఖ్య శీర్షిక
పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది
నేను ధోవతి శేర్వానీతో ఉంటిని
ఏవేళ ప్రాణం పోతుందో
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.
2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదా తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది..
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచ పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అము నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తా రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ ఉన్నది.
II. పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ)బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు?
బాసర పుణ్యక్షేత్రంలోని దేవత శ్రీ జ్ఞానసరస్వతి.
ఆ) సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది?
జ. గోదావరి నది తీరము
ఇ) సరస్వతి దేవి సైకతా మూర్తిని మలిచిన వారు ఎవరు?
జ. వ్యాసం మహర్షి సైకతమూర్తిగా మల్చాడని ప్రసిద్ధి
ఈ). నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి
జ.దసరా పండుగ రోజు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు
ఉ)పై పేరాకు శీర్షిక సూచించండి.
జ. బాసర సరస్వతి / బాసర వీణపాణి
III. స్వీయ రచన
కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి దూర
అ)ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఒకటి ప్రయాణపు రోజులలో అవసరమైన నిత్యవసర వస్తువులు బట్టలు నిత్యం ఉపయోగించే కాస్మోటిక్సు నూనె సభ్యులు బ్రష్ టూత్ పేస్టు మొదలైనవి
రెండు శీతల ప్రాంతాలకు వెళ్లేవారు దానికి తగ్గట్టుగా బట్టలను సిద్ధం చేసుకోవాలి
రవాణా సౌకర్యాలను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి
నిత్యవసర వస్తువులు కొనడానికి కొంత సొమ్మును ఏటీఎం లాంటి బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి విలువైన బంగారు ఆభరణాలు ధరించకూడదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులను వివిధ రకాల ఔషధాలను తీసుకొని వెళ్ళాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణం సుఖవంతంగాను ఆరోగ్యప్రదంగాను ఆనందదాయకంగానూ ఉంటుంది.
ఆ) రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జ. రచయిత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్లడం ద్వారా గ్రహించిన అంశం:
పట్టుదల ఉంటే కానిది లేదని అవగతమైనది.
చదువు జీవితంలో అరగని పెట్టుబడిగా గ్రహించాను.
చదువుకోవడానికి డబ్బే అవసరం లేదని వీరి ద్వారా నేర్చుకున్నాను
పేదరికం చదువును నిరోధించలేదని తెలుసుకున్నాను చదువు అనేది ప్రయత్నించే వాడికి తప్పకుండా సిద్ధిస్తుందని రచయిత అనుభవం నుండి నేర్చుకున్నాను.
ఇ) ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు వివరించండి.
జ. ఉన్నత లక్ష్యం సాధించవచ్చు
అసాధ్యం అన్నది మూర్ఖులను కనబడే పదం మాత్రమే అని నెపోలియన్ పేర్కొన్నాడు.
మానవ జీవితం నిరంతరం దుర్లభమైంది కృషి ధార ఆచరణ ధార దాన్ని సార్ధకం చేసుకోవాలి. ఏదైనా సాధించాలని అనుకున్నా అందుకు తగిన ఆలోచన ప్రణాళిక లక్ష్యం దీక్ష దక్షతలు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాటిని సాధించాలని నిరంతర తపన మానవుని అనుకున్న లక్ష్యాల వైపు నడిపిస్తుంది. నిరంతర పరిశ్రమ, నిరంతర ధ్యానం మానవ గమ్యానికి దిక్సూచి లాగా ఉంటాయి.
పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది. సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని కవి చెప్పినట్లు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఉన్నత లక్ష్యం పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. అసాధ్యమైనది మానవుడికి లేనేలేదు.
ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలు తెలుసుకోవడానికి మీరేం చేస్తారు?
జ. ఒక కొత్త ప్రదేశాన్ని తెలుసుకోవడానికి చేయాల్సిన పనులు:
1. ముందు ఆ ప్రాంతం పైన ఆ ప్రదేశం పైన అవగాహన పెంచుకుంటాను.
2. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దర్శింప దర్శన ప్రాంతంలోని విశేషాలను సులభంగా తెలుసుకోవాలంటే స్థానికులను మరియు వివిధ పద్ధతుల్లో వివరాలను కనుక్కోంటాను.
3. అక్కడ విశేషాలను వింతలను స్థలము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాను.
4. తెలిసిన బంధుమిత్రులు ముందుగా సంప్రదించి మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాను.
5. దర్శించిన ప్రాంతానికి చెందిన పుస్తకాలు మరియు ఇతరేతర అంశాలను తెలుసుకోంటాను. ఈరకంగా ప్రాంతానికి చెందిన అనేక విశేషాలను నేను తెలుసుకుంటాను.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలు జవాబు రాయండి.
అ) అనుకున్న సాధించడంలో ఒకరికి చెప్తే అనంతమైనది ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
జ. అనుకునే సాధించడంలో అనంతమైన తృప్తి కలిగిన ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం:
కరీంనగర్ జిల్లా మంథని గ్రామస్తుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు చిరునామాగా మారారు. ఉన్నత లక్ష్యసాధన కోసం అనేక ఆటంకాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎదురైన ప్రతి సమస్యను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. తర్వాతి తరాల వరకు మార్గదర్శకుడుగా నిలిచాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రామకృష్ణయ్య ఇంగ్లాండుకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నాడు. కష్టాలు ఎదురవుతాయి ముందుగానే గ్రహించాడు. తన ఆత్మస్థైర్యం ముందు తన అనుభవిస్తున్న పేదరికాన్ని లెక్క చేయలేదు. బొంబాయిలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉన్నప్ధైపటికీ ధైర్యంగా అధిగమించాడు. సాధారణ పంచే పైజామా షేర్వానీతోనే ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రయాణికుల్లో చాలామంది ఆంగ్లేయులు కలరు. వారి భాష వీరికి వీరి భాష వారికి రాదు. తన భావాలను వ్యక్తం చేయలేని పరిస్థితి అధిగమించాడు.
లండన్ లో డబ్బున్న వాళ్లకు మాత్రమే చదువు సొంతం అనుకునే వారి మధ్య నేను పేదరికంలోనైనా చదువు పూర్తి చేయాలని తెలుసుకున్నాడు. పేదరికం నుంచి కాపాడు మని దైవాన్ని ప్రార్థించాడు. పూర్తి చేశాడు దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు గారి సహకారం లభించింది. లండన్ చీర గాని రామకృష్ణ అధికారుల అనుమతిచ్చారు దీంతో రామకృష్ణ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి తను లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించడం వల్ల అనేకమందికి ఆదర్శంగా నిలిచాడు.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. జవాబులు సృజనాత్మకంగా రాయండి.
అ) కష్టంగా భావించవద్దు ఉన్నత లక్ష్యం పెట్టుకుని ఇష్టంగా చదువుకొని అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ.
లేఖ
సిద్దిపేట,
తేది:
ప్రియమైన మిత్రుడు రాజేష్ కి,
శుభాకాంక్షలు మిత్రమా నేను బాగా చదువుతున్నాను నీవు బాగా చదవాలని కోరుతున్నాను ముఖ్యంగా నీవు నవోదయ పాఠశాలలో చేరావు. చేరడంతో సరిపోదు. నీ లక్ష్యాన్ని నీవు మరవద్దు. నువ్వు చాలా కృషి చేయాలి. నీ జీవితంలో ఉన్నత చదువు చదివి అనేక మందికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. చదువు గొప్ప సాధన ఇది నీకు తెలియంది కాదు. కష్టంగా భావించవద్దు మీ కుటుంబం చాలా పేద కుటుంబం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశయాలను నెరవేర్చాలి. అందుకోసం నేను చదువులో ఉన్నత లక్ష్యాన్ని చేరాలి. విలాసాలు కబుర్లు మొదలైన వాటితో కాలనీ వృధా చేయవద్దు. చదివే చదువు నీ జీవితానికి మూలధనం అవుతుంది. నీపై నాకు నమ్మకం ఉంది. నీవు భవిష్యత్తులో ఉన్నత లక్షణాలు చేరుకుంటావు. అలా జరగాలని కోరుకుంటూ.....
ఇట్లు
మీ ప్రియ మిత్రుడు
రాజు
చిరునామా:
ఈ రాజేష్,
ఎనిమిదో తరగతి,
నవోదయ విద్యాలయ సమితి,
వర్గల్, గజ్వేల్, సిద్దిపేట జిల్లా.
లేదా
ఆ) మీరు చేసిన ప్రయాణ వ్యాసం రాయండి.
నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్లాను. అక్కడ చార్మినార్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ ప్లానిటోరియం చూశాను...
మీరు చేసిన ఒక ప్రయాణి అసు
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి. ( ఇ )
అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నావద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
ఆ) నామిత్రునికి సహాయపడతనని నేను వాగ్దానం చేశాను.
( అ)
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా:- అందెవేసిన చేయి
సీసపద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
అ) పట్టరాని సంతోషం : నాకు పుట్టినరోజు అంటే పట్టరాని సంతోషమే.
ఆ) దేవునిపై భారం వేయు: నాకు ఆపద కలిగినప్పుడు నేను దేవునిపై భారం వేస్తాను.
ఇ) గుండెజల్లుమను : కుక్కలను చూస్తే గుండె జల్లు మంటుంది.
ఈ) చెమటలుపట్టు : నాకు భయం కలిగినప్పుడు చెమటలు పడతాయి.
VI. భాషను గురించి తెలుసుకుందాం.
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.
అ) ఆదిశేషునికి వేయితలలు : వేయి సంఖ్య గల తలలు - ద్విగు సమాసము
ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు. కృష్ణుడును అర్జునుడును - ద్వంద్వ సమాసము
ఇ) రవి, రాము అన్నదమ్ములు. అన్న మరియు తమ్ముడు - ద్వంద్వ సమాసము
ఈ) వారానికి ఏడురోజులు. ఏడు సంఖ్యగల రోజులు -ద్విగు సమాసము
ఉ) నూరేండ్లు జీవించు. నూరు సంఖ్య గల ఏండ్లు - ద్విగు సమాసము
2. కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
అ) విద్యాభ్యాసం = విద్య+అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి
ఆ) మొదలయింది =మొదలు + అయింది = మొదలయింది = ఉత్వ సంధి
ఇ) విద్యార్థులు = విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) ఏదైనా = ఏది + ఐనా = ఇత్వ సంధి
ఉ) వారందరు = వారు + అందరు = ఉత్వ సంధి
అత్త్వసంధి
*కింది పదాలను పరిశీలించండి.
అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త /మేనయత్త = మేన + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక ఒక + ఒక
పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది?
సంధిని విడదీసినప్పుడు ఏర్పడి
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది?
రెండు పదాలలో మొదటి పదా 'పూర్వపదం', రెండవ పదాన్ని 'పరపదం' అని అంటారు,
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది?
పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన 'అ' అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ. ఏ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు 'అ' లోపించి రెండో పదం మొ అచ్చు వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.
(i) రామయ్య లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
(ii) మేనత్త, మేనయత్త→ లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
(iii) సెలయేరు → లాంటి పదాలు 'సెలేరు' లాగా మారకుండా 'సెలయేరు' లాగానే ఉంటాయి. (నిషేర్లు,
(iv) ఒకానొక→ లాంటి పదాలు 'ఒకొక'లాగా మారకుండా మరోరూపంలోకి అంటే 'ఒకానొక’లాగా మారుతాని (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వ స్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
'అ' కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ) పరమైతే ఏర్పడే సంధి 'అత్త్వసంధి'.
అత్తు (అత్తు అంటే హ్రస్వమైన 'అ' ) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.
ఉదా : తగిన + అంత =తగినంత
అ) చాలిన + అంత = చాలినం
ఆ) సీత + అమ్మ = సీతమ్మ
ఇ) అక్కడ + ఇక్కడ = అక్కడికక్కడ
ఈ) అందక + ఉండెను = అందకుండెను
ఉ) చెప్పుట + ఎట్లు = చెప్పు టెట్లు
ఊ) రాక + ఏమి = రాకేమి
బహుళం:
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని 'బహుళం' అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి