భాష అనే పదం ‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది (ధాతువు అంటే మూలము). భాష భావ వినిమయ సాధనం. ప్రతి ఒక్కరు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తానూ తెలుసు కోవడానికి ఉపయోగపడేదే భాష. సొంపు అనగా సంవృద్ది, సంతోషము, ప్రసన్నత, సుఖము, సౌందర్యము అని మొదలగు అర్థాలు కలవు.
ఎవరి భాష వాళ్ళకు - ఎవరి మాతృభాష వాళ్ళు విన్నప్పుడు సంతోషం కలగడం సహజం. ఎన్ని భాషలు నేర్చినా తన సొంత భాష ద్వారా పొందే ఆనందాన్ని ఇంక దేని ద్వారా పొందలేరు. వ్యాస ప్రక్రియను పరిచయం చేస్తూ భాష పై అభిమానాన్ని తెలియజేస్తుంది ఈ పాఠ్యభాగం.
ప్రక్రియ పరిచయం:
ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వుండడటం వ్యాస లక్షణం.
రచయిత పరిచయం:
రచయిత పేరు: డాక్టర్ సామల సదాశివ.
ప్రస్తుత పాఠ్యభాగం: తన స్వీయ అనుభూతులతో రచించిన సామల సదాశివ గారి ‘యాది’ అనే వ్యాస సంపుటి.
జననం : 11.05.1928
మరణం:07.08.2012
జన్మస్థలం: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం, తెనుగు పల్లె.
భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంత పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని బేరీజువేస్తూ, తెలుగుభాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుందీ పాఠం.
పూర్వకథ/నేపథ్యం :
నాలుగేళ్ళు కూడా నిండని మన రచయిత సామల సదాశివ గారి మనుమరాలు లావణ్య ఒకనాడు
‘తాతా ! ఇగపటు నీ పాను జర్దా డబ్బి’. అని అచ్చమైన తెలుగు నుడికారంలో ఇగపటు అనగానే తన మనుమరాలికి ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడ్డ ఆనందంలో కొన్నాళ్ళ క్రిందట సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు;
“వారీ! రామచంద్ర! ఇగపటు” అనే మాటలు యాదికి వచ్చి ప్రస్తుత పాఠ్యభాగమైన “ఎవరిభాష వాళ్ళకు వినసొంపు” అనే వ్యాసాన్ని రాయడానికి పూనుకుంటాడు.
సారాంశం: మనమరాలు ఇగపటు అనగానే రచయిత సామల సదాశివ కి గుర్తుకొచ్చిన అంశాలు:
"తాతగారండీ! ఇదిగోనండి నీ పాను" అన్నా తెలుగే. తెలుగు మాట్లాడలేని మనుమరాలుకు ఇక్కడి తెలుగు పలుకుబడి పట్టుబడ్డందుకు సామల సదాశివ గారికి సంతోషం కలిగింది.
తిరుమల రామచంద్ర ఆంధ్ర ప్రభ ఆదివారం చివరి పేజీకి హైదరాబాద్ నోట్ బుక్ పేరిట ఏదో ఒకటి రాస్తుంటాడు.
ఇలాంటి ప్రత్యేకమైన ప్రత్యేకతలు గల కరంజియా నిర్వహించే బ్రిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే వాటి కోసమే అత్యధిక కాపీలు అమ్ముడుపోయేది.
ఒకరోజు తిరుమల రామచంద్ర మిత్రుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గుర్తు చేసుకున్నారు.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు "వారీ రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డూ"అనగానే ఇగపటు అనునది ఇక్కడి ప్రాంతీయ పరిమళం. ఇక్కడి భాష. ఇక్కడి పలుకుబడి.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు.
సంస్కృత బిల్హణ కవి రాసిన విక్రమాంక దేవ చరిత్ర అనే ప్రౌఢ గ్రంథాన్ని అంతే ప్రౌఢంగా తెలుగులోకి అనువదించాడు.
బిల్హణకవి గారిదే 'కర్ణ సుందరి' అనే నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు.
"కర్ణ సుందరీ" నాటకం రాత ప్రతి పైన చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారు మొదలుకొని మహా పండితుల వరకు వ్యాఖ్యానం చేశారు.
అందువల్ల వారు "ఆంధ్ర బిల్హణ" బిరుదాంచితులు
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి నుంచి సామల సదాశివ గారు తెలియని అనేక విషయాలను శిష్యరకం చేయకుండా ఉత్తరాల ద్వారా తెలుసుకునేవాడు. అందువల్ల కప్పగంతుల వారిని గురుస్తానీయులుగా భావించాడు రచయిత.
సామల సదాశివ గారికి గురుస్థానీయులు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు 'ఇగపటు' అనడం వింతగా అనిపిస్తుంది కదా అది ప్రాంతీయ భాష.
బాసర సరస్వతీ క్షేత్రంలో వ్యాస వాంగ్మయం మీద సదస్సు
ధారాళంగా ప్రసంగించినది కే. కమల
ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత రిటైర్డ్ ప్రొఫెసర్.
ఆమె వాగ్దాటి విన్న రచయిత భోజన సమయంలో పరిచయం చేసుకున్నాడు ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. గురు పుత్రిక కాబట్టి నమస్కరించాడు.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిది మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానము.
నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినాడు.
మహబూబ్నగర్ వాళ్ళ భాష తెలుగుతనం:
సురవరం ప్రతాపరెడ్డి
ఇటిక్యాల పాడు
ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ కు వెళ్ళింది.
గడియారం రామకృష్ణ గారు పరిశోధకులు, పత్రిక నిర్వాహకులు. హైదరాబాద్ ఆంధ్ర సార్వసత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన వారిలో ఒకరు. రచయితకు తెలియని అనేక విషయాలు తెలియజేశారు కాబట్టి వారిని గురుస్థానీయులుగా భావించాడు.
గడియారం రామకృష్ణ గారు
ఆలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయం పునరుద్ధరణ గావించారు.
నల్లగొండ జిల్లా తెలుగు సోంపయినదే. మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాల్లో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉన్నారు.
నల్లగొండలో అంబటిపూడి వెంకటరత్నం - వత్సలుడు అనే కావ్యం.
కొండూరి వీరరాఘవాచార్యులు వారు వీరు వేలూరి వారి శిష్యులు.
అంబటిపూడి
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాత.
ఆంధ్ర సారస్వత పరిషత్తు పరీక్ష లో అంబడిపూడి కావ్యం, కప్పగంతుల సంక్షిప్త వ్యాకరణం సిలబస్ లో ఉండేవి.
పలుకుబడి నుడికారం జాతీయాలు ఉర్దూ ప్రాధాన్యం ఎక్కువ.
వీటిని రోజుమర్రా, మొహావీర అంటారు.
వరంగల్ తెలుగును టాక్సాలి తెలుగు అంటారు.
ఢిల్లీ ఉర్దూను టాక్సాలి ఉర్దూ అంటారు.
టాక్సాలి అనగా టంకశాల.
ఘంటసాల నానానికి విలువ ఎక్కువ. ఇతరులు ఎవరు చేసినా అది నకిలీ నాణెం. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.
II వ్యక్తీకరణ - సృజనాత్మకత :
1. ఐదేసి వాక్యలలో జవాబులు రాయండి.
ఆ) మనుమరాలు మాటలు విని తాత ఎందుకు అబ్బురపడ్డాడు?
జ. రచయిత సామల సదాశివ గారు రెండో మనవరాలు లావణ్య ఆమెకు నాలుగేళ్లు. వాళ్లు హైదరాబాదులో ఉంటారు. లావణ్య కు తెలుగు రాదు. వారు హిందీలో మాట్లాడుతారు. వారు కొన్ని తెలుగు మాటలు హిందీలో అనువదించుకొని మాట్లాడుతారు. నీ వారికి పలుకుబడి నుడికారం అస్సలు తెలియదు.
అలా నాలుగేళ్లు పూర్తిగా నిండని మనవరాలు లావణ్య "తాతా ! ఇగపటు నీ పాను జర్ధా డబ్బీ' అని ప్రాంతీయ భాషలో మాట్లాడి సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య ఇగపటు అనగా, ఇదిగోనండి అని అర్థం వచ్చేలా ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతపు తెలుగు భాష మాట్లాడినందుకు తన చిన్న మనవరాలికి ఆ భాష పట్టు బట్టినందుకు సదాశివ గారు అబ్బురపడ్డాడు.
ఆ) కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురిస్తానీయులుగా ఎందుకు భావించారు వివరించండి.
జ. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందిన మహా పండితులు ఈయన సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్ధండులు.
డాక్టర్ సామల సదాశివ గారు లక్ష్మి శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయలేదు కానీ ఒక్కొక్కప్పుడు శాస్త్రి గారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి దగ్గర నుండి అనేక తెలియని సాహిత్య విషయాలను తెలుసుకున్నారు. అందువల్ల సదాశివ గారు లక్ష్మి శాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావించారు.
ఇ) అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది?
జ. వరంగల్లులో సాహితీ మిత్ర మండలి ఉంది. సాహితి పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సభలో ఎందరో తెలుగు విద్వాంసులున్నారు. ఎందరో విశ్వవిద్యాలయ ఆచార్యులున్నారు. అంతమంది తెలుగు సాహిత్య పండితులు ఉన్న ఆ సభకు, ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడానికి కారణం ఏమిటో రచయిత సదాశివ గారికి ఆలోచించారు. బహుశా కాళోజికి ఆఫీసర్ స్నేహితుడి ఏమో అని సదాశివ గారు భావించారు. తర్వాత అధ్యక్షుడైన రెవిన్యూ ఆఫీసర్ వరంగల్ ప్రాంతీయ తెలుగులో అచ్చు తెలుగు పదాలలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో సంస్కృత పదాలను ఇంగ్లీష్, ఉర్దూ, పదాలను వాడకుండా మాట్లాడారు. అప్పుడు సదాశివ గారికి ఆయనను ఎందుకు అధ్యక్షులు చేశారో తెలిసింది. యూనివర్సిటీ ఆచార్యులు రెవిన్యూ ఆఫీసర్ కన్నా బాగా మాట్లాడుతారని సదాశివ గారి ఉద్దేశం. అందరికంటే అనర్గళంగా మహాపాండిత్యంతో మాట్లాడిన వాడు రెవిన్యూ ఆఫీసర్.
ఈ) రచయిత రచన శివుని ప్రశంసిస్తూ రాయండి.
జ. డాక్టర్ సామల సదాశివ గారు సహృదయ విమర్శకుడు విశ్లేషకులు సాహితీవేత్త. ఈయన రచనలలో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసును హత్తుకు పోయేటట్లు ఉంటుంది. సదాశివ గారు వ్యాసం శైలి పాఠకునికి అతి సులువుగా అర్థమవుతుంది స్పష్టంగా నిర్దిష్టంగా అర్థమయ్యే విధంగా రాయడం సామల సదాశివ గారి ప్రత్యేకత. ఈ వ్యాసంలో సదాశివ గారు తెలంగాణ మాండలికంలో తీయని తెలుగు గూర్చి చక్కగా వివరించారు. విశ్లేషించారు.
సదాశివ గారి వచన రచన శైలి ప్రాంతాల వారికి సులభంగా అర్థమవుతుంది సదాశివ గారు వివిధ భాషలలో మంచి పండితులు కల్తీ చేయకుండా ఆంధ్రులందరికీ అర్థమయ్యేలా తమ రచన వ్యాసాన్ని చక్కగా సాగించారు.
2 పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేం అర్థమైందో రాయండి.
జ. సామల సదాశివ గారు తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం తెనుగు పల్లె లో జన్మించారు. సామల సదాశివ గారికి తెలంగాణ తెలుగుపై మమకారము ఎక్కువ. తన మనుమరాలు లావణ్య ఇగపటు అని అసిఫాబాద్ మాండలికంలో మాట్లాడండి. రచయిత ఆనందంతో ఆశ్చర్యపడ్డాడు.
అనేక విషయాలు తెలుసుకున్న కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారిని గురుస్తానీలగా భావించారు రచయిత. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడడానికి కారకులైన గడియారం రామకృష్ణ శర్మగారు కూడా సదాశివ గారికి గురు స్థానీయులు. సదాశివ గారికి వేలూరు వారికి కూడా ఏకలవ్య శిష్యులు.
వరంగల్లులో కూరగాయల మేస్త్రి మాటలలో కూడా స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు మాట వినిపిస్తుందని సదాశివ గారు వివరిస్తారు. ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినిపిస్తుందని సదాశివ గారి ఉద్దేశం. సదాశివ గారు అనేక భాషలో పండితుడైనప్పటికీ ఉర్దూ లో మాడగలుగుతారు. సదాశివ గారి తెలుగు రచనా వ్యాస విశ్లేషణ ఆంధ్ర ప్రాంతం వాళ్లు కూడా మెచ్చుకునేవారు. తెలంగాణ ప్రాంతం తెలుగు భాషలో కలుపుతూ విలక్షణంగా రాసే సదాశివ గారి వివరణ అద్భుతంగా ఉంటుంది. ఉర్దూ భాషలో ప్రజల పలుకుబడితే ప్రాధాన్యమని సదాశివ గారు అభిప్రాయం.
సదాశివ గారు హిందీ సంస్కృతం తెలుగు ఇంగ్లీషు మరాఠీ మహర్షి భాషలో పండితులు. అయినప్పటికీ తెలుగునే అమితంగా ప్రేమించేవారు. వీరి స్వరలయలు గ్రంధానికి కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డు, యాది సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి.
ఆ) కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి సదాశివ గారు ఏ విధంగా గుర్తు చేసుకున్నారు? or కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి సదాశివ గారు చెప్పిన విషయాలు ఏమిటి? or కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని సామల సదాశివ గారు గురుస్తానీయులుగా ఎందుకెంచారో తెలుపండి?
జ: కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు.
సంస్కృత బిల్హన మహాకవి రాసిన విక్రమార్క దేవ చరితము అనే ప్రౌఢకావ్యాన్ని తెలుగులో అంతే ప్రౌఢంగా వారు అనువాదం చేశారు అందువల్ల వారికి ఆంధ్ర బిల్హణ అనే బిరుదు సార్ధకం అయింది.
లక్ష్మణ శాస్త్రి గారు బిల్హన కవి గారిది కర్ణ సుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించారు. నాటకం కాకపోయినా వీరి విక్రమార్క దేవ చరిత్రను చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు మొదులుకొని నాటి పండితులంతా ప్రశంసా వాక్యాలు ఆ వ్రాతప్రతిపై ఉన్నాయి.
సదాశివ గారు లక్ష్మణ శాస్త్రి గారికి ఏకలవ్య శిష్యులు గా పేర్కొన్నారు.
శిష్యులు కాకపోయినా వారి వారు శాస్త్రి గారి దగ్గర కూర్చుని తరచుగా లేఖలు రాసి తెలియని అనేక విషయాలను వారి ద్వారా తెలుసుకున్నారు.
ఒకరోజు వ్యాస పూర్ణిమనాడు బాసర క్షేత్రంలో లక్ష్మణ శాస్త్రి గారి కూతురు కే కమల వ్యాసవగ్మపై మాట్లాడుతూ ఉన్నారు. నా ఆమె ప్రసంగానికి ముద్దులయ్యారు . ఆమే కప్పగంతుల వారి కుమార్తె. గురువుగారి కుమార్తె అని నంస్కరించారు.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు.
లక్ష్మణ శాస్త్రి నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరి చివరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ఓరియంటల్ లాంగ్వేజెస్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉద్యోగ విరమణ చేశారు.
3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరిచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి.
నేను నా ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మరిచిపోలేని సంఘటన నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజు నేను ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరించాను. ప్రధానోపాధ్యాయిని హోదా బాధ్యతలు విధులు నిర్వర్తిస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. కానీ అది తాత్కాలికమైనది నా జీవిత దేంగా ప్రభుత్వ ఉద్యోగిగా అనేకమందికి ప్రయోజనకరంగా నా చదువును ఉపయోగించడానికి కష్టపడతానని కంకణం కట్టుకున్నాను.
అదేరోజు ముగింపు సభలో నన్ను మాయచ్చం గారు ఉపాధ్యాయ బృందం నా పనిని గుర్తించి అభినందించారు అది ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన.
లేదా
ఆ) మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణగా రాయండి.
మా పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటన వాడుక భాషలో.
రవి: అక్క ఎప్పుడొస్తవు
రమణి: తమ్మి! వచ్చే నెలలో రాఖీల పున్నము వస్తుంది కదా! అప్పుడు వస్తా.
a. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరీ నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.(సంశ్లిష్ట వాక్యం)
రుగాగమ సంధి:
ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.
పేదరాలు ఆ) బీదరాలు ఇ) బాలింతరాలు
పేద + ఆలు
ఆ) బీద + ఆలు
ఇ) బాలింత + ఆలు ''ఈ ఉదాహరణలకు రుగాగమం వస్తుంది. ఇలా మారుతాయి.
ఉదా : అ) పేద + ఆలు - పేద + ర్ + ఆలు - పేదరాలు
ఆ) బీద + ఆలు బీద + ర్ + ఆలు బీదరాలు
ఇ) బాలింతరాలు బాలింత + ర్ + ఆలు - బాలింతరాలు
ఆగగమనగ ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడం
గమనిక: పై మూడు సంధి పదాల్లోనూ పరపదం 'ఆలు'
1) పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది. అంటారు.
2) పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను "పేదాదులు"
3) పేదాది పదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
4) 'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.
పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది. పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)
విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
రుగాగమ సంధి సూత్రం కర్మధారయమందు పేదాది శబ్దాలకు "ఆలు" శబ్దం పరమైతే రుగాగమమౌతుంది.
అదనపు సమాచారం.
మనుమరాళి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు or 'తాతా! ఇగపటు నీ పాను, జర్దాడబ్బీ' అని మనుమరాలు పలికిన మాటలు విన్న సామల యాది చేసుకున్న విషయాలేమిటి ?
జ. సామల సదాశివగారి రెండవ మనుమరాలు పేరు లావణ్య. ఒక రోజున లావణ్య తన తాత సదాశివగారికి పాను, జర్దా డిబ్బీ తెచ్చి అందిస్తూ "తాతా! ఇగపటు నీ పాను జర్దా డబ్బీ" అని ఆ ప్రాంతపు తీయని తెలుగుయాసలో మాట్లాడింది. సదాశివగారు మనుమరాళ్ళు హైదరాబాదులో ఉంటున్నందున, వారికి తెలుగురాదు. వాళ్ళకు తెలుగువాళ్ళ నుడికారము, పలుకుబడి తెలియదు.
లావణ్యకు అప్పటికి ఇంకా నాలుగేళ్ళు నిండలేదు. అటువంటి బాలిక లావణ్యకు, 'ఇగపటు' అని ఆ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడినందుకు, సదాశివగారు సంతోషపడ్డారు. అబ్బురపడ్డారు. (కొన్నాళ్ల క్రిందటి ఒక ముచ్చట యాదికి వచ్చింది సదాశివ గారికి.
ప్రాకృత, సంస్కృత, ఆంధ్రభాషల్లో పండితులైన తిరుమల రామచంద్రగారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరిపేజీ హైదరాబాద్ నోట్బుక్ రాసేవారు. ఏ పత్రికకయినా చివరి పేజీయే అందం. కరంజియా నిర్వహించే బ్లిట్జ్ పత్రికలో కె.కె. అబ్బాస్ రాసే చివరిపేజీ కోసమే కొందరాపత్రికను కొనేవాళ్లని ఆ తరం వాళ్లకు తెలుసు. ఒక వారం హైదరాబాదు నోటుబుక్కులో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రిగారు. తిరుపతికి వెళ్లివచ్చినారట. అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికిచ్చినారట. ఇస్తూ వారన్నమాటను వారి భాషలోనే రాసినారు రామచంద్రగారు. అదే మొదటి వాక్యం. “వారీ రామచంద్రా ! ఇగపటు తిరుపతి లడ్డూ." మనుమరాలు లావణ్య వాక్యం వినగానే రామచంద్రగారు రాసిన వాక్యం యాది చేసుకున్నారు.)
ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతడు శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్లమీద కూర్చుండి ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి మాట్లాడు కుంటుంటే వాటిని శ్రద్ధగా విని ప్రజలపలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. తఖీమీర్ నాది ప్రజా కవిత అన్నాడట.
తఖీమీర్ గారి ఒక షేర్
‘గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సేహై’
ఇందులో ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు.
“ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని పై షేర్ యొక్క అర్థం.”
ఈ విధంగా సామల సదాశివగారు ఆయా ప్రాంతాల తెలుగును ఆయా ప్రాంతాలలోని భాషా సేవకులను, అభిమానులను గుర్తుచేసుకుంటూ ఉర్దూ భాషపై తనకు గల అభిమానాన్ని, పట్టును ప్రస్తావిస్తూ సాగించిన రచనే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం.
"పసందు అంటే బాగా ఇష్టం అని అర్థం" .
ఏప్రాంతంవారికి ఆప్రాంతం లో మాట్లాడే భాష బాగా నచ్చుతుంది.అలామాట్లాడడంలో భాషకు ములాలైన స్థానిక పదాలు,అన్య భాష ప్రయోగాలు,నుడికారాలు,సామెతలు,జాతీయాలు,యాసలు,ఇవన్ని ఎక్కడి వాళ్లకు అక్కడ అప్రయత్నంగా తాము మాట్లాడే భాషలో ప్రయోగించడం జరుగుతంది,.అందుకే ప్రాంతీయ భాష ఆయా ప్రాంతాల వారికి బహు పసందుగా వుంటుంది.ఎంతటి కవులైన,పండితులైన దీనికి అతీతులు కారు.
భాష అంతా ఒకటే ఐన ,ఎ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు.ఈ యాస క్రియా రుపాల్లోనే గాక నామవాచకంలో,సంబోదన్నలో,మర్యాదల్లో వైవిధ్య భరితంగా వుంటుంది.
ఒకప్రాంతంలోని మనుషుల జీవన విధానం,వ్యవహార శైలి,పాలకుల విధానం,పరిసర ప్రభావం,తదితరాంశాలు,భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి.ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం వుంటుంది.వస్త్ర ధారణా,ఆహార వ్యవహారాలు,వాళ్ళ భాషలో అంతర్లినమై వుంటాయి.భాష పరమార్థం భావ వ్యక్తికరనే కాబట్టి ఎక్కడి వారు అక్కడి భాషకు అలవాటు పడతారు.చెవులకింపుగా ,హృదయాన్ని తాకే టట్టుగా ఉండే భాష వాళ్ళతో విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది.అలవాటు లేని భాష విన్నప్పుడు విచిత్రంగా వుంటుంది.అది రుచించదు.అందుకే ఎవరి భాష వారికి చాల బాగా అనిపిస్తుంది.
ఆడవాళ్ళ నోట అసలైన భాష ఉంటుందని' సామల సదాశివ ఎందుకు అన్నాడు ? జ. 'ఆడవాళ్ళ నోటి నుండే అసలైన భాషను వినగలం' అనే మాటను, నేను సమర్థిస్తాను. ఆడవాళ్ళ మాటల్లో కల్తీ ఉండదు. వారు ఇంటిపట్టునే ఉంటారు. కనుక, వారు మాట్లాడే భాషలో ఇతర భాషా పదాలు కలియవు. అందుకే ఆడవాళ్ళ నోట అసలైన భాషను మనము వినగలం. అందుకు గల కారణాలు.
1) వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లో అచ్చమయిన తెలుగు నుడి వినిపిస్తుంది.
2) అలాగే ఉర్దూ మాట్లాడే ముస్లిము స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళెన రాజమహల్లులో ఉండే బేగముల భాష, పరిశుద్ధమైనదని ఆ రోజుల్లో విద్వాంసులు చెప్పేవారు. అందుకే కల్తీ లేని ఉర్దూను, 'బేగమాతీ జుబాన్', 'మహెల్లాతీ జుబాన్' అని పిలిచేవారు.
సారాంశం:
సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.
మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది.
సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు. వీరు వేలూరి శివరామశాస్త్రి గారి శిష్యులు. సామల సదాశివ, కోడూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులు. అంబటిపూడి వారి ఒకకావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం పరిషత్ నిర్వహించే పరీక్షల సిలబస్ లో ఉండేవి.
పలుకుబడి, నుడికారం, జాతీయాలను ఉర్దూలో రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చు. టక్సాలీ అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ ఎక్కువ. డిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు.
సదాశివ గా ఊరిలో మరాఠీపు రోహితుడు మొదట 'మీకండ్లకు నీళ్లు పెట్టుకోండి"అంటాడు. "కళ్ల నీళ్లు పెట్టుకోండి"అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీ నోటివెంట అచ్చ తెనుగు నుడి వినిపిస్తుంది. ముస్లిం స్త్రీలు ఇల్లుదాటి వెళ్ళని వాళ్లు మాట్లాడేది శుద్ధమైన భాష రాజమహల్లలోఉండే బేగములు మాట్లాడేది శుద్ధమైన భాష. ఈ ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అంటారు. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.
వరంగల్లో పెద్ద కాలోజి వర్ధంతి సభలో సదాశివ పాల్గొన్నాడు. పెద్ద కాలోజీ కవి. ఇతని కలంపేరు షాద్. వర్ధంతి సభలో చిన్నపాటి కవి సమ్మేళనం జరిగేది. గాయకులు షాద్ గజల్లు పాడేవారు. సదాశివ గారు సభకు వెళ్ళే సరికి సాహితీ మిత్ర మండలి వాళ్ళు కవితా గానం చేస్తున్నారు. సభకు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు వేరే భాష పదాల జోలికి పోకుండా వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. తర్వాత సామల తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలోనే మాట్లాడాడు.
సామల సదాశివ వార్తా పత్రికల్లో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాశాడు. తర్వాత యాది రాశాడు. యాదిలో వచ్చిన వ్యాసాలను చదివి గుంటూరు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ మెచ్చుకునేవాడు. ఆంధ్రవాళ్ళు మెచ్చుకోవడం గొప్పేకదా.
సదాశివ తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతివెంకన్నను కూడా చూడలేదు. కారా మాస్టారు గారి ఆజ్ఞతో మూడు రోజులు విశాఖ శ్రీకాకుళం వెళ్ళివచ్చాడు. సదాశివ తెలుగు పంతులు ఉర్దూ మరాఠీ పిల్లలు వ్యవహారిక భాషలోనే చదువుకునేవారు. ఒక టీవీ చానల్లో "తెలుగేరాయండి. తెలుగులోనే మాట్లాడండి" అని చెపుతున్నప్పుడు... అది విన్నప్పుడల్లా ఏతెలుగు? ఎక్కడితెలుగు? అని రెండు ప్రశ్నలు వేసుకునేవాడు.
నేర్చుకోవాల్సినవి
1. సామాన్య వాక్యము 2. సంయుక్త వాక్యము
సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అంటారు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.
అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అంటారు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,
సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్థము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి, ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.
సంయుక్త వాక్యం: వాక్యంలో కర్త, కర్మ, క్రియలలో ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉండి, అవి మరియు, లేదా, కావున, కాబట్టి, వంటి సముచ్చాయలతో సంధానింపబడితే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు. ఉదా: రాము, రాజు గద్వాలకు వచ్చారు. వానలు బాగా పడినవి కాబట్టి పంటలు పండాయి.
కర్తరీ వాక్యం : కర్మణి వాక్యం: కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు. ఉదా: రాముడు రాక్షసులను సంహరించాడు - కర్తరి వాక్యం; రామునిచే రాక్షసులు సంహరింపబడిరి - కర్మణి వాక్యం. కర్మణీ ప్రయోగం అనేది తెలుగు భాషలో సహజంగా లేదు. ఇది ఇతర భాషల నుండి తెలుగు లోనికి వచ్చింది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది.
ప్రశ్నార్థక వాక్యాలు: సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదా: రాణి పాఠాలు చదువుచున్నదా ? ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది? మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన ప్రశ్నార్థక పదాలు..
ప్రత్యక్ష కథనం : ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం
ప్రత్యక్ష కథనం. నేను, మేము, నా, మా వంటి పదాలతో వాక్యాలు మొదలవుతాయి. చెప్పిన మాటలను ఉద్దరణ చిహ్నాలలో ఉంచుతారు.
ఉదా: "నా కన్నా గొప్ప రచయిత తెలుగులో మరొకరు లేరు " అని సుబ్బారావు, వెంకట్రావుతో అన్నాడు.
పరోక్ష కథనం : వేరేవాళ్లు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది
పరోక్ష కథనం. ఉదా: తన కన్నా గొప్ప రచయిత తెలుగులో మరొకరు లేరని సుబ్బారావు వెంకట్రావుతో అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి