సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

9వ తరగతి

9వ తరగతి తెలుగు పుస్తకం



1. ధర్మార్జునులు

2. నేనేర్గిన బూర్గుల

3. వలసకూలి

4. దాశరథి రంగాచార్యతో ముఖాముఖీ

5. శతకమధురిమ

6. దీక్షకు సిద్ధంకండి

7. చెలిమి

8. ఉద్యమస్పూర్తి

9. కోరస్

10. వాగ్భూషణం

11. వాయసం

12. తీయని పలకరింపు

o   p   q   r   s తరగతులు  

కంఠస్థ పద్యాలు


1. ధర్మార్జునులు

ఉ||

ఆ పురమేలు 'మేలు బళ్లి !', యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా 
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు; సత్య భా 
షా పరతత్త్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి 
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై,

ఉ||

కోపమొకింతలేదు; బుధకోటికిఁ గొంగుఁబసిండి; సత్యమా
 రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంత్రుఁడు; నూతన ప్రియా 
టోపములేని నిశ్చలుఁ డిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁ గా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందనున్ ?

చ„

ఒరిమయు, భక్తియున్, నెనరు నోర్పుఁ గనంబడఁ బెద్దపిన్నయం 

తరువులెఱింగి, మాట జవదాఁటకె, చెయ్యుల వేఱులేక, యొం 

డొరుల మనమ్ములో మెలఁగుచుండిరి, "పాండు కుమారులెంత 

నే ర్పరు ? లిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమీ !” యనన్.

చ॥

అతని నుతింప శక్యమె ? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్ 

బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్. 

క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్ము నం, 

దతని కతండె సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్..


5. శతక మధురిమ

మ॥

"కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్ 

జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్, 

జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్ ! 

దలకం డుబ్బఁడు చొప్పుదప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా !

శా ||

జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించు టన్యాయ వి 

ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌట మి 

థ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ శ్రీ

 తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా !


మ||

చెవికిం గుండల మొప్పుగాదు శ్రుతమే చేదమ్మికిన్గంకణం 

బు విభూషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్ 

బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌఢియే నిక్కమౌ 

లవితేంద్రాతిగ వైభవా ! సురభిమల్లా ! నీతివాచస్పతీ !


ఉ॥

భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర

 జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై 

యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ 

క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా !


చం॥

ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్ 

ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ 

ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా 

ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!



॥ గరమునింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీయాత్మలో 

మురియంబోకు మనుష్యదుర్విషమునున్మూలింపుమా ముందు యీ 

నరులందుండు విషమ్ము సూది నిడనైనన్సంధి లేదో ప్రభో 

హర శ్రీవేములవాడ రాజఫణి హారా ! రాజరాజేశ్వరా!


సీ॥ కూతురు చందాన కోడలిన్ జూచిన మండునే ఘోరముల్ మందిరమున ? కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ క్రమ్మునే అలజడుల్ కర్మశాల ? దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగాన ? పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు ?


తే॥గీ॥ అఖిల జీవుల తనవోలె నాదరింప ఉద్భవించునే యాపదలుర్వియందు?. వరశుభవిలాస ! శ్రీనింబగిరి నివాస! భవ్యగుణధామ ! నరసింహ ! దివ్యనామ !


ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్పుతో దేశికా. 

దేశంబుందలఁదాల్చి యోగ విధులక్ట్రాన్ సల్పుచున్. భవ్యమౌ

నాశీర్వాదము నొజ్జచేఁ బడసితానందంగనౌ సంచితం 

బౌశాంతంబును నచ్యుతార్చిత పదాబ్జా ! చంద్రమౌళీశ్వరా !


7. చెలిమి


'నెట్టన రేయినిం బగలు నేరమి వెట్టునటంచు వేలుపు ల్వెట్టియుఁ 

గొట్నముల్చలుప వ్రీలని చేబలు వొప్పు సోఁకుడుం 

బట్టము గట్టుకొన్న వృషపర్వుని కూఁతుర, 

నట్టి నేను నీ కట్టిన మైలఁ గట్టుదునె కావరమేటికి వచ్చెనీ' కనన్.


మత్తకోకిల.


'ఓలి రక్కసి వంగడంబున కొజ్జకూరిమి కూఁతుర 

న్నేలవేలుపుఁగన్నియం దగనీవు గట్టినపుట్టముం 

దాలుపందగునమ్మ నా' కని దాని కర్మిలిఁ బల్కఁ దా 

నాలకింపక నూతఁద్రోచి గయాళి యై చనియెన్వడిన్.


11. వాయసం


సీ॥ కాకిబలఁగమంచు గాబరా పడిదెల్పు తనబంధుజనుల యాదరణబొందు 'కాకిపిల్లలు కాకికే కడుముద్ద'ని తనబిడ్డలను గూర్చి తగవులాడు వదరుఁబోతును గాంచి వాదమ్ములో మించి లొట్టిమీఁదం గాకి లొల్లియనును పిల్లలందఱుఁజేరి యల్లరి బెట్టఁగఁ గాకి గోలయని చీఁకాకు పఱచు



యూట్యూబ్ లింక్స్


పాఠశాల స్థాయి 

10వ తరగతి

9వ తరగతి

8వ తరగతి

7వ తరగతి

6వ తరగతి


విద్యార్థులకు సంబధించిన


సంస్కృత సంధులు

తెలుగు సంధులు

చంధస్సు

సమాసములు

zphs ఇందిరానగర్, సిద్దిపేట


1 కామెంట్‌: