సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

18, సెప్టెంబర్ 2023, సోమవారం

X 7. శతక మధురిమ


 7.శతక మధురిమ 
- వివిధ శతక కవులు



పాఠం ఉద్దేశం:
సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్య పాదం చివర ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్య భాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతక పద్యాలు ఉన్నాయి.


కవి పరిచయాలు

1. సర్వేశ్వర శతకం రచయిత యథావాక్కుల అన్నమయ్య 13వ శతాబ్దం. ఇతని శైలి ధారాళమైనది.

2. శ్రీకాళహస్తీశ్వర శతకం రచయిత ధూర్జటి. 16వ శతాబ్దం ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు.

3. మల్లభూపాలీయం రచయిత ఎలకూచి బాలసరస్వతి. నాగర్ కర్నూల్ జిల్లాలోని జటప్రోలు సంస్థానాధీశుడు అయిన సురభి మాధవ రాయల ఆస్థాన కవి. తెలుగులో మొదటి త్యర్ధి కావ్యమైన రాఘవయాదవపాండవీయంను రాశాడు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించిన తొలి కవి.

4. దాశరధి శతకం రచయిత రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న. గోపన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నివాసి. భద్రాచలంలో శ్రీ రామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. శ్రీరాముని పై ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు.

5. నరసింహ శతకం రచయిత కాకుత్థ్సం శేషప్ప కవి. ఇతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన సామాజిక స్పృహ కనిపిస్తుంది.

6. విశ్వనాథేశ్వర శతకం రచయిత గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ. 300కు పైగా అష్టావధానాలు చేసి ‘అవధాని. శశాంక ఆశుకవితా కేసరి’ అన్న బిరుదు పొందాడు.

7. శ్రీ లొంకరామేశ్వర శతకం రచయిత నంబి శ్రీధరరావు. ఇతనికి కవిరాజ అను బిరుదు కలదు.

8. వేణుగోపాల శతకం రచయిత గడిగె భీమకవి. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం.

ప్రవేశిక

మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? స్నేహితులు ఎట్లా ఉంటారు? భగవంతుని గుణాలు భక్తులతో ఎట్లా ఉండాలి? కీర్తిమంతుడు ఎవరు? మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి? అని తెలుపుతూ వివిధ శతక కర్తలు రాసిన పద్యాలను ఈ పాఠంలో గలవు.

కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు


       

మత్తేభం

   I   U

U      I   

 U   I    U

 I   I   I

U    U   U

 I    U   U  

   I   

భ  వ  దీ 

యార్చన   

 సేయుచోఁ 

 ప్ర థమ 

పు ష్పంబె

న్నసత్యం   

బు, రెం

శార్ధూలమ్ షట్కాట్ : మా సభ (ఫోర్టీన్) 14

1వ అక్షరానికి 14 కి యతి మైత్రి

సభరణమయవ అను గణాలుండును. 

  మొత్తం అక్షరాలు 20

                    నాలుగు పాదములుండును 

                    ప్రాస నియమం కలదు 

 



మ. భవదీయార్చన  సేయుచోఁ   ప్రథమ  పుష్పంబెన్న సత్యంబు, రెం
      డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా  సమో
      త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
      గవిధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా !                 

  సర్వేశ్వర శతకము-  యధావాక్కుల అన్నమయ్య 

ప్రతిపదార్థము 

సర్వ + ఈశ్వరా = లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వరా!
భవదీయ    = నీ
ఆర్చన.       = పూజ
చేయుచో = చేసేటప్పుడు
ప్రథమ మొదటి
పుష్పంబు  =  పుష్పం
ఎన్నన్       = ఎంచుకొనగా
సత్యంబు = సత్యం
రెండవ   = రెండవ 
పుష్పంబు = పుష్పం
దయాగుణంబు = కారుణ్యమనే గుణం (దయ)
అతి విశిష్టం = అతి శ్రేష్టమైనదిగా భావించగా
తృతీయ = మూడో
పుష్పము + అది =  పుష్పం
అతి       = మిక్కిలి
విశిష్ట  = విశిష్టమైన
ఏకనిష్టా = ఏకాగ్రతతో
సమోత్సవ  = సమానమైన
సంపత్తి       = సంపదగా
అది     = ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం
భాస్వద్భక్తిసంయుక్తి యోగ విధానంబు
బాస్వత్ =  ప్రకాశించే
భక్తి        = భక్తి
యోగ.   = యోగ విద్య
విధానం = అభ్యసించే తీరు
సంయుక్తి = కలసే విధానంగా
అవి = ఆ మూడు పుష్పాలు
లేని = లేని
పూజలను = పూజలను
మదిన్ = మనస్సులో
గైకోవు = అంగీకరించవు కదా ! (అంగీకరించవు అని అర్థం)

తాత్పర్యము ఓ సర్వేశ్వరా ! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా !
                  1. సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ. మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తియోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవుకదా!



         

          

 

శార్ధూలమ్

U   U   U 

  I    I    U

 I    U    I  

 I    I   U

U    U    I 

U   U    I  

      U 

 రూ రం

  ను  లె

ల్ల   బి   క్ష

మి  డ రో,

యుండం గు

   ల్గ   ల్గ

     వో

            1.      శార్ధూలమ్  లక్షణాలు : (వృత్త పద్యం)

  1. ఇందులో 4 పాదాలుంటాయి.
  2. , స జ,,,,అనే గణాలు (19 అక్షరాలు) ఉంటాయి.
  3. ప్రతి పాదంలో 1 వ అక్షరానికి - 13వ అక్షరం యతి స్థానం.
  4. ప్రాసనియమం ఉంటుంది.
శా. ఊరూరం జనులెల్ల బిక్షమిడరో, యుండం గుహల్గల్గవో
     చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
     పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో
     చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!    

ప్రతిపదార్థము

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !
ఊరూరన్ = ప్రతి గ్రామములోనూ
జనులు + ఎల్లన్ = ప్రజలందరూ
భిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?
ఉండన్ = నివసించడానికి
గుహల్ = గుహలు
కల్గవు+ఓ                 =  కలిగి లేవా
చీరానీకము
(చీర + అనీకము) = వస్త్రముల గుంపు
వీథులన్ = వీధులలో (అంగళ్ళలో)
దొరకదో = దొరకవా ?
శీతామృత స్వచ్ఛవాః పూరంబు ;
శీత        = చల్లని
అమృత = అమృతము వంటి తియ్యని
స్వచ్ఛ      = నిర్మలమైన
వాఃపూరంబు = జలప్రవాహము
ఏఱులన్ = సెలయేళ్ళలో 
(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?
తపసులన్ = తపశ్శాలులను
బ్రోవంగన్ = రక్షించడానికి
నీవు = నీవు
ఓపవో 
(ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?
జనుల్            = ప్రజలు
రాజులన్        = రాజులను
చేరన్   = సమీపించడానికి
పోవుదురు + ఏల = ఎందుకు పోతారో కదా! !                                 

  శ్రీకాళహస్తీశ్వరా! 
తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. 
నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధుల్లో(అంగళ్లలో) దొరుకుతాయి. 
తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. 
తాపసులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు.

           

మత్తేభం

   I   U

    I   

 U   I    U

 I   I   I

U    U   U

 I   U   U  

   I   

సి  రి లే

 కై     వి   

భూ షితుం 

డె యయి

భా  సి  ల్లు

బు ధుం డౌ   

  ద లన్

శార్ధూలమ్ షట్కాట్ : మా సభ (ఫోర్టీన్) 14
1వ అక్షరానికి 14 కి యతి మైత్రి .
  మొత్తం అక్షరాలు 20

స,భ, ర న మ య వ అను గణాలుండును.   

నాలుగు పాదములుండును 

        ప్రాస నియమం కలదు 

మ. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లు బుధుండౌదలన్
      గురుపాదానతి కేల నీగి చెవులందున్విన్కి వక్ర్తంబునన్
      స్థిర సత్యోక్తి భుజంబులంన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
      హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతీ!                             

ప్రతిపదార్థము

సురభిమల్లా = ఓ “సురభిమల్ల” భూపాలుడా !
నీతివాచస్పతీ = నీతిశాస్త్రమునందు దేవతల గురువైన బృహస్పతి వంటివాడా !
ఔదలన్ = శిరస్సునందు
గురుపాదానతి
(గురుపాద + ఆనతి)
గురుపాద  = గురువుగారి పాదాలకు
ఆనతి = మ్రొక్కుటయు (నమస్కరించడము చేయడము ను చెవులందు శాస్త్ర శ్రావణమును ముఖమునందు స్థిరమైన సత్యోక్తి)
కేలన్ = చేతియందు
ఈగి = దానగుణమునూ
చెవులందున్ = చెవులయందు
విన్కి = శాస్త్ర శ్రవణమునూ (శాస్త్రములు వినుటయూ)
వక్త్రంబునన్ = ముఖమునందు
స్థిర                   = స్థిరమైన
సత్యోక్తి 
(సత్య + ఉక్తి) = సత్యమైన వాక్కునూ
భుజంబులన్ = భుజములందు
విజయమున్ = విజయమునూ
చిత్తంబునన్ = మనస్సు నందు
 సన్మనోహర సౌజన్యము ;
సత్ = చక్కని
మనోహర = ఇంపైన
సౌజన్యము = మంచితనమునూ
కల్గినన్ = కల్గి ఉన్నట్లయితే
బుధుండు = పండితుడు
సిరి = ఐశ్వర్యం, సంపదలు
లేకైనన్
(లేక +ఐనన్) = లేకుండా ఉన్నా (లేకపోయినా)
విభూషితుండె ;
(విభూషితుండు + ఎ) = అలంకరింపబడినవాడే
అయి = అయి
భాసిల్లున్ = ప్రకాశిస్తాడు

       నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్లా! 
తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, 
దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, 
భుజబలంతో విజయాలను పొందేవాడు, 
మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు
 సంపదలు లేకున్నా  ప్రకాశిస్తాడు.

ఉ.    

ఉత్పలమాల

    I   I

  I    U

 I    I   I  

 U  I   I   

 U   I   I 

  I   U   

    I  

భం డ  న

భీ ముఁ డా

 ర్థ  జ  న 

బాంధ వుఁ

డు  జ్వ ల

బా ణ తూ

    ణ కో

ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10

1.     చంపకమాల లక్షణాలు : (వృత్త పద్యం)

2.     ఇందులో 4 పాదాలుంటాయి.

3.     , , , , , , ర అనే గణాలు (21 అక్షరాలు) ఉంటాయి.

4.     ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.

5.     ప్రాసనియమం ఉంటుంది.



ఉ. భండనభీముఁ డార్థజన బాంధవుఁ డుజ్వల బాణతూణ కో
    దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
    రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
    డాండ డడాండడాండ నినదంబులజాండము నిండ మత్తవే
    దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!      

ప్రతిపదార్థం 

దాశరథీ   = దశరథుని కుమారా !
కరుణా       = దయా
పయోనిథీ  = సముద్రునివైన ఓ రామా !
భండన      = యుద్ధరంగంలో
భీముడు    = నీవు  శత్రు భయంకరునివని
ఆర్తజన      = దుఃఖాలు పొందేవారి పాలిట
బాంధవుడు = బంధువువని
ఉజ్వల     = కాంతిమంతమైన
తూణ     = అమ్ములపొది
బాణ     = బాణాలు
కోదండ     = కోదండములు
కళాప్రచండ = ఉపయోగించే నేర్పులో ప్రచండమైన
భుజతాండవ = భుజతాండవం చూపి
కీర్తికి         = కీర్తిపొందిన
రామమూర్తికిన్ = శ్రీరామచంద్రునకు
రెండవసాటి  = సాటివచ్చే మరియొక
దైవం           = దైవము
ఇకన్     = ఇంక
లేడనుచున్  = లేరని
గడగట్టి      = స్తంభము నాటి
భేరికా       = ఢంకా యొక్క
డాండ డడాండ, డాండ = డాం డాం డాం అనే
నినదంబులు = ధ్వనులు
అజాండము = బ్రహ్మండం
నిండన్ = వ్యాపించే విధంగా
మత్త = మదించిన (మదమెక్కిన)
వేదండమునెక్కి = ఏనుగునెక్కి
చాటెదను = చాటుతాను                
  
     దశరథుని కుమారా! దయాసముద్రునివైన ఓ శ్రీరామా! 
నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందే వారి పాలిట బంధువువు, కాంతివంతమైన బాణాలు, అమ్ములపొది, కోదండము కలిగి, ప్రచండ భుజ తాండవ ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగునెక్కి ఢంకా మోగిస్తూ భూమండలమంతా డాం డాం డాం అని వినబడేటట్లు చాటుతాను!

సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
                              సకల గ్రంథమ్ములు చదివినట్లు
     బిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
                         జేముట్టి దానంబు చేసినట్లు
     మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
                              నింపుగా బహుమాన మిచ్చినట్లు
     దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలుఁ
                              గనకకంభపుగుళ్ళు గట్టినట్లు

తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ
        బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
        భూషణవికాస! శ్రీధర్మపురి నివాస!
        దుష్టసంహార! నరసింహ! దురితదూర!        

ప్రతిపదార్థము

భూషణవికాస = అలంకారాల చేత శోభిల్లేవాడా !
శ్రీ ధర్మపుర నివాస = ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా !
దుష్టసంహార = దుష్టులను సంహరించేవాడా !
దురితదూర = పాపాలను పోగొట్టేవాడా !
నరసింహా = నరసింహా
హరిదాసులను = విష్ణుభక్తులను
నిందలాడకుండిన + చాలు = నిందించకుండా ఉంటే చాలు
సకల గ్రంథాలను = అనేక గ్రంథాలను
చదివినట్లు = చదివినట్లే
భిక్షము + ఇయ్యంగ = భిక్షమిచ్చేవారిని
తప్పింపకుండినచాలు = ఆపకుంటేచాలు
చేముట్టిదానము = అది దానము
చేసినట్లే = చేసినట్లే
మించి = అతిసయించి, ఉప్పొంగి
సజ్జనుల = సజ్జనులను
వంచింపకుండిన = మోసం చేయకుండా ఉంటే
చాలు = చాలు
ఇంపుగా = చక్కగా
చాలు = చాలు
బహుమానమిచ్చినట్లు = బహుమతినిచ్చినట్లే
దేవ = దేవతా
అగ్రహారముల్ = మాన్యములను
తీయకుండిన = ఆక్రమించకుండా ఉంటే
చాలు = చాలు
కనకకంబపు = అది ధ్వజస్తంభంతో కూడిన
గుళ్ళు + కట్టినట్లు = గుళ్ళు కట్టించినట్లే
ఒకరి = ఇంకొకరి
వర్షాశనము = వర్షాసనం (ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని)
మంచుకున్న = పాడు చేయకుండునట్లైతే
చాలు = చేయకుంటేచాలు
పేరు = తన పేరుతో
కీర్తిగ = కీర్తితో
సత్రముల్ = సత్రాలు
పెట్టినట్లు = కట్టించినట్లే అవుతుంది
                                     

    అలంకారాలచేత శోభిల్లేవాడా! ధర్మపురిక్షేత్రంలో వెలసిన వాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరంచేసేవాడా! నరసింహా! విష్ణుభక్తులను నిందించకుండా ఉంటేచాలు, అనేక గ్రంథాలను చదివినట్లే, బిక్షమిచ్చేవారిని ఆపకుంటేచాలు అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటేచాలు. గొప్ప బహుమతిని ఇచ్చినట్లే, దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటేచాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడికట్టించినట్లే, ఇంకొకరి 'వర్షాశనాన్ని' (ఒక ఏడాదికి సరిపడా భోజనాన్ని) ముంచకుంటేచాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది.

మత్తేభం

   I   U

    I   

 U   I    U

 I   I   I

U    U   U

 I   U   U  

   I   

ఘ ను డ

 వ్వా డగు,

వే డుత్యా

గమయ

దీ క్షం బూ

ని  స ర్వం  

  స హా

శార్ధూలమ్ షట్కాట్ : మా సభ (ఫోర్టీన్) 14

  1.  ఇందులో పాదాలుంటాయి.
  2. , భ, ర, న, మ య, ,వ అనే గణాలు (19 అక్షరాలు) ఉంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతి స్థానం.
  4. ప్రాసనియమం ఉంటుంది.

మ. ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా
      జన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ
      వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
      అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా! విశ్వనాథేశ్వరా!                     6

ప్రతిపదార్థము

విశ్వనాథేశ్వరా ! = విశ్వనాథేశ్వరా !
వేడు = ఎవడు
త్యాగమయ = త్యాగంతో కూడిన
దీక్షన్ + పూని = దీక్ష ( దీక్ష పట్టుదల)ను పూని
సర్వం  = మొత్తం
సహజన.  =   జనులందరి
దైన్యస్థితి + పోనడంచి = దీనస్థితిని రూపుమాపి
సకల = అందరికి (సమస్తమైన, అన్ని)
ఆశాపేశ = కోరికలతో అలంకరింపబడిన
ఆనంద = ఆనందకర
జీవన సంరంభము = జీవిత సుఖాన్ని
పెంచి = పెంచి
దేశ జననీ = మాతృదేశపు
ప్రాశస్త్యమున్ = గొప్పతనాన్ని
పంచునో = ఎవరయితే విశదపరుస్తారో
అవ్వాడు (అ+వాడు) = అటువంటివాడే
అనిదంపూర్వ    = నిందించుటకు వీలులేని
ఘనుడు + అగున్ = గొప్పవాడు 
యశస్వి + ఆతడగు = అపూర్వమైన కీర్తిమంతులవుతాడు


     విశ్వనాథేశ్వరా! త్యాగం తో కూడిన దీక్షను పోనీ జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవితసుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్ప వారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు.

         శార్ధూలమ్

U   U   U 

  I  I    U

 I    U   I  

 I   I   U

  U   U   I 

U   U    I  

      U 

పొ త్తంబై 

 కడునే

ర్పుతో హి త ము ను  ద్భో దించు  మిత్రుండు, 

   సం

శార్ధూలమ్ షట్కాట్ : శా మస (తర్థీన్) 13

  1. 1వ అక్షరానికి 13 కి యతి మైత్రి  మొత్తం అక్షరాలు 19

    1.     శార్ధూలమ్  లక్షణాలు : (వృత్త పద్యం)

    1. ఇందులో 4 పాదాలుంటాయి.
    2. , స జ,,,,అనే గణాలు (19 అక్షరాలు) ఉంటాయి.
    3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థానం.
    4. ప్రాసనియమం ఉంటుంది.

శా. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోదించు మిత్రుండు, సం
     విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా
     యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో
     చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వరా!         
          7
ప్రతిపదార్థము 

శ్రీలొంకరామేశ్వరా ! = ఓ లొంకరామేశ్వరా !
మిత్రుండు = మిత్రుడైనవాడు
పొత్తంబు + ఐ = పుస్తకం మాదిరిగా
కడున్ = మిక్కిలి
నేర్పుతో = నేర్పుతో
హితమున్ = మంచిని
ఉద్బోధించు = బోధిస్తాడు
ఒక = ఒకానొక
కార్య = కార్య
సాధనమునన్ = సఫలతలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
వెల్గొందు = విలువైన
సంవిత్తంబు + ఐ = ధనం వలె
వెల్గొందు = ఉపకరిస్తాడు
అరులన్ = శత్రు నాశనంలో
మిత్రుండు = మిత్రుడైనవాడు
స్వాయత్తంబు + ఐన = స్వాధీనమైన
కృపాణము + ఐ = కత్తి వలె
ప్రోచు = రక్షించె వాడిగా
తగన్ = తగినవిధంగా
ఆహారించు = సహాయపడతాడు
ప్రోచిత్తంబు + ఐ = నిండు మనస్సై
సుఖమిచ్చు = సుఖాన్నిస్తాడు.

     ఓ లొంక రామేశ్వరా! మిత్రుడైన వాడు పుస్తకంమాదిరిగా మిక్కిలినేర్పుతో మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనంవలె ఉపకరిస్తాడు. శత్రునాశనంనాశనంలో స్వాధీనమైన కత్తివలె సహాయపడుతాడు. నిండు  మనస్సై సుఖాన్నిస్తాడు.

సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు
                             మాయమాటల సొమ్ము దీయువాడు
    కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
                             లంచంబులకు వెల బెంచువాడు
    చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు                   
     వరుసవావికి నీళ్ళు వదులువాడు
    ముచ్చటాడుచు కొంప ముంచ జూచెడివాడు                                      కన్నవారల గెంటుచున్నవాడు
తే.గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
       రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర!
       కృపనిధీ! ధరనాగరకుంటపౌరి!
       వేణుగోపాలకృష్ణ! మద్వేల్పు శౌరి!    

ప్రతిపదార్దము

“కృపనిధీ = దయకు నిధివంటివాడా !
రామచంద్ర = ఓ శ్రీ రామచంద్రా !
ధర నాగరకుంటపౌరి = నాగరకుంటపురమునందు కొలువైన వాడా !
వేణుగోపాలకృష్ణ = ఓ వేణుగోపాలకృష్ణా
మత్ + వేల్పు = నా దైవమా !
శౌరి ! = శ్రీ కృష్ణా !
కలన్ + ఐన = కలలో కూడా
సత్యంబున్ = సత్యాన్ని
పలుకన్ + = పలకడానికి
ఒల్లనివాడు = ఇష్టపడనివాడు
మాయమాటలు = మాయమాటలు చెప్పి
సొమ్మున్ = ఇతరుల సొమ్మును
తీయువాడు = అపహరించేవాడు
కులగర్వమున = కుల గర్వంతోటి
పేద = పేదవాండ్ల
కొంపల్ = ఇండ్లను
ఆర్చెడివాడు = నాశనం చేసేవాడు
లంచంబులకు = లంచాలకు
వెలన్ = విలువను
పెంచువాడు = పెంచేవాడు
చెడు ప్రవర్తనలందు = చెడు ప్రవర్తనతో
చెలగితిరుగువాడు = తిరిగేవాడు
వరుసవావికి = వావివరుసలను
నీళ్ళు వదలువాడు = పాటించనివాడు
ముచ్చటన్ + ఆడుచూ = నవ్వుతూ ముచ్చటాడుతూనే
కొంప = ఎదుటివాడిని
ముంచ = నాశనం
చూచెడివాడు = చేయాలనుకునేవాడు
కన్నవారల = తల్లిదండ్రులను
గెంటువాడు = ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు
పుడమిలో = ఈ భూమిమీద
నరరూపుడై = మానవరూపంలో ఉన్న
పుట్టియున్న = పుట్టినట్టి
రాక్షసుడుగాక = రాక్షసుడుగాని
(వేరు + ఔన) వేరౌన = వేరొకరు గారు కదా !
                                             

.దయకు నిధివంటివాడా! నాగరకుంట పురమునందు కొలువైనవాడా! వేణుగోపాలకృష్ణా! నా దైవమా! శౌరీ! కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కులగర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావివరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడుగాని వేరొకడుగాడు కదా!






I. అవగాహన ప్రతి స్పందన

1.  శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయని భావిస్తున్నారా? ఎందుకు చర్చించండి. 



2. కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.

అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తి వలే ఉపయోగపడతాడు.


రాముని మించిన దైవం లేదన చాటుతాను. 


3. విద్వాన్ కల్వకుంట కృష్ణమాచార్య రచించిన కింది పద్యాన్ని చదవండి భావాన్ని సొంతమాటల్లో రాయండి పద్యానికి తగినట్టు శీర్షికను పెట్టండి. 


అనుభవమున్న నేర్చిన యట్టి చదువు 

తండ్రి వలె కాపునిచ్చును తాను ముందు 

పడిన కష్టాలచే గుణపాఠమయ్యి

 తగిన ప్రేరణ - కాపాడు తల్లి వోలే


భావం :



శీర్షిక:


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత


1.కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?

(లేదా)

కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.

జ.:త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.


ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?

(లేదా)

త్యాగి లక్షణాలను వివరించండి.

త్యాగి లక్షణాలు

జ..నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.

అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.

గొప్ప కోసం చూడడు.

కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.

తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.

ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.


ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?

జ. మంచి స్నేహితుని మించిన పుస్తకం:

మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.


అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.


ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?

జ. ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.


2. క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.


అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.

(లేదా)

శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.

జ. శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.


సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.


ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.


శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.


‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.



3. క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.




అ) శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.

జ:

సిద్దిపేట ,

--/--/2023.

ప్రియమైన మిత్రునకు,

ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.


అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :


పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.

రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.

శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.

మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.

అలవర్చుకోకూడని గుణాలు :


విష్ణు భక్తులను నిందించరాదు.

భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.

సజ్జనులను మోసం చేయరాదు.

దేవతామాన్యములను ఆక్రమించరాదు.

అసత్యాన్ని పలకరాదు.

మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.

మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.

ఇట్లు,
నీ మిత్రుడు,

X X X X X.


చిరునామా :

 

పి. అంజిరెడ్డి ,

10వ తరగతి,

జిల్లాపరిషత్ హైస్కూల్,

ఇందిరానగర్,

 సిద్దిపేట  (జిల్లా.)


(లేదా)


ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.

జవాబు:

6వ పద్య భావం ఆధారంగా నీతి కథ


త్యాగం: అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరులకు ఇవ్వడం దానం.

    తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.

     చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో నలభై ఎనిమిది రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.

     అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.

 వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి. రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.


శతక పద్యాలు నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు


  1. శతకంలోని పద్యాలు కేవలం ఒకే పార్వ్శంలో కాకుండా అన్ని విషయాలు తెలియజేస్తాయి 
  2. శాంతీని కలిగి ఉండడం 
  3. కోపం లేకుండా ఉండడం 
  4. మర్యాదతో వ్యవహరించడం 
  5. విచక్షణ తో మెలగడం. తెలిపే మానవ గుణాలు,
  6. నైతిక విలువలు, మానవీయ విలువలు, 
  7. నవ సంభాధాలు కలిగి ఉండడం.
  8. ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియ జేస్తాయి 
  9. జీవిత విధానాలపై స్పష్టతను ఇస్తాయి. 

  10. ఆలోచనలను పెంచుతాయి. ఆలోచింపజేస్తాయి. 
  11. జీవితానికి ఏవి అవసరం, ఏవి అనవసరమో తెలియజేస్తాయి

III. భాషాంశాలు

పదజాలం

ప్రశ్న 1.
క్రింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) భాసిల్లు = ప్రకాశించు
జవాబు: విద్యార్థులు ప్రజ్ఞ తో భాసిల్లాలి.

ఆ) ఉద్బోధించు = మేలుకొల్పుట, రగల్చు
జ.  మహనీయుల ప్రసంగాలు మనకు జ్ఞానం ఉద్భోధిస్తాయి.

ఇ) దైన్యస్థితి = దారిద్ర్యం చేత కలుగు దురవస్థ, దీనత్వం
జ. సత్య హరిచంద్రుడు   దైన్యస్థితిలో జీవనం సాగించాడు.

ఈ) నరరూప రాక్షసుడు = మనుష్య రూపంలోని రాక్షసుడు
జ. హిట్లర్  నరరూప రాక్షసుడు.

2. క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి. రాయండి.

అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది.
జ. ఏనుగు, గజము, కరి, నాగము.

ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జ. స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.

ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జ. కృపాణం, కత్తి, అసి.

ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జ. కనకం, బంగారం, స్వర్ణం, పసిడి.


 3.క్రింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.

అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జ.  దిశ (ప్రకృతి) – దెస (వికృతి)

ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జ. సముద్రం (ప్రకృతి) – సంద్రం (వికృతి)

ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం.
జ. రాజు (ప్రకృతి) – రాయడు (వికృతి)

వ్యాకరణాంశాలు

1. క్రింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
జ. బుద్ధిమంత + ఆలు = బుద్ధిమంతురాలు-- – రుగాగమ సంధి

ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో !
ఆ + చోట = అచ్చోట = త్రిక సంధి

ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.

దివ్య + ఔషధం = దివ్యౌషధం = వృద్ధి సంధి

ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
జవాబు:
సాహసవంత + ఆలు = సాహసవంతురాలు – రుగాగమ సంధి

ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
సమ + ఐక్యత = సమైక్యత = వృద్ధి సంధి

ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.

ఏ + కాలము = ఎక్కాలం = త్రిక సంధి










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...