సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

IX- 4. దాశరథి రంగాచార్యతో ముఖాముఖి


చదువండి - ఆలోచించి చెప్పండి.

తెలంగాణకు చెందిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా॥ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి.

పత్రికా విలేఖరి : మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.

చేకూరి రామారావు : మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య, భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్ గా పదవీ విరమణ చేశాను.

పత్రికా విలేఖరి : మీకు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది?

చేకూరి రామారావు: : నేను రాసిన 'స్మృతి కిణాంకం' అనే వ్యాస సంకలనానికి 2002 సం॥లో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది.

పత్రికా విలేఖరి : వాడుకభాష గురించి చెప్పండి.

చేకూరి రామారావు : వ్యావహారిక భాషావాదమంటే మాట్లాడినట్లు రాయడం కాదు, మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు. ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం.

పత్రికా విలేఖరి : తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం.

చేకూరి రామారావు :

ఇన్ని కోట్లమంది మాట్లాడే భాష కనుమరుగుకాదు. కాకపోతే మన తెలుగులో ఇతర

భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది.

ప్రశ్నలు:

1. పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు?

SCEA

2. పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?

3. ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?

పాఠం ఉద్దేశం

తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటినుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళార చూసిన సాహితీయోధుడు డా॥ దాశరథి రంగాచార్య, తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వస్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం.




కవి పేరు :        దాశరధి రంగాచార్య 
జననం :         24 ఆగస్టు 1928
 మరణం :        7 జూలై 2017 
జన్మస్థలం :     చిన్న గూడూరు మహబూబాబాద్ జిల్లా.
 సోదరులు :     దాశరధి కృష్ణమాచార్య అనువాదములు:  నాలుగు వేదములను 10                                             ఉపనిషత్తులు సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు.
 రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలో రాశారు.
రచనలలోని ప్రత్యేకత : తెలంగాణ రైతాంగ పోరాటం, పాత్రోచిత యాస ప్రవేశపెట్టారు.
 పురస్కారం : చిల్దేలర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య కణం పురస్కారం లభించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

అ).దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
దాశరథి రంగాచార్య తాను రచనలు సమాజంలో చూసిన బాధలు వ్యథల్లోంచి రాశానని చెప్పుకున్నాడు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.

తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?



ఆ). తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని ఇచ్చిందని రచయిత అనడంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని దాసులకు రంగాచార్య పాత్రికేయ విలేకరితో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రంగాచార్య గారు వ్యాసాలు లేఖలు రాసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. తన బాల్యకాలం నుంచి ఇక్కడి ప్రజల ఆకాంక్ష ను చూస్తూనే ఉన్నాడు ఈ బలమైన కోరిక ఇప్పుడు నెరవేరడం రాష్ట్రం సిద్ధించడం వల్ల సంతోషంగా ఉందని ఆనందాన్ని వెలిబుచ్చాడు.

ఇ) ప్రజల భాష అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
ప్రజల భాష అనగా ప్రజలు మాట్లాడే భాష.  మాండలికంలో స్థానిక యాస భాషలతో ప్రజలు మాట్లాడుతారు.  అందులో వివిధ వ్యక్తీకరణలు విభిన్నంగా ఉంటాయి.  వీటిని ఏ పుస్తకాల్లోనూ మనము చూడలేము కాబట్టి ఇది ప్రజల భాష ప్రజలు మాట్లాడుతున్న భాషనే ప్రజల భాష అంటారు.

ఈ) రంగాచార్య రచనకు తెలుగు తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు.

జ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాలుపంచుకున్న రచయిత దాశరథి రంగాచార్యులు. రైతులు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటంలో వీరు భాగమయ్యారు. దగ్గరగా చూసిన జీవితాన్ని రంగాచార్య గారు ప్రజల భాషలో రాశారు వారి ప్రభావాత్మకమైన నవల అది వారి ఆత్మ కథ జనపదం. చాలా విశాలమైన విస్తృతమైన నవల సమాజాన్ని మైక్రోస్కోపిక్ లో చూసిన నవల.
 చిల్లర దేవుళ్ళు నవల ప్రభావంతమైన నవల. ఇదే కాకుండా మరికొన్ని నవలల్లో తెలంగాణ జనజీవనాన్ని మాత్రమే వారు ఇతివృత్తంగా తీసుకున్నారు 

2) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

 1. దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి
 (లేదా)
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.

తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.

కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు, కవి లేదా నాయకుడు వచ్చాడు అనుకోండి వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నల తయారు చేయండి.

జవాబు: నమస్కారం సార్ మీ బాల్యం గురించి చెప్పండి.

మీరు మీ విద్యాభ్యాస కాలంలో ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించారు?

మీరు కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?

మీ తొలి కవిత, తొలి పుస్తకం గురించి వివరించండి.

అచ్చైన తొలి కవిత లేదా తొలి పాట ఏమిటి?

మీరు కవిత్వం రాయడానికి ప్రేరేపించిన పుస్తకాలు ఏమిటి?

మీరు ఏ కవిని లేదా కళాకారుడిని అమితంగా ఇష్టపడతారు? ఎందుకు?

మీరు పొందిన పురస్కారాలు అవార్డులు బహుమానాల గురించి తెలియజేయండి?

కవిగా కళాకారుడిగా రాణించాలంటే ఏం చేయాలి?

కవిత్వం రాసిన వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?

3.మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుడు/ క్రీడాకారుడు / కవి రచయితతో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.
నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
ఏవైనా పుస్తకాలు రాశారా ?
మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? 
బాధపెట్టిన దెవరు ?
మీకు ఇష్టమైన కవి ఎవరు ?
మీకు బాగా 

III. భాషాంశాలు – వ్యాకరణం
పదజాలము కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఉదాహరణకు 
విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
వికాసం వికసించడం విప్పారడం
అ) రామప్ప గుడి శిల్పకళ సొగసులు వర్ణించ శక్యమా
సొగసు అందము సౌందర్యము శోభ

ఆ)వట్టికూట ఆళ్వారు స్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
ఉత్కృష్టం గొప్పది ఉన్నతమైనది

ఇ) భాగవతంలో కృష్ణ లీలలు సమగ్రంగా రాశారు 
సమగ్రం పరిపూర్ణం

ఈ)నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి క్షీణించు నశించు

2. కింది వాక్యాలలో గల వికృతి ప్రకృతిలో గురించి రాయండి.

అ)కథలు అంటే నాకిష్టమని మా నాయనమ్మ నాకు రోజు కతలు చెప్పింది.
కథలు - కతలు

ఆ) స్వచ్ఛభారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం ప్రతిన చేయడమే కాదు పని చేసి చూపుదాం.
ప్రతిజ్ఞ - ప్రతిన

 ఇ) ప్రజల కోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
కవిత - కైత

 ఈ) ఆశ ఉండవచ్చు మితిమీరిన ఆస ఉండరాదు.
ఆశ - ఆస

వ్యాకరణాంశాలు:

ఈ క్రింది పదాలను విడదీయండి సంధి పేరు రాయండి
సంధి పదం
పోయినాడంటే - పోయినాడు +అంటే = ఉత్వ సంధి.
ఏమని - ఏమి+ అని = ఇత్వ సంధి
కాదనుకున్నాడు - కాదు + అనుకున్నాడు = ఉత్వ సంధి
పిల్లలందరూ - పిల్లలు + అందరూ = ఉత్వ సంధి.

2. కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి సమాసం పేరు రాయండి.
ఉదాహరణ: మూడు సంఖ్యల రోజులు - మూడు రోజులు -ద్విగు సమాసం.

అ) రెండు సంఖ్యల రోజులు = రెండు రోజులు - ద్విగు సమాసం 
ఆ) వజ్రమూ వైడూర్యము =
 వజ్రవైఢూర్యాలు - ద్వంద మాసం
ఇ) తల్లియూ బిడ్డ యూ =తల్లి బిడ్డలు ద్వంద సమాసం.

కర్తరి వాక్యము కర్మణి వాక్యము
1) ఆల్వార్ స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. (కర్తరి వాక్యము)

 చిన్నప్పుడే అనే కథ ఆల్వార్ స్వామి చే రాయబడింది. (కర్మణి వాక్యము)

పై రెండింటిలో మొదటి వాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ రాశాడు. కర్త అల్వార్ స్వామిని సూచిస్తున్నది. ఇటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు.

 రెండో వాక్యం కర్మణి వాక్యం. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ (రాయబడింది) కర్మ చిన్నప్పుడే అనే కథను సూచిస్తుంది. ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి 'బడు' అనే ధాతువు చేరడం. రెండు 'చే' అనే విభక్తి చేరడం.

కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు.
 లింగయ్య చేత మా నాయకుడికి ఉసిరికాయ ఇవ్వబడింది.

ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు.
 బాలుచే ఇసుక  ఇల్లు కట్టబడింది.

ఇ)అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది 
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది.

4. కింద వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు.
గ్రామీణులు నాయకులను ఎదుర్కొన్నారు.

ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి.
కాయలన్నీ అతడు ముందర పోశారు.

ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది.
 బాలురు సెలవు తీసుకున్నారు.

5. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించువాడు - విద్యార్థి = ద్వితీయ తత్పురుష సమాసం

ఆ) గుణాల చేత హీనుడు -  గుణహీనుడు = తృతీయ తత్పురుష సమాసం.

ఇ) సభ కొరకు భవనం - సభా భవనం = చతుర్థి తత్పురుష సమాసం.

ఈ) దొంగ వల్ల భయం - దొంగ భయం = పంచమి తత్పురుష సమాసం.

ఉ) రాముని యొక్క బాణం - రామబాణం = షష్టి తత్పురుష సమాసం.

ఊ) గురువు నందు భక్తి - గురు భక్తి = సప్తమి తత్పురుష సమాసం.


ప్రాజెక్టు పని:




ఆహ్వాన పత్రం

ఆహ్వానం 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ 

30వ వార్షికోత్సవం


అక్టోబర్ 10, 2023 సాయంత్రం 5:30 గంటలకు మా పాఠశాల ప్రాంగణంలో నిర్వహింపబడే వార్షికోత్సవం కార్యక్రమానికి రావలసిందిగా మనవి.


అధ్యక్షులు :గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు

ముఖ్య అతిధి :గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు గారు

ఆత్మీయ అతిధి :జిల్లా విద్యాధికారి గారు

ప్రత్యేక ఆహ్వానితులు: కౌన్సిలర్లు

కార్యక్రమము 

జ్యోతి ప్రజ్వలన 

అతిధుల సందేశాలు విద్యార్థులకు బహుమతి ప్రధానం 

సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన 

వందన సమర్పణ


సూచన: దూరప్రాంతం వెళ్ళవలసిన విద్యార్థులకు తల్లిదండ్రులకు రాత్రి భోజనం వసతి ఏర్పాటు ఉంది గమనించగలరు


 ఇట్లు 

ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషక కమిటీ సభ్యులు,

 ఇంద్రానగర్.

20, సెప్టెంబర్ 2023, బుధవారం

ఉపాధ్యాయుల రోజు వారీ డైరీ



ఉపాధ్యాయులు ప్రతిరోజు తమ కాలం నిర్ణయ పట్టిక ప్రకారం కేటాయించిన పీరియళ్ళలో ఏ పీరియడ్ లో ఏ తరగతికి వెళ్తారు? ఏ పాఠం బోధిస్తున్నారు?  లేదా ఏ సామర్థ్యానికి అభ్యాసం కల్పించారో నమోదు చేయాలి? ఇందుకు అనుగుణంగా నమూనా ఉంది. పరిశీలించండి. ఇందుకోసం ఒక నోట్ బుక్ లేదా డైరీ వినియోగించుకోవాలి.

తేది: ఉపాధ్యాయుని పేరు:






ముగింపు:  భాషా బోధనాభ్యసన ప్రక్రియలను అర్థవంతంగా, ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా సోపానాల ప్రకారం నిర్వహించాలి. రోజువారీ అభ్యసన కల్పించాలి. తద్వారా భాషా సామర్ధ్యాలకు చెందిన అభ్యసన ఫలితాలు సాధింపజేయాలి.  (ఉన్నతి మాడ్యూల్, పుట సంఖ్య -83.)




 

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మంచి వక్తగా మారడానికి.....

మీ ప్రశ్నకు ప్రతిస్పందనగా, నేను మీ కోసం ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని కలిగి ఉన్నాను, కానీ మీరు ఈ మార్గాల్లో తీవ్రమైన కృషి మరియు ఫోకస్డ్ ఎగ్జిక్యూషన్ యొక్క స్వేద ఈక్విటీలో ఉంచాలి:

  • అద్దం ముందు మాట్లాడటం ప్రాక్టీస్ చేయడం, పని చేయడం ద్వారా, మీ ఉచ్చారణ, ఒత్తిడితో కూడిన శబ్దాలు మరియు మీ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా చెప్పండి;
  • మీ ప్రసంగం యొక్క పటిమను మెరుగుపరచడం;
  • మీ మాట్లాడే వేగాన్ని తగ్గించడం, తద్వారా మీరు ఆలోచించడానికి సమయాన్ని అనుమతించడం; పబ్లిక్ స్పీకింగ్ నిపుణులు ఈ చొరవను "పాజ్ ఫర్ పోయిస్" అని పిలుస్తారు ;
  • మీ పదజాలాన్ని విస్తరించేందుకు మరింత స్థిరమైన లేదా సెట్ చేసిన పదబంధాలు మరియు ఇతర పద రూపాలను పొందడం;
  • ఉత్పాదకత వ్యూహకర్త స్టీఫెన్ ఆర్ కోవీ చెప్పినట్లుగా, శ్రద్ధగా మరియు శ్రద్ధగా వినడం నేర్చుకోవడం: "మొదట అర్థం చేసుకోవడానికి, తరువాత అర్థం చేసుకోవడానికి! ";
  • సంభాషణను కొనసాగించడానికి మరియు మీరు ఇతరుల అభిప్రాయాల పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు చూపించడానికి మీ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం;
  • "మీ మాతృభాషలో అనువదించడాన్ని" వీలైనంత వరకు నివారించేందుకు, ఆంగ్లంలో మీ రోజు గురించి ఆలోచించడం;
  • సాధ్యమైన చోట, ఉచితంగా కూడా కొన్ని బహిరంగంగా మాట్లాడే గిగ్‌లలో పాల్గొనడం;
  • మీరు ఇంట్లో లేదా ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మాట్లాడటం;
  • బిగ్గరగా చదవడం;
  • రోజువారీ పరిస్థితులలో స్థానిక మాట్లాడేవారి సాధారణ భాషా వ్యక్తీకరణలను ఉపయోగించడం నేర్చుకోవడం మరియు సాధన చేయడం;
  • ఆంగ్ల పాటలతో పాటు పాడటం (చిట్కా: మొదట సాహిత్యాన్ని పరిశోధించండి);
  • ఆంగ్లంలో మీ స్థానిక భాష నుండి కథలు చెప్పడం మరియు/లేదా కథనాలను పంచుకోవడం;
  • ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి;
  • చదవండి, చదవండి మరియు విస్తృతంగా మరియు లోతుగా చదవండి, అలాగే వ్రాయండి, వ్రాయండి మరియు విపరీతంగా వ్రాయండి మరియు కోర్సు యొక్క, మాట్లాడండి, మాట్లాడండి మరియు మాట్లాడండి;
  • చివరిది కానీ, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ మీ మనస్సును తేలికగా లేదా రిలాక్స్డ్ మోడ్‌లో ఉంచడం!

ఇంగ్లీష్ మాట్లాడటంలో మీ ఆకస్మిక ప్రతిస్పందనలను రూపొందించడానికి మరియు మెరుగుపరచడానికి ఉద్దేశించిన మరిన్ని సాధ్యమైన అభ్యాసాలు ఇక్కడ ఉన్నాయి:

  1. DVD నుండి ఏదైనా హాలీవుడ్ మూవీని చూడండి మరియు 60 నిమిషాల పాయింట్ వద్ద దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మీ స్మార్ట్‌ఫోన్ రికార్డర్ ఫంక్షన్‌లో బిగ్గరగా మాట్లాడటం ద్వారా రన్నింగ్ కామెంటరీని చేయండి; మీరు 60 నిమిషాల కట్ ఆఫ్ పాయింట్ వరకు సినిమా ప్లాట్ గురించి మీ వ్యక్తిగత ముద్రలు మరియు/లేదా భావాల అవుట్‌లైన్‌తో మీ వివరణకు ముందు కూడా చేయవచ్చు;
  2. అంతర్జాతీయ వార్తల ప్రసారాన్ని వినండి మరియు మీ ప్రతిచర్యలను వ్యక్తీకరించడానికి మీ వంతు కృషి చేయండి; ప్రసారం చేయబడిన నివేదిక యొక్క హేతుబద్ధత మరియు ప్రేరణలను పరిశీలించడం ద్వారా - మళ్లీ, బిగ్గరగా మాట్లాడటం ద్వారా మీరు ఈ చొరవను మరింత విస్తరించవచ్చు; మీరు మీ రోజువారీ ఆంగ్ల వార్తాపత్రికను చదివేటప్పుడు కూడా ఈ మాట్లాడే చొరవను పునరావృతం చేయవచ్చు;
  3. ఏదైనా పోస్ట్‌కార్డ్ లేదా ఫోటో లేదా చిత్రాన్ని యాదృచ్ఛికంగా పట్టుకుని,
    వివరంగా వివరించడానికి కొనసాగండి - మళ్ళీ, బిగ్గరగా మాట్లాడటం ద్వారా - చిత్రంలో ఏమి ఉంది: 
    థీమ్ ఏమిటి/ముందుగా ఏమిటి/బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమిటి/మధ్యలో లేదా మధ్యలో ఏమిటి/ఏమి ఉన్నాయి కుడివైపు/ఎడమవైపున ఏముంది/పైన ఏముంది/కిందన ఏముంది/ఎగువ-కుడి/ఎగువ-ఎడమ/దిగువ-కుడి/దిగువ-ఎడమ/ఏం జరుగుతోంది/లోపలా లేదా బయట/ఎవరు ఉన్నారు/ వాతావరణం మరియు/లేదా సమయం ఎలా ఉంది; మీకు ఎలా తెలుసు/పోల్చండి మరియు కాంట్రాస్ట్/మీకు ఎలా అనిపిస్తుంది/మీకు నచ్చింది/మీకు నచ్చనిది/మీరు పోస్ట్‌కార్డ్ లేదా ఫోటో లేదా చిత్రంలో ఉండాలనుకుంటున్నారా; ఎందుకు మరియు ఎందుకు కాదు?
  4. ఒకసారి, సామాజిక సంభాషణలు/ఇంటెలిజెంట్ సెలూన్‌లు నిర్వహిస్తున్నారనే నెపంతో మీ స్నేహపూర్వక ఆంగ్ల ఉపాధ్యాయుడిని లేదా ఆంగ్లంలో అగ్రశ్రేణి కుక్కగా ఉన్న స్నేహితుడిని కప్పు లేదా సాధారణ శీఘ్ర భోజనానికి ఆహ్వానించండి;
  5. మీ నగరంలోని కొన్ని MNCలను గుర్తించండి, ఆపై, ఒక ఉత్పత్తి లేదా సేవ గురించి విచారించడానికి వారి కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేయండి లేదా కేవలం ఊహాజనిత సంభాషణ
    కోసం ఉత్పత్తి లేదా సేవ ఫిర్యాదు చేయండి;
    సహజంగా మీరు కొంత వాస్తవికతను ఉంచడానికి ముందుగా మీ హోంవర్క్ చేయాలి;
  6. ఏదైనా స్టార్‌బక్స్ అవుట్‌లెట్ లేదా మీ నగరంలోని ఏదైనా సూపర్‌మార్కెట్‌కి వెళ్లి, క్యూలో వేచి ఉన్న కాకేసియన్‌లతో స్నేహపూర్వకంగా కనిపించే వారితో సాధారణ ఆంగ్ల సంభాషణను ప్రారంభించండి;
  7. మీరు మీ నగరంలోని ఏదైనా పెద్ద అంతర్జాతీయ తరగతి హోటల్‌లోకి ప్రవేశించవచ్చు
    , రిసెప్షన్‌తో మాట్లాడినట్లు నటించవచ్చు - కోర్సు యొక్క ఆంగ్లంలో - విదేశాల నుండి మీ సందర్శకుల సమూహం కోసం వారి సౌకర్యాలను తనిఖీ చేయాలనే మీ కోరిక గురించి;
  8. ఏదైనా ఉంటే మీ నగరంలో అంతర్జాతీయ టోస్ట్‌మాస్టర్స్ క్లబ్‌లో స్థానిక అధ్యాయంలో చేరండి;
  9. మీ సాంకేతిక నైపుణ్యం మరియు స్వర నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాల కోసం మీ స్థానిక కమ్యూనిటీ క్లబ్, పబ్లిక్ లైబ్రరీ, బిజినెస్ లేదా ట్రేడ్ అసోసియేషన్‌లో పబ్లిక్ స్పీకింగ్ గిగ్‌లను ఉచితంగా చెప్పండి;

స్పష్టంగా చెప్పాలంటే, మీ వంతుగా కొంచెం చాతుర్యం మరియు కల్పనతో, మీ ఆంగ్ల కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచే అవకాశాలు వాస్తవంగా అపరిమితంగా ఉంటాయి.

మీ దైనందిన జీవితంలో మరియు వర్క్‌ఫ్లో కార్యకలాపాలలో భారీ ప్రయోజనం మరియు స్థిరమైన అప్లికేషన్ నుండి మాత్రమే మీ మౌఖిక సౌలభ్యం మరియు సంభాషణా పటిమ లభిస్తుందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను, నిజమైన వ్యక్తులతో నిజమైన కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటుంది.





సంపాదకీయం

సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకుని పత్రికలో తమ వ్యాఖ్యానంతో ఆ విషయానికి సంబంధించిన పూర్వపరాలను పరామర్శిస్తూ సాగే రచనను సంపాదకీ వ్యాసం అంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఆలోచించే విధంగా రాయగలగడం మంచి సంపాదకీయానికి గల లక్షణం. ఈ సంపాదకీయాలు, ఆయా కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో వీటిలో విభిన్న కాలాలకు అన్వర్తింపజేసుకోవచ్చు.


ఎడిటోరియల్ అనేది ఒక సమస్యపై వార్తాపత్రిక యొక్క అభిప్రాయాన్ని అందించే కథనం. ఇది సంపాదకులు మరియు వ్యాపార నిర్వాహకులతో రూపొందించబడిన వార్తాపత్రిక యొక్క పాలకమండలి అయిన సంపాదకీయ మండలి యొక్క మెజారిటీ ఓటును ప్రతిబింబిస్తుంది. ఇది సాధారణంగా సంతకం చేయబడదు. ఒక న్యాయవాది యొక్క అదే పద్ధతిలో, సంపాదకీయ రచయితలు ఒక వాదనను నిర్మించారు మరియు పాఠకులను తాము చేసే విధంగానే ఆలోచించేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. సంపాదకీయాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడానికి మరియు కొన్నిసార్లు ప్రజలు సమస్యపై చర్య తీసుకునేలా చేస్తాయి. సారాంశంలో, సంపాదకీయం అనేది ఒక అభిప్రాయంతో కూడిన వార్తాకథనం.


సంపాదకీయం అనేది వార్తాపత్రిక/వార్తా అవుట్‌లెట్ యొక్క సామూహిక అభిప్రాయం లేదా కేవలం ఒక వ్యక్తి (సాధారణంగా ఒక నిర్దిష్ట అంశంపై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి) యొక్క అభిప్రాయం కావచ్చు. జర్నలిజంలో, వార్తలను నివేదించేటప్పుడు ఎల్లప్పుడూ లక్ష్యం ఉండాలి; వాస్తవాలను మాత్రమే తెలియజేయడానికి; ఎటువంటి ఆత్మాశ్రయ అంతర్దృష్టులను అందించకూడదు. అభిప్రాయాలు సంపాదకీయాలకు ప్రత్యేకించబడ్డాయి.



సంపాదకీయం అనేది సాధారణంగా ముందుగా బుట్టల్‌తో కూడిన ఆలోచనాత్మకమైన బాగా కూర్చిన అభిప్రాయం. కొన్నిసార్లు సంపాదకీయం ప్రజలు తమ స్థితిని పునరాలోచించుకునేలా చేస్తుంది మరియు నిర్ణయం తీసుకోని వ్యక్తులు సహేతుకమైన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. సంపాదకీయాలను ఒపీనియన్ మోల్డర్స్ అని కూడా అంటారు.


సంపాదకీయం
ప్రధాన సంపాదకుడు లేదా అతని మార్గదర్శకాల ప్రకారం సంపాదకీయం వ్రాయబడుతుంది. ఇది ప్రాథమికంగా వార్తాపత్రిక యొక్క అభిప్రాయాలు మరియు అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. దీనికి ఎలాంటి బైలైన్ లేదు. మీరు వార్తాపత్రికలోని సంపాదకీయంలో రచయిత పేరును చూడలేరు.

కాలమ్
వార్తాపత్రికతో సంబంధం లేని కాలమిస్ట్ రాసిన కాలమ్. ఆమె తన స్వంత అభిప్రాయాలను మరియు అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది. కాలమ్ అతని పేరుతో పిలువబడుతుంది. ఉదా - ట్వింకిల్ ఖన్నా యొక్క శ్రీమతి ఫన్నీబోన్స్. సైరస్ బరోచా సీరియస్లీ సైరస్.

కథనం
వార్తా కథనాలు లేదా ఫీచర్ కథనాలు వంటి అనేక రకాల కథనాలు ఉన్నాయి.
వార్తా కథనాలు వాస్తవాలు మరియు సమాచారంతో నిండిన కఠినమైన వార్తలు.
ఉదా- నేరం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, చట్టాలకు సంబంధించిన వార్తాపత్రిక యొక్క మొదటి పేజీ వార్తలు.

ఫీచర్ కథనాలు మృదువైన వార్తలు, వినోదం, సలహాలు, హాస్యం, కొన్నిసార్లు పాఠకులకు తెలియజేయడానికి ఉపయోగించబడతాయి.
ఉదా- మూడు నెలల్లో బరువు తగ్గడం ఎలాగో ప్రజలకు సూచించే ఫీచర్ కథనం.

X. 9. జీవన భాష్యం

 9. జీవన భాష్యం:

జీవన భాష్యం పరీక్ష



పాఠం ఉద్దేశం:
 మనిషి దేనిని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం "గజల్" లో పల్లవిని "మత్లా" అని చివరి చిరణాన్ని "మక్తా" అని కవి నామముద్రం "తఖల్లుస్" అని అంటారు. ప్రతి చరణం చివరన అంత్యప్రాస రూపొందిస్తుంది. 
సరస భావన, చమత్కార ఖేలన ఇంపూ, కుదింపూ గజల్ జీవ గుణాలు.
 ప్రస్తుత పాఠ్యభాగం "డాక్టర్ సి.నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం" ఆరవ సంపుటిలోని "తెలుగు గజళ్ళు" లోనిది.

. జీవన భాష్యం పరీక్ష

సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (వికీపీడియా నుంచి)

జననం: జూలై 291931 

మరణం: జూన్ 122017).

తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం:1931 జూలై 29
భారతదేశం హనుమాజీపేట్, రాజన్న సిరిసిల్ల.
మరణం2017 జూన్ 12 (వయసు 85)
హైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుసినారె
వృత్తికవి, గేయరచయిత,
సాహితీవేత్త
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు (1973), 
పద్మ శ్రీ (1977),
కళాప్రపూర్ణ (1978), 
'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు  (1988), 
పద్మ భూషణ్ (1992),
సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)

రచనలు : 

  • విశ్వంభర
  • మనిషి - చిలక
  • ముఖాముఖి
  • భూగోళమంత మనిషి
  • దృక్పథం
  • కలం సాక్షిగా
  • కలిసి నడిచే కలం
  • కర్పూర వసంతరాయలు
  • మట్టి మనిషి ఆకాశం
  • మంటలూ - మానవుడూ - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973)
  • తేజస్సు నా తపస్సు
  • నాగార్జున సాగరం
  • విశ్వనాథ నాయకుడు
  • కొనగోటి మీద జీవితం
  • రెక్కల సంతకాలు


పురస్కారాలు :
  1. 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం
  4. భారతీయా భాషా పరిషత్ పురస్కారం
  5. రాజలక్ష్మీ పురస్కారం
  6. సోవియట్-నెహ్రూ పురస్కారం
  7. అసాన్ పురస్కారం
  8. పద్మశ్రీ పురస్కారం
  9. పద్మభూషణ్ పురస్కారం
  10. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ
  11. ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
  12. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
  13. డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)

పదవులు :- విద్యారంగంలోనూ, పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించాడు.

  1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
  3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
  4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
  5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు

భారత రాష్ట్రపతి అతన్ని 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.

 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు

బిరుదులు: ‘నవ్యగేయ మహాకవి, గేయకవి సమ్రాట్, పుంభావసరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవితా మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వనిచక్రవర్తి, ప్రజాకవి, నవకవితా సమ్రాట్, చలనచిత్ర కవి చక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథులు, నవరసాలమూర్తి’’వంటి ప్రశంసలతో సహృదయ ప్రపంచం నారాయణరెడ్డిగారిని సన్మానించింది. 


(గమనిక : సినారె గురించి రాయమంటే బాల్యం, రచనలు : జ్ఞానపీఠ్,పద్మశ్రీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, పదవులలో ఒక్ ఐదు రాస్తే  కొన్ని రాస్తే సరిపోతుంది. 


ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోని ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్భవించి మానవ వికాస భాష్యాన్ని విందాం.





 జీవన భాష్యం పరీక్ష


ఇదిగో జీవన భాష్యం సారాంశానికి వర్ణ మైండ్ మ్యాప్!

మధ్యలో "జీవన భాష్యం" కేంద్రంగా ఉండి, ఆరు ముఖ్యమైన భావాలు చుట్టూ అమర్చబడ్డాయి:

 మనసు & కన్నీరు — మేఘాలు వర్షంగా మారినట్లే బాధలు కన్నీరవుతాయి

🌿 లక్ష్యం & విజయం — కష్టాలకు వెరవక ముందుకు సాగితేనే విజయం

🍂 బీడు నేల & కృషి — శ్రమతో విత్తనాలు వేస్తే పంట తప్పక పండుతుంది

🌸 సమాజం & సహకారం — అన్యోన్యంగా జీవించడమే నిజమైన మానవత్వం

🌄 విధి & వినమ్రత — హిమాలయమే కరిగినట్లు గర్వం ముందుకు సాగదు

🌱 నిస్వార్థ సేవ — సేవా జీవితమే చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది


I. అవగాహన ప్రతిస్పందన కింది 1. అంశాన్ని గురించి చర్చించండి.

అ)  జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజలకు ఎలా సరిపోయిందో చెప్పండి.

జవాబు:  జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్‌కు అనేక విధాలుగా సరిగ్గా సరిపోయింది.

"జీవనం" అంటే మనిషి జీవించే తీరు. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు కలిసిన  ప్రయాణం. "భాష్యం" అంటే  వివరణ.  ఈ గజల్ జీవితానికి ఒక మార్గదర్శనం. కన్నీరు, లక్ష్యం, కృషి, సమాజం, విధి, సేవ అనే ఆరు జీవన సత్యాలను వరుసగా వ్యాఖ్యానిస్తూ మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి కోణాన్ని స్పృశించింది.. పుట్టుక నుండి చరిత్ర వరకు  రాయబడింది. కాబట్టి "జీవన" అనే పదం సరిగ్గా ఇమిడింది. విధి ముందు వినమ్రత, నిస్వార్థ సేవ వంటి గొప్ప జీవన తాత్త్విక సత్యాలను చెప్పే  జీవన దర్శనం అనిపిస్తుంది. అందుకే జీవన భాష్యం అనే శీర్షిక కు సూటిగా చెప్పే అద్దం వంటిది.

2. పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.

నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది

పేరవంతుంది 

నీరు — జీవన గానం

చినుకు పడిన చోట నీరవుతుంది, 

పాయగా పరిగెత్తి దారవుతుంది.

దారిన పచ్చగా పైరవుతుంది, 

పైరు నవ్విన చోట ఊరవుతుంది.

ఊరి గుండెలో ఏరవుతుంది, 

ఏరు పాటలాడి పేరవుతుంది.

చినుకు నుండి పేరు వరకు 

 ఒకే నీటి యాత్ర, 

ఒకే జీవన గాథ.

ఇచ్చిన చోట పండుతుంది, 

ఇచ్చినవాడే పేరవంతుంది.


చినుకు నీరై పుట్టి, దారై పారి, పైరై పెరిగి, ఊరై నిలిచి, ఏరై పాడి, చివరకు పేరవంతై నిలిచే ప్రయాణమే జీవితం అని ఈ కవిత చెబుతోంది.



3. కింది అపరిచిత గేయ పాదాలు చదవండి.

భీతిలేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో

 తనివి తీరజనులకకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో 

అడ్డుగోడలేని సమ సమాజమేచటనుండుననో 

హృదయంతరాళ జనితమౌ సత్యమేచట వరలునో 

ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము 

లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా!

గేయం చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) 'శిరము నెత్తి నిలుచుననో' అంటే మీకేమి అర్థం అయింది

జవాబు : తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలుస్తుందో అని అర్థమైంది

ఆ) జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయం లో ఉన్నది?

జవాబు : 

ఇ) సమ సమాజం ఎట్లా ఏర్పడుతుంది జవాబు: 

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి? జవాబు 

ఉ) స్వర్గసీమ అనడంలో ఆంతర్యం ఏమిటి?

జవాబు


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత 

"చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? 

జవాబు:చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.

పేరు నిలవడానికి చేయవసిన పనులు :

  1. దానధర్మాలు విరివిగా చేయాలి.
  2. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
  3. పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
  4. కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
  5. బావులు, చెరువులు తవ్వించాలి.
  6. ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
  7. విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  8. చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
  9. వైద్యశాలలు కట్టించాలి.
  10. గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి.
  11. . జీవన భాష్యం పరీక్ష

ఆ)“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు

జ: ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.  సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఇ) "మనుషులు పడుగురు కూడితే ఒక ఊరవుతుంది" అని సినారె ఎందుకు అని ఉంటారు?
జ. మనిషి భగవంతుడు సృష్టిలో ఒకే రకం జీవి. మనుషులందరూ సమానమే అనే భావం ఉన్నదని అర్థమవుతుంది. నీటి సమాజంలో కుల మాత వర్ణ ప్రాంత భేదాలకు విడిపోతున్నారు. 
తద్వారా సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. మత వైశాల్యాల వల్ల దేశాలు రాష్ట్రాలు మనుషులు నాశనం అవుతున్నారు. ఈ వేదాల వల్ల కలతలు కార్పన్యాలు కుట్రలు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. పదిమంది కలిసి ఉంటే అది చక్కని ప్రదేశం. ఆ ప్రదేశమే గ్రామం. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే గ్రామం సుభిక్షంగా, సంతోషంగా ఉంటుంది. కుల మత భేదాలు మరచి కలిసి ఉండటంవల్ల గ్రామానికి సకలం సమకూర్తాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తుంది. 

గ్రామ ప్రజల్లో సహకారం సమన్వయం ఐక్యత అవసరం చెప్పడానికి సినారె గారు ఈ వాక్యాన్ని అందించారు.

2. ఈ క్రింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)జీవన భాష్యం పాఠంలో సినారె అందించిన సందేశం:

మనము ఒక లక్ష్యాన్ని సాధించనీకే బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురౌతాయి ,లోకం మనల్ని భయపెడుతుంది .ఆ భయాలకు లొంగకుండా ముందుకు పోతే గెలుపు మనదే .

  • బీడు భూముల్లో ఏం పండవని నిరాశ పడకుండా కష్టపడి విత్తనాలు ఎస్తే మంచి పంట వస్తుంది.
  • నలుగురు మనుషులు కలిసి ఉంటేనే సాంఘిక జీవనం ,మన బతుకుకు ఒక అర్థం . అట్లాంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక మంచి ఊరు అవుతుంది .
  • మనం ఎంత సంపాదించినా ,ఎంత సాధించినా , కష్టాలు వస్తాయి . మనిషి ఏమి కాదని ధీమాగా ఉండకూడదు . విధి ఎప్పుడు ఎటువంటి పరీక్ష పెడుతుందో చెప్పలేం.
  • బిరుదులు సాధించామని , మంచి పేరు సాధించామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు ఉండదు . మనిషి సాటి వారికి సహాయపడి ,త్యాగాలు చేస్తేనే వారి పేరు చరిత్రలో నిలుస్తుంది .
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. 
జీవన భాష్యం గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవిత ను రాయండి

నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది
పేరవంతుంది

నీరు — జీవన గానం

చినుకు పడిన చోట నీరవుతుంది, పాయగా పరిగెత్తి దారవుతుంది.

దారిన పచ్చగా పైరవుతుంది, పైరు నవ్విన చోట ఊరవుతుంది.

ఊరి గుండెలో ఏరవుతుంది, ఏరు పాటలాడి పేరవుతుంది.

చినుకు నుండి పేరు వరకు — ఒకే నీటి యాత్ర, ఒకే జీవన గాథ.

ఇచ్చిన చోట పండుతుంది, ఇచ్చినవాడే పేరవంతుంది.

(చినుకు నీరై పుట్టి, దారై పారి, పైరై పెరిగి, ఊరై నిలిచి, ఏరై పాడి, చివరకు పేరవంతై నిలిచే ప్రయాణమే జీవితం అని ఈ కవిత చెబుతోంది.)



లేదా 
ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.

1️⃣ రెడ్డి గారూ! నమస్కారం. మీ సినీ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మొదటగా ఏ సినిమాకు మీరు పాటలు రాశారు?

2️⃣ మీరు సినిమా కథా సంభాషణలు కూడా వ్రాశారా? ఉంటే, ఆ సినిమా పేరు చెప్పగలరా?

3️⃣ ‘మీ పరిశోధన గ్రంథం నేటి విద్యార్థులకు మార్గదర్శకం’ అని పలువురు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యపై మీ స్పందన ఏమిటి?

4️⃣ ‘విశ్వంభర’ కావ్యం ద్వారా మీరు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆ కావ్యంలో ప్రత్యేకతలేమిటి?

5️⃣ మీరు పద్య రచనలోనూ నిమగ్నమై ఉన్నారని విన్నాం. మీ పద్యకావ్యం పేరేమిటి? దాని అంశం ఏది?

6️⃣ మీ కవిత్వం నవ్య కవిత్వం లోని ఏ శ్రేణికి చెందిందని మీరు భావిస్తారు?

7️⃣ ప్రాచీన తెలుగు కవుల్లో మీకు అత్యంత ప్రేరణనిచ్చిన కవి ఎవరు? ఎందుకు?

8️⃣ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’పై మీ అభిప్రాయం రెండు మాటల్లో చెప్పగలరా?

9️⃣ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, తెలుగును పరిపాలనా భాషగా స్థిరపరచడానికి మీరు చేసిన ముఖ్యమైన చర్యలేమిటి?

🔟 మీరు భవిష్యత్తులో సినిమా పాటలు రాయరని ప్రతిజ్ఞ చేసినట్టు విన్నాం. దానికి కారణమేమిటి?

1️⃣ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న బీట్ సంగీతానికి తగ్గట్టు మీరు ఏమైనా పాటలు రాశారా? ఉంటే వాటి గురించి చెప్పండి.


జీవన భాష్యం -  సారాంశం

మేఘాలు నీటితో నిండినప్పుడు వర్షంగా కురిసినట్లే, మనసు బాధలతో నిండినప్పుడు కన్నీరు వస్తుంది.

ఆకాశంలో మబ్బులు తేమను మోసుకుని బరువెక్కినప్పుడు వర్షంగా మారి భూమిపై కురుస్తాయి. అదే విధంగా మనసులో ఆందోళనలు, చింతలు, దుఃఖాలు పేరుకుపోయినప్పుడు మనిషి తట్టుకోలేక కన్నీరు కార్చడం సహజమే. కన్నీరు మనిషి బలహీనత కాదు, మనసు మోసే భారానికి సహజమైన స్పందన.

లక్ష్యం వైపు సాగేటప్పుడు కష్టాలు తప్పవు. కానీ వాటికి భయపడకుండా ముందుకు నడిస్తేనే విజయం వస్తుంది.

ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరినప్పుడు లోకం అడుగడుగునా అడ్డంకులను చూపిస్తుంది, భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి మాటలకు చలించిపోకుండా, నిరుత్సాహపడకుండా దృఢమైన మనసుతో ముందుకు సాగినవారే చివరకు విజయం సాధిస్తారు. వారి ధైర్యం, పట్టుదల చూసి మిగతావారు కూడా స్ఫూర్తి పొంది అదే దారిలో నడుస్తారు. అలా ఒక్కరి విజయం వేలమందికి వెలుగు చూపే దీపం అవుతుంది.

బీడు నేలలో పంట పండదని నిరాశపడకూడదు. శ్రమించి దున్ని, విశ్వాసంతో విత్తనాలు వేస్తే మంచి పంట పండుతుంది.

పనికిరాదని అందరూ వదిలేసిన బీడు నేలను చూసి నిరాశపడే బదులు, పట్టుదలతో కష్టపడి దున్ని విత్తనాలు నాటితే ఆ నేల కూడా పచ్చగా మారుతుంది. అలాగే జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితి అయినా విశ్వాసాన్ని వదులుకోకుండా కృషి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ప్రయత్నించకుండానే వదిలేయడం అసలైన వైఫల్యం.

పరస్పర సహకారంతో జీవించడమే మంచి సమాజం. అందరి పట్ల సానుకూలంగా ఉంటేనే కలిసి సంతోషంగా జీవించగలం.

మనిషి ఒంటరిగా జీవించలేడు. ఒకరికొకరు సహాయపడుతూ, అన్యోన్యంగా మెలిగితేనే జీవితం సుఖంగా సాగుతుంది. సాటి మనుషుల పట్ల అభిమానం, గౌరవం కలిగి ఉంటేనే సమాజంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. అలాంటి మనుషులు కలిసి నివసించే చోటే నిజమైన ఊరు ఏర్పడుతుంది, నిజమైన మానవత్వం వికసిస్తుంది.

సంపద, అధికారం, విజయాలు ఎన్ని ఉన్నా విధి ముందు ఎవరూ తలవంచవలసిందే.

మనిషి ఎంత సంపన్నుడైనా, ఎంత అధికారవంతుడైనా, ఎన్ని విజయాలు సాధించినా "ఇక నాకు ఏ కష్టమూ రాదు" అని గర్వంగా చెప్పుకోలేడు. విధి ఎప్పుడు ఎలా పరీక్షిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆకాశమంత ఎత్తులో నిలిచిన హిమాలయ పర్వతశిఖరమే ఎండ వేడికి కరిగి నదిగా ప్రవహించవలసి వస్తుంది. అలాగే ఎంతటి మహాపురుషుని గర్వమైనా కాలం ముందు సాగనేరదు. కాబట్టి మనిషి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండటమే శ్రేయస్కరం.

పేరు, బిరుదులు, సత్కారాలు నిజమైన గుర్తింపు కావు. నిస్వార్థ సేవ చేసినవారి పేరే చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది.

ప్రపంచమంతా తన పేరు తెలుసని గర్వపడటంలో, గొప్ప బిరుదులు, సత్కారాలు పొందడంలో నిజమైన విలువ లేదు. అవన్నీ కాలంతో పాటు మాయమైపోతాయి. కానీ మానవాళి కోసం నిస్వార్థంగా కష్టపడి, తన సుఖాన్ని త్యాగం చేసి మేలు చేసిన వారి పేరు మాత్రం చరిత్రలో చిరకాలం చెరగకుండా నిలిచిపోతుంది. అందుకే మనిషి పేరు కోసం కాకుండా సేవ కోసం జీవించాలి.


III. భాషాంశాలు

అ)మబ్బు : మేఘము, మేయిలు అంబుదము, ఘనము 
ఆ)గుండె : హృదయము, హృత్తు, ఎద డెందము
ఇ) శిరస్సు : తల, శీర్షము, మస్తకము, మూర్ధము, 
2) కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి
అ)వ్యాప్తి :  పరిమళ వాసన వ్యాప్తి చెందుతుంది.
ఆ)జంకని అడుగులు : జంకని అడుగులే ధైర్యం 
ఇ)ఎడారి దిబ్బలు : ఒంటెలు ఎడారి దిబ్బల్లో నడుస్తుంటాయి.
ఈ)చెరగని త్యాగం:  నాన్నగారి చెరగని త్యాగం వల్ల కుటుంబం గొప్ప స్థాయికి ఎదుగుతుంది.

వ్యాకరణాంశాలు

కింది పదాలు కలిపి సంధిని గుర్తించి రాయండి

నీరు + అవుతుంది = నీరవుతుంది - ఉత్వ సంధి.
ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన,- ఉత్వ సంధి
పేరు + అవుతుంది = పేరవుతుంది - ఉత్వ సంధి.
ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం.
2. కింది పంక్తులలోని పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.
అ)ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు 
ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు - షష్టి తత్పురుష సమాసం
ఆ)ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు - షష్టి తత్పురుష సమాసం
3. కింది వాటిని చదివి అలంకారాలో గుర్తించండి.
అ)నీకు వంద వందనాలు
జ. పై వాక్యంలో ఛేకాను ప్రాసాలంకారము ఉంది.
 లక్షణం : హల్లుల జంట అర్థ బేధంతో వెంట వెంటనే వాడితే ఛేకాను ప్రాసాలకారం అంటారు.
ఆ) తెలుగుజాతికి అభ్యుదయం 
నవభారతికే నవోదయం
        అంత్యానుప్రాసాలంకారము 
లక్షణం : పాదం చివరలో లేదా  చివర్లో  ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది అంత్యాను ప్రాసాలంకారం అంటారు.
ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్ - వృత్యనుప్రాసాలంకారము.
ఈ) అజ్ఞానాంధకారం తొలగితే మంచిది రూపకాలంకారం
అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారము అనేది ఉపమానం ఇక్కడ అజ్ఞానము అంధకారము అనే ఉపమాన ఉపమేయాలకు బేధం ఉన్న లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇక్కడ రూపకాలంకారం ఉంది.
రూపకాలంకారము:  ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం రూపకాలంకారం.

 జీవన భాష్యం పరీక్ష