సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

IX- 4. దాశరథి రంగాచార్యతో ముఖాముఖి

కవి పేరు :        దాశరధి రంగాచార్య 
జననం :         24 ఆగస్టు 1928
 మరణం :        7 జూలై 2017 
జన్మస్థలం :     చిన్న గూడూరు మహబూబాబాద్ జిల్లా.
 సోదరులు :     దాశరధి కృష్ణమాచార్య అనువాదములు:  నాలుగు వేదములను 10                                             ఉపనిషత్తులు సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు.
 రామాయణ భారత భాగవతాలను సరళ వచనంలో రాశారు.
రచనలలోని ప్రత్యేకత : తెలంగాణ రైతాంగ పోరాటం, పాత్రోచిత యాస ప్రవేశపెట్టారు.
 పురస్కారం : చిల్దేలర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య కణం పురస్కారం లభించింది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

అ).దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
దాశరథి రంగాచార్య తాను రచనలు సమాజంలో చూసిన బాధలు వ్యథల్లోంచి రాశానని చెప్పుకున్నాడు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.

తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?



ఆ). తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని ఇచ్చిందని రచయిత అనడంపై మీ అభిప్రాయం రాయండి.
జవాబు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని దాసులకు రంగాచార్య పాత్రికేయ విలేకరితో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రంగాచార్య గారు వ్యాసాలు లేఖలు రాసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. తన బాల్యకాలం నుంచి ఇక్కడి ప్రజల ఆకాంక్ష ను చూస్తూనే ఉన్నాడు ఈ బలమైన కోరిక ఇప్పుడు నెరవేరడం రాష్ట్రం సిద్ధించడం వల్ల సంతోషంగా ఉందని ఆనందాన్ని వెలిబుచ్చాడు.

ఇ) ప్రజల భాష అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
ప్రజల భాష అనగా ప్రజలు మాట్లాడే భాష.  మాండలికంలో స్థానిక యాస భాషలతో ప్రజలు మాట్లాడుతారు.  అందులో వివిధ వ్యక్తీకరణలు విభిన్నంగా ఉంటాయి.  వీటిని ఏ పుస్తకాల్లోనూ మనము చూడలేము కాబట్టి ఇది ప్రజల భాష ప్రజలు మాట్లాడుతున్న భాషనే ప్రజల భాష అంటారు.

ఈ) రంగాచార్య రచనకు తెలుగు తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు.

జ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాలుపంచుకున్న రచయిత దాశరథి రంగాచార్యులు. రైతులు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటంలో వీరు భాగమయ్యారు. దగ్గరగా చూసిన జీవితాన్ని రంగాచార్య గారు ప్రజల భాషలో రాశారు వారి ప్రభావాత్మకమైన నవల అది వారి ఆత్మ కథ జనపదం. చాలా విశాలమైన విస్తృతమైన నవల సమాజాన్ని మైక్రోస్కోపిక్ లో చూసిన నవల.
 చిల్లర దేవుళ్ళు నవల ప్రభావంతమైన నవల. ఇదే కాకుండా మరికొన్ని నవలల్లో తెలంగాణ జనజీవనాన్ని మాత్రమే వారు ఇతివృత్తంగా తీసుకున్నారు 

2) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

 1. దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి
 (లేదా)
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.

తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.

కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు, కవి లేదా నాయకుడు వచ్చాడు అనుకోండి వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నల తయారు చేయండి.

జవాబు: నమస్కారం సార్ మీ బాల్యం గురించి చెప్పండి.

మీరు మీ విద్యాభ్యాస కాలంలో ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించారు?

మీరు కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?

మీ తొలి కవిత, తొలి పుస్తకం గురించి వివరించండి.

అచ్చైన తొలి కవిత లేదా తొలి పాట ఏమిటి?

మీరు కవిత్వం రాయడానికి ప్రేరేపించిన పుస్తకాలు ఏమిటి?

మీరు ఏ కవిని లేదా కళాకారుడిని అమితంగా ఇష్టపడతారు? ఎందుకు?

మీరు పొందిన పురస్కారాలు అవార్డులు బహుమానాల గురించి తెలియజేయండి?

కవిగా కళాకారుడిగా రాణించాలంటే ఏం చేయాలి?

కవిత్వం రాసిన వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?

3.మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుడు/ క్రీడాకారుడు / కవి రచయితతో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.
నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
ఏవైనా పుస్తకాలు రాశారా ?
మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? 
బాధపెట్టిన దెవరు ?
మీకు ఇష్టమైన కవి ఎవరు ?
మీకు బాగా 

III. భాషాంశాలు – వ్యాకరణం
పదజాలము కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఉదాహరణకు 
విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
వికాసం వికసించడం విప్పారడం
అ) రామప్ప గుడి శిల్పకళ సొగసులు వర్ణించ శక్యమా
సొగసు అందము సౌందర్యము శోభ

ఆ)వట్టికూట ఆళ్వారు స్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
ఉత్కృష్టం గొప్పది ఉన్నతమైనది

ఇ) భాగవతంలో కృష్ణ లీలలు సమగ్రంగా రాశారు 
సమగ్రం పరిపూర్ణం

ఈ)నానాటికి మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి క్షీణించు నశించు

2. కింది వాక్యాలలో గల వికృతి ప్రకృతిలో గురించి రాయండి.

అ)కథలు అంటే నాకిష్టమని మా నాయనమ్మ నాకు రోజు కతలు చెప్పింది.
కథలు - కతలు

ఆ) స్వచ్ఛభారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం ప్రతిన చేయడమే కాదు పని చేసి చూపుదాం.
ప్రతిజ్ఞ - ప్రతిన

 ఇ) ప్రజల కోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
కవిత - కైత

 ఈ) ఆశ ఉండవచ్చు మితిమీరిన ఆస ఉండరాదు.
ఆశ - ఆస

వ్యాకరణాంశాలు:

ఈ క్రింది పదాలను విడదీయండి సంధి పేరు రాయండి
సంధి పదం
పోయినాడంటే - పోయినాడు +అంటే = ఉత్వ సంధి.
ఏమని - ఏమి+ అని = ఇత్వ సంధి
కాదనుకున్నాడు - కాదు + అనుకున్నాడు = ఉత్వ సంధి
పిల్లలందరూ - పిల్లలు + అందరూ = ఉత్వ సంధి.

2. కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి సమాసం పేరు రాయండి.
ఉదాహరణ: మూడు సంఖ్యల రోజులు - మూడు రోజులు -ద్విగు సమాసం.

అ) రెండు సంఖ్యల రోజులు = రెండు రోజులు - ద్విగు సమాసం 
ఆ) వజ్రమూ వైడూర్యము =
 వజ్రవైఢూర్యాలు - ద్వంద మాసం
ఇ) తల్లియూ బిడ్డ యూ =తల్లి బిడ్డలు ద్వంద సమాసం.

కర్తరి వాక్యము కర్మణి వాక్యము
1) ఆల్వార్ స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. (కర్తరి వాక్యము)

 చిన్నప్పుడే అనే కథ ఆల్వార్ స్వామి చే రాయబడింది. (కర్మణి వాక్యము)

పై రెండింటిలో మొదటి వాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ రాశాడు. కర్త అల్వార్ స్వామిని సూచిస్తున్నది. ఇటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు.

 రెండో వాక్యం కర్మణి వాక్యం. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ (రాయబడింది) కర్మ చిన్నప్పుడే అనే కథను సూచిస్తుంది. ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి 'బడు' అనే ధాతువు చేరడం. రెండు 'చే' అనే విభక్తి చేరడం.

కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.
అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు.
 లింగయ్య చేత మా నాయకుడికి ఉసిరికాయ ఇవ్వబడింది.

ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు.
 బాలుచే ఇసుక  ఇల్లు కట్టబడింది.

ఇ)అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది 
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది.

4. కింద వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి.
అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు.
గ్రామీణులు నాయకులను ఎదుర్కొన్నారు.

ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి.
కాయలన్నీ అతడు ముందర పోశారు.

ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది.
 బాలురు సెలవు తీసుకున్నారు.

5. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించువాడు - విద్యార్థి = ద్వితీయ తత్పురుష సమాసం

ఆ) గుణాల చేత హీనుడు -  గుణహీనుడు = తృతీయ తత్పురుష సమాసం.

ఇ) సభ కొరకు భవనం - సభా భవనం = చతుర్థి తత్పురుష సమాసం.

ఈ) దొంగ వల్ల భయం - దొంగ భయం = పంచమి తత్పురుష సమాసం.

ఉ) రాముని యొక్క బాణం - రామబాణం = షష్టి తత్పురుష సమాసం.

ఊ) గురువు నందు భక్తి - గురు భక్తి = సప్తమి తత్పురుష సమాసం.


ప్రాజెక్టు పని:




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...