సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

24, జులై 2023, సోమవారం

Viii - 1.త్యాగనిరతి --డా. సిద్దెంకి

త్యాగనిరతి 
ప్రక్రియ :  ఇతిహాస ప్రక్రియ
ఇతిహాసం అనగా ఇట్లా ఇది ఇట్లా జరిగింది అని తెలియజేయడం.
ఉదా: రామాయణం మహాభారతం
పాఠం: త్యాగనిరతి పాఠం శ్రీమధాంద్ర మహాభారతంలోని అరణ్యపర్వం తృతీయ ఆశ్వాసం లోనిది.

కవి పరిచయం: 
కవి పేరు : నన్నయ్య
కాలం : 11వ శతాబ్దం
ఆస్థానం : రాజరాజ నరేంద్రుని ఆస్థానం.
రచనలు : మహాభారతంలోని ఆది సభ అరణ్య పర్వాలు. 
అరణ్యపర్వంలోని నాలుగవ ఆశ్వాసం నందలి 142వ పద్యం 'శారద రాత్రులుజ్వల....'అనే పద్యం వరకు రాశారు.
బిరుదులు:  ఆదికవి, వాగను శాసనుడు, 
శైలి : ప్రసన్న కథాకళితార్థయుక్తి, 
అక్షర రమ్యత
నానారుచిరార్ధ సూక్తినిధి
స్వీయ రచన: 
1. ఇతరులు ఆహారం భుజించేటప్పుడు తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదు?  ఒకటి. ప్రాణులన్నీ జీవించాలంటే ఆహారం సేవించాలి ఆకలిగొని ఆకలిగుని తినేటప్పుడు ఆటంకాలు కలిగించినట్లయితే అవి తినలేవు.
కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ఎంత సంపాదించినా తినడానికే
తినేటప్పుడు వాగులాటలు తిట్లు ఉన్నట్లయితే తినలేరు తినకపోవడం వలన శరీర జీవక్రియలు సన్నగిల్లుతాయి.
బలము తగ్గిపోతుంది. ఏ జీవి అయినా కృషించి నశించవచ్చు.

ఆ) 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి,' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జ. ధర్మమనగా సక్రమము. 
అందరికీ మంచి మార్గం.
మంచి వలన చెడు దూరమై అందరికీ మేలు చేకూరుతుంది.
తాను బాగుపడుతూ ఇతరులు బాగుపడాలని కోరుకోవడమే ధర్మం. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకొని ఆచరించడం వల్ల సమాజమంతా క్షేమంగా ఉంటుంది. అందుకే ధర్మంగా జీవించాలి.

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాల చేయవచ్చు రాయండి.
మానవులలో అనేక తారతమ్యాలు ఉంటాయి. వాటిని మనము పూరించి వ్యత్యాసాలను తొలగించాలి.
1. ఒకటి ఉన్నంతలో సాయం చేయాలి.
2. దీనులైన వారికి కూడు గుడ్డ కల్పించాలి.
మన పండుగ దినాలలో జన్మదినాలలో లేనివారికి సాయం చేయాలి.
4. ప్రకృతి వైపరీత్యాలలో సహకారం అందజేయాలి.
5. రక్తదానము అవయవదానం లాంటి మొదలైనవి చేయవచ్చు.

ఈ) త్యాగనిరతి అనే శీర్షిక ఈ పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
త్యాగనిరతి అనే పేరు తగినది
1. ఇందులో శిబి చక్రవర్తి తన శరీరాన్ని త్యాగం చేశాడు.
2. శిబి చక్రవర్తి తనను ఆశ్రయించిన పక్షిని కాపాడాడు.
3. డేగ ఎంత వారించినా పావురాన్ని కాపాడడం కోసం తన మాంసం మొత్తం తక్కడలో తూచాడు.
4. ఇచ్చిన మాటకు కట్టుబడి త్యాగం చేశా సిబి తన దేహాన్ని త్యాగం చేశాడు. కాబట్టి త్యాగనిరతి అనే పాఠం సముచితం.

2. త్యాగం త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.

జ.త్యాగం చేయడంలో గొప్పతనము అనుభూతి: 
త్యాగం అనగా తిరిగి తీసుకోలేనిది. త్యాగం ఒక గొప్ప శక్తి.  గొప్ప చిరునామా. త్యాగం చేసేవారు ఎంతో గొప్పవారవుతారు. కొంతమంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు.   త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. నిస్వార్ధంగా జీవించడం. ఆశ్రిత పక్షపాతం లేకుండా వ్యవహరించడం. ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్ని ఆశ్రయించి సామాజిక శ్రేయస్సు కోసం త్యాగం చేయాలి.

 ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. 

ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు.

 నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం. ఎందుకంటే త్యాగం వలన ఆత్మ సంతృప్తి లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.

త్యాగం చాలా గొప్ప శక్తి, వ్యక్తికి సంతోషం, సమాధానం కలుగుతుంది
  త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది.

IV సృజనాత్మకత/ ప్రశంస:
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది శరీరంలోని అవయవ దానం ఇంకా గొప్పది అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.

పదజాలం
అర్థాలు
కపోతములు = పావురములు
ధర్మో ధర్మము
హితము మేలు
పరిత్యాగము ఇచ్చుట
వర్ధిల్లు వికాసము జీవించు అభివృద్ధి 
బుబిక్షితుడు ఆకలిగొన్నవాడు

నానార్ధాలు
వాడి పాడి న్యాయము ధర్మము
అడవి విపినం అరణ్యం

భాషను గురించి తెలుసుకుందాం
లోపలికి రావచ్చు అనుమత్యర్థక వాక్యం
దయచేసి వినండి ప్రార్ధనార్ధక వాక్యం
రమ చక్కగా రాయగలదు సామర్ధ్యార్థక వాక్యం
ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం
అల్లరి చేయవద్దు నిషేధార్ధక వాక్యం గిరి ఎక్కడున్నావ్ ప్రశ్నార్ధక వాక్యం

 కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఇంద్ర ప్లస్ఆజ్ఞలు సవర్ణదీర్ఘ సంధి
త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి
ఆహార ప్లస్ అర్థము ఆహారార్థం సవర్ణదీర్ఘ సంధి
నేను లేస్ ఇట్లు ఉత్వ సంధి
శౌర్య ఆది= సవర్ణదీర్ఘ సంధి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...