సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

16, ఏప్రిల్ 2023, ఆదివారం

అంతా బూటకం అని చెప్పే రంగమార్తాండ

"నటుడైన నటరాజయినా చివరకు మిగిలేది స్మశాన వసంతమే"
-రంగమార్తాండ

"చోటు మారితే ఆట మారుతుందా
మహాభారతమైనా 
మనిషి జీవితం అయినా విషాదాల సమాహారమే"
-రంగమార్తాండ

"రంగులు వేసి నటించిన అంత ఈజీ కాదు రా 
రంగులు లేని ప్రపంచంలో బ్రతకడం"
-రంగ మార్తాండ

"చిటికెడంత నవ్వి చూడు
 ఏడుపంతా వెళ్లిపోతది"

"అక్షరాలను పొడిగా వాడుకు
దాని వెనుకున్న తడిని చూడు"
-రంగమార్తాండ.

"ఒంటరి జననం 
ఏకాకి మరణం 
నడుమ నడుస్తున్నదంతా జగన్నాటకం"

చిత్రం: రంగమార్తాండ

తారాగణం: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, భద్రం తదితరులు
కెమెరా: రాజ్ కె నల్లి

మాటలు: ఆకెళ్ల శివప్రసాద్
----------------------------------

సంగీతం: ఇళయరాజా
నిర్మాత: కాలిపి మధు, ఎస్ వెంకట రెడ్డి

దర్శకత్వం: కృష్ణవంశీ

విడుదల తేదీ: 22 మార్చ్ 2023.

రంగమార్తాండ జీవిత తత్వాన్ని, మనిషి జీవితంలో ఆఖరి మజిలీని, చివరకు మిగిలిన వైరాగ్యాన్ని అద్భుతంగా చిత్రించిన సినిమా.

నిర్మాత కొడుకు సిద్దు. 
సిద్దు నాన్న రాఘవ రాజుకు ఇచ్చే గౌరవాన్ని చూసి ఈర్ష పడతాడు.
సిద్దుని హీరో చేయాలనే ఉద్దేశంతో సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు కలుగజేసుకొని ఆ హీరో సిద్దూ మనస్తత్వాన్ని మార్చిన గొప్ప నటుడు రాఘవ రాజు. 

ఒకరోజు సిద్ధూ రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేస్తుంటాడు. అన్నీ కోల్పోయిన అనాధగా జీవితమెల్లదీస్తున్న రాఘవ రాజు టిఫిన్ ఇస్తూ నేలపాలు చేస్తాడు.
హోటల్ యజమాని కోప్పడతాడు.

రాఘవ రాజు మీరే కదా మీ వల్ల నా జీవితమే మారిపోయిందని సిద్దు గుచ్చి గుచ్చి అడుగుతాడు. చివరకు తన జీవితంలోని ఉత్థాన పతాన స్థితులను దయనీయ పరిస్థితులను సిద్దుకు తెలియజేయడమే కథా సారాంశం.

మీ నాన్న దొరికాడని రాఘవ రాజు కొడుకు కి ఫోన్ చేసినప్పుడు మా నాన్నగారు కాశీలో ఉన్నాడని సమాధానం చెబుతారు కానీ హోటల్లో పనిచేసేది తెలియదు.
అల్లుడు బిడ్డకు ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్తాడు సిద్దు. అందరూ హుటాహుటిన వస్తారు.

తన జీవిత వికాసానికి మూలమైన నాటక ప్రదర్శన జరిగే చోటులో తన అనుభవాన్ని జీవితాన్ని సిద్ధూ చెప్తుంటాడు రాఘవ రాజు.

ఆ మాటకొస్తే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్న కొడుకులు కూతుళ్లు ఏదో నెపంతో ముసలి తల్లిదండ్రులని వివిధ పద్ధతుల్లో వెళ్ళగొట్టడం ప్రతి మనసుని కలిచి వేస్తుంది. 

నాటకంలో రిటైర్ అవుతూ రాఘవ రాజుగారు రంగమార్తాండ అనే బిరుదు పొందారు. అదే రోజు అతని భార్యకు తెలియకుండా ఉన్న ఆస్తిని కొడుకు రంగాకు, కూతురు బంగారంకు దారాదత్తం చేస్తాడు.

అనుకోని ఒక రోజున సిప్లిగంజ్ రాహుల్ నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అంటూ వచ్చాడు. బిడ్డ మాట కాదనలేక రాఘవ రాజు బ్రహ్మాండమైన వేడుకగా పెళ్లి నిర్వహించి పంపిస్తాడు.

తెలుగులో మాట్లాడడం నేరమని రాసి ఉన్న మాటల్ని చూసిన రాఘవ రాజు మనసు కలుక్కుమంటుంది. 

"అక్షరాలను పొడిగా వాడుకు
దాని వెనుకున్న తడిని చూడు"అనే డైలాగ్ నేడు పెట్టుబడిదారీ విధానాన్ని కార్పొరేట్ మాయాజాలాన్ని, అదే నిజమని భ్రమపడే తల్లిదండ్రుల వ్యామోహాన్ని ఒక్కసారిగా ఖండిస్తుంది.

రాఘవ రాజు ముక్కుసూటితనం, ఖచ్చితత్వం ఎవరికి మింగుడుపడది. మరి ముఖ్యంగా అతని కోడలు కూడా. మనవరాలు వెస్ట్రన్ డాన్స్ ని అసహ్యించుకోవడం వల్ల అటు యాజమాన్యం, ఇటు కొడుకు 
కోడలు ఉన్న ఆస్తిని తీసుకొని మీ చాందసవాదాన్ని మేము భరించలేకున్నాము అని చెప్పడంతో గమ్యం తెలియని పయనం సాగిస్తుంటారు.

రంగమార్తాండ రాఘవ రాజు స్నేహితుడు చక్రి సహాయంతో బస్టాప్ నుంచి  బిడ్డ అల్లుడు ఇంటికి తీసుకెళ్తారు. 

అల్లుడు సిప్లిగంజ్ రాహుల్ పాటలు పాడడమే వృత్తి. నాటకం యొక్క అనుభవాన్ని రంగరించి జానపద భానీల్లోంచి గొప్ప పాటల్ని అందిస్తాడు రాఘవ రాజు. అనేకమైన మెలోడీలు సూపర్ హిట్ అవుతాయి. పరోక్షంగా ధన సంపాదనను అల్లుడికి బిడ్డకు సమకూరుస్తాడు. 

చక్రి, రాఘవరాజు ఇద్దరు సోదరుల నాటక రంగంలో జీవిస్తుంటారు.
చక్రి భార్య చనిపోతుంది. "ఒంటరిగా ఉన్నాను. నన్ను వదిలి పోకురా రాజు" అని దీనంగా వేడుకుంటే చెప్పకుండానే వెళ్ళిపోతాడు రాఘవ రాజు. 

మరొక రోజు చక్రిని చూడడానికి వచ్చిన రాఘవ రాజుని
నువ్వు ఒక చెత్త నటుడివిరా దొంగ నా కొడకా అని తిట్టి గట్టిగా చెంప దెబ్బ వేస్తాడు. బాధపడతాడు. ఆ బాధలోనే హైపర్ టెన్షన్తో హాస్పిటల్ పాలవుతాడు. 

రంగులు వేసుకొని నటించినంత ఈజీ కాదు రంగులు వేసుకోక బతకడం  అని ఓడిపోతున్న పరిస్థితులను, అమితంగా ప్రేమించే కొడుకు బిడ్డ కూడా ఈసడించుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేస్తాడు రాఘవరాజు. 

చక్రి (పాత్ర పోషిస్తున్న బ్రహ్మానందం) "ఒరేయ్ రాజు చావు కైనా, బ్రతుకైనా ఎదురుచూడడం నరకంగా ఉందిరా" అని చక్రి రాఘవరాజుకి చెప్పారు.

 చక్రి ఆజ్ఞను శిరసావహిస్తూ రంగ మార్తాండ అన్ని గోలీలు నీటిలో కలిపి ఒక్కసారిగా తాగిస్తే చక్రి చనిపోతాడు. ఈ సన్నివేశం చూస్తుంటే మనసును పొడి బట్ట చేసి పిండినట్టుగా అనిపిస్తుంటది.

రాఘవ రాజు వజ్రం, జాతిరత్నం అని పిలుచుకునే బంగారు బిడ్డ దొంగతనం ఆరోపణ చేస్తుంది. రాఘవరాజు అంతకుముందే తనభార్య కోసం రంగమార్తాండ బిరుదు ప్రధానం చేసిన రోజు తొడిగిన స్వర్ణ కంకణాన్ని అమ్మి తెచ్చిన డబ్బులు లెక్కిస్తుంటే "నన్ను అడిగితే నేను నీ అవసరం తీర్చేదానినికదా! దొంగతనం ఎందుకు చేసావు? 
" అని బిడ్డ కోప్పడుతుంది. చెప్పితే వినిపించుకోదు. 

"నేను రాజు వేషం వేశాను. భటుడిగా.... రకరకాల వేషం వేశాను కానీ ఇప్పటివరకు వేయనివేషం నీవు వేయిస్తున్నావు అదే దొంగ వేషం. సంతోషం అని బాధపడతాడు.

రంగమార్తాండ దొంగనా? నాటకాలు వేసి కోట్లు సంపాదించాను. అనేక మందికి పంచి పెట్టాను. నన్నే దొంగగా చేస్తే..... అని బాధపడతాడు. తప్పు తెలుసుకుని బిడ్డ అల్లుడు ఎంత బతిమాలిన వినని
రాఘవ రాజు దంపతులు రాత్రికి రాత్రే చెప్పకుండా వెళ్ళిపోతారు. 

పోతూ పోతూ ఒక చెట్టు కింద రాఘవ రాజు భార్య పడుకున్నది పడుకున్నట్టుగానే చనిపోతుంది.

నేనెవరిని నేను ఎవరిని అని తనను తాను ప్రశ్నించుకుంటున్న రంగ మార్తాండ రాఘవ రాజు సంతానం కొడుకు కూతురు వస్తుంది. ఎవరిని దగ్గరికి రానివ్వడు భారీ డైలాగు చెప్పుతూ కుప్పకూలిపోతాడు అప్పుడు సిద్దూకు చెప్తాడు నటన,
 జీవితం చివరకు స్మశాన వసంతం అని. 

ఈ నిలయం నీది 
నర్తనశాలే కాదా?
నీ కొలువేది 
విరాట పర్వం కాదా?
ఏం తెలుసయ్యా సమరం ఏం పొందావు విజయం ?
అంతా వినడమే కానీ అనుమానం
నీ యుద్ధం నీలో నుండి నిన్నోడిందా? బ్యాక్ గ్రౌండ్ పాటతో ముగిసిపోతుంది.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. నటించడం కంటే జీవించడం అంటే సబబుగా ఉంటుంది అని నా అభిప్రాయం.

ప్రతి డైలాగ్ జీవం  ఉట్టిపడేలా ఉంది. కొన్ని తెలుగు కవుల కవితా పంక్త గుర్తు తెచ్చే విధంగా ఉన్న ప్రతి డైలాగు స్వతంత్రంగా రాయబడింది.

కృష్ణవంశీ గారు అనేకమైన కళాఖండాలను అందించారు.
కృష్ణవంశీ గారి సినిమా దర్శకత్వం చాలా రోజుల తర్వాత సంతృప్తిగా చూసే అవకాశం కలుగుతుంది.
ఇళయరాజా గారి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు.

తల్లిదండ్రుల కోరికల్ని గౌరవించడం.
 వారి ఆశయాన్ని కొనసాగించడం.
 చివరి సమయంలో వారికి అండగా ఉండడం నేటి యువతకి పిల్లలకి ఇచ్చే సందేశంగా సినిమా ఉంది.

ఆంగ్ల భాషా వ్యామోహాన్ని ధిక్కరించింది. పాశ్చాత్య పాప్ సంగీతాన్ని తులనాడింది.
విలియం షేక్స్పియర్ కంటే ముందే రాసిన నాటక కర్తలగు కాళిదాసు దండి బలిజేపల్లి లక్ష్మీకాంతం గుర్రం జాషువా ఎంతో మంది నాటక కర్తలను కవులను మరొకసారి గుర్తు చేసింది ఎన్నో భారతీయ మూలాలను చూసిన సినిమాగా నిలిచిపోతుంది.
గొప్ప సినిమా అందించిన కృష్ణవంశీ గారికి,
నిర్మాత గారికి, రంగమార్తాండ సినీ నటులకు సాంకేతిక నిపుణులకు అభినందనలు.

ప్రాణం పోసి నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా జేజేలు.

డా. సిద్దెంకి యాదగిరి
కవి, రచయిత, విమర్శకులు, విశ్లేషకులు 9441244773

15, ఏప్రిల్ 2023, శనివారం

అనేక జీవితాలకు ఆవాసం "మర్రి చెట్టు"

Web versionలో చూడగలరు


అనేక జీవితాలకు ఆవాసం ‘‘మర్రి చెట్టు’’ కథలు
        డా॥ సిద్దెంకి యాదగిరి 9441244773

  బతుకు సంఘర్షణలు అతికినట్లుగా కథల్లో జొప్పించడం అంత సులువైన పనికాదు. లుప్తమవుతున్న ఆత్మీయతలను అక్షరీకరించడం తేలికైనదీకాదు. సంక్లిష్టమైన వ్యక్తీకరణలను అలవోకగా అత్యంత సహజంగా తీర్చిదిద్దడం, పాత్రల మనస్తత్వాలు స్వభావోక్తంగా మలచడం కథకులు మన్నే ఏలియాకి దక్కుతుంది. 

 ఏలియా కథలు ఒకరకమైన కొత్తదనంతో కూడి ఉంటాయి. వస్తు నవ్యత, కథనంలో ప్రత్యేక శైలి మిళితమై ఉంటాయి. కథా వస్తువును ఎంచుకునే విధానంలోనే వినూతనత్వం, అభివ్యక్తిలో నూతనోత్సాహం వారి సొంతం. ఏలియా కథా శైలిలో చదివించే గుణం, ఆకట్టుకునే స్వభావం ప్రధాన లక్షణం.    

మన్నె ఏలియా కథలను పరిశీలిస్తే పాత్రల స్థితిగతులు అంతర్భాహ్య పరివర్తనలు, తెరమీద చూపే నాటకీయత అక్షరాల్లో ఆవిష్కరించబడుతుంది. ఆ కథలు చదువుతుంటే మన పక్కింటి వారో, మనకు అత్యంత ఆప్తులో ముచ్చటపెట్టినట్లు, మాట్లాడినట్లే ఉంటుంది. అంశం పెద్దదైనా, చిన్నదైనా కథను క్లుప్తంగా చెప్పడం వారి ప్రత్యేకత. గుర్తుండిపోయేలా రాయడం మరొక ప్రత్యేకత. 

  ‘మరి చెట్టు’ మన్నె ఏలియా తొలి కథా సంపుటి. పద్నాలుగు కథల సమాహారమే మర్రిచెట్టు. అనేక జీవులకు ఆవాసం మర్రిచెట్టు. లెక్కలేనన్ని అనుబంధాలతో అల్లుకున్న జీవితాలుగా కనపడుతాయి. ప్రతికథ పఠనీయ జీవితంలా దృశ్యీకరణ చేయబడింది. 
 చెట్టు మానవ మనుగడకు సాక్షిభూతంగా నిలుస్తుంది. చెట్టుతో జీవనం, చెట్టుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ రాసిన కథ మర్రి చెట్టు. ఈ కథలో దండేపల్లికి పోతా అనుకున్నా ఒక వృద్ధురాలు రాజవ్వ. బస్సెక్కింది ఆమెకు దండేపల్లి స్టేజి అంటే మర్రిచెట్టు అని గుర్తు. ఆ మర్రిచెట్టు కొట్టివేయబడ్డది. మర్రిచెట్టు కనబడలేదు. నేను దిగాల్సిన చోటు కాదని నిశ్చయించుకుంది. బస్సు ముందుకు పోయింది. కొంత దూరం వెళ్ళాక కండక్టర్‌ గుర్తు చేస్తే తప్ప తను స్టేజి దాటి పోయిన విషయం రాజవ్వకు గుర్తు రాలేదు. అట్లా గుర్తుకొచ్చి అనేక శాపనార్ధాలు పెట్టింది. బిడ్డ ఇల్లు చేరిన తర్వాత బిడ్డతో అదే విషయాన్ని రాజవ్వ చర్చిస్తుంది. రోడ్డు వెడల్పు వల్ల తీసివేసారని తెలియజేస్తుంది. ‘‘ఈని రోడ్డు మీద మన్నువడ. దాన్ని తప్పించి ఎయ్యరాక పోయిందా? మస్తు జాగుంది కదా! సక్కదనపు చెట్టును పొట్టన పెట్టుకున్నరు.’’ అని నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు రాజవ్వ ఒక్కతిదే కాదు. ఆ చెట్టుతో అనుబంధం ఉన్న అనేక మందిది. మర్రిచెట్టు చుట్టూ ఉన్న జీవితాన్ని, గుర్తుల్ని జ్ఞాపకాలని అలవోకగా ఆవిష్కరించింది.

 మనుషుల మధ్య భౌతిక ఆర్థిక సామాజిక అంతరాలున్న మాట నిజమే. సమాజంలో అసలైన శ్రీమంతుడు ఎవరు అనే ప్రశ్నతో ఎంఏ తత్వశాస్త్రం చదువుతున్న విద్యార్థికి ఒక సందేహం కలిగింది. ఇంట్లో తాతయ్య దంపతులది షష్టి పూర్తి మహోత్సవం. పండుగలోనూ సత్తిగాడేడీ అని చూసే వాళ్ళ సహానుభూతిలోంచి బతుకుతత్వము బోధచేసిన కథ ‘‘శ్రీమంతుడు’’.

  సంఘర్షణలను చిత్రించడంలో రచయితది అందెవేసిన చేయి. రెండు సిద్ధాంతాల మధ్య, రెండు వైఖరుల మధ్య ఆలోచనాత్మకంగా సాగుతుంటదీ ఈ కథ. ఆర్థిక శక్తిని ఆలంబనగా జీవించే అనేకమంది ఉన్నారు. జీవితం సంపాదన వెంటబడి కడుపునిండా తిండి తినరు. కంటినిండా నిద్రపోరు. అలాంటి వాళ్ళు ఎలా శ్రీమంతులని రచయిత పాత్రల ద్వారా పరివర్తన చేయిస్తాడు. ఇది నిజ జీవితంలో నుంచి సైదాంతిక అంశాలను పాత్రలు మాట్లాడుకుంటుంటే పాఠకులకు అర్థమవుతాయి. ఈ కథలో సత్తిగాడు పాత్ర నిరుపేద. అతనికి ఎవరూ లేరు. ఏ రకమైన ఆస్తి లేదు. కష్టం చేస్తాడు కడుపు నిండా తింటాడు. కంటి నిండా నిద్రపోతాడు. డబ్బు సంపాదించాలనే ఒత్తిడి లేదు. అన్ని తనకే కావాలి అనే ఆపేక్షాలేదు. ఉన్నంతలో తృప్తి పడుతున్నాడు. అందువల్ల ఆస్తిపాస్తులు లేకుండా జీవించే ఇతడే గొప్ప శ్రీమంతుడనీ తత్వ శాస్త్ర విద్యార్థికి అర్థమవుతుంది.

 కథ సాహిత్యంలో పేరు ఎన్నికగాంచిన కథ ‘‘దిద్దుబాటు’’. ఆ కథలో పేకాటకు వ్యసనపరుడైన గోవిందరావుని కమీలీని తన మంచితనంతో భర్తను, తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటది. అలాంటి సంస్కారవంతమైన కథ నేటి పల్లెల్లో కూడా ఉందని తెలియజేసే కథ ‘‘లచ్చవ్వ’’. లచ్చవ్వ, బక్కయ్య భార్యా భర్తలు. బక్కయ్య తాగుబోతు. తాగిన తర్వాత బాధలు పెట్టడం, పంచాయతి చేయడం మామూలే. ఓపికతో భరించిన లచ్చవ్వ మంచితనంతో భర్తను మార్చుకుంటుంది.

  వస్త్రం కంటే దేహము దేహం కంటే ప్రాణం గొప్పవే కదా అని చెప్పే అన్ని మత గ్రంధాలు చెప్పిన సారాంశాన్ని ఆధారం చేసుకుని రాసిన కథ ‘హత్య’. ఒక జీవిని మరొక జీవి హత్య చేయరాదనీ చెప్పుతుంది. ప్రశాంత్‌ రాత్రి లాంతర్‌ వెలుతురులో చదువుతున్నప్పడు అనుకోకుండా గడ్డి చిలుక ఎగిరి మీద పడుతుంది. వెల్ల గొడుతాడు. మళ్ళీ వెళ్లగొడుతాడు. అట్లా కోపంతో ఆ గడ్డి చిలుకని చంపేస్తాడు.  ఎందుకు చంపావు. నీకు ఇబ్బంది పెడితే చంపేస్తావా? మరొక జీవిని చంపే అధికారం నీకేవరికిచ్చారు? అటునుండి ప్రశ్నిస్తుంది. అని పరి పరి విధాలుగా అడుగుతుంది. తప్పైంది అని ఒప్పుకో అని ప్రశ్నిస్తుంది. ఒప్పుకున్న ప్రశాంత్‌ కి నిద్దుర పడుతుంది. అలా ప్రశ్నించింది ప్రశాంత్‌ అంతరారాత్మ. ఇది బాల సాహిత్యం కథనా? అనిపించకమానదు. ఈ కథ నడపడంలో రచయిత ప్రతిభ కనపడుతుంది. 

  బాధ్యతా రాహిత్యం వల్ల, ప్రేమలోపం వల్ల ఏర్పడ్డ బతుకులు చితికిపోతాయని, బతుకు పేదరికంలోకి ఈడ్వబడుతుందనీ తెలిసిన తర్వాత మనసు శకలలుగా విరిగిపడుతుంది. పాఠకుని మనసుని పిండివేస్తుంది. మనసు బాధించే కథలద్వారా రచయిత దుఃఖపు తెరను మనమీదికి విసిరే కథ ‘ఎర్రపూల గౌను’. విజయ్‌ భార్య చనిపోతే శైలజని లక్ష్మి కొరకు రెండో పెళ్లి చేసుకుంటాడు. విజయ్‌ మామ కార్గిల్‌ లో చనిపోవడం వలన పెద్ద ఇల్లు కొంటాడు. శైలజకి బిడ్డ ప్రిన్సి పుట్టే వరకు గారాబంగా చూస్తది. ఆ తరువాత పనిమనిషిగా చూస్తది. బడికి పంపది. విరామం లేకుండా పని చెప్పుతూనే వుంటది. అలసట లేకుండా పని ఎంత చేసినా ఆమె పట్ల కనికరం చూపది. బండ చాకిరి చేసినందుకు కాను మిగిలిన రాత్రి అన్నం, పాచిపోయిన పదార్థాలు పెడుతది. తండ్రి విజయ్‌ నోరు ఎత్తడు. నిజానికి శైలజ అనుభవిస్తున్న ఆస్తికి వారసురాలు లక్ష్మి. అనుభవిస్తుంది శైలజ. ప్రిన్సి ఎర్రపూల గౌను వేసుకుంటే బాగా కొడుతది శైలజ. ఆ గౌనును బలవంతంగా విప్పదీసి వాకిట్లో వేసి కాలపెడుతుంది. మూలన ఒక వైపున ఏడుస్తున్న లక్ష్మి వీపుపైన వాతలు తండ్రిని వెక్కిరిస్తుంటాయి. తండ్రి అవేవీ పట్టినట్టుగా ఉంటాడు. కొన్ని జీవితాలు ఉత్తాన పతాన స్థితులకు ఉదాహరణగా విషాదంతో ముగించబడిందీ కథ. 

  జీతగాన్ని కనీసం మనిషిగా చూడని మనస్తత్వం కలిగిన యజమానులు ఉంటారు. మనుషులు పంచని ప్రేమని పశువులతో స్నేహం చేసి ఆ లోటును ఎలా తీర్చుకుంటారో తెలిపే కథ 'మల్లిగాని కుక్క'. తనను అమితంగా ప్రేమించే యజమాని కుక్క చనిపోతే దానిని సమాధి చేసి స్నానం చేసిండు. బొంద వద్ద ఆగరుబత్తీలు పెట్టిండు. రంది ఎక్కువైంది. కుక్క గురించే రాత్రంతా ఆలోచిస్తూ అలానే పడుకున్నాడు. దాని జ్ఞాపకాలతో శాశ్వత నిద్రలోకి జారు కున్నాడు. పొద్దు పొడిసింది. మంద ఒకవైపు అల్లరి చేస్తుంది. ఓ తాగుబోతు లేవురా అని లేపేవరకు ఎప్పుడో చనిపోయాడు. కట్టె సర్సుకపోయాడు. మల్లిగాని మంచితనానికి ఊరు ఊరంతా కదిలి వచ్చింది. ఊరి జనమే సావు జేసింది. ఎవరికి రానంత జనం వచ్చింది. రామ సక్కదనం సావొచ్చింది. ఊల్లో ఉండాల్సిన మనిషి ఊరవతలికి, ఊరవతల ఉండాల్సిన కుక్క పెరట్లో ఘోరి కట్టబడిందనీ’’ దహనం చేసి ఊరు దిక్కు మరలిన జనం అనుకోవడం మల్లిగాని మంచితనాన్ని అత్యంత సహజంగా చిత్రించాడు రచయిత.

  వ్యవస్థను ప్రశ్నించిన కథ ‘అపచారమపచారం’ అంటరాని వారి నీడను తాకనివ్వని సమాజంలో దళితులకు నీళ్లివ్వని బావిలో పంది పడ్డది. తాకితే మైలపడుతదనే భావన అందరిలో ఉంది. అది గుడిముందటి బావి. ఆ బావి దళితులకు నీళ్ళివది. నీళ్లివ్వని బావిలోకి దిగి పందిపిల్లను తీయడానికి దళితుడైన చిన్రాజిగాడు ఉచితంగా తీయడానికి ఒప్పుకుంటాడు. తీసినంక నాదొక కోరిక పూజారికి పటేల్ కు రెడ్డికి తెలియజేస్తాడు. నేను శుబ్బురంగా స్నానం చేసి గుళ్లోని నందిని తాకుత అంటాడు. సరే కానీ అని ఒప్పుకుంటారు. పటేల్‌, పూజారి ముందైతే పందిని తియ్యిరా అని పురమాయించి ప్రణాళిక ప్రకారం గుడి మెట్లనుకూడా తాకనివ్వరు. ఈ వ్యవస్థ మీ ‘థూ ’ అని ఉమ్మేస్తాడు. మనుషులని మనుషులుగా చూసే సమాజం కోసం ఘవెళుతాడు. అలా చేసింది ఒక్క చిన్రాజిగాడేనా? ఆ పాత్రేనా? కాదు ముమ్మాటికి అది అంటరాని ఆక్రోశంగా చిత్రించడం అద్భుతంగా సాగుతుంది. 

 కళలను ప్రేమించే వాళ్లకు వాయిద్యాల మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నా ప్రాణం అంటారు. పంబాల భీములు ప్రాణం ఎక్కడుందో తెలిపే కథ ‘జమిడికె’. ఈ కథ చదువుతుంటే చాసో వాయులీనం కథ గుర్తుకు రాకమానదు. రాజ్యం, వెంకటప్పయ్య భార్య భర్తలు. రాజ్యం ఆరోగ్యం కోసం వాయులీనాన్ని అమ్మి జరీ అంచు చీర తెస్తాడు. రాజ్యం ఆ తల్లి పోతూ పోతూ ప్రాణం పోసింది. చీరా, రవికె గుడ్డ పెట్టిందని రాజ్యం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఏలీయా కథ జమిడికెలో ఎత్తుకు పై ఎత్తు వేసి జమిడికెను కాజేయాలనీ చూసిన పట్నం సార్‌ ఇస్తున్న ఐదువందల రూపాయలను వద్దనీ మొకమ్మీద కొట్టిండు బీములు. ‘‘ఇందామని రాలే. నా జమిడికె కొందామనీ వచ్చిండు’’ అని భార్యకు చెప్పుతడు. నా ప్రాణముండంగ నా జమిడిక ఎవరికియ్యననడం గొప్ప అవ్యాజ్యమైన ప్రేమకు పరాకాష్టగా పేర్కోంటాడు. 

  పేదరికం వింత పాఠశాల లజ్జ కానబడది అని అన్న గుర్రం జాషువా మాటల్ని గుర్తుకు వచ్చేలా రాసిన కథ ‘కొత్తంగి’. ఈ కథ చదువుతుంటే రాయిలాంటి మనసున్నా లక్కలా కరుగాల్సిందే. హృదయాల్ని అంకుశంతో పొడిసినట్లుగా చిత్రించిన కథ. తల్లీ కొడుకుకు బట్టలు కొనివ్వలేని దరిద్రంలో ఉంటుంది. పండుగకు పోయేటప్పుడు బంధువు కొడుకుది కొత్తంగి వేసుకొనిపోతారు. తిరిగి వచ్చేటప్పుడు బస్టాండ్‌లోనే పెయిమీదికేలి కొత్తంగి తీసుకుంటది బంధువు. పిల్లాడి వీపు మీద అంగిలేదు. బరివాతల వున్నాడు. తల్లి కొడుకును తన కొంగుకప్పుకొని తెల్లవారుతుండంగా ఊళ్లోకి వస్తుంటది. కొడుక్కు చలి పెడుతుంటది. సానుపు చల్లే వాళ్లు ఏమైందేందని అడుగుతారు. దాటవేసుకుంటూ వెళుతుంటది. ఇంటికి పోవడానికి మక్కపెరట్ల నుంచి వెళుతుంటే తెనుగు చిన్నయ్య కంకులు దొంగతనం చేసినావే. ఎన్నాళ్లు ఈ దొంగతనం చేస్తున్నవే అని తిడుతాడు. అంగి గురించి చెప్పినా వినిపించుకోడు. అట్లా ఇజ్జత్‌ అంతా పోతుంది. గుడిసెలో ఎక్కడ దాసినవో అని గుడిసె అంతా వెతుకుతాడు ఏమీ దొరుకదు. వాడకట్టంతా అవమానం పాలైతది. కొడుక్కు కొత్తంగి కొనాలనుకుంటది. రాత్రంతా ఆలోచిస్తుంటది. సోమవారం అంగడిలో కొంటది. అది కల అని తెలుసుకొని బాధపడుతది. ఒకవైపు సలికి కొడుకు బాధపడుతూనే ఉంటడు. 

  ఆదిలాబాద్‌ జిల్లాలోని దండెపల్లిలో మొదలైన ఏలియా కథా ప్రస్తానంలో పచ్చని పల్లెతనం పుష్కలం. బతుకు పదన అమోఘం. తిరుగుబాటు పదునూ అమేయం. మనుషులు మనుషులుగా పరిగణించని సమాజంపై వారి పాత్రలే ధర్మాగ్రహం ప్రకటిస్తాయి. ఏలియా కథ పాఠకున్ని ఆలోచింపజేస్తుంది. తదాత్మ్యం చేయిస్తుంది. కథలు చదువుతుంటే, ఆ బాధలు వింటుంటే మన మనసు లోంచి కొత్త మనిషిపుట్టుకొస్తాడు పుటం పెట్టిన బంగారంలా. అచ్చమైన బతుకులు. స్వచ్చమైన జీవితాలు లిఖించే ఏలియా ఎన్నటికైనా తెలుగు కథా సాహిత్యానికి, తెలంగాణ జీవితానికి చిరానామాగా తప్పకుండా మిగులుతాడు.

2, ఏప్రిల్ 2023, ఆదివారం

విజయోస్తూ 10వ తరగతి విద్యార్థులకు

*𖣔 విజయోస్తూ (ALL THE BEST)*👍🏻

*𖣔 10 వ తరగతి విద్యార్ధులకు మరియు ఉపాధ్యాయలకు ALL THE BEST*
1 ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.

2 తెల్లవారు ఝామున  4.30 లకు నిద్రలేవండి.

3 మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.

4 ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.

5 ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి.

6 ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.

7 అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.

8 తర్వాత పుస్తకం (main poits) తిరగెయ్యండి

9 పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.

10 ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి.

11. 8.50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి.

12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి వెళ్ళండి.

13. ఉపాధ్యాయులు (Invigilators) చెప్పే సూచనలు గమనించండి.

14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.

15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.

16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.

17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.

18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.

19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.

20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.

21. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.

22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్  ట్రై చేయండి.

23. గుర్తు రాకపోతే తలని ఎడమ వైపు త్రిప్పి ఆలోచించండి.

24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.

25. తప్పులు,ప్రశ్న నెంబర్లు సరి చూడండి.

26. బిట్ పేపర్ ఇవ్వగానే దారం తో కట్టండి.

27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.

28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.

29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి..

30. నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.

31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.

32. బొమ్మలు,మ్యాప్ , గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి.

33. బుద్దిమంతులుగా మసలండి.కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.

34. చక్కని విజయాన్ని అందుకుని - అమ్మ,నాన్న లను by ghu మరియు ,మీ టీచర్స్ ని సంతోష పెట్టండి.

 *𖣔 విజయోస్తు(ఆల్ ది బెస్ట్.)* 💐💐🤝🤝