__________________________________________________________________________
1. దానశీలము
పాఠ్య పుస్తకం లోని 'దానశీలం' పాఠం pdf
__________________________________________________________________________
2. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు
2. ఎవరి భాష వాళ్లకు వినసొంపు- పరీక్ష 2
పాఠ్య పుస్తకం లోని 'ఎవరి భాష వాళ్ళకి వినసొంపు' పాఠం pdf
__________________________________________________________________________
3. వీరతెలంగాణ
పాఠ్యపుస్తకంలోని 3. వీరతెలంగాణ పాఠం pdf _____________________________________________________ _____________________ 4. కొత్త బాట
__________________________________________________________________________
5. నగర గీతం
__________________________________________________________________________
6. భాగ్యోదయం
__________________________________________________________________________
7. శతక మధురిమ
__________________________________________________________________________
8. జీవన భాష్యం
__________________________________________________________________________
9. బిక్ష
__________________________________________________________________________
10. గోల్కొండ పట్టణం
__________________________________________________________________________
11. భూమిక
__________________________________________________________________________
పాత ప్రశ్న పత్రాలు- old question paper
SA-1 question paper October 25
2026 మార్చి SSC ప్రశ్న పత్రం
VIDEO
6 7 8 9 10 తరగతులు
రామాయణం
1. బాలకాండ
2. అయోధ్యా కాండ
3. అరణ్యకాండ
5. సుందరకాండ
6. యుద్ధకాండ
తెలుగులీనేల
మంచి మార్కులు రావాలంటే ....
విజయోస్తు ...
అభ్యాస పరీక్ష -2 X CLASS TELUGU - MARCH 2025 KEY PAPER
VIDEO
7. శతక మధురిమ పరీక్ష
8. జీవన భాష్యం పరీక్ష
అపరిచిత పద్యం & గద్యం
6 7 8 9 10
మ. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వం భరుం డలతిం బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండ ముం గలడే మాన్ప నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనముం, బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా! తాత్పర్యం: దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ , రాజ్యాన్నీ , పరాక్రమాన్నీ , నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా ? నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని (వామనుడిని) పంపించు.
శా. కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గ ర్వోన్నతిం బొందరే ?
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీ తిన్ యశః కాములై
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే ? భూమిపైఁ
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యి క్కాలమున్ ? భార్గవా! !
తాత్పర్యం: ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా ? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా.
మ నిరయంబైన , నిబంధమైన , ధరణీ ని ర్మూలనంబైన , దు
ర్మరణంబైనఁ, గులాంతమైన నిజమున్ రా నిమ్ము; కానిమ్ము పో ;
హరుఁ డైనన్, హరి యైన , నీరజభవుం డ భ్యాగతుం డైన నౌఁ ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా ; ధీ వర్య! వే యేటికిన్ ?
తాత్పర్యం:ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా , నాకు దుర్మరణం వచ్చినా సరే , నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ , ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు , విష్ణువు , బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).
*ఉ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్! ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!
తాత్పర్యం: అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజు తో తలపడ మన్నావు ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా!
*మ. తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా జలలాముం డనువాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము! భీ తిలిపోయెన్ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్! దిశాం చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ తాత్పర్యం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.
*మ. తెలగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!
తాత్పర్యం: అమ్మా! తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా..
మ. భవదీయార్చన సేయుచోఁ ప్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెం
డవ పుష్పంబు దయాగుణం, బతివిశిష్టం బేకనిష్ఠా సమో
త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో
గవిధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా !
సర్వేశ్వర శతకము- యధావాక్కుల అన్నమయ్య
శా. ఊరూరం జనులెల్ల బిక్షమిడరో, యుండం గుహల్గల్గవో
చీరానీకము వీధులందొరకదో, శీతామృత స్వచ్ఛవాః
పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో
చేరం బోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
మ. సిరి లేకైన విభూషితుండె యయి భాసిల్లు బుధుండౌదలన్
గురుపాదానతి కేల నీగి చెవులందున్విన్కి వక్ర్తంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులంన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా! నీతి వాచస్పతీ!
ఉ. భండనభీముఁ డార్థజన బాంధవుఁ డుజ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలుఁ
సకల గ్రంథమ్ములు చదివినట్లు
బిక్షమియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ
జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచింపకుండినఁ జాలుఁ
నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలుఁ
గనకకంభపుగుళ్ళు గట్టినట్లు
తే.గీ. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
మ. ఘనుడవ్వాడగు, వేడు త్యాగమయ దీక్షంబూని సర్వంసహా జన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీ వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా! విశ్వనాథేశ్వరా! 6
శా. పొత్తంబై కడునేర్పుతో హితము నుద్భోదించు మిత్రుండు, సం విత్తంబై యొక కార్యసాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వా యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు, ప్రో చిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంకరామేశ్వరా!
సీ. కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు
మాయమాటల సొమ్ము దీయువాడు
కులగర్వమున పేద కొంపలార్చెడివాడు
లంచంబులకు వెల బెంచువాడు
చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు
వరుసవావికి నీళ్ళు వదులువాడు
ముచ్చటాడుచు కొంప ముంచ జూచెడివాడు కన్నవారల గెంటుచున్నవాడు
తే.గీ. పుడమిలో నరరూపుడై పుట్టియున్న
రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర!
కృపనిధీ! ధరనాగరకుంటపౌరి!
వేణుగోపాలకృష్ణ! మద్వేల్పు శౌరి!
ఉ. వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మనిపిల్చె హస్తసం జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
శా॥ ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే! నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్ శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ !
చ॥ అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్
యూట్యూబ్ లింక్స్
పాఠశాల స్థాయి
10వ తరగతి
9వ తరగతి
8వ తరగతి
7వ తరగతి
6వ తరగతి
సంస్కృత సంధులు
తెలుగు సంధులు
చంధస్సు
సమాసములు
follow కాగలరు. ఈ బ్లాగ్ గురించి మీ అభిప్రాయం / మరిన్ని సూచనలు కామెంట్ బాక్స్ లో రాయండి.
చాలా బాగుంది సార్ ,పిల్లలకు ఉపయోగకరం ధన్యవాదాలు
రిప్లయితొలగించండిGuguloth rahul
రిప్లయితొలగించండిGuguloth mansing
రిప్లయితొలగించండిKgbv
రిప్లయితొలగించండిSanjana
రిప్లయితొలగించండి