రామాయణం నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి
రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.
వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.
రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.
దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.
కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.
అయోధ్య : కోసలదేశ రాజధాని
దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).
రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు
రామాయణంలోని కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్యకాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7. ఉత్తరకాండ
నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.
వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.
వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”
ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.
మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.
మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.
బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.
తాటక : యక్షిణి
సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.
జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.
కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.
అహల్య : గౌతమ మహర్షి భార్య.
శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.
సీత (జానకి) : శ్రీరాముని భార్య
ఊర్మిళ : లక్ష్మణుని భార్య
మాండవి : భరతుని భార్య
శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య
పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.
కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.
మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.
సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని రథసారథి.
గుహుడు : శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు.
భరద్వాజుడు : సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.
భరద్వాజాశ్రమం : గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.
చిత్రకూటం : ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.
అత్రిమహర్షి : సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.
అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.
దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది.
విరాధుడు : తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.
శరభంగ మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.
సుతీక్ష్య మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు.
విశ్వామిత్రుడు : గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.
అగస్త్య భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు తెలియని వారిని ‘అగస్త్య భ్రాత’ అంటారు.
అగస్త్య మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.
పంచవటి : గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.
జటాయువు : ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.
శూర్పణఖ : ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె ముక్కు, చెవులను కోసి విరూపినిగా చేశాడు.
ఖరదూషణులు : శూర్పణఖ సోదరులు.
అకంపనుడు : రావణాసురుడి గూఢచారులలో ఒకడు.
రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.
లంకానగరం : త్రికూట పర్వతం మీద ఉంది.
కబంధుడు : ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.
శబరి : ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.
ఋష్యమూక పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.
వాలి సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.
హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.
తార : వాలి భార్య.
రుమ : సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.
నీలుడు : ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.
నలుడు : ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.
జాంబవంతుడు : భల్లూకరాజు.
సుషేణుడు : వానరరాజు, తారతండ్రి.
సంపాతి : పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.
మైనాకుడు : ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు.
సురస : నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
సింహిక : ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.
లంకిణి : లంకాధిదేవత.
కుంభకర్ణుడు : రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.
మహాపార్శ్వుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.
వీభీషణుడు : రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.
మహూదరుడు : ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.
విరూపాక్షుడు : మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు సంహరించాడు.
విద్యుజిహ్వుడు : ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.
త్రిజట : విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత కోరిక నెరవేరుతుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది.
ఇంద్రజిత్తు : రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు
ప్రహస్తుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.
శుకసారణులు : రావణాసురుని మంత్రులు.
సరమ : విభీషణుని భార్య.
జంబుమాలి : ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు
అతికాయుడు : రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.
మాతలి : ఇంద్రుని రథ సారథి.
పుష్పక విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.
త్రికూట పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.
- అయోధ్యాపురం, రాముని జననం
- విశ్వామిత్రుని వద్ద శిష్యరికం
- తాటక వధ
- యాగ పరిరక్షణ
- అహల్య వృత్తాంతము
- విశ్వామిత్రుని వంశము
- గంగావతరణ గాధ
- వివాహ నిశ్చయము
- సీతారామ కల్యాణము
- పరశురామ గర్వ భంగము
- అయోధ్యాగమనం
- బాలకాండ కీలక పదాలు: జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం.
- కోసల దశరథ మహారాజు గారి దేశం.అయోధ్య కోసల దేశపు రాజధానిఅయోధ్య అనగా యోధులు జయింపశక్యము కానిదిదశరథుని మంత్రి సుమంతుడుఋష్యశ్రుంగ మహర్షి మూడు రోజులపాటు అశ్వమేధ యాగం చేశాడు.బల అతిబల విద్యలుదేవతలు రావణాసురుని బాధ తప్పించమని బ్రాహ్మణ వేడుకున్నారు. రావణాసురుడికి మానవునితోనే మరణం అని బ్రహ్మ చెప్పాడు.దేవతలంతా శ్రీమహావిష్ణువు వేడుకున్నారు.విష్ణువు అభయమిచ్చాడు.
- సామెతలు, సూక్తులు: చెవిలో ఇల్లు కట్టుకొని కోరుతున్నాయి.
- యోధులకు జయింపసత్యం గాని అయోధ్య.
- 'యధా రాజా తథా ప్రజాః' రాజీ ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు.
- గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది.
రామాయణం డౌన్ లోడ్ చేసుకోండి.
రాముని జననం:
యజ్ఞపురుషుడిచ్చిన దివ్య పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకిచ్చాడు. వారు చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, గురూదయ సమయంలోకౌసల్యకు రాముడు జన్మించాడు.కైకేయి కి భరతుడు జన్మించాడు.సుమిత్రకు - లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు.
- విశ్వామిత్రుని వద్ద శిష్యరికం మారీచ స్వభావులు యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు."యజ్ఞ రక్షణ కొరకు రాముని పంపు" -విశ్వామిత్రుడు"రాముని పంపలేను. నేనే వస్తా" - దశరధుడురాముడు వెళ్లడానికి దశరథునికి నచ్చజెప్పి ఒప్పించింది వశిష్ట మహర్షి.
- వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపాడు.
మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. వాటివలన అలసట, ఆకలిదప్పులు కలుగవు.
- తాటక వధ, యాగ పరిరక్షణ
- గంగావతరణ గాధ:అయోధ్యాధిపతి సగరునకు పెద్దభార్య కేశిని వల్ల అసమంజసుడనే కొడుకు, రెండవ భార్య సుమతి వల్ల అరవై వేలమంది కొడుకులు జన్మించారు. భగీరధుని ప్రార్థనపై ఒక పాయను నేలకు వదిలాడు. ఉరుకులు పరుగులతో గంగ భగీరధుని వెంట బయలుదేరి, దారిలో ఎందరినో పునీతం చేసింది. ఆ ప్రవాహం తన యజ్ఞశాలను ముంచివేసినందుకు కోపించి జహ్న మహర్షి గంగను పానం చేసేశాడు. పిదప దేవతల విన్నపాలపై తన చెవిలోనుండి వదలిపెట్టాడు. కనుక ఆమె జాహ్నవి అయ్యింది. గంగ భగీరధుని వెంట సముద్రంలో కలిసి, పాతాళానికి వెళ్ళి, సగర పుత్రుల భస్మరాసులపైనుండి ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కలిగించింది.(అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది. ) భగీరథుని వంశంలోని వాడే రాముడు.
దశరథునికి పుత్ర జననం గురించి రాయండి (లేదా)
కౌసల్యకు రాముడుకైక కు భరతుడుసుమిత్రకు లక్ష్మణ శత్రజ్ఞులు పుట్టారు.
- తల్లిదండ్రులను పూజించాలి వారి మాటలను ఆచరించాలి
- గురువులను భక్తితో గౌరవించాలి ఆపదలో ఉన్న వారిని బలహీనులను ఆదుకోవాలి
- మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి.
- ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఆశ్రయం కోరిన వారిని ఆదుకోవాలి.
- అన్ని సమయాల్లో ధైర్యాన్ని కలిగి ఉండాలి.
- మిత్రుత్వం కోసం సుఖ సంతోషాలను వదిలిపెట్టి సహాయం అందించాలి.
- స్త్రీలు మాతృమూర్తులు స్త్రీలందరిని గౌరవించాలి.
- ధర్మాలు సారంగా జీవించడం నేర్చుకోవాలి.
- పవిత్రమైన జీవితాన్ని ఆచరించాలి. చేయాల్సిన పనితో పాటు దానికి భంగం కలగకుండా దానికి అనుగుణమైన అనుబంధమైన ఇతర కార్యాలను కూడా సాధించాలి.
- ఇతరులను గౌరవించాలి.
- అందరి పట్ల సహానుభూతి ఉండాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సత్పురుషులతో మేధావులతో మంచి విషయాలు చర్చించాలి.
- ప్రకృతిని ప్రేమించాలి.
- ఇతరుల పట్ల అసూయ ఈర్ష ద్వేషం లేకుండా జీవనం గడపాలి.
రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.
వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.
రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.
దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.
కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.
అయోధ్య : కోసలదేశ రాజధాని
దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).
రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు\
నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.
వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.
వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”
ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.
మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.
మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.
బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.
తాటక : యక్షిణి
సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.
జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.
కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.
అహల్య : గౌతమ మహర్షి భార్య.
శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.
సీత (జానకి) : శ్రీరాముని భార్య
ఊర్మిళ : లక్ష్మణుని భార్య
మాండవి : భరతుని భార్య
శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య
పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.
కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు. శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు- కైకేయికి మంధర దుర్బోధ
- కైకేయి కోరికలు:
- దశరథుడు మూర్ఛిల్లడం
- కైకేయికి శ్రీరాముని హామీ
- సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష
- వన ప్రయాణం
- గుహుని ఆతిథ్యం
- చిత్రకూట నివాసం
- దశరధుని మరణం
- భరతుని దుఃఖం
- చిత్రకూటానికి భరతుడు ప్రయాణం
- పితృవాక్య పాలన
- శ్రీరాముని పాదుకలతో పరిపాలన
- అత్రి, అనసూయ, సీత
కీలక పదాలు :
- కైకేయికి మంధర దుర్బోధ
- కైకేయి కోరికలు:
- దశరథుడు మూర్ఛిల్లడం
- కైకేయికి శ్రీరాముని హామీ
- సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష
- వన ప్రయాణం
- గుహుని ఆతిథ్యం
- చిత్రకూట నివాసం
- దశరధుని మరణం
- భరతుని దుఃఖం
- చిత్రకూటానికి భరతుడు ప్రయాణం
- పితృవాక్య పాలన
- శ్రీరాముని పాదుకలతో పరిపాలన
- అత్రి, అనసూయ, సీత
అరణ్యకాండ
విరాధ వధ
అగస్త్యాశ్రమ దర్శనం
పంచవటిలో నివాసం
శూర్పణఖ భంగం
ఖరదూషణాదుల సంహారం
రావణునితో శూర్పణఖ గోడు
రావణునకు మారీచుని హితవు
మాయలేడితో మోసం
సీతాపహరణం
జటాయువు మరణం
కబంధుని శాప విమోచన
శబరి సేవ
విరాధ వధ ( తుంబుర వధ ): తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాప కారణంగా రాక్షసుడయ్యాడు. ఏ శస్త్రంతోనూ చావకుండా వరముంది.
రామునిచేతనే అతనికి శాపవిముక్తి కావాలి.
విరాధుడు సీతను పట్టుకుపోసాగాడు.
రాముని పదును బాణాలవలన కోపించి, సీతను విడచి, రామ లక్ష్మణులను చేతులలో ఇరికించుకుపోసాగాడురామ లక్ష్మణులు విరాధుని చేతులు నరికేశారు. శాపవిముక్తి కలిగిన విరాధుడు వారెవరో తెలిసికొని రాముని శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. గోతిలోనే పూడ్చమన్నాడు. శిరభంగ మహర్షిని దర్శించుకోమన్నాడు.
బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని కోసమే తాను బ్రహ్మలోకానికి వెళ్ళకుండా వేచియున్నాడు. తన తపస్సు పుణ్యాన్ని రామునికి సమర్పించి, వారిని సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళమన్నాడు.
అక్కడి మురులందరూ రాక్షసులచేత చంపబడిన మునుల కళేబరాలను చూపించారు.
మీరు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను శిరసావహిస్తానని రాముడన్నాడు.
సుతీక్షణ మహర్షి అగస్త్య ఆశ్రమం దర్శించుకోవాలని రామునికి విన్నవించాడు.
2. అగస్త్యాశ్రమ దర్శనం: సుతీక్ష్ణ మహర్షి చెప్పిన ప్రకారం సీతారామలక్ష్మణులు ముందుగా అగస్త్యభ్రాత ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని ఆతిథ్యాన్ని స్వీకరించారు. (పేరు లేని వాడిని అగస్త్యబ్రాత అని సంబోధిస్తారు)
ముందుకు సాగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి చేరుకొన్నారు. అగస్త్యుడు మృత్యువును జయించిన మహాతపస్వి. వింధ్య పర్వతం పెరుగుదలను నిలిపాడు. నరమాంస భక్షకులైన వాతాపి ఇల్వలులను నాశనం చేశాడు. దక్షిణ దిక్కును మునులకు ఆవాస యోగ్యంగా చేశాడు. ఆగస్త్యుడు శ్రీరాముని ఆహ్వానించాడు(అతిధిని గౌరవించే సంప్రదాయం).
శ్రీరామునికి ఆగస్టు డు దివ్య ధనుస్సు అక్షయ తూణీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించిఆశీర్వదించాడు. భర్తతో సీత అడవికి రావడం గొప్ప సాహసం అని కితాబిచ్చాడు. వారిని గోదావరి తీరాన ఉన్న పంచవటికు వెళ్ళమని సూచించాడు.
3. పంచవటిలో నివాసం: పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం. వారిని గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు. తాను దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు.
పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు.
4. శూర్పణఖ భంగం: రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి కామరూపి.
ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్ళి చేసుకోమని అడిగింది. రాముడు, లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. సీతను తినివేయబోయింది. అపుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసివేశాడు.
శూర్పణఖ యేడుస్తూ తన సోదరుడైన ఖరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది.
ఖరుడు యముళ్ళాంటి పధ్నాలుగు రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. పదునాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు.
శూర్పణఖ బావురుమంటూ ఖరునివద్దకుపోయి అతను చేతకానివాడని దెప్పిపొడిచింది. ఉద్రిక్తుడైన ఖరుడూ, అతని సేనాధిపతి దూషణుడూ వీరాధివీరులైన పధ్నాలుగు వేల రాక్షససేనతో దిక్కులు పిక్కటిల్లే పెడబొబ్బలతో, భేరీభాంకారాలతో, సాగరంవలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు.
5. ఖరదూషణాదుల సంహారం: ఖరునిపై బాణ ప్రయోగం చేసిన రాముడు ఆకాశంలో పుట్టిన ఉత్పాతాలను గమనించాడు రాముడు. రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ధనసు ధరించి, సీతను వెంటబెట్టుకొని, ఒక దుర్గంలా ఉన్న గుహలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిలాగా వెలుగుతున్న రాముడు కవచం తొడుగుకొని ధనుర్ధారియై నారి మోగిస్తూ రాక్షసులకు ఎదురు వచ్చాడు. వారి యుద్ధం చూడడానికి ఆకాశంలో మహర్షులు, దేవ గంధర్వ సిద్ధ చారణాదులు గుమికూడి రామునకు మంగళం పలికారు. పధ్నాలుగు వేల మంది రాక్షసులూ, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు మరణించడంతో శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకకు పోయింది.
రావణాసురునితో శూర్పణక గోడు:శ్రీరాముని భార్య సీత అందాల రాసి శ్రీరామునికి ప్రాణం ఎలాగైనా ఆమె అపరిస్తే చాలు ఆయన బాటిల్ తట్టుకోలేక రాముడు జీవితం చాలా ఇస్తాను అని ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది
8. మాయా లేడి మోసం: రావణుడు సీతాపర్ల విషయం తెలియజేశాడు. శ్రీరాముని కవ్వించడం కొరుకుతో తలకోక్కోవడమే కావున వద్దని వారించాడుమారీచుడు. బంగారు లేడి గా మారి సహకరించమన్నాడు మారించుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. (మూర్ఖులకు హిత బోధలు చెవికి ఎక్కవు.) నేను చెప్పినట్టు చేయకుంటే నీ చావు తప్పదని హెచ్చరించాడు రావలెను
9. సీతాపహరణం: బంగారు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు మారిచూడు. ఆ లేడీ ని ఇష్టపడ్డది. అది కావాలని సీత అడిగితే అది మాయామృగం అని రామలక్ష్మణులు సెలవిచ్చారు. సీత పట్టు వదలలేదు.
సీత కోరికపై మాయా లేడిని పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు రాముడు. అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని కొంతసేపటికి ప్రాణాలు విడిచాడు మారీచుడు.
శ్రీరాముడు ఆపదలో చిక్కుకున్నాడు వెంటనే వెళ్ళు మరి లక్ష్మణ ని కి చెబితే మీ రక్షణ భారం నాదని నేను వెళ్లలేను అన్నాడు. సీత ఆవేశం రెండింతలు అయింది. నీలో ఏదో దుష్టాలోచన ఉంది అని నిష్టూరోక్తులాడిందిసీత. వెళ్లడానికి నమస్కరించుకున్న లక్ష్మణుడు సీతకు నమస్కరించి వెళ్ళాడు.
సన్యాసివేషంలో సీత సమక్షానికి వచ్చిన రావణుడు తాను రాక్షస రాజు లంకేశ్వరుడునని ప్రకటించాడు. తనను ప్రతిగా స్వీకరించమని అడిగాడు. అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో వెలసిల్లుతావని ఆశ చూపాడు. నన్ను అపహరించి నీ చావు నీవే కొని తెచ్చుకోకు అనిహెచ్చరించింది. రామా రామా అంటూ ఆర్తనాదాలు చేసింది.
10. జటాయువు మరణం: అపహరించుకుపోతున్న రావణునితో జటాయువు యుద్ధం చేయగా జటాయు రెక్కలను కాలనీ నరికి వేశాడు రక్తంతో తడిసి ముద్దయిన అతని చూసి ఆత్మ బంధువులు పోగొట్టుకున్నట్లు సీత విలపించింది. ఇట్టి విషయాన్ని కొనఊపిరితో ఉన్న జటాయువు రామునికి చెప్పి కన్ను మూసింది. రాముడు దహన సంస్కారాలు చేశాడు.
11. కబంధుని శాప విమోచన: తల మెడ కనబడని కబంధుడనే రాక్షసుడు యోజనం పొడవు చేతులు వ్యాపించి పక్షులను మృగాలను పట్టుక తింటాడు(అందుకే ‘కబంధహస్తాలు’ అన్న జాతీయం పుట్టుకు వచ్చింది). రామలక్ష్మి భుజించడానికి నోరు తీర్చగా అన్నదమ్ములిద్దరూ తమ కడ్గాలతో వాడు భుజాల నరికి వేశారు కాబోలు కుప్పకూలాడు. శాపం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పి మీకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందని వివరించారు.
4. కిష్కింధా కాండ
1. శ్రీరామ, సుగ్రీవుల మైత్రి
2. సుగ్రీవుడు, వాలి పోరాటం
3. రాముని వాలి నిందించుట
4. రాముని సమాధానం
5. వాలి చివరి కోరికలు
6. శ్రీరాముని వేదన
7. సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం
8. సీతాన్వేషణ ఆరంభం
9. దక్షిణ దిశలో సాగిన అన్వేషణ
10. హనుమంతుని సంకల్పం
పంపా సరోవరం కడు రమణీయం
సీతలేని రాముడు దిగులుతో ఉన్నాడు.
“అన్నా! ఈ ధైర్యాన్ని వదులు. అది మనకు మేలు చేస్తుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యమైనది లేదు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. వదినగారు తప్పకుండా లభిస్తారు.” అని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు
ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను సుగ్రీవుడు చూశాడు.
శ్రీరామ, సుగ్రీవుల మైత్రి:
హనుమంతుడు రామునితో “వానర రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు. అతని అన్న వాలి అతనిని వంచించాడు. నేను అతని మంత్రిని నన్ను హనుమంతుడు అంటారు” అని పరిచయం చేసుకున్నాడు.
సరైన స్వరముతో తప్పులు లేకుండా మనసు పతుకునేటట్లు చెప్పాడు ఈయన మాట తీరు వల్ల చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు శ్రీరాముడు
సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు.
సీతాపహరణ వృత్తాంతాన్ని విని, తాను సహాయపడగలన్నాడు.
రామా! ఈనాడు నీవు నాకు ప్రాణ మిత్రుడు అయినావు? ఇప్పటినుంచి సుఖదుఃఖాలలో మనం ఒకటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు.
నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తాను అని మాట ఇచ్చాడు శ్రీరాముడు.
కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు.
వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.
కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు.
రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు.
వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు.
సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.
దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
సుగ్రీవుడు, వాలి పోరాటం హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు
అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--
రాముని వాలి నిందించుట: రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.
రాముని సమాధానం: వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.
ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.
నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కానీ నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.
వాలి చివరి కోరికలు:రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు. వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.
శ్రీరాముని వేదన: నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే రావణ వధకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవునకు చెప్పాడు.
రామ లక్ష్మణులు ధాతు సంపన్నమైన ప్రస్రవణ పర్వతంపై నివశించసాగారు.దుఃఖించేవాడికి సర్వ కార్యాలు చెడుతాయని, ఒక్క నాలుగు నెలలాగితే కార్యసాధన సానుకూలమౌతుందని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.
సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం: రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు.
అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్ప లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.
అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.
సీతాన్వేషణ ఆరంభం: సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేల కొలది సేనతో తూర్పు దిక్కున సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు.
పడమటి దిక్కుకు సుషేణుడు,
ఉత్తర దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్ళారు.
అంగదుడు దక్షిణ దిశాన్వేషణా బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.
సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు.
ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.
దక్షిణ దిశలో సాగిన అన్వేషణ: దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. రజత పర్వతంపైని వెదికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. దాహార్తులై ఋక్షబిలం అనే ఒక సొరంగంలో ప్రవేశించారు. అందులోంచి బయట పడే మార్గం కానరాలేదు. అక్కడ మేరు సావర్ణి పుత్రిక స్వయంప్రభ తపస్సు చేసుకొంటూ మహా తేజస్వినియై వెలిగిపోతున్నది. వారి కథ విని ఆమె వారికి ఆతిధ్యం ఇచ్చింది. వారిని కనులు మూసుకోమని, తన తపశ్శక్తితో దక్షిణ దిశలో సాగర తీరానికి చేర్చింది.
అంతు లేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరు వేసుకొంటుండగా అక్కడికి సంపాతి అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన జటాయువు మరణించాడని తెలిసికొని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకొని పోయి సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు.
హనుమంతుని సంకల్పం: సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు.
అంగదుని వారించి జాంబవంతుడు హనుమంతునితో ఇలాగన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు కష్టం కాదు. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.
ఆంజనేయుడు పర్వకాల సముద్రంలా ఉప్పొంగిపోయాడు. దీర్ఘ దేహుడై విజృంభించాడు. అతని ముఖం ధూమం లేని అగ్నిలాగా ప్రకాశించింది. జాంబవంతునికీ, అన్య వానర ప్రముఖులకూ వందనం చేశాడు. అంగదుని ఆశీర్వదించి ఇలా అన్నాడు – మహనీయులారా! మా తండ్రికి సాటియైన నేను అవశ్యం సాగరాన్ని గోష్పదంలా లంఘిస్తాను. నా వేగానికి సాగరం అల్లకల్లోలం అవుతుంది. సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు అగుపడుతున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. లంఘనా సమయంలో నా పద ఘట్టనకును భూమి తట్టుకోలేదు. కనుక ఈ మహేంద్రగిరిపైనుండి లంఘిస్తాను – అన్నాడు.
కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలూనిన చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి. శత్రు నాశన సమర్ధుడు, అత్యంత వేగగామి అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంకాభిముఖంగా నిలుచున్నాడు.
5 సుందరకాండ
సముద్ర లంఘనం
లంకా నగర ప్రవేశం
అంతఃపురంలో సీతాన్వేషణ
అశోకవనంలో సీతమ్మ దర్శనం
త్రిజటాస్వప్నం
శ్రీరామ వర్ణన
రాక్షసులను దండించడం
రావణునితో సంవాదం
లంకా దహనం
తిరుగు లంఘనం
రామునకు సీత జాడ తెలుపుట
సముద్ర లంఘనం : హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు.
రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి, మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్ళీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చి వేసి, అప్రతిహతంమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు.
లంకా నగర ప్రవేశం: ద్వారం వద్ద లంకా నగరాధిదేవత లంకిణి అతనిని అడ్డగించింది. హనుమంతుడు ఆమెను దండించాడు. అతడు కారణజన్ముడనీ, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనుందనీ లంకిణి గ్రహించింది. ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి, ఎడమ కాలు ముందుంచి, హనుమంతుడు మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెతుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి, లంకానగరం మరింత శోభాయమానం అయింది.
అంతఃపురంలో సీతాన్వేషణ: తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.
అశోకవనంలో సీతమ్మ దర్శనం: శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె ఏకవస్త్రయై, ధూమావృతమైన అగ్ని శిఖవలె, మిధ్యాపవాదువలన భంగపడిన కీర్తివలె, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంవలె ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.
త్రిజటాస్వప్నం: సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు "వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.
ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది.
శ్రీరామ వర్ణన: సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.
అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను నాశణం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.
రాక్షసులను దండించడం: హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.
వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుజ్జునుజ్జయ్యింది.
ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడూను. అతడు తండ్రికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించ దలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు.
రావణునితో సంవాదం: హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుని మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.
రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు. అంతే కాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీను శతృవులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు. కనుక, దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆనతిచ్చాడు.
లంకా దహనం: మండుచున్నలంకను చూచుచున్న హనుమంతుడు
రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు.
ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకను భయభ్రాంతమొనర్చి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.
తిరుగు లంఘనం: మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను; ఆమె రాక్షసుల బంధీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.
ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించుట సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.
రామునకు సీత జాడ తెలుపుట: ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.
యుద్ధకాండ
యుద్ధానికి సిద్ధం విభీషణ శరణాగతి
సాగరంపై వారధి
రామ లక్ష్మణ సుగ్రీవులకు జయం
నాగపాశ విమోచన
రాక్షస వీరుల మరణం: ధూమ్రాక్షుడు, వజ్ర దంష్ట్రుడ,అకంపనుడు,ప్రహస్తుడు
రావణునికి పరాభవం, కుంభకర్ణుని మరణం
రాక్షస వీరుల మరణం
హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట
కుంభ, నికుంభుల మరణం
ఇంద్రజిత్తు మరణం
రామరావణ యుద్ధం ఆరంభం
లక్ష్మణ మూర్ఛ,
రావణ సంహారం
సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు పునరాగమనం
శ్రీరామ పట్టాభిషేకం
Excellent job
రిప్లయితొలగించండి