సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

2, నవంబర్ 2023, గురువారం

VII. 7. శిల్పి

VII.7. శిల్పి  

       గుర్రం జాషువా


పాఠం ఉద్దేశం:
 అరవై నాలుగు కలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాల్లకు జీవం పోసేవాడు శిల్పి.  శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని శిల్పి కష్టాలను తెలియజేయడమే పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తువైవిద్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యమే ఖండకావ్యం అని అంటారు.

కవి పరిచయం :
కవి పేరు గుర్రం జాషువా
జననం : 28 -09- 1895 
మరణం : 24 -07 -1971
జన్మస్థలం వినుకొండ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రచనలు: గబ్బిలం ఫిరదోసి 
ముంతాజ్ 
మహల్ 
నేతాజీ 
బాపూజీ 
క్రీస్తు చరిత్ర 
నా కథ 
స్వప్న కథ 
కొత్త లోకము ఖండకావ్యాలు
శైలి : సరళంగా, వర్ణనలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి.
బిరుదులు :కవి కోకిల 
కవితా విశారద 
కళా ప్రపూర్ణ 
పద్మభూషణ్ 
నవయుగ కవి చక్రవర్తి 
మధుర శ్రీనాథ మొదలైనవి.


ప్రవేశిక 
భారతదేశం శిల్పకలకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే!  మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్ని ఇస్తాడు శిల్పి. వేయి స్తంభాల గుడి గ్రామప దేవాలయం గుప్తుల కాలంలో ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం.

చుక్క పద్యాలు:
తే. గీ సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి 
బయలుపడే నిన్ని యెన్ని దేవ స్థలములు 
సార్థకముగాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ
భావం: మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో! ఒకనాడు వ్యర్ధంగా పడి ఉన్నా ఎన్నో బండలకు నీవల్ల
 పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది.(అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడు అని తాత్పర్యం.)

తే.గీ. కవి కలంబున గల అలంకార రచన 
కలదు కలదోయి శిల్పి నీ యులి ముఖమున; 
గాక పోయిన బెను రాతి కంబములకు గుసుమ వల్లరు లేరీతి గుచ్చినావు
భావం: కవి కలానికి ఉండే అలంకార రచన శక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో (పూలు లేత కొమ్మలను) పూల గుత్తులను ఎట్లా చెక్కగలిగావు?


తే. గీ. ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత 
వల్లె వేయింప గలవు చూపరుల చేత; 
గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు 
దారతమ్యంబు లేదబద్ధంబు కాదు.
భావం : చూసే వాళ్ళ చేత‌ నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యం లో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు. ఇది అబద్ధం కాదు.

విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం:
కవి శిల్పిని శాశ్వతుడని ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు కదా దీని మద మీ అభిప్రాయం చెప్పండి
 నీకు తెలిసిన ఇతర కలలేవి ఆయా కళాకారుల గొప్పతనం ఏమిటి

ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పద్య పాదాలు పాఠంలోని ఏఏ పద్యాల్లో ఉన్నాయి. వాటి సందర్భం ఏమిటి?
అ) బయలు పడె నెన్ని యెన్ని దేవ స్థలములు.

ఆ) తారతమ్యం లేదబద్ధంబు గాదు.

ఇ) రాళ నిద్రించు ప్రతిమల మేలుకొలుపి

ఈ) శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకో గల

2. కవికి - శిల్పికి మధ్య పోలికలు ఉన్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.


3.కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి 
పేజి నెంబర్ 69 లోని పేరా

III స్వీయ రచన 
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. శిల్పి రాళ్లలో ఏ ఏ రూపంలో చూసి ఉంటాడు? 
జవాబు: రాళ్లను చూసిన శిల్పి మనసులో అనేక ఆకృతులుగా మలుచుకుంటాడు. దేవతామూర్తులుగా దర్శిస్తాడు. అందమైన రాతి స్తంభాలపై పూల గుత్తులు చూస్తాను. దేవాలయాలను చూసి ఉంటాడు. ఏనుగులు గున్న ఏనుగు వ్యవహార శైలి చూసుకుంటాడు. అజంతా చిత్రాలను చూసి ఉంటాడు.

ఆ. నల్లని రాళ్ళకు శిల్పి మీద కృతజ్ఞత ఎందుకు ఉండాలి?
జవాబు: నల్లని రాళ్లు కొండలపైన గుట్టల పైన ఉంటే అవి అలాగే ఉండేవి. కానీ శిల్పి చేతిలో పడిన తర్వాత వాటికి దైవత్వం వచ్చింది. దేవత మూర్తులుగా మిగులుతాయి. దేవాలయాలు అయ్యాయి. అవి ఈరోజు పసుపు కుంకుమ పుష్పాలతో వివిధ రకాల పూజలు అభిషేకాలు అందుకుంటున్నాయి. కాబట్టి నల్లని రాళ్లు, శిల్పి మీద మనం కృతజ్ఞత చూపవలసి ఉంది.

ఇ.  కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, బేధాలు ఏమిటి?
జవాబు: కవి మాటలతో పదాలతో కవిత్వం రాస్తారు. చిత్రకారుడు రమణీయమైన చిత్రాలను చిత్రిస్తాడు. కవి వర్ణనలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. మనసుకు హత్తుకుంటాయి.
 చిత్రకారుడు కాగితం పైననో కాన్వాస్ మీదనో రంగులతో మరో ప్రపంచాన్ని చిత్రిస్తారు‌ దానికి పరిమితులు లేవు.

ఈ. చూసేవాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవు కవి ఎందుకన్నాడు?
జవాబు: చరిత్రను‌ అక్షరాలతో కాగితాలపై  చిత్రాల లో శిల్పాలపై చిత్రీకరిస్తారు. ఒక మహారాజు చరిత్రను శిల్పములుగా చెక్కితే ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. ఆ శిల్పాల ఆధారంగా ఆ రాజు యొక్క జీవిత సంఘటనలను మనకు చూపిస్తాయి. తెలంగాణలో కాకతీయ రాజులు, తెలుగు నెలలో కృష్ణదేవరాయలు మొదలైన వారు వారి చరిత్రను శిల్పాలుగా చెక్కించుకున్నారు. వాటిని చూడగానే చూపరులకు వారి చరిత్ర చెప్పగలుగుతాయి. కాబట్టి చూసే వాళ్లకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవు అని కవి అన్నాడు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
 తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళా గురించి సొంతమాటల్లో వివరించండి.
కలలు 64 రకాలు. అందులో మనోహరమైనవి లలిత కళలు. లలిత కళలు 5. ఇందులో శిల్పకళ ఒకటి. రాయి లోహము కర్ర మట్టి మొదలైన వాటిపై దేవత విగ్రహాలు మందిరాలను నిర్మించేదే శిల్పకళ.
తెలంగాణ నుంచి పాలించిన వంశాలలో కాకతీయ రాజవంశీయులు గొప్పవారు. నేటి వరంగల్లు లో వారు నిర్మించిన కాకతీయుల పేరుని నృత్యం వేయి స్తంభాల గుడి రామప్ప పై గల శిల్పకళ చిత్రలేఖనము సంగీతం వంటి కళలను పోషించినట్లు మనకు తెలుస్తుంది.
రామప్ప గుడి వేయి స్తంభాల గుడిలో ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. వేయి స్తంభాల గుడి నిర్మాణం ఒక ప్రత్యేకత గలది. వేయి స్తంభాల గుడిలోని స్తంభాలన్నీ నేలను తాకకుండా నిర్మించబడినాయి. నంది విగ్రహాలు కూడా అందాలు చిందిస్తూ మనకు కనబడుతుంటాయి మనం దూరం నుండి చూసినప్పుడు విగ్రహాలు ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దుల వలే దర్శనమిస్తాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం యాదగిరి నరసింహస్వామి దేవాలయం యాదాద్రిలో అద్భుతంగా శిల్పకలను ప్రదర్శిస్తుంది. 
శిల్పులు ఉలి దెబ్బల చేత రాళ్లు వివిధ భంగిమలతో అందాలను విరుద్ధమే విగ్రహాలుగా రూపుదిద్దుకున్నవి.

 లేదా 
శిల్పి గొప్పతనన్ని వివరిస్తూ సొంతమాటల్లో రాయండి.
శిల్పి గొప్పతనం తరతరాలు నివసించి ఉండడం వలన చిరంజీవిగా వెలుగొండుతాడు.
అతడు చెక్కిన సింహాలు ఏనుగులు ఎద్దులు వాటిని చూసినప్పుడు నిజమైన వాటిగా మనకు బ్రాంతి కలుగుతుంది. 
 పూర్వకాలంలో రాజుల చేత సామంతుల చేత శిల్పకళ ఆదరించబడ్డది. శిల్పులు వివిధ ఆకృతుల్లో శిల్పాలను చెక్కారు.
శిల్పకలను నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. శిల్పకలను పెంచి పోషించడానికి ప్రభుత్వమే చేయూతనివ్వాలి. పూర్వం శిల్పులు చెక్కిన శిల్పాలను రక్షించి వృద్ధిలోకి తేవాలి. శిల్పకలను అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.


IV. సృజనాత్మకత ప్రశంస: 
శిల్పి ని  ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి. ఉదాహరణకు

నేను శిల్పి ని
మహా ఘనత వహించిన శిల్పాల సృష్టికర్త ను.
బ్రహ్మ మనుషులకు ప్రాణం పోస్తే నేను శిలలకు ప్రాణం పోసి శిల్పాలు చేస్తాను.
దేవతలు మనుషులను చేస్తే నేను దేవతలని చెక్కుతాను. అవి రాళ్లయిన చెక్క బొమ్మలైనా పసుపు కుంకాలతో పూజలు అందుకుంటాయి. వివిధ అభిషేకాలతో సేవల్ని స్వీకరిస్తుంటాయి.
నిశ్చలంగా ఉన్న శిల్పంలో అనేక భావాలు పలికించగలిగే మేము ఈనాడు దారిద్రస్థితిలో ఉన్నం
ఆదరించండి
శిల్పాన్ని మొక్కే మీరు చేసిన శిల్పిని ఆదరించండి.
దైవనామస్పనల్లో తరించే మీరు
శిల్పులకు చేయూతనివ్వండి. దయచేసి వేడుకుంటున్నా ను


V. పదజాల వినియోగం
కింది వాక్యాలు మీ పాఠంలోని వీటిలో గీత గీసిన పదాలు అర్థలు తెలుసుకొని వాటితో వాక్యాలను తిరిగి రాయండి
 అ) భయద సింహంల తలలు 
భయం కలిగించే సింహంల తలలు.
ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
జ. భూమి మీద కనిపించే పర్వతములందు
ఇ) శాశ్వతుడబోయి నీవు నిశ్చయముగాను.
నిశ్చయముగా నీవు శాశ్వతుడవు.
ఈ) తెనుగుందేశం నిన్ను వంటి పనివానించు ఉప్పొంగుచుండును
జ. నీ వంటి పనిమంతుడిని చూసి తెలుగుదేశం పొంగుతుంది.
ఉ) నీ సుత్తిలో మొలుచు  న్మానవ విగ్రహములు
జ. నీ సుత్తి నుండి మనుష్య రూపాలు పుడతాయి

2. ప్రకృతి వికృతులు
అ) సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖం అని అనుకున్నది.
జ. సింహం - సింగం
ఆ)  కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాకూడదు
జవాబు: స్తంభాలు కంబాలు
ఇ) నిద్ర మనకు అవసరమే కానీ మన నిద్దుర మొహాలం కాకూడదు
జవాబు నిద్ర నిద్దుర
ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనలను నిలుపుతుంది.
జవాబు: పుణ్యం పున్నెం 

3. సూచనల ఆధారంగా పాఠ్యాంశాలు అన్ని పదాలతో గడులు నింపండి.
వల్లె
సుత్తి
దేవా
గురువు
షీలా
నమస్సులు

నేల

IV భాషను గురించి తెలుసుకుందాం.
అ) శివాలయం= శివ + ఆలయం (అ+ఆ=ఆ)
ఆ) మునీంద్రుడు= ముని + ఇంద్రుడు (ఇ+ఇ=ఈ)
ఇ) భాను ఉదయం= భాను + ఉదయం (ఉ+ఉ=ఊ)
ఈ) మాతౄణము =మాతృ + రుణము (ఋ+ఋ=ౠ)

1. కింది పదాలను విడదీయండి
హిమాలయం =హిమ + ఆలయం అ+ ఆ= ఆ
కిరీటాకృతి= కిరీట + ఆకృతి (అ+ఆ=ఆ)
మహా ఆనందం =మహా + ఆనందం (అ+ఆ=ఆ)
మహీంద్రుడు =మహి + ఇంద్రుడు (ఇ+ఇ=ఈ)
గురుపదేశం =గురు + ఉపదేశం (ఉ+ఉ=ఊ)
మాతౄణం =మాతృ + రుణం (ఋ+ఋ=ౠ)

ప్రాజెక్టు పని:
మీ గ్రామం/ప్రాంతంలోని కలలను గురించి కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ల గొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.
సిద్దిపేట ప్రాంతంలో భాతిక్ చిత్రకళ గలదు.
శారద కాండ్రు, చిందుకళాకారులు,  దాసరులు మొదలైన కళాకారులు కలరు.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విద్యా హక్కు (RTE) చట్టం, 2009 యొక్క ప్రధాన లక్షణాలు

విద్యా హక్కు ( RTE) చట్టం , 2009 యొక్క ప్రధాన లక్షణాలు భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ...