సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, డిసెంబర్ 2023, ఆదివారం

"సమానతకై నినదించే - సాక" నమస్తే తెలంగాణ


మిత్రులందరికీ జంబూ శనార్థులు 
 జై భీమ్ లు
2022 దళిత కథ వార్షిక గురించి నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురించిన సంపాదక వర్గానికి మరియు మధుకర వైద్యులు అన్నగారికి కృతజ్ఞతలు.

సాక
దళిత కథావార్షిక - 2022.

*సమానతకై నినదించే బతుకులు - 'సాక' కథలు* 

జీవితాన్ని దాచకుండా దండోరా వేసినట్టు చెప్పడంలో కథా ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. సుత్తి లేకుండా చెప్పడంలోనే కథకుడి నేర్పరితనం కనపడుతుంది. 
 సాంపే జల్లి వాకిట్లో ముగ్గు వేసినంత అందంగా కథ అల్లడంలోనే కథకుడి నైపుణ్యం (skill) తెలిసిపోతుంది. 

బతుకును, జీవితాన్ని ఏ ప్రమాణాలు కొలుస్తాయి? వస్తువు శిల్పము శైలి ప్రమాణాల కందని జీవితం ఉంటుంది. ఇది దళిత కథ. ఇందులో అలంకారాలు, విచిత్ర విన్యాసాలు పదప్రయోగాలు ఉండవు. బతుకును చిత్రించిన బాధలే ఉంటాయి. జీవితాన్ని మించిన కథ ఇంకేం ఉంటుంది? ఈ వార్షికలోని దళిత కథలు బతుకునే చిత్రించాయి. బాధలను ప్రతిబింబించాయి. 

 'జంబూ సాహితీ' నుండి వెలువడుతున్న వార్షికలలో 'సాక' ముచ్చటగా మూడవది.
'సాక'కు అర్పించడం, అర్పణం, తర్పణం, ధారపోయడం లాంటి అర్థాలున్నాయి.

ప్రతి సంవత్సరం దళిత కథను రికార్డు చేయడం, వాటిలోని మేలైన కథలను ఒక దగ్గరికి చేర్చడం జంబు సాహితీ ప్రతి సంవత్సరం చేస్తున్న ఆనవాయితీ.
ఈ కథలు పత్లా కథలు కావు. గుండె లోతుల్లోని తేమను ఉసిలించే కథలు. నిద్రాణమై ఉన్న మనిషిని చర్రున సరుపు సరిచి లేపే చైతన్య పూరితమైన కథలు. ఇందులో భిన్నమైన కథా వస్తువులు ఉన్నాయి.

ఇప్పుడు కథల గురించి కొత్తగా మాట్లాడుకోవాలి. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే రచయిత జీవితాన్ని అర్థం చేసుకోవాలి - సెయింట్ బోవే (1804 - 1869) చెప్పినట్లు దళిత కథ అర్థం చేసుకోవాలంటే దళితులు అనేక వేదనల మధ్య, జీవితాలను కోల్పోయిన దుస్థితుల మధ్య నలుగుతున్న స్థితిని కొత్తగా సరికొత్తగా మాట్లాడుకోవాలి.

నిజానికి దళితులకు తమకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసినా, వస్తువు 'ఎంపిక' సమస్య ఒకటి ఎప్పుడూ ఉండనే ఉంది. ఎన్నో బాధలు. ఏ బాధలు ముందుగా అక్షరీకరించాలో కొద్దిగా సందిగ్ధత ఉంటుంది. అయినప్పటికీ అన్ని బాధలు కథలు కాలేవు. అందరూ బలంగా మాటల్లో రాజ్యాధికార కాంక్షను 'వ్యక్తం' చేస్తున్నారు కానీ ఉన్నత వర్గాల వారి 'మనీ క్రీడను' తట్టుకోలేకపోతున్నారు. అంతర్గతంగా కుల ప్రస్తావనలు ఎలా తికమక పెడుతున్నాయో? జీవితాంతం ఎలా బాధిస్తున్నాయో? ఎలా భయపెడుతున్నాయో అనుబంధాలను తెంచేయటాన్ని దళిత కథలు నిప్పుల తప్పటై మోగుతున్నాయి

 తండ్రీ కూతురు ఒక్కటై తల్లిని వేధించడానికి ఏది కారణమై ఉంటుందో తల్లి జీవితాన్ని వెంటాడుతున్న సమస్య ఏంటో తెలుసుకోవాలంటే సతీష్ చందర్ 'యువరానర్' కథ చదివితే జీవితమంతా బాధించిన విషయం అవగతమవుతుంది.

కుల వివక్ష ప్రతినిధి అయి పీడించిన వ్యక్తిని అంతిమ సంస్కారంలో అయిన వాళ్లు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు రాలేదు. మహోన్నత మనసుతో పురుగులు పడ్డ శవాన్ని దళితులు ఎలా మోసారో తెలియజేసే జూపాక సుభద్ర కథ "అప్పు పడ్డది సుమీ"చదవాల్సిందే.
 

కులం గొప్పదైతే గొప్ప కాదు. గుణం గొప్పగా ఉండాలని, ఆ గొప్ప గుణం దళితులకు ఉన్నదని ఎలా రూపుకం చేసిందో జిలకర శ్రీనివాసు రాసిన 'బురద గుంట' కథ అధ్యయనం చేస్తే గాని అర్థం కాదు.

బతుకు పోరులో ఓడి గెలిచిన సైనికుల గొప్పతనం,
బతుకంతా సాము చేసి నిలిచి గెలిచిన సుందరమ్మ స్ఫూర్తి ఏమిటో అర్థం కావాలంటే చల్లపల్లి స్వరూపారాణి రాసిన "సాము"కథ అవాహన చేసుకోవాల్సిందే. 

దళితులు పెను వేసుకున్న క్రైస్తవ్యం, పోరాటం నేర్పిన కమ్యూనిజం, అస్తిత్త్వమే అంతిమ కలికితురాయని ప్రకటించిన అంబేద్కరిజం, వీటి మధ్యలో డోలాయమానమైన స్థితి నుంచి ఒక నిశ్చిత ఆలోచన తెలియాలంటే పసునూరు రవీందర్ కథ
 'ఒక నేల మూడు ముఖాలు' త్రికర్ణ శుద్ధిగా పఠించాల్సిందే.

జీవితాన్ని ఎలా జీవించవచ్చో నేర్పుతుంది మంచి దళిత కథ. తెలుగు కథ ఇంకా అంటరానితనం దాటి లేకపోయినా అపవాదు ఒకటి ఉండడానికి కారణం కులమే.
 'ముక్కు ఉన్నంతసేపు పడిశం ఉంటుంది' అన్నట్లుగా సనాతన ధర్మం ఉన్నంత వరకు రోజులు దళితులకు వివక్ష అంటరాని తప్పేటట్లు లేదు. ఈ విషయాన్ని చాలా కథలు తెలియజేస్తున్నాయి.

స్వీయ అస్తిత్వ పరిరక్షణకై వైరుధ్యాల తగ్గింపుకై కృషి జరగాలి.
మనుషులు ఎందుకు ఇంకా మారడం లేదు, ముఖ్యంగా చదువుకున్న మనిషి ఎందుకు ఇంతలా కుల చట్రంలో కుచించుకుపోతున్నాడు? అనే ప్రశ్నలకు ఈ కథలు కొంత సమాధానాన్ని ఇవ్వగలవు.

లోపలి బాధను తోడిపోసిన కథ చరణ్ పరిమి రాసిన కథ 'అతిథితో అక్కడిదాకా!. గుండెను పిండేసే కథ ఇది. హవింగ్ లైఫ్, హవ్ నాట్ లైఫ్ కు మధ్య ఏదో కనెక్షన్ తెగిపోయినట్టు ఈ కథ మనకు తెలిపుతుంది .

క్రైస్తవం హైందవికరించబడిందా? హిందువులు క్రైస్తవికరించ బడుతున్నారా? అనే మీమాంసను క్లియర్ జేసే వాస్తవిక కథ మెర్సీ మార్గరేట్ రాసిన కథ 'వర్షం సాక్షిగా'.... తెలియాల్సిందే...

 ఒకే ఊరి నుండి అగ్రకుల పటేలు రామారావు, మాదిగ కులానికి చెందిన రాములు ఇద్దరు పట్నం వలస వచ్చి, పట్నం వచ్చినాక కూడా కులవివక్షను, ఆధిపత్యాన్ని వదులుకోలేని తనాన్ని పటేల్ యొక్క అహంకారాన్ని పట్టించే కథ తాళ్లపల్లి యాకమ్మ రాసిన 'వెన్నెల గొడుగు' కథ. అదేవిధంగా అగ్రకులాలకు దళితులు ఆయుధాలు ఎలా బలైపోతున్నారో తెలియజేసే కథ కెంగార మోహన్ రాసిన 'సమిధలు' కథ.

చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత, చాలామంది దళితులు తమ మూలాలను మరిచిపోతున్నారు.సోఫిస్టికేటెడ్ లైఫ్ కు అలవాటు పడిన తర్వాత తాను నడిసొచ్చిన, ప్రయాణాన్ని, మార్గాన్ని తామే అవమానిస్తుంటారు కొందరు దళితులు . "ఎంత దూరం వెళ్లినా మేము మాకులాగానే ఉంటాం" అంటూ మూలాలను తెలియజేసే కథ అనిల్ డానీ గారి వీకెండ్ కథ.

గర్భిణీ స్త్రీ చనిపోతే బొందల గడ్డలో పూడ్చిపెట్టనీ య్యకుండా అవమానించి, అడ్డుకొని,కడాకు బొందల గడ్డలో కూడా స్త్రీ వివక్ష ఎదుర్కొంటున్నదని తెలియజేసే కథ డి.జి హైమావతి రాసినటువంటి బొందల గడ్డకు దూరంగా అనే కథ.

ఇవే కాకుండా రత్నాకర్ పెనుమాక, సొలోమోన్ విజయ్ కుమార్, సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్ రాసినటువంటి కథలు కూడా ఆలోచింపజేస్తున్నాయి.

అసూయ అనేది దోపిడి కులాలు, దోపిడీకి గురయ్యే కులాల్లోనే కాదు. కింది కులాల్లో కూడా అంతర్గతంగా ఉంది. ఆ అసూయ పెరిగిపోతుంది.ఇది తగ్గించాలి అంటే ఇంకా ఉత్తమ కథలు రావాలి.

ఆధిపత్య వర్గాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. అంబేద్కర్ మార్గాన్ని ఆచరించాలి అని ఈ కథల్లో అంతర్గతంగా ఒక ఆలోచన ఇండికేట్ ఉన్నది.

ఈ కథల్లో సాంస్కృతిక వ్యత్యాసం, కులమతాల ఆర్థిక వ్యత్యాసం, ఆధిపత్యాలు మొదలగు వస్తువులతో కథలు నడిచాయి.దళిత జీవితం అధునాతనమైన వ్యవస్థలోకి చేరికోవాలని కోరుతున్నాయి ఈ కథలు. జీవితానికి సంబంధించిన సున్నితమైన సమస్యలను సెన్సిటివ్గా వ్యక్తీకరించిన కథలుఇవి.

 జంబు సాహితీ ప్రచురించిన రెండు కథా వార్షికలను ఆదరించినట్టుగానే ఈ మూడవ 2022వ కథా వార్షికను కూడా ఆదరించి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా సాహితీ
పాఠకులను కోరుతున్నాము. కథలను ఎంపిక చేయడంలో మాకు కష్టమైనప్పటికిని ఇష్టంగా చేస్తున్న పనిగా భావిస్తూ అందరికీ జై భీమ్.

                  ఇట్లు
       జంబూ సాహితి
         సంపాదకులు
      డా. సిద్దెంకి యాదగిరి
      గుడిపల్లి నిరంజన్
       తప్పెట ఓదయ్య

6, డిసెంబర్ 2023, బుధవారం

FLN/UNNATHI/LAKSYA App ఉన్నతి ఆప్

🔖అతి ముఖ్యమైన సూచన🔖
📌జిల్లాలోని సమస్త యాజమాన్యాల మరియు అన్ని కేటగిరీల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు
📌FLN, Unnathi మరియు Lakshya కు సంబంధించి సమస్త ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు క్రింద పేర్కొనబడిన లింకు ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

కింది లింకు నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.aponline.fln

 👉అందులో ప్రతినెల, ప్రతి టీచర్ మరియు ప్రధానోపాధ్యాయులు సెల్ఫ్ అప్రైజర్ ని సబ్మిట్ చేయాలి 
👉అదేవిధంగా ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని ఉపాధ్యాయుల తరగతి బోధనను ప్రత్యక్షంగా పరిశీలించి తమ తమ పరిశీలనను యాప్ లో అప్లోడ్ చేయాలి
👉 ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఉన్నతికి సంబంధించి బేస్ లైన్ టెస్ట్ అదేవిధంగా మాసవారి పరీక్షల లో విద్యార్థుల ప్రగతిని యాప్ లో సబ్మిట్ చేయాలి.
👉 ఈనెల 8 లోగా అంటే శుక్రవారం లోగా ప్రతి ప్రధానోపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయుడు బేస్ లైన్ మరియు మాసవారి ప్రగతిని అప్లోడ్ చేస్తూ సెల్ఫ్ అప్రైజర్ ని సబ్మిట్ చేయాలి.

🌀 యాప్ లోకి లాగిన్ కావడానికి లాగిన్ క్రెడిన్షియల్స్ క్రింది విధంగా ఉన్నాయి
1) అందరూ హైస్కూల్/ మోడల్ స్కూల్ మరియు కేజీబీవీల ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపల్ మరియు స్పెషల్ ఆఫీసర్స్ కి

Username: same as isms portal user name
Password: same as isms portal
2) టీచర్స్ కి లాగిన్ క్రెడియన్షియల్స్
Username: emp ID
Password: OTP in their mobile
3) DEOs/MEOs/CHMs కి లాగిన్ క్రెడియన్షియల్స్
Username: same as isms portal
Password: same as isms portal
4) AMO/MNOs కి
Username: as given by tsonline
Password: as given by tsonline

📌 ఇది కాకుండా ప్రతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రతి మండల్ నోడల్ ఆఫీసర్ , ప్రతి మండల విద్యాధికారి విధిగా తమ తమ పరిధిలోని అన్ని పాఠశాలలను కచ్చితంగా సందర్శించి ఎఫ్ ఎల్ ఎన్, ఉన్నతి మరియు లక్ష్య కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి వారి పరిశీలనలను అబ్జర్వేషన్ షీట్లో యాప్ లో అప్లోడ్ చేయాలి.

📌అదేవిధంగా ప్రతినెల రివ్యూ మీటింగ్లను జరిపి ఆ రివ్యూ వివరాలను ఆన్లైన్లో యాప్ లో పొందుపరిచాలి .
ఇది అత్యవసరంగా ప్రతి స్థాయిలో, ప్రతి మానిటరింగ్ ఆఫీసర్ విధిగా చేయాలి.

🌀ఎఫ్ ఎల్ ఎన్ కి సంబంధించి ఆరు నాన్ నెగోషియబుల్స్ అలాగే ఉన్నతికి సంబంధించి ఎనిమిది నాన్ నెగోషియబుల్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. ఈ విషయాలలో ఎలాంటి పర్యవేక్షణ రాహిత్యం మరియు ఏమరపాటు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు.

✳️ FLN/Unnathi అకాడమిక్ బబుల్ 11 డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుంది
// స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మరియు డైరెక్టేటర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆజ్ఞానుసారము//
- జిల్లా విద్యాధికారి, సిద్దిపేట

4, డిసెంబర్ 2023, సోమవారం

VIII.9. అమరులు

VIII. 9. అమరులు 
                                - ఆచార్య కె. రుక్నుద్దిన్
బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి: ( Page No.89)
ప్రశ్నలు:
1.బొమ్మలో ఏం జరుగుతున్నది?
జవాబు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతున్నది.
2.స్తూపాలను ఎందుకు కట్టిస్తారు ?
జవాబు.ఏదైనా ఉద్యమంలో పాల్గొని, అమరులైన వారిని, లేక వారిని కాపాడటంలో ప్రాణాలను అర్పించిన వీరజవానులను స్మరించుకోవడం కోసం స్థూపాలను నిర్మిస్తారు.
3.స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?
జవాబు.వీరోచితంగా పోరాడి అమరులైన వారిని స్మరించుకోవడానికి గుర్తుగా ఘనంగా నివాళులు అర్పిస్తారు.
4.అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?
జవాబు. ఏ ఆశయసాధన కోసం పోరాడి అమరులు అయ్యారో, వారి ఆశయాలను, ఆకాంక్షలను తీరుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ పిడికిలి బిగించి చేతిని పైకెత్తి నివాళులు అర్పిస్తారు.

పాఠం నేపథ్యం, ఉద్దేశం:
ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు.
(1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.) తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ – గేయం:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో గేయ కవిత ఒకటి. ఇది రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మాత్రా ఛందస్సు ఎక్కువగా వాడతారు. ఒక పల్లవి, కొన్ని చరణాలు ఉంటాయి. కొన్ని గేయాల్లో శబ్దాలంకారాల ప్రయోగం ఎక్కువగా ఉంటుంది.

పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య కె. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.

కవి పరిచయం:
కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2.5.1947 – 26.5.2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.

ప్రవేశిక:
వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో
తెలుసుకుందాం.


పాఠ్యభాగ సారాంశం:
తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా ! మీకు జోహార్లు. వీరులారా ! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు. శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది.
మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా ! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

ఆలోచించండి – చెప్పండి. ( Page No.91)
 1.‘మాకై అసువులు బాసిన’ అనటంలో మాకు అంటే -ఎవరు?.
జవాబు.‘మాకై అసువులు బాసిన’ అనడంలో ‘మాకు’ అంటే తెలంగాణ ప్రజలమైన మాకు’ అని అర్థం. తెలంగాణ రాష్ట్రసిద్ధికై ప్రాణత్యాగం చేశారని కవి ఉద్దేశం.
2.‘జోహారులు’ అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం? ఎందుకు సమర్పించాలి ?
జవాబు.‘జోహారులు’ అంటే నివాళులు అని అర్థం. సామాజిక సేవలోను, ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను తీర్చే విషయంలో ప్రాణాలను అర్పించిన మహనీయులకు ఆత్మశాంతి కలగాలని మనమంతా ఘనంగా నివాళు లను అర్పిస్తాము.

ఆలోచించండి – చెప్పండి: (Page No.92)
1.“కడుపు పంటల – కడుపు మంటల్” దీనిని గురించి మీకేమి అర్థమయింది ?
జవాబు.“కడుపు పంటలు” అంటే కన్నతల్లికి సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడం. కడుపులో పుట్టినందుకు మంచి ఆనందాన్ని కల్గించడం. ‘కడుపు మంటలు’ అంటే కడుపులో బాధ. అనగా పుత్రశోకంతో తల్లికి మాటలతో చెప్పనలవికాని దుఃఖం కలుగుతుంది. దీనినే కడుపు మంటలు అని అంటారు.
2.“పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?
జవాబు. సజ్జనులు పరిపాలకులు అయినప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వారు ప్రాంతీయ అసమానతలు చూపరు. కాని పాపాత్ములు పరిపాలించినట్లైతే విద్వేషాలు కలుగుతాయి. సామరస్య భావం లోపిస్తుంది. అరాచకం పెరుగుతుంది. అందుకే ఆంధ్రుల పాలనను పరోక్షంగా ‘పాపాత్ముల పాలన’ అని కవి చెప్పాడు.

ఇవి చేయండి :
I. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
1.తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.
జవాబు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణపై పెత్తనం చెలాయించాలని కొందరు ప్రయత్నించారు. ఉద్యమాల సందర్భంగా ఎందరో అమరులైనారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

నిజాం నవాబును వ్యతిరేకించింది తెలంగాణ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరువాత తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి దూరం అయింది. ఎన్నో అవమానాలను తెలంగాణ ప్రజలు అనుభవించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది యువకులు బలిదానం చేశారు.

ముఖ్యంగా గత పదమూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రోద్యమము మహోగ్రంగా సాగింది. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి విద్యావంతులు, గద్దర్ వంటి ప్రజాగాయకులు, చంద్రశేఖర్రావు వంటి ధీరనాయకులు ప్రముఖపాత్ర పోషించారు. చంద్రశేఖర్రావుగారు ప్రత్యేక పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఆయన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్ర ప్రభుత్వం కదిలింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు పోరాటం చేశారు. సకలజనుల సమ్మె తెలంగాణ పోరాటంలో ప్రముఖపాత్రగా చెప్పవచ్చు. ఈ ప్రయత్నాల మూలంగా 2.06.2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలంతా సహకరించాలి. అమరవీరుల త్యాగాలను మనం మరచిపోకుండా ఉండాలి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నయో గుర్తించి, వాటి సందర్భం రాయండి.
అ) సకలజనుల సమూహములు.
జవాబు. ఈ వాక్యం గేయంలో మొదటి భాగంలోని మూడవ చరణంలోని మూడవ పాదంలో ఉంది. తెలంగాణ రాష్ట్రసాధన కోసం అమరులైన వారికి సకలజనావళి నివాళులు అర్పించే సందర్భంలోనిది.
ఆ) క్రాంతి విడదు శాంత పడదు.
జవాబు. ఈ వాక్యం గేయంలోని రెండవ భాగంలోని రెండవ చరణంలో చివరి వాక్యంగా ఉంది. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఎంతో మంది తమ రక్తాన్ని ధారపోశారు. వారి రక్తం పాపాత్ముల పరిపాలన పటాపంచలౌ పర్యంతం శాంతింపదని తెలియజేయు సందర్భంలోనిది.
ఇ) రుధిరసిక్త యమపాశం.
జవాబు. ఈ వాక్యం గేయంలోని రెండవ భాగంలోని నాలుగవ చరణంలో చివరి వాక్యంగా ఉంది. అమరవీరులు పెట్టిన రక్తపుతిలకం అధికారమదాంధుల పాలిట యమపాశమని కవి హెచ్చరించుచున్న సందర్భంలోనిది.
ఈ) అమృతవర్షం కురిపిస్తాం.
జవాబు.ఈ వాక్యం గేయంలోని మూడవ భాగంలోని మూడవ చరణంలోని చివరి వాక్యంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం నిలుస్తామని, అమృతవీరుల ఆత్మలలో అమృతవర్షం కురిపిస్తామని కవి తెలియజేయు సందర్భంలోనిది.
2. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకలజనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో,బలిదానాలు చేయవద్దని చెప్పింది. ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.
ప్రశ్నలు :
అ) తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?
జవాబు. ఆంధ్రపాలకుల కబంధ హస్తాలనుండి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులను పెంపొందించుకోవడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది.

ఆ) ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?
జవాబు. విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకలజనులు పాల్గొన్నారు.

ఇ) ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?
జవాబు. ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని.

ఈ) ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?
జవాబు.ఆబాలగోపాలం అంటే జనులు అందరు అని అర్థం.

ఉ) అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?
జవాబు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటానికి మనమంతా కృషిచేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.


III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా !” అని ఎందుకు సంబోధించాడు ?
జవాబు. తెలంగాణ ప్రజల్లో ఆవేశం, ఆక్రోశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ ప్రజలు అణచివేతలను, అవమానాలను సహించరు. అరాచక శక్తులపైన, అధికారమదాంధులపైన రుద్రులౌతారు. తెలంగాణ ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రాణాలను లెక్కచేయరు. అమరులై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. అందుకే కవి అమరులను ప్రశంసిస్తూ “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా !” అని చెప్పాడు.

ఆ) అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?
జవాబు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కవులు, కళాకారులు, ఉద్యోగులు, ప్రజలందరు సంఘటితంగా ముందుకు నడిచారు. ఉద్యమం శాంతియుతంగానే నడిచింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, రాష్ట్రం త్వరగా ఏర్పడాలనే కోరికతో ఎందరో అమరులు అయ్యారు. వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.
అమరవీరుల కుటుంబాలను ప్రజలు ఆదుకోవాలి. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళు కట్టించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలి. ఈ రకంగా ప్రభుత్వము, ప్రజలు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. అప్పుడే మనం తగిన విధంగా వారిని గౌరవించినట్లు అవుతుంది.

ఇ) అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?
జవాబు. అధికారం అనేది ప్రజలకు సేవలందించేందుకు వినియోగించాలి. కాని కొందరు అధికారమదంతో ప్రవర్తిస్తారు. ప్రజలను హీనంగా చూస్తారు. మానవహక్కులను హరిస్తారు. ప్రాంతీయ అసమానతలను ప్రదర్శిస్తారు. విచక్షణను కోల్పోయి అహంకారంతో ప్రవర్తిస్తారు.
గ్రామీణ ప్రాంతాల వారిని హీనంగా చూస్తారు. సాధారణ ప్రజలకు విద్యావకాశాలను కల్పించరు. తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తారు. అవినీతిని ప్రోత్సహించి ప్రజాధనాన్ని కొల్లగొడతారు. అధికార మదాంధుల ప్రవర్తన సమాజానికి హాని కల్గిస్తుంది.
ఈ) కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?
జవాబు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎందరో యువకులు, సాధారణ ప్రజలు బలిదానం చేశారు. వారి త్యాగాలు మరువలేనివి. వారి త్యాగాల మూలంగానే రాష్ట్రం సాకారమైంది.
కవి ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలని స్మరించాడు. వారి త్యాగాల నుండి రాష్ట్ర ప్రజలు స్పూర్తిని పొందాలని ఆశించారు. వారి రక్తతర్పణం అధికారమదాంధులపాలిటి యమపాశం కావాలని ఆవేశంగా ప్రకటించారు. వారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సాధిస్తామని, వారి ఆత్మలు శాంతించే విధంగా అమృత వర్షం కురిపిస్తామని ప్రతిజ్ఞ చేయడంవల్ల కవిలోని ఆవేశం తీవ్రస్థాయిలో ఉందని అర్థం చేసుకున్నాను.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.
జవాబు. భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం మహోన్నతమైందిగా పేర్కొనవచ్చు. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతో కాలం నుండి ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలచింది. తెలంగాణ రాష్ట్రసాధనలో అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణపై జరిగిన ఉద్యమాలు శాంతియుతంగా జరగడం దేశమంతటిని ఆకర్షించింది.
సాయుధ తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులైనారు. అయినా అప్పటి కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని ప్రదర్శించింది. తన దమననీతిని ప్రదర్శించింది. తెలంగాణ ప్రాంతాన్ని అవమానించింది. మలిదశ ఉద్యమంలో ఎందరో పాల్గొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, నాయకులు, వ్యాపారులు ఒక్కతాటిపైకి వచ్చారు. సకలజనుల సమ్మెను సమర్థవంతంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందరో విద్యార్థులు ఉద్యమంలో భాగంగా అమరులైనారు.
శ్రీకాంతాచారి లాంటి వారి ఆత్మబలిదానం ఎందరికో స్ఫూర్తిని అందించింది. మరెందరో పోలీసుల తుపాకీగుండ్లకు బలై అమరులైనారు. వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సిద్ధించింది. అమరవీరుల త్యాగాలను మనం విస్మరింపకూడదు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారు కోరుకున్న బంగారు తెలంగాణను సాధించాలి. అంతవరకు ప్రజలు విశ్రమించకుండా కృషిచేయాలి.

IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత / గేయం రాయండి.
జవాబు.
కవితలు :
1. “మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”
2. “తెలంగాణ ప్రజలు సల్పు / తెలంగాణ ఉద్యమాన్ని
రౌడీ అలజడి అంటూ బాకాలూదెడి ఆంధ్రుల
దెంతపాటి సభ్యతంట | తెలంగాణ “యాస” నెపుడు
యీసడించు భాషీయుల / సుహృద్భావన ఎంతని”
గేయం :
జయహో అమరులారా !
జయజయ జయహో త్యాగనిరతులారా !
మరువదు మీ త్యాగం ఈ జగతి
చిరంజీవులుగా ఉన్నారండి గుండెల్లో.

త్యాగానికి మారుపేరుగా
పౌరుషానికి ప్రతీకలుగా
ఉరకలు వేశారు, పరుగులు తీశారు,
పరాయి పాలనకు చరమగీతం పలికారు. ||జయహో||

ఓ అన్నలారా ! ఓ అమ్మలారా !
మాన్యులారా ! మహనీయులారా !
తెలంగాణ వీర పురుషులారా !
ఆత్మగౌరవాన్ని నిలిపిన ధీరులారా ! ||జయహో||

అవమానాలు ! తిరస్కారాలు
ఛీత్కారాలు, దోపిడీలు
సాగవు ఇకపై ముందుకు
నవ తెలంగాణ సాధకులారా ||జయహో||


V. పదజాల వినియోగం:

1. కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి.
అ) సమూహం = గుంపు, బృందం, సముదాయం
ఆ) అసువులు = ప్రాణాలు, ఉసురులు, ఊపిరులు
ఇ) స్వేచ్ఛ =స్వాతంత్య్రం, స్వతంత్రత
ఈ) సఖులు = స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు గల నానార్థాలు వేరు వేరు అర్థాలు) రాయండి.
అ) ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది.
జవాబు. సంవత్సరం, వాన
ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.
జవాబు. పాలు, నీరు
3.కింది వృత్తంలోగల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి
జవాబు.
ప్రకృతి – వికృతి
1. భాగ్యం – బాగ్గెం
2. ఆకాశం – ఆకసం
3. శ్రీ – సిరి
4. ప్రతిజ్ఞ – ప్రతిన

VI. భాషను గురించి తెలుసుకుందాం:
సంధులు:
1. కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి.
అ) ఉద్రేకాస్త్రం =ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘ సంధి
ఆ)మొట్టమొదలు=మొదట + మొదలు = ఆమ్రేడిత సంధి
ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం = సవర్ణదీర్ఘ సంధి
ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

ఉపమాలంకారం :
కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి.
ఆమె ముఖం అందంగా ఉన్నది.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.
పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా ! ఇట్లా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇట్లా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్నిబట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి :

ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒక విధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”
2. కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి.

అ) ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.
జవాబు.
ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. ‘గురితప్పకుండడం’ అనేది సమానధర్మం’.

ఆ) తోటలో పిల్లలు సీతాకోకచిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
జవాబు.
పిల్లల్ని సీతాకోకచిలుకలతో పోల్చారు. “అటూ ఇటూ తిరగడం” అనేది సమానధర్మం

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
1. తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.

I. ప్రాథమిక వివరాలు
ప్రాజెక్టు పేరు     :
ప్రాజెక్టు సంఖ్య  :

II. సమాచార సేకరణ విధం: 
ఇంటర్వ్యూ ద్వారా /
అభ్యసనం ద్వారా / క్షేత్ర పర్యటన ద్వారా          : 
ప్రాజెక్టులో పాల్గొన్న వారి పేరు/  విద్యార్థి పేరు   : 
తరగతి           :
క్రమసంఖ్య      :

III. చదివిన అంశం / సంక్షిప్త వివరణ:

జవాబు.ఉద్యమాగ్ని చల్లారిన విశ్రమించలేదు.
వివక్షను నిలదీయుట విస్మరించలేదు
తోడు ఎవరు లేకున్నా తొవ్వ తీసినాడు.
ఆంధ్రవలస పాపాలను రాసిపెట్టినాడు
విద్రోహం మూలాలు విప్పి చెప్పె దీక్ష
విడువని జయశంకరెపుడు తెలంగాణ రక్ష ||తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ॥

తెలంగాణ వాదాన్ని తీర్చి దిద్దినావు
మారుతున్న తరానికి మార్గం చూపావు
అరువదేండ్ల తెలంగాణ మనాదివే నీవు
మలిదశ పోరాటానికి పునాదివే నీవు
భావాలను వెదజల్లిన వెల్లువ వైనావు
తెలంగాణ పాటలకు పల్లవి వైనావు
ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు ||తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ||
వివరణ: జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ వాదాన్ని బలాన్ని ఎప్పుడు వినిపిస్తుండేవాడు. తెలంగాణలో మారుతున్న కాలాన్ని మార్గదర్శనం చేసినాడు. తోడు ఎవ్వరు లేకున్నా ఒంటరిగానైనా తెలంగాణ సిద్ధాంతాన్ని మోసుకెళ్లాడు. తెలంగాణ వాదాన్ని 60 ఏళ్లుగా కొనసాగించాడు. చెక్కుచెదరని చెరువు తీరు ధైర్యం ఇచ్చారు. జయశంకర్ సార్ మీరు చాలా గొప్పవారు.
నేర్చుకున్న అంశాలు: జయశంకర్ సార్ పాట నేర్చుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారికి కీలక భూమిక నేను తెలుసుకున్నాను. ఎవరైనా సరే ఒక అంశాన్ని చేపడితే సాధించే వరకు విశ్రమించకూడదని విషయాన్ని గ్రహించాను. 
III. ప్రదర్శన

3, డిసెంబర్ 2023, ఆదివారం

VIII. 5. శతక సుధ

పాఠం ఉద్దేశం:

శతకపద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

ప్రక్రియ శతకం:

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ ఒకటి. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. ‘కొన్ని శతకాల్లో నూరుకుపైగా పద్యాలు ఉంటాయి ‘మకుటం’ ప్రధానంగా ఉంటుంది. కొన్ని శతకాల్లో మకుటం లేకుండా కూడా పద్యాలు ఉంటాయి. పద్యాన్నీ స్వయం ప్రతి పత్తిని కల్గి ఉంటాయి. నీతి, ధర్మం, సత్యం, అహింస, దేశభక్తి మొదలైన విషయాలను శతక పద్యాలు బోధిస్తాయి.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గి ఉంటుంది.

ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.



కవి పరిచయాలు:

1. కవి పేరు : బమ్మెర పోతన
రచించిన శతకం : నారాయణ శతకం
కాలము : 15వ శతాబ్దం
జన్మస్థలం : వరంగల్లు జిల్లా బమ్మెర వాసి
బిరుదు : సహజ పండితుడు
ఇతర రచనలు : ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం.
శైలి : మధురమైన శైలి. శబ్దాలంకార ప్రియత్వం.

2. కవి పేరు : శ్రీపతి భాస్కర కవి
రచించిన శతకం : చిత్త శతకం
కాలము : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఇతడు చాళుక్య యుగంలో వీరశైవమతాన్ని ఆచరించి, ప్రచారం చేసిన శ్రీపతి పండితుడి వంశీయుడని పరిశోధకుల భావన.

3. కవి పేరు : మారద వెంకయ్య
రచించిన శతకం : భాస్కర శతకం
కాలము : 17వ శతాబ్దం
విశేషాంశాలు : మారవి (మారద వెంకయ్య) ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

4. కవి పేరు : కంచర్ల గోపన్న
రచించిన శతకం: దాశరథి శతకం
కాలము : 17వ శతాబ్దం
జన్మస్థలం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
ఇతర రచనలు : భద్రాచలం రామునిపై చక్కని కీర్తనలు రచించాడు.
విశేషాంశాలు : గోపన్న ‘రామదాసు’ గా కీర్తి పొందాడు ‘దాశరథీ కరుణాపయోనిధీ !’ అనే మకుటంతో పద్యాలు రాశాడు.


5. కవి పేరు : కాకుత్థ్సం శేషప్పకవి
రచించిన శతకం : నరసింహ శతకం
కాలము : 18వ శతాబ్దం
జన్మస్థలం : జగిత్యాల జిల్లా ధర్మపురి
ఇతర రచనలు : నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీ రామాయణం మొదలైనవి
విశేషాంశాలు : “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు.

6. కవి పేరు : పండిత రామసింహకవి
రచించిన శతకం : విశ్వకర్మ శతకం
కాలము : 1855 – 1963
జన్మస్థలం : జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం.
ఇతర రచనలు : దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.
విశేషాంశాలు : ఈయన ఆశుకవిగా కీర్తి పొందాడు. ‘విశ్వపాలన ధర్మ ! శ్రీ విశ్వకర్మ !’ అనే మకుటంతో శతకాన్ని రచించాడు.

7. కవి పేరు : మరింగంటి పురుషోత్తమాచార్యులు
రచించిన శతకం : శ్రీ వేంకటేశ్వర శతకం
కాలము : 11.4. 1936 – 9.1.2011
జన్మస్థలం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం
ఇతర రచనలు : గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలైనవి.
విశేషాంశాలు : విద్వత్ కవి. ఈయన ‘వేంకటేశ్వరా !’ అనే మకుటంతో పద్యాలు రచించాడు.

8. కవి పేరు : వేంకటరావు పంతులు
రచించిన శతకం : శ్రీ బాకవరాంజనేయ శతకం
కాలము : 03.02.1937 – 26.08.1994
జన్మస్థలం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి
ఇతర రచనలు : యక్షగానాలు, కీర్తనలు, గేయాలు
విశేషాంశాలు : తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ ! ఖలభంజన ! సాధుజనానురంజనా !” అనే మకుటంతో పద్యాలను రాశాడు.


ప్రవేశిక:

విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాల నుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.


I

ఉ. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ 
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ 
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ 
స మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా!1

నారాయణ శతకం - బమ్మెరపోతన
1. లక్ష్మీదేవి భర్తయైన ఓ నారాయణుడా! ప్రియవచనం, దయ, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ, సర్వప్రాణుల మేలు కోరేవాడిగా మీ సన్నిధిలో నీ కిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి (ఇవ్వుమని అర్థం).


ఉ. బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం 
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
 ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
 వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా! 2
చిత్తశతకం - శ్రీపతి భాస్కరకవి
2. ఓ మనసా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోను వాదనకు దిగకు. హద్దుమీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.

******"*******************
ఆలోచించండి- చెప్పండి.

* కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి?

* 'వివేకధనం'గా కవి వేటిని పేర్కొన్నాడు?
***********************

II

'

చ. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా  
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం 
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
 పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా! 3.
భాస్కర శతకం - మారద వెంకయ్య
3. భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!

ఉ. పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర  
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా 
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
 త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ! 4

దాశరథి శతకం - కంచర్ల గోపన్న
 ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!

4. దయా సముద్రడవైన రామా! నీవు పెంపకంలో తల్లివి. చెడుదారిన నడువకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ (జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ) రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు
5. పోసీ. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. 
లక్షాధికారైన లవణమన్నమె కాని  
   మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు 
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని, 
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు 
పొందుగా మఱుగైన భూమిలోపలపెట్టి దానధర్మము లేక దాచి దాచి

ਭੰ. తుదకు దొంగల కిత్తురో? దొరలకవునొ? తేనె జుంటీగలియ్యవా తెరువరులకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

నరసింహ శతకం – కాకుత్థ్సం శేషప్పకవి
తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొనిరాడు. పోయేటప్పుడు వెంటతీసుకొని వెళ్ళలేదు. లక్షాధికారైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోడమే కానీ, తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాన్ని దానం, ధర్మం చేయకుండా భూమిలో దాచిదాచి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులపాలు చేసినట్లు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో రాజులపాలో చేస్తాడు.
******************
ఇక

ఆలోచించండి-చెప్పంది.

ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు?

సత్సంపదలు అంటే ఏవి?

డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు?
***************************

6.

ఆలోచించండి-చెప్పడు

ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎండా * సత్సంపదలు అంటే ఏవి? డబ్బు కూడబెట్టి దానధర్మం = తేనెటీగతో ఎందుకు పోలా

సీ. మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి? పశువుల దోషముల్ పాలకేమి? అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి? కప్పదోషము మౌక్తికములకేమి? వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి? వెలియైన వాని సద్విద్యకేమి? అపవిత్ర దోషంబు లగ్నిహోత్రునకేమి? గుణదోషములవల్ల కులముకేమి? మలినమై చందనము పరిమళము జెడున రాతికంటు గుడము మధురంబు జెడున వినయములు జెడ మావృత్తి ఘనత జెడున విశ్వ పాలన ధర్మ! శ్రీ విశ్వ కర్మ!

విశ్వకర్మ శతకం – పండిత రామసింహకవి
శ్రీ విశ్వకర్మా! విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడ! మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యం ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల (ముత్యపు చిప్పల) దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికిపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు.

ఉ. లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
 మక్కువలన్ సృజించుచు నమాయకుడై సుడులన్ పదేపదే 
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్ 
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!

శ్రీ వేంకటేశ్వర శతకం - ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు

7. ఓ వేంకటేశ్వరా! మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటు సుడిగుండాలలో పడి, ఉక్కిరిబిక్కిరై తిరుగుతుంటాడే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయడం లేదు కదా!

*ఉ. ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
 శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్ 
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్ 
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!

శ్రీ బాకవరాంజనేయ శతకం వేంకటరావు పంతులు

8. పాపులను నశింపజేసేవాడ! సాధుజనులను ఆనందింపజేసేవాడ! బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా! ఆకలి దప్పులతో అలమటించే వారికి పట్టెడన్నంగాని, శాకంగాని, నీళ్ళుగాని ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే అది వారికి మేలయినదని, ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు..



అ) అందంగా ఉండాలంటే ఇది అవసరం
జవాబు. అన్నం

ఆ) పరువు అంటే అర్థం
జవాబు.గౌరవం

ఇ) సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది 
జవాబు. ఎ) అన్నం

ఈ) జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
జవాబు.డి) సోయగం

ఉ) ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినద
జవాబు.ఎ) పరువు

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు ?
జవాబు.
అబద్ధం మనిషి హీనతకు నిదర్శనం. మన సంస్కృతిలో రాముడూ, హరిశ్చంద్రుడూ, గాంధీజీ, బలీ వంటి మహనీయులు సత్యవాక్య పాలకులుగా ఖ్యాతి గాంచారు. నీచమైన అశాశ్వతమైన సుఖాల కోసం, సంపదల కోసం అబద్ధం ఆడి మన వ్యక్తిత్వాన్ని, మన ఘనచరిత్రనూ మాపుకోవడం అవివేకం అని కవి భావించాడు.

ఆ) వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలు :

దానధర్మాలు విరివిగా చేయడం,
అబద్ధాలు ఆడకుండడం,
గౌరవాన్ని కాపాడడం,
అందరితో స్నేహభావంతో మెలగడం.
ఇ) పెంపునదల్లివై ….. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
పెంపున తల్లివై పద్య అంతరార్థం : ఈ సృష్టిలో అందరికీ భగవంతుడే తల్లీ, తండ్రీ, వైద్యుడూ. అతడే తన భక్తులకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక మానవ రూపంలో ఉన్న భగవంతుని గుర్తించాలి. అందరినీ గౌరవించి, ఆదరించాలి. భగవంతుని చిత్తశుద్ధితో ఆరాధించాలి.

ఈ) “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు అనంతం. అవి గుర్రాలలాంటివి. మనం ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఇంకా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటి గురించే ఆలోచిస్తుంటే వాటికై పరిగెత్తుతుంటే బతుకు ఉక్కిరి బిక్కిరి అయి, నరకంలా తయారు అవుతుంది. కనుక కోరికలను అదుపు చెయ్యాలి. ఆ కోరికలను అదుపుచేసే విశిష్టమార్గం సంతృప్తి. భక్తీ, త్యాగం, దానం ఇవి అన్నీ విశిష్టమార్గాలు. ఇవి మనను ప్రశాంతంగా ఉంచుతాయి.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) శతకకవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
శతకపద్యాలు రాయడానికి నాకు తోచిన కారణాలు :

శతకకవులు సమాజానికి హితం చెప్పదలచారు.
శతకకవులు ప్రపంచాన్ని, మానవ జీవనాన్ని బాగా అధ్యయనం చేశారు.
వారికి కొంత వైరాగ్యం కలిగింది.
తమకు కలిగిన భావాలను కవితాత్మకంగా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు.
ఈ జగత్తులో మంచి నడవడి, సత్యం, దానం, ధర్మం, భక్తి వంటివి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతాయనీ, మానవుని శాశ్వతుణ్ణి చేస్తాయనీ వారు గ్రహించారు.
అసత్యమూ, నీచమైన కోరికలూ, పిసినారితనం, ధనమదం, అధికార దర్పం వంటివి అశాశ్వతమనీ, మనిషిని అశాంతిలోకి నెట్టుతాయనీ గ్రహించారు.
కనుక ఏది శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందో, ఏ అశాశ్వత ఆనందం కోసం మనిషి ప్రాకులాడుతున్నాడో తమ అనుభవాల ద్వారా తెల్పాలనుకున్నారు.
అందుకే శతకపద్యాలలో జీవన మూల్యాలు మూటగట్టి ఉంటాయి.
ఈ పద్యాలు రచించడం ద్వారా శతకకవులు మనిషికి సత్ జీవన మార్గాన్ని సూచించదలచారు.
శతకకవులు మేలైన పద్యాలు రచించి తెలుగు భాషకూ, సాహిత్యానికి గొప్ప సేవ చేశారు.
IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి.
(ప్రకటనలో పోటీ నిర్వహణ తేది, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి.)
జవాబు.

పాఠశాల బాలబాలికలకు పద్యాల పోటీకి ఆహ్వానం

ఈ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలలో తెలుగు భాషాసాహిత్యాల పట్ల అభిరుచి పెంపొందించేందుకుగాను తెలుగు పద్యాల పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని మాతృభాష పట్ల మీకున్న అభిరుచినీ, ఆసక్తినీ చాటుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.

1. పోటీల విభాగాలు :

పోటీలు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో జరుగుతాయి.
ఆరు, ఏడు తరగతులు జూనియర్స్ విభాగం
ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు సీనియర్స్ విభాగం
2. పోటీ జరిగే తేది, స్థలం :
పోటీలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా x x x x xన ఉదయం 10.00 నుండి పాఠశాల గ్రంథాలయం హాలులో జరుగుతాయి.

3. పాల్గొనేవారికి సూచనలు :

పోటీలలో పాల్గొనేవారు xx x x x సాయంత్రంలోగా తమ తమ పేర్లు తెలుగు ఉపాధ్యాయులకు అందచేయాలి.
తెలుగు పద్యాలు ఎవరు రాగయుక్తంగా, భావయుక్తంగా ఎక్కువ పద్యాలు చెప్పగల్గుతారో వారికి మంచి బహుమతులు అందచేస్తాము.
బహుమతులు గెల్చుకున్నవారికి విశిష్ట అతిథుల చేతుల మీదుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా బహుమతులు అందచేయబడతాయి.
నిర్వహించువారు
తెలుగు విభాగం
××××× పాఠశాల.

V. పదజాల వినియోగం:

ప్రశ్న 1.
కింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి, గీత గీయండి.
అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు.
ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
అ) దోషాలు = తప్పులు
ఆ) తేనె = మధువు

ప్రశ్న 2.
కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
జవాబు.
ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
సహృదయత = మంచి మనసు

అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
పరిమళం = సువాసన

ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
మైత్రి = స్నేహం

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

జవాబు.
ప్రకృతి – వికృతి
గుణం – గొనం
దోషం – దోసం
సుఖం – సుకం
పుణ్యెం – పున్నెం
అగ్ని – అగ్గి
వైద్యుడు – వెజ్జు
ధర్మం – దమ్మం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) దశేంద్రియ = దశ + ఇంద్రియ – గుణసంధి
ఆ) లక్షాధికారి = లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి
ఇ) పట్టెడన్నము= పట్టెడు + అన్నము – ఉత్వ సంధి
ఈ) రాతికంటు = రాతికి + అంటు – ఇత్వ సంధి
ఉ) చాలకున్న =చాలక + ఉన్న – అత్వసంధి

2. కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.

జవాబు.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) ఆకలిదప్పులు – ఆకలియు, దప్పియు – ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలు – అన్నము, వస్త్రము – ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలు – దశ సంఖ్య గల ఇంద్రియములు – ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు – నాలుగైన వేదాలు – ద్విగు సమాసం

ఛందస్సు – లఘువు, గురువు:
కింది వానిని చదివి తెలుసుకోండి.

పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.

అ) “లఘువు” – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “I” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.


ఆ) “గురువు” – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.
 3.కింది పదాలకు గురులఘువులు గుర్తించండి
జవాబు.
గణాలు :
గణం అంటే మాత్రల అక్షరాల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.
రెండు అక్షరాల గణాలు.
మూడు అక్షరాల గణాలు
కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.
 4.కింద పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.

అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము –

ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.ఇందులో న, జ, భ, జ, జ, జ, ర ‘అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్య పాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.


ప్రతి పదార్థాలు

మ॥ సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా !

ప్రతిపదార్థం:

మా నాథ ! = లక్ష్మీదేవికి భర్తయైన (మమ్మల్ని రక్షించేవాడా !)
నారాయణా ! = శ్రీమన్నారాయణా !
సతత + ఆచారము = సనాతన ఆచారమూ
సూనృతంబు = మంచి మాటా
కృషయున్ = దయా
సత్యవాక్కు = మంచి నడవడీ
నతి = గౌరవమూ
శాంతత్వము = శాంత స్వభావమూ
చిత్తశుద్ధి = చిత్తమునందు పవిత్రతా
కరమున్ + అధి + ఆత్మయున్ = మిక్కిలి భక్తితత్పరతా
ధ్యానమున్ = ధ్యానమూ
ధృతియున్ = దీక్షా
ధర్మము = ధర్మమూ
సర్వజీవ హితమున్ = సర్వ ప్రాణులకూ మేలు చేకూర్చుట అనే సద్గుణాలను
దూరంబు కాకుండ = దూరం కాకుండా
మీ నివాస సుఖమున్ = మీదైన నివాస సుఖం
సమ్మతికిన్ = సద్గతికి (మోక్షానికి)
చేరువ = దగ్గర కదా !

భావం : లక్ష్మీపతియైన శ్రీమన్నారాయణా ! నీ సన్నిధి మోక్షప్రదం. నీ సన్నిధిలో నున్నవానికి సకల సద్గుణాలూ దూరం కావు.

2వ పద్యం (కంఠస్థ పద్యం):

ఉ॥ బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా!

ప్రతిపదార్థం:

చిత్తమా ! = ఓ మనసా !
బీదలకు = పేదవారికి
అన్నవస్త్రములు = ఆహార వస్త్రాదులు
పేర్మిన్ = సంతోషంతో
ఒసంగుము = అందించు
తుచ్ఛ = నీచ
సౌఖ్యసంపాదనకై = సుఖములు పొందడానికై
అబద్ధములు = అబద్ధాలు
పలకు = పలుకవద్దు
వాదములు = వృథా ప్రసంగములు
ఆడన్ + పోకు = చేయవద్దు
మర్యాదన్ = గౌరవాన్ని
అతిక్రమింపకు = మీరవద్దు
పరస్పర మైత్రిన = ఇతరులతో స్నేహభావంతో
మెలంగుము = వర్తించు
ఇట్టివి + ఔ = ఇటువంటివే
వేదములు + అంచు + ఎఱుంగుము = వేదములని గ్రహించు
వివేకధనంబు + ఇది = ఇదే వివేకుల సంపద అని
నమ్ము = నమ్ము

భావం :
‘ఓ మనసా ! పేదలకు ఉదారంగా అన్న వస్త్రాలందచేయి. క్షణిక ఆనందం కోసం అబద్ధం చెప్పకు. వ్యర్థ ప్రసంగాలు చేయకు. గౌరవాలను మీరకు. అందరితో సఖ్యభావంతో మెలగు. వీటన్నిటి సారమే వేదాలని గ్రహించు’. అని తన మనస్సుకు ఆత్మబోధ చేసుకున్నాడు కవి.


II.

3వ పద్యం (కంఠస్థ పద్యం) :

చ|| చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా ! = ఓ భాస్కరుడా !
చదువు + అది = చదువు
ఎంత + కల్గినన్ = ఎంత ఉన్నా
రసజ్ఞత = ఔచిత్యం
ఇంచుక = ఒకింత
చాలక + ఉన్నన్ = లేకుంటే
ఆ చదువు = ఆ విద్య అంతా
నిరర్థకం = వ్యర్థం
ఎచ్చటన్ = ఎక్కడా
గుణసంయుతులు = సద్గుణ సంపన్నులు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = మెచ్చుకోరు
పదునుగ = మిక్కిలి నేర్పుతో
మంచికూర = మంచి కూర
నలపాకము చేసినన్ + ఐనన్ = నలుడే చేసినా
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = రుచి కల్గించే
ఉప్పు = ఉప్పు
లేక = వేయకపోతే
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చునట + అయ్యా ? = ఎలా పుడుతుంది ?

భావం :
భాస్కరా ! ఎంత గొప్ప చదువులు చదివినా కొద్దిగా విచక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థం. సద్గుణులు ఎవ్వరూ మెచ్చుకోరు. నలుడే స్వయంగా వండినా కూరలో ఉప్పు వేయకపోతే రుచి పుడుతుందా ?

ఇక్కడ కవి విచక్షణను ఉప్పుతోనూ, గొప్ప చదువును నలుని వంటి వాని కూరతోనూ సామ్యం చూపాడు. విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించాడు కనుక ఇది అర్థాంతరన్యాసాలంకారం.

4వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ॥ పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నిపా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ!

ప్రతిపదార్థం:

దాశరథీ ! = దశరథుని పుత్రుడైన ఓ రామా !
కరుణాపయోనిధీ ! = సముద్రమంతటి దయ కలవాడా !
పెంపునన్ = నన్ను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లివై
కలుషబృంద = పాప సమూహాల
సమాగమము = కలయిక
ఒందకుండ = నన్ను తాకకుండా
రక్షింపను = రక్షించడంలో
తండ్రివై = నాకు తండ్రివై
మెయి = నా శరీరంలో
వసించు = నివాసం ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియాలనే
రోగముల్ = రోగములను
నివారింపను = నివారించడానికి
వెజ్జువై = వైద్యుడవై
కృప గుఱించి = కృపతో
పరంబు = మోక్షం
తిరంబు + కాగ = నాకు శాశ్వతంగా లభించేటట్లు
సత్ + సంపదలు = ఉత్తమ సంపదలు
ఈయన్ = ఇచ్చుటకు
గతి నీవె = సద్గతి నీవే !

భావం :
దశరథ కుమారుడైన ఓ రామా ! దయా సముద్రా! నన్ను పెంచడంలో నీవే తల్లివి. పాపములు అంటకుండా రక్షించడంలో నీవే తండ్రివి. ఇంద్రియాలనే రోగాలు నివారించడంలో నా పాలిటి వైద్యుడివి. కృపతో నాకు మోక్షం శాశ్వతం చేసే గొప్ప సంపదలీయవయ్యా

5వ పద్యం (కంఠస్థ పద్యం) :

సీ॥ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ప్రతిపదార్థం:

భూషణ వికాస ! = ఆభరణములచే శోభించే వాడా!
శ్రీ ధర్మపుర నివాస ! = ధర్మపుర క్షేత్రంలో కొలువైన వాడా!
దుష్ట సంహార! = దుష్టులను సంహరించే వాడా!
దురితదూర ! = పాపాలు పోగొట్టేవాడా !
నరసింహా ! = ఓ నరసింహస్వామీ !
తల్లి గర్భము నుండి = పుట్టుకతోడనే
ఎవ్వర = ఎవరూ
ధనము తేరు = సంపదలు తీసుకురారు
వెళ్లిపోయెడు నాడు = మరణించేనాడు
వెంట రాదు = సంపాదించుకున్న దేదీ వెంటరాదు.
లక్ష + అధికారి + ఐన = ఎంత ధనవంతుడైనా
లవణము + అన్నమె కాని = ఉప్పూ అన్నాలే కాని
మెఱుగు బంగారంబు = ధగధగ మెరిసే బంగారం
మ్రింగన్ + పోడు = మ్రింగడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విఱ్ఱవీగుట + ఎ కాని = మదించి తిరగడమే తప్ప
కూడబెట్టిన = సంపాదించిన
సొమ్మున్ = డబ్బు
కుడువన్ + పోడు = తినడు
పొందుగా = ఒద్దికగా
మఱుగు + ఐన = ఎవరికీ కనబడని
భూమిలోపలపెట్టి = భూమిలో పాతిపెట్టి
దానధర్మము = దానమూ ధర్మమూ
లేక = లేక
దాచి దాచి = దాచిపెట్టి
తుదకు = చివరకు
దొంగలకు + ఇత్తురొ? = దొంగలపాలు చేస్తారో ?
దొరలకు + అవునొ ? = దొరలపాలు చేస్తారో ?
జుంటి + ఈగలు = తేనెటీగలు
తేనెన్ = తేనెను
తెరువరులకు = దారిని పోయేవారికి
ఇయ్యవా ? = ఇస్తాయి కదా !

భావం :
ధర్మపురి నివాసుడైన ఓ నృసింహా ! మనిషి పుట్టేటప్పుడు ఏమీ పట్టుక రాడు. పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోడు. ఎంత సంపాదించినా ఉప్పు, అన్నమూ తినాల్సిందే. లక్షలార్జించి అహంకారంతో వర్తించి, ఎవరికీ దానమీయక దాచి దాచి తుదకు దొంగలపాలో, దొరలపాలో చేస్తూ ఉంటారు. తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె తుదకు బాటసారుల పాలవుతుంది కదా !

ఇక్కడ ఒక విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పనైనది కనుక అర్థాంతరన్యాసాలంకారం.


III.

6వ పద్యం (కంఠస్థ పద్యం) :

*సీ॥ మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహెూత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ ! శ్రీ విశ్వ కర్మ!

ప్రతిపదార్థం:

విశ్వ పాలన ధర్మ ! = విశ్వపాలనమే ధర్మముగా కలవాడా !
శ్రీ విశ్వకర్మ = ఓ విశ్వకర్మా !
మొదలు = మొదలులో
కర్దమము + ఉంటె = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలి పూవుకు వచ్చిన ముప్పేమి ?
పశువుల = పశువులకు
దోషముల్ = రోగాలుంటే
పాలకు + ఏమి = = పాలదోషం ఏమి ?
అరయన్ = విచారించగా
వైద్యుని కులంబు = వైద్యునికున్న కులము
ఔషధంబునకు ఏమి = మందులకంటదు కదా !
కప్ప దోషము = నీటిలో కప్ప ఉన్నంతమాత్రాన
మౌక్తికములకు + ఏమి = ముత్యాల కాంతి తగ్గుతుందా!
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్న = ఎలా ఉన్నా
కృషి కర్మమునకు + ఏమి = వ్యవసాయ వృత్తికి ఇబ్బంది ఏమిటి ?
వెలియైనవాని. = వెలివేసిన కులస్థుని
సత్ + విద్యకు + ఏమి = విద్యకు కల్గిన నష్టమేమి ?
అపవిత్ర దోషంబులు = ఒకవేళ శుచీ శుభ్రం లేకపోతే
అగ్నిహెూత్రునకు + ఏమి = అగ్నికి వచ్చిన నష్టం ఏమి?
గుణదోషముల వల్ల = మనుషుల మంచిచెడుల వల్ల
కులముకు + ఏమి = ఆ కులానికి వచ్చిన నష్టం
చందనము = మంచి గంధం
మలినమై = మలినం అంటి
పరిమళము = సువాసన
మధురంబు = దాని తీపి
చెడున ? = పోతుందా ?
గుడము = బెల్లం
రాతికి + అంటు = రాతికి అంటుకుంటే
చెడున ? = పోతుందా ?
వినయములు = గౌరవాదరాలు
చెడన్ = తగ్గితే
మా వృత్తి = మాదగు వృత్తి
ఘనత = గొప్పదనం
చెడున ? = తగ్గుతుందా ?

భావం :
ఓ విశ్వకర్మా ! మొగిలిపువ్వు మొదలులో బురద ఉంటే మొగిలిపువ్వు సువాసన తగ్గుతుందా ? పశువు నల్లగా ఉంటే ఆ నలుపు పాలకంటుతుందా ? వైద్యుడు ఏ కులమైనా అది మందులకంటదు. కప్ప పక్కన ఉంటే ముత్యం కాంతి తగ్గదు. ఎద్దు ఎలా ఉన్నా వ్యవసాయానికి ఆటంకం కాదు. అధమ కులస్థుడైనవాడు నేర్చిన గొప్ప విద్యలకేమి లోటు? పాపపుణ్యాలు అగ్నికంటవు. ఒకరిద్దరు చెడ్డవాళ్ళున్నా ఆ కులానికి కల్గి నష్టం లేదు. మంచి గంధానికి కొంత మలినం అంటితే దాని పరిమళం తగ్గుతుందా ? బెల్లం రాతికి అంటితే దాని తీపి చెడుతుందా ? గౌరవాదరాలు తక్కువ చూపితే మా వృత్తికున్న గొప్పదనం మాసిపోతుందా ?

8. శతక సుధ

7వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ॥ లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
ముక్కువలన్ సృజించుచు సమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!

ప్రతిపదార్థం:

వేంకటేశ్వరా ! = పాపహరుడైన ఓ దేవా !
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = లెక్కలేనన్ని
కోరికల = కోరికలనే
రీతులలోన్ + పడి = విధానాలలో మునిగి
ఇటుల్ = ఈ విధంగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచున్ కొత్త కొత్తగా కనిబెడుతూ
అమాయకుడై = మాయ తెలియనివాడై
పదేపదే = మరల మరల
సుడులన్ = సుడులలో
ఉక్కిరి బిక్కిరి + ఐ = ఉక్కిరి బిక్కిరి అయిపోతూ
తిరుగుచుండును+కాని = తిరుగుతూంటాడు కానీ
విశిష్టమార్గముల్ = మహత్తు కలిగిన దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశము = కొద్దిగా అయినా
కుదుర్కొననీయడె = కుదురుగా నిల్పడు కదా !

భావం :
ఓ వేంకటేశ్వరా ! మానవుడు నిరంతరం నీచకోరికలనే సుడిగుండాలలో మునిగి ఉక్కిరిబిక్కిరియై పోతూంటాడు కానీ మంచి మార్గంలో నడుద్దామనే ఆలోచన కొద్దిగా అయినా చేయడు కదా !


8వ పద్యం (కంఠస్థ పద్యం) :

ఉ|| ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!

ప్రతిపదార్థం:

ఖలభంజన ! = పాపులను సంహరించేవాడా!
సాధుజన + అనురంజనా ! = సజ్జనులను సంతోషపెట్టే వాడా !
బాకవర + ఆంజనేయ! = బాకవర ఆంజనేయా !
ఆకలిదప్పులన్ = ఆకలి దప్పికలతో
వనట = వేదన
చెందినవానికి = చెందేవారికి
పట్టెడు + అన్నమో = పట్టెడంత అన్నమో
శాకమొ = కూరలో
నీరమో = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతులన్ చేసిన = సంతృప్తిపరిస్తే
సర్వపుణ్యముల్ = సమస్త పుణ్యాల ఫలం
చేకురు = దక్కుతుంది
నీవు = నీవు
శ్రేయము+అటంచున్ = వారికి శ్రేయము (మేలు) కలగాలని
ఎంతయున్ = ఎంతో
మెచ్చెదవు = మెచ్చుకుంటావు కదా !

భావం :
బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా ! ఆకలి దప్పికలతో అలమటించేవారికి ఒకింత అన్నం, కూరా, మంచినీరిచ్చి ఆదరించినవారిని నీవు ఎల్లవేళలా వారి మేలు కోరుతూ ఎంతో మెచ్చుకుంటావు కదా !

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:
1.కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

జవాబు.

శతకం పేరు కవి పేరు
1. సుమతీ శతకం బద్దెన
2. శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి
3. తెలుగుబాల కరుణశ్రీ
4. కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం
5. వేమన శతకం వేమన
6. దాశరథీ శతకం కంచర్ల గోపన్న
7. సుభాషిత త్రిశతి ఏనుగులక్ష్మణ కవి
8. భాస్కర శతకం మారద వెంకయ్య
9. నారాయణ శతకం పోతన
10. చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి