ఆలోచించండి – చెప్పండి:
ప్రశ్న 1.
‘మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీరా నది పల్లెటూళ్ళను తల్లిలాగా భావించింది. పల్లెప్రజలకు అవసరమైన తాగునీటిని, సాగునీటిని అందించింది. పల్లెప్రజల బ్రతుకులో కొత్త కాంతులను నింపింది. అందుకే కవి మంజీర పల్లెటూళ్ళను తల్లివలె లాలించిందని చెప్పాడు.
ప్రశ్న 2.
పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీర పట్టణాలను తోబుట్టువులా ప్రేమించింది. పల్లె ప్రాంతాల్లోని పాడిపంటలను నగరప్రజలకు అందించింది. వారికి ఆహారాన్ని అందించింది. వారి జీవితాలను రక్షించింది. అందుకనే కవి మంజీరా నది తోబుట్టువులాగా పట్టణాలను ప్రేమించిందని చెప్పాడు.
ప్రశ్న 3.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీర పట్టణవాసులను తన జలధారలతో పోషిస్తున్నది. హైదరాబాద్ వంటి నగరాలకు తీయని నీటిని అందిస్తున్నది. పల్లెల్లో పండిన ధాన్యాన్ని పట్టణాలకు అందిస్తున్నది. పట్టణప్రాంత వాసుల దాహాన్ని మంజీర తీరుస్తున్నది.
ఇవి చేయండి :
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
- నదులు ప్రాణికోటికి జీవనాధారాలు.
- జీవనంలో అన్నింటికి అవసరమైన నీటిని మనం నదుల నుండి పొందుతాము.
- నదులకు ఆనకట్టలు కట్టి, ఆ నీటిని కాలువల ద్వారా మళ్ళించి, పంటలు పండిస్తాము.
- ప్రకృతి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఎంతో మేలు చేస్తాయి.
- నదుల వలన తాగునీరు, సాగునీరు అందుతుంది. కనుక నదులు పవిత్రమైనవి, పుణ్యప్రదమైనవి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.
అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగేను
ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు
ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.
ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి.
2. గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ.
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
గిరులంటి, వానిని
ర్హరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా
ప్రశ్నలు :
అ) ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం ‘దుందుభి’ నదిని గుర్చి చెప్తున్నది.
ఆ) దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించే నదితో పోల్చాడు.
ఇ) కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు ?
జవాబు.
‘పాలు’ ఆరోగ్యానికి మంచిది. పాలు మధురంగా ఉంటాయి. దుందుభి నదిలో నీళ్ళు కూడా పాలవలె మధురంగాను. ఆరోగ్యవంతంగాను ఉంటాయని కవి అన్నాడు.
ఈ) ‘దరులు’ – అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
‘దరులు’ అనే పదానికి ‘ఒడ్డులు’ అనే అర్థం.
ఉ) దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం చిరుగాలికి కదిలి, పొర్లిపడే కెరటాలతో, అమృతంలాంటి నీటిబిందువులతో పర్వతాలను, చెట్లను తాకి, సెలయేళ్ళతో కలిసి, జాజిపూవుల కొమ్మల అందాలను అడ్డుకొని పాలయేరులా ఉందని కవి ఉద్దేశం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
పొలాలు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం. వర్షాలు బాగా కురిస్తేనే నదులు ప్రవహిస్తాయి. నదుల్లోని నీరే పంటపొలాలకు బలం. నదులు కేవలం నీటిని మాత్రమే కాదు సారవంతమైన మట్టిని కూడా పొలాలకు అందిస్తాయి. దాంతో పంటలు పచ్చగా పెరుగుతాయి. నదుల్లోని నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీంతోనే పంటలకు చక్కని బలం సిద్ధిస్తుంది. ఈ కారణంవల్లనే కవి – “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని చెప్పాడు.
ఆ) భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం తెల్పండి.
జవాబు.
భాగ్యనగరాన్ని కులీకుతుబ్షా నిర్మించాడు. ఇలాంటి భాగ్యనగరానికి సమీపంలోనే మంజీరా నది ఉంది. ఈ కారణంగా భాగ్యనగరానికి, మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది. మంజీర తన అమృతజలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది. ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని, సాగునీటిని అందిస్తున్నది.
మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది. గ్రామాల్లోని ధాన్యాన్ని నగర ప్రజలకు అందిస్తున్నది. ఈ విధంగా భాగ్యనగరవాసులకు, మంజీరాకు విడదీయరాని సంబంధం ఉంది.
ఇ) మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
ఏ దేశంలోనైనా నదులు, దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు. నదులు ప్రవహించే ప్రాంతాలు, ధాన్యాగారాలుగా మారతాయి. మనదేశంలో జీవనదులయిన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు ఉత్తర భారతాన్నీ, కృష్ణా, గోదావరులు, దక్షిణ భారతాన్నీ సస్యశ్యామలం చేస్తున్నాయి.
పాడిపంటలతో ఆ ప్రాంతాల్ని కలకలలాడిస్తున్నాయి. మనకు కావలసిన తాగునీటినీ, సాగునీటినీ మనకు అందిస్తున్నాయి. విద్యుదుత్పత్తికి తోడుపడుతున్నాయి. రవాణా సౌకర్యాలను కలుగజేస్తున్నాయి. మానవుల జీవనానికి నదులు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. నదీతీరాలలోని పరిశ్రమలకు నీటిని అందిస్తున్నాయి.
కాబట్టి మనం అత్యంత ప్రాముఖ్యమైన నదీజలాలను భద్రంగా కాపాడుకోవాలి. మురికినీటిని, నదులలో కలపరాదు. నదీజలాల్లో బట్టలు ఉతకరాదు. పశువులను కడగరాదు. పరిశ్రమల వ్యర్థాలను నదీజలాల్లో కలుపరాదు. నదీజలాలను పరిశుభ్రంగా ఉంచి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కలుషిత నదీజలాలను తాగడం వల్లే, మనలో చాలామంది రోగాలబారిన పడుతున్నాము. కాబట్టి జాగ్రత్తపడదాం. మన నదులను మనం రక్షించుకుందాం.
ఈ) నదులు ‘నాగరికతకు ఆలవాలం’ – ఎందుకు ?
జవాబు.
భారతదేశంలో గంగ, కృష్ణ, గోదావరి వంటి పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. ఎక్కువ భాగం నదులు హిమాలయ పర్వత సానువుల నుండే పుట్టాయి. మనదేశంలో గంగానదికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయులు నదులను దేవతామూర్తులుగా భావిస్తారు.
వాటిని పూజిస్తారు, హారతులు ఇస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలను నిర్వహిస్తారు. నదులలోని నీటిలో ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. అందువల్లనే మన నదులు సనాతన ‘నాగరికతకు ఆలవాలం’ అని అంటారు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదులు మనకు త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరిస్తున్నాయి. ఈ రకంగా నదులు సకలజీవకోటికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో కూడా నీరు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రకృతితోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని-
- సకాలంలో వర్షాలు కురవకపోవడం, వర్షపాతం చాలా తగ్గిపోవడం.
- ఎగువ రాష్ట్రాలు నదులపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం.
- విద్యుత్ ఉత్పత్తికి పరిమితికి మించి నీటిని వృథాగా ఖర్చు చేయడం.
- అడవులను పరిరక్షించకపోవడం
- పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం
- నీటి పొదుపుపై ప్రభుత్వాలకు సరియైన అవగాహన లేకపోవడం.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు/చెరువు/నదిని వర్ణిస్తూ కవిత/గేయాన్ని రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.
కవితా గేయం :
“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసే
గౌతముడు కోపాన కనువిచ్చి చూసె
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంధ శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి