సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్లోకం


"గతకాలము మేలు వచ్చు కాలముకంటేన్" - 
"మంచిగతమున కొంచెమేనోయ్" - 
ఏది సరైనది?
ఇది తెలియాలంటే
 కాళిదాసు "మాళవికాగ్నిమిత్రమ్నాటకంలో ప్రస్తావనలో ఉంది.

పురాణ మిత్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవ మిత్యవద్యమ్
నన్త పరీక్ష్యాన్యతర ద్భజంతే
మూఢ: పరప్రత్యయనేయబుద్ధి:



పాతది అనే కారణంతో మంచిదికాదని అనకూడదు. 
కొత్తదైనంత మాత్రాన దోషయుక్తమైనదీ కాదు.
ఉత్తములైన వారు వాటిని పరీక్షించి  మంచిదాన్నే తీసుకుంటారు.
అవివేకి ఇతరులమాటలపై నమ్మకంతో నిర్ణయించుకుంటాడు.
మంచి చెడులను వస్తుధర్మమే కారణంగాని కాలం కారణం కాదు. - అని భావం.

పాతది మంచిది కొత్తది చెడ్డది అనే అపోహ
కాళిదాసు కాలం నుంచీ ఉందని దీన్నిబట్టి తెలుస్తుంది.
ఈ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాడు కాళిదాసు.
మంచి చెడ్డలు గతంలోను వర్తమానంలోను
భవిష్యత్తులోను ఉంటాయి అనేది అందరూ
ఆమోదించదగినది.


శ్లోకం:
వృశ్చికస్య విషంపుచ్చం మక్షికస్య విషంశిరః !
తక్షకస్య విషందంష్ట్రాస్సర్వాంగం దుర్జనే విషం !!

తాత్పర్యం:
తేలుకు తోకలోను, ఈగకు తలలోను, నాగుపాముకు కోరల్లోను విషముంటుంది, అయితే దుర్జనులకు మాత్రం నిలువెల్లా విషమే ఉంటుంది.

శ్లోకం:
కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం !
మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం !!

తాత్పర్యము:
కృషి చేసుకునే వానికి కరువులేదు, జపం చేసుకునే వానికి పాపము లేదు, మౌనంగా ఉండేవాడికి కలహము లేదు, మేల్కొని ఉండే వాడికి భయమే లేదు. 



కార్యేషు దాసీ 

శ్లోకం:
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రీ !
స్నేహేచ మాతా శయనే తు వేశ్యా, షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!!


తాత్పర్యం:
ఇంటి పనులయందు దాసివలే, పనుల ఆలోచనలో మంత్రిలా, రూపమందు లక్ష్మివలే (రూపంలో లక్ష్మి అంటే లక్ష్మిదేవిలా అందంగా అని కాక లక్ష్మీకళ ఉట్టిపడేలా శుభ్రతాలంకారంతో), ఓర్పులో భూదేవిలా,  చనువు-స్నేహంలో తల్లిలా, పడకయందు వేశ్యలా (స్నేహేచ మాతా శయనేతు వేశ్యా బదులుగా భోజ్యేషు మాతా, శయనేషు రంభ అనే వాక్యం కూడా వినిపిస్తుంది - భోజనం దగ్గర తల్లిలా, పడకయందు రంభలా అని ఈ వాక్యార్థం) ఈ ఆరు రూపాలలో ప్రవర్తించునదే కులధర్మస్త్రీ.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...