విద్యార్థులతో వచన కవిత ఎలా రాయించాలి?
ఎంచుకున్న వస్తువు మీద స్పష్టమైన అవగాహన ఉండాలి.మైండ్ మ్యాప్ చేయాలి.మేథో మథనం జరగాలి.స్వరూప, స్వభావ, మూల అంశాలను వాక్యాలుగా రాయాలి.ఎంత వీలైతే అంత తక్కువ పదాలలో ఎక్కువ అర్థం స్ఫురించే విధంగా రాయాలి.సరిపడే పదజాలం ఉపయోగించాలి.భావం చిత్రం వచ్చేలా రాయాలి.
ముగింపులో స్పార్క్ / ఒక మెరుపులాంటి సందేశం ఉండాలి.
విలువలు ప్రబోధించాలి.
దేని గురించి రాస్తున్నామో దానిని కవితా వస్తువు అంటారు.
ఆ వస్తువుకు ఆకారం చేకూర్చాలి.
అక్షరాలతో మేకప్ వేయాలి. (అలంకారాలు అంత్యాను ప్రాసాలంకారం, ఛేకాను, ముక్త పదగ్రస్తం .... మొదలైనవి వాడాలి.)
శబ్దం, లయకు విద్యార్థులు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.
అన్నీ వాక్యాలకు సంబంధం ఉండాలి.
కవిత చదివినాక మంచి భోజనం చేసింట్టుండాలి(సినారె అన్నారు)
వాక్యం పాఠకుణ్ణి వెంటాడేలా రాయాలి.
రాయడానికి ప్రయత్నించాలి
వస్తువు : మట్టి అనుకుంటేశిల్పం : కవితా ఆకారం (పదాలతో మంచి ఆకారం దిద్దుకోవాలి)
స్వరం : ఎవరు కవిత చెపుతున్నారు.
క్లుప్తత : తక్కువ పదాలతో ఎక్కువ అర్థం (అల్పాక్షారాలలో అనల్పార్థ రచన)
ముగింపు : మెరుపు మెరిసినట్లు ముగింపు ఉండాలి.
సందేశం ఉండాలి.
ఆలోచన రేకెత్తిదిగా ఉండాలి.
భావ చిత్రం : భావం స్పురించాలి.
ఉదా : ఆరడుగుల బుల్లెట్. బుల్లెట్ చిన్నదే అయినా ఆరడుగుల పొడవు అంటే చాలా తీవ్రం అన్నమాట.
అట్లాగే అతడు దేవుడు
సాక్షాత్తు ఈశ్వరుడు
పదచిత్రం కల్పిచేలా రాయాలి.
ఉదా.
ఇద్దరం ఎండిన చెట్లవలే అవుతాము
చీకటి నది
మెత్తని పులి (తిక్కన)
భస్మ సింహాసనం (గుర్రం జాషువా)
కొత్త పదబంధాలను ఉపయోగించాలి.
నీ కళ్లలోకి చూశాను రెండు ప్రతి బింబాలు (సబ్బని)
ప్రతీకలు : ఉదాహారణాలు.
పిల్లలకు అంత్యాను ప్రాసాలంకారతో రాయించవచ్చు
భావనలు కల్పించాలి. మేథో మథనం చేయాలి.
ఆలోచించాలి. ఒక్కొక్కోటి రాయాలి.
మళ్ళీ మళ్ళీ చదవాలి రాయాలి.
కొత్త పదజాలం కోసం వెతకాలి.
కవిత రాసే ముందు బాగా ఆలోచించగలగాలి. మేథో మథనం చేయాలి.
భావానా చిత్రం:
చెట్టు - కాకులు - మేకలు - ఈకలు -
తోకలు- నూకలు - ఆకులు- కాకి - బాకీ, జీవులు - పూవులు -
చెట్టు కింద మేకలు ఉన్నాయి
కాకులకు ఈకలు ఉన్నాయి
మేకలకు తోకలు ఉన్నాయి
మేకలు తింటాయి ఆకులు
కాకులు తింటాయి నూకలు
తర్వాత క్రియాపదాలు తొలగించినా అర్థం మారనపుడు తొలగించాలి.
విభక్తులు చేర్చి ప్రయతించాలి.
ఒకసారి క్రియ ముందు చేర్చాలి.
ఒకసారి కర్త ముందు చేర్చాలి.
ఒకసారి కర్మ ముందు చేర్చాలి.
కొన్ని తొలగించాలి
కొన్ని చేర్చాలి.
ఇంతకంటే నేను రాయలేను అనేవరకు రాయాలి .
కవిత్వం రాసేవారికి ఉండాల్సిన లక్షణాలు:
ఓర్పు ఉండాలి.
నాలుగు వాక్యాలు రాయగానే సంతృప్తి చెందకూడదు
కొత్తగా ఆలోచించాలి.
చెట్టుమీద కాకులు
చెట్టు కింద మేకలు
కాకులకు ఈకలు
మేకలకు తోకలు
మేకలకు ఆకులు
కాకులకు నూకలు
కొట్టినా తిట్టినా కోపగించుకోక
కాకులు పిలుస్తుంటవి కాక కాక అని
అవి కాకులు కావు
సమాజమే వాటికి బాకీ
కాకి మేకలు పశువులు
పూవులన్నీ జీవులు
అన్నీ కలగలస్తే జీవావరణం
అదే మానవ మనుగడ
..............
అక్క అన్న మీద కవిత కోసం ఏవిధంగా సహయాకారులు. ఏమేం చేస్తారు....
అమ్మ = అక్క
నాన్న= అన్న
అమ్మంటే లాల పోసి అన్నం పెట్టే చేయే కాదు
ఆదరించి లాలించే చల్లటి ఒడి కూడా
అక్కంటే మ్మ తర్వాత అమ్మంత ప్రేమ కూడా
అన్నంటే నా తాయిలం లాక్కునే వాడే కాదు
తన పాత చొక్కా లాగూ నాకిచ్చేవాడు కూడా
నాన్నంటే తిట్టి దండించే నరసింహుడే కాదు
దారి చూపి నడిపించే గురువూ కాపరి కూడా...
****************,
ఊరు
ఊరు - ఏరు - పారు - హోరు - జోరు -
వాగు- భావనా అందజేయాలి
లేదా మేథో మథనం చేయాలి
మా ఊరు గోనేపల్లి
తనువంతా తాళ్లపల్లి
మండువలో కల్లు
ఒడువనీ మాటల సొల్లు
పక్కనే పారుతుంది ఏరు
సుట్టాల కాళ్ళకు సాకవోసే తీరు
కడుగుతూ పారు
వర్షాకాలంలో చూడాలే దాని జోరు
వర్ణనకందని హోరు
మా వూరు కమతాల ఖని
మమతల చిరునామా
భావన / మేథో మథనం కోసం కొన్ని పదాలు
సిద్దిపేట - ప్రసిద్ధి - అభివృద్ధి - బుద్ధి - శుద్ధి - వెలుగులు - చెరువు - పరువు -
సిద్దిపేట కళలకు ప్రసిద్ధి
తెలంగాణ నుదుటి పై తిలకం దిద్ది
ఒద్దికగా జరిగే అభివృద్ధి
ఇక్కడి విద్యాలయాల్లో నిబద్ధత
లేదు ఎక్కడ అసంబద్ధత
చదివితే పెరుగుతుంది బుద్ధి
పట్టనము ఒళ్ళంతా శుద్ధి
పనిలో ఎందరికో ఆదెరువు
వెలుగులు వెదజల్లే కోమటి చెరువు
ఖండంతారాలకు పాకిన పరువు
వేడుకలకు వేదికలకు పత్తా
చాటుతుంది సత్తా
మమతల కోట
ఆత్మీయతల వేట
నిత్యం భవిష్యత్ పాట
అది సిద్దిపేట కాదు
అది మా అభివృద్ధి ప్రసిద్ధిపేట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి