ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేస్తారు.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –
గౌరవనీయులైన మీకు నమస్కారము. సుస్వాగతము.
కవిత్వం రాయాలని మీకు ఎందుకనిపించింది?
కవిత్వం రాయడం వలన మీకు కలిగిన సంతోషమేమిటి?
ఇప్పటివరకు మీరు ఏ ఏ ప్రక్రియలో రాణించారు?
ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు ముద్రించారు?
రచన సాహిత్యములో మీరు పొందిన గౌరవం అవార్డుల వివరాలు చెప్పండి.
కవిగా రచయితగా మీరు ఏ ఏ సవాళ్లను ఎదుర్కొన్నారు? ఎలా అధిగమించారు?
తెలుగు బోధన భాషగా వెనుకబడుతున్న నీటి పరిస్థితులలో తెలుగు కవిత, కథ చదివే వారు ఉన్నారా?
పాఠశాల స్థాయి నుండి కవిత్వము కథ మొదలైన సాహితీ ప్రక్రియలు పెంపొందించుటకు ఏ విధంగా కృషి చేయాలి?
కవిత్వము, కథ మొదలైనవి రాయాలంటే నేనేం చేయాలి?
కొత్తగా రాస్తున్న విద్యార్థులకు లేదా కవులకు రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి