సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

జీవన భాష్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవన భాష్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

X. 9. జీవన భాష్యం

 9. జీవన భాష్యం:




పాఠం ఉద్దేశం:
 మనిషి దేనిని గురించి నిరుత్సాహపడకూడదు. దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం "గజల్" లో పల్లవిని "మత్లా" అని చివరి చిరణాన్ని "మక్తా" అని కవి నామముద్రం "తఖల్లుస్" అని అంటారు. ప్రతి చరణం చివరన అంత్యప్రాస రూపొందిస్తుంది. 
సరస భావన, చమత్కార ఖేలన ఇంపూ, కుదింపూ గజల్ జీవ గుణాలు.
 ప్రస్తుత పాఠ్యభాగం "డాక్టర్ సి.నారాయణరెడ్డి సమగ్ర సాహిత్యం" ఆరవ సంపుటిలోని "తెలుగు గజళ్ళు" లోనిది.



సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (వికీపీడియా నుంచి)

జననం: జూలై 291931 

మరణం: జూన్ 122017).

తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం:1931 జూలై 29
భారతదేశం హనుమాజీపేట్, రాజన్న సిరిసిల్ల.
మరణం2017 జూన్ 12 (వయసు 85)
హైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుసినారె
వృత్తికవి, గేయరచయిత,
సాహితీవేత్త
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు (1973), 
పద్మ శ్రీ (1977),
కళాప్రపూర్ణ (1978), 
'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు  (1988), 
పద్మ భూషణ్ (1992),
సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)

రచనలు : 

  • విశ్వంభర
  • మనిషి - చిలక
  • ముఖాముఖి
  • భూగోళమంత మనిషి
  • దృక్పథం
  • కలం సాక్షిగా
  • కలిసి నడిచే కలం
  • కర్పూర వసంతరాయలు
  • మట్టి మనిషి ఆకాశం
  • మంటలూ - మానవుడూ - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1973)
  • తేజస్సు నా తపస్సు
  • నాగార్జున సాగరం
  • విశ్వనాథ నాయకుడు
  • కొనగోటి మీద జీవితం
  • రెక్కల సంతకాలు


పురస్కారాలు :
  1. 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  2. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం
  3. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం
  4. భారతీయా భాషా పరిషత్ పురస్కారం
  5. రాజలక్ష్మీ పురస్కారం
  6. సోవియట్-నెహ్రూ పురస్కారం
  7. అసాన్ పురస్కారం
  8. పద్మశ్రీ పురస్కారం
  9. పద్మభూషణ్ పురస్కారం
  10. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యము డాక్టరేటు డిగ్రీ
  11. ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
  12. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం
  13. డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)

పదవులు :- విద్యారంగంలోనూ, పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించాడు.

  1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
  3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
  4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
  5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు

భారత రాష్ట్రపతి అతన్ని 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో అయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.

 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు

బిరుదులు: ‘నవ్యగేయ మహాకవి, గేయకవి సమ్రాట్, పుంభావసరస్వతి, అభినవ కవి జలపాతం, ఆధునిక కవితా మహాప్రభువు, గేయ చక్రవర్తి, అభినవ కవి సార్వభౌముడు, గేయ భగీరథుడు, ఆంధ్ర రవీంద్రుడు, ధ్వనిచక్రవర్తి, ప్రజాకవి, నవకవితా సమ్రాట్, చలనచిత్ర కవి చక్రవర్తి, గేయ గంగాధరుడు, అభినవ జయదేవుడు, రసజగన్నాథులు, నవరసాలమూర్తి’’వంటి ప్రశంసలతో సహృదయ ప్రపంచం నారాయణరెడ్డిగారిని సన్మానించింది. 


(గమనిక : సినారె గురించి రాయమంటే బాల్యం, రచనలు : జ్ఞానపీఠ్,పద్మశ్రీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం, పదవులలో ఒక్ ఐదు రాస్తే  కొన్ని రాస్తే సరిపోతుంది. 


ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోని ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్భవించి మానవ వికాస భాష్యాన్ని విందాం.






I. అవగాహన ప్రతిస్పందన కింది 1. అంశాన్ని గురించి చర్చించండి.

అ)  జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజలకు ఎలా సరిపోయిందో చెప్పండి.

జవాబు: 



2. పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి. రాయండి.


నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది

పేరవంతుంది 

3. కింది అపరిచిత గేయ పాదాలు చదవండి.

భీతిలేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచునో

 తనివి తీరజనులకకెల్ల జ్ఞాన సుధలు దొరుకునో 

అడ్డుగోడలేని సమ సమాజమేచటనుండుననో 

హృదయంతరాళ జనితమౌ సత్యమేచట వరలునో 

ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము 

లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము లెమ్ము సోదరా!

గేయం చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) 'శిరము నెత్తి నిలుచుననో' అంటే మీకేమి అర్థం అయింది

జవాబు : తలెత్తుకొని ఆత్మగౌరవంతో నిలుస్తుందో అని అర్థమైంది

ఆ) జ్ఞాన సుధలు ఎట్లా ఉండాలని గేయం లో ఉన్నది?

జవాబు : 

ఇ) సమ సమాజం ఎట్లా ఏర్పడుతుంది జవాబు: 

ఈ) సత్యం విలసిల్లడం అంటే ఏమిటి? జవాబు 

ఉ) స్వర్గసీమ అనడంలో ఆంతర్యం ఏమిటి?

జవాబు


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత 

"చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? 

జవాబు:చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.

పేరు నిలవడానికి చేయవసిన పనులు :

  1. దానధర్మాలు విరివిగా చేయాలి.
  2. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
  3. పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
  4. కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
  5. బావులు, చెరువులు తవ్వించాలి.
  6. ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
  7. విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  8. చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
  9. వైద్యశాలలు కట్టించాలి.
  10. గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి. 

ఆ)“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు

జ: ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.  సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఇ) "మనుషులు పడుగురు కూడితే ఒక ఊరవుతుంది" అని సినారె ఎందుకు అని ఉంటారు?
జ. మనిషి భగవంతుడు సృష్టిలో ఒకే రకం జీవి. మనుషులందరూ సమానమే అనే భావం ఉన్నదని అర్థమవుతుంది. నీటి సమాజంలో కుల మాత వర్ణ ప్రాంత భేదాలకు విడిపోతున్నారు. 
తద్వారా సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. మత వైశాల్యాల వల్ల దేశాలు రాష్ట్రాలు మనుషులు నాశనం అవుతున్నారు. ఈ వేదాల వల్ల కలతలు కార్పన్యాలు కుట్రలు కుతంత్రాలు పెరిగిపోతున్నాయి. పదిమంది కలిసి ఉంటే అది చక్కని ప్రదేశం. ఆ ప్రదేశమే గ్రామం. గ్రామంలోని ప్రజలంతా కలిసి ఉంటే గ్రామం సుభిక్షంగా, సంతోషంగా ఉంటుంది. కుల మత భేదాలు మరచి కలిసి ఉండటంవల్ల గ్రామానికి సకలం సమకూర్తాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తుంది. 

గ్రామ ప్రజల్లో సహకారం సమన్వయం ఐక్యత అవసరం చెప్పడానికి సినారె గారు ఈ వాక్యాన్ని అందించారు.

2. ఈ క్రింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)జీవన భాష్యం పాఠంలో సినారె అందించిన సందేశం:

మనము ఒక లక్ష్యాన్ని సాధించనీకే బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురౌతాయి ,లోకం మనల్ని భయపెడుతుంది .ఆ భయాలకు లొంగకుండా ముందుకు పోతే గెలుపు మనదే .

  • బీడు భూముల్లో ఏం పండవని నిరాశ పడకుండా కష్టపడి విత్తనాలు ఎస్తే మంచి పంట వస్తుంది.
  • నలుగురు మనుషులు కలిసి ఉంటేనే సాంఘిక జీవనం ,మన బతుకుకు ఒక అర్థం . అట్లాంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక మంచి ఊరు అవుతుంది .
  • మనం ఎంత సంపాదించినా ,ఎంత సాధించినా , కష్టాలు వస్తాయి . మనిషి ఏమి కాదని ధీమాగా ఉండకూడదు . విధి ఎప్పుడు ఎటువంటి పరీక్ష పెడుతుందో చెప్పలేం.
  • బిరుదులు సాధించామని , మంచి పేరు సాధించామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు ఉండదు . మనిషి సాటి వారికి సహాయపడి ,త్యాగాలు చేస్తేనే వారి పేరు చరిత్రలో నిలుస్తుంది .
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. 
జీవన భాష్యం గజల్ లోని అంతిప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవిత ను రాయండి

నీరవుతుంది 
దారవుతుంది 
పైరవుతుంది 
ఊరవుతుంది 
ఏరవుతుంది
పేరవంతుంది

లేదా 
ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి.

III. భాషాంశాలు

అ)మబ్బు : మేఘము, మేయిలు అంబుదము, ఘనము 

ఆ)గుండె : హృదయము, హృత్తు, ఎద డెందము

ఇ) శిరస్సు : తల, శీర్షము, మస్తకము, మూర్ధము, 

2) కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి

అ)వ్యాప్తి :  పరిమళ వాసన వ్యాప్తి చెందుతుంది.

ఆ)జంకని అడుగులు : జంకని అడుగులే ధైర్యం 

ఇ)ఎడారి దిబ్బలు : ఒంటెలు ఎడారి దిబ్బల్లో నడుస్తుంటాయి.

ఈ)చెరగని త్యాగం:  నాన్నగారి చెరగని త్యాగం వల్ల కుటుంబం గొప్ప స్థాయికి ఎదుగుతుంది.

వ్యాకరణాంశాలు

కింది పదాలు కలిపి సంధిని గుర్తించి రాయండి

నీరు + అవుతుంది = నీరవుతుంది - ఉత్వ సంధి.

ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన,- ఉత్వ సంధి

పేరు + అవుతుంది = పేరవుతుంది - ఉత్వ సంధి.

ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం.

2. కింది పంక్తులలోని పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో తెలియజేయండి.

అ)ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు 

ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు - షష్టి తత్పురుష సమాసం

ఆ)ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు - షష్టి తత్పురుష సమాసం

3. కింది వాటిని చదివి అలంకారాలో గుర్తించండి.

అ)నీకు వంద వందనాలు

జ. పై వాక్యంలో ఛేకాను ప్రాసాలంకారము ఉంది.

 లక్షణం : హల్లుల జంట అర్థ బేధంతో వెంట వెంటనే వాడితే ఛేకాను ప్రాసాలకారం అంటారు.

ఆ) తెలుగుజాతికి అభ్యుదయం 

నవభారతికే నవోదయం

        అంత్యానుప్రాసాలంకారము 

లక్షణం : పాదం చివరలో లేదా  చివర్లో  ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది అంత్యాను ప్రాసాలంకారం అంటారు.

ఇ) రాజు రివాజులు బూజు పట్టగన్ - వృత్యనుప్రాసాలంకారము.

ఈ) అజ్ఞానాంధకారం తొలగితే మంచిది రూపకాలంకారం

అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారము అనేది ఉపమానం ఇక్కడ అజ్ఞానము అంధకారము అనే ఉపమాన ఉపమేయాలకు బేధం ఉన్న లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇక్కడ రూపకాలంకారం ఉంది.

రూపకాలంకారము:  ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం రూపకాలంకారం.


డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...