పాఠం ఉద్దేశం: దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ, ఆసక్తిని పెంపొందింప చేయడం సాధారణ వార్తలకు, సంపాదకీయాలకు మధ్య ఉండే తేడాను, వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది ఈ పాఠం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకుని పత్రికలో తమ వ్యాఖ్యానంతో ఆ విషయానికి సంబంధించిన పూర్వపరాలను పరామర్శిస్తూ సాగే రచనను సంపాదకీ వ్యాసం అంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఆలోచించే విధంగా రాయగలగడం మంచి సంపాదకీయానికి గల లక్షణం. ఈ సంపాదకీయాలు, ఆయా కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో వీటిలో విభిన్న కాలాలకు అన్వర్తింపజేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2, 2014 నాడు ఇది ఒక తెలుగు దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం.
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
I. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?
జ. అది తెలంగాణ పోరాటం గమ్యాన్ని అందుకున్న శుభ సందర్భం. తెలంగాణ జాతి చరిత్రలో అదొక మహత్తరమైన క్షణం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తొలిదశ తెలంగాణ ఉద్యమం. మలిదశ తెలంగాణ ఉద్యమం అన్ని కలగలిపి కలలు సాధించుకున్న అద్భుతమైన క్షణం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మూడు తరాల పిల్లల కనుల నుండి భావోద్వేగంతో ఆనంద భాష్పాలు వర్షించాయి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు తెలంగాణ ప్రజల ఎదలపై ఆర్ద్రంగా మారాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో అద్భుత ఘట్టంగా అనుకుంటున్నారు.
ఆ) ప్రస్తుత సంపాదకీయ వ్యాసం లోని భాష శైలి ఎట్లా ఉన్నది?
జ. సంపాదకీయమంటే సమాజ దర్పణం సంపాదకీయం సృజనాత్మక శైలి రచన సరళంగాను, సూటిగాను, నిష్కర్షగా ప్రాధికారికంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. సంక్లిష్టమైన అంశాలను జన భవిష్యత్తును వర్తమానాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలను విశ్లేషించి, ఉత్తమమైన దానిని పరిచయం చేస్తూ పాఠకుడి కందివ్వాలి. సంపాదకీయాల్లో ఆసక్తి కలిగించే ఎత్తుగడ, వివరణ తప్పనిసరి. ఆలోచించే ముగింపు అవసరం. పత్రిక హృదయమే సంపాదకీయ వ్యాసం. ఒకప్పటి పద్యాలు, శ్లోకాలు వివరణలు కొంచెం లోపించాయి అని చెప్పవలసి ఉంటుంది. సృజనాత్మక శైలి ఎక్కువగా సంపాదకీయాల్లోనూ ప్రత్యేక వ్యాసాల్లోను కనిపిస్తున్నది.
ఇ) సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు?
సంపాదకీయాలు పత్రికల్లో అతి ముఖ్యమైన రచన. సంపాదకీయమంటే పత్రిక హృదయమని కొందరు చెప్తారు. ప్రజల అభిప్రాయాలు వ్యాఖ్యానించి అర్థం చేయించి, మార్గదర్శనం చేసేందుకు వివిధ సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపజేసేందుకు సంపాదకీయం రాస్తారు. తక్షణ సమస్యలపై తాజా వార్తలపై, సంఘటనలపై చేసే పరిశోధన ఆలోచనల వాక్యాన్ని సంపాదకీయంలో ఆసక్తిని కలిగించే ఎత్తుగడ, వివరణ, ముగింపు ఉంటాయి. సంపాదకీయాలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. తక్కువ మాటల్లో పాఠకులను ఆలోచింపజేసేటట్లు ఆకట్టుకునేటట్లు సంపాదకీయాలు రాస్తారు. సంపాదకీయ వ్యాసాలు ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాయి.
ఈ) పత్రికల్లోని సంపాదకీయాలకు సాధారణ వార్తాంశాలకు మధ్యలో ఉన్న భేదాలు ఏవి?
జ. పత్రికల్లో సంపాదకీయాలకు సృజనాత్మక శైలి వాడడం వలన పాఠకులు ఇష్టంగా చదువుతారు
వార్త రచనలో కల్పనలకు, అభిషేక్తులకు, ఊహలకు చోటు ఇవ్వరాదు. ప్రజల పట్ల ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల బాధ్యత కలిగి వార్తా రచన చేయాలి. సంపాదకీ రచన సరళంగా సూటిగా నిష్కర్షగా సాధికారికంగా సులభ గ్రాహ్యంగా
ఉండాలి. వార్త వ్యాసాలలాగే సంపాదకీయాలు కూడా ఆసక్తిని కలిగించే అవసరం ఉంది. చిన్న పదాల్లో చెప్పదగిన భావాన్ని చిన్న మాటల్లోనే సూచించాలి. పెద్ద మాటలను అనవసరంగా ఉపయోగించకూడదు.
సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు?
జ: పత్రికకు ప్రాణవాయువు సంపాదకీయం. జరిగిన సంఘటనలను పత్రికలో యథావిధిగా పాఠకులు నేరుగా తెలుసుకుంటారు. కానీ, దాని పూర్వాపరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలను సంపాదకీయాలు తెలియజేస్తాయి.
2. కింది ప్రశ్న కు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
1. సంపాదకీయ వ్యాసం అనగా నేమి?
లేదా
2. సమకాలీన ప్రతి బింబం - "సంపాదకీయ వ్యాసం" వివరింపుము
లేదా
3. సంపాదకీయ వ్యాసం వల్ల ప్రయోజనం ఏమి?
లేదా
"నేటి సమాజానికి సంపాదకీయ వ్యాసమే మేలుకొలుపు " - విశ్లేషించండి.
పై 4 ప్రశ్నలకు జవాబు
జ. సమకాలీన సంఘటనలలో మానవ జీవితం నుంచి విడదీయలేని అతి ముఖ్యమైన అంశాలను, తీసుకొని వ్యాఖ్యాన రూపంతో పూర్వపరాలను పరామర్శిస్తూ, విశ్లేషణ చేస్తారు.
అనేక అంశాలతో ముడిపడి ఉన్న సంఘటన ఉదహరిస్తూ వీటి ద్వారా వచ్చే ఫలితాన్ని విశ్లేషిస్తూ సోదాహరణంగా సాగే రచనను సంపాదకీయ వ్యాసం అని అంటారు.
సంపాదకీయ వ్యాసం పత్రిక యొక్క ప్రాణాత్మదేహాలుగా పరిగణించవచ్చు.
సంపాదకీయ వ్యాసం రాసేటప్పుడు ప్రముఖుల మాటల్ని ఉదహరిస్తారు. లోకంలో ప్రసిద్ధమైన సామెతలను అతికినట్టుగా వాడుతారు.
తదనుగునమైన నిర్వచనాలను వివరిస్తారు. ఉపోద్ఘాతం ముడిబడి ఉన్న చారిత్రక అంశాలను, వర్తమాన వాస్తవికతలను వివరిస్తూ భవిష్యత్తును అంచనా వేస్తారు. ఫలితాలను క్రోడీకరిస్తారు. అల్పాక్షరాల్లో అనాల్పార్థ రచన చేస్తూ పాఠకులను ఆకట్టుకుంటారు.
అంశము అంశ స్వభావాన్ని పరిధిని విస్తృతిని వివరిస్తారు.
లోతైన విశ్లేషణతో మార్మికమైన రహస్యాలను బట్టబయలు చేస్తారు.
ఉదాసీన వైఖరి విడనాడు మని బోధిస్తారు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలని దిశానిర్దేశం చేస్తారు. ఉత్పాతాలను గ్రహించమని చదువువరులకు ఆలోచింపజేయగలిగే మేధస్సును అందజేస్తారు. అలా ఆలోచింపజేయగలడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి ఆయా కాలాలకు సంబంధించినవే అయినప్పటికీ ఒక్కొక్క సందర్భంలో వివిధ సంబంధాలకు, అనుబంధ సంఘటనలకు, విభిన్న కాలాలకు అనవర్తింపజేసుకోవచ్చు. సంపాదకీయ వ్యాసం తత్కాలానికి సంబంధించిన అయినా విభిన్న కాలాలకు కూడా చెందుతుంది
అలాంటి గొప్ప సంపాదకీయ వ్యాసాలలో ఒకటైనది లక్ష్యసిద్ధి వ్యాసం తెలంగాణ ఏర్పాటును పురస్కరించుకుని జూన్ 2 2014 రోజున వెలువడిన వ్యాసం.
పత్రికా వార్తలకు సంపాదకీయ వార్తలు తేడా ఏమిటి
సాధారణ వార్తలు
1. సమకాలీన ప్రపంచంలో జరిగిన అనేక విషయాలు వార్తలుగా రాస్తారు
2. జరిగిన సంఘటన మాత్రమే లిఖిస్తారు.
3. జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగానే వివరిస్తారు.
4. వింతలు విశేషాలు జయాపజయాలు మొదలగునవి సహజంగా చిత్రీకరిస్తారు
5. వార్తాంశం పత్రికల్లో ఒక భాగం మాత్రమే భాష సరళంగా మామూలు శైలిలో సాగుతుంది.
6. ఈ వార్తల్ని విలేకరులు సేకరించి రాస్తారు సాధారణ అంశాలు చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది తెలియజేస్తాయి.
సంపాదకీయ వ్యాసాలు:
1. సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటికి తీసుకొని వ్యాఖ్యల రూపంలో సంక్షిప్తంగా రాస్తారు.
2. ఆసక్తిని కలిగించే వ్యూహాత్మక ఎత్తుగడ స్పష్టమైన వివరణ సమర్థవంతమైన ముగింపు అవసరం.
3. సంపాదకీయాల వల్ల సమాజానికి జరిగే మంచి చెడులను బాధ్యతాయుతంగా విశ్లేషిస్తారు ఆలోచన రేకెత్తిస్తారు.
4. ఇందులో 1000 పదాలు మించకుండా పత్రికా హృదయం సామాజిక దృక్పథంతో ఆవిష్కరించబడుతుంది.
5. భాష సరళంగా సూటిగా స్పష్టంగా ఉంటుంది సృజనాత్మక శైలిలో సంపాదకీయం కొనసాగుతుంది.
6. సంపాదకుడు లేదా సంపాదకమండలి సమాజ చైతన్యానికి తోడ్పడే విధంగా రాస్తారు.
III. భాషాంశాలు
పదజాలం
కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
ఆ) ముసురుకొను : కొన్ని జ్ఞాపకాలు మనసుపై ముసురుకుంటాయి.
ఇ) ప్రాణం పోయు : శిల్పి శిల్పానికి ప్రాణం పోస్తాడు.
ఈ) గొంతు వినిపించు : నల్ల జాతి తరపున మైకేల్ జాక్సన్ గొంతు వినిపించారు
ఉ) యజ్ఞం: వర్షాలు రావాలని ప్రజలు వరుణ యజ్ఞం నిర్వహించారు.
కింది పదాలకు పర్యాయపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
తారలు చుక్కలు నక్షత్రాలు వాక్య ప్రయోగం ఆకాశంలోని నక్షత్రాలు మల్లెలు వెదజల్లినట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా
అ)జ్ఞాపకం : జ్ఞప్తి, స్మృతి
నా చిన్ననాటి సంగతులు నాకు జ్ఞప్తికి రావడం లేదు.
పోరాటం : యుద్ధం, సమరం, రణం
వాక్య ప్రయోగం: అన్నదమ్ముల మధ్య సమరం మంచిది కాదు.
విషాదం : ఖేదం, దుఃఖం
వాక్య ప్రయోగం: కోరిక వలనే దుఃఖం కలుగుతుందని గౌతమ బుద్ధుడు చెప్పాడు.
సంస్కరణ: సంస్కారం, సంస్క్రియ
వాక్య ప్రయోగం: దేశాభివృద్ధికి ఉత్తమ సంస్కారాలు అమలు చేయాలి.
వ్యాకరణాంశాలు
ప్రత్యక్ష పరోక్ష కథనం లోకి మార్చడం
రాజకీయ పార్టీల వారు "జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర" అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (ప్రత్యక్ష వాక్యం)
రాజకీయ పార్టీల వారు జనానికి కావాల్సింది కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. (పరోక్ష వాక్యం)
"సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని నెహ్రు అన్నారు (ప్రత్యక్ష కథనం)
సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతును వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు. (పరోక్ష కథనం)
పరోక్ష కథనం ప్రత్యక్ష కథనం లోకి మార్చడం
పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు (పరోక్ష కథనం)
"పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం" అని ముఖ్యమంత్రి ప్రకటించాడు (ప్రత్యక్షకథనం)
సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి అని మేధావులు నిర్ణయించారు (పరోక్ష కథనం)
"సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి" అని మేధావులు నిర్ణయించారు (ప్రత్యక్ష కథనం)
తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడనని టీవీ ఛానల్ లో ప్రసారం చేశారు. (పరోక్ష కథనం)
"తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి" అని టీవీ ఛానల్ లో ప్రసారం చేశారు. (ప్రత్యక్ష కథనం)
2. కింది పదాలను విడదీసి సంధులు గుర్తించి సూత్రాలను రాయండి.
ప్రపంచమంతా = ప్రపంచము + అంతా = ఉత్వ సంధి.
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం.
అత్యద్భుతం = అతి + అద్భుతం = అత్యద్భుతం - యణాదేశ సంధి.
సూత్రం: ఇ, ఉ, రు,లకు అసవర్ణంలైన అచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశం గా వస్తాయి.
సచివాలయం = సచివ + ఆలయం = సచివాలయం - సవర్ణదీర్ఘ సంధి
సూత్రం: ఆ ఈ ఊ రూ లకుఅవే అచ్చులు పరమైతే సవర్ణదీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
కింది పదాలను విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి.
బృహత్కార్యం బృహత్తు అయిన కార్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
శక్తి యుక్తులు : శక్తియును, యుక్తియును - ద్వంద్వ సమాసం.
సంక్షేమ పథకాలు : సంక్షేమం కొరకు పథకాలు - షష్టి తత్పురుష సమాసం.
అతిశయోక్తి అలంకారం:
ఏదైనా ఒక వస్తువును గాని, విషయాన్ని గాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం.
డాక్టర్ సిద్దెంకి యాదగిరి
9441244773
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి