సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

కరపత్రం ఎలా రాయాలి


కరపత్రం ఎలా రాయాలి 

కరము =  చేతి 
పత్రము= వ్రాతతో పత్రమును వ్రాయడం. 
పూర్వకాలంలో కరపత్రాన్ని చేవ్రాతతో రాసేవారు
దీనినే కరపత్రం అంటారు. ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేసి పంచుతున్నారు.
కరపత్రంలో ముందుగా టైటిల్ ఎంపిక చాలా ముఖ్యం. ఇది కరపత్రంలోని సారాంశమును ప్రతిబింబించేలాగా ఉండాలి.


కరపత్రం యొక్క లక్షణాలు:
పైన ఎడమవైపున తప్పనిసరిగా తేదీ రాయాలి.
శీర్షిక లేదా టైటిల్ అతి ముఖ్యం.
క్లుప్తంగా వివరిస్తూ సందర్భం తెలియజేయాలి.
ఆకర్షనీయంగా ఉండాలి. 
పాఠకునికి సరళంగా అర్థం అవుతుంది.
అవగాహన కలుగుతుంది.
ఆంగ్లంలో దీనిని పాంప్లీట్ అంటారు.


 

                                                                                                      తేది:23-09-23.

చదవండి !                                                                ఎదగండి !

 

పరిసరాల పరిశుభ్రత


రోగం వస్తే చేంతాడు క్యూలో నిలబడి, డాక్టరును కలిసి మందులు కొనుక్కొని మింగుతాం. అసలు రోగాలెందుకు వస్తున్నాయి? దానికి మనం ఎంతవరకు కారణం అని ఆలోచించం. నిజంగా ఆలోచిస్తే మన ఇంటిచుట్టూ పరిసరాల శుభ్రత లేకపోవడం వల్లే, ఈ రోగాలు మనపై దండయాత్ర చేస్తున్నాయి.

మనం ఇల్లు తుడిచి ఆ తుక్కు పక్క ఇంటి వాని గుమ్మం ముందు వేస్తాం. మన ఇంట్లోని మురికినీరు రోడ్లపైకి వదలివేస్తాం. మనకు పనికిరాని వస్తువులు రోడ్లపైకి విసరుతాం. మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. దోమల వల్లే మనకు సగం రోగాలు. అందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మందులూ, డాక్టర్లూ అవసరం ఉండదు. పరిసరాల పరిశుభ్రత పాటించండి. మందుల అవసరం తగ్గించండి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు మానండి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోండి.   మా మాట వినండి.


.

ఇట్లు,
పాఠశాల ఆరోగ్యసమితి.

ఇందిరానగర్.

 


స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.
ఇట్లు,
మహిళా రక్షణ సమితి.









స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.


ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.


ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
సిద్దిపేట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...