- అధికారిక లేఖ : ఏ రకమైన వ్యాపార లేఖ లేదా అధికారులకు లేఖ అయినా ఈ అందించిన వర్గంలోకి వస్తాయి.
- అనధికారిక లేఖ : ఇవి వ్యక్తిగత లేఖలు. వారు ఎటువంటి సెట్ నమూనాను అనుసరించాల్సిన అవసరం లేదు లేదా ఏదైనా ఫార్మాలిటీలకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. అవి వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయి లేదా వ్రాతపూర్వక సంభాషణ. అనధికారిక లేఖలు సాధారణంగా స్నేహితులు, పరిచయస్తులు, బంధువులు మొదలైన వారికి వ్రాయబడతాయి.
- వ్యాపార లేఖ : ఈ లెటర్ బిజినెస్ కరెస్పాండెంట్‌ల మధ్య వ్రాయబడింది, సాధారణంగా కొటేషన్లు, ఆర్డర్‌లు, ఫిర్యాదులు, క్లెయిమ్‌లు, సేకరణల కోసం లేఖలు మొదలైన వాణిజ్య సమాచారాన్ని కలిగి ఉంటుంది. అలాంటి లేఖలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా అధికారికంగా ఉంటాయి మరియు ఫార్మాలిటీల నిర్మాణం మరియు నమూనాను అనుసరిస్తాయి.
లేఖా రచన విధానం (ఉత్తరాలు వ్రాయడం )
అందరికి
అర్ధమయ్యే తేలికభాషలో ఉత్తరాలు వ్రాయటం ఓక కళ. ఈ లేఖలను, సాంఘిక లేఖని, వ్యవహార లేఖలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ లేఖారచనలో రెంటికి
ఒకే పద్దతి అనుసరించారాదు .కాబట్టి ఎవరెవరికి ఏయే రీతిలో ఉత్తరాలు వ్రాయాలో తెలుసుకోవాలి లేఖను
ప్రారంభించే సందర్బంలో లేఖకు కుడిప్రక్క పై భాగంలో తానున్న ఊరు తేది వ్రాయాలి.
సాంఘిఖలేక
మిత్రులకు ,
బందువులకు
రాసే లేఖలు,
పెండ్లీ, పుట్టినరోజు మొదలైన శుభకార్యాలకు, బంధువులకు,స్నేహితులకు పంపే పిలుపు పత్రికలూ మొదలైన
వాటిని సాంఘిఖ లేఖలంటారు.
సాంఘిఖ
లేఖలోతల్లితండ్రులకు రాసే సందర్భాలో ప్రారంభంలో :
పూజ్యులయిన
నాన్న గార్కి,
ప్రియమైన
నాన్న గార్కి,
ప్రియమైన
అమ్మ (తల్లి) గార్కి,
మిత్రులకు
అయితే !
ప్రియ
మిత్రుడికి
ప్రాణ
స్నేహితునికి శ్రీ ..........కు
పరిచయము
లేనివారైతే:
అయ్యా!-
అమ్మా!---అని
సంభోధించాలి
పూర్వం మనదేశ ఆచారాన్ని బట్టి పెద్దవారికైతే
"మహారాజశ్రే" "బ్రహ్మశ్రే" "శ్రీ వెదమూర్తులు"
మొదలయిన మాటలు ఉపయోగిస్తారు. అలాగే స్త్రీలకు రాసే సందర్భాల్లో "మహాలక్ష్మి
సమానురా" లనీ."శ్రీమతి" భర్త చనిపోయినవారికైతే "గంగాభగీరధీ
సమానురాలైన" అని మొదలైన వాటిని ఉపయోగిస్తారు.చిన్నవారైతే "చిరంజీవి'అని పేర్లకు ముందు చేరుస్తారు. తనకంటె పెద్దలైన
వారికి నమస్కారాలు: వందనాలు అని చెప్పాలి.తనకంటే ఛిన్నవారికి రాసే సందర్భాల్లో 'గ్రహింపవలయును'. ఇట్లు" శ్రేయోభిలాషి' అని వ్రాయాలి.
(1) మాదిరి సాంఘిక లేఖలు
తేది:05-09-2023,
సిద్దిపేట.
ప్రియమైన
నాన్నగారికి,
తమ కుమారుడు అనిల్ కుమార్ నమస్కరించి వ్రాయు ఉత్తరము. ఉభయకుశలోపరి.
మాకు
సంవత్సరాంత పరీక్షలు ఏప్రిల్ నెలలో జరుగు తున్నాయి బాగా చదువు చున్నాను, పరీక్ష ఫీజు కట్టుటకు పం రూపాయలు పంపవసిందిగా
ప్రార్దిస్తున్నాను.
చిత్తగించవలెను.
ఇట్లు
హర్షవర్ధన్.
చిరునామా: ఇం. నెం.3-5, సుభాష్ నగర్, హైద్రాబాద్ - 500301 |
(2) మాదిరి సాంఘిక లేఖలు
తేది:
23-09-23,
సిద్దిపేట.
ప్రియమైన స్నేహితురాలు గీతశ్రీ కి,
ప్రేమాభివందనాలు.
ఉభయకుశలోపరి.
నీను
సంక్రాంతి సెలవులకు హైద్రాబాద్ కి వస్తాను. ఇద్దరము కల్సి ఛార్మినార్ మొదలైన చూద్దాం.
ఇందిరా పార్క్ ఇంకా
ఎన్నో ఎన్నో చూస్తూ సంతోషంగా గడుపుదాం నీవు కూడా పరీక్షలు బాగా వ్రాయి అమ్మకు
నాన్నకు నమస్కారములు తెలుపు.
ఇట్లు
.నందిని
చిరునామా: ఇం. నెం.3-5, సుభాష్ నగర్, హైద్రాబాద్ - 500301 |
శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జ:
సిద్దిపేట ,
--/--/2023.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.
అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :
పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.
అలవర్చుకోకూడని గుణాలు :
విష్ణు భక్తులను నిందించరాదు.
భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
సజ్జనులను మోసం చేయరాదు.
దేవతామాన్యములను ఆక్రమించరాదు.
అసత్యాన్ని పలకరాదు.
మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.
ఇట్లు,నీ మిత్రుడు,X X X X X.
చిరునామా :
పి. అంజిరెడ్డి , 10వ తరగతి, జిల్లాపరిషత్ హైస్కూల్, ఇందిరానగర్, సిద్దిపేట (జిల్లా.) |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి