సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు?
సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.
కొత్త పొస్ట్
18, సెప్టెంబర్ 2023, సోమవారం
X. 8. లక్య సిద్ధి
X 7. శతక మధురిమ
7. శతక మధురిమ పరీక్ష
సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్య పాదం చివర ఉంటుంది అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్య భాగంలో సర్వేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, మల్లభూపాలీయ, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర, లొంక రామేశ్వర, వేణుగోపాల శతక పద్యాలు ఉన్నాయి.
మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి? ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? స్నేహితులు ఎట్లా ఉంటారు? భగవంతుని గుణాలు భక్తులతో ఎట్లా ఉండాలి? కీర్తిమంతుడు ఎవరు? మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి? అని తెలుపుతూ వివిధ శతక కర్తలు రాసిన పద్యాలను ఈ పాఠంలో గలవు.
|
మత్తేభం
|
||||||
|
స |
భ |
ర |
న |
మ |
య |
వ |
|
I I U |
U I I |
U I U |
I I I |
U U U |
I U U |
I U |
|
భ వ దీ | యార్చన |
సేయుచోఁ |
ప్ర థమ |
పు ష్పంబె |
న్నసత్యం |
బు, రెం |
|
శార్ధూలమ్ షట్కాట్ : మా సభ (ఫోర్టీన్) 14 1వ అక్షరానికి 14 కి యతి మైత్రి సభరణమయవ అను గణాలుండును. మొత్తం అక్షరాలు 20 నాలుగు పాదములుండును ప్రాస నియమం కలదు |
||||||
7. శతక మధురిమ పరీక్ష
|
శార్ధూలమ్
|
||||||
|
మ |
స |
జ |
స |
త |
త |
గ |
|
U U U |
I I U |
I U I |
I I U |
U U I |
U U I |
U |
|
ఊ రూ రం |
జ ను లె |
ల్ల బి క్ష |
మి డ
రో, |
యుండం |
హ ల్గ ల్గ |
వో |
|
||||||
శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరా !ఊరూరన్ = ప్రతి గ్రామములోనూజనులు + ఎల్లన్ = ప్రజలందరూభిక్షము + ఇడరో = అడిగితే భిక్షము పెట్టరా ?ఉండన్ = నివసించడానికిగుహల్ = గుహలుకల్గవు+ఓ = కలిగి లేవాచీరానీకము(చీర + అనీకము) = వస్త్రముల గుంపువీథులన్ = వీధులలో (అంగళ్ళలో)దొరకదో = దొరకవా ?శీతామృత స్వచ్ఛవాః పూరంబు ;శీత = చల్లనిఅమృత = అమృతము వంటి తియ్యనిస్వచ్ఛ = నిర్మలమైనవాఃపూరంబు = జలప్రవాహముఏఱులన్ = సెలయేళ్ళలో(పాఱదు + ఓ) = ప్రవహించడం లేదా ?తపసులన్ = తపశ్శాలులనుబ్రోవంగన్ = రక్షించడానికినీవు = నీవుఓపవో(ఓపవు + ఓ) = సమర్థుడవు కాదా ?జనుల్ = ప్రజలురాజులన్ = రాజులనుచేరన్ = సమీపించడానికిపోవుదురు + ఏల = ఎందుకు పోతారో కదా! !
|
మత్తేభం
|
||||||
|
స |
భ |
ర |
న |
మ |
య |
వ |
|
I I U |
U I I |
U I U |
I I I |
U U U |
I U U |
I U |
|
సి రి లే |
కై న వి |
భూ షితుం |
డె యయి |
భా సి ల్లు |
బు ధుం డౌ |
ద లన్ |
స,భ, ర న మ య వ అను గణాలుండును. నాలుగు పాదములుండును
|
||||||
ఉ. 7. శతక మధురిమ పరీక్ష
|
ఉత్పలమాల
|
||||||
|
భ |
ర |
న |
భ |
భ |
ర |
వ |
|
U I I |
U I U |
I I I |
U I I |
U I I |
U I U |
I U |
|
భం డ న |
భీ ముఁ
డా |
ర్థ జ న |
బాంధ వుఁ |
డు జ్వ ల |
బా ణ తూ |
ణ కో |
|
ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10 1. చంపకమాల లక్షణాలు : (వృత్త పద్యం) 2. ఇందులో 4 పాదాలుంటాయి. 3. న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు (21 అక్షరాలు) ఉంటాయి. 4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
5. ప్రాసనియమం ఉంటుంది. |
||||||
|
మత్తేభం
|
||||||
|
స |
భ |
ర |
న |
మ |
య |
వ |
|
I I U |
U I I |
U I U |
I I I |
U U U |
I U U |
I U |
|
ఘ ను డ |
వ్వా డగు, |
వే డుత్యా | గమయ |
దీ క్షం బూ |
ని స ర్వం |
స హా |
|
శార్ధూలమ్ షట్కాట్ : మా సభ (ఫోర్టీన్) 14
|
||||||
శార్ధూలమ్
|
మ |
స |
జ |
స |
త |
త |
గ |
|
U
U U |
I I U |
I U I |
I I U |
U U I |
U
U I |
U |
| పొ త్తంబై |
|
ర్పుతో హి | త ము ను | ద్భో దించు | మిత్రుండు, |
|
|
శార్ధూలమ్
షట్కాట్ : శా మస (తర్థీన్) 13
|
||||||
I. అవగాహన ప్రతి స్పందన
1. శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయని భావిస్తున్నారా? ఎందుకు చర్చించండి.
2. కింది భావమున్న పద్య పాదాలను పాఠంలో గుర్తించండి.
అ) మిత్రుడు యుద్ధరంగంలో కత్తి వలే ఉపయోగపడతాడు.
రాముని మించిన దైవం లేదన చాటుతాను.
3. విద్వాన్ కల్వకుంట కృష్ణమాచార్య రచించిన కింది పద్యాన్ని చదవండి భావాన్ని సొంతమాటల్లో రాయండి పద్యానికి తగినట్టు శీర్షికను పెట్టండి.
అనుభవమున్న నేర్చిన యట్టి చదువు
తండ్రి వలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ - కాపాడు తల్లి వోలే
భావం : అనుభవమే ఆసరా
అనుభవం ద్వారా నేర్చుకున్న చదువు మనిషికి తండ్రిలా ముందు నిలబడి కాపాడుతుంది. పడిన కష్టాలు వృథా కావు. అవే గుణపాఠాలై మళ్ళీ తప్పులు చేయకుండా కాచుకుంటాయి. ఆ కష్టాల నుండి వచ్చిన స్ఫూర్తి తల్లిలా మనిషిని లేపి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి జీవితంలో అనుభవమే నిజమైన తల్లిదండ్రులు రక్షించడానికి తండ్రి, ప్రేరేపించడానికి తల్లి.
శీర్షిక: అనుభవమే ఆసరా
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
1.కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
(లేదా)
కీర్తివంతుని లక్షణాలను పాఠం ఆధారంగా వివరించండి.
జ.:త్యాగం గుణం కల్గి జనులందరి దీనస్థితిని రూపు మాపి, అందరికి సుఖమయమైన, ఆనందకర జీవిత సుఖాన్ని పంచి, మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరయితే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు. అపూర్వమైన కీర్తిమంతులవుతారు. ఈ పై లక్షణాలన్ని అపూర్వ కీర్తిమంతునికి ఉండాలని నా అభిప్రాయం.
ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి ?
(లేదా)
త్యాగి లక్షణాలను వివరించండి.
త్యాగి లక్షణాలు
జ..నిజమైన త్యాగి తన సర్వస్వాన్ని ధారపోయటానికి కూడా ఇష్టపడతాడు. అడిగితే కాదనకుండా ఇస్తాడు. తనకిష్టమైనా సరే తృణప్రాయంగా భావించి ఇస్తాడు. ఇది చాలా గొప్ప విషయం.
అతడు తన ప్రాణాలు కూడా లెక్కచేయడు.
గొప్ప కోసం చూడడు.
కీర్తి ప్రతిష్ఠలను కూడా లెక్కచేయడు.
తన సర్వసాన్ని ఇచ్చివేస్తాడు. ఇవి త్యాగి లక్షణాలు.
ఉదా : కర్ణుడు, బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి మొదలగువారు.
ఇ) మిత్రుడు పుస్తకంవలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలవు ?
జ. మంచి స్నేహితుని మించిన పుస్తకం:
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. మంచి స్నేహితుని మించిన పుస్తకం లేదు. పుస్తకం అంటే విజ్ఞానం. ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకంలో చూసుకొంటాం లేదా స్నేహితులను అడుగుతాం. పుస్తకం మనకు కథల రూపంలో మంచి మంచి నీతులను చెబుతుంది. జీవితంలో ఉపయోగించే ఎన్నో మంచి విషయాలను చక్కటి పదాలతో చెబుతుంది.
అలాగే స్నేహితుడు కూడా ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. తప్పు చేస్తుంటే చేయవద్దు అంటాడు. మనకు వినసొంపైన మాటలతో మంచిని చెబుతాడు. కష్టకాలంలో తోడుగా నిలబడతాడు. తప్పుచేస్తే పరిహారం కూడా చెబుతాడు. అందుకే స్నేహితుడు మంచి పుస్తకం వలె మంచి మార్గం చూపిస్తాడు అంటారు.
ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా ! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జ. ఏకాగ్రత అవసరం. శ్రద్ధ చాలా అవసరం. ఉత్సుకత, కార్యదీక్ష కూడా అవసరం “శ్రద్ధయా వర్థతే విద్య”. విద్యార్థికి అలసత్వం పనికిరాదు. “అలసతకూడదు ఇంచుక అధ్యయనంబున, బోధనంబునన్” అని ఒక ప్రసిద్ధ కవి అన్నాడు. వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా చాలా అవసరం. పట్టుదల సాధించాలనే తపన ఉండాలి. వీటితోపాటుగా శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం.
2. క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి.
(లేదా)
శతక పద్యాల్లోని నీతులు జగతికి మార్గదర్శకాలు ఎలా అవుతాయో విశ్లేషించండి.
జ. శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో చాలా ఉపయోగ పడతాయి. ఎలాగంటే ……. సర్వేశ్వర శతకంలోని ‘భవదీయార్చన……….` అనే పద్యంలో దేవుని పూజించడానికి సత్యం, దయ, ఏకాగ్రత అనే లక్షణాలు ఉండాలన్నారు.
సత్యం మాట్లాడే లక్షణం అలవాటైతే మోసంచేసే ఆలోచన రాదు. అందుచేత గౌరవం పెరుగుతుంది. దయ కలిగి ఉంటే, కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తాము. దాని వలన సమాజంలో స్నేహభావం పెరుగు తుంది. కక్షలు కార్పణ్యాలూ ఉండవు.
ఏకాగ్రత కలిగి ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఏ విషయమైనా అర్థమవుతుంది. తెలివి పెరుగుతుంది. తెలివైన సమాజం సంపదలను అభివృద్ధి చేస్తుంది. దరిద్రం ఉండదు. కరవుకాటకాలు ఉండవు.
శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘ఊరూరం జనులెల్ల ……….’ అనే పద్యంలో చక్కటి నీతులు ఉన్నాయి. అవి అర్థం చేసుకొంటే ‘నేను, నావాళ్ళు’ అనే స్వార్థం పోతుంది. సంపాదన మాత్రమే జీవితం కాదని తెలుస్తుంది. భగవంతునిపైన నమ్మకం పెరుగుతుంది. ఉత్తమమైన సంస్కారం కలుగుతుంది.
‘సిరిలేకైన విభూషితుండె’ అనే పద్యంలో గురువులను గౌరవించాలని చెప్పారు. ఈ రోజులలో గురువులంటే గౌరవం తగ్గుతోంది. దానగుణం కావాలన్నారు. దానగుణం ఉంటే దొంగతనాలు, దోపిడీలు ఉండవు. మంచి విషయాలను వినాలన్నారు. మంచి విషయాలను వింటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచిపనులు చేస్తాం. మంచి సమాజం ఏర్పడుతుంది. మనసులో సౌజన్యం ఉండాలన్నారు. మనసులో సౌజన్యం ఉంటే ఎవ్వరిపైనా కోపం, ద్వేషం ఉండవు. అందరూ నావాళ్ళే అనే భావం కలుగుతుంది. గొడవలకు అవకాశం లేదు. అందుచేత శతక పద్యాలలో చెప్పిన నీతుల వలన అనేక ప్రయోజనాలున్నాయి.
3. క్రింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
అ) శతక మధురిమ పాఠం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి.
జ:
సిద్దిపేట ,
--/--/2023.
ప్రియమైన మిత్రునకు,
ఉభయకుశలోపరి. నేను 10వ తరగతి చదువు చున్నాను. మన 10వ తరగతిలోని 7వ పాఠం “శతక మధురిమ” చాలా బాగుంది. ఈ పాఠంలో మంచి గుణాలు, ఉండకూడని గుణాలు మా పంతులుగారి ద్వారా తెలుసుకున్నాను. వాటిని ఇక్కడ రాస్తున్నాను.
అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు :
పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఉండాలి. ఇవి లేని పూజ వ్యర్ధం.
రాజులను ఆశ్రయించరాదు. అది నరకంతో సమానం.
శ్రద్ధ, దానగుణం గల సత్యవ్రతుడు సంపదలు లేకపోయినా ప్రకాశిస్తాడు.
మిత్రుడు మంచి పుస్తకంలాగా, ధనంలాగా, సహాయపడతాడు నిండు మనస్సుతో సుఖాన్ని ఇస్తాడు.
అలవర్చుకోకూడని గుణాలు :
విష్ణు భక్తులను నిందించరాదు.
భిక్షం ఇచ్చేవారిని ఆపకూడదు.
సజ్జనులను మోసం చేయరాదు.
దేవతామాన్యములను ఆక్రమించరాదు.
అసత్యాన్ని పలకరాదు.
మాయమాటలు చెప్పరాదు. లంచాలకు విలువ ఇవ్వరాదు. చెడు ప్రవర్తనతో తిరగరాదు.
మీ పాఠంలో నీవు తెలుసుకున్న విషయాలు తెలియపరచగలవు.
ఇట్లు,నీ మిత్రుడు,X X X X X.
|
చిరునామా :
పి. అంజిరెడ్డి , 10వ
తరగతి, జిల్లాపరిషత్ హైస్కూల్, ఇందిరానగర్, సిద్దిపేట
(జిల్లా.) |
(లేదా)
ఆ) ఏదైనా ఒక పద్యభావం ఆధారంగా నీతికథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
6వ పద్య భావం ఆధారంగా నీతి కథ
త్యాగం: అన్ని సద్గుణాల్లోను ‘త్యాగం’ ఎంతో గొప్పది. ఇది మానవుడికి అజరామరమైన కీర్తిని సంపాదించిపెడుతుంది. మనం కన్న సంతానం కన్నా, మనం సంపాదించిన ధనం కన్నా, మనం చేసిన మంచి పనుల కన్నా, శాశ్వతత్వాన్ని సమకూర్చి పెట్టేది త్యాగం ఒక్కటే! అందుకనే “నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకేన అమృతత్వమానసు” అని వేదం ఘోషిస్తుంది. దానం – త్యాగం ఈ రెండూ దగ్గర లక్షణాలు కలవిగానే కనిపించినా రెండింటిలో చాలా తేడా ఉంది. తన దగ్గరవున్న దానిలో ఇతరులకు ఇవ్వడం దానం.
తనకు మిక్కిలి అవసరమైనదని తెలిసికూడా, దానిని లెక్కపెట్ట కుండా ఇతరు లకు ఇచ్చేయడం త్యాగం. భారతీయ సంస్కృతి ఈ త్యాగానికి పెద్దపీట వేసింది. త్యాగధనుల్ని ప్రాతః స్మరణీయులుగా భావించి నిత్యం ఆరాధించింది. అలాంటి త్యాగానికి సంబంధించిన ఎన్నో కథల్లో భాగవతంలోని ‘రంతిదేవుని” చరిత్ర వినదగ్గది. రంతిదేవుడు గొప్ప మహారాజు. తన దగ్గర వున్న సంపదనంతా ప్రజలకు దానం చేశాడు.
చివరకు ఏమీలేని నిర్ధన స్థితిలో భార్యాబిడ్డలతో మిగిలి పోయాడు. తినడానికి, తాగడానికి ఏమీ లభించని పరిస్థితిలో నలభై ఎనిమిది రోజులు గడిపాడు. అప్పుడు ఆయన ముందు ఆకస్మాత్తుగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. నకనకలాడే భార్యాబిడ్డలతో ఆ ఆహారాన్ని తీసుకోడానికి సిద్ధపడ్డాడు.
అంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘అయ్యా! ఆకలితో బాధ పడుతున్నాను. నాకేమైనా పెట్టండి’ అని దీనంగా అడిగాడు. రంతిదేవుడు ఆ పరిస్థితిలో కూడా అతడికి సగభాగం యిచ్చేశాడు. ఆ తరువాత మరొక అతిథి వచ్చాడు. అతడికి తన దగ్గరవున్న సగభాగం యిచ్చాడు.
వరుసగా వచ్చి అడిగే ఆర్తులతో ఆహారం అయిపోయింది. చివరకు పానీయం మాత్రమే మిగిలింది. కనీసం ఆ నీరైనా తాగి ఆకలిని తీర్చుకుందామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ దాహార్తుడు వచ్చి మంచినీరు యివ్వమని కోరాడు. రంతిదేవుడు ఎంతో ఆప్యాయతతో “అన్నా ! కష్టాలు ఎవరికైనా వస్తాయి. రా అన్నా. ఈ నీరు త్రాగు” అని తనవద్ద మిగిలివున్న మధుర పానీయాలను కూడా యిచ్చివేశాడు. ఇదీ అసలైన త్యాగం. త్యాగం చేసిన మహానుభావుడు రంతి దేవుడు. అతని త్యాగానికి అంతటి విలువ ఉంది.
శతక పద్యాలు నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు
- శతకంలోని పద్యాలు కేవలం ఒకే పార్వ్శంలో కాకుండా అన్ని విషయాలు తెలియజేస్తాయి
- శాంతీని కలిగి ఉండడం
- కోపం లేకుండా ఉండడం
- మర్యాదతో వ్యవహరించడం
- విచక్షణ తో మెలగడం. తెలిపే మానవ గుణాలు,
- నైతిక విలువలు, మానవీయ విలువలు,
- నవ సంభాధాలు కలిగి ఉండడం.
- ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియ జేస్తాయి
- జీవిత విధానాలపై స్పష్టతను ఇస్తాయి.
- ఆలోచనలను పెంచుతాయి. ఆలోచింపజేస్తాయి.
- జీవితానికి ఏవి అవసరం, ఏవి అనవసరమో తెలియజేస్తాయి
