సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, నవంబర్ 2023, మంగళవారం

VIII.7. మంజీరా

VIII. 7. మంజీరా 
- డా. వేముగంటి నరసింహాచార్యులు

పాఠ్య భాగ వివరాలు:
ఈ పాఠం 'గేయ' ప్రక్రియకు చెందినది. గేయం / పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా చందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన 'మంజీర నాదాలు' అనే గేయ కావ్యం లోనిది.

కవి పరిచయము
పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు 
జననం:  30 - 06 - 1930 
మరణం 29 - 10 - 2005
తల్లిదండ్రులు : రామక్క రంగాచార్యులు
సంస్థలు : సాహితి వికాస మండలి 
మెదక్ జిల్లా రచయితల సంఘం లను స్థాపించారు.
రచనలు : తిక్కన్న, రామదాసు అనే పద్య కావ్యాలు.
'మంజీరా నాదాలు' అనే గేయ కావ్యం
'వివేక విజయమ'నే కండకావ్యంతో పాటు 40 పుస్తకాలు రాశారు.
బిరుదులు : కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్కవి ఆయన బిరుదులు.

గౌరవ డాక్టరేట్: తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది
శైలి : రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి.   వీటిలోని తెలంగాణ భాష ఇంపు , సొంపు పాఠకులను పరవశింపజేస్తాయ

ప్రశ్నలు:

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు ?
జవాబు.
పై బొమ్మలో నదీప్రవాహం, నది ఒడ్డున ఒక పవిత్ర దేవాలయం, నదిలో స్నానం చేస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. బొమ్మలోని బాలిక నదీప్రవాహ అందాలను తనివితీరా చూస్తున్నది. ఆ బాలిక “ఈ నది ఎంత హృద్యంగా ఉన్నదో! ఈ నదిలో స్నానం చేస్తున్న భక్తులు ఎంతటి ధన్యులో, నేను కూడా ఈ నదిలో స్నానం చేసి పునీతురాలను అవుతాను అని ఆలోచించి ఉండవచ్చు.

ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
ఏదైనా నదిని చూచినప్పుడు నాలో అలౌకికమైన భావాలు కలుగుతాయి. నదీ ప్రవాహం పరోపకారం కోసం గంభీరంగా ప్రవహిస్తుంది. నదీజలం త్రాగటానికి, పంటలు పండించుకొనడానికి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నది. ఈ నదీజలం ఎన్నటికీ కలుషితం

3.

మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి..
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, మంజీర, కిన్నెరసాని నదులు ప్రవహిస్తున్నాయి.

ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదుల వల్ల సకల జీవకోటికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని –

  1. త్రాగునీటిని, సాగునీటిని అందిస్తాయి.
  2. విద్యుత్ ఉత్పత్తికి సహాయపడతాయి.
  3. భూమి పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుంది.
  4. సరిహద్దుల్లోని చెట్లు ఏపుగా పెరుగుతాయి.
  5. జంతువులకు చక్కని పశుగ్రాసం అందుతుంది.
  6. భూములు సారవంతంగా ఉండడానికి ఉపయోగపడుతాయి.

ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి ?
జవాబు.
మంజీర బీడుబారిన పంటపొలాలను తన జల ధారలతో తడుపుతున్నది. ఎందుకూ పనికిరాని పొలాలను పంటలు వేయడానికి అనువుగా చేసింది. దాంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో విలసిల్లుతున్నాయి. అందుకే కవి పై విధంగా అన్నాడు.

ప్రశ్న 2.
మంజీర నదిని “కవి ఎంత తీయని దానవే” అనడంలో ఆంతర్యమేమిటి ?
జవాబు.
మంజీరా నదిలోని నీరు మధురంగా ఉంటుంది. బీడుబారిన పొలాలను పచ్చని పైర్లు ఉండే విధంగా చేసింది. చేదైన నేలల్లో తీయని చెరకును పండించింది. పట్టణ, పల్లెలవాసులకు తన అమృత ధారలను అందించింది. తాగునీటిని, సాగునీటిని అందించింది. అందుకే కవి మంజీరాను “ఎంత తీయని దానవే” అని చెప్పాడు.

ప్రశ్న 3
జవాబు.

బీడుబారిన భూమాత హృదయాన్ని తన అమృతపు ధారలతో తడిపింది. సస్యానికి యోగ్యంగా చేసింది. పంటలు పండటానికి అనువుగా మార్చింది. అందువల్లనే కవి ‘గిడస బారిన పుడమి విడద కరిగించెదవు’ అని చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి: 

ప్రశ్న 1.
‘మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీరా నది పల్లెటూళ్ళను తల్లిలాగా భావించింది. పల్లెప్రజలకు అవసరమైన తాగునీటిని, సాగునీటిని అందించింది. పల్లెప్రజల బ్రతుకులో కొత్త కాంతులను నింపింది. అందుకే కవి మంజీర పల్లెటూళ్ళను తల్లివలె లాలించిందని చెప్పాడు.

ప్రశ్న 2.
పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
మంజీర పట్టణాలను తోబుట్టువులా ప్రేమించింది. పల్లె ప్రాంతాల్లోని పాడిపంటలను నగరప్రజలకు అందించింది. వారికి ఆహారాన్ని అందించింది. వారి జీవితాలను రక్షించింది. అందుకనే కవి మంజీరా నది తోబుట్టువులాగా పట్టణాలను ప్రేమించిందని చెప్పాడు.

ప్రశ్న 3.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీర పట్టణవాసులను తన జలధారలతో పోషిస్తున్నది. హైదరాబాద్ వంటి నగరాలకు తీయని నీటిని అందిస్తున్నది. పల్లెల్లో పండిన ధాన్యాన్ని పట్టణాలకు అందిస్తున్నది. పట్టణప్రాంత వాసుల దాహాన్ని మంజీర తీరుస్తున్నది.


ఇవి చేయండి :

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.

  1. నదులు ప్రాణికోటికి జీవనాధారాలు.
  2. జీవనంలో అన్నింటికి అవసరమైన నీటిని మనం నదుల నుండి పొందుతాము.
  3. నదులకు ఆనకట్టలు కట్టి, ఆ నీటిని కాలువల ద్వారా మళ్ళించి, పంటలు పండిస్తాము.
  4. ప్రకృతి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఎంతో మేలు చేస్తాయి.
  5. నదుల వలన తాగునీరు, సాగునీరు అందుతుంది. కనుక నదులు పవిత్రమైనవి, పుణ్యప్రదమైనవి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:

1. కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగేను

ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు

ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.

ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి.


2. గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ.
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
గిరులంటి, వానిని
ర్హరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా

ప్రశ్నలు :

అ) ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం ‘దుందుభి’ నదిని గుర్చి చెప్తున్నది.

ఆ) దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించే నదితో పోల్చాడు.

ఇ) కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు ?
జవాబు.
‘పాలు’ ఆరోగ్యానికి మంచిది. పాలు మధురంగా ఉంటాయి. దుందుభి నదిలో నీళ్ళు కూడా పాలవలె మధురంగాను. ఆరోగ్యవంతంగాను ఉంటాయని కవి అన్నాడు.

ఈ) ‘దరులు’ – అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
‘దరులు’ అనే పదానికి ‘ఒడ్డులు’ అనే అర్థం.

ఉ) దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం చిరుగాలికి కదిలి, పొర్లిపడే కెరటాలతో, అమృతంలాంటి నీటిబిందువులతో పర్వతాలను, చెట్లను తాకి, సెలయేళ్ళతో కలిసి, జాజిపూవుల కొమ్మల అందాలను అడ్డుకొని పాలయేరులా ఉందని కవి ఉద్దేశం.


III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
పొలాలు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం. వర్షాలు బాగా కురిస్తేనే నదులు ప్రవహిస్తాయి. నదుల్లోని నీరే పంటపొలాలకు బలం. నదులు కేవలం నీటిని మాత్రమే కాదు సారవంతమైన మట్టిని కూడా పొలాలకు అందిస్తాయి. దాంతో పంటలు పచ్చగా పెరుగుతాయి. నదుల్లోని నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. దీంతోనే పంటలకు చక్కని బలం సిద్ధిస్తుంది. ఈ కారణంవల్లనే కవి – “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని చెప్పాడు.

ఆ) భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం తెల్పండి.
జవాబు.
భాగ్యనగరాన్ని కులీకుతుబ్షా నిర్మించాడు. ఇలాంటి భాగ్యనగరానికి సమీపంలోనే మంజీరా నది ఉంది. ఈ కారణంగా భాగ్యనగరానికి, మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది. మంజీర తన అమృతజలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది. ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని, సాగునీటిని అందిస్తున్నది.

మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది. గ్రామాల్లోని ధాన్యాన్ని నగర ప్రజలకు అందిస్తున్నది. ఈ విధంగా భాగ్యనగరవాసులకు, మంజీరాకు విడదీయరాని సంబంధం ఉంది.

ఇ) మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
ఏ దేశంలోనైనా నదులు, దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు. నదులు ప్రవహించే ప్రాంతాలు, ధాన్యాగారాలుగా మారతాయి. మనదేశంలో జీవనదులయిన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు ఉత్తర భారతాన్నీ, కృష్ణా, గోదావరులు, దక్షిణ భారతాన్నీ సస్యశ్యామలం చేస్తున్నాయి.

పాడిపంటలతో ఆ ప్రాంతాల్ని కలకలలాడిస్తున్నాయి. మనకు కావలసిన తాగునీటినీ, సాగునీటినీ మనకు అందిస్తున్నాయి. విద్యుదుత్పత్తికి తోడుపడుతున్నాయి. రవాణా సౌకర్యాలను కలుగజేస్తున్నాయి. మానవుల జీవనానికి నదులు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. నదీతీరాలలోని పరిశ్రమలకు నీటిని అందిస్తున్నాయి.

కాబట్టి మనం అత్యంత ప్రాముఖ్యమైన నదీజలాలను భద్రంగా కాపాడుకోవాలి. మురికినీటిని, నదులలో కలపరాదు. నదీజలాల్లో బట్టలు ఉతకరాదు. పశువులను కడగరాదు. పరిశ్రమల వ్యర్థాలను నదీజలాల్లో కలుపరాదు. నదీజలాలను పరిశుభ్రంగా ఉంచి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కలుషిత నదీజలాలను తాగడం వల్లే, మనలో చాలామంది రోగాలబారిన పడుతున్నాము. కాబట్టి జాగ్రత్తపడదాం. మన నదులను మనం రక్షించుకుందాం.

ఈ) నదులు ‘నాగరికతకు ఆలవాలం’ – ఎందుకు ?
జవాబు.
భారతదేశంలో గంగ, కృష్ణ, గోదావరి వంటి పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. ఎక్కువ భాగం నదులు హిమాలయ పర్వత సానువుల నుండే పుట్టాయి. మనదేశంలో గంగానదికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయులు నదులను దేవతామూర్తులుగా భావిస్తారు.

వాటిని పూజిస్తారు, హారతులు ఇస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలను నిర్వహిస్తారు. నదులలోని నీటిలో ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. అందువల్లనే మన నదులు సనాతన ‘నాగరికతకు ఆలవాలం’ అని అంటారు.


2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదులు మనకు త్రాగునీటిని, సాగునీటిని అందిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరిస్తున్నాయి. ఈ రకంగా నదులు సకలజీవకోటికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో కూడా నీరు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి ప్రకృతితోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని-

  1. సకాలంలో వర్షాలు కురవకపోవడం, వర్షపాతం చాలా తగ్గిపోవడం.
  2. ఎగువ రాష్ట్రాలు నదులపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం.
  3. విద్యుత్ ఉత్పత్తికి పరిమితికి మించి నీటిని వృథాగా ఖర్చు చేయడం.
  4. అడవులను పరిరక్షించకపోవడం
  5. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం
  6. నీటి పొదుపుపై ప్రభుత్వాలకు సరియైన అవగాహన లేకపోవడం.

IV. సృజనాత్మకత / ప్రశంస:

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు/చెరువు/నదిని వర్ణిస్తూ కవిత/గేయాన్ని రాయండి.
జవాబు.
మా ప్రాంతంలో గౌతమీ నది ప్రవహిస్తోంది.

కవితా గేయం :
“సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద
వనము పెంచెను ఋషి ఫలవృక్షములను
గోవొకటి దానిని భగ్నంబు చేసే
గౌతముడు కోపాన కనువిచ్చి చూసె
భస్మమయ్యెను గోవు మునికోపదృష్టి
ఋషిమండలంబంత నిందించె ఋషిని
గౌతముడు తాపమున తపము చేయంగ
పరమేశుడప్పుడు ప్రత్యక్షమయ్యె
గోవు స్వర్గతి చెంధ శివు డంత కరుణ
గోదావరీనదిని సృష్టించి విడిచె
నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత


V. పదజాల వినియోగం : 
కింది పదాలకు సమానార్ధక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.
అ) రైతు - కర్షకుడు
ఆ) చల్లదనం - చలువ
ఇ) నేల - పుడమి
ఈ) స్నేహం - సోపతి
ఉ) పంపి - అంపి
ఊ) ప్రకాశించు - విలసిల్లు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.
ఎడద - ఎద
రాసి - రాశి

3. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి 
అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది.  
విలసిల్లు= ప్రకాశించు
ఆ)కృష్ణ కుచేల కూర్మి గొప్పది 
కూర్మి = స్నేహం
ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం పుడమి = భూమి

VI. భాషను గురించి తెలుసుకుందాం 
1. కింది ఖాళీలను పూజించండి.
సమాస పదం - విగ్రహ వాక్యం - సమాసం పేరు
అ) సీత జడ -  సీత యొక్క జడ - షష్టి తత్పురుష సమాసం
ఆ) చెట్టు నీడ - చెట్టు యొక్క నీడ - షష్టి తత్పురుష సమాసం
ఇ) వయోవృద్ధుడు - వృద్ధుడైన వయోజనుడు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) రాజశ్రేష్టుడు - రాజులలో శ్రేష్టుడు - షష్టి తత్పురుష సమాసం
ఉ) అమంగళం - మంగళం కానిది - నైన్ తత్పురుష సమాసం.


అలంకారం:
కింది దాన్ని చదవండి.
 ఇల్లు, మనిషి, పెళ్లి, మండపం, ఫంక్షన్ హాల్, వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం.

 అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.

 ఇది మనబడి 
ఇది అక్షరాల గుడి 
సరస్వతి దేవి ఒడి 
మనకు నేర్పు నడవడి 

పై కవితలో డి అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా వినుసంపుగా ఉన్నది కదా ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్ధాలంకారం అవుతుంది.

 ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.
వృత్యానుప్రాసం : 
కింది వాక్యాలు పరిశీలించండి.
గడగడ బడుకుచూ తడబడి జారిపడను రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది 

పై రెండు వాక్యాలలో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది? పై వాక్యాల్లో వరసగాడా అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడానికి అలంకారం అంటారు. 
మరికొన్ని వృత్యానుప్రాసాలంకారానికి చెందిన వాక్యాలను మరికొన్ని పాఠాల్లో వెతికి రాయండి.



5, అక్టోబర్ 2023, గురువారం

ఉన్నతి ప్రగతి నమోదు రిజిస్టర్ 2023


ఉన్నతి ప్రగతి నమోదు కోసం తెలుగు భాషోపాధ్యాయులు ప్రగతి నమోదు చేయవలసిన విధానం కింది పట్టికలో నమోదు చేసిన విధంగా నమోదు చేయాలి.
 మాసాన్ని బేస్ లైన్ టెస్ట్ కోసం ఉపయోగించాలి.

14, సెప్టెంబర్ 2023, గురువారం

వచన కవిత ఎలా రాయించాలి?

 

విద్యార్థులతో వచన కవిత ఎలా రాయించాలి?

 “కవిత్వం ఒక ఆల్కెమీ,...”   -తిలక్

కవికి స్పందన ముఖ్యం. మీ చుట్టూ జరిగే ప్రతి విషయానికి కేవలం మనసుతో స్పందించండి.

కవిత్వం – ఒక అసంకల్పిత ప్రతీకార చర్య.
తన్నుకొస్తున్నవమనాన్ని... ఆపడం ఎంత నిష్ప్రయోజనమో, ఉద్వేగంతో ఉబికివస్తున్న కవిత్వాన్ని ఆపడమూ అంతే నిష్ప్రయోజనం.

కవిత్వం – ఒక ఔన్నత్యం, ఒక ఔదార్యం
ఎంతోమంది మౌనంగా దాచుకున్న అనుభవాన్ని పదిమందికీ పదాలలో, పాదాలలో వెల్లడించడం, వాటి ద్వారా తమకు తోచింది అందరి మంచీ చెడూ చేయటం, సామాన్యులు చేసే పని కాదు. అందువల్ల కవిత్వం (కథ) రాయడం అనేది కవి (రచయిత) ఔన్నత్యానికి, ఔదార్యానికి సంబంధించిన విషయం.




ఎంచుకున్న వస్తువు మీద స్పష్టమైన అవగాహన ఉండాలి.
మైండ్ మ్యాప్ చేయాలి.
మేథో మథనం జరగాలి.
స్వరూప, స్వభావ, మూల అంశాలను వాక్యాలుగా రాయాలి.
ఎంత వీలైతే అంత తక్కువ పదాలలో ఎక్కువ అర్థం స్ఫురించే విధంగా రాయాలి.
సరిపడే పదజాలం ఉపయోగించాలి.
భావం చిత్రం వచ్చేలా రాయాలి.

ముగింపులో స్పార్క్ / ఒక మెరుపులాంటి సందేశం ఉండాలి.

విలువలు ప్రబోధించాలి. 

 దేని గురించి రాస్తున్నామో దానిని కవితా వస్తువు అంటారు. 

ఆ వస్తువుకు ఆకారం చేకూర్చాలి.

 అక్షరాలతో మేకప్ వేయాలి. (అలంకారాలు అంత్యాను ప్రాసాలంకారం, ఛేకాను, ముక్త  పదగ్రస్తం .... మొదలైనవి వాడాలి.)

బ్దం, లయకు విద్యార్థులు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.

అన్నీ వాక్యాలకు సంబంధం ఉండాలి. 

కవిత చదివినాక మంచి భోజనం చేసింట్టుండాలి(సినారె అన్నారు)

వాక్యం పాఠకుణ్ణి వెంటాడేలా రాయాలి. 

రాయడానికి ప్రయత్నించాలి


వస్తువు : మట్టి అనుకుంటే  

శిల్పం : కవితా ఆకారం (పదాలతో మంచి ఆకారం దిద్దుకోవాలి)  

స్వరం : ఎవరు కవిత చెపుతున్నారు.

క్లుప్తత : తక్కువ పదాలతో ఎక్కువ అర్థం (అల్పాక్షారాలలో అనల్పార్థ రచన)

ముగింపు : మెరుపు మెరిసినట్లు ముగింపు ఉండాలి.

సందేశం ఉండాలి.

ఆలోచన రేకెత్తిదిగా ఉండాలి.

భావ చిత్రం : భావం స్పురించాలి.

ఉదా :  ఆరడుగుల బుల్లెట్.  బుల్లెట్ చిన్నదే అయినా ఆరడుగుల పొడవు అంటే చాలా తీవ్రం అన్నమాట.

అట్లాగే    అతడు దేవుడు 

సాక్షాత్తు ఈశ్వరుడు 


 పదచిత్రం కల్పిచేలా రాయాలి. 

ఉదా.

ఇద్దరం ఎండిన చెట్లవలే అవుతాము 

చీకటి నది 

మెత్తని పులి (తిక్కన)

భస్మ సింహాసనం (గుర్రం జాషువా)

కొత్త పదబంధాలను ఉపయోగించాలి.

 నీ కళ్లలోకి చూశాను రెండు ప్రతి బింబాలు (సబ్బని) 


ప్రతీకలు : ఉదాహారణాలు.


పిల్లలకు అంత్యాను ప్రాసాలంకారతో రాయించవచ్చు 

భావనలు  కల్పించాలి.  మేథో మథనం చేయాలి. 

ఆలోచించాలి. ఒక్కొక్కోటి రాయాలి. 

మళ్ళీ మళ్ళీ చదవాలి రాయాలి. 

కొత్త పదజాలం కోసం వెతకాలి.



కవిత రాసే ముందు బాగా ఆలోచించగలగాలి. మేథో మథనం చేయాలి.


భావానా చిత్రం: 

చెట్టు - కాకులు  -  మేకలు -  ఈకలు -

 తోకలు- నూకలు - ఆకులు- కాకి - బాకీ, జీవులు - పూవులు - 


చెట్టుమీద కాకులు ఉన్నాయి
చెట్టు కింద మేకలు ఉన్నాయి
కాకులకు ఈకలు ఉన్నాయి
మేకలకు తోకలు ఉన్నాయి
మేకలు తింటాయి ఆకులు

కాకులు తింటాయి నూకలు 


తర్వాత క్రియాపదాలు తొలగించినా అర్థం మారనపుడు తొలగించాలి.

విభక్తులు చేర్చి ప్రయతించాలి. 

ఒకసారి క్రియ ముందు చేర్చాలి.

ఒకసారి కర్త  ముందు చేర్చాలి.

ఒకసారి కర్మ  ముందు చేర్చాలి.

కొన్ని తొలగించాలి 

కొన్ని చేర్చాలి. 

ఇంతకంటే నేను రాయలేను అనేవరకు రాయాలి .

కవిత్వం రాసేవారికి ఉండాల్సిన లక్షణాలు:

ఓర్పు ఉండాలి.

నాలుగు వాక్యాలు రాయగానే సంతృప్తి చెందకూడదు

కొత్తగా ఆలోచించాలి.


చెట్టుమీద కాకులు

చెట్టు కింద మేకలు 

కాకులకు ఈకలు 

మేకలకు తోకలు 

మేకలకు  ఆకులు 

కాకులకు  నూకలు 


కొట్టినా తిట్టినా కోపగించుకోక

కాకులు పిలుస్తుంటవి కాక కాక అని 

అవి కాకులు కావు

సమాజమే వాటికి  బాకీ

కాకి మేకలు పశువులు

పూవులన్నీ జీవులు    

అన్నీ కలగలస్తే జీవావరణం 

అదే మానవ మనుగడ  

 

..............




అక్క అన్న మీద కవిత కోసం ఏవిధంగా సహయాకారులు. ఏమేం చేస్తారు....

అమ్మ = అక్క 

నాన్న= అన్న



అమ్మంటే లాల పోసి అన్నం పెట్టే చేయే కాదు

ఆదరించి లాలించే చల్లటి ఒడి కూడా

అక్కంటే మ్మ తర్వాత అమ్మంత ప్రేమ కూడా

అన్నంటే నా తాయిలం లాక్కునే వాడే కాదు

తన పాత చొక్కా లాగూ నాకిచ్చేవాడు కూడా

నాన్నంటే తిట్టి దండించే నరసింహుడే కాదు

దారి చూపి నడిపించే గురువూ కాపరి కూడా...

****************,

ఊరు

ఊరు - ఏరు - పారు -  హోరు - జోరు - 

వాగు- భావనా అందజేయాలి 

లేదా మేథో మథనం  చేయాలి 



మా ఊరు గోనేపల్లి 

తనువంతా తాళ్లపల్లి 

మండువలో  కల్లు

ఒడువనీ మాటల సొల్లు

పక్కనే పారుతుంది ఏరు 

సుట్టాల కాళ్ళకు సాకవోసే తీరు 

కడుగుతూ పారు 

వర్షాకాలంలో చూడాలే దాని జోరు 

వర్ణనకందని హోరు 

మా వూరు కమతాల ఖని

మమతల చిరునామా 



భావన / మేథో మథనం కోసం కొన్ని పదాలు 

సిద్దిపేట - ప్రసిద్ధి - అభివృద్ధి - బుద్ధి - శుద్ధి -  వెలుగులు - చెరువు - పరువు - 


సిద్దిపేట కళలకు  ప్రసిద్ధి 

తెలంగాణ నుదుటి పై తిలకం దిద్ది 

ఒద్దికగా జరిగే అభివృద్ధి 

ఇక్కడి విద్యాలయాల్లో నిబద్ధత 

లేదు ఎక్కడ అసంబద్ధత  

చదివితే పెరుగుతుంది బుద్ధి 

పట్టనము  ఒళ్ళంతా  శుద్ధి 

పనిలో ఎందరికో ఆదెరువు 

వెలుగులు వెదజల్లే కోమటి చెరువు 

ఖండంతారాలకు పాకిన పరువు 

వేడుకలకు వేదికలకు పత్తా

చాటుతుంది సత్తా 

మమతల కోట 

ఆత్మీయతల వేట 

నిత్యం భవిష్యత్ పాట 

అది సిద్దిపేట కాదు 

అది మా అభివృద్ధి ప్రసిద్ధిపేట


12, మార్చి 2023, ఆదివారం

పీడనను చిత్రించిన కథలు








పీడనను చిత్రించిన కథలు

ఒకే సమాజంలోనూ జీవిస్తున్న ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల్ని, సంఘర్షణల్ని కథలు వ్యక్తీకరిస్తాయి. దళిత, దళితేరజీవితాల్లో అటువంటి వైరుధ్యాలు కోకొల్లలు. కొన్ని వైరుధ్యాలని చూసిన పిదప మౌనంగా ఉండడం చాలా కష్టం. అట్లాంటి మౌనాన్ని బద్దలుచేస్తూ నా మిత్రుడు డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ఈ కథల్ని రాశాడు. సిద్దెంకి  యాదగిరి రాసిన ఇవి కథలు మాత్రమే కాదు గుండెలోతుల్లో సంచరిస్తున్న బాధల్ని, గాథల్ని తనదైన భాషా శైలితో కథలుగా మలిచాడు. ఈ కథలు తాను జీవిస్తున్న, అనుభవిస్తున్న వ్యవస్థ పట్ల అపరిమితమైన కన్సర్న్‌తో రాసినవి. దుగ్ధతో యావతో, కోపంతో రాసిన కథలు కావు. 

ఈ కథలన్నింటికీ మనిషే అడ్రస్‌. ఆ అడ్రస్‌ గల్లంతవుతున్న మనిషిని ‘‘డిఫెన్స్‌’’ చేయడం కోసమే ఈ కథలు రాశాడు. ఈ కథలు చదివిన తర్వాత ఊరు కోల్పోయిన మనిషి, నిరాశ్రయులైన మనిషి, పీడితుడైన మనిషి, కరోనాతో నిరాదరణకు గురైన మనిషి, వంచింపబడిన దళితుడు, 
రాజకీయవివక్ష ఎదురుకున్న దళిత స్త్రీ, మంచి మనసున్న విద్యార్థి, ఏ కల్మషం లేని ఉపాధ్యాయుడు అందరూ కనపడతారు. ఉట్టిగా కనబడడమే కాదు వారితో సంభాషిస్తున్నట్లుగా ఈ కథలు ఉంటాయి. వారికి భరోసాను ఇస్తాయి. గుండె ధైర్యాన్ని కూడా ఇస్తాయి. మార్పు అనివార్యమనే ఒక మేలుకొలుపును పట్టిస్తాయి.

ఈ కథ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఈ కథలు వేటికవే ప్రత్యేకమైనవి. కథనంలో, శైలిలో, భాషా సౌందర్యంలో ఒక్కో కథా ఒక్కో నేపథ్యాన్ని తెలియజేస్తుంది.
మన కండ్ల ముందర జరుగుతున్నది అభివృద్దే కాదని, అభివృద్ధిలాగా కనిపిస్తుందని ఒక ‘‘ఎపిఫని’’ అర్థం అవుతుంది. ఎపిఫని అంటే ఒక నిజమైన సత్యం ‘సాక్షాత్కరించడం’.  నిజానికి ఈ మాయ వ్యవస్థలో ‘అసత్యం’, ‘సత్యం’ లాగా కనిపిస్తుందని ‘‘ఆఖరి కోరిక’’ కథ చదివితే అర్థమై కన్నీళ్లు వస్తాయి. జీవితం పాతదే కానీ వేదనలే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ సందర్భాన్ని చాలా బలమైన కథగా మలిచాడు సిద్దెంకి.

గత కాలపు జ్ఞాపకాలను నెమరువేస్తూ బలమైన శైలిలో ఈ ‘ఆఖరు కోరిక’ కథను రాశాడు. ఈ కథలో వెంకటయ్య అనే ఉపాధ్యాయుడు ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి ఒక విద్యార్థి బడి బంద్‌ చేసి ఇంటి దగ్గరే ఉంటాడు. సారు ఊల్లకు పోయి విద్యార్థి ఎందుకు రాలేదని తల్లిదండ్రులను కలుస్తాడు. అక్కడ పోశవ్వ అనే ముసలి అవ్వ మాట మాట కలుపుతూ సారు... ఊరు పోతుందంట కదా. ఇంకా చదివి ఏమి లాభం? అని ఊరుతో, ఇల్లుతో, వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ ఇల్లు గోడలకు, దూలానికి ఉండే చరిత్రను చెపుతుంది. వాసానికి  ఉండే అనుభవాన్ని  కూడా ఆర్తితో వేదనతో వలపోస్తుంది. బతుకు మర్మం ఇప్పుతుంది. ‘పందిరి మీద గుండు పడ్డట్టు’ ఇంత పెద్ద చెరువు ఎందుకు సారు మాకు అనే ప్రశ్న బలంగా వేస్తుంది. మా ఉనికే లేనటువంటి అభివృద్ధి ఎవరికోసమని ఎందుకోసమని ప్రశ్నిస్తుంది. నిత్య సత్యాలతో నిప్పులు చెరుగుతుంది. వెంకటయ్య సారు అవ్వ ప్రశ్నలకు నిస్సహాయుడైపోతాడు. 
  
       నీళ్లు వచ్చినా పూర్తిగా బతికే స్థితి లేనప్పుడు కొందరి అభివృద్ధికై మేమెందుకు త్యాగం చేయాలన్న ప్రధాన ప్రశ్నకు సమాధానం శూన్యమే. ఈ కథలో గోసలు ఎతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఊరు మునిగితే వచ్చే కష్టాలు, పడే బాధలు, పోగొట్టుకున్న గుర్తులు, చెల్లాచెదురయ్యే జీవితాలు అన్ని గుర్తుకు వస్తాయి. మనిషి చుట్టూ అల్లుకున్న వెలుగులను ఆర్తితో గుర్తుచేశాడు. దోపిడి పరాయి ప్రభుత్వాలే కాదు సొంత ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయని నిరూపించిన కథ ఈ ‘ఆఖరి కోరిక’ కథ.
తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రోది చేసుకొని తెలంగాణ కలను సాకారం చేసుకున్నది. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఒక ప్రధానమైన పండుగ. ఈ పండుగలో ఉండే వివక్షతను అంటరానితనాన్ని నిరసిస్తూ ‘అంటరాని బతుకమ్మ’ అనే కథ రాసిండు. 

సిద్దెంకి ఏ విలువల్ని ముఖ్యంగా ఎవరి విలువల్ని గౌరవిస్తున్నాడు అనేది ఈ కథ చదివితే అర్థమవుతుంది. నిర్మాణ పరంగా ఈ కథ చాలా సహజమైన శైలిలో నడిచి, అధరహో అనిపిస్తుంది. కథను నిర్మించిన పద్ధతి పాఠకుడిని కట్టిపడేస్తుంది. కథ అల్లిక కృత్రిమంగా లేదు. చలికాలం మంట పెట్టుకొని చేతులు కాపుకుంటూ మాట్లాడినంత సులభ సంభాషణగా ఈ కథ నడిచింది. నిజానికి ఉన్నత కులాల వాళ్ళు బతుకమ్మను పేర్చితే ఆ బతుకమ్మ పేర్చడానికి కావలసిన పూలు అన్నీ కూడా కింది కులాల వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడులేని అంటరానితనం బతుకమ్మ పేర్చేటప్పుడు మాత్రం బాగా గుర్తుకు వస్తుంది. అందుచేత కింది కులాల స్త్రీలు ఇన్నొద్దులు ఎక్కువోళ్ల  కోసం పువ్వులు తెంపినం. ఇప్పుడు మనకోసం తెంపుతున్నము. మనకోసం మనం బతుకమ్మ ఆడాలి. ఇన్నొద్దులు శాతకానట్లు చేతులు ముంగట పెట్టుకుని ఆడిటోళ్ళను చూశాం అని అనుకుంటారు. అంతా ఆడటానికి రెడి అవుతారు. తీరా బతుకమ్మ ఆడడానికై పూలు తెంపడానికి వెళితే తేనెటీగలు ఒకరికి కుట్టినయ్‌. దళితులు బతుకమ్మ ఆడటానికి పూలు తెంపితే తేనెటీగలు కుట్టినాయి అనే భయం పుకారుగా వ్యాపించింది. ఇది అపశకునంగా భావిస్తారు. కాబట్టి దళితులు బతుకమ్మ ఆడొద్దని పెద్ద మనుషులు అనుకుంటారు. అట్లను మైసయ్య మనవడు రాకేష్‌ బండి నడుపుతూ జారిపడ్డాడు. దెబ్బలు తగులుతాయి. ఇవన్నిటికి బతుకమ్మకు ఏ సంబంధం లేదని మన తప్పిదాల వల్లనే ఇట్లాంటివి జరుగుతాయని చదువుకున్న పోరగాండ్లు పెద్దవాళ్లకు సదిరి చెప్తారు. తీరా బతుకమ్మ ఆడాలని యూత్‌ తీర్మానిస్తారు. పెద్దలను ఒప్పిస్తారు. పెద్దవాళ్లు సంతోష పడతారు. చేయక చెడిపోయినా చేసి బాగుపడాలని పెద్దోళ్ళు సంబరపడతారు. ఇది కథ. ఈ కథలో అవమానాల మూలతత్వాన్ని ఎరుక పరుస్తాడు. కథకుడికి కలిగిన అనుభూతిని పాఠకుడికి కూడా కలిగిస్తున్నాడు. జరగాల్సిన దానికి జరిగిన దానికి మధ్య ఏర్పడిన ‘ఖాళీ’ని పూడ్చే విధంగా పై కథ ను తీర్చిదిద్దాడు సిద్దెంకి.

అట్లాగే గ్రామాల్లో దళితులకు జరిగే రాజకీయ వివక్షతను పట్టించే కథ ‘మూడు గుడిసెల పల్లె ‘కథ. ఈ కథలో పటేల్‌ ఊరు సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేయాలనే     ఉద్దేశంతో కుట్రతో దళిత కులానికి చెందిన సరిత అనే ఉత్తమ గుణాలున్న మహిళను సర్పంచ్‌ కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్‌ చేసినటువంటి మోసం, ఆడినటువంటి నాటకాన్ని బయట పెట్టిండు. అదే దళిత కులానికి చెందిన రాజు మిగతా కొంతమందితో నామినేషన్‌ వేయించి విత్‌ డ్రా కావాలంటే లక్ష రూపాయల డబ్బు  సరిత ఇవ్వాలని తీర్మానించిండు. చివరకు సరిత, సరిత భర్త శంకర్‌ డబ్బులు ఇవ్వలేక పోటీ చేయరు. పటేల్‌ పెంపుడు కుక్కలుగా మసిలే వ్యక్తులే ఆ పదవిలో కుదురుకుంటారు. ఏమి చేసైనా సరే పటేళ్లు తమ బానిసలనే రాజకీయంగా అందలం ఎక్కిస్తారు. కానీ చైతన్యవంతమైనటువంటి దళితులను రాజకీయ పదవులు అనుభవించకుండా అడ్డుకుంటారని ఈ కథ ద్వారా తెలియజేసిండు. ఈ కథలో తేలిపోయే వస్తువు లేదు. తన ఉనికి కోసం బలవంతుల మెప్పుకోసం అధికార గుర్తింపు కోసం కాకుండా తన గుండెల్లో తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, ఎతలను విప్పి చెప్పాలనే ఉద్దేశం బలంగా కనపడుతుంది. 

ద్రోహం చేసే వ్యక్తుల కళ్ళు తెరిపించాలనే తపన రచయితకు బలంగా ఉంది.   ఈ కథలో అల్లిక పూర్తిగా పటిష్టంగా ఉంది. ఏమాత్రం నీరసంగా కృత్రిమంగా లేదు. చిన్నపిల్లవాడు వందల మంది స్త్రీలు ఉన్న తన తల్లి దగ్గరికి ఎంత సహజంగా కన్ఫ్యూజ్‌ కాకుండా వెళతాడో అంతే సహజంగా పాఠకుడిని కథాంశంలోకి తీసుకుపోగల నేర్పరితనం సిద్దెంకి కి ఉన్నది అని నిరూపించిన కథ.పల్లెలో అగ్రకుల రాజకీయ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గతంగా సూత్రంగా తెలిపిండు అని భావించాలి.

విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి నింపే కథ ‘‘గెలుపు గీతం’’ కథ. చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చూయించును. ఎన్ని కష్టాలనైనా చదువుతో జయించొచ్చు అని నిరూపించే  కథ ఇది. ఇక్కడ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చదువు గురించి చెప్పిన ఒక కొటేషన్‌ గుర్తుకు చేస్తాను.
  ‘‘you may forgot the material benefit of our culture.But we cannot forgot educational benifit’’ అంటే మనం వస్తు గత ప్రయోజనాలను వదులుకోవచ్చు కానీ, చదువు అందించే ఏ ప్రయోజనాన్ని వదులుకోకూడదు అని అంబేద్కర్‌ చెప్పాడు. సరిగ్గా ఈ అంశానికి అతికినట్టుగా ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఈ కథలో చాలా పరిమితంగా పాత్రను సృష్టించాడు. ఒకే సంఘటన కథలో    ఉంది. కథాంశం పాఠకుడికి తొందరగా చేరుతుంది.

‘పిడుగు’ కథలో అనేక మలుపులున్నాయి. ఏమవుతుందో అనే టెన్షన్‌ పాఠకుడికి కలుగుతుంది. సిద్దెంకి యాదగిరి కథల్లో సాధారణ మహిళా పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాంటి స్త్రీ పాత్రే లింగమ్మ. లింగమ్మ చాలా కలుపుగోలు మనిషి. ఇగురం గలది .మానవ సంబంధాలు  చెడిపోకుండా మాట మాట్లాడుతుంది.  కసురుకోదు. ఇసురుకోదు. మనిషిని అభిమానిస్తుంది. లింగమ్మ బిడ్డ అంజమ్మ. చదువు పట్ల చాలా శ్రద్ధ గలది. చదివి జీవితంలో తానేంటో నిరూపించాలనుకుంటుంది. కానీ పల్లెల్లో చదువు కంటే ముఖ్యంగా పెళ్లి మీదే వాడకట్టు మనుషుల ఆలోచన ఉంటుంది. లింగమ్మ అత్త చావుకు దగ్గర అవుతుంది సచ్చే ముందర మనవరాలి పెండ్లి చేసి నాలుగు అక్షంత లేసి చావాలనుకుంటుంది. కోడలిని తొందరగా పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తుంది. అందుకోసం అత్తమామలు సంపాదించిన ఎకరం భూమిని 14 లక్షలకు అమ్మి డబ్బును బ్యాంకు నుండి ఇంటికి తెస్తుంది. అదే రోజు అంజమ్మ అన్నం తినకుంటా టీవీ చూస్తున్న సందర్భంలో నోట్ల రద్దు అంశం టీవీలో వస్తుంది. డబ్బులు చెల్లవని రెండు లక్షల వరకే బ్యాంకులో తీసుకుంటారని, మిగతా డబ్బులు పనికిరావని అంజమ్మ వార్తల్లో వింటుంది. ఇట్టి విషయం అమ్మ లింగమ్మకు చెబితే గుండె పగిలి చస్తుందని తన గుండెల్లోనే దాచుకుంటుంది. అంజమ్మ టెన్షన్‌ పడుతుంది. నిద్రపట్టదు చాలా ఆందోళనకు గురవుతుంది. సామాన్యులకు ప్రభుత్వాలు సృష్టించే సమస్యల వలయాల ఆధారంగా కథ రూపు దిద్దుకున్నది. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలను అనుభవించారో ఈ కథ ద్వారా సిద్దెంకి బలంగా వ్యక్తీకరించారు. ఈ కథలో దళిత ఈస్థటిక్స్‌ చాలా బలంగా పలికించాడు. తెలంగాణ భాషా సౌందర్యం అదనపు బలంగా పలికింది. జీవితం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఉంది కాబట్టే సిద్దెంకి ఇట్లాంటి కథ రాయగలిగిండు. నిజాయితీ కొట్టొచ్చినట్లు ఈ కథలో కనపడిరది. అందరి జీవితాలు ఉన్నతంగా తయారు కావాలనే తాపత్రయం ఈ కథ వెనుక ఉన్న బలమైన కథనం.

‘‘ఆరు కోట్ల అందగాడు’’ కథలో ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక జరిగే సంభాషణ ముచ్చట్ల ఆధారంగా కథను నడిపించాడు. విచిత్రమేమంటే టెన్త్‌ ఫెయిల్‌ అయినవాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ప్లాట్లు కోట్లు సంపాదించాడు. క్లాసులో మంచి ర్యాంకులు వచ్చి బాగా చదివిన విద్యార్థులు చిన్నపాటి ఉద్యోగంచేసి కుటుంబ పోషణకు పరిమితమైన స్థితిని చూయించాడు. ఈకథలో ఉద్యోగం అనేది మనిషిని పరిమితమైన స్థాయిలో ఎలా బంధిస్తుందో చెప్పిండు. కథావస్తువు తెలిసిన జీవితమే. చాలామంది పెద్దలు ‘కథకు ముడిసరుకు జీవితమే’ అంటారు. అట్లాంటి జీవితాలు ఎన్నో సిద్దెంకి కథల్లో రూపుదిద్దుకున్నాయి.

అంబేద్కర్‌ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ‘ఆచరణ’ కథ. ఈ కథ చాలామంది ఉపాధ్యాయులు చదవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో ఈ కథ తెలియజేస్తుంది. 

‘రుణం’ కథ ఈ కథల్లో చాలా భిన్నమైన కథ. ఈ కథలో నేటివిటీ బాగా కనిపిస్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి పట్ల ఎంత అమానవీయంగా సొంత మనుషులే ప్రవర్తించారో నిరూపించిన కథ. ఈ కథలో డాక్టర్‌ కత్తి మల్లయ్యగారి పాత్ర చాలా స్ఫూర్తివంతంగా ఉంది. దాదాపు చావుకు దగ్గరగా పోయిన వ్యక్తిని డాక్టర్‌ కత్తి మల్లయ్య గారు బతికించి మళ్లీ పూర్వపు స్థితికి తీసుకువచ్చారు. బతకడానికి ఒక భరోసానిచ్చిన  అంశం అందరి డాక్టర్లకు మాత్రమే కాదు మనందరికీ కూడా ఆదర్శం.

ఈ కథల్లో సిద్దెంకి వాడిన పద సంపద భాషా సొబగు అందరిని ముగ్దుల్ని  చేస్తుంది. సందర్భానికి అనుగుణంగా జాతీయాలను, నుడులను సామెతలను ఎంత గొప్పగా వాడారో. ఈ సామెతలు  కచ్చితంగా అసహజంగా మాత్రం లేవు. సందర్భానికి అదనపు బలాన్ని మెరుపులు చేకూరుస్తున్నాయి. మచ్చుకు కొన్ని సామెతలను ఇక్కడ పేర్కొంటున్న దినడమంత్రాన నాలుగు వెంట్రుకలు వచ్చిన అవ్వ ఎగిసి పడుకుంటూ కొప్పులు పెట్టినట్లు ఉంది.
ఆరాటం గళ్ళ అప్ప తొర్ర ఎప్పుడొచ్చినా చిప్ప తొర్ర.
అంబేద్కర్ను మొక్కుడే, మనకు బతుకమ్మ లేదంటే తొక్కుడ.ే 
నల్ల వెంట్రుకలని పాపితే తెల్ల వెంట్రుకను ఊడబీకినట్లు.
మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటిల్నే.
తెలిస్తే మొలిచినట్టు దిఊరంతా ఒక దిక్కు ఊసుగంలోడు ఒక దిక్కు. 
పిట్ట బెదిరించి బట్ట గుంజుకపోయినట్లు.
రసీదు తప్పితే మసీదు దితోలుడిగిన ముసలి భవిష్యత్తును పోతపోస్తది.
దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంటా.
మాటకు సత్యం మందుకుపథ్యం.
అతనికి ఆగం ఎక్కువ ఆలోచన తక్కువ.
రాయిని లక్క లక్కను చేసిండు.
పులి బక్కగైనా సారుకలు తగ్గినట్లే. 
కష్టాల కొలిమిలో కాలినోల్లే సోకం బంగారమైతరు.
సదివినోళ్లకు సన్మానం లేదంటే అవమానం లాంటి సామెతలు కథకు 10 చొప్పున విరివిగా పడ్డాయి. ఇన్ని సామెతలు ఉట్టిగనే పడవు. సామాన్యులు మాట్లాతుంటే గొప్ప గ్రహింపు ఉంటేనే ఇది సాధ్యం.  

అట్లాగే ఒక డిక్షనరీకి సరిపోయేటాన్ని తెలంగాణ భాషా పదాలు కూడా ఈ కథల్లో దొరుకుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏదైనా ఉంది అంటే తెలంగాణ భాష సాహిత్య గౌరవాన్ని పొందడం. అది సిద్దెంకి లాంటి వాళ్లు బతికిస్తున్నందువల్లే ఈ గౌరవం దక్కింది.

దాదాపుగా ప్రతి కథలో వ్యవస్థల మధ్యన జరిగిన ఘర్షణ ఉంది. ఘర్షణ లేకుండా కథ రాస్తే ఆ కథకుడికి ఒక నిర్దిష్ట జీవిత నేపథ్యం, ఒక నిర్దిష్ట చూపు లేనట్టే లెక్క. ఈ కథలకు ఒక సామాజిక నేపథ్యం ఉంది. సామాజిక ప్రతిఫలం ఆశిస్తూ అంతర్గత ఘర్షణను బలంగా వ్యక్తీకరించిన కథలు ఇవి. సామాన్యుల కలలు సాఫల్యం కావాలని సామాన్యుడు ఉన్నతంగా జీవించాలని ఆశించి రాసిన కథలు.

కల చెదిరిన మనుషులకు, ఆ కలల్ని చెదరగొట్టిన మనుషులను పట్టిస్తాడు. ముఖ్యంగా శత్రువు ఎవరో మిత్రువు ఎవరో అర్థం చేయించడానికి ఒక వంతెనలాగా సిద్దెంకి కథలు ఉన్నాయని బలంగా నేను నమ్ముతున్నాను. నా దృష్టిలో చెదిరిన జీవితాలను సాహిత్యంలో ఒంపడమే రచయిత కథకుడి పని. ఆ పనిని బలంగా చేస్తున్న సిద్దెంకి  యాదగిరికి నా జై భీమ్‌లు.

 9493319878
           

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...