"ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచిస్తుంది" అని గురజాడ అన్నారు.(21.05.1909న ఒంగోలు ముని సుబ్రహ్మణ్యంకు రాసిన గురజాడ లేఖ, చూ.. గురజాడ కవిత్వం-కొన్ని మహా వాక్యాలు, సాహితి పేజి, ప్రజాశక్తి దినపత్రిక, చంద్ర శేఖర్ రెడ్డి, రాచపాళెం. తేది: 4-10-2021)
ఒక శతాబ్దం కంటే ముందే ఆధునిక మహిళా సమాజాన్ని సంస్కరించగలదనే ఒక భవిష్యత్తును గురజాడ కలగన్నాడు. నేటి సమాజంలో అనేక విజయాలతో తనను నిరూపించుకుంటున్న ఆధునిక మహిళలు చరిత్రపై తమ మార్పును, అభివృద్ధిలో, అనేక విషయాలలో తమను తాము రుజువు చేసుకుంటున్నారు.
తెలుగు కథా సాహిత్యం స్త్రీల నుంచే ప్రారంభమయ్యింది . 1902లో 'స్త్రీ ధనత్రయోదశి' అనే కథా రాసిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంభ. తెలుగు కథకు పాదులు వేసింది.
సత్య శోధక్ సమాజం ద్వారా ఫూలే వెలిగించిన చేయూత, మహిళల్లో అభ్యుదయాన్ని నింపింది. సామాజిక దృక్పతాన్ని కలిగించింది. నిజామాంధ్రలో భాగ్యరెడ్డి కలగన్న ఆధునిక సమాజం స్త్రీ విద్య ద్వారానే వ్యాప్తి చెందుతుందని బలంగా నమ్మారు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాల ద్వారా స్త్రీ విద్యా వ్యాప్తి జరిగింది. తత్ఫలితంగా స్త్రీ సృజనకారులు తమ బాధల్నీ తామే రాసి తెలియజేస్తున్నారు.
తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ. తూర్పు గోదావరి జిల్లాలో జన్మిచింది. ఆమె రాసిన తొలికథ 'ఇంకెక్కడి జయం' 1934లో గృహాలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. తెలంగాణలో తొలి కథ రాసిన రచయిత్రి మామిడిపూడి సత్యవతి.
చరిత్రను రాసేది ఆధునిక మహిళలే అని నిరూపితమవుతుంది. అందుఊ అణగారిన మహిళల పాత్ర గణనీయంగా ఉందని తమ కథలు, కవితలు, వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా సృజన శీలతలలో కనపడుతుంది. దళితమహిళలే చరిత్ర తిరిగి రచిస్తున్నారు అని చెప్పడానికి వారు రచిస్తున్న రచనలే బలమైన సాక్ష్యాలు.
1971-72 లో మహారాష్ట్రలో ప్రారంభమయిన దళిత పాంథర్స్ ఉద్యమం కొత్త చైతన్యాన్ని నింపింది. దళితోద్యమం పురుడుపోసుకుంది. దళిత స్పృహ పెరిగి రచనల్లో దళిత బాధలు సృజించబడుతున్నాయి.
దళిత కథా సంకలనాల్లో గోగు శ్యామల తెచ్చిన తొలి దళిత కథా సంకలనం "నల్లపొద్దు"., గోగు శ్యామల, జూపాక సుభద్రలు కలసి మాదిగ, మాదిగ ఉపకులాల కథ సంకలనం గా "నల్లరేగడి సాల్లు" గా వెలువరించారు. ఆ సంకలనాల్లో మొత్తం స్త్రీల కథలే (బహుశా...)
దళిత రచయితలు, రచయిత్రులు రాసిన ఇరువై మూడు కథలతో కలిపి అరుణ గోగుల మండ, మానస ఎండ్లూరి (మిళింద కథా సంపుటి- కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత) సంపాదకత్వంలో తెచ్చిన కథా సంకలనం "ముళ్ళ చినుకులు" . ఇందులో రెండు రాష్ట్రాలకు సంబధించిన కథలు ఉన్నాయి. వినూతనమైన కథలు ఉన్నాయి.
కనపడే కనిపించని శత్రువు కులాన్ని అత్యాధునికంగా చిత్రించాయి. ఆధునిక యుగంలోకి మారుతున్న దళిత జీవన విధానం, వివిధ రకాల కుల వివక్షతలను చిత్రించాయి. ఆధునిక కాలంలో ఆధునిక దళిత కథలుగా దర్శనమిస్తాయి. ఇందులో నా కథ "ఆచరణ" ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు.
వినూత్న కథలతో సంకలనం తెచ్చినందుకు అభినందనలు ...
జై భీమ్ లు,
జంబూ శనార్థులతో...
డా. సిద్దెంకి యాదగిరి,
జంబూ సాహతీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి