భారత సంఘ సంస్కరణల చరిత్ర లోనే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయాడు. రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి, అ కాలములో సాధారణమైన బహు భార్యత్వం నేరమని జనులకు నచ్చ చెప్పాడు
సతీసహగమనము అను మూఢాచారము భారతదేశములో చిరకాలముగానుండిన మూఢనమ్మకములపై ఉద్భవించిన దురాచారము. చనిపోయిన భర్తచితిపై భార్యకూడా అగ్నిలో ఆహుతి అగుట. అట్టి మూఢాచారమును ఖండించి రూపుమాపుటకు బంగళా దేశపు మహా మేదావి రాజా రామ్మోహన్ రాయ్ అనేక ఉపన్యాసములు చేసి ప్రచారముచేశాడు. ఆ దురాచారమును సంస్కరించుటకు భారతదేశములో నేకాక ఇంగ్లండుదేశములో కూడా భారత ధేశ ప్రజలహితము కోరి ప్రచారముచేసినట్టి రాజా రామ్మోహన్ రాయ్ విలియంబెంటిక్ కు సన్నిహితుడైన తరువాత ఆ దురాచారమును నిషేధించుచూ 1829 డిసెంబరు 29 తేదిన విలియం బెంటింక్ నిబంధనలు అమలుచేశాడు. ఆ నిబంధన ప్రకారము సతిసహగమనము చేయుట చట్టరీత్యా దోషాయుక్త హత్య (culpable
Homicide) క్రింద పరిగణించబడింది. సమాజములోనున్న అజ్ఞాన అంధకారములను తొలగించుటకు రాజారామమోహన రాయలు ధైర్యసాహసాలతో చేసిన కృషివలననే విలియం బెంటిక్ కు మనోబలము కలిగి అటువంటి సామాజిక మత సంస్కరణలతో కూడిన నిబంధనలు, నిషేధాలు అమలు చేయగలిగెను. లేనిచో చిరకాలమునుండి వచ్చుచ్చున్న సామాజిక ఆచార వ్యవహారములలో జోక్యము అగ్నితో చలగాటమని ఎరిగియుండిన విలియం బెంటింక్ ముందుకు వచ్చియుండకపోయేవాడు.
1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు[1][2] అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే
ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులాంగిరి', 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబరు 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.
బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ,
శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి. [9]
1848లో, అతను తన భార్యకు చదవడం మరియు వ్రాయడం ఎలాగో నేర్పించాడు, ఆ తర్వాత దంపతులు పూణేలో బాలికల కోసం స్వదేశీగా నిర్వహించబడుతున్న మొదటి పాఠశాలను ప్రారంభించారు, అక్కడ వారిద్దరూ బోధించారు. పాఠశాల వివిధ విభాగాలు, మతాలు మరియు సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి అమ్మాయిలను ఆహ్వానించింది – వచ్చి చదువుకోవడానికి.
ఫూలే బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించాడు మరియు వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. 1863లో, అతను తన స్నేహితుడు మరియు భార్యతో కలిసి శిశుహత్య నివారణ కేంద్రాన్ని ప్రారంభించాడు, ఇక్కడ గర్భిణీ వితంతువులు సురక్షితంగా జన్మనివ్వడానికి మరియు శిశువులను చూసుకోవడానికి. వారు 1880ల మధ్యకాలం వరకు కేంద్రాన్ని నడిపారు.
ఫూలే ఒక వ్యాపారి, రచయిత మరియు మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు కూడా. 1863లో, నిర్మాణ స్థలాలకు మెటల్ కాస్టింగ్ పరికరాలను సరఫరా చేయడం అతని వ్యాపారాలలో ఒకటి. అతను పూనా మునిసిపాలిటీకి కమిషనర్‌గా నియమించబడ్డాడు మరియు 1883 వరకు ఆ స్థానంలో పనిచేశాడు.
అతను కూడా ప్రముఖ రచయిత. అతని ప్రసిద్ధ పుస్తకాలలో గులాంగిరి (బానిసత్వం) మరియు షెట్కరాయచా ఆసుద్ (సాగుదారుల విప్‌కార్డ్) ఉన్నాయి. ఫూలే జీవిత చరిత్ర రచయిత ధనంజయ్ కీర్ మాట్లాడుతూ, బొంబాయికి చెందిన తోటి సంస్కర్త విఠల్‌రావు కృష్ణాజీ వందేకర్‌చే ఫూలేకి మహాత్మ బిరుదు ప్రసాదించబడింది.
1888లో, ఫూలే పక్షవాతానికి గురయ్యాడు, అది అతనిని పక్షవాతానికి గురిచేసింది. అతను నవంబర్ 20,
1890 న మరణించినప్పటికీ, అతను మరియు అతని పని నేటికీ దేశంలోని అనేక మంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
కందుకూరి వీరేశలింగం పంతులు |
|
నవయుగ వైతాళికుడు |
|
జననం |
1848 ఏప్రిల్ 16 రాజమండ్రి |
మరణం |
1919 మే 27 (వయసు 71) చెన్నై |
సుపరిచితుడు/ |
సంఘసంస్కర్త, రచయిత |
బిరుదు |
రావుబహద్దూర్ |
జీవిత భాగస్వామి |
బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) |
తల్లిదండ్రులు |
|
సంఘ సంస్కరణ కార్యక్రమాలు[మార్చు]
వీరేశలింగం హేతువాది .
ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.
వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు,
పలకా బలపాలు కొనిచ్చేవాడు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.
ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, ఆయన విద్యార్థులూ వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (అత్తగారు బాపమ్మకు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.
విశిష్టత
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
·
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
·
మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
దేశ శాస్త్ర పఠనం
అనే వ్యాసంలో కొమర్రాజు
వెంకటలక్ష్మణ రావు బాలబాలికలకు
విద్యా అవసరం అని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి